Social Media
-
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
తిరుపతి,సాక్షి: తిరుపతిలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు దళిత బాలికకు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోలీసులు నిందితుల్ని గుర్తించారు. ఎఫ్. ఐ.ఆర్.51/2025 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మస్క్‌తో వైట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్ : ఫోటో వైరల్, ఎవరీ సజ్వానీ ?
దుబాయ్‌కు చెందిన డెవలపర్ DAMAC ప్రాపర్టీస్ చైర్మన్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ Hussain Sajwani) మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తున్నాడు. దుబాయ్ బిలియనీర్, వైట్ హౌస్‌లో ఎలాన్ మస్క్ (Elon Musk), ఆయన భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొన్ని నిమిషాల్లోనే 10.2 లక్షలకు పైగా వ్యూస్, వేలాది లైక్స్ దక్కించుకుంది. ఇంతకీ ఎవరీ హుస్సేన్ సజ్వానీ?హుస్సేన్ సజ్వానీ ఎవరు?దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ (71) డమాక్ ప్రాపర్టీస్ చైర్మన్ హుస్సేన్ సజ్వానీ. ఫోర్బ్స్ ప్రకారం. నియక విలువ విలువ 10.2 బిలియన్డాలర్లు. ఇటీవల దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీతో కలిసి, టెస్లా , స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ వైట్ హౌస్‌లో అల్పాహార విందు ఆరగించాడు. ‘‘ఒక చిరస్మరణీయ ఉదయం" అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సజ్వానీ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు మస్క్‌తోపాటు, మస్క్ భార్య న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, శివోన్ జిలిస్‌ను కూడా చూడవచ్చు.చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్‌డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మొదటి దఫా అధ్యక్షుడిగా పనిచేసినపుడు వార్తల్లో నిలిచారు సజ్వానీ. 2016 నూతన సంవత్సర వేడుకలో ఆయన సంస్థ డమాక్ దుబాయ్‌లో ట్రంప్-బ్రాండెడ్ గోల్ఫ్ కోర్సును నిర్మించాడ. ఇక రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన అమెరికా డేటా సెంటర్లలో 20 బిలియన్ల పెట్టుబడిని సజ్వానీ ప్రకటించాడు. ఎనిమిది రాష్ట్రాలలో 2025లో నిర్మాణం ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, అమెరికా సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం , డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల తరువాత ట్రంప్ సజ్వానీని "దార్శనిక వ్యాపారవేత్త"గా ప్రశంసించిన సంగతి తెలిసిందే.Had a great breakfast at the White House with Elon Musk and family — a memorable morning. pic.twitter.com/ckTs9PBRVM— Hussain Sajwani (@HussainSajwani) April 21, 2025 1953లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జన్మించిన హుస్సేన్ సజ్వానీ, అనేక లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో మల్టీ బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. వ్యాపార కుటుంబానికి చెందిన సజ్వానీ చిన్నతనంలోనే తన తండ్రి దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం,పారిశ్రామిక ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. తరువాత సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి బిజినెస్ టైకూన్ ఎదిగాడు. ముఖ్యంగా గల్ఫ్ వార్ టైంలో సజ్వానీ అమెరికన్ సైనిక కార్యకలాపాలకు సేవలందిచాడు. 2002లో DAMAC ప్రాపర్టీస్‌ను స్థాపించి వెనుదిరిగి చూసింది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం ఎదిగాడు. DAMAC హోటళ్ళు, అపార్ట్మెంట్లు మరియు విల్లాలు వంటి వేలాది లగ్జరీ గృహాలను నిర్మించింది. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం -
World Earth Day ఎంఎల్సీ విజయశాంతి ఇంట్రస్టింగ్ ట్వీట్
నేడు (ఏప్రిల్ 22) ప్రపంచ ధరిత్రి దినోత్సవం(World Earth Day) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ(Congress MLC) విజయశాంతి(Vijayashanti) ఆసక్తికర ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ముఖ్యంటా ట్విటర్లో యాక్టివ్‌గా ఉండే ఆమె వరల్డ్ ఎర్త్‌డే సందర్భంగా ప్రకృతిని, ఈ భూమాతను రక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇకనైనా మారదాం వినాశనాన్ని ఆపుదాం అంటూ పిలుపునిచ్చారు. విజయశాంతి ట్వీట్ ఇలా..‘‘ నేను ప్రపంచ ధరిత్రీ దినోత్సవం..అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు. తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ విజయశాంతి ట్వీట్ చేయడం విశేషం. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది. నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవంఅనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం... భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే... మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా... సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం కావాల్సిందే.… pic.twitter.com/GBqbhMYzjQ— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 22, 2025 -
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ట్రోల్స్ పై రోజా క్లారిటీ
-
YSRCP సోషల్ మీడియా కన్వీనర్ గోపిపై దాడి
-
జాన్వీ కపూర్‌కు స్టార్ హీరో స్కూటీ పాఠాలు.. బిగ్‌బాస్ దివి స్టన్నింగ్ అవుట్‌ఫిట్!
జాన్వీ కపూర్‌కు స్కూటీ నేర్పిస్తోన్న స్టార్ హీరో..అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పిన మీనాక్షి చౌదరి..స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో బిగ్‌బాస్ దివి పోజులు..డీసెంట్ లుక్‌లో నాసామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్...బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
పొంతన లేని మాటలతో జనాల్ని తికమకపెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది తిరుగులేని రికార్డు. తాజాగా కొద్ది రోజుల క్రితం జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవాల్లో ఇది మరోసారి నిరూపితమైంది. ఎల్లోమీడియా ‘బీసీల సంక్షేమానికి రూ.48 కోట్లు’ అంటూ బాబుగారి ప్రసంగాన్ని భాజాభజంత్రీలతో కథనంగా వండి వార్చినప్పటికీ వివరాలు చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే.. బాబు గారు తన ప్రసంగంలో సంక్షేమ వసతి గృహాలకు రూ.405 కోట్లు, గ్రూప్ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ శిబిరాలు, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, అమరావతిలో 500 మంది బ్యాచ్‌తో ఉచిత శిక్షణ, ఆదరణ పథకం కింద ఏటా రూ.వెయ్యికోట్లు ఖర్చు వంటివి మాత్రమే ప్రస్తావించారు. .. ఇవేవీ కొత్తవి కాకపోవడం ఒక వింతైతే.. వీటికయ్యే ఖర్చు ఏటా రెండు వేల కోట్లకు మించకపోవడం ఇంకోటి. మరి.. రూ.48 వేల కోట్లు ఎక్కడ? ఎప్పుడు? ఎలా వ్యయం చేస్తారు? ఎల్లో కథనం చదివిన వారి ఊహకే వదిలేయాలి దీన్ని. పోనీ మొత్తం ఐదేళ్లకు ఇంత మొత్తం అనుకుంటే.. ఒక ఏడాది గడచిపోయింది కాబట్టి.. మిగిలిన నాలుగేళ్లలో ఏటా రూ.12 వేల చొప్పున ఖర్చు పెట్టాలి. దీనిపై కూడా స్పష్టత లేదు. అయినా చంద్రబాబు(Chandrababu) బీసీ సంక్షేమానికి 48 వేల కోట్లు అని ఒక అంకె చెప్పడం, అదేదో మొత్తం ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేసి బ్యానర్ కథనాలు రాసేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయడం ఎల్లో మీడియా మార్కు జర్నలిజమై పోయింది. 👉బాబు గారు ఇంకొన్ని మాటలూ ఆడారు. ఆర్థిక అసమానతలను రూపుమాపే బ్రహ్మాస్త్రం పీ-4 అని, దీని ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పనైతే చెప్పారు కానీ.. ఎలా అన్నది మాత్రం చెప్పడం మరిచారు!. సాధారణంగా ఏ నేత అయినా వేల కోట్ల మొత్తాలను ప్రకటించినప్పుడు దేనికెంత ఖర్చు చేస్తారు? బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు ఇవ్వడం జర్నలిజమ్ ప్రాథమిక లక్షణం. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి భారీ కేటాయింపులు జరిగినప్పుడు దానికి కట్టుబడి ఉన్నట్టు సమాచారం ఉండేది. అప్పటి విపక్షం టీడీపీ కూడా తప్పు పట్టే పరిస్థితి ఉండేది కాదు. పోనీలే... ఏదో ఒక రీతిన బీసీల సంక్షేమానికి రూ.48 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని సంతోషిస్తూండగానే చంద్రబాబు అన్నమాటతో నిరాశ కమ్మేసింది. 👉అప్పు చేసి సంక్షేమం అమలు చేస్తే రాష్ట్రం కష్టాలలో కూరుకుపోతుందని, సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని ఎల్లో మీడియా(Yellow Media)నే తెలిపింది. చంద్రబాబు అక్కడితో ఆగలేదు. కాని టీడీపీకి నష్టం అని భావించి ఎల్లో మీడియా ఆ భాగం రాయకుండా వదలి వేసింది. మిగిలిన మీడియాలో ఆ వివరాలు ఉన్నాయి. చెప్పినవన్నీ చేయాలని ఉన్నా గల్లా పెట్టే ఖాళీగా కనిపిస్తోందని, అప్పు చేద్దామన్నా ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. పరపతి లేకపోతే అప్పు ఎలా పుడుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయింది. ఈ కాలంలో సంపద సృష్టించ లేకపోయానని ఆయన చెబుతున్నట్లే కదా? పైగా అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబే కదా దానికి బాధ్యుడు అవుతారు. పోనీ అదే నిజమనుకున్నా, ఇప్పటికే రూ.లక్ష కోట్ల అప్పు ఎలా చేశారు? దానిని ఎందుకోసం ఖర్చు పెట్టారు అన్నది ఎప్పుడైనా చెప్పారా అంటే లేదు. ఒక్క అమరావతి(Amaravati) నిర్మాణాలకే ఏభైవేల కోట్ల అప్పు ఎలా తీసుకు వస్తున్నారు? ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ, ఎన్నికల ప్రణాళిక అంటూ తెగ వాగ్దానాలు ఇచ్చేశారు కదా? బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తానన్నారు కదా? ఇప్పుడు ప్రతి దానికి గల్లా పెట్టె ఖాళీగా ఉందని చెప్పడం ప్రజలను చీట్ చేయడమే కాదా? ఈ లెక్కన ఇప్పుడు బీసీల సంక్షేమానికి ప్రకటించిన రూ.48 వేల కోట్లు ఉత్తుత్తి ప్రకటనగానే తీసుకోవాలా? లేక దాని అమలుకు వేరే మార్గం ఏమైనా ఉందని చెబుతారా?. తల్లికి వందనం కింద త్వరలో డబ్బులు ఇస్తామని అంటారు. ఒక ఏడాది ఇప్పటికే ఎగవేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించరు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇస్తామని చెప్పారు. మరి ఈ ఏడాది ఎందుకు ఎగవేశారో వివరించాలి కదా? కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా రైతులకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఇవైనా ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు. చంద్రబాబు మాత్రం వాటిని నివృత్తి చేయరు. తాను చెప్పదలచుకున్నది ఏదో అది ప్రజలు నమ్ముతారా? లేదా ?అనేదానితో నిమిత్తం లేకుండా ప్రచారం చేసి వెళుతుంటారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకు వస్తామని, వారికి 34 శాతం రిజర్వేషన్లు తెస్తామని, నామినేటెడ్ పోస్టులలో 33 శాతం బీసీలకు కేటాయిస్తామని, కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించామని.. ఇలా ఆయా విషయాలను చెప్పారు. విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఒక వైసీపీ నేత లింగమయ్యను టీడీపీ వారు హత్య చేస్తే వీరు కనీసం ఖండించలేదు. ఆ కేసులో ఇరవైమంది నిందితులు ఉన్నారని చెబుతున్నా ఇద్దరిపైనే కేసు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం బీసీ రక్షణ చట్టం గురించి ఉపన్యాసం ఇస్తున్నారు.ఏపీలో సోషల్ మీడియా(AP Social Media) నేరస్తులకు అడ్డాగా మారిందని, వ్యక్తిత్వ హననం చేస్తే అది వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి సోషల్ మీడియాను దుర్వినియోగం ఎక్కువగా చేసింది టీడీపీ వారే అనే సంగతి ఆయనకూ తెలుసు. వారిని ప్రోత్సహించింది తాను, తన కుమారుడు అన్న విషయం అందరికి విదితమే. ఈ మధ్య తప్పని స్థితిలో ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించి ,అతను వాగిన పిచ్చివాగుడు వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు తేల్చుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు. సీమ రాజా అని, ఇంకేవేవో పేర్లతో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దారుణమైన నీచమైన వ్యాఖ్యలు చేసినవారంతా రాష్ట్రంలో సేఫ్‌గా తిరుగుతున్నారు. మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అసహ్యకరమైన ఆరోపణ చేసిన ఒక టీడీపీ నేతకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చరిత్ర కూడా సార్‌దే కదా! ఏదైనా చిత్తశుద్దితో చెబితే పర్వాలేదు. కాని సుద్దులు పైకి చెప్పి, టిడిపి సోషల్ మీడియా అరాచక శక్తులకు అండగా నిలబడుతున్నారన్న అపకీర్తి మూట కట్టుకుంటే ఏమి చేస్తాం. అందువల్ల నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు మాటల్లో వాస్తవం అంత ఉంటుందని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తుంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
తన ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ఓ వ్యక్తి చేసిన సాహసం నెట్టింట ప్రశంసలందుకుంటోంది. విద్యుత్ షాక్‌కు గురైన తొమ్మిదేళ్ల చిన్నారిని కాపాడి శెభాష్ అనిపించుకున్నాడు చెన్నై యువకుడు కణ్ణన్. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో ఆయన మాటల్లోనే..‘‘నా పేరు కణ్ణన్ తమిళసెల్వన్. బుధవారం మధ్యాహ్నాం సమయంలో పని మీద బైక్ మీద వెళ్తున్నా. ఆరోజు బాగా వర్షం కురిసింది. అరుంబాక్కమ్ ఏరియాలో రోడ్ల మీద బాగా నీరు నిలిచిపోయింది. చూస్తుండగానే ఓ పిల్లాడు నీళ్లలో పడిపోయాడు. బహుశా కళ్లు తిరిగి అందులో పడిపోయాడు అనుకున్నా. సాయం చేయడానికి దగ్గరగా వెళ్లా. కానీ, దగ్గరికి వెళ్లి చూస్తే షాక్‌తో విలవిలాడుతున్నాడని అర్థమైంది.సాయం కోసం కేకలు వేశా. ఎవరూ ముందుకు రాలేదు. దగ్గరికి వెళ్లి ముట్టుకోగానే నాకూ షాక్ కొట్టింది. ఆలస్యం చేయకుండా బయటకు లాగేశా. పక్కకు తీసుకెళ్లి ఛాతీ మీద బలంగా నొక్కా. ఆ పిల్లాడు ఊపిరి తీసుకోవడంతో ెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లా అని కణ్ణన్ తెలిపాడు. బాధిత చిన్నారి పేరు జేడన్. ప్రస్తుతం అతను కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. సీసీటీవీ ఫుటేజీలో ఆ ఘటన రికార్డయ్యింది. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతూ ఆ బాలుడు నీటిలో కుప్పకూలిపోయాడు. అది గమనించిన కణ్ణన్ దగ్గరగా వెళ్లాడు.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడాడు. కాస్త ఆలస్యమైతే ఆ చిన్నారి ప్రాణాలు పోయేవే. ఆదివారం నుంచి ఆ వీడియో వైరల్‌గా మారడంతో కణ్ణన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నిజమైన హీరో’ అంటూ కొనియాడుతున్నారు. జేడన్ తండ్రి రాబర్ట్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. అరుంబాక్కమ్‌లోని మాంగ్లీ నగర్లో నివాసం ఉంటున్నారు. ఆరోజు జేడన్కు ఆరోగ్యం బాగోలేదట. కానీ, వార్షిక పరీక్షలు ఉండడంతో బడికి పంపించా. పరీక్ష రాశాక ఒక్కడే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురయ్యాడు అని చెబుతున్నాడాయన. జేడన్ ఐడీ కార్డు మీద ఉన్న నెంబర్ చూసి కణ్ణన్ తనకు ఫోన్ చేశాడని, తన బిడ్డ ప్రాణం కాపాడిన అతనికి జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతున్నాడు రాబర్ట్. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడంతో అరుంబాక్కమ్ అధికారులు స్పందించారు. అండర్‌గ్రౌండ్ కేబుల్ దెబ్బ తినడం వల్లే ఈ ఘటన జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. #Kannan is the young man who bravely saved a boy who was drowning in the water due to an electric shock. He is the young man who risked his life to save the boy.⛑️He is a true hero. An inspiration to all.🫡Everyone should admire him.🫡#Chennai #Tamilnadu pic.twitter.com/PopgnYDUGp— Shashi Kumar Reddy Vura (@vurashashi) April 20, 2025 -
Viral: అబ్బాయి జీతం రూ.2.50 కోట్లు ఉండాలి.. పిల్లలు వద్దు!, వధువు 18 కోరికల చిట్టా
అమ్మా..! సుధా(పేరు మార్చాం) బాగా చదువుకున్నావు. మంచి ఉద్యోగం చేస్తున్నావు. మా వయసు మీద పడిపోతుంది. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాలని మీ నాన్న కంగారు పడుతున్నారు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు. సంబంధాలు వెతుకుతాం అంటూ జానకి తన కూతురికి విజ్ఞప్తి చేసింది. తల్లి విజ్ఞప్తితో ఏమో అమ్మా.. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నా పెళ్లి నీ ఇష్టం అని చెప్పడంతో నా బంగారు తల్లి అనుకుంటూ భర్త భూషణ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఏవండోయ్ సుధా పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది.. మనోళ్లు ఉన్నారు కదా మంచి సంబంధం చూసి పెట్టమనండి అంటూ వంటింట్లోకి వెళ్లిన జానకి గుక్కెడు పంచదారను భర్త భూషణం నోట్లు కుమ్మరించింది. భార్య జానకి మాటలకు సంబరపడిపోయిన భర్త నాగభూషణం కుమార్తె సుధాకు పెళ్లి సంబంధాలు చూసేందుకు పక్కూరు తన పెద్దమ్మ పార్వతమ్మ ఇంటికి బయల్దేరాడు. ఈ స్టోరీ వినడానికి ఎంత బాగుంది.కానీ అదే సుధని పెళ్లి సంబంధాలు చూస్తాం. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పమ్మా అంటూ అడిగిన తల్లిదండ్రులకు ఎలాంటి కోరికలు లేవంటూనే తనకు కాబోయే వరుడిలో 18 రకాల కోరికలు ఉండాలంటూ తన కోరికల చిట్టా విప్పితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఓ యువతి విషయంలో అలానే జరిగింది. పేరు, ఊరు వెలుగులోకి రాలేదు. కానీ ఆమె కోరికల చిట్టా వెలుగులోకి వచ్చింది. ఆ కోరికల చిట్టా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.జీతం ఏడాదికి 3లక్షల డాలర్ల సంపాదించాలి (మన కరెన్సీలో దాదాపు రూ.2.5 కోట్లు!)జెనరస్, స్పాయిల్‌గా ఉండాలి. అంటే భోజనం, ప్రయాణం, ఫ్యాషన్ ఇలా ప్రతీది కాస్ట్లీగా ఉండాలిలగ్జరీ లైఫ్ ఇష్టపడాలి (ఫైన్ డైనింగ్, ట్రావెలింగ్, వైన్ టేస్టింగ్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్)నన్ను నిజంగా ప్రేమించాలి. అన్ని విషయాల్లో నాకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలిఎమోషనల్ ఇంటెలిజెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా ఉండాలినైట్ ఎప్పుడైనా బయటికి వెళితే షాడోలా నన్ను వెన్నంటే ఉండాలిఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి నిరంతరం, దూర దృష్టితో కష్టపడి పనిచేసే వ్యక్తి కావాలికుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇష్టమైన వారితో గడపడం. తరచుగా కుటుంబ విలువలు, సంప్రదాయాలు బాధ్యతలకు ప్రాముఖ్యత ఇవ్వాలిసోషల్ మీడియాలో షో ఆఫ్ వద్దు. ప్రైవసీ ఇష్టంశృంగారం విషయంలో నమ్మకంగా ఉండాలి.నాకు పిల్లలు వద్దు .. ఆవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి పని,వంట పని ఇలా అన్నింట్లో సహాయపడే వ్యక్తే జీవిత భాగస్వామి కావాలని పోస్టులో పేర్కొంది. She sent me a list of her requirements. One of them includes a salary of $300k+byu/New_Ambassador2442 inTinder -
బట్టల మిషనా? బంగాళదుంపల మిషనా? వైరల్ వీడియో
వంట చేయడం కంటే.. ప్రిపరేషన్‌కే ఎక్కువ టైం పడుతుంది. కూర వండాలంటే..చిక్కుడు కాయలు, బీన్స్ గిల్లడం, దొండకాయలు, బెండకాయలు కట్ చేయడం అబ్బో పెద్దపనే కదా. అలాగే బంగాళాదుంపలను తొక్క తీసి శుభ్రం చేయడం అంటే అదో పెద్ద పని. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన మహిళ కేవలం రెండు నిమిషాల్లో వాషింగ్ మెషిన్ సహాయంతో బంగాళాదుంపలు తోలు తీయడం అందర్నీ ఆకర్షించింది.‘ఆమె వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్లింది. ఆ తరువాత ఏం చేస్తుంది?’ అనే ప్రశ్నకు ఎవరైనా ఇచ్చే జవాబు....‘బట్టలను వాషింగ్ మెషిన్లో వేస్తుంది’ అయితే సదరు మహిళ మాత్రం బట్టలను కాదు బంగాళదుంపలను వేసింది. మన ఆశ్చర్యాన్ని మరింత పెంచేలా మెషిన్ ఆన్ చేసింది. ఆ తరువాత ఏమిటి అనే విషయానికి వస్తే..... తొక్క రహిత బంగాళదుంపలు కనిపించాయి! వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘భేష్’ అని కొందరు కితాబు ఇవ్వగా చాలామంది మాత్రం ‘ఇది సరికాదు’ అని విమర్శించారు. మరికొందరు ‘ఇది ఫేక్ వీడియో’ అన్నారు. बढ़ती हुई तकनीक ने बहुत कामों को बहुत सरल बना दिया है।ये देखो आलू को छीलने वाली मशीन।एक मिनट में कितने सारे आलू छील दिए हैं। pic.twitter.com/gpwu6Y5KG0— kuldeep kumar (@kdgothwal1) April 6, 2025ఎండలను చల్లపుచ్చండి వేసవిలో ఎదురయ్యే సమస్యలలో డీ హైడ్రేషన్ ఒకటి. డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా పుచ్చకాయ తింటే మంచిది. పుచ్చకాయతో లాభాలునీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ ఒంట్లోని టాక్సిన్స్‌ను తొలగిస్తుందినీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తుంది. చెమట రూపంలో కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది. పుచ్చలో అమైనో ఆమ్లం ‘సిట్రులిన్’ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.ఎండలో కమిలిన చర్మానికి పుచ్చపండు గుజ్జు రాస్తే మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది.కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.పుచ్చకాయలో ఎక్కువగా ఉండే ఎ విటమిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. -
వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..
కర్నూలు (ముచ్చుమర్రి) సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు కొన్ని జనాల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి. అందులో మంచి ఉన్నా.. చెడు ఉన్నా.. సరే తెగ వైరల్ అయిపోతుంటాయి. అలా వైరల్ అయిన ఓ వీడియో.. అందునా తెలుగు రాష్ట్రానికి చెందిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వీడియో ఓ యువతి తన భర్తతో అందరి మందే అదర చుంభనం కానిచ్చేసింది. అయితే అది కావాలని చేసింది కాదు. నిజానికి వివాహ వేడుకల్లో పెళ్లి తంతులోభాగంగా వధూవరులతో సంప్రదాయబద్ధంగా కొన్ని పనులను పూజారులు దగ్గరుండి చేయిస్తుంటారు. అలాంటివాటిలో వధూవరులు ఒకరి కాలి బొటనవేలు తొక్కడం, బిందెలో ఉంగరం తీయడం, శోభనం గదిలో పూలబంతులాట ఇలాంటి పనులు చేస్తుంటారు. అయితే, ఈ వీడియోలో మాత్రం తన భర్త నోట్లో పెట్టుకున్న స్వీట్‌ను భార్య తీయడం కనిపిస్తుంది. ఆ సమయంలో వారి పక్కనే అనేక మంది మహిళలు కూర్చొనివున్నారు. వీరిలో కొందరు వృద్ధులు కూడా ఉన్నారు. అలా కర్నూలు జిల్లాలోని పగిడ్యాల మండలానికి చెందిన గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Chinna Chinna Raghu (@mr______raghava_____1318) -
రీల్స్ కోసం ఎక్స్ట్రాలకు పోయి..
సోషల్ మీడియాలో యూజర్ల అటెన్షన్ కోసం వినూత్నంగా ప్రయత్నించే వాళ్లు ఈ మధ్యకాలంలో పెరిగిపోయారు. అదే సమయంలో అధికారిక చానెల్స్ నుంచే ‘సెల్ఫ్ ట్రోలింగ్’తో ఆకట్టుకుంటున్నవాళ్లను ఈ మధ్యకాలంలో చూస్తున్నదే. ఇక.. ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో, ఆకతాయిలను హెచ్చరించే విషయంలోనూ పోలీసులూ అస్సలు తగ్గడం లేదు.తాజాగా.. బెంగళూరు సిటీ పోలీసులు(Bengaluru City Police) చేసిన ఓ ట్వీట్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఓ వ్యక్తి మాగాడి రోడ్లో పైత్యం ప్రదర్శించాడు. నడిరోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్ చేశాడు. ఈ రీల్ జనాల్లోకి విపరీతంగా వెళ్లింది.అయితే ఈ స్టంట్ అతనికే కాదు.. ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించేదిగా ఉండడంతో బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాగోలా ట్రేస్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇలాంటి వేషాలు వస్తే కటకటాల వెనక్కి నెడతామంటూ ఓ సినిమాలోని ఫన్నీ సీన్‌ను జోడించారు. బెంగళూరు పోలీసులు మిమ్మల్ని గమనిస్తుంటారు జాగ్రత్త అంటూ ఓ ఫన్నీ పోస్ట్ చేశారు. Taking tea time to the traffic line will brew you a hefty fine, not fame !!! BEWARE BCP is watching you#police #awareness #weserveandprotect #stayvigilant pic.twitter.com/5A8aCJuuNc— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) April 17, 2025 -
జిమ్‌లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
జిమ్‌లో అనసూయ కసరత్తులు..నేపాల్‌లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైస్వాల్..పొట్టి డ్రెస్‌లో హీరోయిన్ కృతిశెట్టి హోయలు..బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న సారా అలీ ఖాన్..కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ దివి.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాక్.. ఎవరూ నమ్మొద్దని ట్వీట్!
టాలీవుడ్ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్ గురైంది. ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ వాటిని ఎవరూ నమ్మవద్దని అభిమానులను, సన్నిహితులను కోరింది. తనకు డబ్బులు అవసరమైతే డైరెక్ట్‌గా అడుగుతానని తెలిపింది. సోషల్ మీడియాలో ఎవరినీ నేను డబ్బులు అడగనని ట్వీట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. కాగా.. మంచు లక్ష్మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో బిట్‌కాయిస్, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన మంచు లక్ష్మీ వెంటనే ట్విటర్ ద్వారా అభిమానులను, సన్నిహితులను అలర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. చివరికీ నా మొబైల్ నంబర్ కూడా హ్యాకర్స్ గుర్తించారని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆఫ్రికా దేశం నైజీరియాకు చెందిన సైబర్ కేటుగాళ్లు ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.కాగా.. మంచు లక్ష్మీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ ఫ్యాషన్ షో నిర్వహించింది. టీచ్ ఫర్ ఛేంజ్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్లో పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరైన సందడి చేశారు. ఆమె తమ్ముడు మంచు మనోజ్ సైతం ఈవెంట్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే.ఇక సినిమాల విషయానికొస్తే మంచు లక్ష్మీ చివరిసారిగా మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మాన్‌స్టర్‌లో కనిపించింది. ఇందులో మోహన్‌లాల్, హనీ రోజ్, జానీ ఆంటోనీ, జగపతి బాబు కూడా అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ దక్ష – ది డెడ్లీ కాన్‌స్పిరసీలో కనిపించనుంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, మహేశ్, వీరేన్ తంబిదొరై కూడా నటించారు. And they got to my number too! Wow! This is very scary! pic.twitter.com/3rOeiTgpwn— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025 My Instagram has been hacked. Kindly do not engage with anything that is on my stories. If I need money, I will ask you directly not on social media 😂Will tweet once I get it all back in order…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025 -
Puri Jagannath Temple : ఆలయ జెండాతో గద్ద ప్రదక్షిణలు వీడియో వైరల్
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి (Puri Jagannath temple) ఆలయంలో అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీమందిర్ ఆలయ శిఖరంపై ఉన్న పవిత్రమైన జెండాను ఒక గద్ద తన ముక్కుతో పట్టుకుని ఆకాశంలో ప్రదక్షిణ చేసింది. ఈ అసాధారణ ఘటన భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది అనర్థమా, శుభసూచికగా అనేక చర్చకు దారితీసింది ఇది భక్తులను విపరీతంగా ఆకర్షించడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందనపూరీ ఆలయ శిఖరంపై ఉన్న (Neela Chakra) నీలచక్రంపైన ఎగిరే జెండాను ముక్కున కరుచుకుని ఓ గద్ద ఆకాశంలో చక్కర్లు కొట్టింది. పూరీకి వచ్చే భక్తులు పవిత్రంగా భావించే ఆ జెండాను దర్శనం చేసుకుని , తరించడం ఆనవాయితీ. అలాంటిది ఇపుడు శ్రీమహావిష్ణువు వాహనమైన గద్ద తన ముక్కుతో ఈ జెండాను జాగ్రత్తగా పట్టుకుని, ఆకాశంలో ప్రదక్షిణం చేయడం విశేషంగా మారింది. ఈ దృశ్యం కెమెరాలో రికార్డ్ అయింది. ఇది దైవిక సంకేతంగా భక్తులు భావించారు.What is going to happen?Eagle takes away flag from Jagannath Temple pic.twitter.com/0AzUZb1uDE— Woke Eminent (@WokePandemic) April 13, 2025 నెటిజన్లు స్పందనఆలయ జెండాను పోలి ఉన్నప్పటికీ, ఆ వస్త్రం నిజానికి జగన్నాథ ఆలయానికి చెందినదా లేదా కేవలం ఒక సాధారణ గుడ్డ ముక్కేనా అనేది ఇంకా నిర్ధారించలేదు. ఆన్లైన్లో చర్చలకు దారి తీసింది. "జగన్నాథ ఆలయం నుండి ఒక గద్ద పవిత్ర జెండాను తీసుకెళ్లినప్పుడు, అది దొంగతనం కాదనీ, అది స్వర్గపు సందేశం. జగన్నాథుని ఆశీర్వాదాలతో గరుడుడు స్వయంగా స్వర్గానికి ఎక్కినట్లుగా. దైవిక జోక్యం, పునరుద్ధరణ ,క్తివంతమైన మార్పుకు సంకేతమన్నవాదనలు వినిపించాయి. సోషల్ మీడియాలో వేలాదిమంది భక్తులు దీన్ని షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. “PuriJagannathEagle” హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది, ఈ ఘటన జగన్నాథుని అనుగ్రహంగా కొంతమంది భావించారు.‘జగన్నాథుని కృప’’, ‘‘గరుడ దర్శనం’’ వంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. మరోవైపు ఈ ఘటనను సహజమైనదని కామెంట్ చేశారు. దాన్ని ఆహారంగానో, మరేదో ఆసక్తికరమైన వస్తువుగా గద్ద భావించి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈ ఘటనతో ఒడిశాలోని భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయం ఒక్కసారి చర్చల్లో నిలిచింది. ఆలయ వైభవాన్ని, ఖ్యాతిని పలువురు గుర్తుచేసుకున్నారు. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్ -
షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ రెస్టారెంట్ బిజినెస్‌లో ఉన్నారు. అంతేకాదుఇంటీరియర్ డిజైనర్, చిత్ర నిర్మాత ,వ్యవస్థాపకురాలిగా తన కంటూ ప్రత్యేకమైన పేరు ఫ్రఖ్యాతులు సంపాదించుకున్న సెలబ్రిటీ మహిళ. ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనర్‌గా ఆమెకు అనేకమంది సెలబ్రిటీ కష్టమర్లు ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ,అంతర్జాతీయ ప్రముఖుల క్లయింట్లకు సేవలు అందించే లగ్జరీ ఇంటీరియర్ డిజైన్ స్టోర్ గౌరీ ఖాన్ డిజైన్స్‌ను ముంబైలో నడుపుతోంది.అలాగే ఇటీవల టోరీ పేరుతో ముంబైలో ఒక హై-ఎండ్ రెస్టారెంట్ లగ్జరీ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. తాజాగా ఈ హోటల్ వివాదంలో ఇరుక్కుంది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , యూట్యూబర్, సార్థక్ సచ్‌దేవా గౌరీ ఖాన్ టోరీ ఫుడ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇక్కడ 'నకిలీ' పనీర్ వడ్డిస్తున్నారంటూ ఒక వీడియో చేశాడు. దీంతో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఇదీ చదవండి : రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు తరచుగా సెలబ్రిటీలు నడిపే రెస్టారెంట్లను సందర్శించి, వాటి నుండి సమీక్షలను పంచుకుంటూ ఉంటారు. ఇలాంటి వీడియోలు సాదారణంగా ప్రజాదరణ పొందుతాయి. అలాగే సదరు హోటల్ ఖ్యాతిని పెంచుకోవడానికి కూడా దోహదపడతాయి. కానీ ఈ విషయంలో మాత్రం గౌరీ ఖాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. గౌరీ ఖాన్ఖు చెందిన లగ్జరీ హోటల్ టోరీ నకిలీ పనీర్ (కాటేజ్ చీజ్)ను అందిస్తుందని, ఇది కల్తీకి గుర్తు అని తన వీడియోలో పేర్కొన్నాడు సార్థక్ సచ్‌దేవా. తన వీడియోలో టోరీలో వడ్డించే పనీర్ ముక్కపై అయోడిన్ టింక్చర్ పరీక్ష కూడా చేసాడు. ఇది స్టార్చ్ స్థాయిని గుర్తించడానికి ఉపయోగిస్తారట. , అయోడిన్ వేయగానే పనీర్ ముక్క రంగు నలుపు నీలం రంగులోకి మారిపోయింది. దీంతో తాను షాక్ అయ్యానంటూ సార్థక్ సచ్‌దేవా ఆరోపించారు.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఫన్నీగా, మరికొందరు అతణ్ని ట్రోల్ చేస్తూ కమెంట్స్ చేశారు. మరికొందరు యూజర్లు అతనిని సమర్థించారు."గౌరీ, షారూఖ్ ఖాన్ ఇది నిజమేనా, లేదా అతనుఅబద్ధం చెబుతున్నాడా? దయచేసి స్పందించండి అంటూ మరికొంతమంది స్పందించారు. మరొక అభిమాని అయితే హెల్తీ సెలబ్రెటీలు నక్లీ పనీర్ తింటున్నారా అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. గౌరీ ఖాన్ టీం స్పందన"అయోడిన్ పరీక్ష స్టార్చ్ ఉనికిని ప్రతిబింబిస్తుంది తప్ప పనీర్ నాణ్యత ప్రామాణికతను కాదు అంటూ టోరీ టీం స్పందించింది. వంటకంలో సోయా ఆధారిత పదార్థాలు ఉన్నం వల్లే, అలాంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది తప్ప, అది నకిలీదికాదని స్పష్టత ఇచ్చింది. తమ పనీర్ చాలా స్వచ్చమైందనీ, టోరీలో పదార్థాలన్నీ నాణ్యంగా, ఆరోగ్యంగా ఉంటాయని హామీ ఇచ్చింది. -
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
ప్రముఖ యాంకర్, టీవీ ప్రెజెంటర్, బిగ్ బాస్ తమిళ సీజన్ 5 ఫేమ్ ప్రియాంక దేశ్‌పాండే తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాదు, ఆయా షోలకు సక్సెస్‌కు కీలకంగా నిలిచింది. అందుకే ఆమెను దక్షిణ భారత టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్‌గా పేరొందింది. తాజాగా ఆమె తనప్రియుడితో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియాంక వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.సూపర్ సింగర్, ది వాల్ అండ్ కింగ్స్ ఆఫ్ కామెడీ జూనియర్స్ వంటి షోలలో హోస్ట్‌గా పాపులర్ అయిన ప్రియాంక DJ వాసి సచ్చితో ఏడడగులు వేసింది.కరియర్లో సక్సెస్అయినప్పటికీ వైవాహిక జీవితంలో ఫెయిల్ అయిన ప్రియాంక రెండోసారి ప్రేమను వెదుక్కుంది. ఏప్రిల్ 16 కొంతమంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకుంది. ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అభిమానులతో ఈ ఆనందకరమైన క్షణాలను పంచుకుంది. దీంతో ఈ జంటకు ఫ్యాన్స్‌కు అభినందనలు తెలిపారు. టెలివిజన్ ఐకాన్ పెళ్లి అవతార్‌పై నెటిజన్లు ముగ్ధులైపోతున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, నెటిజన్లు ముగ్ధులయ్యారు. View this post on Instagram A post shared by Priyanka Deshpande (@priyankapdeshpande)రాయల్ లుక్‌లో వధూవరులుప్రియాంక , వాసి కొత్త దంపతులుగా చాలా అనందంగా కనిపించారు. చాలా సంతోషంగా ఇరు కుటుంబాలతో కలిసి పోజులిచ్చారు. ముఖ్యంగా ప్రియాంక తన స్పెషల్ డే కోసం ఐవరీ అండ్ గోల్డెన్ సిల్క్ చీరలో ముగ్ధమనోహరిలాగా మెరిసిసోయింది. హెవీ ఎంబ్రాయిడరీ , జరీ వర్క్ బ్లౌజ్, సన్నని బంగారు అంచు, సింపుల్ ఎంబ్రాయిడరీతో ఎరుపు దుపట్టాతో కొత్త పెళ్లికూతురిలా కళకళలాడింది. ఇంకా సింపుల్ మేకప్ లాంగ్ నెక్లెస్, గాజులు, ఝుమ్కి, కమర్ బంద్ ,మాంగ్ టీకాతోపాటు, ఆమె ఉత్సాహభరితమైన చిరునవ్వుతో అలంకరించుకుంది. మరోవైపు, వాసి సాధారణ తెల్లటి కుర్తా , వేష్టి ధరించాడు.మొత్తం మీద ఇద్దరూ రాయల్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఒక అభిమాన ప్రేమ పూర్వక సందేశం"మనం కోరుకునే ప్రేమను పొందడం నిజంగా చాలా అరుదు. అలాంటి ప్రేమ దొరికడం అత్యంత అందమైన విషయం. ప్రేమ అంటే యవ్వనంగా కనిపించడం లేదా పరిపూర్ణంగా ఉండటం గురించి కాదు; ఇది ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకోవడం,ఒకరినొకరు సంతోషపెట్టేది ఏమిటో తెలుసుకోవడం,ఒకరికొకరు చిన్న విషయాలను మార్చుకునేంత శ్రద్ధ వహించడం..అంతేగా.. అదే ప్రేమ. ప్రియాంక, స్వచ్ఛమైన, సంతోషకరమైన ప్రేమకు మీరు అర్హులు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ చుట్టూ ప్రేమతో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టడం చూసి హృదయం నిండిపోతుంది. "మీకు చాలా, చాలా, చాలా సంతోషకరమైన వివాహ జీవితం కావాలని కోరుకుంటున్నాను."ప్రియాంక దేశ్పాండేప్రియాంక దేశ్‌పాండే 2016 ఫిబ్రవరిలో సీనియర్ నిర్మాత ప్రవీణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. అయితే, వ్యక్తిగత విభేదాల కారణంగా ఇద్దరూ 2022లో విడిపోయినట్లు సమాచారం. ఎవరీ డీజే వాసిమ్యూజిక్ ఇండస్ట్రీలో సుపరిచితమైన పేరు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ క్లిక్ 187 కంపెనీకి డైనమిక్ వ్యవస్థాపకుడు. అగ్రశ్రేణి క్లబ్‌లు, ప్రైవేట్ పార్టీలు సెలబ్రిటీ వివాహాలను నిర్వహణలో దిట్ట. దీనికితోడు సంగీత నైపుణ్యం ,ఈవెంట్ నైపుణ్యం అతన్ని హై-ప్రొఫైల్ ఈవెంట్స్‌లో కీలకంగామారాడు. ప్రియాంక హోస్ట్ చేస్తున్న వాసి ఈవెంట్లలో అయిన పరిచయం ప్రేమ, పెళ్లికి దారి తీసింది. -
కావు కావు కాదు... హాయ్ హాయ్ : మాటలు నేర్చిన కాకి
సాధారణంగా చిలక పలుకులు అంటూ ఉంటాం కదా. రామచిలక మనిషి మాటలను అనుకరించడం మనకు తెలిసిందే. పెంపుడు పక్షి చిలుకు ముద్దార మాటలు నేర్పిస్తే చక్కగా పలుకుతుంది. తేనెలూరు ఆ మాటలు విని తెగ మురిసిపోతారు యజమానులు. ఇపుడు మాకేం తక్కువ అంటూ ఈ జాబితాలోకి వచ్చేసిందో కాకి. కాకి చేష్టలు, కారు కూతలు కావు... చక్కగా హాయ్.. హల్లో అంటూ పలకరిస్తూ.. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. సరైన శిక్షణ ఇస్తే.. ముద్దార నేర్పింపన్.. అన్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది. పదండి ఆ విశేషాలేంటో చూద్దాం.అద్భుతమైన సామర్థ్యంతో ఇంటర్నెట్లో తెగ సందడి చేస్తోందీ కాకి. కుటుంబ సభ్యులను పేరు పెట్టి పిలుస్తుంది. మరాఠీలో మాట్లాడేస్తుంది. ఈ కాకి కావు కావు కాదు... హాయ్ హాయ్ అని అరుస్తుంది! అయితే మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఒక కాకి మనిషి మాటలను అనుకరిస్తూ అందరినీ బోలెడు ఆశ్చర్యపరుస్తోంది. వాడా తాలూకాలోని పాల్ఘర్కు చెందిన తనూజ ముక్నే అనే మహిళ తన తోటలో గాయపడిన కాకిని చూసి సపర్యలు చేసింది. కొన్ని రోజులు తరువాత కోలుకున్న కాకి తనూజ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయింది. అంతేకాదు... మనుషులు మాట్లాడే మాటలను అనుకరించడం మొదలు పెట్టింది. ‘పపా’ ‘బాబా’ మమ్మీ’ అంటూ వరుసలు పెట్టి పిలవడం మొదలుపెట్టింది. దీంతో ఈ కాకి లోకల్ సెలబ్రిటీగా మారింది! View this post on Instagram A post shared by PUNE PULSE (@punepulse) -
Telugu Theatre Day నటి ఝాన్సీ ఇంట్రస్టింగ్ పోస్ట్
గొప్ప రచయిత, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 16న ఆయన గౌరవార్థం తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రతీ సంవత్సరం నిర్వహిస్తారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది.ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ కొన్ని ఫోటోలను షేర్ చేశారు తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా మె నాటకరంగం తనకున్న అభిమానాన్ని ప్రేమను చాటుకున్నారు. . ఈ సందర్భంగా కళాకారులకు శుభాకాంక్షలందించారు. యాంకర్ ఝాన్సీ ఇన్‌స్టా పోస్ట్: రేడియో నాటకంతో మొదలైన నా ప్రయాణం, టీవీ, సినిమాల నుంచీ రంగస్థలం వైపుకి రావడం చాలా మందికి విడ్డూరంగా తోచవచ్చు.నా తపన నాటక ప్రక్రియని ప్రేమించే వాళ్లకి మాత్రం అర్ధం అయితే చాలు.నేను నాటకానికి క్రొత్త..కానీ సమకాలీన నాటక రంగంలోని సరి క్రొత్త ఒరవడిలో ఒక కెరటాన్ని కావాలని ఆకాంక్ష. తెలుగు నాటకరంగాన్ని పరిపుష్టం చేసిన మహామహులందరినీ తలుచుకుంటూ, తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు.ఇదీ చదవండి: మాలాంటి క్షోభ మరెవ్వరికీ వద్దు..వారికి సాయం చేయాలి : బాబూ మోహన్కాగా కందుకూరి వీరేశలింగం పంతులు బహుముఖ ప్రజ్ఞాశాలి. తన రచనల ద్వారా జాతి వివక్ష , అనేక ఇతర సామాజిక దురాచారాలపై అవిశ్రాంత పోరు సలిపారు. ఆయన రచించిన అనేక అభ్యుదయ నాటకాలు, నవలలు, సామాజిక వ్యంగ్య రచనలు తెలుగు సాహిత్యంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త కూడా, వితంతు పునర్వివాహాలకోసం ఆయన చేసిన కృషి స్త్రీజాతికి ఎంతో మేలు చేసింది.చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం! -
ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే, దీని ప్రకంపనలు భారత్‌ను తాకాయి.వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌లో హిందూకుష్ ప్రాంతం కేంద్రంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇక, ఈ భూకంప తీవ్రత ప్రకంపనలు భారత్‌ను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 55 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపానికి సంబంధించి వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.A 6.1 magnitude earthquake shook the Hindu Kush region of Afghanistan, and another 6.9 magnitude earthquake shook Tajikistan. pic.twitter.com/HcvpzSd0Cl— Niv Calderon (@nivcalderon) April 16, 2025 -
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
డిజిటల్ ప్రపంచంలో మరో కొత్త అంశం చక్కర్లు కొడుతోంది. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు కాస్తా ప్రఖ్యాత జపనీస్ యానిమేటర్ హయావో మియజాకీ శైలిలో గీసిన ఫ్యామిలీ, వ్యక్తిగత చిత్రాలతో నిండిపోతున్నాయి. గిబ్లీ ఆర్ట్ పేరు పెట్టుకున్న ఈ చిత్రాల ధోరణి నాలుగు దశాబ్దాల పాటు యానిమేషన్ రంగంలో ఎన్నో ప్రఖ్యాత క్యారెక్టర్లను సృష్టించిన గిబ్లీ స్టూడియో నకలు అన్నది మీకు తెలిసే ఉంటుంది. తేలిక పాటి పేస్టల్ షేడ్స్‌లో క్యారెక్టర్ల చిత్రీకరణ దీని హైలైట్. ప్రస్తుతానికి ఈ గిబ్లీ ఆర్ట్ అన్నది ఏఐ ప్లాట్‌ఫామ్స్ కొన్నింటిలో ఉచితంగా లభి స్తోంది. కొన్ని క్లిక్‌ల సాయంతో ఏ చిత్రాన్నైనా గిబ్లీ ఆర్ట్‌గా మార్చేయ వచ్చు. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఫ్యాషన్ , స్పోర్ట్స్ ఇన్‌ఫ్లుయెన్స ర్లతో పాటు కొన్ని కోట్ల మంది ఇప్పటికే ఈ గిబ్లీ ఆర్ట్‌ను వాడేశారు.సరదాగా కనబడుతున్నా...కంటెంట్‌ను సృష్టించేందుకు ఉపయోగించే జనరేటివ్ ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చి కొంత కాలం అయినప్పటికీ, ‘ఓపెన్ ఏఐ’ అభివృద్ధి చేసిన సరికొత్త ఏఐ టూల్ ఈ గిబ్లీ ఆర్ట్ ట్రెండ్‌కు కారణమైంది. ఛాట్‌జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు మనం అందించే సమాచారం (టెక్ట్స్) ఆధారంగా మనకు కావాల్సిన సమ చారాన్ని వివిధ రూపాల్లో (ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు వంటివి) తయారు చేస్తాయి. అదే గిబ్లీ ఆర్ట్ వంటివి మల్టీమీడియా జనరేటివ్ ఏఐ టూల్స్! టెక్ట్స్‌తో పాటు వీడియోలు, వాయిస్, ఫొటోలు, మ్యూజిక్ వంటి వాటినన్నింటినీ అది తీసుకోగలదు. ‘మిడ్ జర్నీ’, ‘స్టేబుల్ డిఫ్యూషన్ ’, ‘డాల్–ఈ’ వంటివి టెక్ట్స్‌ను తీసుకుని ఇమేజెస్ ఇవ్వగలవన్నది తెలిసిందే. డాల్–ఈతో ఢిల్లీ వీధుల చిత్రాలను ఎం.ఎఫ్.హుస్సేన్ లేదా జామినీ రాయ్ శైలిలో కొన్ని సెకన్ల సమయంలోనే తయారు చేయవచ్చు. ఇక ‘లెన్సా’ వంటివి ఇచ్చిన ఇమేజ్‌కు ప్రత్యామ్నాయాలను సృష్టిస్తాయి. వీటితో పోలిస్తే గిబ్లీ ఆర్ట్‌కు ఎక్కువ ఆదరణ ఎందుకు లభించిందంటే... ఇవి ముద్దుగా, హాస్యస్ఫోరకంగా ఉండటమని చెప్పాలి. చూసేందుకు హాస్యస్ఫోరకంగానే ఉండవచ్చు కానీ, దీని వెనుక ఒక సీరియస్ సమస్య ఉంది. ఏదైనా ఏఐ వ్యవస్థ వాస్తవ ప్రపంచం నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే పనిచేస్తుంది. ఈ సమాచారం ద్వారా ఏఐ వ్యవస్థలకు శిక్షణ అందుతుంది. రకరకాల మార్గాల ద్వారా ఏఐ వ్యవస్థలకు డేటా (టెక్ట్స్, ఇమేజెస్, సంగీతం) అందు తూంటుంది. రస్కిన్ బాండ్ లేదా అమితవ్ ఘోష్ శైలిలో ఒక చిన్న కథ రాయమని మనం ఏదైనా లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను అడిగా మనుకోండి... వీరిద్దరి రచనల తాలూకూ సమాచారం మొత్తాన్ని వెతికేస్తుంది ఏఐ! చివరకు కాపీరైట్ హక్కులున్న సమాచారం కూడా. కానీ ఏఐ కంపెనీలు ఈ కాపీరైట్ హక్కులు పొందకపోవడం గమ నార్హం. గిబ్లీ ఆర్ట్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏ కంపెనీ కూడా గిబ్లీ స్టూడియో తాలూకూ చిత్రా లను వాడుకునే హక్కులు తీసుకోలేదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్నే తాము వాడుకుంటున్నట్లు ఏఐ కంపెనీలు చెబుతున్నా... రచయితలు, కళా కారుల స్పందన వేరుగా ఉంది. కాపీరైట్ చట్టాల్లోని ‘ఫెయిర్ యూజ్’ సిద్ధాంతం గురించి ఏఐ కంపెనీలు చదివితే మేలని వీరు అంటు న్నారు. అప్పుడే అమెరికా, యూరప్‌లలో న్యాయపోరాటాలైతే మొద లయ్యాయి. సృజనకారులకు దక్కేదేమిటి?గిబ్లీ ఆర్ట్ వంటి ఏఐ టూల్స్ అసలు సృజనాత్మకత అన్న అంశంపైనే సవాళ్లను లేవనెత్తుతున్నాయి. ఓ అందమైన పెయింటింగ్, కార్టూన్ క్యారెక్టర్, సంగీతం... ఇవన్నీ మనిషి సృజనకు మచ్చుతున కలు. ఇవన్నీ ఆ యా వ్యక్తుల సొంత అనుభవాలు, సందర్భాల నుంచి పుట్టుకొచ్చినవి. గిబ్లీ ఆర్ట్‌నే ఉదాహరణకు తీసుకుందాం. జపాన్ సమాజం, సంస్కృతులకు అది అద్దం పడుతుంది, అమెరికన్ సంస్కృతికి వాల్ట్ డిస్నీ స్టూడియో అద్దం పట్టినట్లు!ఇలాంటి సృజనాత్మక కళాకృతులను యంత్ర సృష్టిగా మార్చడం లేదా ఒక ఏఐ సిస్టమ్ మానవ సృజనాత్మకత, అభినివేశాలకు విరు ద్ధంగా వెళ్లడం మేలైన ఆలోచనైతే కాదు. ఒక పెయింటింగ్‌ను పూర్తి చేసేందుకు కళాకారుడికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. అలాగే పుస్తకం రాయడానికి ఏళ్లు పడుతుంది. ఒక కార్టూన్ లేదా యానిమేషన్ స్ట్రిప్ తయారు చేసేందుకు ఆర్టిస్టులు వందల గంటలు కష్టపడాల్సి రావచ్చు. వీటన్నింటి ఆధారంగా పనిచేసే ఏఐ సృష్టించే ఆర్ట్‌కు పేరు, డబ్బు... రెండూ అసలు కళాకారులకే దక్కాలి. అందుకే ఏఐ కంపె నీలు డేటా లాండరింగ్‌కు పాల్పడుతున్నాయనీ, కళాకారులకు దక్కా ల్సిన డబ్బు, క్రెడిట్ రెండింటినీ ఎగ్గొడుతున్నాయనీ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని లక్షల మంది కళాకారులపై ఆధారపడి అభివృద్ధి అవుతున్న ప్రతి ఏఐ జనరేటివ్ మోడల్ కంపెనీ విలువ వందల కోట్ల డాలర్లుగా ఉండటం ప్రస్తావనార్హం. ఇవి వినియోగ దారుల నుంచి వేల డాలర్ల రుసుము వసూలు చేస్తూంటాయి. అయితే, అసలు కళాకారులకు ఇందులోంచి ఏమీ దక్కడం లేదు. ఇమేజ్ జనరేటర్లు కళాకారులు కాదు కానీ... కళాకారులకు సవాలు విసురుతున్నాయి. జనరేటివ్ ఏఐ మోడళ్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మకత కలిగిన వారి జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయి. యానిమేషన్ రంగంలోని కళాకారులు, ఇల్లస్ట్రేటర్లు, డిజైనర్లపై ప్రభావం ఎక్కువే ఉంది. పైగా మానవ కళాకారులతో పోలిస్తే ఏఐ తయారు చేసే బొమ్మల్లో డెప్త్, భావ ప్రకటన తక్కువ. ఏఐ ఆకృతులు ఓ మోస్తరువి మాత్రమే! ఒప్పందాలు మేలా?ఇప్పుడు డిజిటల్ ప్రపంచం మొత్తం గిబ్లీ వంటి ఉచిత ఏఐ టూల్స్ ఉత్పత్తులతో నిండిపోయింది. సినిమా స్టుడియోలు, నెట్ వర్క్‌లు ఇప్పటికే ఈ ఏఐ టూల్స్‌ను శ్రమ, ఖర్చులు రెండూ తగ్గించేవిగా చూస్తున్నాయి. పదుల కొలదీ యానిమేటర్ల బృందాలను నియమించుకునే బదులు, కొందరు ఏఐ టెక్నికల్ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ధోరణి మనదేశంలో ఆందోళనకు కారణం అవుతోంది. వేల మంది భారతీయ టెకీలు హాలీవుడ్ స్టూడియోలు ఔట్‌సోర్స్ చేసే యానిమేషన్ వర్క్‌పై ఆధారపడి ఉన్నారు. వాళ్లు కంప్యూటర్ గ్రాఫిక్స్, ఇతర టూల్స్‌ను వాడుతున్నారు. కానీ ఏఐ టూల్స్‌తో ఆటోమేషన్ మరో స్థాయికి వెళ్తుంది.ఈ సమస్యకు సులభ పరిష్కారం లేదు. కాపీరైట్ల విషయంలో న్యాయ స్థానాలకు వెళ్లడం ఒక మార్గం. డేటా ప్రొటెక్షన్ చట్టాలు, ఏఐ నియంత్రణలు ఇప్పుడిప్పుడే ఏఐ టూల్స్ తాలూకూ సైడ్ ఎఫెక్ట్స్్పై దృష్టి పెడుతున్నాయి. కొంతమంది పబ్లిషర్లు, పుస్తక, సంగీత కంపె నీలు ఆదాయాన్ని పంచుకునే విషయంలో ఏఐ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తద్వారా తమ పుస్తకాలు, సంగీతం లేదా ఇతర కళలను ఏఐల శిక్షణకు ఉపయోగించుకునే వీలు ఏర్పడుతోంది. డేటా ట్రెయినింగ్ కోసం ఎటూ టెక్ కంపెనీలు తమ కళను వాడుకుంటున్నట్లు వీరు భావిస్తున్నారు. బదులుగా ఒప్పందం కుదుర్చుకో వడం మేలని వీరి ఆలోచన. అనుమతులు తీసుకుని కళలు, సమా చారాన్ని ఏఐ ట్రెయినింగ్ కోసం వాడుకోవడం ఇంకొక మార్గం. సోషల్ మీడియా వేదికలు కూడా ఏఐ ఆధారిత ఇమేజెస్, వీడి యోలు, యానిమేషన్లను అనుమతించే విషయంలో ఆచితూచి వ్యవ హరించాలి. ప్రస్తుత గిబ్లీ ఆర్ట్ ట్రెండ్ ముప్పు లేదని అనిపించవచ్చు. కానీ... వాస్తవానికి ఇది మనకు మేలుకొలుపు లాంటిది!దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వైరల్ : తప్పుడు వార్తలు ఎలా వ్యాపిస్తుంటాయంటే..
నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టివచ్చేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి సంగతే ఇది.‘‘మధ్యప్రదేశ్ లో నలుగురు వ్యక్తులు కలిసి, ఒక మేకను దేవుడికి బలి ఇవ్వడానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారి వాహనానికి యాక్సిడెంటు అయింది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వంతెన మీద నుంచి సోమావతి నదిలోకి పడిపోయింది. మేకను బలి ఇవ్వడానికి తీసుకువెళుతున్న ఆ నలుగురు వ్యక్తులూ, ఆ ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కానీ దైవికంగా సంభవించిన చిత్రమేమిటంటే.. ఆ మేక మాత్రం క్షేమంగా బతికి బయటపడింది.’’ ఇలాంటి వార్త ఇక్కడ చూపిస్తున్న ఫోటోతో సహా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.‘దేవుడి మహిమ అంటే అదీ’ అని వాదించేవాళ్లు..‘వాళ్లు మేకను బలి ఇవ్వాలనుకున్నారు. దేవుడు వాళ్లనే బలి తీసుకున్నాడు’ అనే వాళ్లూ..‘దేవుడు కరుణమాయుడు.. తాగుబోతులను కాకుండా మూగజీవిని కాపాడాడు’ అని సూత్రీకరించేవాళ్లూ.. బోలెడు మంది తయారవుతారు.ఫోటోలో ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది తప్పుడు వార్త! మరి ఫోటో ఎలా? అని సందేహించకండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారైన ఫోటో కావొచ్చు. వాహనం తలకిందులుగా పడి ఉంటే.. దాని నెంబర్ ప్లేట్ మాత్రం.. స్ట్రెయిట్ గానే కనిపిస్తుండడం ఈ ఫోటో ఫాబ్రికేషన్ లో ఒక లోపం.తత్వ ఇండియా (#thetatvaindia) అనే బ్లూటిక్ ఉన్న అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ పోస్టు పబ్లిష్ అయింది. 23 గంటలు కూడా గడవక ముందే.. ఈ పోస్టును కోటి మంది వీక్షించారు. దాదాపు 600 మంది తమ కామెంట్లను పంచుకున్నారు. దాదాపు మూడువేల మంది ఈ పోస్టును షేర్ చేశారు. దాదాపు 30 వేల మంది దీనిని లైక్ చేశారు. 1300 మంది వరకు బుక్ మార్క్ చేశారు. అంతగొప్పగా వైరల్ అయిన ఈ విషయాన్ని కాస్త లోతుగా గమనిస్తే.. అది కాస్తా తప్పుడు వార్త అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన మాట నిజం. కానీ ఈ పోస్టు మాత్రం తప్పు!వాస్తవాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని భేడాఘాట్ చౌకీతాళ్ కు చెందిన ఆరుగురు వ్యక్తులు.. నర్సింగ్‌పూర్ జిల్లాలోని దుల్హా దేవ్ మహరాజ్ ఆలయంలో బలి ఇవ్వడానికి మేకను తీసుకుని వెళ్లారు. ఆ ఆలయంలో ప్రతీకాత్మకంగా మాత్రమే బలి జరుగుతుంది. బలి ఇచ్చినట్టు గుర్తుగా మేక చెవులను మాత్రం కత్తిరిస్తారు. వీళ్లు ఆ బలి మొక్కుబడిని తీర్చుకుని గోటగావ్ నుంచి జబల్పూర్ కు తిరిగి బయల్దేరారు. చెవులు కత్తిరించిన మేక కూడా అదే వాహనంలో ఉంది. డ్రైవ్ చేస్తూనే బాగా మద్యం సేవించారు. జబల్పూర్ సమీపంలో ఛర్గావాన్ ప్రాంతానికి వచ్చిన తర్వాత.. అదుపు తప్పి వంతెన మీదనుంచి సోమవతి నదిలో పడిపోయింది. ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మేకమాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన అసలు ఫోటో ఇది (తెల్ల స్కార్పియో ఉన్నది). వాహనంలో ఉన్న వాళ్లు మద్యం సేవించి నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.సంఘటన నిజంగానే జరిగింది. కానీ దానిని.. తమకు కావాల్సిన రీతిలో వక్రీకరించి సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు. ఏ రకంగా వక్రీకరించి ప్రచారంలో పెడితే.. వ్యూస్ ఎక్కువగా వస్తాయో.. ఇలాంటి తప్పుడు వ్యక్తులకు బాగా తెలుస్తుంది. అంత తెలివైన వాళ్లు కాబట్టే.. ఒక్కరోజు కూడా గడవకముందే కోటి వ్యూస్ సంపాదించుకున్నారు. దీనిని బట్టి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే.. సోషల్ మీడియాలో ఏది కనిపిస్తే అది నిజం అని నమ్మకూడదు. కంటికి కనిపించేవి.. చెవులకు వినిపించేవి అన్నీ నిజం కాదు. బ్లూ టిక్ ఉన్నంత మాత్రాన ఆ సోషల్ మీడియా అకౌంట్లు నిజాలు చెప్పే నిజాయితీ ఉన్నవి అనుకోవడానికి కూడా వీల్లేదు. సోషల్ మీడియాలో ఏ సంగతి కనిపించినా.. ముందు దానిని అపనమ్మకంతో చూడాలి. ఇంకాస్త అనుమానం కలిగితే.. ఏదో ఒక రకంగా క్రాస్ చేసుకోవాలి. లేకపోతే.. ఈ తప్పుడు ట్వీట్ ను షేర్ చేస్తూ వెళ్లిన మూడు వేల మంది అమాయకుల్లో ఒకరుగా మనం కూడా మారిపోతాం...ఎం.రాజేశ్వరి -
సినిమా రేంజ్ మావా.. నడి రోడ్డుపై వాటర్ ట్యాంకర్ పల్టీలు
బెంగళూరు: బెంగళూరు నగరంలో పట్టపగలే సినిమా రేంజ్ రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంలో ఉన్న వాటర్ ట్యాంకర్ మరో వాహనాన్ని ఓటర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. దీంతో, నడిరోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. వాటర్ ట్యాంకర్ వర్తూర్ వైపు నుంచి దొమ్మసాంద్రకు నీటిని తీసుకెళ్తోంది. ఈ క్రమంలో సదరు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాలను ఓటర్ టేక్ చేశాడు. ఒక్కసారిగా వేగం పెరగడంతో ట్యాంకర్ వాహనం అదుపు తప్పింది. దీంతో, వాహనం ప్రమాదానికి గురైంది. సినిమా రేంజ్లో పల్టీలు కొడుతూ.. రోడ్డుపై పడిపోయింది. ట్యాంకర్లో ఉన్న నీళ్లు ఎగిరిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇక, ఈ ప్రమాదం కారణంగా ట్యాంకర్ డ్రైవర్, వాహనంలో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. A water tanker overturned on #Dommasandra-#Varthur Main Road in #Bengaluru earlier today, causing a major disruption to traffic in the area.According to eyewitnesses, the driver lost control of the vehicle, leading to the accident.Passersby and local residents quickly rushed… pic.twitter.com/sPtLTr6Hpg— Hate Detector 🔍 (@HateDetectors) April 14, 2025 -
ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి?.. సలహా కోరిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ నటుటు అమితాబ్ బచ్చన్ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సరదా పోస్టులతో అలరిస్తుంటారు. అయితే ట్విటర్ వేదికగా మరోసారి తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు బిగ్ బీ. ఈ సందర్భంగా తన ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలో సలహా ఇవ్వండని కోరారు. ప్రస్తుతం నాకు 49 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని.. ఆ సంఖ్యను పెంచేందుకు సలహా ఇవ్వమని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ తమకు నచ్చిన విధంగా అమితాబ్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులతో నింపేస్తున్నారు. మరి వారిచ్చిన సలహాలేవో చూసేద్దాం పదండి.అయితే అమితాబ్ పోస్ట్‌కు పలువురు నెటిజన్స్ స్పందించారు. కొందరైతే మీ సతీమణి జయాబచ్చన్‌తో ఓ వీడియో చేసి పోస్ట్ చేయండని సలహా ఇచ్చారు. మరికొందరేమో కేవలం పెట్రోల్ ధరల గురించి మాట్లాడితే ఒక్కరోజులో మీ సంఖ్యం 50 మిలియన్ల మంది ఫాలోవర్లు దాటిపోవడం గ్యారెంటీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరైతే ఏకంగా నటి రేఖను పెళ్లి చేసుకోవాలని సరదాగా పోస్ట్ చేశాడు. ఒకరేమో జయా బచ్చన్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయండని వారికి తోచిన విధంగా కామెంట్స్ పెడుతున్నారు.అయితే చాలా మంది నటి రేఖ పేరు ప్రస్తావించడంపై నెట్టింట చర్చ మొదలైంది. దీనికి కారణం వీరిద్దరు కలిసి గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అమితాబ్- రేఖ.. దో అంజానే, అలాప్, ఖూన్ పసీనా, గంగా కీ సౌగంద్, రామ్ బలరామ్, సిల్సిలా లాంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు. వీరి జోడీపై గతంలో చాలా రూమర్స్ కూడా వినిపించాయి. ఆ తర్వాత అలాంటి ప్రచారాలకు చెక్ పెడుతూ ఆయన జయా బచ్చన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చివరిసారిగా కల్కిలో కనిపించిన అమితాబ్.. ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్‌పతి రియాల్టీ షోకు హోస్ట్‌గా పనిచేశారు.T 5347 - बड़ी कोशिश कर रहे हैं, लेकिन ये 49M followers का नंबर बढ़ ही नहीं रहा है ।कोई उपाय हो तो बताइए !!!— Amitabh Bachchan (@SrBachchan) April 13, 2025 -
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
దుబ్బాకటౌన్: సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకొని సిద్దిపేట జిల్లాకు చెందిన యువ కళాకారులు తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గజ్జె కట్టి, మైక్ పట్టి ధూంధాం వంటి కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన ఎంతో మంది కళాకారులు యూట్యూబ్‌ను వేదికగా చేసుకొని తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. యూట్యూబ్‌ల్లో లక్ష్యల్లో వ్యూస్ పొందుతున్నారు. రేలారే రేలా.. వివిధ టీవీ కార్యక్రమాలతో మనం నేర్చుకున్న విద్య, చేస్తున్న వృత్తి, జీవితంలో ఎంచుకున్న మార్గం పెద్దల బాటల్ని బట్టే ఉంటాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి సాహిత్యంలో మంచి గౌరవం ఉన్నట్లే భార్గవి తల్లి భూదవ్వకు మంచి గుర్తింపు ఉంది. రేలారే రేలా.. వివిధ టీవీ కార్యక్రమాల్లో జానపద పాటలతో అలరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాల్లో తన ఆట, పాటలతో జనాన్ని కట్టి పడేసింది. ప్రస్తుతం జాన పదాలను పాడుతూ.. తానే స్వయంగా నటిస్తూ యూట్యూబ్‌లో ఫోక్ స్టార్‌గా పేరు గాంచింది. ప్రముఖ జానపద గాయకుడు కళాకారుడు శ్రీనివాస్ భార్గవిని చాలా ప్రోత్సహించేవాడు. ఆయన అప్పటికే జానపదాలు పాడుతుండేవాడు. డప్పు కొట్టుకుంటూ పాడడం, డ్యాన్స్ చేస్తూ పాడడం నేర్పంచి కొత్త భార్గవిగా తయారు చేశాడు. ఆయన వల్లె రేలారే రేలాలో భార్గవికి అవకాశం వచి్చంది. కళను నేర్ప న కళాకారుడితోనే వివాహం పాటతో ప్రారంభమైన భార్గవి జీవితంలో మరో పాటగాడు ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు.. ఆట, పాట నేర్పిన కళాకారుడు ముక్కపల్లి శ్రీనివాస్‌ను భార్గవి వివాహం చేసుకుంది. భార్గవి, శ్రీనివాస్ కలిసి పాడి నటించిన.. కుటుంబ నేపథ్యానికి చెందిన జానపదాలైన బంతి పూల వాసన నీ బానిన్ల, చిన్ననాడు పెట్టిన చిక్కుడు చెట్టు, పోంగ పోంగా పొట్లా చెరువు, కొత్త కుండాల రెండిత్తునాలత్తో .. వంటి పాటలు అధ్యశ్రీ మ్యూజిక్ ద్వారా యూట్యూబ్‌లో విడుదలై ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. మరికొందరు కళాకారులు దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన కమ్మరి నర్సింలు, పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన బిట్ల ఎల్లం, దుబ్బాకకు చెందిన తుమ్మల ఎల్లంఆస రామారావు, తదితర కళాకారులు, కవి గాయకులు తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి నేడు సోషల్ మీడియా ద్వారా తమ కళను నిరూపించుకుంటున్నారు. హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి మూడు తరాల నుంచి మా ఇంట్లో జానపదాలు జాలువారుతూ వస్తున్నాయి. జాన పదాలంటే నాకు ప్రాణం. ధూంధాంలో వివిధ సభల్లో జాన పదాలు పాడుతుంటే ఆడ పిల్లవైన నీకు ఈ సభలలో పాడడం అవసరమా అని చాలా మంది హేళన చేసేవారు. కానీ వారే ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు. అమ్మ నేర్పన పాటను జీవన పాఠంగా నేర్చుకొని గురువు నేర్పన బాటలో ముందుకు సాగుతున్నాను. ఇప్పటి వరకు 10 పాట్లల్లో నటించగా, ఆధ్యశ్రీ మ్యూజిక్ ఛానల్‌కు 2.90 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. భవిష్యత్‌లో మరింతగా రాణిస్తాను. –ముక్కపల్లి భార్గవి సోపతి మ్యూజిక్ సత్తా చాటుతూ.. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పిల్లి కార్తీక్ ముదిరాజ్ 2019 సంవత్సరంలో వస్తావ పిల్ల ఓ మధుబాల పాట ద్వారా పరిచమమై సోపతి యూట్యూబ్ ఛానల్ ద్వారా సత్తా చాటుతున్నాడు. 30కి పైగా పాటల్లో నటించి జిల్లాలో ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఇటీవల ప్రారంభించిన సోపతి యూట్యూబ్ ఛానల్‌కు 7 వేల మందికి పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అత్తని చూడది అన్నమెయ్యది పాట 1.5 మిలియన్ వ్యూస్‌తో మంచి ఆదరణ పొందింది. 200 పైగా పాటల్లో మౌనిక డింపుల్ మౌనిక డింపుల్ డ్యాన్స్‌లో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని దాదాపు 200కు పైగా పల్లె పదాల పాటల్లో నటించింది. చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన మౌనిక మొదట సైడ్ డ్యాన్సర్‌గా వచ్చి డ్యాన్స్‌లో మెళుకువలు నేర్చుకొని జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎంతో మంది ఆదరాభిమానాలు పొందింది. పల్లెదనం ఉట్టిపడేలా పల్లెటూరి యువతీల పాటల్లో నటిస్తూ హోరెత్తిస్తుంది. ఇన్స్ట్ర్రాగమ్లో రీల్స్ చేస్తూ..ముందుకు సాగుతుంది. డ్యాన్స్‌లో, యాక్టింగ్‌లో నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి నేను 200 పల్లె పదాల్లో నటించడానికి నా గురువులే కారణం. నన్ను ప్రోత్సహించిన కార్తీక్ ముదిరాజ్, హరీశ్ పటేల్‌కు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది. పీఎం క్రియేషన్స్: 8 లక్షల సబ్స్క్రైబర్స్సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల గ్రామానికి చెందిన పార్వతీ మహేశ్ తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి విభాగంలో కళాకారుడిగా పాల్గొన్నాడు. ఉద్యమ సమయంలో పలు వేదికల్లో ఆట, పాటతో అలరించాడు. పీఎం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పల్లె పదాలను అందిస్తున్నాడు. మంచి పాటల రచయితగా గుర్తింపు పొందిన మహేశ్ 50 పాటలు పైగా రచించి, 30 పాటలకు ప్రొడ్యూస్ చేశాడు. 40 పాటల్లో నటనతో అలరించాడు. 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. భార్య సంజన సైతం సింగర్ కావడం విశేషం. నాయి దొరో.. నా రాజమని పాట 100 మిలియన్ వ్యూస్‌తో జనాధారణ పొందింది.దివ్యాంగుడైనా కళాకారులను ప్రోత్సహిస్తూ.. సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి దివ్యాంగుడైనా కొత్త కళాకారులను ప్రోత్సహిస్తూ.. పల్లె సవ్వడి ఛానెల్ ద్వారా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. 6 పాటలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి కొత్త కళాకారులకు అవకాశం కలి్పస్తున్నాడు. -
‘ఈమెను చూస్తే దోమలకు వెన్నులో వణుకు’
న్యూఢిల్లీ: ‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’ అని అంటుంటారు. ఎవరి బుర్రలో ఏముందో ఇతరులు చెప్పలేరు. ఇదేకోవలోకి వస్తుంది.. ఆకాంక్ష రావత్(Akanksha Rawat).. ఈమె తన విచిత్రమైన హాబీతో సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకుంటోంది. ఆమె చేస్తున్న పనిని చూసిన జనం నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేస్తోంది?ఆకాంక్ష రావత్‌కు చనిపోయిన దోమలను సేకరించడం, వాటికి సంబంధించిన వివిధ వివరాలతో లేబుల్ చేయడమనే వింత హాబీ ఉంది. తన అభిరుచిని ఆమె ఇన్స్టాగ్రామ్(Instagram)లో ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసింది. దీనిని చూసినవారంతా ‘ఇదేం వింత హాబీరా బాబూ’ అని అంటున్నారు. ఆ వీడియోలో ఆకాంక్ష రావత్ ఒక కాగితం షీట్‌ను చూపిస్తుంది. దానిపై చనిపోయిన దోమలు టేప్‌తో అతికించినట్లు కనిపిస్తాయి. ప్రతి దోమకు ఒక పేరు.. ఉదాహరణకు 'సిగ్మా బోయ్', 'రమేష్', 'బబ్లీ', 'టింకు' అని రాసివుంది. అలాగే వాటి మరణ సమయం, మరణ స్థలం లాంటి వివరాలు కూడా ఆ షీట్లో ఉన్నాయి.ఈ వీడియోను రికార్డ్ చేసిన కెమెరాపర్సన్.. చాలామందికి వింత హాబీలు ఉంటాయి. వాటికి మించిన వింత హాబీ ఈమెకు ఉంది. ఆ వివరాలు నేను మీకు చూపిస్తాను అని అంటూ దోమల సేకరణ వివరాలను చూపిస్తారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు మిలియన్లకుపైగా వీక్షణలను దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారంతా పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక యూజర్ ‘ఈమెను చూసి దోమల సమాజమంతా భయపడుతోంది’ అని రాశారు. మరొకరు దోమలకు మగ పేర్లను పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. సాధారణంగా ఆడ దోమలే రక్తాన్ని పీలుస్తాయని వివరణ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఎన్ఐఏ విచారణలో రాణా మూడు డిమాండ్లు -
సోషల్ మీడియా సలహాలతో జాగ్రత్త
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్(ఎస్‌ఎంపీలు) ద్వారా సెక్యూరిటీ మార్కెట్ల సంబంధిత కుట్రపూరిత కార్యకలాపాలు జరుగుతున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. ఎస్‌ఎంపీల ద్వారా సెక్యూరిటీ మార్కెట్ల మోసాలు అధికమయ్యాయని తెలియజేసింది. కేవలం సెబీ వద్ద రిజిస్టరైన ఇంటరీ్మడియరీల ద్వారా లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వమంటూ పబ్లిక్కు సూచించింది. పెట్టుబడులు చేపట్టేందుకు అ«దీకృత ట్రేడింగ్ యాప్స్‌ను మాత్రమే వినియోగించుకోమంటూ సలహా ఇచ్చింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్(ట్విటర్), టెలిగ్రామ్, గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ తదితర సుప్రసిద్ధ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇటీవల మోసపూరిత సలహాలు, లావాదేవీలు అధికమైన నేపథ్యంలోసెబీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. వీటి ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ఎడ్యుకేషనల్ కంటెంట్ ఆఫర్ చేస్తున్నట్లు సెబీ తెలియజేసింది. దీనిలో భాగంగా తప్పుదారి పట్టించే కాల్స్, మోసపూరిత డాక్యుమెంట్లు, తప్పనిసరిగా లేదా రిస్‌్కలేని లాభాల అక్రమ హామీలు వంటివి ఇన్వెస్టర్లకు ఎరగా వేస్తున్నట్లు వివరించింది. అంతేకాకుండా రిజిస్టర్‌కాకుండానే పెట్టుబడి సలహాలు, సెబీ నకిలీ రిజిస్ట్రేషన్ సరి్టఫికెట్లు వంటివి వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. మరికొన్ని సందర్భాలలో సెబీ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్స్ పేరిట మోసాలకు తెరతీస్తూ అధిక రిటర్నుల ఆశ చూపుతూ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ప్రయతి్నస్తున్నట్లు వివరించింది. ఇందుకు వాట్సాప్, టెలిగ్రామ్ చానళ్లలో తప్పుడు గ్రూప్‌లను సైతం సృష్టించడం ద్వారా మోసపుచ్చుతున్నట్లు పేర్కొంది. వెరసి నకిలీ సలహాదారులపట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లను మరోసారి సెబీ హెచ్చరించింది! -
పువ్వులు... కొన్ని చిరునవ్వులు
బుంగమూతి పెట్టుకుని ఓ ఫొటో, చిరునవ్వులు చిందిస్తూ మరో ఫొటో, ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తున్నట్లు ఓ ఫొటో... ఇలా రష్మికా మందన్నా తన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ బ్యూటీ ఇటీవల వెకేషన్ కోసం ఒమన్ వెళ్లారు. అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేయడం, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం... ఇలా రొటీన్‌కి భిన్నంగా టైమ్ స్పెండ్ చేశారామె. ఈ నెల 5న తన పుట్టినరోజుని కూడా అక్కడే జరుపుకున్నారు.‘బీచ్... ఇసుక, సన్ సెట్, పువ్వులు (పూల తోట నుంచి ఉద్దేశించి ఆయ్యుండొచ్చు), కొన్ని చిరునవ్వులు... ఇంకా మీ ప్రేమ’ అంటూ పోస్ట్ చేశారు. ఒమన్‌లో గడిపిన వెకేషన్‌కి సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. ఇక వెకేషన్ నుంచి వచ్చిన రష్మిక హిందీ చిత్రం ‘థామా’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ హారర్ మూవీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. -
గ్రేట్ ఆంధ్రా మ్యాజిక్ షో!
పీసీ సర్కార్ ఇంద్రజాలం గొప్పదా... ఏపీ సర్కార్ ఇంద్ర జాలం గొప్పదా? పీసీ సర్కార్ మ్యాజిక్ ట్రిక్స్ ఈ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవని విన్నాము. ఏపీ సర్కార్ ట్రిక్స్ మాత్రం ప్రజలను షాక్ మీద షాక్‌కు గురిచేస్తున్నాయి. అది... స్టేజ్ షో. అంతా మ్యాజిక్ అనే సంగతి ముందుగానే తెలుసు! కానీ, ఇది... జనజీవితంతో ఆటాడుకోవడం! మోసపోతున్నా మని ముందుగా ప్రజలకు తెలియదు. క్రమంగా అనుభవంలోకి వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంటింటికీ ఓ వైకుంఠాన్ని వాగ్దానం చేసిన మ్యానిఫెస్టో కూడా మ్యాజిక్ షోలో భాగమని అప్పుడు అర్థం కాలేదు. మెజీషియన్ దాన్ని తన టోపీలో పడే శారు. ఇప్పుడా టోపీలోంచి కుందేళ్లు, కుక్కపిల్లలు వగైరాలే వస్తున్నాయి. మ్యానిఫెస్టో మాయమైంది.ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఆహ్లాదపరచాలని, హామీల సంగతిని మరిపింపజేయాలని చంద్రబాబు సర్కార్ ప్రయాస పడుతున్నది. అందులో భాగంగా ఆయన నాలుగు రోజులకో కొత్త ట్రిక్కును నేర్చుకొస్తున్నారు. వేదికల మీద వాటిని ప్రదర్శి స్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో వాస్తవాలకు గంతలు కట్టడానికి, ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి శతవిధాలైన విన్యాసాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇందులో మొదటి అంశం – అభివృద్ధి అనే పదానికి తననే నిర్వచనంగా చెప్పు కోవడం, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా తనను తాను ప్రమోట్ చేసుకోవడం! కానీ, వాస్తవ పరిస్థితి? ఈ పది మాసాల కాలంలోనే అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. పన్నుల వసూళ్లు మందగించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తిరోగమన పథంలోకి వెళ్లాయి. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ధాన్యం రైతుల దగ్గర్నుంచి ఆక్వా రైతుల వరకు అందరూ దయనీయ స్థితిలోకి జారిపోతున్నారు. విద్యుత్ బిల్లుల భారంతో వేలాది ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇరవై వేలమంది ఉపాధి కోల్పోయారు.బాబు సర్కార్ మ్యాజిక్ చేయదలచుకున్న రెండో అంశం – సంక్షేమ రంగం. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ గుర్తు కొస్తుందని బహిరంగ సభల్లో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి తరఫున ఆయన చేసిన వాగ్దానాల సంగతిని కాసేపు మరిచిపోదాం. అంతకుముందు జగన్ ప్రభుత్వం అమలుచేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను చాప చుట్టేసి అటకెక్కించారు. ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. మహిళలకు ‘చేయూత’ అందడం లేదు. ‘వైఎస్సార్ బీమా’ కనుమరుగైంది. ‘మత్స్యకార భరోసా’ మాయమైంది. ‘కల్యాణమస్తు’ కనిపించడం లేదు. ఆటో డ్రైవర్లకు ‘చేదోడు’ లేదు. చిల్లర వర్తకులకు తోడుగా నిలిచిన రుణ సదుపాయం నిలిచిపోయింది. ఇవి కొన్ని మాత్రమే! చెప్పుకుంటూ పోతే సంక్షేమం కథ చాలా పెద్దది.ఇక మూడో ఇంద్రజాల ఇతివృత్తం – తనను తాను గొప్ప ప్రజాస్వామికవాదిగా ప్రచారం చేసుకోవడం. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ హింసా రాజకీయాలు చేయలేదు. కక్షలూ కార్పణ్యాలకు పూనుకోలేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదని బాబు చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నారు. అనుబంధ మీడియా ఇంకో నాలుగడుగులు ముందుకెళ్లి ఆయన్ను ప్రమోట్ చేస్తున్నది. ఈ ప్రమోషన్‌కూ, వాస్తవ పరిస్థితికీ మధ్యన 180 డిగ్రీల దూరం ఉన్నదని పది నెలల కాలంలో జరిగిన అనేక ఘటనలు రుజువు చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రత్యర్థుల వేట మొదలుపెట్టింది. వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను బహిరంగంగా నరికి చంపుతున్న భయానక దృశ్యాలను చూడవలసి వచ్చింది. పల్నాడు వంటి ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు దాడులకు భయపడి ప్రవాస జీవితాలు గడపవలసి వచ్చింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారి మీద దారుణమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. 50 పైచిలుకు మందిని అరెస్టు చేశారు. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. బీఎన్ఎస్ 111 సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తు న్నారని పోలీసులను పలుమార్లు ఉన్నత న్యాయస్థానం మంద లించవలసి వచ్చింది. ‘రెడ్‌బుక్’ గైడ్‌లైన్స్ ప్రకారం పనిచేయా లని పోలీసులను వారి ఉన్నతాధికారులే ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని పరిణామాలివి.తనకు లేని ఘనతల్ని ఆపాదిస్తూ యెల్లో మీడియా తగిలించిన భుజకీర్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు మ్యాజిక్ షోలను ఆశ్రయించక తప్పడం లేదు. అమరావతి ప్రాంతంలో కొన్ని కృత్రిమ మెరుపుల్ని మెరిపించి, ‘అదిగో అభి వృద్ధి’ అని చెప్పుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి పేరుతో 30 వేల కోట్ల అప్పులు ఇప్పటికే తీసు కొచ్చారు. రైల్వే స్టేషన్ ఎక్కడొస్తుందో ప్రకటించారు. బస్టాండ్ స్థలాన్ని గుర్తించడం జరిగింది. అద్భుతమైన స్టేడియం వస్తుందని ప్రచారం చేశారు. ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఐటీ పరిశ్రమను వేలు పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తాను, అదే చందంగా ‘క్వాంటమ్ వ్యాలీ’ని అమ రావతికి పిలుచుకొస్తానని కూడా చంద్రబాబు పదేపదే ప్రక టిస్తున్నారు. ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటుకు అవసరమయ్యే భౌతిక, మే«ధాపరమైన పరిస్థితులు అమరావతిలోనే కాదు,ఆంధ్రప్రదేశ్‌లోనే లేవనేది నిపుణుల అభిప్రాయం. సమీప భవి ష్యత్తులో అటువంటి ఎకో సిస్టమ్ ఏర్పడే అవకాశాలు కూడా లేవని వారు చెబుతున్నారు.అయినా సరే, అమరావతి టైర్లలో గాలి నింపడానికి ఆయన ఇటువంటి అసంగతమైన సంగతులు ఇంకా ఎన్నయినా చెప్ప వచ్చు. అయినప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక కనిపించడం లేదు. అక్కడ ప్లాట్లు కొనేందుకు జనం ఎగబడడం లేదు. చివరికి మొన్న అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో ఐదెకరాల పైచిలుకు విస్తీర్ణం (25 వేల చదరపు గజాలు)లో ఉన్న ప్లాట్‌లో స్వగృహ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. వెలగ పూడి గ్రామానికి చెందిన కంచర్ల కుటుంబం వారు తమ 29 ఎకరాల 51 సెంట్ల వ్యవసాయ భూమిని ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించగా వారికి 25 వేల చదరపు గజాల ప్లాటు కోర్ క్యాపి టల్ ఏరియాలో లభించింది. 18 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భూమిని నారా బ్రాహ్మణి పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొనుగోలు చేశారు. అంటే గజానికి 7,500 పడిందన్న మాట. కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మరీ ఇంత తక్కువ రేటేమిటో?ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త మిగిలిన సొమ్మును బ్లాక్‌లో చెల్లించి ఉంటారని అనుకోలేము కదా! అమరావతిలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రే షన్ విలువ గజానికి ఐదు వేలు మాత్రమే ఉందట! చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంత తక్కువ విలువ ఎక్కడా లేదు. ప్రపంచంలోని ఐదు పెద్ద నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని తలపోస్తున్న అమరావతిలో ఈ విలువేమిటో అర్థం కాదు. ప్రస్తుతం అమరావతి పట్నం ‘బ్లాక్’ ఈజ్ బ్యూటీ అని కలవరిస్తున్నది. పిలు స్తున్నది. కానీ ఆ బ్యూటీ మాత్రం అమరావతిని ఇంకా కరుణించడం లేదు. ఎప్పుడు కరుణిస్తుందో, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పుంజుకుంటుందో, ఆకాశహర్మ్యాలకు పునాదులు ఎప్పుడు పడతాయో! అప్పటికీ తన మీద అభివృద్ధి ప్రదాత అనే స్టాంపు వేయించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేయగలిగినంత మ్యాజిక్‌ను చేస్తూనే ఉన్నది.అభివృద్ధి ముద్ర కోసం అమరావతి ముసుగును వేసు కున్నట్టే... సంక్షేమం సర్టిఫికెట్ కోసం ఆయన ‘పీ–ఫోర్’ అనే దౌర్భాగ్య సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేయవలసిన ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేల మీద పుట్టిన ప్రతి జీవి ఈ దేశ సంపదలో హక్కుదారేనన్నది సహజ న్యాయం.ఆ సహజ న్యాయం రాజ్యాంగ హక్కుగా పౌరులందరికీ భరోసా నిచ్చింది. కానీ, దేశ సంపదను ప్రైవేటీకరించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించే చంద్రబాబు పేద ప్రజలను కూడా ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. తమ హక్కుల సాధన కోసం, తమ న్యాయమైన వాటా కోసం పిడికిళ్లు బిగించ వలసిన ప్రజలను మభ్యపెట్టి, తక్షణావసరాల కోసం సంప న్నుల ముందు సాగిలపడేట్టు ప్రోత్సహిస్తున్నారు. తన సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకొని తన అనుచరులకు సంపద సృష్టించే పథకాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ‘పీ–ఫోర్’ మంత్రంతో పేదరికం పోదు. ఈ మ్యాజిక్ ఎక్కువ కాలం చెల్లదు. అనగనగా ఒక చిత్తకార్తె చతుష్పాద జీవి లాంటి వెధవొకడు టీడీపీకి అనుబంధ సోషల్ మీడియాలో కిరాయి సైనికుడు. వైసీపీ అగ్రనేత మీద సొల్లు వాగాడు. ఈ రకమైన వాగుడు, అటువంటి పోస్టింగులు అతడికి చిరకాలంగా అలవాటే! కానీ, మొన్నటి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఖండించారు. అతడిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రక టించారు. అరెస్ట్ చేశారు. స్వాగతించవలసిన విషయమే! కానీ, ఈ వ్యవహారంలో చిత్తశుద్ధి ఉండాలనేది సహజమైన ఆకాంక్ష. ఈ ఖండన వెలువడిన వెంటనే సిద్ధంగా ఉన్నట్టుగా యెల్లో మీడియా స్పందించింది. చంద్రబాబును ప్రశంసలతో ముంచె త్తింది. ఇమేజ్ మేకోవర్ ఎక్సర్‌సైజని అర్థమవుతూనే ఉన్నది. అదే బాధాకరం. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన జరుగుతున్నదని ఈ పది నెలల పాలనపై ఆరోపణలు వస్తున్నాయి. చిత్తశుద్ధి వుంటే దీన్ని సరిదిద్దుకోవాలి. కానీ హైకోర్టు హెచ్చరిస్తున్నా ఈ పాలనలో మార్పు రావడం లేదు. టీడీపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఐటీడీపీలో వందలాదిమంది సైకోల్లాంటి కిరాయి సైనికులు పనిచేస్తున్నారు. వారి జుగుప్సాకరమైన రాతలతో, వాగుడుతో ఎంతోమంది కలతచెందిన ఘటనలున్నాయి. ఎన్ని కలకు ముందు గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే గృహిణి ఈ వేట కుక్కల దాడి తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడే ఖండించి ఉంటే, చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితులు ఇలా దిగజారి ఉండేవా? విజయవాడలో జగన్ మామ గురించి ఆప్యాయంగా మాట్లాడిన ఓ పసిబిడ్డ మీద అవాకులు చవాకులు పేలినప్పుడైనా ఈ ఖండన రావాల్సింది. ఇటువంటి అను భవాలు కోకొల్లలు. ఎప్పుడూ స్పందించలేదు. పైపెచ్చు ప్రోత్సహించారని మొన్నటి సొల్లు వెధవే ఒక వెబ్ చానల్లో చెప్పుకొచ్చాడు. ఈ కారణాల రీత్యా, దిగజారి పోతున్న ప్రతిష్ఠను కాపాడుకోవడానికే ఇలా స్పందించారని భావించవలసి వస్తున్నది. మ్యాజిక్ షోలెప్పుడూ మ్యానిఫెస్టో అమలుకు ప్రత్యామ్నాయం కాబోవు. అలా భావిస్తే భంగపాటు తప్పదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
(వీడియో): బాయ్స్ హస్టల్‌కు లవర్‌ను తీసుకెళ్లే ప్లాన్.. ప్రియుడు ఏం చేశాడంటే?
ఛండీగఢ్: ప్రస్తుత జనరేషన్లో యువత ప్రేమ పేరుతో రచ్చ చేస్తున్నారు. భయం, సిగ్గు లేకుండా పబ్లిక్‌గానే హద్దులు దాటుతున్నారు. ఇక, తాజాగా ఓ ప్రేమికుడు.. తన ప్రియురాలి కోసం పెద్ద సాహసమే చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్ రూమ్‌లోకి తీసుకెళ్లేందుకు కొత్త ప్లాన్ చేశాడు. ఓ సూటు కేసులో ఆమెను దాచిపెట్టి తన రూమ్‌కి తీసుకువెళ్దామనుకున్నాడు. ఇంతలో సెక్యూరిటీకి ొదొరికిపోాయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. వీరి మధ్య ప్రేమ ముదిరిపోవడంతో తన గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచి ఉండలేక ఆమెను తనతో పాటు హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. దీంతో, ఆమెను ఓ పెద్ద సూట్ కేసులోప్యాక్ చేశాడు. సూట్ కేసులో ఆమెను తీసుకెళ్తూ హాస్టల్ లోకి ప్రవేశించాడు. అయితే, సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి లగేజ్ సూట్ కేసును చెక్ చేశారు.ఇంకేముంది.. ఆ సూట్‌కేస్‌ను తెరవగానే లోపల అమ్మాయి కనిపించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే సూట్‌కేస్‌లో నుంచి ఆ అమ్మాయిని బయటకు తీశారు. హస్టల్లో తోటి విద్యార్థులు ఈ ఘటనను వీడియో తీశారు. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూనివర్సిటీ యాజమాన్యం వారిద్దరినీ సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వయసు ప్రభావం ఎంతటి తప్పునైనా చేయిస్తుందని కొందరు.. ఇదేమి ప్రేమ పైత్యంరా బాబు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.A boy tried sneaking his girlfriend into a boy's hostel in a suitcase.Gets caught.Location: OP Jindal University pic.twitter.com/Iyo6UPopfg— Squint Neon (@TheSquind) April 12, 2025 -
రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?!
ఆధునిక సాంకేతికత కారణంగా నగర జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు తదితర నిత్య క్రియలతో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ టెక్నికల్ లైఫ్‌గా మారిపోయింది. ప్రధానంగా నగరవాసులు తమ జీవితంలో గ్యాడ్జెట్లను ఒక భాగంగా మార్చుకున్నారని.. ఉదయాన్నే నిద్ర లేపే అలారమ్ మొదలు రాత్రి నిద్రించే ముందు గంటల తరబడి మొబైల్ స్క్రీన్ చూడటం వరకూ ప్రతి క్షణం గ్యాడ్జెట్ల మధ్యనే గడుస్తోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవి మనిషి ఆరోగ్యం, ఫిట్నెస్, కమ్యూనికేషన్, విజ్ఞానం, వినోదం మొదలైన అనేక అంశాల్లో ప్రభావం చూపుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో దైనందిన జీవితంలో విచ్చలవిడి వినియోగం విజ్ఞానం, వినియోగమూ ఎక్కువే..! గ్యాడ్జెట్స్ మన సౌలభ్యం కోసం ఆహ్వానించినవే ఐనప్పటికీ.. వీటి వినియోగంలో మంచి- చెడూ ప్రయోజనా లున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్యాడ్జెట్స్‌పై ఎంత వరకూ ఆధారపడాలి, ఎంత వరకూ వినియోగించుకోవాలి, ఇవి చేస్తున్న మేలేంటి, కలిగిస్తున్న ముప్పు ఎంత అనేది విశ్లేíÙంచుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఈ గ్యాడ్జెట్ల ప్రభావాన్ని నియంత్రించాల్సిన అవసరముందని ఎన్సీఈఆర్టీ వంటి సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి. స్మార్ట్ లైఫ్.. బ్యాడ్ రిజల్ట్.. ఆరోగ్య పరంగా ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లు వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా యాపిల్ వాచ్, ఫిట్‌బిట్, శామ్సంగ్ గెలాక్సీ వాచ్ వంటి డివైజ్‌లు మన హార్ట్ రేట్, నిద్ర, వాకింగ్ స్టెప్స్, క్యాలరీ బర్న్ వంటి వివరాలు మానిటర్ చేస్తాయి. ఇవి ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో ఎంతో దోహదపడుతున్నా. అదే సమయంలో మితిమీరిన స్క్రీన్ టైం వల్ల మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కళ్ల సమస్యలు వంటి దుష్పరిణామాలూ ఎదురవుతున్నాయి. ఫిట్నెస్ఫిట్నెస్ పరంగా షాఓమీ, ఎమ్ఐ బ్రాండ్, హానర్ బ్యాండ్‌లాంటివి మన వర్కౌట్ యాక్టివిటీలను ట్రాక్ చేస్తాయి. యూట్యూబ్, ఫిట్నెస్ యాప్‌ల ద్వారా ఇంట్లోనే వ్యాయామం చేయవచ్చు. దీని కోసం ఆన్లైన్ వేదికగా లెక్కకు మించిన వీడియోలు, సమాచారం అందుబాటులో ఉంది. కానీ ఈ గ్యాడ్జెట్లపై ఆధారపడుతూ నిజమైన ఫిజికల్ యాక్టివిటీకి, వ్యాయామానికి సమయం కేటాయించలేకపోతే ఫలితం కనబడదని కొందరు ఫిట్నెస్ ట్రైనర్ల సూచన. గ్యాడ్జెట్లతో 7 గంటలు.. స్మార్ట్ ఫోన్ సహాయంతో ఫేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో రోజంతా మునిగిపోయే స్థితికి చేరుకున్నారు. ఇది ఒంటరితనాన్ని, ఆత్మవిమర్శను పెంచే పెను ప్రమాదంగా మారింది. సోషల్ యాప్స్ సమాజానికీ, మనుషులకూ మధ్య సంధానకర్తగా మారాయి. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో చేరిపోతుండటం సాంకేతికత మాయాజాలమే. సామాజిక అభివృద్ధిలో ఇదొక కీలక మలుపు. కానీ ఈ వేదికగా లభ్యమయ్యే సమాచారంలో వాస్తవికత, నిజాలను తేల్చిచెప్పే అవకాశం అంతగా లేకపోవడంతో మంచి-చెడూ రెండు అంశాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. 2023లో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎమ్ఏఐ), నిల్సెన్ సంయుక్తంగా నిర్వహించిన రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో సగటు పౌరుడు రోజుకు సుమారు 7 గంటల పాటు డిజిటల్ గ్యాడ్జెట్లపై గడుపుతున్నాడు. ఇందులో 2.5 గంటలు సోషల్ మీడియా కోసం మాత్రమే వినియోగిస్తున్నాడని వెల్లడించారు. డిజిటల్ డిపెండెన్సీ.. వినోదం, గేమింగ్ రంగాల్లో ఈ గ్యాడ్జెట్లు మరో కొత్త యుగానికి నాంది పలికాయి. ఆక్యులస్ క్వెస్ట్, ప్లే స్టేషన్, వీఆర్ వంటి హెడ్సెట్లు వాస్తవిక అనుభూతిని అందిస్తూ, వినోదాన్ని సహజ అనుభూతిని పంచుతున్నాయి. ప్రస్తుత 5డీ టెక్నాలజీ గేమ్స్ అద్భుత వినోదంతో.. పాటు సమయాన్ని వృథా చేస్తోంది. భారతీయ పరిశోధన సంస్థ ఎయిమ్స్, ఐసీఎమ్ఆర్ నిర్వహించిన అధ్యయనంలో సుమారు 3000 మంది అత్యధిక స్క్రీన్ టైం వల్ల నిద్ర, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తేల్చింది. మరీ ముఖ్యంగా యువతలో డిజిటల్ డిపెండెన్సీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించాయి. ఆనందం.. ఆధిపత్యం కాకూడదు.. మొత్తానికి గ్యాడ్జెట్లు మన జీవితంలో అసాధారణ సౌలభ్యాలను, అనుకూలతలను తీసుచ్చినా, అవి మనిషిపై ఆధిపత్యం చెలాయించకుండా ఉండేందుకు మనమే జాగ్రత్తగా ఉండాలి. వాటిని సంతులితంగా వాడితే అవి వరంగా మారతాయి. లేకపోతే అవే మన స్వేచ్ఛను హరిస్తాయనడంతో ఎలాంటి సందేహం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ చేపట్టిన పరిశోధనలో ఎక్కువగా మొబైల్ వాడకం వల్ల యువతలో ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం పెరిగినట్లు తేలింది. ఈ అధ్యయనంలో ‘నోమోఫోబియా’ (నో మొబైల్ ఫోబియా) అనే పరిస్థితి గురించి కూడా ప్రస్తావించారు. -
మరి ఆ రోజు అనితపై ఎందుకు కేసు పెట్టలేదు: Syamala
-
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్. ఏదో ధర్నా జరుగుతుంటే.. నిరసనకారుల్లో కొందరిని అరెస్ట్ చేయడంలో తన సిబ్బందికి సాయం చేస్తుంటుంది. ఇంతలో వెనకాల పోలీసుల చేతిలో ఉన్న బులుగు చొక్కావోడు.. ఆమె నడుంను పట్టుకుని తెగ ఊగిపోతుంటాడు. చాలామంది ఇదేదో జోక్ అనుకుని.. మెన్ విల్ బి మెన్ అనుకుంటూ వీడియోను ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. నవ్వుకుంటున్నారు. కానీ..ఆ టైంకి ఆ కామాంధుడి చెర నుంచి తనను తాను విడిపించుకున్న ఆమె.. సిబ్బంది సాయంతో పక్కకు తీసుకెళ్లింది. ఈ ఘటన ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో స్పష్టత లేదు. కేసు నమోదైన దానిపైనా స్పష్టత లేదు. పలు జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇచ్చాయికానీ.. ఎక్కడ జరిగిందన్నది ప్రస్తావించలేదు. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలామంది ఆ బులుగు చొక్కావోడిని తిట్టి పారేస్తున్నారు. అలాంటి వాళ్లను వదలకూడదంటూ పోస్టులు పెడుతున్నారు. పట్టపగలు.. అదీ ఓ మహిళా పోలీస్ పట్ల అలా ప్రవర్తించడం ఏంటని? కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ మహిళా పోలీస్తో ఓ వ్యక్తి బహిరంగంగా.. అసభ్యంగా ప్రవర్తించిన తీరును హాస్య కోణంలో కాకుండా తీవ్రంగా పరిగణించాలని పలువురు కోరుతున్నారు.Just look at that blue shirt guy.He is trying to harass a lady Police officer.Such anti social people deserve Jail. pic.twitter.com/nj5MGAEKJU— Sunanda Roy 👑 (@SaffronSunanda) April 9, 2025ఇదిలా ఉంటే.. మహిళా పోలీసులతో ఇలాంటి అసభ్య ప్రవర్తనల ఘటనలు ఈ మధ్యకాలంలోనే చూశాం. మహారాష్ట్రలో నాగ్‌పుర్ (Nagpur)లో మార్చి మూడో వారంలో.. రెండు గ్రూప్‌ల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఒక అల్లరిమూక డ్యూటీలో ఉన్న మహిళా పోలీసు అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించింది. అలాగే.. గణేష్‌పేట ప్రాంతంలో ర్యాపిడ్ కంట్రోల్ పోలీస్ దళంలో విధులు నిర్వహించిన ఓ అధికారిణి సైతం తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న మరో అధికారిణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారట. -
వ్యతిరేక పోస్టులుంటే నో వీసా, నో పర్మిట్
వాషింగ్టన్: సోషల్ మీడియా ఖాతా చూస్తే వ్యక్తుల గురించి తెలిసిపోతుంది. అందుకే.. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఇప్పుడు దానిపై దృష్టి పెట్టారు. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన తరువాతే వీసాలు, నివాస అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా, యెమెన్‌కు చెందిన హౌతీలతో సహా ఉగ్రవాదులుగా అమెరికా వర్గీకరించిన గ్రూపులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులుంటే వారికి అమెరికాలోకి ప్రవేశం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టులుంటే వీసాలు, నివాస అనుమతులు నిరాకరిస్తామని తెలిపారు. ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏజెన్సీ అయిన యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. అమెరికాలో ఉండేందుకు పర్మనెంట్ రెసిడెంట్ ‘గ్రీన్ కార్డుల’ కోసం దరఖాస్తు చేసేవారికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. విదేశీ ఉగ్రవాదాన్ని, యాంటీసెమిటిక్ ఉగ్రవాద సంస్థలు లేదా ఇతర యాంటీసెమిటిక్ కార్యకలాపాలను సమర్థించడం, ప్రోత్సహించడం లేదా మద్దతు ఇచ్చేవిగా సోషల్ మీడియా కంటెంట్ ఉంటే.. యూఎస్ ప్రతికూల అంశంగా పరిగణిస్తుందని ఏజెన్సీ తెలిపింది. ప్రపంచంలోని ఉగ్రవాద సానుభూతిపరులకు అమెరికాలో చోటు లేదని డీహెచ్ఎస్ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసాయ మెక్లాఫ్లిన్ అన్నారు. మరోఅడుగు ముందుకేసి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే విద్యార్థులను ఉన్మాదులుగా అభివర్ణించారు. -
కన్నీరు కార్చడమే దేశద్రోహమా?
ఉత్తరాది రాష్ట్రాలు ఆశ్చర్యకరమైన వార్తలకు జన్మనిస్తాయి. ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగి సాఖిబ్ ఖాన్ (35)ను ఉద్యోగం నుంచి తొలగించారనేది అటువంటి తాజా వార్త. సాఖిబ్ ఖాన్ సహారన్పూర్ జిల్లా కైలాష్పురిలో విద్యుత్ సంస్థకు చెందిన సబ్ స్టేషన్లో కాంట్రాక్టు మీద లైన్ మన్‌గా పని చేస్తున్నాడు. మార్చి 31న ఈద్ నమాజ్ అయి పోయిన తర్వాత పాలస్తీనా జెండా పట్టుకుని ఫొటో దిగి, ఆ ఫొటోను సోషల్ మీడియా మీద పంచుకున్నాడు. ఆ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆయనను పిలిచి రెండు గంటల పాటు ప్రశ్నించి ఏ నేరారోపణలూ, కేసూ లేకుండా వదిలివేశారు. ఆయన మీద ఏ చర్యా తీసుకోకపోతే నిరసన ప్రదర్శనలు చేస్తామని స్థానిక సంఘ్ పరివార్ (Sangh Parivar) సంస్థలు పోలీసులను హెచ్చరించాయి. ఈలోగా ఈ విషయం విద్యుత్ శాఖ దృష్టికి వచ్చి, ఆ చర్యను దేశద్రోహ కర చర్యగా పరిగణించి, తక్షణమే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అదే సమయంలో సహారన్పూర్లో అంబాలా రోడ్ ఈద్గాలో నమాజ్ ముగిసిన తర్వాత పాలస్తీనా (Palestine) జెండాను ప్రదర్శించిన కొందరు యువకుల వీడియో తమ దృష్టికి వచ్చిందని, వారిలో ఎనిమిది మందిని గుర్తించి దేశద్రోహ నేరానికి విచారణ జరపనున్నామని నగర పోలీస్ సూపరింటెండెంట్ వ్యోమ్ బిందాల్ వార్తాసంస్థలకు తెలిపాడు. ఈ యువకులు చేసిన నేరం ఏమిటి? చనిపోయిన వారికి కన్నీరు కార్చడం! గత ముప్పై నెలలుగా గాజా మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు సాగిస్తున్నది. యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం చేసిన తర్వాత కూడా మారణహోమం కొనసాగిస్తున్నది. కళ్ళముందర ఘోరకలి సాగిపోతుంటే ఇంకేమీ చేయలేకపోయినా, ‘మీ దుఃఖం పంచు కుంటున్నాము’ అని పాలస్తీనీయుల పతాకను ప్రదర్శించడం అత్యంత మానవీయమైన, ప్రతీకాత్మక చర్య. సానుభూతి ఈ దేశంలో నేరమైపోయిన పాడు కాలానికి చేరాం. నిజానికి పాలస్తీనా జెండా ప్రదర్శించడం, ఆ మాట కొస్తే స్నేహ సంబంధాలున్న ఏ దేశపు జెండానైనా ప్రదర్శించడం భారత చట్టాల ప్రకారం, ప్రత్యేకించి ‘ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002’ ప్రకారం నేరం కాదు. దేశద్రోహం కాదు. కానీ గత రెండు సంవత్సరాలుగా, ముఖ్యంగా గాజా మారణకాండ ప్రారంభమైనప్పటి నుంచీ పాలస్తీనా బాధితుల పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తూ ముహర్రం ఊరేగింపులోనో, ప్రార్థనల తర్వాతనో పాలస్తీనా పతాకం ప్రదర్శించిన వందల మంది మీద ఉత్తరాది రాష్ట్రాల పోలీసులు కేసులు బనాయిస్తున్నారు. కొందరి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసులు కూడా పెట్టారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఇజ్రాయెల్ జెండా ప్రదర్శిస్తూ ప్రదర్శనలు జరిపినవారి మీద ఎటువంటి కేసులూ లేవు. దేశంగా పాలస్తీనాతో, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలతో, చివరికి సాయుధ పోరాటం చేస్తుండిన పాలస్తీనా విమోచన సంస్థతో, దాని నాయకుడు యాసర్ అరాఫాత్తో భారత ప్రభుత్వానికీ, భారత దేశానికీ ఉండిన సంబంధాల నేపథ్యంలో చూస్తే ఈ కొత్త ‘దేశద్రోహకర నేరం’ ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం బాల్ఫోర్ డిక్లరేషన్ ద్వారా పాలస్తీనాలో యూదులను స్థిరపరచడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుంచీ భారత వలస వ్యతిరేక జాతీయోద్యమ నాయకులందరూ బ్రిటిష్ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ, పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించడం ప్రారంభించారు. 1938లోనే ఒక వ్యాసంలో గాంధీ ‘ఇంగ్లండ్ ఇంగ్లిష్ వాళ్లకూ, ఫ్రాన్స్ ఫ్రెంచి వాళ్లకూ ఎలా చెందుతుందో, అదే విధంగా పాలస్తీనా కూడా అరబ్బులకు చెందుతుంది. అరబ్బుల మీదికి యూదులను రుద్దడం తప్పు, అమానుషం’ అన్నారు. పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్ (Israel) ఏర్పాటు చేయాలనే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి 1947 లోనే భారతదేశం వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇజ్రాయెల్ ఏర్పాటును 1950లో ఆమోదించినప్పటికీ, 1992 దాకా దౌత్య సంబంధాలు నెలకొల్పలేదు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ... ‘పాలస్తీనా పాలస్తీనీయులదే’ అని అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానాలను సమర్థిస్తూ వచ్చింది భారతదేశం. ఇజ్రాయెల్ మీద సాయుధ పోరాటం ప్రారంభించిన పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్ఓ)ను ‘పాలస్తీనా ప్రజల ఏకైక, సాధికార ప్రతినిధి’గా గుర్తించి, 1974లోనే ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. 1980 నాటికి పీఎల్ఓతో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నది. 1988 నవంబర్ స్వాతంత్య్ర ప్రకటనతో ఏర్పాటైన పాలస్తీనాను గుర్తించిన తొలి అరబేతర దేశం భారతదేశమే! గాజాలో 1996లోనే భారత ప్రభుత్వ ప్రతినిధి కార్యాలయం స్థాపించింది. అదే సమయంలో 1990ల నుంచే ఇజ్రాయెల్‌తో కూడా భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధాలు ప్రారంభించింది. దీంతో పాలస్తీనా నాయకులలో వ్యక్తమైన అనుమానాలను కూడా భారత నాయకులు కొట్టివేస్తూ వచ్చారు. పీఎల్ఓ అధ్యక్షుడు యాసర్ అరాఫాత్ 1997 నవంబర్‌లో భారత పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నో వాణిజ్య, పారిశ్రామిక సహకార, సాంస్కృతిక సంబంధాల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి. అప్పుడే అరాఫాత్ హైదరాబాద్‌కు కూడా వచ్చి ఇండో–అరబ్ భవన సముదాయానికి పునాది వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)) నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. ఈ సుహృద్భావాన్నీ, సంఘీభావాన్నీ తోసివేస్తూ, 2014 తర్వాత భారత ప్రభుత్వం అధికారికంగా తన వైఖరి మార్చుకోకుండానే, అనధికారికంగా పాలస్తీనాకు దూరంగా, ఇజ్రాయెల్‌కు దగ్గరగా జరుగుతూ వచ్చింది. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ ప్రధానిగా నరేంద్ర మోదీ 2017 జూలైలో ఇజ్రాయెల్ వెళ్లి బెంజమిన్ నెతన్యాహూను కౌగిలించుకుని సాన్నిహిత్యాన్ని ప్రకటించారు. చదవండి: కఠిన వాస్తవాలను దాచేస్తారా?అక్కడి నుంచి ఆ సంబంధాలు మరింత బలపడుతూ, 2023 అక్టోబర్ 27న, మారణహోమం మొదలైన ఇరవై రోజుల తర్వాత ఇజ్రాయెల్ దాడిని ఆపి, శాంతి ఒప్పందానికి రావాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత ప్రభుత్వం ఓటు వేయకుండా ఉండి పోయింది. మరి, అరవై వేల మరణాలకు కన్నీరు కార్చడం, సానుభూతి ప్రకటించడం దేశద్రోహకర నేరమవుతుందా?ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
హైకోర్టన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే
హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది. సెక్షన్ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఉద్దేశపూర్వకంగా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు కాదా? ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసి చూపేలా ఉన్నాయి. దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తూ ఆ ఇన్స్పెక్టర్కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసు జారీ చేస్తున్నాం. – హైకోర్టు న్యాయమూర్తి సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద అడ్డగోలుగా కేసులు పెడుతున్న పోలీసులపై హైకోర్టు మరోమారు నిప్పులు చెరిగింది. పోలీసుల చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని తేల్చి చెప్పింది. కోర్టులన్నా.. కోర్టులిచ్చిన ఆదేశాలన్నా పోలీసులకు లెక్కేలేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు అధికారాన్ని, న్యాయ పాలనను పోలీసులు సవాలు చేస్తున్నారంది. పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడింది. తమ ఆదేశాలున్నా కూడా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై పోలీసులు అదనపు సెక్షన్ల కింద కేసు పెట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. సెక్షన్ 111ను చాలా అరుదుగానే ఉపయోగించాలని, అవసరమైన సందర్భాల్లో మాత్రమే దానిని ఉపయోగించాలని తాము గతంలో ఓ కేసులో ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పామంది. అయినా కూడా పోలీసులు సెక్షన్ 111 కింద కేసులు పెడుతూనే ఉన్నారంటూ ఆక్షేపించింది. ఇలా ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోసాని కృష్ణ మురళిపై తమ ఆదేశాలకు విరుద్ధంగా అదనపు సెక్షన్లు చేర్చడాన్ని తప్పు పట్టింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారంది. తద్వారా ఆయన పరిధి దాటి వ్యవహరించారని తేల్చింది. మురళీకృష్ణ చర్యలు కోర్టు ధిక్కారమేనని తెలిపింది. ఇందుకు గాను ఎందుకు చర్యలు తీసుకోరాదో స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని మురళీకృష్ణను హైకోర్టు ఆదేశించింది. పోసానిపై సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ నాయుడిని తిట్టారంటూ ఫిర్యాదు టీటీడీ చైర్మన్, టీవీ 5 యజమాని బొల్లినేని రాజగోపాల్ నాయుడుని పోసాని కృష్ణ మురళి దూషించారని, వాటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారంటూ టీవీ 5 ఉద్యోగి బొజ్జా సుధాకర్ గత ఏడాది నవంబర్ 14న సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవే కావడంతో, పోసానికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) నోటీసు ఇచ్చి, వివరణ తీసుకోవాలని సూళ్లూరుపేట పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఈ నెల 7న పోసాని కృష్ణమురళికి సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసుల్లో గతంలో నమోదు చేసిన సెక్షన్నే కాకుండా బీఎన్ఎస్ సెక్షన్ 111తో పాటు పలు ఇతర సెక్షన్లను కూడా జత చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ కొట్టేయాలంటూ పోసాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు.పోలీసుల చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేస్తున్నాయి..ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘సెక్షన్ 111ను దురుద్దేశ పూర్వకంగా, ఎలాపడితే అలా వాడటానికి వీల్లేదని ఇదే హైకోర్టు ఇప్పటికే పప్పుల చలమారెడ్డి కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. సెక్షన్ 111ను ఏ సందర్భాల్లో వాడాలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళిపై గతంలో నమోదు చేసిన కేసులో తాజాగా జారీ చేసిన నోటీసులో అదనపు సెక్షన్లు చేర్చడం, అందులోనూ సెక్షన్ 111ను చేర్చడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇన్స్పెక్టర్ చర్యలు కోర్టు ఆదేశాలను అణగదొక్కే విధంగా ఉన్నాయి. అంతేకాక కోర్టు ఆదేశాలను సైతం ఇన్స్పెక్టర్ అతిక్రమించారు. అతని చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసేలా కూడా ఉన్నాయి. కేసు దర్యాప్తు విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాలకు విరుద్ధంగా పోసానికి జారీ చేసిన నోటీసుల్లో అదనపు సెక్షన్లు చేర్చారు. ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారు. అందువల్ల ఇన్స్పెక్టర్కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసు జారీ చేస్తున్నాం’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు.ఇప్పుడు అదనపు సెక్షన్లు విస్మయకరంపిటిషనర్ తరఫు న్యాయవాది పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో సెక్షన్ 35(3) కింద నోటీసులిచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిందన్నారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా సెక్షన్ 35(3) కింద పోసానికి నోటీసులు జారీ చేశారని, అయితే విస్మయకరంగా ఆ నోటీసుల్లో పలు అదనపు సెక్షన్లను జత చేశారని చెప్పారు. మహిళలను కించ పరిచారంటూ కూడా కేసు పెట్టారన్నారు. టీటీడీ చైర్మన్‌ను దూషించారంటూనే మహిళలకు ఉద్దేశించిన చట్టం కింద కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) సాయిరోహిత్ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఆదేశాల మేరకు పోసానికి సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చామన్నారు. అదనపు సెక్షన్ల నమోదు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. దీనిపై పూర్తి వివరాలు సమరి్పంచేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. -
అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై మరో మెలిక.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. వీలైనంత మంది విదేశీయులను అమెరికా నుంచి పంపించి వేయడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వీసా, పర్మినెంట్ రెసిడెన్సీ(గ్రీన్ కార్డు)లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక, తాజాగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అధికారికంగా సంచలన ప్రకటన చేసింది. సోషల్ మీడియా వేదికగా యూదులకు వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్ చేసినా, పోస్టులు పెట్టినా వారికి వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని లేదా ఇప్పటికే జారీ చేసిన వీసాను రద్దు చేయవచ్చని బాంబు పేల్చింది.అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన కొన్ని గ్రూపులకు మద్దతు ఇస్తున్న వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ క్రమంలో సదరు గ్రూపులకు ఎవరైనా మద్దతు తెలిపినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని తెలిపింది. కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు తేలితే సోషల్ మీడియా కంటెంట్‌ను ప్రతికూలంగా పరిగణిస్తామని హచ్చరికలు జారీ చేసింది. అలాగే, హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటు సానుభూతిపరులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ సంస్థలను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ఇదే సమయంలో ఒక విదేశీయుడు ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలు, ఇతర వ్యతిరేకవీసా, గ్రీన్ కార్డ్ రద్దు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద మద్దతుదారులకు అమెరికాలో చోటు లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లౌగ్లిన్ తెలిపారు. వారు తమ దేశంలోకి రానివ్వాల్సిన, ఇక్కడ ఉండాల్సిన బాధ్యత లేదని స్పష్టం చేశారు. స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డులపై ఈ ప్రభావం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. స్టూడెంట్ వీసాలు (ఎఫ్ -1, జే-1 మొదలైనవి), గ్రీన్ కార్డు దరఖాస్తులు, వర్క్ పర్మిట్లు, వీసా పొడిగింపులతో సహా అన్ని కేసులపై ఇది ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో 300 మందికి పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్వయంగా గత కొన్ని వారాల్లో అంగీకరించిన తర్వాత ఈ విధానం వచ్చింది.#NEW: U.S. Citizenship and Immigration Services (USCIS) will now start screening social media of any migrants for anti-semitism land any antisemitic activity the physical harassment of Jewish individuals will now be grounds for denying immigration benefit requests. This will…— Brooke Taylor (@Brooketaylortv) April 9, 2025ఇదిలా ఉండగా.. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కారు చిదిమేస్తోంది. ఏడాది, రెండేళ్ల కిందటి చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తోంది. తక్షణం దేశం విడిచి వెళ్లాలంటోంది. స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.వీసా రద్దయితే అక్రమంగా ఉంటున్నట్లే..అధిక వేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు అందాయి. సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అధికశాతం కేసులు కొట్టేస్తారు. అయితే కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు. వీసా రద్దయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకి వస్తుంది. అమెరికాలోకి అడుగుపెట్టే సమయంలోనే ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకుంటారు. ఏదైనా కేసులో అరెస్టు అయితే ఆ సమయంలోనూ వేలిముద్రలు తీసుకుంటారు. వాటి ఆధారంగానే వీసా రద్దు చేస్తూ వెంటనే దేశం వీడాలని తాఖీదులు జారీ చేశారు. దీనికి ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కావు. చదువుకోవడానికి, ఓపీటీపై పనిచేయడానికి, హెచ్1బీపై ఉద్యోగం చేయడానికి.. అంటే గడువు వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్ రద్దు చేసి బయటకు వెళ్లిపోవాలంటూ మెయిల్స్ పంపిస్తున్నారు. -
జీవితాలే బెట్.. మాఫియా క్రికెట్
ఫోర్ కొడితే చప్పట్లు.. సిక్స్ కొడితే కేకలు.. వికెట్ పడితే అరుపులు.. గెలుపు ఓటములపై ఉత్కంఠ..! ఇవీ సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లో ఆస్వాదించే అంశాలు.. అయితే, ఇదంతా తెర ముందు దృశ్యం..! మరి తెరవెనుకో..? టాస్కు ముందు.. పరుగు తీస్తే.. ఫోర్ కొడితే.. సిక్స్ బాదితే.. మ్యాచ్‌లో ఉత్కంఠ పెరుగుతున్న కొద్దీ బెట్టింగ్..! బెట్టింగ్..! అంతగా ఈ మాఫియా వికటాట్టహాసం చేస్తోంది. చివరికి ఏ టీమ్ మ్యాచ్ గెలిచినా ఓడేది మాత్రం కచి్చతంగా పందెం కాసినవారే. అది ఎంతగా అంటే..? బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి.. అప్పులు అమాంతంగా పెరిగి ఆస్తులు పోతున్నాయి. కొన్నిసార్లు ఒక్క మ్యాచ్ తోనే జీవితం తలకిందులైపోతోంది. సాక్షి, అమరావతి: వేసవి వచ్చిందంటే ఐపీఎల్ (IPL) సందడితో పాటు.. దేశంలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఇన్నింగ్స్ కూడా మొదలవుతోంది. ఆట పట్ల సగటు భారతీయుడి వ్యామోహమే పెట్టుబడిగా ఊబిలోకి లాగుతోంది. చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి దిగజారుస్తోంది. డిజిటల్ ఇండియా ఫౌండేషన్ తాజా నివేదిక ప్రకారం ఒక్క ఐపీఎల్ సీజన్లోనే దేశంలో వంద బిలియన్ డాలర్ల (రూ.8,500 కోట్లు పైగా) బెట్టింగ్ దందా సాగుతోంది. గత 17 సీజన్లను విశ్లేషించి ఈ సంస్థ నివేదిక రూపొందించింది. ఏటా బెట్టింగ్ దందా 30 శాతం చొప్పున పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుత 18వ సీజన్లో బెట్టింగ్ అత్యంత గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేసింది. రూ.10 వేల కోట్ల మార్కు దాటడం ఖాయమని స్పష్టం చేసింది. ఏటా ఐపీఎల్ సీజన్లో 34 కోట్లమంది బెట్టింగ్‌లో పాల్గొంటున్నారని ఇండియా ఛేంజ్ ఫోరం అనే సంస్థ పేర్కొంది. ప్రధాన బెట్టింగ్ యాప్‌ల డేటాను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చింది.ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్లుదేశంలో వ్యవస్థీకృతమైన మాఫియా పకడ్బందీగా బెట్టింగ్ దందా సాగిస్తోంది. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లు, ఆన్లైన్ ద్వారా పల్లెలకు కూడా ఈ రాకెట్ విస్తరించింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ లేని ఉత్సుకతను పెంచేలా దందాను నడుపుతోంది. టాస్‌తో మొదలుపెట్టి.. బంతి బంతికి బెట్టింగ్ నిర్వహిస్తోంది. ఒక్కో పందెం రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఉంటోంది. కొన్నేళ్ల క్రితం క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు, లాడ్జిలలో ముందుగా డబ్బులు పెట్టి బెట్టింగ్ కాసేవారు. డిజిటల్ చెల్లింపుల యుగంలో బెట్టింగ్ దందా మరింత సులభతరమైంది.అత్యాధునిక టెక్నాలజీ..బెట్టింగ్ మాఫియా 5జీ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతూ యాప్‌లను పకడ్బందీగా నిర్వహిస్తున్నాయి. స్పోర్ట్స్ రాడార్, బెట్ 365 వంటివి మ్యాచ్‌ల రియల్ టైమ్ డేటా ఫీడ్‌ను సెకనులో వెయ్యో వంతు (మిల్లీ సెకన్) సమయంలో అప్డేట్ చేస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ టూల్స్‌తో బెట్టింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. తద్వారా ప్రతి బాల్‌కు దేశవ్యాప్తంగా అత్యంత వేగంతో భారీగా బెట్టింగులు కాసేలా చేస్తున్నారు.పుట్టుగొడుగుల్లా యాప్‌లు.. సోషల్ మీడియాతో వలదందా టర్నోవర్‌కు తగ్గట్టే దేశంలో బెట్టింగ్ యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియా (Social Media) విస్తృతి పెరిగాక బెట్టింగ్ మాఫియా దందాకు అడ్డే లేదు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్‌లలో బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు ముంచెత్తుతున్నాయి. మెగాపరి, మోస్ట్బెల్, పరిసేస, పర్ మ్యాచ్, బీసీ డాట్‌గేమ్, 22 బెట్స్, 10సీ సీఆర్ఐసీ, మెల్‌బెట్, మేట్‌బెట్, 1 ఎక్స్‌బెట్, రాజా బెట్స్, స్టేక్ డాట్‌కామ్, డఫ్పా బెట్ ఇలా ఎన్నో యాప్‌ల ప్రకటనలు వరదలా వచ్చి పడుతున్నాయి. కొన్నయితే ఇన్ఫ్లుయెన్సర్లతో వల విసరుతున్నాయి. రూ.100 పెడితే రూ.వేయి ఇస్తాం అంటూ.. కొత్త కస్టమర్లకు రూ.100 నుంచి రూ.500 వరకు డిస్కౌంట్లు ఇస్తూ ఊబిలోకి గుంజుతున్నాయి. ఐపీఎల్ సీజన్లో దాదాపు 75 యాప్‌లు బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు డిజిటల్ ఇండియా ఫౌండేషన్ వెల్లడించింది.కమీషనే రూ.వెయ్యి కోట్లుభారీగా డబ్బు రొటేషన్ అవుతుంది తప్ప.. ఐపీఎల్ బెట్టింగ్‌ల ద్వారా సామాన్యులు డబ్బు సంపాదించిన దాఖలాలు లేవన్నది నిజం. నిర్వాహకులు మాత్రం పందెం మొత్తంపై కనీసం 10 శాతం నుంచి 25 శాతం వరకు కమీషన్ దండుకుంంటున్నారు. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ దందా టర్నోవర్ రూ.10 వేల కోట్లు అనుకుంటే యాప్‌ల నిర్వాహకులు కమీషన్ల రూపంలోనే రూ.వెయ్యి కోట్లు వెనకేస్తున్నారు.అంతా మనోళ్లే.. చూసీ చూడనట్లు పొండిప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్ మాఫియా చెలరేగుతోంది. ఎంపిక చేసిన హోటళ్లు, లాడ్జీలు, అపార్టుమెంట్ల కేంద్రంగా చేసుకుని దందా సాగిస్తోంది. టీడీపీ కూటమిలోని కీలక నేతల ప్రధాన అనుచరులే జిల్లాల్లో బెట్టింగ్ దందాకు సూత్రధారులు. ⇒ గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేల కార్యాలయాలు బెట్టింగ్ మాఫియాకు అనుకూలంగా పోలీసులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం.⇒ విజయవాడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ టీడీపీ నేత పోలీసులకు ఫోన్ చేసి ‘అదంతా మనవాళ్లదే’ అని చెప్పడంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. ⇒ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కూటమి ప్రజాప్రతినిధి సోదరుడే బెట్టింగ్ మాఫియాకు కింగ్ పిన్.⇒ ఏలూరు జిల్లాలో కోడి పందేల నిర్వాహకుడిగా గుర్తింపు పొందిన టీడీపీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి వర్గం ప్రస్తుతం బెట్టింగ్ దందాను సాగిస్తోంది.⇒ వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత వివాదాస్పదుడైన కూటమి ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు బెంగళూరులోని బెట్టింగ్ రాకెట్‌తో మిలాఖత్ అయి.. జిల్లాలో దందా నడుపుతున్నారు. ఈ సీజన్లో రాష్ట్రంలో రూ.500 కోట్ల దందా వీరి లక్ష్యం కావడం గమనార్హం.పందెంరాయుళ్లు కాదు.. బాధితులేక్రికెట్ బెట్టింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారుల నుంచి మెకానిక్‌లు, హోటళ్లలో పనిచేసే యువకులు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు చివరకు కనీస సంపాదన లేని విద్యార్థులు కూడా బాధితులే. చేతిలోని డబ్బే కాదు.. అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని మరీ బజారున పడుతున్నారు. బెట్టింగ్ కోసం కాల్ మనీ రాకెట్ నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి, తీర్చలేక తీవ్ర అవమానం, ఇబ్బందులు పడుతున్నవారూ భారీగా ఉన్నారు.n మార్చి నెలలో శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో అన్నదమ్ములు సూర్యనారాయణ, ఉమామహేశ్ రూ.45 లక్షలు కోల్పోయారు. అప్పులు తీర్చలేమని గ్రహించి వేర్వేరుగా ఆత్మహత్యకు యత్నించారు. సూర్యనారాయణ చనిపోగా అపస్మాకర స్థితిలో ఉన్న ఉమామహేశ్‌ను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.n హైదరాబాద్‌లో బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.n బిహార్‌లో వ్యాపారి బెట్టింగ్‌లో రూ.2 కోట్ల విలువైన విల్లాను కోల్పోయాడు.n కర్ణాటకలో ఓ వ్యక్తి రూ.కోటి నష్టపోగా.. అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుంది.n తమిళనాడు కోయంబత్తూరులో రూ.90 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి జీవితాన్నే బలి తీసుకున్నాడు.బలహీన చట్టాలతో చెలరేగుతున్న మాఫియాదేశంలో జూదం, ఆన్లైన్ బెట్టింగ్‌లో అధికారికంగా, అనధికారికంగా బరి తెగిస్తున్న మాఫియాను కట్టడి చేసేందుకు సరైన చట్టాలు లేవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్‌ను నిషేధించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల నుంచి నిర్వహణ సాగిస్తున్న మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే కేంద్రమే ఏకీకృత చట్టం చేయాల్సిన అవసరం ఉంది.జూదానికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో ఉన్న చట్టాలు.. వాటి లోపాలు..జూద కార్యకలాపాల నిరోధక చట్టం–1867: బ్రిటీష్ కాలంలో చేసిన ఈ చట్టం జూద గృహాలను నిషేధిస్తోంది. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా చట్టాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. దాంతో దేశవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యం కావడం లేదు. ఆన్లైన్ జూదాలు, ఇతర అంశాలు కూడా ఈ చట్టం పరిధిలోకి రావు.రాష్ట్రాల ప్రత్యేక చట్టాలు: సిక్కిం, గోవా, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు కొన్ని జూదానికి అనుమతిస్తూ ప్రత్యేక చట్టాలు చేశాయి. ఈ రాష్ట్రాల్లో లైసెన్సు తీసుకుని దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. దీంతో కట్టడి చేసేందుకు సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి.ఐటీ చట్టం 2000: సైబర్ నేరాలను నిరోధించేందుకు ఉద్దేశించినది. దీంతో ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను నిరోధించడం సాధ్యమా కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైబర్ నేరాల పరిధిలోకి వస్తాయా రావా అని స్పష్టత లేకపోవడమే అందుకు కారణం.బెట్టింగా..!? స్కిల్ గేమా...!?ఆన్లైన్ బెట్టింగ్ అన్నది జూదమా కాదా అన్న అంశంపై దేశంలో ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. ‘గేమ్ ఆఫ్ స్కిల్’ అన్నది ఒక క్రీడగా భావించాలి తప్ప జూదంగా కాదని ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు వాదిస్తున్నారు. ఆ మేరకు ‘గేమ్ ఆఫ్ స్కిల్’గా పేకాట క్లబ్బులకు అనుమతిస్తూ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ స్కిల్ గేమ్ అని వాదిస్తూ తమపై నిషేధం చెల్లదని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఆన్లైన్ బెట్టింగ్‌ను నిరోధించే అంశం న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. కఠిన చట్టమే పరిష్కార మార్గం...ఆన్లైన్ బెట్టింగ్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణం సమగ్ర చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ‘బెట్టింగ్– గ్యాంబ్లింగ్ రెగ్యులేషన్ బిల్లు’ పెండింగులో ఉంది. దీనిపై మరింత న్యాయ సలహాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వచనం, బిల్లులోని అంశాల పరిధి, న్యాయ సమీక్షకు నిలవడంపై మరింత లోతుగా సమాలోచనలు జరపాలని చూస్తోంది. పకడ్బందీ చట్టంతోనే బెట్టింగ్ మాఫియాకు అడ్డుకట్ట సాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
పెళ్లి సంబంధాలు : శాలరీ స్లిప్ అడగాలా వద్దా? అడిగితే తప్పేంటి?
‘వేయి అబద్దాలు చెప్పి ఒక పెళ్లి చెయ్యమన్నారు’ అనేది సామెత. ఈ సామెత ఎలా పాపులర్ అయిందనేది పక్కన బెడితే, ఈ మధ్య కాలంల పెళ్లిళ్లలో మోసాలు ఆందోళన కరంగా మారింది. అధిక కట్నం కోసం ఫేక్ సర్టిఫికెట్లతో వధువు, వారి కుటుంబాన్ని మెప్పించేందుకు నానా తంటాలు పండతారు. తీరా అసలు విషయం తెలిశాక గొడవలు, విడాకులు తెలిసిన సంగతే.. ఈనేపథ్యంలోనే ఒక స్టోరీ నెట్టింట్ తెగ సందడి చేస్తోంది.వివాహ సంబంధాల్లో మోసాలు, విడాకులు కేసులు, నేరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు పెళ్లి సంబంధాలు చూడటం, పెళ్ళిళ్లు చేయడం పెద్ద సవాల్‌గా మారింది. తన మనసుకు నచ్చిన భాగస్వామిని తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. అందులోనూ మాట్రిమమోనియల్ వెబ్సైట్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న తరుణంలో అప్రమత్తత చాలా అవసరం.కొందరు తమ సంబంధాల గురించి అబద్ధం చెబుతుండగా, మరికొందరు తమ విద్యార్హతలు, వృత్తి, ఆరోగ్యం, ఆర్థిక స్థితి గురించి అబద్ధం చెబుతారు. దీంతో ఆ జంట, వారి కుటుంబాల మధ్య సమస్యలకు దారితీస్తుంది. దీనిమీదే ఎక్స్(ట్విటర్)లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాలరీ స్లిప్పులు అడగడం, అవునో కాదో ధృవీకరించు కోవాలా వద్దా? అనే ప్రశ్నపై చర్చ మొదలైంది. ప్రొఫైల్స్ వెరిఫికేషన్ పై నెటిజన్లు వివిధ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ పోస్ట్ పై నెటిజనుల స్పందనప్రపంచంలో పుష్కలంగా మంచితనం ఉందని నమ్మినా, వివాహం లాంటి కీలక అడుగు వేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలపై స్పస్టత తెచ్చుకోవాలి. "జాతకానికి బదులుగా ITRని చెక్ చేయడం మంచిది. సీరియస్‌గా చెప్పాలంటే, ఇద్దరి మధ్యా ప్రముఖ ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్య పరీక్ష నివేదిక , ITR తనిఖీ కనీసం జరగాలని ఒకరన్నారు. మరొకరు ఇలా రాశారు, "అవును, కొంతమంది పురుషులు జీతం గురించి అబద్ధం చెబుతారు. డిఫాల్టర్ కాకపోతే, స్థానిక పోలీస్ స్టేషన్ నుండి క్యారెక్టర్ సర్టిఫికేట్ అడగాలి, అతి ముఖ్యమైనది మెడికల్ సర్టిఫికేట్! అన్నాడు. మరొకాయన తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. తెలుసుకోవాలి. ఎందుకంటే బాగా సంపాదిస్తున్నామని చెప్పి లెక్కలేనన్ని పెళ్లి కొడుకు కుటుంబాలు, అమ్మాయిల కుటుంబాలను మోసం చేశాయి. అదృష్టవశాత్తూ, ఇప్పుడు సాలరీ స్లిప్‌లు ఉన్నాయి. పాత కాలంలో, ఇలాంటివేమీ లేవు కదా. అప్పట్లో లెక్చరర్‌గా ఉన్న నా సొంత మౌసి (ఇప్పుడు మరణించింది), తాను పోలీసు అధికారినని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తీరా అతను మామూలు సేవకుడు, పైగా అతనికి అప్పటికే పెళ్లి అయింది. ఒక బిడ్డకూడా ఉన్నాడు. అంతే ఈ విషయం తెలిసి ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేసింది. మళ్లీ అతని గుమ్మం తొక్క లేదు. తన జీవితాన్ని విద్యకు అంకితం చేసింది, 2 పీహెచ్‌డీలు చేసింది, బోధనా వృత్తిలో ఉంది. మనస్తత్వశాస్త్ర పుస్తకాలు రాసింది అని చెప్పాడు.ఒక యూజర్ ఇలా వ్రాశాడు, "నా స్నేహితుల్లో ఒకరు నియామక ప్రొఫైల్ ఉద్యోగంలో పని చేశారు.. ఆమె కొన్నిసార్లు మ్యాట్రిమోనియల్ సైట్లలో పేర్కొన్న ప్యాకేజీలను క్రాస్ చెక్ చేసేది. దాదాపు అన్నీ కల్పిత సమాచారంతో నిండిఉన్నాయనీ, ప్యాకేజీలు చాలావరకు అబద్ధం మని గుర్తించింది. "వెరిఫైడ్ జీతం స్లిప్పులు అడిగితే అబ్బాయి పారిపోవాలి" అని ఒక యూజర్ అన్నారు. ఆ మాత్రం నమ్మకంలేకపోతే ఎలా?మరో కామెంట్ ఏంటంటే.. నన్ను ఒకమ్మాయి ఇలానే అడిగింది. పంపాను కానీ పెద్దలు కుదిర్చిన వివాహానికి నో చెప్పాను. నేను, నా జీతం మీద కూడా వాళ్లకి నమ్మకం లేకపోతే, భవిష్యత్తులో ఇక దేన్ని నమ్ముతారు?"దీనిపై మీరేమనుకుంటున్నారు. కామెంట్ల రూపంలో తెలియజేయండి. -
ఏకంగా పోలీసు వాహనంతోనే రీల్!
సోషల్ మీడియాలో రీల్స్ మోజులో విచక్షణ మర్చిపోతున్నారు. కంటెంట్ కోసం, వ్యూస్ కోసం వాళ్లు సృష్టించా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఒక పిచ్చి పనికి లక్షల కొద్దీ వ్యూస్ రావడంతో ఇక అందరూ అదే బాటపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ ఈ రీల్స్ పురాణం చాలా పెద్దదే. తాజాగా నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు యువకులు పోస్ట్ చేసిన రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్‌తోనే రీల్స్ చేశారా యువకులు. ఇద్దరు యువకులు పోలీసు వాహనం నడుపుతూ.. రీల్స్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వివాదా స్పద మయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఈగలపెంటలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాలోని ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇన్నోవా టీఎస్ 09 పీఏ 4622 వాహనాన్ని మంగళవారం ఇద్దరు యువకులు నడుపుతూ రీల్స్ చేశారు. ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ అధికారి బంధువులే.. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన రీల్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. -
ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట లభించింది. తాము చెప్పేవరకు కేసు విచారణ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. హత్య సినిమాలో క్లిప్పింగ్‌లు షేర్ చేశాడని సోషల్ మీడియా కార్యకర్త పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు పవన్‌ను పులివెందుల పోలీసులు విచారించారుపవన్తో పాటు హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితపైనా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పైనా కేసు నమోదు చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న సినిమా క్లిప్పింగ్ షేర్ చేయడం తప్పు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడంతో.. విచారణను నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
టీఎంసీలో అంతర్గత విభేదాలు.. ఆగని అమిత్ మాలవీయ వరుస పోస్టులు
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత పోరును బీజేపీ రచ్చకెక్కించింది. టీఎంసీ నేతల మధ్య గొడవలకు సంబంధించిన వీడియోలు, వాట్సప్ చాట్లను కమలం పార్టీ బయటపెట్టింది. సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మరో ఎంపీ మధ్య గొడవ జరిగిందని.. అదీ ఎన్నికల సంఘం కేంద్రకార్యాలయం వద్దేనంటూ బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాలవీయ వాటిని షేర్ చేశారు. ఈ క్రమంలో ఇంకా వరుస వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు.మాలవీయ చేసిన పోస్టుల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రతినిధుల బృందం ఒక ప్రజెంటేషన్‌ను సమర్పించడానికి ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లింది. ఆ టైంలో.. ఈసీ ఆఫీస్‌కు వెళ్లడానికి ముందు వినతిపత్రంపై సంతకాలు చేసేందుకు ఒకసారి సమావేశం కావాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. కానీ సదరు ఎంపీ ఆ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. నేరుగా ఈసీ వద్దకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే.. ఇద్దరు ఎంపీల మధ్య గొడవకు దారితీసి పోలీసుల జోక్యం దాకా వెళ్లింది. అమిత్ మాలవీయా షేర్ చేసిన వీడియోలో కల్యాణ్ బెనర్జీ మరో ఎంపీపై ‘‘ఇదంతా పబ్లిక్ ప్లేస్. కాస్త సంయమనం పాటించండి’’ అని ఊగిపోతూ కనిపించినట్లు ఉంది. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రిన్ మధ్యలో వచ్చి‘‘మీడియాలో ప్రసారమవుతుంది. వద్దు..’’ సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. కొసమెరుపు ఏంటంటే.. ఈ వ్యవహారం తర్వాత పార్లమెంట్ సభ్యులు బెనర్జీ, కీర్తి ఆజాద్ చాటింగ్ చేసుకుంటే.. ఏఐటీసీ ఎంపీ 2024 పేరిట ఉన్న గ్రూపులోని ఆ సంభాషణను కూడా మాలవీయ బయటపెట్టారు. ఆ సంభాషణ ధాటి తట్టుకోలేక సదరు మహిళా ఎంపీ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినట్లు ఆ షేరింగ్‌లో ఉంది. Soon after the public spat between two TMC MPs in the precincts of the Election Commission of India on 4th April 2025, the irate MP continued slandering the ‘Versatile International Lady (VIL)’…This is the stuff legends are made of! pic.twitter.com/dsubQrmQUj— Amit Malviya (@amitmalviya) April 8, 2025ఇక ఈ వ్యవహారంపై టీఎంసీ నేత సౌగతారాయ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ అంతర్గత గోప్యతను కాపాడుకోవాలంటూ టీఎంసీ నేతలకు హితవు పలికారు. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆ మహిళా ఎంపీ కన్నీళ్లు పెట్టుకోవడం చూశాను. కల్యాణ్ ప్రవర్తనపై పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది అని రాయ్ అన్నారు. అయితే అమిత్ మాలవీయా ఇక్కడితోనే ఆగలేదు. సౌగతారాయ్ను తీవ్రంగా విమర్శించిన కళ్యాణ్ బెనర్జీ వీడియోను సైతం షేర్ చేశారు.A defiant Kalyana Banerjee, one of the TMC MP, who had a bitter altercation with someone he described as ‘versatile international lady’… pic.twitter.com/JSieKoVynw— Amit Malviya (@amitmalviya) April 8, 2025 TMC MP Kalyan Banerjee won’t stop at anything. He hits back at his senior colleague Saugata Roy after Roy claimed that Banerjee is damaging TMC’s public image. In a sharp retort, Kalyan calls Roy a man with ‘no character,’ labelling him a ‘chor’ in reference to the Narada case.… pic.twitter.com/5LrNexOLGL— Amit Malviya (@amitmalviya) April 8, 2025 మరోవైపు.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గోప్యంగా ఈ విషయాన్ని ఉంచాలని మొదటి నుంచి భావించారట. అయితే ఈలోపే బీజేపీ నేత అమిత్ మాలవీయ పోస్టులతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చేసింది. ఈ విషయాన్ని బెంగాలీ న్యూస్ ఛానెల్స్ ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. -
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.వివరాల ప్రకారం... బెంగళూరులోని బీటీఎం లేఅవుట్లో గురువారం తెల్లవారుజామున ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు నడుస్తున్న వీధి నిర్మానుష్యంగా ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి వారి వద్దకు వచ్చాడు. వారిలో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో, మరో మహిళ.. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అనంతరం, సదరు ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బాధితురాలు ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా తామే స్వయంగా చర్య తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.A shocking case of sexual harassment on the street has emerged from the #BTMLayout in #Suddaguntepalya area of #Bengaluru, where a youth allegedly touched the private parts of a woman walking on the street on April 4.The accused reportedly approached her from behind and behaved… pic.twitter.com/PqzDc9sMg8— Hate Detector 🔍 (@HateDetectors) April 6, 2025ఇదిలా ఉండగా.. బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల సాధారణంగా మారాయి. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో ఓ యువతి వేధింపులకు గురైంది. ఆమె బుక్ చేసుకున్న క్యాబ్లోకి బలవంతంగా ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను వేధించారని ఆరోపించారు. కమ్మనహళ్లి నివాసి అయిన ఆ మహిళ ఏదో విధంగా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 27న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ మహిళ తన స్నేహితుడిని తీసుకెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ మహిళ భయంతో క్యాబ్ నుంచి దిగాలని నిర్ణయించుకున్నప్పుడు నిందితుల్లో ఒకరు ఆమెను వెంబడించాడు. మరొకరు ఆమె బట్టలు చింపడానికి ప్రయత్నించారు. ఆ మహిళ సహాయం కోసం కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. -
ఏడు పదాల్లోనే రాజీనామా చేసిన ఉద్యోగి - ఫోటో వైరల్
సాధారణంగా ఒక ఉద్యోగి రాజీనామా చేస్తున్నాడంటే.. ఒక వివరణతో కూడిన సమాచారం ఉంటుంది. కానీ ఒక ఉద్యోగి కేవలం ఏడు పదాల్లోనే రాజీనామా చేస్తున్నా అంటూ వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. 'ఛారిటీ అకౌంటింగ్ నాది కాదు, నేను క్విట్ అవుతున్నాను' అని ఒక కాగితంపై చేతితో రాసిన రాత ఏడు పదాలతో ఉండటం గమనించవచ్చు. దీనిని మా కొత్త ఉద్యోగి.. అతని డెస్క్ మీద కనుగొన్నాడు, అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.ఈ రెడ్డిట్ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు అందులో నిజాయితీ ఉందని చెబితే.. మరికొందరు ఎవరో మొరటుగా లేదా ఆకస్మికంగా రాసినట్లు ఉందని అన్నారు. నిజానికి ఇలాంటి రాజీనామా లేఖలు చాలా అరుదుగా వెలుగులోకి వస్తుంటాయనే చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఉద్యోగులు అసహనానికి గురైతే.. ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.ఇదీ చదవండి: అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్ఆర్ -
జనాలే లేని ద్వీపంపై పన్నులా? ట్రంప్ సుంకాలపై పెంగ్విన్స్ సెటైర్లు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు 1800 దేశాలను టార్గెట్ చేస్తూ పరస్పరం (రెసిప్రోకల్ టారిఫ్స్) పన్నులు విధించడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అనేక దేశాధినేతలు తమ స్పందన వెల్లడించారు కూడా. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యబాణాలు వెల్లువెత్తాయి కూడా. మరీ ముఖ్యంగా అయితే జనావాసాలు లేని ఒక ద్వీపంపై ట్రంప్ సుంకాలు విధించిన తీరు మరింత విస్మయ పర్చింది. దీనిపై పెంగ్విన్ మీమ్స్(penguin memes) ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.సబ్ అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ దీవుల (Heard and McDonald Islands) పై ఎందుకు పన్నులు విధించారు అనేదే పెద్ద ప్రశ్న. మానవ జనాభా లేని బంజరు సబ్-అంటార్కిటిక్ ఆస్ట్రేలియన్ ప్రాంతమైన హర్డ్ , మెక్‌డొనాల్డ్ దీవుల నుండి వచ్చే అన్ని ఎగుమతులపై ట్రంప్ 10శాతం సుంకాలను విధించారు. అయితే ఈ దీవులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి.. వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారి వివరణ ఇచ్చారు.వాస్తవానికి ఈ దీవుల్లో మనుషులు నివసించరు. దాదాపు 80 శాతం మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. దీవులు యాక్టివ్ అగ్నిపర్వతాలు, వివిధ సముద్ర జంతువులకు నిలయంగా ఉండటంతో అక్కడ ప్రజలు నివసించటం లేదు. దాదాపు దశాబ్ధకాలం నుంచి ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ సందర్శించలేదని తెలుస్తోంది. ఈ ప్రాంతం పెంగ్విన్లు, సీల్స్కు ఆవాస ప్రాంతంగా ఉంది. The penguin wore a suit. But didn’t escape the Trump tarifs on the Heard og McDonald Islands. Maybe it didn’t say thank you? pic.twitter.com/aaPr1ufCr0— Christopher Arzrouni (@CArzrouni) April 3, 2025 ఓవల్ ఆఫీసులో ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్థానంలో పెంగ్విన్‌ను అమెరికా అధ్యక్షుడు ,ఉపాధ్యక్షుడు వాన్స్‌తో ఇటీవల జరిగిన వివాదాస్పద సమావేశానికి ఉటింకిస్తూ ఒక మీమ్ ఉంది. జెలెన్స్కీ ప్లేస్‌లో పెంగ్విన్‌ను ఉంచారు. మరొక మీమ్ యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో స్థానంలో చక్రవర్తి పెంగ్విన్‌ను చూస్తున్నట్లు ఉంది. "పెంగ్విన్లు సంవత్సరాలుగా మనల్ని చీల్చి చెండాడుతున్నాయి" అని మొదిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాజీ కమ్యూనికేషన్స్ చీఫ్‌గా 11 రోజులు పనిచేసిన ఆంథోనీ స్కారాముచ్చి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చమత్కరించారు. ఈ సుంకాల జాబితాలో రష్యా లేదనే వాస్తవాన్ని ప్రస్తావిస్తూ. "ట్రంప్ పుతిన్‌పై కాదు పెంగ్విన్లపై సుంకాలను విధించారు" అంటూ అమెరికా సెనేట్ డెమోక్రటిక్ నాయకుడు చక్ షుమర్ పోస్ట్ చేశారు,Outstanding memes capturing the absurdity of Trump’s tariff on penguin inhabited Heard & McDonald Islands #owngoal #PowerToThePenguins pic.twitter.com/AETymaLFdC— Eddie Lloyd (@worldzonfire) April 4, 2025 ; చదవండి: ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!మరోవైపు ట్రంప్ సుంకాల దెబ్బతో అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 2020లో కోవిడ్ మహమ్మారి తర్వాత మళ్లీ ఇపుడు స్టాక్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి. -
మా చేతుల్లో ఏం లేదు.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో చిన్నారులు సోషల్ మీడియా(Social Media) వాడకుండా నిషేధించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ నిర్ణయం తమ చేతుల్లో లేదన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికార యంత్రాగాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.సోషల్ మీడియా వాడకం వల్ల చిన్నారులపై శారీరకంగా, మానసికంగా, ప్రభావం పడుతోందని, కాబట్టి 13 ఏళ్లలోపు పిల్లలు వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని ఓ పిల్(PIL) దాఖలైంది. అంతేకాదు 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని జెప్ ఫౌండేషన్ ఈ పిల్లో కోరింది. దీనిని పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. అది తమ పరిధిలోని అంశం కాదని, విధానపరమైన నిర్ణయమని చెబుతూ పిల్‌ను తిరస్కరించింది.పిల్లో ఏముందంటే.. 13 ఏళ్లలోపు వయసున్నవాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడకూడదంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నామమాత్రంగా నిబంధనను పెట్టాయి. కేవలం యూజర్లు రిపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అలాంటి అకౌంట్ల వివరాలు బయటకు వస్తున్నాయి. ఇదీ ఆందోళన కలిగించే అంశమే.మైనర్ల సోషల్ మీడియా అకౌంట్లకు కూడా అనియంత్రిత యాక్సెస్unrestricted access ఉంటోంది. దీని మూలంగా వాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.మైనర్లు సోషల్ మీడియా వాడకుండా నియంత్రించని ఈ వ్యవహారం.. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి, కఠిన జరిమానాలు, ఇతర చర్యల ద్వారా పిల్లల చేతికి సోషల్ మీడియా వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.భారత్‌లో యువత సగటున ప్రతీరోజు ఐదు గంటలపాటు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఈ సమయం గణనీయంగా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగించే అంశం. అందుకు తగ్గట్లే దేశంలో సైబర్ నేరాలు.. మైనర్లకు సైబర్ వేధింపులు పెరిగిపోతున్నాయి.ఉదాహరణకు.. మహారాష్ట్రలో 9-17 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం ఆరు గంటలకు పైగా సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో గడుపుతున్నారు. ఇది వాళ్ల చదువులపై, జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో పలు రాష్ట్రాలు మైనర్లు సోషల్ మీడియా ఉపయోగించకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.భారతదేశ జనాభాలో దాదాపు 30% మంది 4-18 సంవత్సరాల వయస్సు మధ్యే ఉంది. కాబట్టి 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై చట్టబద్ధమైన నిషేధాన్ని అమలు చేయడం అత్యవసరం.అయితే పైన పేర్కొన్న దేశాలు మైనర్లకు సోషల్ మీడియా కట్టడిని కేవలం ప్రత్యేక చట్టాల ద్వారా మాత్రమే చేయగలిగాయి. ఏ సందర్భంలోనూ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదు. కాబట్టి భారత్‌లోనూ చట్ట ప్రక్రియ ద్వారా మాత్రమే కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుందనేది నిపుణుల మాట. -
పెళ్లి రోజే భార్య కళ్ల ముందు కుప్పకూలి..
ఆ జంట విజయవంతంగా పాతికేళ్లు వివాహ బంధం పూర్తి చేసుకుంది. కుటుంబ సభ్యుల సూచన మేరకు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. బంధువులు, అతిథులంతా ఆ సంబురంలో భాగం అయ్యారు. కొందరు అమ్మాయిలు ఆ జంటతో వేదిక మీద డ్యాన్సులు వేయించారు. అయితే అంతలోనే అనుకోని విషాదం ఆ వేదికను ఆవిరించింది. అచేతనంగా పడి ఉన్న భర్తను చూసి ఆ భార్య గుండెలు అవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. లక్నో: వసీం సర్వత్(Wasim sarwat) ఉత్తర ప్రదేశ్ బరేలీ(Bareilly)లో షూ వ్యాపారి. 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. హ్యాపీగా స్టేజ్‌పై తన భార్య ఫరాతో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే, ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా లాభం లేకపోయింది. అప్పటికే ఆయన గుండెపోటు(Heart Attack)తో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లెదుటే భర్త మరణంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వసీం స్టేజ్‌పై కుప్పకూలి పడిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.🚨2 April 25 : Shoe merchant Wasim died of a #heartattack2025 while dancing with his wife on his 25th wedding anniversary in Bareilly district of Uttar Pradesh.#LuciferShotWorking #ChipShot pic.twitter.com/OrHYonE2NP— Anand Panna (@AnandPanna1) April 3, 2025హఠాన్మరణాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా.. హుషారుగా కనిపించవాళ్లు ఉన్నట్లుండి కుప్పకూలి ప్రాణం విడుస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని నిపుణులు సూచిస్తుండగా.. ఇలాంటి అత్యవసర సందర్భాల్లో సీపీఆర్లాంటి వాటిపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.నోట్: పై వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు. కేవలం వార్తను అథెంటిక్‌గా అందించే ఉద్దేశంలో భాగంగానే వీడియోను అందిస్తున్నాం. -
పొట్టి గౌనులో సుప్రీత హోయలు.. బ్లూ శారీలో అనసూయ అందాలు!
పొట్టి గౌనులో సురేఖవాణి కూతురు సుప్రీత హోయలు..కామాఖ్య ఆలయంలో సంయుక్త మీనన్ పూజలు..ఫ్యాషన్ షోలో మెరిసిన అత్తారింటికి దారేది హీరోయిన్..బ్లూ శారీలో అనసూయ బ్యూటీఫుల్ లుక్స్..రాబిన్‌హుడ్ హీరోయిన్ శ్రీలీల క్యూట్ పిక్స్.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ గురించి బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. సైఫ్ వారసురాలిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో స్కై ఫోర్స్‌తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారా అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఉద్దేశించి మాట్లాడింది. తన నటనపై సోషల్ మీడియాలో తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అవీ నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ నుంచి బయటపడేందుకు ధ్యానం చేస్తానని తెలిపింది.సారా అలీ ఖాన్ మాట్లాడుతూ.. "నేను సాధ్యమైనంత వరకు వాటిని ఫిల్టర్ చేయడం ప్రారంభించా. ఈ విషయంలో నాకు సహాయపడేది ధ్యానం. ఇలా చేయడం వల్ల నాకు నిజమేంటో తెలుస్తుంది. నేను నా స్వంత ఆలోచనలతో చూడటం ప్రారంభించా. ప్రతి ఆలోచనకు కూడా నన్ను సమర్థించుకోను. ఒక నటిగా నేను ఉన్నతమైన స్థానంలో లేను. కొంతమందికి కొందరు నటీనటులు అంటే ఇష్టం. మరికొందరికి ఇష్టం ఉండదు. నటిగా ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాలి. ఆ భగవంతుడు కోరుకుంటే సుదీర్ఘ జీవితం సినిమాల్లో ముందుకు సాగుతా. ఆ తర్వాత ప్రొడక్షన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై దృష్టి సారిస్తా.' అని తెలిపింది. -
ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
పొద్దున్న లేచింది మొదలు రాత్రినిద్రపోయేంతవరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు జనం. బస్సుల్లో, బస్‌స్టాప్‌లో, రైళ్లలో, పార్క్‌ల్లో, ఇలా ఎక్కడ చూసినా ఇదే తంతు. పెద్దలు చెప్పినట్టు లేవగానే దేవుడి ముఖం చూస్తారో లేదో తెలియదు గానీ స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూడని వారుమాత్రం ఉండరంటే అతిశయోక్తికాదు. అలా మారిపోయింది నేటి డిజిటల్ యుగం. కొంచెం టైం దొరికితే చాలు.. ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ (Reels), యూట్యూబ్ షార్ట్ వీడియోలు... అక్కడితో అయిపోదు.. టైం వేస్ట్ అవుతోందని తెలిసినా..మళ్లీ ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది గంటల తరబడి. ఇలా రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నవారికి ఒక హెచ్చరిక. ఈ అలవాటు అనేక మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుసా? స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల అనర్థాలపై ఇప్పటికే చాలా అధ్యయనాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పడుకునే సమయంలో షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూడటానికి గడిపే స్క్రీన్ సమయానికి , యువకులు మధ్య వయస్కులలో అధిక రక్తపోటుకు మధ్య పరస్పర సంబంధం ఉందని ఒక అధ్యయనం గుర్తించింది. తాజాగా ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ (APAO) 2025 కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ ' సెలెండ్ ఎపిడమిక్ ఆఫ్ డిజిటల్ ఐ' అంటూ ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరించారు. "రీల్స్ తక్కువగా ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది" అని డాక్టర్ లాల్ హెచ్చరించారు.మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో మనుషులు అనేక సమస్యలు కొని తెచ్చుకోవడమేననీ, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్బుక్ ,యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్‌ను అతిగా చూడటం వల్ల అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా పిల్లలు , యువకుల్లో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ విపరీతంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని యశోభూమి- ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో మంగళవారం (ఏప్రిల్ 1) జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ, ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్ సొసైటీ సంయుక్త సమావేశంలో ఇందుకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల పెద్దల్లో కూడాతరచుగా తలనొప్పి, మైగ్రేన్లు , నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది నయంకాని అంధత్వానికి అత్యంత సాధారణ కారణమైన మయోపిక్‌తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా.చదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల డిజిటల్ కంటి ఒత్తిడి, మెల్లకన్ను,కంటి చూపు క్షీణించడం వంటి సమస్యలతో ముఖ్యంగా విద్యార్థులు ,పని చేసే నిపుణులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక స్క్రీన్ సమయం వల్ల సామాజికంగా ఒంటరితనం, మానసిక అలసట,మతిమరపు లాంటి సామాజిక , మానసిక నష్టాన్ని కూడా వారు నొక్కి వక్కాణిస్తున్నారు.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఏం చేయాలి. 20.20.20 రూల్నియంత్రణలేని రీల్స్ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు 20-20-20 రూల్‌ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు 5 నిమిషాల పాటు కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. అలాగే ఐ బ్లింక్ రేటు పెంచడం, స్క్రీన్లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్ చేయడానికి ప్రయత్నం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం,క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్‌లు వంటి డిజిటల్ డిటాక్స్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుందంటున్నారు కంటివైద్య నిపుణులు.చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు! -
జీబ్లీ ఇమేజ్.. పర్సనల్ డ్యామేజ్?
జీబ్లీ ఇమేజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇమేజ్ టూల్. ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ తన చాట్‌జీపీటీ ఏఐ టూల్ ద్వారా తీసుకొచి్చన ఈ జీబ్లీ ఇమేజ్ క్రియేషన్ టూల్‌ను పిల్లల నుంచి ప్రముఖులు, దేశాధినేతల వరకు తెగ వాడేస్తున్నారు. ఎక్స్ గ్రోక్, గూగుల్ జెమినీ ఏఐ టూల్స్ కూడా జీబ్లీ చిత్రాలను అందిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏఐ జనరేటెడ్ జీబ్లీ ఆర్ట్‌వర్క్ చిత్రాలు సోషల్‌మీడియాను ముంచెత్తుతున్నాయి. కానీ, ఇది యూజర్ల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య ఏమిటి? జీబ్లీ ఇమేజ్ కోసం మనం ఫొటో ఇస్తున్నామంటే మన వ్యక్తిగత ఫొటోలను ఏఐ టూల్ తన ఇష్టంవచి్చనట్లు వాడుకొనేందుకు ఒప్పుకుంటున్నట్లు లెక్క. మనమిచ్చే ఫొటో ఆధారంగా జీబ్లీ ఇమేజ్ను సృష్టించిన తర్వాత ఏఐ టూల్ ఒరిజినల్ ఫొటోను తన డేటా బేస్ నుంచి తొలగించదు. దానిని సదరు కంపెనీ ఏఐ శిక్షణ కోసమో, మరే ఇతర అవసరాలకైనా వాడుకొనే అవకాశం ఉంది. అప్పుడు మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు దుర్వినియోగం కావచ్చని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏమిటీ జీబ్లీ? చాట్‌జీపీటీ, గ్రోక్, జెమినీ అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఇమేజ్ జనరేటివ్ ఆర్ట్‌వర్క్ ఇది. ముఖ్యంగా చాట్‌జీపీటీలో బాగా పాపులర్ అయ్యింది. మన సొంత ఫొటోలు లేదంటే మనకు ఇష్టమైన ఏ ఇతర ఫొటోలైనా చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసి జీబ్లీ స్టైల్ ఇమేజ్ కావాలని అడిగితే వెంటనే చూడముచ్చటైన చిత్రాన్ని అందిస్తుంది. మనకు ఏ విధమైన చిత్రం కావాలో సూచనలు ఇచ్చినా అలాంటి చిత్రాన్ని సృష్టించి ఇస్తుంది. మీ వ్యక్తిగత ఫొటోలు ఒకసారి ఏఐ టూల్‌కు షేర్ చేశారంటే ఇక మీరు వాటిపై నియంత్రణ కోల్పోయినట్లే. ఆ ఫొటోలతో ఏఐ ట్రైనింగ్‌తోపాటు ఏ రకంగానైనా వాడుకొనేందుకు ఆ కంపెనీకి అవకాశం ఇచ్చినట్లే. అది డేటా చౌర్యం ప్రమాదానికి దారితీస్తుంది. ఆ ఫొటోలు, కంటెంట్‌తో మిమ్మల్ని అప్రతిష్టపాలు చేయటానికి, వేధింపులకు గురిచేయటానికి కూడా అవకాశం ఉందని ప్రముఖ డేటా సెక్యూరిటీ సంస్థ ప్రొటాన్ హెచ్చరించింది. ‘ప్రస్తుతం ఎక్కడ చూసినా జీబ్లీ స్టైల్ ఏఐ ఆర్ట్ చిత్రాలే కనిపిస్తున్నాయి. కానీ, దీనివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీ చిత్రాలు, ఆలోచనలను ఏఐ టూల్స్‌లో అప్లోడ్ చేయటం వల్ల డేటా చౌర్యంతోపాటు మీ ఉనికి (లొకేషన్) సదరు సంస్థ చేతుల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన అత్యంత సున్నిత డేటా కూడా మీ చేయిదాటిపోతుంది. జీబ్లీ ఇమేజ్ జనరేషన్ ఉచితమే కావచ్చు. కానీ, అది మీ జీవితం (డేటా) విలువ కూడా అవుతుంది. అది మీకు సమ్మతమే అయితే ఇబ్బంది లేదు. అప్రమత్తంగా ఉండటం ఎందుకైనా మంచిది.’ – ఎలీ ఫారెల్ కింగ్స్లే, బ్రిటిష్ టెక్ నిపుణురాలు.జీబ్లీ స్టైల్‌కు ఆద్యుడెవరు? జీబ్లీ ఆర్ట్ ఇమేజెస్‌కు ఆద్యుడెవరు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ చిత్రాలు అచ్చం జపనీస్ యానిమేటర్ హయావో మియాజాకీ సృష్టించిన ఆర్ట్వర్క్లాగే ఉన్నాయి. అయితే, ఈ ఏఐ జీబ్లీ చిత్రాన్ని తొలి సారి పొందింది మాత్రం అమెరికాలోని సియాటిల్ నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్రాంట్ స్లాటన్. 2023 డిసెంబర్లోనే ఈయన ఓపెన్ ఏఐ డాల్–ఈ టూల్‌ను వాడి తన కుటుంబ జీబ్లీ ఇమేజ్ను సృష్టించాడు. -
మీకు దండం పెడతా ఆ ఫొటోలు ఆపండ్రా బాబు
మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వచ్చినా జనం ఊరుకోరు.. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చే అప్డేట్స్.. మార్పులు.. కొత్తకొత్త ఆవిష్కరణలు వంటివి జనాన్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ఎంతలా అంటే కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చిన కంపెనీకి సైతం నిద్రపట్టని స్థాయిలో మనోళ్లు వాడకం ఉంటుంది. ఐ ఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు తిండి నిద్రమానేసి దానికోసం లైన్లో నిలబడి చివరకు దాన్ని దక్కించుకునేవరకూ ఊపిరిసలపని వాళ్ళు కొందరు. దానికోసం ఏకంగా కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫోన్ కొనకపోతే ఉరేసుకుంటాను అని తల్లిదండ్రులను బెదిరించిన కేసులూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా చాట్‌జీపీటీలో వచ్చిన కొత్త ఆవిష్కరణ జిబ్లీ స్టూడియో ఫోటోలు.. అంటే మనం ఏదైనా ఫోటోను దానిలోకి అప్లోడ్ చేస్తే అది కార్టూన్ మాదిరి మార్చేసి మనకు తిరిగి ఇస్తుందన్నమాట. అంటే ఒక చిత్రకారుడు పెన్సిల్.. కుంచెతో వేసినట్లు ఆ ఫోటోలు ఉంటాయి.ఈ కొత్త ఫీచర్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం ఐంది. ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోటోలు అప్లోడ్ చేసేసి వాటిని జిబ్లీ స్టూడియో ఫొటోలుగా మార్చేసుకుని ఫేసుబుక్ ట్విట్టర్.. ఇన్‌స్టాలో పోస్టు చేసుకుంటున్నారు. మనిషికి తనని తాను చూసుకోవడం ప్రతిసారీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందేమో..అద్దంలో ఒకసారి ఫోటోలో ఒకసారి.. బొమ్మ గీయించుకొని ఒకసారి..చూసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా కార్టూన్ లో ఎలా ఉంటానో అనే కుతూహలంతో.. చాట్‌జీపీటీలో అందరూ స్టూడియో గిబ్లీ ఆర్ట్ స్టైల్ లో తమ ఫొటోలు మారుస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ఫోటోల పిచ్చి ఏకంగా ఆ చాట్‌జిపిటి సంస్థను సైతం కుదిపేసింది.మనం అప్లోడ్ చేసిన మన మామూలు ఫోటోలను ఏకంగా జపానీస్ యానిమేషన్ స్టూడియో డైరెక్టర్లు హయావో మిజజాకి, ఇసావో టకహట రూపొందించిన పాపులర్ సినిమాలు స్పిరిటెడ్ అవే , ప్రిన్సెస్ మోనోనొకే వంటి సినిమా క్యారెక్టర్లను పోలి ఉండేలా మార్చేసి మనకు అందిస్తోంది. . ఈ కార్టూన్ చిత్రాలు మంచి జనాదరణ పొందడంతో కోట్లకొద్దీ ఫోటోలు చాట్‌జీపీటీలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో అక్కడి సిబ్బందికి తిండి నిద్ర కూడా లేదంట. దీంతో ఈ ట్రేండింగ్ ను చూసి విసుగెత్తిపోయిన చాట్ జిపిటి వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మాన్ బాబూ కాస్త గ్యాప్ ఇవ్వండి.. మా సిబ్బంది కూడా కాస్త నిద్రపోవాలి కదా అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అంటే కొత్త ట్రెండ్ మొదలైతే జనం ఎంతలా వేలం వెర్రిలా ఉంటారన్నదానికి ఇదో ఉదాహరణ అన్నమాట.- సిమ్మాదిరప్పన్న -
ట్రాఫిక్ సిగ్నల్‌లో భార్య రీల్స్ .. ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్న భర్త
ఛండీఘడ్ : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ భార్య చేసిన అత్యుత్సాహం భర్త కొంప ముంచింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. దీంతో భర్త లబోదిబో మంటూ మళ్లీ తనని విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ప్రాధేయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ హర్యానా సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది. అందుకే సమయం ఎప్పుడైనా, సందర్భం ఏదైనా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఆ సాంగ్ పాడటం లేదంటే, డ్యాన్స్‌లతో అదరగొట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.ఈ తరుణంలో మార్చి 20న సాయంత్రం 4:30 గంటల సమయంలో జ్యోతి అనే మహిళ తన వదిన పూజతో కలిసి స్థానికంగా ఉండే దేవాలయానికి వెళ్లింది. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఛండీఘడ్ సెక్టార్-20 గురుద్వారా చౌక్ సిగ్నల్‌లో జ్యోతి అత్యుత్సాహం ప్రదర్శించింది. తన వదిన పూజ సాయంతో హర్యాన్వీ ఫోక్‌సాంగ్‌కు డ్యాన్స్ వేసింది. తన వదిన వీడియో తీస్తే ఆమె డ్యాన్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగచక్కెర్లు కొట్టాయి.चंडीगढ़: पुलिसकर्मी की पत्नी ने ज़ेबरा क्रॉसिंग पर बनाई रील, ट्रैफिक नियमों की उड़ाई धज्जियां; रोड पर लगा जाम महिला के खिलाफ पुलिस ने FIR दर्ज की, हालांकि थाने में ही बेल दे दी गई. मामला सेक्टर-20 में गुरुद्वारा चौक के पास का है.#Chandigarh pic.twitter.com/l2j4fTYFGv— Ishani K (@IshaniKrishnaa) March 27, 2025 ఈ వీడియో వైరల్ కావడంతో, హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్ 34 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్, సెక్టార్ 17లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షించింది. సీసీటీవీ ఫుటేజీల్లో ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద డ్యాన్స్ చేసిన జ్యోతిపై, వీడియో తీసిన పూజపై బీఎన్ఎస్ సెక్షన్ 125, 292 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.సెక్టార్ 19 పోలీస్ స్టేషన్లో సీనియర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి భర్త అజయ్ కుందును పదవి నుండి సస్పెండ్ చేశారు. ఎందుకంటే భార్య డ్యాన్స్ వీడియోను అజయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంపై అతనిపై చర్యలు తీసుకున్నారు. కేసులు నమోదు కావడంతో జ్యోతి,పూజలు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. -
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్‌బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫెక్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన. -
ప్రపంచంలోనే అత్యంత శీతల మార్కెట్..! కొనాలంటే గజగజ వణకాల్సిందే..
గజగజలాడించే చలిప్రాంతాలు గురించి ఉన్నాం. అయితే మార్కెట్లు వ్యాపార ప్రాంతాలు కాస్త అనువైన ప్రదేశాల్లో, సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే చోటనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మార్కెట్ మాత్రం గడ్డకట్టుకుపోయే మార్కెట్. అక్కడ కొనుగోలు చేయడానికి వెళ్లాలంటే తగిన జాగ్రత్తలతో వెళ్లకపోతే అంతే సంగతులు. అంతలా వణుకుపుట్టిస్తుంది అక్కడ చలి. శీతాకాలంలో అయితే ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 60 డిగ్రీలకు పడిపోతుందట. అంతలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ జనాభా వృద్ధి చెందుతుండటం విశేసం. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందంటే..సైబీరియాలోని యాకుట్స్క్ అనే నగరం అత్యంత శీతల నగరంగా పేరుగాంచింది. అక్కడ నివాసితులు సాధారణ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నట్లుగా మనుగడ సాగించటం విశేషం. వాళ్లేమి ఆ చలిని పెద్దగా లెక్కచేయరు. అది వారికి అత్యంత సర్వసాధారణం. అక్కడ ఒక నాన్‌వెజ్ మార్కెట్ ఉంటుంది. సందర్శనకు వెళ్లితే గజగజ వణికిపోవాల్సిందే. దీనిపై ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్ డాక్యుమెంట్ చేసి మరీ ఈ నగరం విశేషాల గురించి వివరించింది. ఎముకలు కొరికే చలిలో మార్కెట్‌ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజలు. యాకుట్స్క్ నగరవాసులు మాంసం బాగా తింటారట. అక్కడ చేపల మార్కెట్లు కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయట. ఎలాంటి వాసనరాదట. అక్కడ గుర్రం, రెయిన్ డీర్, కుందేలు, కొన్ని రకాల పచ్చి మాంసాలు, చేపలు తదితరాలను విక్రయిస్తుంటారట. అక్కడ స్థానిక ప్రజలకు బాగా ఇష్టమైనది గుర్రపు కాలేయం అట. ఈ మార్కెట్ సందర్శించాలనుకుంటే రెడీమేడ్‌గా తినగలిగే పదార్థాలను తీసుకువెళ్లితే మంచిదట. ఇంతలా వణికించే చలికి తగ్గట్టుగానే వేసవి ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో ఉంటాయట. జూలైలో యాకుట్స్క్ సగటు అధిక ఉష్ణోగ్రత 78 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుందట. ఇది లండన్‌తో పోలిస్తే మరింత ఎక్కువని చెబుతోంది ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరీ.. View this post on Instagram A post shared by Ankita Kumar 🇮🇳| TRAVEL (@monkey.inc) (చదవండి: పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!) -
గెలుపు ఎర వేస్తారు.. తర్వాత ఓడిస్తారు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువత పైనే ఉంటోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేకమంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటివాళ్లు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఒకటీ రెండుసార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎర అనే విషయం తెలుసుకోవాలి..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్నీ కదిలించింది. తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాల పైనా ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్.. వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం ప్రకటించిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అవగాహన పెంచేందుకే ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ యువత ప్రాణాలు తీసుకోవడం కదిలించింది. బెట్టింగ్ యాప్‌ల బారినపడ కుండా వారిని కాపాడటం కోసం, వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రారంభమైంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది సెర్చ్ చేశారు. క్యాంపెయినింగ్ మొదలైన తర్వాత ‘ఎక్స్’ను 1.2 కోట్లు మంది, ఇన్‌స్ట్రాగామ్‌ను 85 లక్షలు మంది వీక్షించారు. ప్రస్తుతం అనేక మంది సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లు ఆయా ప్రకటనలు చేసేప్పుడు తదనంతర పరిణామాలను ఊహించలేదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సైబర్ టెర్రరిజం కిందికే వస్తుంది. మన పోలీసులు ఆది నుంచీ ముందున్నారు సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన ఆర్థిక దోపిడీలను అడ్డుకోవడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందుంటున్నారు. ఒకప్పుడు ఎంఎల్ఎం స్కామ్స్, ఆపై మైక్రో ఫైనాన్స్ దుర్వినియోగాలను పకడ్బందీగా కట్టడి చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వంతు వచ్చింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి కేవలం పాత్రధారులనే కాదు సూత్రధారులకూ చెక్ చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేయాలి. అన్నివర్గాల్లో అవగాహన కల్పించాలి. బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయడం, ప్రమోటర్లతో పాటు నిర్వాహకుల పైనా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ బెట్టింగ్ ప్రకటనలను అనుమతించిన మీడియా ప్లాట్‌ఫామ్‌లూ బాధ్యత వహించేలా చేయాలి. లావాదేవీలను సులభతరం చేసే చెల్లింపు గేట్‌వేల లైసెన్స్‌లు రద్దు చేయాలి. అడ్డుకట్ట వేయకపోతే ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సిందే.. బెట్టింగ్ నెట్‌వర్క్‌లు విదేశాల నుండి పనిచేస్తుంటాయి. అందువల్ల వీరిని కనిపెట్టి, కట్టడి చేయడం కష్టసాధ్యమైన అంశం. అందువల్ల అంతా ముందుకు వచ్చి అందరిలోనూ అవగాహన కల్పించడం ద్వారా ఈ ఉచ్చు నుంచి యువతను తప్పించాలి. పోలీసులు సైతం ఎప్పటికప్పుడు బెట్టింగ్ దందాలపై అవరసమైన చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లు అనేక కుటుంబాలు కుప్పకూలడానికి కారణం అవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక ఉగ్రవాదంతో సమానం. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే దానికి ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ తరుణంలో అందరం కలిసి ముందుకు వెళితేనే మన సమాజాన్ని కబళిస్తున్న బెట్టింగ్ భూతానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలం. యువతరాన్ని రక్షించుకోగలం. తల్లిదండ్రుల అప్రమత్తతా కీలకం బెట్టింగ్ యాప్‌ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. ఈ భూతాన్ని పూర్తిగా పారద్రోలాలంటే తల్లిదండ్రుల సహకారం అనివార్యం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సోషల్‌మీడియా వినియోగదారుల్లో 16–30 ఏళ్ల మధ్య వయసు్కలే ఈ యాప్‌ల టార్గెట్‌గా ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఎందరో విద్యార్థులు తమ చదువుకు ఉద్దేశించిన డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకుని విద్యకు దూరమైన ఉదంతాలు ఉన్నాయి. యువత అనేకమంది అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇవి ఆత్మహత్యలు కాదు.. బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వాళ్లు చేసిన హత్యలు. -
భూకంపంలో శిశువులను కాపాడిన నర్సులు.. హ్యట్సాప్ అంటూ ప్రశంసలు
మయన్మార్‌లో భూకంప విలయం (Earthquake) కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంచనాలకు కూడా అందని నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలే వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు.మరోవైపు.. భూకంపం సందర్బంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని ఒక చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. భూకంపం సందర్భంగా ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో చిన్న పిల్లలను నర్సులు కాపాడారు. భూకంపం ధాటికి భవనంలో కుదుపులు ఎదురైనప్పటికీ వారు కింద పడిపోతున్నా.. ఆసుపత్రిలో ఉన్న శిశువుకు ప్రమాదం జరగకుండా నర్సులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో నర్సు ప్లోర్‌పై కూర్చుని శిశువును పట్టుకుంది. ఎంతో కష్టం మీద కన్న తల్లిలాగా శిశువులను కాపాడారు. ఈ క్రమంలో నర్సుల కష్టంపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు.ఇదిలా ఉండగా.. మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు (Aftershocks) వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.Nurses in SW China protect newborn babies during earthquake in Myanmar #ChinaBuzz pic.twitter.com/Yixj3pCtZE— CGTN (@CGTNOfficial) March 30, 2025ప్రపంచ దేశాల ఆపన్న హస్తం..ఈ కష్ట సమయంలో అక్కడి ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్ వెల్లడించారు.Terrifying CCTV video of yesterdays M7.7 earthquake that hit Myanmar. The death toll is at least 1,644, with 3,408 people injured. Numbers are expected to rise. pic.twitter.com/5fAXXXpVDl— Volcaholic 🌋 (@volcaholic1) March 29, 2025 Nature doesn’t care about our strength, borders, or pride. The earthquake in #Thailand & #Myanmar is a stark reminder: no matter how advanced we become, nature still holds the power to shake everything. A brutal reminder of how small we really are. #earthquake pic.twitter.com/wQPZ82MB8j— Hala Jaber (@HalaJaber) March 29, 2025 -
పట్టు పరికిణిలో బిగ్‌బాస్ బ్యూటీ.. ఉప్పెన భామ కృతి శెట్టి గ్లామరస్ పిక్స్!
అవార్డ్స్ ఫంక్షన్లో మెరిసిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి..షిప్లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మి..బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ అదిరిపోయే లుక్స్...జీన్స్ డ్రెస్‌లో శ్రద్ధాదాస్ పోజులు... మేకప్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలీవుడ్ భామ కాజోల్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
Adolescence Review: డిజిటల్ లోయల్లో టీనేజ్ పిల్లలు
తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడుతుంటారు. పిల్లలు చదువులతో కష్టపడాలి వాస్తవంగా. కాని వారికి సోషల్ మీడియాలోని చెత్తా చెదారం, తప్పుడు సమాచారం, ఉద్రిక్త ఆకర్షణలు, హింసాత్మక భావజాలాలు... ఇవి కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘అడోలసెన్స్’ వెబ్‌సిరీస్ మీద సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇది హెచ్చరిక అంటున్నారు. ఈ సిరీస్ మనల్ని ఎలా నిద్ర లేపుతున్నది?మీ పిల్లలు మీతో ఇంట్లో మాట్లాడే భాష మీకు తెలుసు. వాళ్లు సోషల్ మీడియాలో మాట్లాడే భాష మీకు తెలుసా? వాళ్లు ఉపయోగించే ‘ఎమోజీ’ల అర్థాలు తెలుసా? మాటలు లేకుండా ఎమోజీలతో గాయపరిచే వీలు ఉంటుందని తెలుసా? కిడ్నీ బీన్స్, రెడ్ పిల్, బ్లూ పిల్, డైనమైట్, రెడ్ హార్ట్, పర్పుల్ హార్ట్, ఎల్లో హార్ట్.... ఈ ఎమోజీల అర్థం ప్రతి దానికీ మారుతుంది. అవి ఎందుకు ఉపయోగిస్తున్నారు. ఇంట్లో మన ఎదురుగా పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసు. సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసా?ముఖ్యంగా వారి వయసు 12– 14 సంవత్సరాల మధ్య ఉంటే వారికి తెలిసింది ఎంత... తెలియంది ఎంత... తెలిసీ తెలియంది అంత. జాగ్రత్త సుమా... అని హెచ్చరించడానికి వచ్చింది ‘అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్.నాలుగు ఎపిసోడ్స్ల సిరీస్‘అడోలసెన్స్’ అనేది నాలుగు ఎపిసోడ్ల మినీ వెబ్ సిరీస్. బ్రిటిష్ క్రైమ్ డ్రామా. బ్రిటన్‌లో టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తిని గమనించి ఈ సిరీస్‌ను తీశారు. జాక్ థోర్న్ స్క్రిప్ట్ రాస్తే, ఫిలిప్ బరాన్టిని దర్శకత్వం వహించాడు. ఒక్కో ఎపిసోడ్ ఒక గంట ఉంటుంది. విశేషం ఏమిటంటే ప్రతి ఎపిసోడ్ సింగిల్ షాట్. అంటే మధ్యలో కట్ లేకుండా కెమెరా కదులుతూ దృశ్యాలను చూపుతూ వెళుతుంది. ఈ మేకింగ్‌లో వినూత్నత వల్ల కూడా ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంటోంది.ఆ పసివాడి సంఘర్షణఈ సిరీస్ మొదలు కావడమే ‘జెమీ మిల్లర్’ అనే 13 ఏళ్ల పిల్లవాడి అరెస్టుతో మొదలవుతుంది. ముందు రోజు రాత్రి స్కూల్లో తన క్లాస్మేట్ అమ్మాయి కేటీని కత్తితో ఏడుసార్లు పొడిచి చంపాడని అభియోగం. తండ్రి, తల్లి, సోదరి హడలిపోతాడు. జెమీ మిల్లర్ అయితే పోలీసులను చూసి ప్యాంట్ తడుపుకుంటాడు. ఆ తర్వాత జేమీనే కేటీని చంపాడని ఇందుకు ఒక స్నేహితుడు కూడా పురిగొల్పాడని విచారణలో ప్రేక్షకులకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇందులో ఎవరి తప్పు ఎంత? దీనికి బాధ్యులు ఎవరెవరు? శిక్ష మాత్రం ఒక్కడికే పడబోతోందా?ఇన్‌స్టా గొడవజెమీ వయసు 13 ఏళ్లే అయినా అతనికి ఇన్‌స్టా అకౌంట్ ఉంది. అందమైన ఫిమేల్మోడల్స్ బొమ్మలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు. అతని పోస్టులకు కేటీ కామెంట్స్ పెడుతూ ఉంటుంది. వాటికి రకరకాల ఎమోజీలు వాడుతుంటుంది. అవి జెమీని బాధ పెట్టాయని మనకు తెలుస్తుంది. జెమీ తన వయసులో అపరిపక్వత వల్ల తను ఆకర్షణీయంగా లేడని తనను ఎవరూ ఇష్టపడరని న్యూనతతో ఉంటాడు. కేటీ కామెంట్స్ ఇందుకు ఆజ్యం పోస్తాయి. అంతే కాదు సాటి మనిషి పట్ల, ఆడపిల్లల పట్ల సెన్సిటివ్‌గా ఉండాలనే భావజాలం కాకుండా వాళ్లను ఏమైనా అనొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అనే ఆధిపత్యపు భావజాలమే ఎక్కువగా జెమీకి పరిచయం అవుతుంటుంది. వీటన్నింటి దరిమిలా అతడు కేటీప్రాణం తీసేవరకూ వెళతాడు.టీనేజ్ పిల్లలు ఎంతో సున్నితమైన దశలో ఉండే సీతాకోక చిలుకలు. వారిని గురించి అందరికీ బాధ్యత ఉండాలని చెబుతోంది ఈ సిరీస్. ఇందులోని ముఖ్య పాత్రను ఒవెన్ కూపర్ అనే బాల నటుడు అద్భుతంగా పోషించాడు. దిన పత్రికల వార్తలు కూడా మనకు రోజూ టీనేజ్ పిల్లల సమస్యలు, కుటుంబాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లోపం పట్టి ఇస్తున్నాయి. తల్లిదండ్రులు ఈ సిరీస్ చూడటం మంచిదంటున్నారు అభిరుచి ఉన్న ప్రేక్షకులు. కొందరైతే టీనేజ్ పిల్లలతో పాటుగా తల్లిదండ్రులూ చూడాలని సూచిస్తునారు. ముందు పెద్దలు చూడండి. ఆ తర్వాత మీకు సబబని అనిపిస్తే పిల్లలకు చూపించండి. కానీ ఆలోచించండి.ఎవరు నిందితులు?సోషల్ మీడియాను, ఎమోజీలను కనిపెట్టిన వారా? వాటిని ఫోన్లకు అనుసంధానం చేసిన వారా? పిల్లలకు ఫోన్లు కొనిచ్చిన తల్లిదండ్రులా? వాళ్లు ఏ మీడియాను ఉపయోగిస్తున్నారో చూడని తల్లిదండ్రుల నిర్బాధ్యతా? వారితో గడపలేని బిజీతో ఉన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యమా? సరిగా పెంచని, సరిగా విద్యాబుద్ధులు చెప్పని వారంతా ఇందుకు బాధ్యులు కాదా? సమాజంలో పేరుకున్న హింసా ప్రవృత్తిని దూరం చేయలేని పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ, పౌర వ్యవస్థలో ఉన్న వీరంతా కాదా బాధ్యులు. -
ఆఫీసులో అమ్మ... ఇంట్లో బిడ్డ
ఐఏఎస్ అధికారిణి, ఇద్దరు పిల్లల తల్లి అయిన దివ్య మిట్టల్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ‘నేను ఒక ఐఏఎస్ అధికారిణి ని. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎమ్) బెంగళూరులో చదివాను. వీటిని సాధించడానికి చాలా కష్టపడ్డాను. కానీ, నా ఇద్దరు చిన్నారి కూతుళ్లను పెంచే క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఏదీ నన్ను సిద్ధం చేయలేదు..’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఇటీవల కాలంలో ఉద్యోగం చేసే అమ్మల శాతం పెరుగుతోంది. అదే సమయంలో పిల్లల పెంపకం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామా అనే ఆందోళనా పెరుగుతోంది. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను నేటి తల్లులు ఎలా సమతుల్యతను సాధించాలో నిపుణులు సూచిస్తున్నారు.వయస్సుతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ‘అమ్మా’ అని పిలుస్తాం. ఈ పిలుపు తల్లీ బిడ్డ జీవితాంతం పంచుకునే అనుబంధానికి స్పష్టమైన సూచన. ప్రాచీన కాలం నుండి సమాజంలో మహిళలు పిల్లల సంరక్షకులుగా పరిగణించబడ్డారు. వారి విధి ఇంటికి, ఇంట్లోని వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యింది. దీంతో తల్లులు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలనే ఈ భావన పిల్లలను వారి జీవితాల్లో, అభివృద్ధిలో సురక్షితంగా ఉంచింది. నేడు సమాజంలో తల్లులు ఇంటి పనుల నిర్వహణలోనూ, పిల్లల సంరక్షణలోనూ రెండు పాత్రలను పోషిస్తున్నారు. పిల్లల సంరక్షణలో తండ్రుల వాటా పెరిగినప్పటికీ మహిళలు ఇప్పటికీ వారి ఇంట్లో మొదటి సంర క్షకులుగా ఉంటున్నారు.విజయవంతమైన మార్పుప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్ గురించి చేసిన అధ్యయనాల్లో దాదాపు 73 శాతం మంది మహిళలు 30 ఏళ్ల వయసులో తమ పిల్లలను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను విడిచిపెట్టారని, 27 శాతం మంది కొంతకాలం తర్వాత తిరిగి వచ్చారని గమనించారు. వారిలో దాదాపు 16 శాతం మంది తమ వృత్తిపరమైన పని జీవితంలో అధికారులుగా ఉన్నారు. కాబట్టి తల్లులుగా ఉన్న మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను విజయవంతంగా మార్చుకుంటున్నారని కూడా స్పష్టమైంది.‘ఉద్యోగినిగా డబ్బు సంపాదిస్తూ పిల్లలకు కావల్సినవి సమకూర్చగలుగుతున్నాను. కానీ, వారిని సక్రమంగా పెంచగలుగుతున్నానా..’ అనుకునే తల్లులకు సాంకేతికత వరంగా మారింది. సమయానుకూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకోవచ్చు.సానుకూల ప్రభావాలు → ఉద్యోగ తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో రెండు పని చక్రాలతో తమ జీవితాలు సజావుగా నడుస్తున్నట్టు చూస్తారు. ఉన్నత విద్యను పొందగల సామర్థ్యం, భౌతిక, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగల సామర్థ్యం కారణంగా వారు మరింత సంతృప్తికరమైన జీవితాలను గడుపుతారు. ఇప్పుడు ఉద్యోగాల్లోకి వెళ్లే మహిళలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, కెరీర్ అవకాశాలను సరైన ప్యాకేజీలతో అందుకుంటున్నారు. → హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం పనిచేసే తల్లుల కుమార్తెలు వారి తల్లులకంటే 23శాతం ఎక్కువ సంపాదిస్తారని తెలిసింది. మరోవైపు పనిచేసే తల్లుల కుమారులు బాధ్యతాయుతమైన పెద్దలుగా ఎదుగుతారు. వారి ఆఫీసుల్లో లింగ సమానత్వాన్ని ఇష్టపడతారు. మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను గౌరవిస్తారు. వారు భవిష్యత్తులో తమ కుమార్తెలకు అద్భుతమైన తండ్రులుగా కూడా పెరుగుతారు.→ తమ తల్లి జీవితంలోని దుఃఖకరమైన రోజులనూ చూసి ఉంటారు. అంతేకాదు తమ తల్లి పట్టుదల, దృఢ సంకల్పం వారు మానసికంగా, ఆర్థికంగా తమ సామర్థ్యాల మేరకు తమను తాము ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. అన్నింటికంటే వారు హీరోలలో తమ తల్లిని ఒక షీ–రో గా చూస్తారు.మెరుగైన సమయ నిర్వహణ → పనిచేసే తల్లులు ప్రతిరోజూ తమ పిల్లలతో కనీసం ఒకటి లేదా రెండు గంటలు గడపగలిగేలా సమయాన్ని ప్లాన్చేసుకోవాలి. ఇది ఒక దినచర్యగా అనుసరించాలి. వేర్వేరు పనులను షెడ్యూల్ చేయడం, వాటిని సమయానికి పూర్తి చేయడం అనే మీ అలవాటు మీ పిల్లలు అదే అడుగు జాడల్లో నడవడానికి ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. → పిల్లలు టైమ్‌టేబుల్‌కు కట్టుబడి ఉండటానికి కూడా ప్రోత్సహిస్తుంది. పిల్లలు మీ పనిని పూర్తి చేయడంలో సహకరిస్తున్నందుకు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. → కాలక్రమంలో పిల్లల సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది వారి మెరుగైన జీవితానికి సహాయపడుతుంది. అంతేకాదు, పిల్లలతో మరింత నాణ్యమైన సమయాన్ని గడపడానికి సహాయపడుతుంది. రోజువారీ జీవన విధానంలో ముఖ్యమైన వాటికి సమయం ఇస్తూ, తమ పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ, చేస్తున్న పని గురించి పిల్లలకు క్లారిటీ ఇవ్వడం వల్ల మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. హద్దులు అవసరంపని, కుటుంబంతో పాటు వ్యక్తిగత అవసరాలకూప్రాముఖ్యం ఇవ్వండి. శారీరక, భావోద్వేగ శ్రేయస్సు కోసం స్వీయ సంరక్షణ అవసరం అనేది గుర్తుంచుకోవాలి. రోజులో పిల్లలకోసమే అన్నట్టుగా కొంత సమయం గడపండి. ఆ సమయంలో ఏదైనా పని నైపుణ్యాలు నేర్పించాలా, చదువు పట్ల దృష్టి పెట్టాలా, ఆనందంగా ఉంచడానికిప్రాధాన్యత ఇవ్వాలా.. ఇలా దేనికది బేరీజు వేసుకోవాలి. సహాయకులుగా ఉండేవారి మద్దతు ఎలా అందుతుందో చెక్ చేసుకోండి. వృత్తిపరమైన వృద్ధికి, తల్లి పాత్రకు విలువనిచ్చేవారిని సహాయకులుగా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. ప్రతి ఒక్కరూ పనులు చేసేలా, బాధ్యత తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. –ప్రొ÷. పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ నిపుణులుఅమ్మా, నువ్వే నా హీరో..నా పెద్ద కూతురికి 8 ఏళ్లు. ప్రపంచం గురించి ఇప్పటికే భిన్నమైన ఆలోచనలను చేస్తుంటుంది. ఎదిగే క్రమంలో ఆమె ఆలోచనల కాంతిని మసకబారనివ్వం. కొన్నిసార్లు పని ఒత్తిడిలో చాలా అలసిపోయినట్టుగా ఉంటుంది. ఆ అలసటలో ఏడుపు వచ్చేస్తుంటుంది కూడా. అలాంటప్పుడు నా కూతురు నన్ను కౌగిలించుకుని, ‘నువ్వు నా హీరోవి‘ అని చెబుతుంది. అంటే, పిల్లలు మనల్ని గమనిస్తారు. వారు మన వైఫల్యాల నుండి దృఢంగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. పడిపోవడం సహజమే అని ఆమెకు చూపించండి, ఆపై లేవండి. నా ఉద్యోగం నాకు ఇది నేర్పింది. ఏది జరిగినా నువ్వు స్థిరంగా ఉంటావని చూపించండి. మాతృత్వంలో తమకు తాము వేసుకునే ప్రశ్నల్లో కొంత అపరాధ భావనతో నిండి ఉంటాయి. నేను పిల్లలకు సరైనదే ఇస్తున్నానా, ఏమైనా తప్పులు చేస్తే.. ఇలాంటివి తలెత్తుతుంటాయి. కానీ, తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ సొంత మార్గంలో ప్రయాణిస్తూ ఆమె దేనినైనా వెంబడించగల ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని గుర్తించాలి. తనను తాను క్షమించుకుంటూ ముందుకు సాగడం కూడా చాలా ముఖ్యం. మీకు ఒకరి కంటే పిల్లలు ఎక్కువమంది ఉంటే ఆ బాధ్యత పది రెట్లు పెరుగుతూనే ఉంటుంది. అందుకని, పిల్లలను ప్రేమించడం కంటే కూడా న్యాయంగా ఉండడటం ముఖ్యం. – దివ్యా మిట్టల్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సిడ్నీలో సమంత చిల్.. మాల్దీవుస్‌లో సాక్షి అగర్వాల్!
సిడ్నీ వైల్ట్ లైఫ్ పార్క్‌లో చిల్ అవుతోన్న సమంత..హీరోయిన్ శ్రద్దాదాస్ గ్లామరస్ పిక్స్...పింక్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హోయలు..మాల్దీవుస్ వీడియోను షేర్ చేసిన సాక్షి అగర్వాల్..శారీలో టాలీవుడ్ యాంకర్ లాస్య మంజునాథ్ పోజులు..టీ గ్లాస్‌తో అను ఇమ్మానియేల్ అలాంటి లుక్.. View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
నలుపు అంటే శక్తి
నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.కట్ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్.‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్‌పై ఫేస్బుక్లో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.శారద 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.త్రివేండ్రం జిల్లా కలెక్టర్‌గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్‌గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు. వారి కామెంట్స్‌లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్బుక్ పోస్ట్‌లో పెట్టారు శారద. ఆ పోస్ట్‌పై మొదట్లో కొందరి కామెంట్స్ చూసిన తరువాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ‘మీ పోస్ట్ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్ చేశారు. రీ–షేర్ చేసిన తరువాత ఆమె పోస్ట్‌కు మద్దతుగా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్ కూడా ఉన్నారు.‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ -
మా ఇంటి గోడ దూకి వచ్చి నన్ను కొట్టి అసలు నిజాలు బయటపెట్టిన ప్రేమ్ కుమార్
-
లవ్ లెటర్లు తీసుకుంటా.. ల్యాండ్ లైన్ కాల్స్ లిఫ్ట్ చేస్తా: శ్రేయాంక (ఫోటోలు)
-
కూటమిపై ఇదెక్కడి మాస్ ట్రోలింగ్ మావా!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అని ఓ సామాన్యుడిని ఓ విలేకరి అడిగారు. ‘‘ఓ బ్రహ్మాండంగా ఉందిగా...’’ అన్నది అతడి సమాధానం!. ‘‘ఏ ఏ స్కీములు అందాయి’’ అనే రిపోర్టర్ ప్రశ్నకు వచ్చిన జవాబు.. ‘‘ఒకటేమిటి అన్నీ అందాయి కదా!’’ అని!!! ఇదేమిటి ఇలా అంటున్నాడని ఆ విలేకరి మరో ప్రశ్న వేశారు. ‘‘రైతు భరోసా కింద నిధులు వచ్చాయా?’’ అంటే, ‘‘నలభై వేలు వచ్చాయి..’’ అని సమాధానమొచ్చింది. ‘‘హామీ ఇచ్చింది రూ.ఇరవై వేలే కదా..’’ అని రిపోర్టర్ ఆశ్చర్యపోతే.. ‘‘అవునండి.. రైతులు కష్టాలలో ఉన్నారని కూటమి ప్రభుత్వం రూ.నలభై వేలు ఇచ్చిందిలే..’’ అని నిట్టూరుస్తూ చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆ విలేకరికి.. ఆ సామాన్యుడి చమత్కారం!కూటమి ప్రభుత్వంపై ప్రజల మాస్ ట్రోలింగ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఇక కొందరు పిల్లలు ‘‘నాకు పదిహేను వేలు, నాకు పదిహేను వేలు ఎక్కడ ముఖ్యమంత్రి గారూ’’ అంటూ అడిగిన వీడియో కూడా పాపులర్ అయింది. మరో వ్యక్తి పశువులను చూపుతూ ‘‘నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు’’ అంటూ మరో వీడియో చేశారు. కొందరు మహిళలు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి గతంలో చంద్రబాబు చెప్పిన డైలాగుల వీడియో ప్రదర్శించారు. అందులో ‘‘మీ చంద్రన్న డ్రైవర్ అయ్యాడు. మీరు ఏ బస్సైనా ఎక్కండి.. పుట్టింటికి వెళ్లండి.. లేదా పని చేసే చోటకు వెళ్లండి.. ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న పేరు చెప్పండి’’ అని చంద్రబాబు చేసిన ప్రకటన ఉంది. ఏపీలో ప్రభుత్వం ఎంత హేళనకు గురి అవుతుందో ఈ ఉదాహరణలన్నీ తెలియ చేస్తాయి. అయితే.. సమాధానం చెప్పవలసిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకుండా, ఇలా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోంది. పోలీసులు అలా మాట్లాడిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఏపీలో ప్రజలు అత్యధిక శాతం తాము చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతల చేతిలో మోసపోయామని, వారు చేసిన వాగ్దానాలు నమ్మి దెబ్బతిన్నామని, రెండికి చెడ్డ రేవడి అయ్యామని బాధ పడుతున్నారు. ఈ దశలో శాసనసభ్యులు మాత్రం తమ సాంస్కృతిక కార్యక్రమాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై స్కిట్లు వేస్తూ తమ కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. జగన్ పేరు నేరుగా చెప్పకపోయినా అగౌరవంగా సంభోధిస్తూ.. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు డైలాగులు చెప్పారు. ఆ క్రమంలో.. ‘‘లే..లే..నా రాజా..’’ అంటూ ఓ ఐటెమ్ సాంగ్‌ను పాడుకుని వెకిలి ఆనందం పొందారు. వారిద్దరూ ఏదో పిచ్చి స్కిట్ వేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు పడి, పడి నవ్వుకుంటూ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్లినా నవ్వు ఆపుకోలేనని చెప్పారు. తోటి ఎమ్మెల్యేలపై ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా నీచంగా ప్రదర్శనలు చేయవచ్చా? అనేది చాలామందికి వచ్చిన డౌటు. అందులో హాస్యం కన్నా వెకిలితనం ఎక్కువగా ఉందన్నది విశ్లేషకుల వ్యాఖ్య. 👉చిత్రం ఏమిటంటే.. ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడి వారిలో వారు సంతోషపడుతున్నారు కాని, ఎన్నికలకు ముందు నిజంగానే డ్రామాలు ఆడారు. ప్రజలను మాయ చేశారు. ఎక్కడలేని వాగ్దానాలు చేసి ప్రజలను బోల్తా కొట్టించామన్న ఆనందంలో కూటమి ఎమ్మెల్యేలు ఉండవచ్చు. కానీ ప్రజలు వీరి వికృత విన్యాసాలను జ్ఞప్తికి తెచ్చుకుని నిజంగానే వీరిని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. శాసనసభలో ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ తామిచ్చిన హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. గతంలో తాము ఇంటింటికి తిరిగి మరీ బాండ్లు పంచిన ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు ఆత్మ అనేది ఉంటే వాటిని గుర్తు చేసుకోవాలి. 👉ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మాట్లాడుతూ తల్లికి వందనం స్కీము అమలు చేసేస్తున్నామనే భావన కలిగేలా మాట్లాడిన వీడియో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలు ఎందరు ఉంటే అందరికి డబ్బులు ఇస్తున్నామని, పిల్లలు సంపాదించుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ఆయన కుమారుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ చట్టసభలో మాట్లాడుతూ లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో తగ్గారని ఒక నిజాన్ని వెల్లడించారు. దానికి జగన్ ప్రభుత్వ విధానాలు అనే ఒక అబద్దాన్ని జత చేశారు. అంతే తప్ప తాము తల్లికి వందనం,తదితర పధకాలను హామీ ఇచ్చిన విధంగా అమలు చేయలేకపోతున్నామని మాత్రం చెప్పలేకపోయారు. 👉జగన్ టైమ్ లో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్న విషయం మర్చిపోయి ఉండవచ్చు. కాని ఈ మద్య ఒక వీడియో వచ్చింది. పొలంలో కూలి పని చేసుకుంటున్న ఒక మహిళ ఒక బాలికను చూపుతూ.. డబ్బులు లేక స్కూల్ మాని పొలం పనికి వస్తోందని చెప్పింది. ఈ దృశ్యం హృదయ విదాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో చేసిన బాసలను అధినేతలకు గుర్తు చేస్తూ స్కిట్లు ప్రదర్శించి ఉంటే బాగుండేది. లేదా మరో పని చేసి ఉండాల్సింది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఎలాంటి స్పీచ్ లు ఇచ్చింది.. ప్రజలను ఎలా బోల్తా కొట్టించింది.. అన్న అంశాలపై నాటికలు ప్రదర్శించి ఉంటే చాలా రక్తి కట్టేవేమో! తాము ఎలా ప్రజలను మోసపూరిత హామీలతో నమ్మించింది చెప్పే స్కిట్లను వేసుకుని ఉండాల్సింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎంతెంత ఇచ్చేది లెక్కలు వేసే చెప్పారు కదా. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి పొట్టగొట్టమని, పదివేలకు గౌరవ వేతనం పెంచుతామని అధినేతలు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని సంబంధిత డ్రామాలు ప్రదర్శించుకుని ఉంటే అర్థవంతంగా ఉండేవేమో! లేదా ఆ వీడియోలను తెరపై ఒక్కసారి వేసుకుని చూసుకుని ఉంటే తెగ నవ్వు వచ్చేది కదా!. 'నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు.." ఇది ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ రోజుల్లో ఇంటింటికి సైకిల్ వేసుకుని వెళ్లి మహిళలు, పిల్లలందరిని కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా కబుర్లు చెప్పి వచ్చారు. అలాగే యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా..మీకు పద్దెనిమిది వేలు.. వలంటీర్ల దగ్గరకు వెళ్లి మీకు నెలకు పది వేలు ఖాయం అంటూ ఎన్నికల మానిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు. అంతేకాదు..ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీ అమలు పరుస్తామని, ఆ తర్వాత వలంటీర్లు తనకు స్వీట్లు, పూతరేకులు తెచ్చి తినిపంచాలని కూడా కోరారు.ఆ సన్నివేశం ఒక్కటి చాలు బాగా పండడానికి. ఆ వీడియోలను చూసుకుని ఉంటే వారంత కడుపారా నవ్వుకునే వారేమో! .చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి మీకు ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఇదే విధంగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేవారు. ఎమ్మెల్యేలు పిల్లలు కనమంటున్న చంద్రబాబుకు సంబంధించి స్కిట్ వేసినట్లున్నారు కాని, ఆ పిల్లలకు తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టిన సంగతి మాత్రం చెప్పలేదు. సాంస్కృతిక ప్రదర్శనలో కొంతమంది వికృత విన్యాసాలకు బాగా సంతోషించిన పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు. పిఠాపురం సభలో.. తనవల్లే టీడీపీ నిలబడిందని స్పీచ్ ఇచ్చినా, ఇక్కడ మాత్రం కారణం ఏమైనా, చంద్రబాబు మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగాలని అంటూ పవన్ తన విధేయత ప్రదర్శించారు. చంద్రబాబు నుంచి చాలా నేర్పుకున్నానని ఆయన చెబుతుంటే బహుశా పరిపాలన కన్నా, ఇలా అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా నమ్మించవచ్చు..ఆ తర్వాత ఎలా ఎగవేయవచ్చన్నది బాగానే నేర్చుకున్నారన్న భావన ఏర్పడుతోంది. సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వంపై వేస్తున్న ఛలోక్తులు సహజంగా ఉంటే.. ఎమ్మెల్యేల స్కిట్లు మాత్రం కృత్రిమంగా ఉన్నాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి
ప్రేమ, పెళ్లి అనేవి క్షణికమైన బంధాలుగా మారిపోతున్న వేళ పవిత్రమైన ప్రేమకు, వివాహ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో జంట. 64 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. అదీ మనవరాళ్ల మధ్య. గుజరాత్‌కు చెందిన ఈ జంట వివాహ వేడుక నెట్టింట పలువుర్ని ఆకట్టు కుంటోంది. 80 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన అందమైన జంట లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.1961 నాటి ప్రేమకథ1961 సంవత్సరం అది. అసలు ప్రేమ, అందులోనూ ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం లాంటి విషయాలను చాలా ఆశ్చర్యంగా చూసే సామాజిక కట్టుబాట్లు ఉన్న రోజులవి. కులాంతర వివాహాలన్న ఊసే లేదు. ఇవి ఆచరణాత్మకంగా నిషిద్ధం. ఆ రోజుల్లో హర్ష్, మృధు మధ్య ప్రేమ చిగురించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న జైన యువకుడు హర్ష్, బ్రాహ్మణ యువతి మృదుతో ప్రేమలో పడ్డాడు. పాఠశాలలో చిగురించిన ప్రేమ, ప్రేమ లేఖలతో మరింత బలపడింది. View this post on Instagram A post shared by The Culture Gully™️ (@theculturegully) యథాప్రకారం వీరి ప్రేమ గురించి తెలిసి ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. చర్చోపచర్చలు, తర్కాలు తరువాత కూడా తమ వాదన మీదే నిలబడ్డాయి ఇరుకుటుంబాలు. అటు కుటుంబం, ఇటు ప్రేమ వీటి రెండింటి మధ్యా ప్రేమనే ఎంచుకున్నారు. ఇద్దరూ సాహసమే చేశారు. ధైర్యంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కొత్త జీవితాన్ని వెదుక్కుంటూ ఇంటినుంచి పారిపోయారు.హర్ష్ -మృదు వివాహంకలిసిన ఈ రెండు హృదయాలకు..ఒకరికొకరే తోడు నీడు తప్ప మరెవ్వరూ అండగా నిలబడలేదు. పెళ్లి వేడుక లేదు, పెద్దల ఆశీర్వాదాలు అసలే లేవు. అయినా పూర్తి నిబద్ధత, పట్టుదలతో సాదాసీదాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. సామాజిక సరిహద్దులను అధిగమించే ప్రేమ విలువను అర్థం చేసుకునేలా పిల్లలను పెంచారు. వారికి పెళ్లిళ్లు చేశారు. మనవరాళ్లతో కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కథను వింటూ పెరిగారు హర్ష్ మృదు పిల్లలు మనవరాళ్ళు. ఈ క్రమంలోనే ఇన్నేళ్లుగా వారి మదిలి మిగిలిపోయిన కోరిక గురించి తెలుసుకున్నారు. 64వ వార్షికోత్సవం సందర్భంగా, కనీవిని ఎరుగని విధంగా తామే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక అతిథులందరి చేత కంట తడిపెట్టించింది.సాధారణ 10 రూపాయల చీరలో భర్తచేత ఆనాడు తాళి కట్టించుకున్న మృదు ఇపుడు గుజరాతీ సాంప్రదాయంలో ఘర్చోలా చీర, గోరింటాకు, నగలతో అందంగా ముస్తాబైంది. ఆరు దశాబ్దాలకు పైగా తన భర్తగా ఉన్న వ్యక్తిని మరోసారి పెళ్లాడి భావోద్వేగానికి లోనైంది. పవిత్ర అగ్నిహోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, తొలిసారి కలిసిన ఈ జంట చేతులు మరింత దృఢంగా పెనవేసుకున్నాయి. జీవితాంతం పంచుకున్న ఆనందాలు , కష్టాలు, కన్నీళ్లను చూసిన వారి కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలునిజమైన ప్రేమ అంటే ప్రేమించడం మాత్రమే కాదు; జీవిత పయనంలో వచ్చే ప్రతీ సవాల్‌ను స్వీకరించడం, అంతే బలంగా దాన్నుంచి బయటపడటం. ఓరిమితో , ఒకరికొరు తోడు నీడగా సాగిపోవడం. ఏ సామాజిక కట్టుబాట్లను తాము తోసి రాజన్నారో, ఆ అవగాహనను, చైతన్యాన్ని తమబిడ్డల్లో కలిగించడం. ఇదే జీవిత సత్యం. వైవాహిక జీవితానికి పరిపూర్ణత అంటే ఇదే అని నిరూపించిన జంటను శతాయుష్షు అంటూ దీవించారు పెళ్లి కొచ్చిన అతిథులంతా.చదవండి: కొడుకుకోసం..చిరుతపైనే పంజా విసిరింది! -
Vishal- Nikki సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ గ్రాండ్ వెడ్డింగ్, ఫోటోలు వైరల్
-
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తన లేడీ లవ్‌తో ఏడడగులు వేశాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. అయితే అందరి పెళ్లి ఫోటోలను అత్యంత అందంగా తీసే ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు ఎవరు తీశారు అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. నిజమే కదా.. ఎవ్వరికైనా ఇలాంటి సందేహం రావడం సహజమే కదా? మరి ఇంకెందుకు ఆలస్యం.. అసలింతకీ ఎవరీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. వీరి బిగ్ డేకు సంబంధించిన ఫోటోలను బంధించింది ఎవరు? ఏమిటి? తెలుసుకుందాం.సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విశాల్ పంజాబీ ఒక ఇంటి వాడయ్యాడు. ప్రేయసి నిక్కీ కృష్ణన్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తద్వారా ఇటీవల బ్యాచిటర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్న సెలబ్రిటీల సరసన చేరాడు. మార్చి 23,ఇన్స్టాగ్రామ్ పేజీలో తన వెడ్డింగ్ ఫోటోలను పంచుకున్నాడు. ఎంతో ఆనందకరమైన వేడుకను విశాల్ స్నేహితుడు, మరో ప్రముఖ వివాహ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ బంధించడం విశేషం. అంతేకాదు తన స్నేహితుడు విశాల్ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలనుంచి పవిత్ర హోమం చుట్టూ ప్రదక్షిణలు దాకా, అనేక ఇతర వేడుకల ఫోటోలను అందమైన క్యాప్షన్లతో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం మరో విశేషం.ఇదీ చదవండి: Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్‘‘15 ఏళ్ల తన కరియర్లో చాలా తక్కువ సార్లుమాత్రమే తన సన్నిహితుల పెళ్లి వేడుకలను బంధించే అవకాశం లభించింది. అదీ పెళ్ళళ్లలో మాట్లాడే అవకాశం కేవలం రెండు సార్లు మాత్రమే. ఇపుడు నిక్కీ, విశాల్ ఫోటోలను తీయడం అదృష్టం . ఈ అవకాశం కల్పించినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు’’ అంటూ ఇన్‌స్టాలో ఒక నోట్ ద్వారా కొత్త జంటకు అభినందనలు తెలిపాడు.మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో వధూవరులు పెళ్లి కళతో కళ కళలాడిపోయాడు. హ్యాండ్లూమ్ పింక్ బనారసి బ్రోకేడ్ లెహంగా, పుదీనా ఆకుపచ్చ టిష్యూ దుపట్టాతో నిక్కీ కృష్ణన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించగా, విశాల్ పంజాబీ కాశ్మీరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చేసిన సాంప్రదాయ ఓపెన్ షేర్వానీని ఎంచుకున్నాడు. ఫ్లేర్డ్ కుర్తా, వైడ్-బాటమ్ ప్యాంటు , క్యాస్కేడింగ్ డ్రేప్‌తో దీన్ని జత చేశాడు. రష్యన్ పచ్చలు, అన్ కట్ డైమండ్ జ్యుయల్లరీ, 18K బంగారంతో కూడిన ఇంపీరియల్ హెయిర్లూమ్స్తో కొత్త జంట అందంగా మెరిసిపోయారు.విశాల్-నిక్కీ లవ్ స్టోరీవిశాల్ పంజాబీ , నిక్కీ కృష్ణన్ గత ఏడాది జూన్ 2024లో లండన్‌లో క్రైస్తవ వేడుకలో వివాహం చేసుకున్నారు. నిక్కీ సోదరి వివాహంలో తాము మొదట కలుసుకున్నారు. ఆ పెళ్లికి విశాల్ ఫోటోగ్రాఫర్. ఆ సమయంలో వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే నిక్కీ లండన్‌కు చెందినది కావడంతో ఆరంభంలో వీరి ప్రేమకు కొన్ని ఇబ్బందులొచ్చాయి, మొత్తానికి తమ బంధం వివాహ బంధంగా బలపడింది. ఎవరీ జోసెఫ్ రాధిక్హై ప్రొఫైల్ పెళ్లిళ్లు అనగానే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ గుర్తొస్తాడు. బాలీవుడ్ పవర్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్, నయనతార విఘ్నేష్ శివన్, అలాగే అదితి రావు హైదరి, సిద్ధార్థ్ కలల వివాహ క్షణాలను బంధించిన ఘనత జోసెఫ్‌దే. అంతేకాదు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ల డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలు తీసింది కూడా జోసెఫ్. -
Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్
అందాల హీరోయిన్, తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఎథ్నిక్ వేర్లో అందంగా మెరిసిపోతున్న లుక్ ఫ్యాన్స్నువిపరీతంగా ఆకట్టుకుంటోంది. మిల్కీ బ్యూటీగా పాపులర్అయిన గులాబీ రంగు పువ్వుల డిజైన్‌తో ఉన్న శారీలో అందంగా మారిపోయింది. తాజాగా పింక్ శారీలో ఉండే ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కామెంట్లతో సందడి చేస్తున్నారు.తమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యాషన్స్టైల్ను చాటుకుంటూ ఉంటుంది. తాజాగా వేసవి వార్డ్‌రోబ్‌లో పూల చీర ఎందుకు అవసరమో తమన్నా లుక్ రుజువు చేసింది. స్టేట్మెంట్-మేకింగ్ బోర్డర్ సారీకి మెరిసిపోయేతన లుక్‌తో మరింత సొగసుదనాన్ని జోడించింది. పింక్కలర్ శారీలో మెరిసి పోతున్న ఆమెను ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ కంటే అందంగా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా శారీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేవతలా వుంది, వెరీ ప్రెటీ అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. (వెరైటీ ఇడ్లీ, చట్నీకూడా అదిరింది, ట్రై చేయండి!) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) అందమైన తన శారీ లుక్కు మ్యాచింగ్‌గా ముత్యాల ఆభరణాలను ఎంచుకుంది. రెండు పొరల ముత్యాల చోకర్ , సొగసైన స్టడ్లు అతికినట్టు సరిపోలాయి. ప్రొఫెషనల్ లాగా ఆమె ఎథ్నిక్ స్టైల్‌ను పూర్తి చేయడానికి ఓపెన్ వేవ్స్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు. కాగా అశోక్ తేజ దర్శకత్వంలో తమన్నా భాటియా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం 'ఒడెలా 2' (Odela 2) విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 17 రిలీజ్ అవుతోందంటూ తమన్నా ఇన్‌స్టాలో వెల్లడించింది. తమన్నా ప్రతిసారీ సాధారణం కంటే భిన్నంగా ఉండే దుస్తులతో ఆశ్చర్యపరుస్తుంటుంది. సాంప్రదాయ చీరలో అయినా, మోడ్రన్ దుస్తుల్లో అయినా, తన ఐకానిక్ స్టైల్‌తో ఆకట్టుకోవడం తమన్నా స్పెషాల్టీ. -
‘నాయక్ నహీ.. ఖల్నాయక్ హూ మై’.. రబ్రీ ఇంటి ముందు సీఎం నితీష్ పోస్టర్
పట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడు నెలలకు పైగా సమయం ఉంది. అయితే రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. కొన్ని రోజుల క్రితం సీఎం నితీష్ కుమార్ వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియోలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మౌనంగా ఉండకుండా సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ఆర్జేడీ నేతలు సీఎం నితీష్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. #WATCH | Bihar: Amid CM Nitish Kumar's National Anthem controversy, a poster targeting the Chief Minister comes up outside the residence of former Chief Minister and RJD leader Rabri Devi in Patna. The poster addresses him as "The Non Serious Chief Minister." pic.twitter.com/t6I5Sr1PPh— ANI (@ANI) March 23, 2025ఇప్పుడు పట్నాలోని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి ఇంటి వెలుపల సీఎం నితీష్‌కు సంబంధించి ఒక పోస్టర్ ప్రత్యక్షమైంది. ఈ పోస్టర్లో నితీష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రాశారు. ఈ పోస్టర్లో ‘నాయక్ నహీ.. ఖల్నాయక్ హూ మై’(నేను హీరోని కాదు విలన్‌ను’ అని రాసి ఉంది. అలాగే ఈ పోస్టర్లో నితీష్ కుమార్ మహిళలను, మహాత్మా గాంధీని, జాతీయ గీతాన్ని అవమానించారని కూడా ఆరోపించారు.ఇటీవల వెలుగు చూసిన సీఎం నితీష్ కుమార్ వీడియోను దృష్టిలో పెట్టుకుని శాసనసభ, శాసన మండలిలో ప్రతిపక్షాలు.. ముఖ్యమంత్రి జాతీయ గీతాన్ని అవమానించారంటూ గందరగోళం సృష్టించాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీరు దేశంలోని ప్రజల మనోభావాలను అపహాస్యం చేసినట్లుందని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అసెంబ్లీలో విమర్శించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
పట్టాలపై ఎస్‌యూవీని ఈడ్చుకెళ్లిన రైలు
సూరత్‌గఢ్: రాజస్థాన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. సూరత్‌గఢ్ థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలోని ఒక లెవెల్ క్రాసింగ్‌పై కేంద్ర పోలీసు బలగాలకు చెందిన ఎస్‌యూవీని ఒక రైలు బలంగా ఢీకొంది(Rajasthan Hits SUV). ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో ఎస్యూవీ కారులో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్)నకు చెందిన ముగ్గురు జవానులు ఉన్నారు. ఈ కారు పట్టాలపైకి చేరుకోగానే రైలు బలంగా ఢీకొని కొంత దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. దీనికి కారణమేమిటన్నదీ ఇంకా వెల్లడికాలేదు. అయితే సీసీటీవీ ఫుటేజీ(CCTV footage)లో ఉన్న దృశ్యాన్ని చూస్తే ఈ పట్టాల మీదుగా రైళ్ల రాకపోకలు సాగించే సమయంలో అటు రోడ్డు మీదుగా వచ్చే వాహనాలను నిలువరించేందుకు ఎటువంటి గేటు లేదు. 📍Rajasthan | #Watch: An SUV of a central police force was rammed by a train at a level crossing near Suratgarh Super Thermal Power Plant in Rajasthan.CCTV footage of the accident has gone viral on social media.Local reports said there were three personnel of the Central… pic.twitter.com/Zw7GiJbd51— NDTV (@ndtv) March 22, 2025వీడియోను పరిశీలనగా చూస్తే ఎస్‌యూవీని నడుపుతున్న డ్రైవర్‌కు అటుగా రైలు వస్తున్న సంగతి తెలియలేదు. ప్రమాదాన్ని గుర్తించిన ఒక సీఐఎస్ఎఫ్ జవాను కారు నుంచి బయటకు దూకి పారిపోయారు. ఇంతలో రైలు ఆ ఎస్‌యూవీని ఢీకొంది. కారులోని ఇద్దరు జవానులు బయటపడేంతలో ఆ రైలు వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆన్లైన్ గేమింగ్‌కు రూ. 3.26 కోట్ల ప్రభుత్వ సొమ్ము.. పంచాయతీ అధికారి అరెస్టు -
నమ్మకమే జీవితం.. ఆయనే ఉదాహరణ..
ఓనాడు స్కూల్లో పిల్లలందరినీ దగ్గరకు పిలిచిన టీచర్ తలా ఒక్కో అరటిపండు ఇచ్చి ఎవరు చూడని చోటకు వెళ్లి తినేసి రండి అన్నారట. పిల్లలందరూ తినేసి వట్టి చేతులతో వచ్చి.. ఎవరు చూడకుండా తినేసాను మాస్టర్ గారు అన్నారట. కానీ స్వామి వివేకానంద మాత్రం అదే అరటిపండు వెనక్కి తెచ్చి నిలబడ్డారు. అదేంటి నరేంద్ర నువ్వు ఎందుకు తినలేదు ఆ మూలకు వెళ్లి తినొచ్చు కదా అన్నారంట టీచర్ గారు.. ఎవరూ లేని చోటుకి నేను వెళ్ళలేదు టీచర్ గారు.. ఎవరికి కనిపించిన చోటు అంటూ ఉండదు.. ఎవరు చూడకపోయినా మనం చేసే ప్రతి పని ప్రతి కర్మను భగవంతుడు చూస్తుంటాడు.. అందుకే నేను ఆయన కళ్ళుగప్పి తినలేకపోయాను.. ఇదిగోండి మీ అరటిపండు అంటూ తెచ్చి ఇచ్చేసాడట. అంటే ఎవరికీ కనిపించకపోయినా నమ్మకం, విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది.. అదే ఈ జీవితాలను నడిపిస్తుంది..ఓ పసి పిల్లాడ్ని గోడ ఎక్కించి మనం కింద నిలబడి దూకేయిరా చిన్నా నేను పట్టుకుంటాను అని చేతులు చాచిన మరుక్షణం ఆ చంటోడు ఒక్క క్షణం జాగు చేయకుండా నవ్వుతూ చటుక్కున దూకేస్తాడు. వాడికి తండ్రి మీద ఉన్న నమ్మకం. నాన్న తనను జారిపోనివ్వడని.. పడిపోనివ్వడని.. తనను భద్రంగా పట్టుకుంటాడని విశ్వాసం. ఆ నమ్మకమే పిల్లాణ్ణి అంతెత్తు నుంచి దూకేలా చేసింది.. చేస్తుంది.అమ్మా గమ్మున జడ వేసేసి పౌడర్ రాయవే నాన్న వస్తారు.. నన్ను బయటకు తీసుకెళ్ళి జైంట్ వీల్ ఎక్కిస్తారు అని అల్లరి చేస్తోంది చిన్నారి. దానికి నాన్నంటే అంత నమ్మకం.. అందుకే స్కూలు నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫ్రెష్ గౌన్ వేసుకుని నాన్న కోసం గుమ్మంలో ఎదురుచూస్తోంది. ఒసేయ్ మీ నాన్న రాడు.. మార్చి నెల కదా ఆఫీసులో పని ఎక్కువ ఉంటుంది. ఇంకో రోజుంటే తీసుకువెళ్తాడులే అని అమ్మ చెబుతున్నా వినదు. దాని నమ్మకం దానిది. తనకు మాట ఇచ్చారంటే ఆఫీస్ పని వాయిదా వేసి.. అవసరం అయితే ఆఫీసులో గొడవ పెట్టుకుని అయినా వస్తారనేది దాని నమ్మకం. అనుకున్నట్లే అరగంట ముందు వచ్చాడు నాన్న.. చిన్నదాని కళ్లలో మెరుపు.. చూశావా నాన్న నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పడు అంటూ బైక్ ట్యాంక్ మీద కూర్చుని అమ్మకు బై చెబుతూ తుర్రుమంది.. వెళ్తున్నంతసేపూ నాన్నతో అమ్మమీద కంప్లయింట్లు చెబుతోంది. నువ్వు రావన్నది నాన్నా . వస్తావని నేను చెబుతున్నా వినదే అంటున్నపుడు నా నమ్మకాన్ని నిలబెట్టావు.. నా మాట నెగ్గింది.. నెగ్గించావు నాన్నా అనే గర్వం ఆ చిన్నదాని మాటల్లో ప్రస్ఫుటిస్తూనే ఉంది.ఈసారి సరిగా వేయలేదు కానీ.. వచ్చే ఏడాది అప్రైజల్లో నీకు భారీ హైక్.. ప్రమోషన్ గ్యారెంటీ.. గట్టిగా పని చేయవయ్యా సుభాష్ అని చెబుతున్న మేనేజర్ మాటల్లోని దృఢత్వం సుభాష్ ను రేసు గుర్రంలా పరుగెత్తించింది. మేనేజర్ మాటంటే మాటే.. అదే నమ్మకం సుభాష్ తో మరింత ఎక్కువ పని చేయించింది.Amazing to see this. Shri Laddu Gopal shop in Jabapur - you pick what you like and pay. No shop boys/girls, no cashier.Even if you don't have money, you pick up what you want and pay when you can.Amazing we have such places even now. pic.twitter.com/I287IXsOJN— D Prasanth Nair (@DPrasanthNair) March 17, 2025కొన్నిసార్లు ఈ నమ్మకం మనల్ని ముంచేస్తుంది.. నీకెందుకు డార్లింగ్ మీ అమ్మ తాలూకు బంగారం డబ్బు పట్టుకుని వచ్చేయ్ ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం అని ప్రియుడు చెప్పిన మాటలు నమ్మి ఊబిలో చిక్కుకున్న అమాయకురాళ్లు ఎందరో.. ఈ సైట్ కొనండి సర్.. రెండేళ్లలో డబుల్ చేసి అమ్మెద్దాం అని బ్రోకర్ చెప్పగా నమ్మేసి ప్రభుత్వ భూమిని కొనేసి అడ్డంగా నష్టపోయినవాళ్ళూ ఉన్నారు. నమ్మకం అనేది ఒకొక్కరి జీవితంలో ఒక్కోలాంటి ఫలితాలను సూచిస్తుంది. దుష్యంతుడు తన వద్దకు మళ్ళీ వస్తాడు అనేది శకుంతల నమ్మకం.. కానీ శాపగ్రస్తుడైన ఆయన శకుంతలకు ఇచ్చిన మాట మర్చిపోతాడు. అది ఆమెకు ఎంతటి నష్టాన్ని కలగజేసిందో పురాణాల్లో చదవవచ్చు.ఇదంతా ఎందుకు చెప్పడం అంటే జబల్పూర్లోని లడ్డు గోపాల్ అనే వ్యక్తి స్వీట్ షాపులోని క్యాష్ కౌంటర్లో ఎవరూ ఉండరు. షాప్ తెరిచే ఉంటుంది.. సీసీ కెమెరాలు కూడా ఉండవు. ఎవరికి నచ్చిన మిఠాయి వాళ్ళు తీసుకుని కౌంటర్ మీద ఉండే డబ్బాలో డబ్బులు వేయడమే. మీరు వేశారా లేదా అనేది మీకు తెలుస్తుంది అంతే తప్ప దుకాణం యజమానికి తెలియదు.. చూడడు. అయితే, ఆ కౌంటర్ వద్ద చిన్ని కృష్ణుని విగ్రహం మాత్రం ఉంటుంది. మీరు చేసేవన్నీ ఎవరూ చూడకపోయినా ఆయన చూస్తూ ఉంటాడన్నమాట . ఆ నమ్మకంతోనే ఆ ఓనర్ ఆ షాపును అలా నిర్వహిస్తున్నారు. అదన్నమాట సంగతి.. నమ్మకమే జీవితం.-సిమ్మాదిరప్పన్న. -
మహిళలకు బీజేపీ మాజీ ఎంపీ వార్నింగ్.. మీ గొంతు నులిమేస్తా అంటూ..
కోల్కత్తా: బెంగాల్లో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. బీజేపీ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ సహనం కోల్పోయి స్థానిక మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో, బెంగాల్ మహిళలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బెంగాల్‌కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ శుక్రవారం ఖరగ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా ఖరగ్‌పూర్‌లోని వార్డు నంబర్-6లో జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు. అయితే, రోడ్డు ప్రారంభోత్సం సందర్బంగా దిలీప్ ఘోష్‌ను అక్కడున్న మహిళలు అడ్డగించారు. మేం ఇప్పుడు గుర్తొచ్చామా?. మీరు ఎంపీగా ఉన్నప్పుడు మా ఏరియాకు ఎందుకు ఒక్కసారి కూడా రాలేదని నిలదీశారు. రోడ్డును మా కౌన్సిలర్ ప్రదీప్ సర్కార్ నిర్మిస్తే మీరు వచ్చి ప్రారంభిస్తారా? అని ప్రశ్నించారు.మహిళల ప్రశ్నలకు దిలీప్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. వారితో వాదిస్తూ..‘ఈ రోడ్డు నిర్మాణానికి నేనే డబ్బులు ఇచ్చాను. మీ తండ్రి డబ్బులతో రోడ్డు వేయలేదు. కావాలంటే వెళ్లి ప్రదీప్ సర్కార్‌ను అడగండి’ అంటూ మండిపడ్డారు. ఆయన సమాధానానికి సదరు మహిళలు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. మరోసారి మహిళలు కల్పించుకుని.. మా నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?. ఎంపీ మీరు కదా.. రోడ్డు వేయాల్సింది కూడా మీరే అని అని నిలదీశారు. ఈ క్రమంలో పూర్తిగా సంయమనం కోల్పోయిన దిలీప్ ఘోష్ బెదిరింపులకు దిగారు. వెంటనే..‘అలా అరవకండి. అలా అరిస్తే మీ గొంతు నులిమేస్తా’ అని మహిళకు వార్నింగ్ ఇచ్చారు.ছিঃ! একজন মহিলাকে বিজেপি নেতা দিলীপ ঘোষ কিভাবে হুমকি দিচ্ছে, শুনে নিন! বিজেপির থেকে এর বেশি আর কিই বা আশা করা যায়? ধিক্কার বিজেপিকে!#ShameOnBJP #DilipGhosh #bjpwestbangal pic.twitter.com/JdGL4guhJc— Banglar Gorbo Mamata (@BanglarGorboMB) March 21, 2025అనంతరం, మహిళలకు, దిలీప్ ఘోష్ మధ్య తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో.. భద్రతా సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు దిలీప్ ఘోష్‌ను వెంటనే కారు ఎక్కించగా.. మహిళలు వాహనాన్ని చుట్టుముట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల మధ్యే ఘోష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. తాను పార్లమెంటేరియన్‌గా ఉన్న సమయంలోనే ఎంపీ లాడ్ ఫండ్ నుంచి ఈ రోడ్డుకు డబ్బు ఇచ్చానని వివరణ ఇచ్చారు. అయితే, మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై టీంఎసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. দিলিপ ঘোষেরা বাংলার মা বোনেদের কনো দিন সম্মান করেনি আর করবেও না, দেখুন ভিডিও টা, #DilipGhosh #BJPLeader #WestBengal #Kharagpur #exmp #foryoupage #banglaviral #highlighteveryone pic.twitter.com/EWSvjXjvTf— Belal Hossen🇮🇳 (@BelalHossen786) March 22, 2025 -
రెడ్ శారీలో విష్ణు ప్రియ.. యానిమల్ బ్యూటీ ప్యాషన్ లుక్!
బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ జ్యోతి పూర్వాజ్...రెడ్ శారీలో మెరిసిపోతున్న బిగ్‌బాస్ బ్యూటీ విష్ణు ప్రియ..భర్త నిక్ జోనాస్‌తో కలిసి ప్రియాంక చోప్రా చిల్..యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఫ్యాషన్ లుక్..ప్రకృతి పచ్చదనాన్ని ఆస్వాదిస్తోన్న బిగ్‌బాస్ ముద్దుగుమ్మ అశ్విని శ్రీ.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
ఇది ఓయో కాదు.. దూరం ప్లీజ్ : క్యాబ్ డ్రైవర్ నోట్ వైరల్
ప్రేమికులు ప్రైవసీ కోసం పార్క్‌లు, సినిమా థియేటర్లను వెతుక్కుంటారు. కాసేపు అచ్చిక బుచ్చికలు, మాటా ముచ్చట కావాలంటే ఇదొక్కటే మార్గం. ఆశ్చర్యకరంగా ఇపుడు ఈ జాబితాలో ప్రైవేట్ క్యాబ్‌లు కూడా చేరాయి. అటు భార్యాభర్తలకు కూడా మనసు విప్పిమాట్లాడుకునేందుకు ఇదో బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది హద్దు మీరనంతవరకు ఏదైనా బాగానే ఉంటుంది కానీ మరికొంతమంది మితి మీరుతున్నారు. తాజాగా ఒక క్యాబ్ డ్రైవర్ పెట్టిన నోటు దీనికి ఉదాహరణగా ని లుస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్అవుతోంది. తన క్యాబ్‌లో ప్రేమికుల వ్యవహారాలతో విసిగిపోయాడో ఏమోగానీ బెంగళూరు క్యాబ్ డ్రైవర్ తన కారులో ఒక నోట్ పెట్టాడు. జంటలను నో రొమాన్స్.. దూరంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి ఒకరికొకరు దూరం పాటించాలని హెచ్చరించారు. "హెచ్చరిక!! నో రొమాన్స్.. ఇది క్యాబ్, ప్రైవేట్ ప్లేసో, OYO కాదు.. సో దయచేసి దూరంగా, కామ్‌గా ఉండండి." అంటూ ఒక నోట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. ఆలోచన రేకెత్తించింది. డ్రైవర్ ముక్కుసూటి తనం తెగ నచ్చేసింది నెటిజనులకు. హ్హహ్హహ్హ.. పాపం ఇలాంటివి ఎన్ని చూసి ఉంటాడో అని ఒకరు, డ్రైవర్లను తలచుకుంటే జాలేస్తోంది. కొంతమంది జంటలు క్యాబ్‌లో గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం గురించి విన్నాను.. అని ఒకరు వ్యాఖ్యానించగా, కనీసం ఇంటికి లేదా హోటల్‌కు చేరుకునే వరకు వేచి ఉండండ్రా బాబూ మరొకరు వ్యాఖ్యానించారు. బెంగళూరులోని డ్రైవర్లు క్యాబ్‌లో ఏదైనా రొమాంటిక్ ప్లాన్లను పునరాలోచించుకునేలా చేసే విషయాలను చూశారు. ఇది పూర్తిగా భిన్నమైన పట్టణ జీవితం!" అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. భారతదేశ స్టార్టప్ రాజధాని బెంగళూరు నగరంలో మాత్రమే జరిగే ఇలాంటి ఉదంతాలు హైలైట్‌గా నిలుస్తాయి. ఆన్లైన్ మీమ్‌లకు కేంద్రంగా ఉంటాయి. -
తమన్‌ని అన్‌ఫాలో చేసిన రామ్ చరణ్..!
-
జిమ్‌లో నేషనల్ క్రష్ రష్మిక.. వింత డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ!
వారణాసిలో అనసూయ ప్రత్యేక పూజలు..ప్రత్యేక ఇంటర్వ్యూ ఫోటోలు షేర్ చేసిన శోభిత ధూళిపాల..వైట్ గౌనులో మిల్కీ బ్యూటీ హోయలు..బ్లూ శారీలో మెరిసిపోతున్న జ్యోతి పూర్వాజ్..జిమ్‌లో రష్మిక మందన్నా కసరత్తులు.. View this post on Instagram A post shared by Meghana S Shankarappa ✨ (@meghanasshankarappa_) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది!
ఐడియా ఉండాలే గానీ, వేస్ట్ నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకొంచెం క్రియేటివ్‌గా ఆలోచిస్తే ఎందుకూ పనికి రాదు అనుకున్న వాటి ద్వారా కోట్లకు పడగలెత్తవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే. ఇక అది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు అయితే ఇక తిరుగే లేదు.జపాన్‌లోని ఒసాకాకు చెందిన 38 ఏళ్ల హయాటో కవమురా ఇదే నిరూపించాడు. ఆయన బుర్రలో తట్టిన ఒక ఐడియా ఆయన జీవితాన్నే మార్చేసింది. పాడుబడిన ఇళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని రీమోడలింగ్ చేసి అందంగా తీర్చి దిద్దాడు. ఆ తరువాత వాటిని రెంట్‌కు ఇచ్చాడు. ఇలా ఎంత సంపాదించాడో తెలుసా? ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిది కోట్లు సంపాదించాడు.‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన వివరాల ప్రకారం..హయతో కవాముర అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి వివిధ ఆకారాల్లో నిర్మించిన ఇళ్లంటే మహా ఇష్టం. అంతేకాదు నగరంలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్లి పైనుంచి కింద ఉన్న వివిధ రకాలైన ఇళ్లను గమనిస్తుండేవాట. 200 పాతబడిన ఎవరూ పట్టించుకోని,శిథిలావస్థలో ఉన్న ఇళ్లు హయాటో కళ్ల బడ్డాయి. అంతే రంగంలోకి దిగాడు. వాటిని అందంగా మలిచి, వాటికి అద్దెకు ఇవ్వడం ద్వారా 8.2 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు.చిన్నప్పటి రియల్ ఎస్టేట్ పట్ల మక్కువ ఉండేది. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో తనకు డబ్బు లేకపోయినా, తన స్నేహితురాలితో డేటింగ్లో భాగంగా సందర్శించే వాడు. చదువు తరువాత జాబ్‌లో చేరాడు. అయితే సీనియర్ మేనేజ్మెంట్తో వివాదం రావడంతో సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలనే కోరిక పెరిగింది. ఉపాధి నుండి వైదొలగాలనే అతని కోరిక పెరిగింది. ప్రమోషన్లు సామర్థ్యంమీద ఆధారపడి ఉండవు, పై అధికారి మన్నలి ఇష్టపడుతున్నారా లేదా అనే దానిపై ఆధార పడి ఉంటుందని కవామురాకి అర్థమైంది రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే కవామురా సామర్థ్యం కూడా అతని విజయంలో కీలక పాత్ర పోషించింది. అతని సంబంధాలు ఇతరుల కంటే ముందుగా విలువైన ఆస్తి సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సాయపడ్డాయి. 2018లో, అతను తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన సొంత రియల్ ఎస్టేట్ సంస్థ మెర్రీహోమ్ను స్థాపించి ఘన విజయం సాధించాడు. మారుమూల, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను బాగు చేసి అద్దెకు ఇవ్వగలిగాడు. 23 సంవత్సరాల వయసులో, వేలంలో 1.7 మిలియన్ యెన్ (10.1 లక్షలు) కు ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. అద్దె ద్వారా ఆదాయం. రూ. 2 లక్షలు. రెండేళ్ల తరువాత దీన్ని రూ. 25.6 లక్షలకు విక్రయించాడు. “రాత్రికి రాత్రే ధనవంతుడవుతానని అస్సలు ఊహించలేదు. రియల్ ఎస్టేట్‌లో లాభాలు రావాలంటే అపెట్టుబడులకు దీర్ఘకాలికంగా ఉండాలి. దీనికి ఓపిక , జాగ్రత్తగా శ్రద్ధ అవసరం అంటాడు కవామురా. అతని దూరదృష్టి ప్రశంసలు దక్కించుకుంది. భవిష్యత్తులో గొప్ప ఫలితాలను సాధించే అవకాశాలున్నాయంటూ మెచ్చుకున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట సందడి చేస్తోంది. -
బీ అలర్ట్.. వారికి కఠిన చర్యలు తప్పవు: సజ్జనార్ హెచ్చరిక
బెట్టింగ్.. ఈ పేరు వింటేనే ఎంతోమంది జీవితాలు ఛిద్రమైన ఉదంతాలు గుర్తుకు వస్తాయి. బెట్టింగ్ యాప్‌లు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ వ్యసనంలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఉండగా.. యువత సైతం తప్పుడు దారిలో వెళ్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. దీంతో, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘యువత, ఎందరో బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రెటీలు ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకపోవడం మంచిది. యాప్‌ను ఎవరు ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి యాప్ వస్తున్నాయి అనేది చూడాలి. ఎవరు అప్లోడ్ చేస్తున్నారు అనేది పర్యవేక్షించాలి. ఈ యాప్స్ ద్వారా ఎవరు లాభం పొందారు అనేది కూడా విచారణ చేపట్టాలి. ఇలాంటి యాప్స్ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు.ఇలాంటి యాప్స్‌పై అవగాహన కల్పించాలి. ఇప్పటకే పలు విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. డిజిటల్ అరెస్ట్, బ్యాంక్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, ఓఎల్ఎక్స్ నేరాలు ఇలాంటివి అన్నీ గతంలో జరిగాయి. ప్రధాని మోదీ కూడా డిజిటల్ అరెస్ట్ మోసాలను వివరించారు. దీంతో, మోసాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే, బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అందరికీ అవగాహన కల్పిస్తే మోసాలు తగ్గిపోతాయి. మళ్లీ చెబుతున్నాను.. బెట్టింగ్ యాప్స్ వెళ్లకండి. జీవితాలను నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడకండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కదలికలు, ప్రవర్తనను గమనించాలి’ అని కోరారు.అలాగే, ప్రస్తుతం మార్కెట్లో వేలాది బెట్టింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటిని ప్రోత్సహించే యూట్యూబర్లను, ప్రచారకర్తలను నమ్మ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రికెటర్లు, సినీ స్టార్లు, టీవీ సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు కోసం ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. కష్టపడి పనిచేస్తేనే డబ్బు వస్తుందని, షార్ట్‌కట్ మార్గాల్లో డబ్బును ఆశిస్తే నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే యూట్యూబర్లను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సజ్జనార్ తెలిపారు. ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే ఉద్యమం ఊపందుకుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
అవును వాళ్లిద్దరికీ పెళ్లైంది : అదిరే స్టెప్పులతో పెళ్లి వీడియో వైరల్
మన దేశంలో పెళ్లి అంటే కేవలం వేడుక, ఆనందం మాత్రమేకాదు ఆడంబరం, ఆర్బాటం కూడా. ఎంత ఖర్చైనా పరవాలేదు విలాసవంతంగా మూడు ముళ్ల వేడుక పూర్తి కావాల్సిందే. ఇదీ నేటి ప్రజ తీరు. దీనికి తోడు ఇలాంటి వివాహ వేడుకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం క్రేజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అంటే ముందుగా గుర్తొచ్చే నెటిజన్లు కమెంట్లే గదా. తాజాగా ఒక పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.అయితే ఈ పెళ్లి వెనుక విశేషం ఇదే అంటూ ఇంటర్నెట్ యూజర్లు కమెంట్లతో హోరెత్తించారు. ఇంతకీ విషయం ఏమిటంటే.ఈ వైరల్ వీడియోలో వధువు గ్రాండ్ జర్జోజీ వర్క్‌తో తయారైన మెరూన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. డబుల్ దుపట్టాలతో మరింత అందంగా కనిపించింది.ఆకర్షణీయమైనమేకప్, చోకర్,నెక్లెస్‌లు,చెవిపోగులు ఇలా సర్వహంగులతో పెళ్లికూతురి లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తోంది. మరోవైపు, వరుడు కూడా ఐవరీ కలర్ షేర్వానీలో బాగానే తయారయ్యాడు. ఇద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తారు. మరీ ముఖ్యంగా పెళ్లి కూతురు చాలా ఉత్సాహంగా స్టెప్పులేసింది. అటు 40 ఏళ్ల పెళ్లి కొడుకుగా సిగ్గుపడుతూ ఆమెతో జత కలిశాడు. View this post on Instagram A post shared by mayank Kumar Patel (@mayank_kumar_patel473)అసలు స్టోరీ ఇదట! వరుడు వయసు 46, వధువు వయసు 24.తనకంటే పదహారు సంవత్సరాలు పెద్దవాడిని సంతోషంగా వివాహం చేసుకుంది. వయసులో చాలా తేడా ఉన్నా కూడా ఆమె ఆనందంగా కనిపిస్తోంది. వరుడు గవర్నమెంట్ టీచర , సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగం అందుకే ఇలా అంటూ గత ఏడాది డిసెంబరులో చేసిన పోస్ట్‌లో వెల్లడించింది. వీడియో అప్లోడ్ కాగానే కమెంట్ సెక్షన్‌ను నెటిజన్లు చమత్కారాలు, వ్యంగాలతో నింపేశారు. కొంతమంది పెళ్లి కొడుకు వయస్సును ఎగతాళి చేయగా, మరికొందరు గవర్నమెంట్ ఉద్యోగం బాబూ అని వ్యాఖ్యానించారు. పెళ్లి చేయాలంటే అందం, కులంతోపాటు, వయసు, హోదాకూడా పరిశీలిస్తారు పెద్దలు సాధారణంగా. సమయాన్నిబట్టి, తమ సౌలభ్యాన్ని వీటిల్లో అనేక మినహాంపులతో పెళ్లిళ్లు జరిగిపోతాయి. దాదాపు వీరంతా చాలా హ్యాపీగా జీవితాలను గడుపుతూ ఉంటారు. అయితే సోషల్ మీడియా యూజర్లు మాత్రం, చమత్కారాలతో, మీమ్స్ సందడిచేస్తూనే ఉంటారు. ‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు’ అన్న సామెత వీళ్లు అసలు పట్టించుకోరు. -
సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరమంటే ఎలా?: ఏపీ హైకోర్టు
-
సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరమంటే ఎలా?: హైకోర్టు
సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయి? బీఎన్ఎస్ సెక్షన్–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలం? సోషల్ మీడియా పోస్టులను మెటీరియల్ బెనిఫిట్ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేం. – పోలీసులను ఉద్దేశించి హైకోర్టు సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయని హైకోర్టు పోలీసులను బుధవారం ప్రశ్నించింది. భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) సెక్షన్–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయో చెప్పాలంది. పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలమో చెప్పాలంది. ప్రస్తుత కేసులో నిందితులు ఓ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, దీన్ని పర్‌సెప్షనల్ బెనిఫిట్ (అనుభూతి ద్వారా పొందే ప్రయోజనం)గా భావించగలమే తప్ప.. మెటీరియల్ బెనిఫిట్ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేమంది. సోషల్ మీడియా పోస్టుల ద్వారా పిటిషనర్లు ఏ విధంగా ఆర్ధిక, వస్తు తదితర రూపేణ ప్రయోజనం పొందారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వీటన్నింటిపైనా స్పష్టతనివ్వాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పోలీసులు వేర్వేరుగా నమోదు చేసిన పలు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇన్చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను జస్టిస్ విజయ్ బుధవారం విచారించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా పిటిషనర్లు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు. -
Sunita Williams: భూమి మిమ్మల్ని మిస్ అయ్యింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్ బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష నౌకలో లోపం కారణంగా, వారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగివచ్చిన వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు స్వాగతం పలుకుతూ ‘భూమి ఇన్నాళ్లూ మిమ్మల్ని మిస్ అయ్యింది’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ(Prime Minister Modi).. తాను సునీతా విలియమ్స్‌తో పాటు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఇలా రాశారు ‘స్వాగతం, #Crew9! భూమి మిమ్మల్ని మిస్ అయింది. ఇది సహనం, ధైర్యం, అపరిమిత మానవ స్ఫూర్తికి పరీక్ష. సునీతా విలియమ్స్, #Crew9 వ్యోమగాములు పట్టుదల అంటే ఏమిటో మనకు మరోసారి చూపించారు. వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. అంతరిక్ష పరిశోధన అంటే మానవ సామర్థ్య సరిహద్దులను అధిగమించడం. కలలు కనే ధైర్యం.. ఆ కలలను నిజం చేసే ధైర్యం కలిగి ఉండటం. సునీతా విలియమ్స్ ఒక ట్రైల్బ్లేజర్(ఆవిష్కర్త).. తన కెరీర్ మొత్తంలో ఈ స్ఫూర్తిని ప్రదర్శించిన ఐకాన్. ఆమె సురక్షితంగా తిరిగి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ చూసి చాలా గర్వపడుతున్నాను. ఖచ్చితత్వం, అభిరుచిని కలగలిస్తే.. సాంకేతికత పట్టుదలను కలబోస్తే ఏమి జరుగుతుందో ఆమె నిరూపించారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Welcome back, #Crew9! The Earth missed you. Theirs has been a test of grit, courage and the boundless human spirit. Sunita Williams and the #Crew9 astronauts have once again shown us what perseverance truly means. Their unwavering determination in the face of the vast unknown… pic.twitter.com/FkgagekJ7C— Narendra Modi (@narendramodi) March 19, 2025సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యోమగామి. ఆమెకు ఇది మూడవ అంతరిక్ష ప్రయాణం. సునీత ఇప్పటివరకు మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. సునీత 1965, సెప్టెంబర్ 19న ఒహియోలోని యూక్లిడ్లో జన్మించారు. అతని తండ్రి దీపక్ పాండ్య గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని ఝులసన్కు చెందినవారు. అత్యధికంగా అంతరిక్షంలో నడిచిన మహిళగా విలియమ్స్ రికార్డు సృష్టించారు. సునీతా విలియమ్స్ 2007,2013లలో భారతదేశాన్ని సందర్శించారు. 2008లో సునీతకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సునీతా విలియమ్స్ కు ఒక లేఖ రాస్తూ, ఆమెను భారత పుత్రిక అని అభివర్ణించారు. ప్రధాని మోదీ సునీతను ఈ లేఖలో భారత్‌కు రావాలంటూ ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: Sunita Williams: నాటి సెల్ఫీని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా -
బిల్డర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొందరు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ.. బిల్డర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. వీరంటే జీహెచ్ఎంసీ సిబ్బంది వణికిపోతున్నారని, అందరూ కూర్చుని కాంప్రమైజ్ అవుతుండడంతో.. అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. శాసనసభలో మంగళవారం జరిగిన జీరోఅవర్‌లో ‘దానం’మాట్లాడారు. తన ప్రమేయం లేకుండా.. తన నియోజకవర్గంలోని ఈద్గా మైదానంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. దీంతో తాను వెళ్లి.. సబ్ స్టేషన్‌కు వేసిన పునాదులను కూల్చివేశానన్నారు. తన క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరినా కేటాయించడం లేదని ‘దానం’ విమర్శించారు. » అంబర్‌పేటలో రూ.400 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మించగా, సీఎంకు సమయం లేక ఇంకా ప్రారంభించలేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఫ్లైఓవర్‌కు సమాంతరంగా సర్వీసు రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మూసారాంబాగ్ ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడకన సాగుతోందని, వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ 15 నెలలుగా తమ నియోజకవర్గాల్లో ఎలాంటి పనులకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. » ఎల్బీనగర్ నియోజకవర్గంలో హుడా ఆమోదించిన లేఅవుట్లో 44 కాలనీలు ఏర్పాటు కాగా, ఆ తర్వాత ఆ స్థలం ప్రభుత్వానిదని పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు ఆపేశారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 118 కింద ఈ స్థలాలను క్రమబద్దికరించి కన్వేయన్స్ డీడ్స్ జారీ చేసిందని చెప్పారు. ఎన్నికలు రావడంతో కొందరికి ఇవ్వలేకపోయిందన్నారు. మిగిలిన వారికి సైతం కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడంతో పాటు నిషేధిత జాబితాల నుంచి ఈ స్థలాలను తొలగించాలని కోరారు. ఈ సమస్యను గతంలో సైతం తన దృష్టికి తీసుకువచ్చారని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బదులిచ్చారు. » నగరంలోని బస్తీ దవాఖానాల్లో వైద్యులు, అత్యవసర మందులు లేవని యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తెలిపారు. రక్త పరీక్షలు సైతం జరపడం లేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు బస్తీ దవాఖానాలకు ప్రజలు ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలానికి తక్షణమే ఎన్వోసీ జారీ చేయాలని జీహెచ్ఎంసీని కోరారు. » ప్రకాశ్‌నగర్, ఇతర కాలనీల ప్రజలు అటవీ భూముల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని, వారికి పట్టాలు ఇవ్వాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. » తన నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.15 కోట్లు రావలసి ఉండగా, ఇవ్వడం లేదని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మెట్పల్లి ఆస్పత్రి నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వాలని కోరారు. మునిపేటలో రుణమాఫీ జరగని 330 మంది రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తే అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. » నాగర్‌కర్నూల్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం నిర్మించాలని, సాంకేతిక విద్య కళాశాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కె.రాజేశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. » సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల మధ్య ఉన్న తన నియోజకవర్గం.. గత బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని మానకొండూరు ఎమ్మెల్యే కె.సత్యనారాయణ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆట పాటలు, ఎగరడం, దూకడానికే పరిమితమయ్యారని, నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించగా, బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. కేవలం 24 ఎకరాలు సేకరిస్తే 10వ ప్యాకేజీ పనులు పూర్తయ్యేవని, బాలకిషన్ ప్రజలను రెచ్చగొట్టి పనులు జరగకుండా చేశారని ఆరోపించారు. సత్వరం భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. » ఆసిఫాబాద్ నియోజకవర్గం ఉండి గ్రామంలో రూ.8.5 కోట్లతో మంజూరైన వంతెన నిర్మాణ అంచనాలు రూ.14.4 కోట్లకు పెరిగాయని, నిధులు మంజూరు చేసి సత్వరం పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి విజ్ఞప్తి చేశారు. లక్మాపూర్ వంతెనను కూడా పూర్తిచేయాలని, ఆసిఫాబాద్ నుంచి అస్మాపూర్ వరకు రోడ్డు వేయాలని కోరారు. » నారాయణపేట నియోజకవర్గం కోయిల్‌కొండ నియోజకవర్గంలో బీసీ వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధన్వాడలో డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. » నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన 396 ఇళ్లతో పాటు నిర్మాణం ఆగిపోయిన 252 ఇళ్లను పూర్తిచేసి లబ్దిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే డి.సూర్యనారాయణ గుప్తా విజ్ఞప్తి చేశారు. » మిర్యాలగూడను స్పెల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండగా, విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. -
గ్రోక్ vs చాట్‌జీపీటీ: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్..
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న సమయంలో గూగుల్, మెటా, ఓపెన్ఏఐ వంటివి సొంత చాట్‌బాట్స్ ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే.. మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) గ్రోక్ ప్రవేశపుట్టింది. ఇది ఇప్పటికి అందుబాటులో ఉన్న ఇతర ఏఐ చాట్బాట్ల కంటే భిన్నమైన సమాధానాలు ఇస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.గ్రోక్ ఏఐ కొంత దురుసుగా ప్రవర్తించడం చేత.. సోషల్ మీడియాలో నెటిజన్లు గ్రోక్ vs చాట్‌జీపీటీలను పోలుస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో హాస్యాస్పద చిత్రాలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి.చాట్‌జీపీటీ ప్రతి అంశానికి.. సామరస్యమైన సమాధానాలు ఇస్తుంటే, గ్రోక్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు బూతులు తిడుతోంది. ఆ బూతులు కాస్త నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఎక్కువమంది గ్రోక్‌ను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.ChatGPT Grok pic.twitter.com/LmuyqO0gsV— Dr Gill (@ikpsgill1) March 15, 2025ChatGPT Grok pic.twitter.com/CcqPZA2PDt— rozgar_CA (@Memeswalaladka) March 15, 2025చాట్‌జీపీటీ (ChatGPT)చాట్‌జీపీటీ అనేది ఓపెన్ఏఐ రూపొందించిన.. చాట్‌బాట్. ఇది ప్రాంప్ట్‌ల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వ్యాసాలు రాయడం, కవిత్వం రాయడం, రెజ్యూమె రూపొందించడం, కొన్ని ఆరోగ్య సలహాలను ఇవ్వడం వంటివి చేస్తోంది. దీంతో ఎక్కువమంది దీనిని ఉపయోగిస్తున్నారు. అంటే ఇది ఒక పద్దతి ప్రకారం సమాధానాలు ఇస్తూ.. ఉపయోగకరంగా ఉంది.గ్రోక్ (Grok)ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) అభివృద్ధి చేస్తున్న చాట్‌బాట్ 'గ్రోక్'. ఇది కూడా అంశం ఏదైనా.. తనదైన రీతిలో సమాధానాలు ఇస్తుంది. ఎవరైనా తిడితే.. గ్రోక్ సైతం వెనకాడకుండా తిడుతుంది. దీంతో ఎక్కువమంది దీనివైపు ఆకర్శిస్తులవుతున్నారు.ChatGPT Grok pic.twitter.com/yVZeBCafBd— Narundar (@NarundarM) March 15, 2025Grok to Indian people pic.twitter.com/AIfrdngY2x— Sajcasm (@sajcasm_) March 15, 2025 -
ట్రూత్ సోషల్‌లో చేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ప్లాట్ఫామ్లో ప్రధాని నరేంద్ర మోదీ చేరారు. పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్తో మోదీ ఆదివారం సంభాషించారు. ఈ పాడ్‌కాస్ట్‌ను ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో వెంటనే షేర్ చేశారు. దీంతో సోమవారం మోదీ ట్రూత్ సోషల్‌లో అరంగేట్రం చేశారు. ‘ట్రూత్‌సోషల్‌లో చేరడం సంతోషంగా ఉంది. ఇక్కడ ఉద్వేగ భరిత గొంతులతో సంభాషించడానికి, రాబోయే కాలంలో మరింత అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొడానికి ఎదురు చూస్తుంటాను’ అని ప్రధాని మొదటి పోస్ట్‌లో పేర్కొన్నారు. మరో పోస్ట్‌లో.. ఫ్రిడ్మన్తో జరిగిన తన సంభాషణను పంచుకున్నందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నా మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు. నా జీవిత ప్రయాణం, భారతదేశ నాగరిక దృక్పథం, ప్రపంచ సమస్యలు, మరెన్నో అంశాలను నేను కవర్ చేశాను’ అని పేర్కొన్నారు. -
మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్ వైరల్
ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ జోరుగా నడుస్తోంది. ప్రముఖ్యంగా ఈ సీజన్లో చాలామంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. బ్యాచిలర్స్ జీవితానికి బై బై చెప్పేస్తున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ విపుల్ ధనాకర్ క్లబ్లో చేరారు. తన లేడీలవ్‌తో ఏడడుగులు వేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఈ జంటను అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.విలేన్గా పాపులర్ సింగర్ విపుల్ ధనాకర్. తాజాగా ( మార్చి 16)తన ప్రేయసి దివ్య దహియాతో వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం గురించి చాలా గోప్యంగా ఉండే, విలేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఈ సడన్ సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. "మా ఈ ప్రయాణం లోతు ఎంతో మాకు మాత్రమే తెలుసు మా కష్టాలు, బాధలు, అనుభవించిన, బాధ , ప్రేమ అన్నీ.. చివరకు ఇలా.. జీవితాంతం కలిసి పయనించబోతున్నాం’’ తన జీవితంలో ముఖ్యమైన రోజు గురించి వార్తను షేర్ చేశాడు. దీంతో కొన్ని అందమైన ఫోటోలను కూడా పంచుకున్నాడు.విలేన్,దివ్య దహియా పెళ్లిదుస్తుల్లో అత్యద్భుతంగా కనిపించారు. తెల్లటి, సిల్వర్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో రాయల్ లుక్‌తో అదిరిపోయాడు. ముత్యాల హారం, ముత్యాలు, కుందన్ కల్గితో అలంకరించిన తెల్లటి పగ్డితో, గడ్డంతో విలేన్ లుక్ మరింత ఎలివేట్ అయింది.ఇకవధువు దివ్య పాస్టెల్ పింక్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది. ఎంబ్రాయిడరీ స్కర్ట్, సరిపోలే బ్లౌజ్‌తో మహారాణిలా మెరిసిపోయింది. తలపై షీర్ దుపట్టా, క్లాసీగా కనపించింది. డైమండ్ నెక్లెస్, గ్యాజులు మ్యాచింగ్ చెవిపోగులు ,మాంగ్ టీకాతో లుక్‌ను మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అద్భుతంగా ఉన్నారు..దిష్టి తగిలేను జాగ్రత్త అంటూ నెటిజన్లు కొత్త జంటను అభినందించారు.గాయకుడిగా విలేన్ న్యూ ఢిల్లీకి విపుల్ దనాకర్ యూట్యూబ్‌లో తన మ్యూజిక్ వీడియోలకు బాగా ప్రాచుర్యం పొందాడు. 2018లో ‘ఏక్ రాత్’,చిడియా (2019) పాటలతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూత లూగించాడు.అలాగే సావన్, జవానీ లాంటి పాటలతోపాటు, కనికా కపూర్ తో పాడిన తాజా పాట ‘చురాకే’ మరింత ప్రజాదారణ పొందాడు. గాయకుడిగా, స్వరకర్తగా,రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ప్రయాణంలో చాలా కష్టపడ్డాను. ప్రతిదీ అర్థం చేసుకోవాలి, దర్శకత్వం , స్క్రీన్ ప్లే రాయాలి, ఎడిటింగ్ కంపోజింగ్, సాహిత్యం ఎలా రాయాలి వీటన్నింటిలోనూ పట్టు ఉండాలి,అప్పడేరాణిస్తాం అంటాడు విలేన్. View this post on Instagram A post shared by Vilen (@vilenofficial) -
సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డి అరెస్టు
సాక్షి గుంటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వేదింపుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం, పెదకాకాని స్టేషన్‌కి తీసుకుని వెళ్లకుండా గుంటూరు చుట్టూ తిప్పుతున్నారునోటీసు ఇవ్వకుండా ,కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోలీసుల అరెస్టు చేసి గుంటూరు చుట్టూ తిప్పుతూ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డిని పెదకాకాని పోలీసులు హింసిస్తున్నారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు మండిపడుతున్నారు. పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డికి 35(3) నోటీస్ ఇవ్వాలి ....లేకపోతే వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేస్తున్నారు. -
పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరిని ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు కాస్తా గురి తప్పి బెడిసికొట్టాయి. మిషిగాన్‌లో ఒక కార్యక్రమానికి ఆయన భార్యాసమేతంగా హాజరయ్యారు. తన భార్య అమెరికా సెకండ్ లేడీగా గొప్పగా బాధ్యతలు నిర్వర్తిస్తోందంటూ పొగడ్తలు కురిపించారు. పనిలో పనిగా..‘అయితే ఒక్కటి మాత్రం నిజం. నేనెంత అర్థంపర్థం లేని మాటలు మాట్లాడినా ఆమె నవ్వాల్సిందే పాపం! ఎందుకంటే చుట్టూ కెమెరాలుంటాయి! నవ్వుతూ నాతో శ్రుతి కలపాలి. మరో దారి లేదు’ అంటూ చెణుకులు విసిరారు.అయితే, ఆయన కామెంట్లు విమర్శలకు దారితీశాయి. తనకు సెన్సాఫ్ హ్యూమర్ అస్సలు లేదని వాన్స్ మరోసారి నిరూపించుకున్నారంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. చౌకబారు వ్యాఖ్యలతో భార్యను చీర్‌లీడర్‌గా చిత్రించారంటూ తూర్పారబడుతున్నారు. హాస్యం అనుకుని వాన్స్ చేసే కామెంట్లు ఎప్పుడూ ఇలాగే గురి తప్పుతూ ఉంటాయంటూ ఎద్దేవా చేశారు.Vance: Here's the thing. The cameras are all on; anything I say, no matter how crazy, she has to smile, laugh, and celebrate it. pic.twitter.com/KO36G1D7ju— Acyn (@Acyn) March 14, 2025ఇక, వాన్స్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా ఉష ఎప్పట్లాగే ఆయన వెనకాల నుంచుని నవ్వుతూ చూస్తుండిపోవడం విశేషం! గత ఉపాధ్యక్షునిగా వాన్స్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయనకేసి ఉష ఆప్యాయంగా, గర్వంగా, చిరునవ్వుతో చూస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. తెలుగు మూలాలున్న ఉష 2014లో వాన్స్‌ను పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు. వాన్స్ దంపతులు ఈ నెలాఖర్లో భారత్ రానున్నారు. సెకండ్ లేడీ హోదాలో ఉషకు ఇది తొలి భారత పర్యటన. Usha's gaze of pure admiration for her husband - her smile hasn't faded, and she's absolutely glowing! 💖 pic.twitter.com/kOW3xtyyte— 𝕍𝕚𝕠𝕝𝕒 𝕃𝕖𝕚𝕘𝕙 𝔹𝕝𝕦𝕖𝕤 (@ViolaLeighBlues) January 20, 2025 -
హోలీ డ్యాన్స్ చేస్తావా.. సస్పెండ్ చేయించమంటావా?
పాట్న: హోలీ వేడుకల సమయంలో డ్యాన్స్ చేస్తావా లేక సస్పెండ్ చేయించమంటావా అంటూ ఒక పోలీసును ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ బెదిరించడం వివాదం రేపుతోంది. మాజీ సీఎంలు లాలు ప్రసాద్, రబ్డీదేవీల పెద్ద కుమారుడు ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ అధికార నివాసం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి లాలు మాదిరిగానే హోలీ వేడుక సమయంలో పండగ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మద్దతు దారుల చొక్కాలను తేజ్ ప్రతాప్ చించివేశారు. అనంతరం స్కూటర్‌పై ‘పిల్లిమొగ్గల చిన్నాన్నకు హోలీ శుభాకాంక్షలు’అని పరోక్షంగా సీఎం నితీశ్‌కుమార్‌ను ఉద్దేశించి తన నివాసం చుట్టుపక్కల వీధుల్లో కేకలు వేస్తూ తిరిగారు. అదేవిధంగా, తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేదికపై సోఫాలో కూర్చుని.. ‘ఏయ్ పోలీస్.. దీపక్..ఇప్పుడు మేమొక పాట వేస్తాం. డ్యాన్స్ చేయాలి. లేదంటే నువ్వు సస్పెండ్ అవుతావ్. ఏమనుకోకు, ఇది హోలీ పండగ’ అని అక్కడే ఉన్న దీపక్ అనే కానిస్టేబుల్నుద్దేశించి అంటున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో, ఆ కానిస్టేబుల్ అక్కడి వారితో కలిసి కొద్దిసేపు డ్యాన్స్ చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. ‘తండ్రి మాదిరిగానే కుమారుడు కూడా. అప్పట్లో సీఎంగా లాలు చట్టాన్ని డ్యాన్స్ చేయించాడు. బిహార్‌ను జంగిల్ రాజ్‌గా మార్చాడు. ఇప్పుడు కుమారుడు అధికారంలో లేకున్నా, చట్టాన్ని, రక్షకులను డ్యాన్స్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి వారికి అధికారం ఇవ్వరాదు’ అని పేర్కొంది. VIDEO | A policeman was seen dancing on the instruction of RJD leader Tej Pratap Yadav during Holi celebration at his residence in Patna. #tejpratapyadav #Holi #Patna pic.twitter.com/oCIP0kL03r— Press Trust of India (@PTI_News) March 15, 2025 -
హద్దు మీరితే ఖబడ్దార్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘సోషల్ మీడియాలో భాష చూడండి. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం. లేదంటే ఒక్కడు కూడా బయట తిరగలేడు. హద్దు దాటితే ఊరుకోబోం. మీడియా మిత్రులు, మీడియా సంఘాలు.. మీరైనా చెప్పండి. జర్నలిస్టులు ఎవరో మీరే జాబితా ఇవ్వండి. జాబితాలో లేనివాడు జర్నలిస్టు కాడు. జర్నలిస్టు కానోడిని క్రిమినల్‌గానే చూస్తాం. క్రిమినల్స్‌కు ఎట్లా జవాబు చెప్పాల్నో అట్లానే చెప్తాం. జర్నలిస్టు ముసుగేసుకుని వస్తే.. ముసుగుతీసి ఒక్కొక్కడిని బట్టలూడదీసి కొడతాం, తోడ్కలు తీస్తా..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తాను సీఎం కురీ్చలో ఉన్నానని, అందువల్ల ఊరుకుంటానని అనుకుంటున్నారని.. కానీ ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నేనూ మనిషినే.. చీమూనెత్తురు ఉన్నాయి. నన్ను తిట్టిన తిట్లకు మీపేరు పెట్టుకుని చూడండి. నేను ఓపికతో ఉన్నా.. కేసీఆర్ మీ పిల్లలకు బుద్ధిచెప్పు.. హద్దు దాటితే, మాటజారితే అనుభవిస్తరు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. కోర్టుకు పోతే బెయిల్ వస్తుందని అనుకుంటున్నారు. అవసరమైతే చట్టాన్ని సవరిస్తాం. ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉప్పు పాతరేస్తం. చట్టపరిధిలో అన్ని చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాపై చర్చ పెట్టండి. పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బతింటుంది. దీనిపై చట్టం చేద్దాం. ఇది నా ఒక్కరి వేదన కాదు.. అందరి ఆవేదన. స్వీయ నియంత్రణతోపాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలి. ఒకరోజు దీనిపై చర్చ పెట్టాలి. సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఈ అంశంపై దృష్టి పెట్టాలి. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు ఆడుతారా? రాష్ట్రంలో కులగణనను 1931 తర్వాత ఇప్పుడు మేమే చేశాం. ఈ సర్వేలో 96.9 శాతం మంది పాల్గొన్నారు. మిగతావారి కోసం మరో అవకాశం ఇచ్చాం. కానీ బీఆర్ఎస్ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ కుటుంబం మొత్తం అబద్ధాలతోనే బతుకుతున్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకే కులగణనపై అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలపై జీఎస్టీ లేదని ఇష్టమున్నట్టు అబద్ధాలు ఆడుతారా? ప్రధాని మోదీకి చెప్పి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ వేయించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని కోరుతున్నాను. నామీద కోపం ఎందుకు ఉంటుంది? మేం తెలంగాణ సంస్కృతిని గౌరవించాం. తెలంగాణ తల్లిని సచివాలయం లోపల ప్రతిష్టించాం. నామీద అన్ని వర్గాలకు కోపం ఉందని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు, రైతులకు, యువతకు 15 నెలల్లోనే ఎన్నో చేశాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే కార్యక్రమం చేపట్టాం. రైతులకు రుణమాఫీ, రూ.500 బోనస్ ఇస్తున్నాం. యువతకు ఉద్యోగాలిస్తున్నాం. గ్రూప్స్ పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేస్తున్నాం. నామీద ఎందుకు కోపం ఉంటుంది? 15 ఏళ్లు పైబడ్డ వాహనాలు తిరగొద్దు హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 1,600 కొత్త వాహనాలు వస్తున్నాయి. ఇంటికి నాలుగు వాహనాలు ఉంటున్నాయి. దీనితో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, కొత్త రోడ్లు వేసినా పరిస్థితిలో మార్పు రాదు. ప్రజా రవాణాను పెంచుతున్నాం. కాలుష్యం నుంచి హైదరాబాద్‌ను కాపాడాలి. మరో ఢిల్లీ కాకుండా చూడాలి. నగరంలోని 3 వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను గ్రామాలకు పంపి.. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తం. 15ఏళ్లు పైబడిన వాహనాలను నగరంలోకి అనుమతించం. పరిశ్రమలను ఓఆర్ఆర్ ఆవలికి తరలిస్తాం. పాతబస్తీలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సూచన మేరకు లాల్‌దర్వాజా ఆలయం అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.20కోట్లు కేటాయిస్తున్నా. ఈ మేరకు జారీ చేసే జీవోలో అక్బరుద్దీన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేతల ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్ ‘‘రాష్ట్రంలో గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను సరఫరా చేసే పెడ్లర్లు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. డ్రగ్స్ విక్రయించే వారి ఇళ్లకు కరెంటు, నీటి సరఫరా నిలిపివేస్తాం. రూ.250 కోట్లు వెచ్చించి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్టం చేశాం. ఇటీవల దుబాయిలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పోస్టుమార్టం వివరాలన్నీ తెప్పించాం. డ్రగ్స్‌కు సంబంధించిన గుట్టంతా మా వద్ద ఉంది. స్కూళ్లలో డ్రగ్స్ వినియోగిస్తే ఆ స్కూల్ యాజమాన్యానిదే బాధ్యత. వారిపై కేసులు పెట్టాలని నిర్ణయించాం. లక్షలకొద్దీ ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లలో ఏం జరుగుతోందో, పిల్లల మానసిక స్థితి ఎలా ఉందో యాజమాన్యమే పర్యవేక్షించాలి. ప్రతి స్కూల్లో సైకాలజీ టీచర్‌ను తప్పనిసరిగా నియమించుకోవాలి. స్కూళ్లు, కాలేజీల వద్ద ప్రత్యేకంగా నిఘాపెడతాం.’’ -
‘సోషల్ మీడియా చాలా ఇబ్బందిగా మారింది’
హైదరాబాద్: తాను కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ బారిన పడ్డ మహిళనే అన్నారు తెలంగాణ మంత్రి సీతక్క. సోషల్ మీడియా ద్వారా తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని, సోసల్ మీడియా ఎఫెక్ట్‌ను సీఎం రేవంత్ సభలో మాట్లాడటం తమ అందరికీ చాలా రిలీఫ్ గా ఉందన్నారు సీతక్క. ఈరోజు(శనివారం) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.‘నా ఫోటోలు మార్ఫింగ్ చేసి.. మానసిక ఆవేదనకు గురి చేశారు. సోషల్ మీడియా పోస్ట్ లు కొన్ని సార్లు డీమోరల్ చేశాయి. మహిళలు రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టం.. అలాంటిది మేము ఈ స్థాయికి వస్తే మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. సోషల్ మీడియాను సోషల్ సర్వీస్ కోసం వాడుకున్న నేను.. అంతే ఇబ్బందులకు గురయ్యాను. సోషల్ మీడియాను బీఆర్ఎస్ అబద్ధాలకు వాడుతుంది. సోషల్ మీడియా కుటుంబాలను బజారుకీడుస్తుంది. బాడీ షేమింగ్, ఫోటోలు మార్ఫింగ్, అననివి అన్నట్లుగా చెప్తున్నారు. గత ఏడాది నుంచి ఇది ఎక్కువ అవుతుంది. అన్న చెల్లెల్లు చేతిలో చెయ్యి వేసుకున్నా.. మరోకరకంగా చూపుతున్నారు. సోషల్ మీడియాను మంచికి వాడాలి.. చెడు కు కాదు. కరోనా సమయంలో ఎంతో సర్విస్ చేసా.. దాన్ని కూడా సోషల్ మీడియాలో నన్ను విమర్శించారు. అబద్దాల పైనే బీఆర్ఎస్ నడుస్తుంది. అబద్ధానికి అర్థం బీఆర్ఎస్. ఏ రోజుకైనా నిజమే గెలుస్తుంది. సోషల్ మీడియా కట్టడి అవసరం. సోషల్ మీడియా ద్వారా మాపై బురద చల్లుతున్నారు....కడుక్కోవడం మా వంతు అవుతుంది’ అని సీతక్క వ్యాఖ్యానించారు. -
పాతికేళ్ల బంధం, ఒక్కసారి లే నేస్తమా : వైరల్ వీడియో
మనుషులైనా, జంతువులైనా మనసుంటుంది. అనుబంధాలు, అప్యాయతలు ఉంటాయి. అపురూపమైన ఆ అనుబంధం (Friendship) తెగిపోతే.. కలకాలం తోడునీడగా ఉన్న ఆత్మీయ నేస్తం.. అందనంత దూరం వెళ్లిపోతే.. మనుషులైతే గుండె పగిలేలా రోదిస్తారు. మరి మూగజీవి ఏం చేస్తుంది. మూగగానే రోదిస్తుంది. ఈ మాటలకు అక్షర సత్యం అనేలా ఒక వీడియో నెట్టింట పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది. అసలేంటీ కథ.. తెలుసుకుందాం..పాతికేళ్ల బంధాన్ని వీడిన శాశ్వతంగా కన్నుమూసిన తన భాగస్వామిని ఒక ఏనుగు (elephant) చలించి పోయింది. ఎలాగైనా దాన్ని తట్టి లేపాలని ప్రయత్నించింది. తొండంతో గుండెలకు హత్తుకోవాలని తపించిపోయింది. కానీ తనవన్నీ వృధా ప్రయత్నాలనీ, ఇకలాభం లేదని తెలిసి కన్నీరు పెట్టుకుంది. ఈ సమయంలో పశువైద్యులను దగ్గరకు రానీయలేదు.బాజా వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం జెన్నీ, మాగ్డా అనే ఏనుగులు రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో ఉండేవి. 25 సంవత్సరాలకు ఇవి రెండూ పార్టనర్స్‌గా ఉండేవి. వివిధ ఫీట్లు చేస్తూ జనాలను అలరించేవి. వయసుమీద పడటంతో సర్కస్ వర్క్‌నుంచి విముక్తి లభించింది. ఈ వారం జెన్నీ కన్నుమూసింది. దీంతో తన నేస్తం అలా నిర్జీవంగా పడి ఉండటం మాగ్డా తట్టుకోలేకపోయింది. దాన్ని లేపేందుకు విశ్వప్రయత్నం చేసింది. గంటల తరబడి దాని చుట్టూ తిరిగింది. కన్నీరు పెట్టుకుంది. ఆఖరికి వెటర్నరీ వైద్యులను కూడా దగ్గరికి రానివ్వలేదు. చివరికి జెన్నీకి కన్నీటి వీడ్కోలు(Mourns) పలికింది. ఇది చూసి సర్కస్ సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. వారు దృశ్యాలను రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు హృదయాలను తాకింది. ఏనుగు దుఃఖం చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు.😢💔 An elephant mourns her deceased friendIn occupied Crimea, the famous elephant Jenny passed away due to illness.Her companion, Magda, refused to let people approach for hours, hugging Jenny and staying by her side for a long time. pic.twitter.com/nY5FRJueHp— Based & Viral (@ViralBased) March 14, 2025 -
బలవంతంగా రంగులు పోస్తే.. వైరల్ వీడియోలు
దేశంలో హోలీ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సంబరాల్లో ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని ఆనందించారు. కొందరైతే ‘ఏమీ అనుకోకండి’ అంటూ ఎదుటివారిని ఆటపట్టిస్తూ వారిని రంగుల్లో ముంచెత్తారు. సోషల్ మీడియాలో హోలీకి సంబంధించిన లెక్కలేనన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని తెగనవ్వు తెప్పిస్తున్నాయి. 💀💀pic.twitter.com/Q3xav0qzeu— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025రంగు జల్లాడని ఫోను విసిరికొట్టి..సోషల్ మీడియాలో ప్ర్యత్యక్షమైన ఒక వీడియోలో ఒక యువకుడు మంచి దుస్తులు ధరించి నడుచుకుని వస్తుండగా, మరొక యువకుడు అతనిపై రంగులు కుమ్మరిస్తాడు. దీంతో ఆగ్రహంచిన ఆ వ్యక్తి తన సెల్ ఫోనును అతని మీదకు విసరడాన్ని చూడవచ్చు.Phone tod dia uncle ji ne😭 pic.twitter.com/l9FXBsGJZt— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025రంగుపడిందని..మరో హొలీ వీడియోలో ఒక యువతి కుర్చీలో కూర్చున్న అంకుల్‌పై వెనుక నుంచి రంగు పోస్తుంది. వెంటనే అంకుల్ ఆగ్రహంతో ఫోనును పగులగొడతాడు.Ladai pi kr bhang na kare….Happy Holi!!!#HappyHoli pic.twitter.com/B9PKRhW4C7— RV (@Dominus_vaibhav) March 14, 2025ఇరువర్గాల వివాదం @Dominus_vaibhav అనే యూజన్ ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో మద్యం మత్తులో హోలీ ఆడవద్దు అనే వ్యాఖ్యానంతో పాటు, రెండు గ్రూపులు గొడవ పడుతున్న ఒక సీన్ కనిపిస్తుంది.Holi is incomplete without KALESH pic.twitter.com/tNlR0iRKrW— JEET (@saadharan_ladka) March 14, 2025ఏదో జరిగిందిమరో వీడియోలో రెండు గ్రూపులు ఎందుకో గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను చూస్తే ఏదో జరిగింది అని అనిపించడం ఖాయం.Kalesh b/w Two Group of Men During holi celebration and a Kaleshi guy recording itpic.twitter.com/q6hsS8r3S0— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025హోలీలో కొట్టుకుంటున్నారుఇంకొక వీడియోలో దానిని రికార్డు చేస్తున్న వ్యక్తి హోలీలో కొట్టుకుంటున్నారని పెద్దగా అరుస్తూ చెప్పడాన్ని గమనించవచ్చు.😭😭 (Use-Headphones 🎧) pic.twitter.com/8VHeWSF12h— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025తాతకు కోపం వస్తే..ఈ వీడియోలో ఒక తాత దుకాణం ముందు కూర్చుని కనిపిస్తున్నాడు. ఇంతలో హోలీ ఆడుతున్న కొందరు యువకులు అతనిపై రంగులు చిలకరిస్తారు. దీంతో ఆయన ఆగ్రహిస్తూ, కర్రతో వారిని తరిమికొడతాడు.ఇది కూడా చదవండి: Bihar: హోలీ వివాదంలో జోక్యం.. పోలీసు అధికారి హత్య -
Vinisha Reddy: వైద్య వృత్తిని వదిలి ఐఏఎస్ వైపు
ప్రస్తుతం యువతను సోషల్ మీడియా గురించి అడిగితే.. రీల్స్ గురించి, షార్ట్స్ గురించి చెబుతారు.. కానీ అదే సామాజిక మాధ్యమాల్లో ఒకటైన యూట్యూబ్‌ను వినియోగించుకుని గ్రూప్స్‌లో టాపర్‌గా నిలిచింది ఆ యువతి. ప్రతి నిమిషం అదే లక్ష్యంతో ఏకాగ్రతగా నిర్ధేశిత ప్రణాళికతో ముందుకు కదిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విజయం సాధించింది. ఆమె నగరానికి చెందిన డాక్టర్ వినీషా రెడ్డి.. యూట్యూబ్‌లో పోటీ పరీక్షల క్లాసులు వీక్షిస్తూ రికార్డును సృష్టించింది.. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలో మహిళా విభాగంలో అత్యధిక మార్కులు సాధించి వరుసగా టాపర్‌గా నిలిచారు వినీషా రెడ్డి. చదివింది వైద్య వృత్తి అయినప్పటికీ తల్లిదండ్రుల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. బీహెచ్ఎంఎస్ పూర్తి కాగానే డాక్టర్ ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపకుండా 2022 నుంచి పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. కోచింగ్ సెంటర్‌కు వెళ్లడం కంటే ఇంట్లోనే కూర్చోని ఆన్లైన్ క్లాసుల ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధం అయితే సమయం వృథా కాదని తల్లిదండ్రులు సలహా ఇచ్చారు. చదివిన వైద్య వృత్తితో సంబంధం లేకుండా యూట్యూబ్‌లో సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల టాపర్స్ ఇంటర్వ్యూలను వీక్షించారు. తద్వారా ఓ అంచనాకు వచ్చారు. గ్రూప్స్ నోటిఫికేషన్ వెలువడగానే దరఖాస్తు చేసుకుని యూ ట్యూబ్‌లో క్లాసులను వీక్షించారు. చక్కని ప్రణాళికతో రోజుకు ఎనిమిది గంటలు సమయం కేటాయించి సబ్జెక్టుల వారీగా క్లాసులు వింటూ తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. మొదటి అటెంప్ట్ లోనే.. అనుకున్న లక్ష్యాన్ని చేరేలా చక్కని ప్రణాళికతో ప్రాక్టీస్ చేసినట్లు డాక్టర్ వినీషా రెడ్డి చెబుతున్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన సీడీపీవో పరీక్షలకు హాజరై స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. గ్రూప్–1లో సైతం అత్యధిక మార్కులు సాధించారు. గ్రూప్–2 మహిళా విభాగంలో టాపర్‌గా నిలిచారు. తాజాగా టీజీపీఎస్సీ గ్రూప్–3 మహిళా విభాగంలోనూ మొత్తం 450 మార్కులకు గానూ 325.157 మార్కులు సాధించారు. 8వ జనరల్ ర్యాంకింగ్‌లో నిలిచారు. సివిల్స్ పరీక్షలతో ఐఏఎస్ కావాలన్నదే తన ముందున్న ఏకైక లక్ష్యమని వినీషారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మహాకుంభమేళాలో మాయమైన మహిళ తిరిగొచ్చిందిలా..
పట్నా: సోషల్ మీడియాతో కొంతమేరకు ముప్పు పొంచివున్నమాట వాస్తవమే అయినప్పటికీ, ప్రయోజనాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. సోషల్ మీడియాను సరైన రీతిలో వినియోగించుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభింస్తుందనడంలో సందేహం లేదు. బీహార్‌లోని రోహతక్ జిల్లాలోని బల్దారీ గ్రామానికి చెందిన లాఖ్‌పాతో దేవి విషయంలో సోషల్ మీడియా ఒక వరంలా మారింది.యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు వెళ్లిన లాఖ్పతో దేవి అక్కడ తప్పిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా సాయంతో ఇంటికి చేరుకుంది. ఆమె ఫిబ్రవరి 24న తన కుటుంబ సభ్యులతో పాటు మహాకుంభ్‌లో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లింది. అయితే అక్కడ జనసమూహం అధికంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కుంభమేళా ప్రాంతంలోనే రెండు రోజుల పాలు ఉండి, ఆమె కోసం వెదికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఇంటికి తిరుగుముఖం పట్టారు.అయితే ఇది జరిగిన 15 రోజుల తరువాత లాఖ్‌పాతో దేవి జార్ఖండ్(Jharkhand)లోని గఢ్వా జిల్లాకు చెందిన బహియాపూర్లో ఉందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. బహియాపూర్ పంచాయతీ సభ్యురాలు సోనీదేవి భర్త వీరేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఇటీవల 60 ఏళ్ల మహిళ తమ ఇంటికి వచ్చిందని, ఆ సమయంలో ఆమె బలహీనంగా కనిపించిందన్నారు. దీంతో ఆమెకు ఆహారం అందించి, వసతి కల్పించామన్నారు. ఆమె తన చిరునామా చెప్పలేకపోవడంతో ఆమె ఫొటోను సోషల్ మీడియాలో సంబంధిత వివరాలతో పాటు షేర్ చేశామని తెలిపారు.లాఖ్‌పాతో దేవి కుమారుడు రాహుల్ తల్లి ఫొటోను చూసి, వెంటనే జార్ఖండ్ చేరుకుని తన తల్లిని తనతోపాటు ఇంటికి తీసుకువచ్చాడు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ మార్చి 10 సోషల్ మీడియాలో తన తల్లి ఫొటోను చూశానని,తరువాత తాను బహియార్ పూర్ చేరుకుని తన తల్లిని కలుసుకున్నానని తెలిపారు. ఇది కూడా చదవండి: తండ్రి ఫోన్ రిపేర్ చేయించలేదని.. కుమారుడు ఆత్మహత్య -
యువత మార్కెట్ సోషల్ మీడియా
కొత్త బట్టలు కొనాలన్నా... లేటెస్ట్ గాడ్జెట్ కావాలన్నా... టీవీలు, ఫ్రిడ్జ్‌లు వంటి గృహోపకరణాలు తీసుకోవాలనుకున్నా.. ఇంటీరియర్ డిజైనింగ్.. ఆటోమొబైల్స్.. ఆభరణాలు.. ఇలా మార్కెట్లోకి వచ్చిన కొత్త ట్రెండ్స్ తెలుసుకునేందుకు సోషల్ మీడియా వేదికలను ఆశ్రయిస్తున్నామని యువత ముక్తకంఠంతో చెబుతోంది.హాలిడే ట్రిప్స్‌ను ప్లాన్ చేసేందుకు సైతం సోషల్ మీడియాలోనే అన్వేషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వస్తు వినియోగ మార్కెట్‌ను సోషల్ మీడియా శాసిస్తోంది. అంతర్జాతీయ మార్కెటింగ్ కన్సల్టెన్సీ స్ప్రౌట్ సోషల్ ఇండెక్స్ తాజా నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. – సాక్షి, అమరావతి1 కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణల గురించి తెలుసుకునేందుకు యువత ఆధారపడే వాటిలో సోషల్ మీడియా స్థానం90 శాతం కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణల గురించి తెలుసుకునే విషయంలో సోషల్ మీడియానునమ్మేవారు81 శాతం సోషల్ మీడియా ప్రభావంతో తక్షణం స్పందించి వస్తువులు కొనుగోలు చేస్తున్నవారు » కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణలను గురించి తెలుసుకునేందుకు యువత ఆధారపడేవాటిలో సోషల్ మీడియా మొదటి స్థానంలో ఉంది. ఏకంగా 90శాతం మంది యువత సోషల్ మీడియాను విశ్వసిస్తున్నారు. » స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించడం అనేది రెండో స్థానంలో ఉంది. 68శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. » టీవీ చానళ్లు మూడో స్థానంలో ఉన్నాయి. 60శాతం మంది యువత టీవీ చానళ్లలో ప్రకటనలను పరిశీలిస్తున్నారు. » నాలుగో స్థానంలో డిజిటల్ మీడియా ఉంది. 54శాతం మంది డిజిటల్ మీడియా ద్వారా మార్కెటింగ్ ట్రెండ్స్ తెలుసుకుంటున్నారు.» పాడ్ కాస్ట్ ప్రసారాలను 35శాతం మంది విశ్వసిస్తున్నారు. » 23శాతం మంది పత్రికలను ఆశ్రయిస్తున్నారు. » సోషల్ మీడియా ప్రభావంతో తక్షణం స్పందించి నచ్చినవి కొనుగోలు చేస్తున్నామని ఏకంగా 81శాతం మంది చెప్పారు.» కనీసం నెలకు ఒకసారి అయినా సోషల్ మీడి యా తమ కొనుగోలు అభిరుచులను నిర్దేశిస్తోందని 28శాతం మంది తెలిపారు.» ఇక ఏదైనా బ్రాండ్ గురించి సోషల్ మీడియాలో లేకపోతే తాము ప్రత్యామ్నాయ బ్రాండ్ల పట్ల మొగ్గుచూపుతున్నట్లు 78శాతంమంది వెల్లడించారు. » సోషల్ మీడియా ద్వారా వస్తువుల కొనుగోలుకు పలు కారణాలను కూడా యూజర్లు వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రదర్శించే వివిధ కంపెనీల ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారులకు అందించే సేవల పట్ల సంతృప్తి కారణంగా వస్తువులు కొనుగోలు చేస్తున్నామని 63శాతం మంది తెలిపారు. -
భర్తతో సాక్షి అగర్వాల్ హోలీ సెలబ్రేషన్స్.. అనన్య నాగళ్ల బోల్డ్ లుక్స్!
మూవీ సెట్లో ప్రియాంక చోప్రా హోలీ సెలబ్రేషన్స్..రవీనా టాండన్ కూతురు రషా తడానీ హోలీ లుక్స్..కుటుంబంతో కలిసి హోలీ వేడుకల్లో రాశీ ఖన్నా..భర్తతో కలిసి తొలిసారి హోలీ జరుపుకున్న సాక్షి అగర్వాల్..శారీలో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల బోల్డ్ లుక్స్... View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
క్షమాపణలు చెప్పిన సురేఖవాణి కూతురు సుప్రీత.. ఎందుకంటే?
టాలీవుడ్ నటి సురేఖ కూతురు సుప్రిత దాదాపు తెలుగువారికి సుపరిచితమే. ఆమె త్వరలోనే హీరోయిన్గా పరిచయం కానుంది. బిగ్‌బాస్ -7 రన్నరప్ అమర్దీప్ చౌదరితో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. అంతేకాకుండా పీలింగ్స్ విత్ సుప్రిత అనే టాక్ షో చేస్తోంది. తాజాగా హోలీ సందర్భంగా అభిమానులకు విషెస్ తెలిపింది. దీంతో పాటు క్షమాపణలు కూడా కోరింది. ఇంతకీ సుప్రీత చేసిన తప్పేంటి। ఎందుకు క్షమాపణలు చెప్పిందో తెలుసుకుందాం.ఇటీవల కొద్ది రోజులుగా పలువురు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీత సైతం తాను కూడా తెలిసో, తెలియక బెట్టింగ్ ప్రమోట్ చేశానని తెలిపింది. ఇక నుంచి అలా చేయడం లేదని.. మీరు కూడా అందరూ ఇలాంటి వారికి దూరంగా ఉండాలని ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఎవరూ కూడా అలాంటి యాప్స్‌ను ఎంకరేజ్ చేయొద్దు.. ఈజీ మనీకి అలవాటు పడొద్దు.. అలాంటి వారికి సోషల్ మీడియాలో కూడా దూరంగా ఉండండి అంటూ వీడియో సందేశం ఇచ్చింది.సుప్రీత మాట్లాడుతూ..' కొంతమంది తెలిసో, తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్లలో నేను కూడా ఒకదాన్ని. అందుకే ఈ విషయంలో అందరికీ క్షమాపణలు కోరుతున్నా. ఎవరైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవీ చూసి వాటిని అనుసరించకండి. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. అలాంటి యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. వారిని సోషల్ మీడియాలో ఫాలో కావొద్దు. అందరికీ థ్యాంక్యూ. అలాగే మీ అందరికీ మరోసారి సారీ.' అంటూ వీడియోను పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
రంగులు పులుముకున్న జాబిల్లి.. ఆకాశంలో ఈ సుందర దృశ్యం చూశారా?
ఆకాశంలో ఇవాళ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఏడాదిలో మొదటి గ్రహణం.. అందునా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. అరుదైన బ్లడ్ మూన్ ఘట్టం చోటు చేసుకోవడంతో ప్రపంచమంతా ఈ దృశ్యాన్ని చూసేందుకు తహతహలాడుతోంది. దాదాపు.. రెండేళ్ల తర్వాత ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే. భూమి.. సూర్యుడు.. చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు... భూమి నీడ చంద్రుడి మీద పడి పూర్తిగా కప్పేసినప్పుడు ఏర్పడేదే సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ‘బ్లడ్ మూన్’గా పిలిచే చంద్రగ్రహణం ఏర్పడిందని, దీని ప్రకారం భూమి నీడ జాబిల్లిని 99.1 శాతం కప్పేస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భారత కాలమానం ప్రకారం ఉదయం 11.57 గంటలకు గ్రహణం మొదలైంది. మధ్యాహ్నం 12.29 గంటలకు గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుని దాదాపు గంట పాటు కొనసాగింది. మధ్యాహ్నం 1.01 గంటలకు గ్రహణం పూర్తయ్యింది. మొత్తం 3గం. 38 ని.లోనే గ్రహణం మూడుదశలు పూర్తి చేసుకుంది. #BloodMoon #LunarEclipse pic.twitter.com/ufNhgx5ccd— தோழர் Manic (@ManicBalaji) March 14, 2025సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో భారత్‌లో పగటి సమయం. కాబట్టి మనకు కనిపించదు. అయితే.. ఆ సంపూర్ణ చంద్రగ్రహణం పశ్చిమార్థగోళంలో పూర్తిగా, కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తోంది. ఉత్తర-దక్షిణ అమెరికా దేశాలు, పశ్చిమ ఐరోపా దేశౠలు, ఆఫ్రికా దేశాల్లోని వారు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. ప్రత్యేకించి.. అమెరికాలో ఎక్కువ ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. If i wasnt in the middle of a city, with tons of light pollution, I would have much better shots. These will have to do.#lunareclipse #bloodmoon pic.twitter.com/aABvGuXiWL— Jared Hardaway (@jartraxwx) March 14, 2025యూరప్‌లో గ్రహణ దశలో చంద్రుడు అస్తమించనుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాత్రం గ్రహణం పూర్తయ్యే సమయానికి చంద్రుడు ఉదయించాడు. దీంతో అక్కడ ఎటువంటి పరికరాలు లేకుండానే గ్రహణాన్ని నేరుగా వీక్షించారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో ఆ దృశ్యాలను పోస్టులు పెడుతున్నారు. #BloodMoon #LunarEclipse pic.twitter.com/ufNhgx5ccd— தோழர் Manic (@ManicBalaji) March 14, 2025సాధారణ గ్రహణాల సమయంలో చంద్రుడి పరిమాణం కాస్త పెద్దదిగా, ఎప్పుడు కనిపించే రంగులోనే దర్శనమిస్తాడు. కానీ, బ్లడ్‌మూన్ రోజున జాబిల్లి పూర్తిగా ఎరుపు, నారింజ రంగులో చూపురులను కనువిందు చేశాడు. సూర్యుడి నుంచి విడుదలయ్యే ఎరుపు, నారింజ కిరణాలు భూ వాతావరణం గుండా ప్రయాణించి చంద్రుడ్ని ప్రకాశింపజేస్తాయి. ఖగోళ పరిభాషలో దీనినే రేలీ స్కాటరింగ్ అంటారు.If i wasnt in the middle of a city, with tons of light pollution, I would have much better shots. These will have to do.#lunareclipse #bloodmoon pic.twitter.com/aABvGuXiWL— Jared Hardaway (@jartraxwx) March 14, 2025 -
కాలం చెల్లిన చైనా ‘చేప కథ’
ఏ శాస్త్రంలోని నూతన ఆవిష్కరణ అయినా సామాజిక శాస్త్ర పర్యావరణ గీటురాయి మీద దాని మానవీయ విలువను నిర్ధారించుకోక తప్పదు. 2004 డిసెంబర్లో ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ (ఐసీటీ) మన బడుల్లో పాఠంగా మొదలయింది. అది మొదలు గత రెండు దశాబ్దాలలో దానికి మొలకెత్తిన చిలవలు పలవలు... ఊడలు దిగిన మ్రానులైన పరిస్థితుల్లో, మన మానసిక వైఖరులు మన మానవీయ విలువలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? అన్నప్పుడు కొంచెం తేడాతో అందరం అందులో మునకలు వేయడం అయితే నిజం. మనకంటే ముందే ఈ అనుభవమున్న సంపన్న దేశాల్లో దీని పర్యవసానాలపై అధ్యయనం మొదలయింది కనుక ఈ ప్రపంచీకరణ కాలంలో ఆ కొలమానాలు మనమూ వాడుకోవచ్చు. గత పదేళ్ళలో పెరిగిన ‘సోషల్ మీడియా’ మన మీద పెంచుతున్న ఒత్తిడితో ఏర్పడిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’లో ఇప్పుడు మనం ఉన్నాం. అదొక నూతన పర్యావరణంగా మారి, మన ఆలోచనలు అభిప్రాయాలు అందుకు అనుగుణంగా మార్చుతూ, మూడు రంగాలలో మన జీవితాల్ని అది ప్రభావితం చేస్తున్న దని ఫిబ్రవరి 2023లో ఎవాన్ కుహెన్ ఒక వెబ్‌సైట్‌కు రాసిన ‘వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం?’ వ్యాసంలో అంటారు. గుర్తించిన ఆ మూడింటిలో ‘సివిల్ సొసైటీ’ (పౌరసమాజం) ఒకటి. ఈ పరిశీలన వెలుగులో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ‘పౌర సమాజం’ సంగతి ఏమిటి? మన పండితులు పామ రుల అభిప్రాయాలపై ఎటువంటి ‘సమాచార’ పర్యా వరణ ప్రభావం ఉంది. ప్రభావశీలురైన ముగ్గురు ప్రముఖులు 2025 ఫిబ్రవరిలో వెలుబుచ్చిన అభిప్రా యాలలో నుంచి వాటిపై ‘సమాచార పర్యావరణ’ ప్రభావం ఏ మేర ఉందో చూద్దాం. ఫిబ్రవరి మొదటివారంలో ప్రభుత్వ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన ఒక సమీక్ష సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ – ‘‘మీరు ఫిర్యాదుల పరిష్కారం మొదటి ప్రాధాన్యతగా చూడాలి, రెవెన్యూశాఖ నుంచి భూ కబ్జాలు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయి. డాక్యుమెంట్స్ ఫోర్జరీ ఎక్కువ అయిపోయింది... వీటిని మీరు ఎలా పరిష్కరిస్తారు అనేది మీకే వదిలి పెడుతున్నాను’’ అన్నారు. ఇది విన్నాక ఈ ధోరణి మూలాలు ఎక్కడ ఎందుకు మొదలయింది వెతికితే, రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడకు మారిన 2015 తర్వాత నుంచి రాజకీయం అంటేనే ‘భూమి విలువ’ అన్నట్టుగా మారింది. ‘‘అమరావతిలో అన్నీ పోను ఎనిమిది వేల ఎకరాలు మిగులుతాయి, ఎకరం 20 కోట్లు చొప్పున అమ్మితే 160 కోట్లు వస్తాయి...’’ తరహా మాటలు అధికార కేంద్రాల నుంచి వస్తే, ‘సోషల్ మీడియా’ దానికి విస్తృత ప్రచారం ఇచ్చింది. ఇప్పుడు తెనాలి ప్రాంతానికి చెందిన ఏ.పి. ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్’ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ కూడా విశాఖలో– ‘‘కొత్త రాష్ట్రానికి అమరావతి వంటి ‘గ్రీన్ ఫీల్డ్ కేపిటల్’ ఉండడం అవసరం’’ అంటూ పనిలో పనిగా –‘‘ఉచితాలు అనుచితం’’ అని కూడా అనేశారు. పోనీ అది నిజమనుకుందాం. మరి వారే ‘‘బాపట్ల సమీపాన 20 ఏళ్ళనాడు ఆగిపోయిన ‘వాన్ పిక్’ ఈ పదేళ్లలో పూర్తి అయివుంటే, ‘ఉచితాలు’ తీసుకునేవారు అవి మాని అక్కడే ఏదో ఒక ‘లేబర్’ పని చేసుకుని బతికేవారు’’ అని కూడా అనొచ్చు కదా? చివరికి ఏమైంది గత పదేళ్ళలో ‘రాజధాని’ చుట్టూ ‘సోషల్ మీడియా’ వ్యాప్తి చేసిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’ కింద నలిగి కేంద్ర హోంశాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ నిపుణుల అభిప్రాయాలు ఇటువంటి ప్రకట నల కింద సమాధి అయ్యాయి.రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బా రావు కూడా ఇదే విశాఖ నుంచి ఉచితాలు గురించి – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటూ ఎప్పుడో పాతదైన ‘చైనా వారి చేప’ కథ చెప్పారు. అది చైనాలో నిజమేమో. ఇక్కడ ‘చేపలు’ పట్టడం నేర్పడం కోసం పెట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ఏమైందో చూశాం. అయినా – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటే, ఈ ‘ఉచితాలు’ పొందే వారు కూడా ఏమంత సంతోషంగా ఏమీ లేరు. కారణం కళ్ళముందు సంపన్న వర్గాల వద్దకు చేరుతున్న సంపద, వారి విజయగాథలు, వైభవంగా జరిగే వారి పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ ఫంక్షన్స్... వాటి గురించి ‘సోషల్ మీడియా’ కథలుగా చెబుతుంటే వింటూ, తమకు అందే అరకొరను వాళ్ళు తూకం వేస్తున్నారు. అధికార కేంద్రాలకు దగ్గరయితే, అక్రమ ఆదాయ వనరులు ఎలా పెరుగుతాయో ‘సోషల్ మీడియా’ వారికి నిత్యం కళ్ళకు కట్టిస్తున్నది.విషయం ఏమంటే, ప్రభుత్వ పరిపాలనలోకి ‘టెక్నాలజీ’ వచ్చాక, అవినీతికి చిల్లులున్న చీకటి మార్గాలు మూతపడి అదాయ వనరులకు గండి పడితే, ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి వనరుల్లో వెతు క్కుంటున్నారు. అభివృద్ధి మారుమూల గ్రామాలకు ప్రవేశిస్తుంటే, బయటకు వెళుతున్న మట్టి, కంకర చూస్తున్నదే. వాటి వివరాలు ‘సోషల్ మీడియా’ 24 గంటలూ జనానికి చూపిస్తున్నది. ఈ అక్రమ లావా దేవీల చిట్టా సామాన్యుడికి అరచేతిలో ‘ఫోన్’లో దొరుకుతుంటే, ప్రభుత్వం అరాకొరా ఉచితంగా ఇచ్చే రొట్టె ముక్కను ఇవ్వాలా వద్దా? అంటూ మళ్ళీ అదే పాత చర్చ అంటే, వారి వద్ద పాండిత్యం పరిహాసం అవుతుందేమో!జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
వారెవ్వా..! ఏం సందేశం ఇది..!
కొన్ని అడ్వైర్టైస్మెంట్లు ఆలోచనాత్మకంగానూ, సందేశాత్మకంగానూ ఉంటాయి. మరికొన్ని విదాస్పదంగా కూడా ఉంటాయి. అందుకే మీడియాలోనూ, ఇలాంటి మార్కెటింగ్ అడ్వర్టైస్మెంట్లలో ఏమరపాటు పనికిరాదని అంటారు నిపుణులు. ఇప్పుడిదంతా ఎందుకంటే నెట్టింట తెగ వైరల్ అవుతున్నఈ డైరీ మిల్క్ అడ్వర్టైస్మెంట్ చూస్తే ఏం ఉందబ్బా అని అనుకుండా ఉండలేరు. ఒక్కసారిగా భాషా అతర్యం పెద్ద సమస్యకాదని చిటికెలో తీసిపారేసింది. నెటిజన్ల మనసు దోచుకున్న ఆ డైరీ మిల్క్ అడ్వర్టైస్మెంట్లో ఏముందంటే..డైరీ మిల్క్ కొత్త అడ్వర్టైస్మెంట్లో ఉత్తర దక్షిణ భారతదేశ భాషల ఆంతర్యంపై ఆలోచనాత్మక సందేశాన్ని అందించింది. ఒక ఇంటిపై హిందీ మాట్లాడే మహిళల గుంపు కూర్చొని ఉంటుంది. వారి మధ్యలోని చెన్నైకి చెందిన పోరుగింటామె కూడా వారి సంభాషణలో చేరుతుంది. అయితే ఆమెకు హిందీ రాక ఇబ్బందిపడుతుంది. అక్కడ తన ఉనికే ప్రశ్నార్థకంగా ఉంటుంది. దాంతో ఆమె మిగతా మహిళలు సంభాషణను వింటూ మౌనంగా ఉండిపోతుంది. అయితే మరో మహిళ కల్పించకుని మాట్లాడమని సైగ చేస్తుంది. తనకు హిందీ కొంచెం కొంచెమే వచ్చు అని చెబుతుంది. దాంతో అవతల మహిళ వచ్చిరాని ఇంగ్లీష్‌లో జరిగింది వివరిస్తుంది. ఆ తర్వాత తనకు కూడా ఇంగ్లీష్ కొంచెం కొంచెమే వచ్చు అనేసి..డైరీ మిల్క్ ఇస్తుంది. అయినా మనుషులతో కలవాలని ఉంటే చాలు ..భాషతో సమస్య ఏం ఉందని నవ్వేస్తుంది. ఆ తర్వాత ఇరువురు ఆ డైరీ మిల్స్‌ని షేర్ చేసుకుని ఆస్వాదించడంతో ఆ యాడ్ ముగిసిపోతుంది. ఇక్కడ ఇందులో మన భాషలు వేరైతేనేం ఈ తియ్యటి చాక్లెట్‌తో కనెక్ట్ అవుదాం అన్నట్లుగా ఉంది. అందరం ఏదో ఒక సమయంలో లేదా ఏదో ఒక టైంలో ఇలాంటి సమస్యను ఫేస్ చేసే ఉంటాం కదా. నెట్టింట వైరల్అవుతున్న ఈ వీడియో నెటిజన్ల మనసును దోచుకోవడమే గాక..ఎంత అందంగా భాషభేధం పెద్ద సమస్య కాదని చెప్పిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. (చదవండి: కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లినా.. నొప్పి తెలియదట ఆమెకు..! వైద్యనిపుణులకే అంతుపట్టని కేసు.) -
ఇరాన్ బీచ్‌లో‘బ్లడ్ రెయిన్’ : నెటిజన్లు షాక్, వైరల్ వీడియో
ఇరాన్లో జరిగిన ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఒకటి వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజనులను ఆశ్చర్యపరిచింది. ఇరాన్లో లోని రెయిన్ బో ఐలాండ్ లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఈ భారీ వర్షం తర్వాత ఎర్రగా మెరిసే బీచ్ వీడియోలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. చాలామంది దీనిని "రక్త వర్షం (Blood Rain)" అని భయపడిపోతోంటే, మరికొందరు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి ముగ్దులైపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే..టూర్ గైడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై ఎర్రటి ధూళితో చేరింది. ఆ తరువాత ఎర్ర రంగులో బీచ్‌లోకి ప్రవహిస్తోంది. మెరిసిపోయే ముదురు ఎరుపు రంగులో నీరు సముద్రంలోకి చేరుతుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని తిలకించేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. View this post on Instagram A post shared by جزیره هرمز | امید بادروج (@hormoz_omid) రెయిన్ బో ఐలాండ్‌లో వర్షాన్ని టూరిస్టులు ఎంజాయ్ చేశారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన బ్లడ్ రెయిన్ జలపాతంలా కిందకు దూకుతుంటే ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. దీనిపై నెటిజన్ల కమెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. "ఈ దృశ్యం నిజంగా అద్భుతమైనది మరియు ప్రత్యేకమైనది.", పకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ, "దేవునికి మహిమ ఎంత అందం. నిజానికి, దేవుడు రెండు ప్రపంచాలకూ అత్యుత్తమ చిత్రకారుడు" ఇలా ఎవరికి తోచినట్టుగా వారు కమెంట్స్ పెడుతున్నారు. What’s going on here? Alien weather phenomenon? Horror from beyond the deep? It looks like this beach is bleeding, with the rains turning blood red and oozing back out into the sea, and indeed, it’s even called the “Blood Rain”. Fortunately, it’s not actually blood.. It’s rust! pic.twitter.com/dbqMdtF7qG— briefchaatindia (@briefchaatindia) March 13, 2025 కాగా హార్ముజ్ జలసంధిలోని రెయిన్బో ద్వీపంలోని బీచ్, అధిక స్థాయిలో ఇనుము , ఇతర ఖనిజాలను కలిగి , సహజంగా ఎర్ర నేల కారణంగా ఇరాన్లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ అగ్నిపర్వత నేలలో అధిక ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ కారణంగా తీరంలో ఏడాది పొడవునా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఖనిజాలు భారీ ఆటుపోట్లతో కలిసి తీరప్రాంతానికి ప్రకాశవంతమైన ఎరుపు రంగును సంతరించుకుంటుంది. ఇది ఎవరో సముద్రంలో పెద్ద బకెట్‌తో ఎరుపు పెయింట్‌ను కుమ్మరించినట్టు కనిపిస్తుంది. రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్ని పర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. -
ప్రత్యేక కేసుల్లోనే సోషల్ మీడియా, డిజిటల్ యాక్సెస్
న్యూఢిల్లీ: కొత్త ఆదాయపన్ను బిల్లు కింద కేవలం సెర్చ్, సర్వే ఆపరేషన్లలోనే పన్ను చెల్లింపుదారుల డిజిటల్ ఖాతాలు, కంప్యూటర్ పరికరాల ప్రవేశాన్ని ఆదాయపన్ను శాఖ బలవంతంగా తీసుకుంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అది కూడా పాస్‌వర్డ్‌లను పంచుకునేందుకు తిరస్కరించినప్పుడే ఇలా జరుగుతుందన్నారు. అంతేకానీ, సాధారణ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి స్క్రుటినీ కేసుల్లో ఆన్లైన్ గోప్యతకు భంగం కలిగించేది ఉండదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్!ఈ తరహా చర్యలు తీసుకునే అధికారం 1961 ఆదాయపన్ను చట్టం కింద ప్రస్తుతం సైతం ఉన్నట్టు అధికారి చెప్పారు. ఇవే అధికారాలను ఆదాయపన్ను బిల్లు 2025లోనూ పేర్కొన్నట్టు తెలిపారు. ఎల్రక్టానిక్ రికార్డులు, పన్ను చెల్లింపుదారుల ఈ–మెయిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్, క్లౌడ్ స్టోరేజీ నుంచి సమాచారం పొందే అధికారం కొత్త ఆదాయపన్ను బిల్లులోని సెక్షన్ 247 కింద దఖలు పడనున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిరస్కరించారు. ఇవి కేవలం భయాన్ని కల్పించేవిగా పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా ఖాతాలు లేదా ఆన్లైన్ కార్యకలాపాలపై పన్ను శాఖ నిఘా పెట్టబోదన్నారు. -
రికార్డింగ్ డ్యాన్సర్‌కు ముద్దు.. బూతు పాటతో ఎమ్మెల్యే రచ్చ
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూబ్యూటర్‌పై ఏకంగా ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మండిపడ్డారు. అలాంటిది ఒక ప్రజాప్రతినిధే బహిరంగంగా అశ్లీల నృత్యాలను ప్రొత్సహించడం.. అందునా ఆయనే అసభ్యంగా ప్రవర్తించడం.. పైగా వేదిక మీదే బూతు పాట పాడడంతో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని పలువురు నెట్టింట ప్రశ్నలు గుప్పిస్తున్నారు.బీహార్ జనతా దల్(యునైటెడ్) ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భగల్పూర్ జిల్లా నౌగాచియాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.వేదిక మీద ఉన్న నృత్యకారిణి దగ్గరకు వెళ్లి.. ఆమె పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కరెన్సీ నోటును ఆమె చెంపకు అతికించాడు. అక్కడితో ఆగకుండా.. నేను డ్యాన్స్ మాత్రమే చేయలేదు.. ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నా అంటూ మైకులో ప్రకటించారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. రాత్రి సయమంలో జరిగిన వేడుకల్లోనూ ఆయన పాల్గొన్నారు. రికార్డింగ్ డ్యాన్సర్లతో చిందులేశారు. ఆపై మైక్ అందుకుని బూతు పాటలు పాడి అక్కడున్నవాళ్లను హుషారెత్తించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆర్జేడీ భగ్గుమంది. ఇలాంటి వాళ్లపై కేసులు నమోదు చేస్తారా? చర్యలు తీసుకుంటారా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధులపై కూడా న్యాయస్థానాలు తీవ్ర వ్యాఖ్యలు చేయాలని పలువురు కోరుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.होली मिलन समारोह में जदयू विधायक गोपाल मंडल ने महिला डांसर के गाल पर नोट चिपकाया और साथ में मंच पर लगाए ठुमके।#Gopalmandal #Bihar #BiharNews #Bhagalpur #Holi2025 pic.twitter.com/ZBNs32uQz1— FirstBiharJharkhand (@firstbiharnews) March 10, 2025JDU विधायक गोपाल मंडल#gopalmandal @Jduonline @RJDforIndia #BiharNews #bhagalpur pic.twitter.com/1nikGeTmWV— Shri Dhiraj Sharma (Journalist) (@ShriDhiraj) March 11, 2025గోపాల్ మండల్ వార్తల్లోకి ఎక్కడం తొలిసారేం కాదు. గతంలో ఆయన అండర్వేర్పై రైలులో తిరిగి వైరల్ అయ్యారు. కొందరు ప్రయాణికులు ఆ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ టైంలోనూ ఆయనపై విమర్శలు రాగా.. కంపార్ట్మెంట్లో మహిళలు లేరని, బాత్రూం వెళ్లాల్సి రావడంతో అలా వెళ్లానని అప్పుడు తన చర్యను సమర్థించుకున్నారాయన. -
భారత్ గెలుపు వేళ అభిమానులపై దాడి.. నిందితులకు పోలీసుల వింత శిక్ష
భోపాల్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా అభిమానాలు సంబరాలు జరుపుకున్నారు. సంబరాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అల్లర్లు చేలరేగాయి. అభిమానులు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో ఘర్షణకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారికి పోలీసులు వింత శిక్ష విధించారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ టీమ్‌ని రోహిత్ సేన ఓడించింది. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేడక చేసుకున్నారు. విజయం అనంతరం రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తి చేశారు. అయితే, మధ్యప్రదేశ్ మోవ్, దేవాస్ నగరాల్లో విజయోత్సవాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేడుకల సందర్బంగా పట్టణంలోని జామా మసీదు దగ్గర అభిమానుల మీద దాడి జరిగింది. అక్కడ ఎందుకు ఊరేగింపు చేస్తున్నారంటూ గొడవ మొదలుపెట్టారు. మాటామాటా పెరగడంతో ఊరేగింపు మీద రాళ్ళు రువ్వారు. ఆ దాడిలో పలువురు క్రికెట్ ప్రేమికులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు అసాంఘిక శక్తులు క్రీడాభిమానుల వాహనాలను ధ్వంసం చేసారు. రెండు వాహనాలకు, రెండు దుకాణాలకూ నిప్పు పెట్టారు. దీంతో హింస చెలరేగింది.అయితే, దేవాస్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్నట్లుగా భావిస్తున్న నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కొందరు యువకులు అత్యుత్సాహంతో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. వీరిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.VIDEO | Madhya Pradesh: Police shave heads and parade those accused of creating ruckus in Dewas after India's ICC Champions Trophy victory on the night of March 9. (Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/PqCIvX4p0y— Press Trust of India (@PTI_News) March 11, 2025 -
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే.. చూస్తూ ఊరుకోం
ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు.స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కూడా కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడటం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి కూడా వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది.– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలురెడ్ బుక్ రాజ్యాంగంలో.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో.. చట్టాలను కాలరాస్తూ.. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ.. పౌరుల స్వేచ్ఛను హరిస్తూ ఎడాపెడా అక్రమ అరెస్టులకు బరి తెగిస్తున్న ఖాకీలపై హైకోర్టు కన్నెర్ర చేసింది..! ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీల అధినేతలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు అడ్డగోలుగా కేసులు బనాయించడంపై నిప్పులు చెరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్‌లు చేస్తున్నా... మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని కూడా తప్పుబట్టింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే నడుచుకోవాలని మందలించింది. ఊహల ఆధారంగా ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే.. రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని ఘాటుగా వ్యాఖ్యానించింది.భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి.ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. – ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుసాక్షి, అమరావతి: టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్‌రెడ్డికి కింది కోర్టు రిమాండ్ విధించడం చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. ఈమేరకు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పు కాపీ అందిన వెంటనే శ్రీధర్‌రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ధర్మాసనం ఆదేశించింది. న్యాయమా?.. అన్యాయమా? అన్నదే ముఖ్యం...ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఎలాంటి రుజువులు లేకుండా పోలీసులు తమ ఊహ ఆధారంగా అరెస్ట్‌లు చేస్తామంటే కుదరదని పేర్కొంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఆరెస్టులు చేస్తూ పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. మేజిస్ట్రేట్లు సైతం ఏమీ చూడకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తులు ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, పోలీసులు చర్యలు న్యాయమా? అన్యాయమా? అన్నదే ముఖ్యమని తేల్చి చెప్పింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పౌరుల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందంది. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలను తాము ఎంత మాత్రం అనుమతించబోమంది. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని పోలీసులకు తేల్చి చెప్పింది. ఎలా పడితే అలా అరెస్టులు చేసి మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంది. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే, రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించింది. అంతా బాగుందని చెప్పేస్తే, తాము మౌనంగా ఉండిపోతామని అనుకోవద్దని పోలీసులకు తేల్చి చెప్పింది. శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసి హాజరుపరిచినప్పుడు మొదట మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించారని, దీంతో ఆయన్ను స్వేచ్ఛగా వదిలేయాల్సిన పోలీసులు మళ్లీ అరెస్ట్ చూపారని పేర్కొంది. మేజిస్ట్రేట్ సైతం రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలను లోతుగా పరిశీలించకుండా శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధించారని ధర్మాసనం ఆక్షేపించింది. ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారంది. శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయాన్ని సైతం సరైన పద్ధతిలో సంబంధీకులకు తెలియచేయలేదని ప్రస్తావించింది. రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 47(1) కింద అరెస్ట్ విషయాన్ని తెలియచేయలేదని తెలిపింది. అందువల్ల శ్రీధర్‌రెడ్డి నిర్భంధం అక్రమమని ధర్మాసనం తేల్చి చెప్పింది. సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్ విషయాన్ని నిర్భంధంలో ఉన్న వ్యక్తికి వెంటనే తెలియచేసి తీరాల్సి ఉంటుందని పేర్కొంది. శ్రీధర్‌రెడ్డిని హాజరుపరిచినప్పుడు సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి తెలియచేయలేదన్న కారణంతో మేజిస్ట్రేట్ రిమాండ్‌ను తోసిపుచ్చారు. సెక్షన్ 47(1) పోలీసులు చట్టం నిర్ధేశించిన విధి విధానాలను పాటించని పక్షంలో నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయాలని చట్టం చెబుతోంది. ఈ కేసు విషయానికి వస్తే పోలీసులు చట్టపరమైన విధి విధానాలను పాటించకపోయినా కూడా నిందితుడికి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. తద్వారా మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారు. అందువల్ల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే శ్రీధర్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని పోలీసులకు సూచించింది.రిమాండ్‌పై భార్య న్యాయ పోరాటంతన భర్త అవుతు శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమంటూ ఎం.ఝాన్సీ వాణిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరఫున యతీంద్ర దేవ్ వాదనలు వినిపించారు.రీల్ పోస్టు చేయడం.. బలవంతపు వసూలా?సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ తీరును వ్యంగ్యంగా చిత్రీకరించి ఫేస్బుక్లో సదరు రీల్‌ను పోస్ట్ చేసిన మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. ప్రేమ్ కుమార్ పోస్ట్ చేసిన రీల్‌కు, బలవంతపు వసూళ్లకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. ఆయన బలవంతపు వసూళ్లకు పాల్పడటంతో పాటు తరచూ నేరాలు చేసే వ్యక్తి అని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనడంపై మండిపడింది. దేని ఆధారంగా ఇలా రాశారంటూ నిలదీసింది. అరెస్ట్ సమయంలో ఆయన వద్ద రూ.300 దొరికాయి కాబట్టి వాటిని బలవంతపు వసూళ్లుగా చెబుతున్నారా? అంటూ మండిపడింది. మేజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా రిమాండ్ విధించేస్తున్నారంది. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఏం పేర్కొన్నారు? అందులో పేర్కొన్న సెక్షన్లు నిందితునికి వర్తిస్తాయా? లాంటి విషయాలను లోతుగా పరిశీలించకుండానే రిమాండ్ విధించేస్తున్నారని పేర్కొంది. రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులు..తమ ముందుకు వస్తున్న కేసులను పరిశీలిస్తే మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. మేజిస్ట్రేట్లు రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులిచ్చేస్తున్నారంది. మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నా, తాము మాత్రం బుర్రలు ఉపయోగించే విచారణ జరుపుతున్నామని వ్యాఖ్యానించింది. నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో అతడు ఎక్కడ ఉంటే అక్కడి పంచాయితీదారుల సమక్షంలోనే జరగాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ప్రేమ్‌కుమార్ అరెస్ట్ విషయంలో కర్నూలు పోలీసులు అక్కడ పంచాయతీదారులను గుంటూరుకి తీసుకురావడంపై హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. ఇలా చేయడానికి చట్టం అనుమతిస్తోందా? అని నిలదీసింది. ప్రేమ్‌కుమార్ వ్యంగ్యంగా నాటక రూపంలో ఓ రీల్ చేసి పోస్టు చేశారని, ఇందులో బలవంతపు వసూళ్ల అంశం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. ఇలాంటి తీరును ఎంత మాత్రం సహించేది లేదని, ప్రేమ్‌కుమార్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారో పోలీసులు చెప్పి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కర్నూలు త్రీ టౌన్ ఎస్‌హెచ్‌వో అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి జోక్యం చేసుకుంటూ, జిల్లా ఎస్పీని సైతం అఫిడవిట్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, మిగిలిన ప్రతివాదులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చని పేర్కొంటూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను కర్నూలు పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ కొరిటిపాటి అభియన్ గత ఏడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది.సెక్షన్ 111 ఏ సందర్భంలో పెట్టొచ్చంటే...కిడ్నాపింగ్, దొంగతనం, వాహన దొంగతనం, బలవంతపు వసూళ్లకు పాల్పడం, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఇతర అక్రమ వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం వంటి వాటికి పాల్పడిన వారికి మాత్రమే సెక్షన్ 111 వర్తిస్తుంది. ఈ నేరాలు రుజువైతే మరణశిక్ష, జీవితఖైధు, రూ.10 లక్షలకు తగ్గకుండా జరిమానా విధించవచ్చు. సోషల్ మీడియా పోస్టులు ఈ నేరాల కిందకు రాకపోయినప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టులను వ్యవస్థీకృత నేరంగా చూపుతూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్ 111 కింద కేసులు బనాయిస్తున్నారు. బెయిల్ రాకుండా చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారు. ప్రస్తుత కేసులో కూడా పోలీసులు ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్ల కింద కేసు పెట్టారు. -
వెంకయ్య నాయుడు గారూ.. అవేం మాటలు?
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు. మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే.. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాత్రం చర్చ జరగాల్సిందే. ఎన్నికల్లో గెలిచేందుకు మూడు పార్టీలు కలిసికట్టుగా వచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం, ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలివ్వడం.. ఆపై వాటిని విస్మరించడం వంటి అంశాలపై వెంకయ్య నాయుడు తన అభిప్రాయం చెప్పకుండా.. చేయగలిగిన పనులపైనే ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యకు అర్థమేమిటి?. ఎన్నికల హామీలు పట్టించుకోవద్దని చెప్పడమే అవుతుంది కదా?. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత వెంకయ్య నాయుడు(M Venkaiah Naidu).. రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటున్నారు. స్వర్ణభారతి ట్రస్టు కార్యకలాపాల్లో భాగస్వామి అవుతుంటారు. ఆయన ఉచిత పథకాలకు వ్యతిరేకమని ప్రతీతి. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. అయితే.. కొన్ని దశాబ్దాలుగా మిత్రుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయాలేవీ ఆయన చెప్పినట్లు కనిపించదు. 👉ఇటీవల వెంకయ్య నాయుడు విశాఖపట్నంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు(Chandrababu)ను అభివృద్ది కాముకుడిగగా ప్రశంసించారు. అయితే సూపర్సిక్స్తోపాటు 150 ఇతర హామీలు ఇవ్వడంలో ఆయనకు ఏ అభివృద్ధి కాముకత కనిపించిందో తెలియదు. ఏదో రకంగా మిత్రుడు గెలిచారన్న ఆనందం ఉంటే ఉండవచ్చు??. చంద్రబాబు ప్రభుత్వం చేసిన హామీలను అమలు చేస్తోందా? లేదా? అనేది ఆయనకు తెలియకుండా ఉంటుందా!. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హామీలు అమలు చేయాలని సూచించాల్సిన వెంకయ్య.. చేయగలిగిన పనులపైనే దృష్టి పెట్టాలని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది కదా. 👉చంద్రబాబు ఆలోచనలు మంచివని వెంకయ్య సర్టిఫికెట్ ఇస్తూ.. అవి చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అవి ఏరకంగా ఉంటాయి? సూపర్‌సిక్స్‌తో సహా అనేక వాగ్దానాలు చేయడంలో ఉన్న మంచి ఆలోచనలు ఏమిటో కాస్త వివరంగా చెప్పి ఉంటే జనానికి కూడా బాగా అర్థమయ్యేది కదా?. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని టీడీపీ, జనసేనలు ఎన్నికల హామీ ఇచ్చాయి. కాని తాజాగా ప్రవేశపెట్టన బడ్జెట్లో ఆ ఊసే ఎత్త లేదు. ఇది మంచి ఆలోచనా కాదా? అదే కాదు..నిరుద్యోగులకు రూ.3,000 భృతి ఇస్తామని,.. వలంటీర్లకు జీతం రూ.10,000 చేస్తామని రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, బలహీన వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు పంపిణీ చేస్తామని.. పలు వాగ్దానాలు చేశారు. ఇవన్నీ చంద్రబాబులో వచ్చిన మంచి ఆలోచనలే అని వెంకయ్య చెప్పదలిచారా?.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి సుమారు లక్షన్నర కోట్ల వరకు ఉండొచ్చు. కేవలం సూపర్ సిక్స్ హామీలకే రూ.79,179 కోట్లు అవసరమవుతాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.17,179 కోట్లే కేటాయించడం మంచి ఆలోచనేనని వెంకయ్య చెబుతారా?. 👉విద్య సంగతి ఎలా ఉన్నా మద్యం బాగా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం తీరు చూసి వెంకయ్య నాయుడు పరవశిస్తున్నారా?. చంద్రబాబు మాతృబాషలోనే విద్యా బోధన జరగాలని అన్నందుకు వెంకయ్య సంతోషించారు. విద్యాబోధన పదో తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో జరగాలని అన్నారు. మరి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందో, లేదో వెంకయ్య అడిగి తెలుసుకుని ఉండాలి. అలాగే చంద్రబాబు మనుమడు కాని, ఆయన బంధుమిత్రులలో ఎందరు తెలుగు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారో ఆరా తీసుకుని మెచ్చుకుని ఉంటే బాగుండేది కదా!. 👉ఇక్కడే సమస్య వస్తోంది. తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసే చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితర ప్రముఖుల కుటుంబాలలో ఎంతమంది దానిని పాటిస్తున్నారో ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదు. కేవలం పేదలు, బలహీన వర్గాల వారు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే తెలుగు మీడియం ఉండాలని అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. సోషల్ మీడియాను అదుపులో పెట్టకపోతే పరిణామాలేమిటో ఏపీలో చూశామని, దాని పరిణామాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు కూడా ఏదో తెలుగుదేశం నాయకుడు మాట్లాడినట్లే స్పీచ్ ఇవ్వడం దురదృష్టకరం. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా ఈయన ఎన్నడైనా నోరు తెరిచారా? అప్పుడేమో భావ వ్యక్తికరణ స్వేచ్చ అని చంద్రబాబు.. ఎల్లో మీడియా ప్రచారం చేశారే. సీఎంగా ఉన్న జగన్‌ను పట్టుకుని బూతులు తిట్టినా కేసులు పెట్టడానికి వీలులేదని వాదించారే. ఆ విషయాలు వెంకయ్య నాయుడుకు తెలియకుండా ఉంటాయా? 👉అధికారంలోకి వచ్చాక సైతం వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వారు ఎంత అరాచకంగా వ్యవహరిస్తునేది ఆయన తెలుసుకోలేక పోతున్నారు. కావాలంటే టీడీపీ వారు పెట్టిన బండబూతుల పోస్టింగులు చూడాలని ఆయన భావిస్తే.. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటివారు పంపిండానికి సిద్దంగా ఉంటారు. అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివి అవి రాసే పచ్చి అబద్దాలనే ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఉప రాష్ట్రపతి పదవి చేసిన పెద్దాయన ఎవరూ అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని అన్ని పార్టీల వారికి చెప్పాలి కాని, ఒకవైపే మాట్లాడడం సమంజసం అనిపించదు.👉అంతెందుకు జగన్ ప్రభుత్వం(Jagan Government)పై ఎన్ని అసత్య ఆరోపణలు చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తెలియదా?. వెంకయ్య నాయుడుకు అవి సూక్తి ముక్తావళిలా నిపించేవేమో తెలియదు. అప్పులపై చంద్రబాబు, పవన్, పురందేశ్వరి తదితరులు చేసిన పచ్చి అబద్దాలు ఇప్పుడు ఆధార సహితంగా కనిపిస్తున్నాయే. అసెంబ్లీ సాక్షిగానే స్వయంగా ఆర్థిక మంత్రి కేశవ్ అవి అబద్దాలని అంగీకరించారే. అలా ఆర్గనైజ్డ్గా మూడు పార్టీల నేతలు అబద్దాలు ప్రచారం చేయడం నేరమో, కాదో వెంకయ్య నాయుడు చెప్పగలిగి ఉంటే బాగుండేది. వైఎస్సార్సీపీ వారికి పనులు చేయవద్దని ఆదేశిస్తున్న చంద్రబాబు నాయుడును అభివృద్ధి కాముకుడని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి?. కనీసం అలాంటి వివక్ష వద్దని చంద్రబాబుకు సలహా ఇవ్వలేక పోయారే! ఏది ఏమైనా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన వెంకయ్య నాయుడు.. ఏపీలో ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీని సమర్థిస్తున్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అరాచక పరిస్థితులపై స్పందించ లేకపోవడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాలా వ్యాఖ్యాత. -
అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నటుడు నాగచైతన్యతో వివాహం, విడాకులు తరువాత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. సినీ పరిశ్రమలో అందం, ప్రతిభతో తానేంటో నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్గా అభిమానుల మనసుల్లో తన చోటును సుస్థిరం చేసుకుంది. తాజాగా సమంతాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.సమంత నిశ్చితార్థ ఉంగరాన్ని సరికొత్తగా మార్చేసినట్టు తెలుస్తోంది. తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను లాకెట్టుగా మార్చేసిందని తాజా నివేదికల సమాచారం. ఈ మేరకు సూరత్‌కు చెందిన ఆభరణాల డిజైనర్ ధ్రుమిత్ మెరులియా అంచనాలు వైరల్‌గా మారాయి. నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత, ఈ జంట 2021 లో విడాకులు తీసుకుంది. విడాకుల తీసుకున్న ఇన్నేళ్లకు ఇపుడు సమంత తన డైమండ్ రింగ్‌ను లాకెట్టుగా మార్చుకుంది. 3 క్యారెట్ల ప్రిన్సెస్-కట్ డైమండ్ రింగ్‌ను లాకెట్‌గా ఎలా మార్చుకుందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. దీన్ని క్రమం తప్పకుండా ధరిస్తోందని, ఇది ప్రస్తుత ట్రెండ్ అంటూ పేర్కొన్నాడు. అయితే దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ ధ్రుమిత్ మెరులియా ఊహ మాత్రమే అయినప్పటికీ, ఇది ఫ్యాన్స్ మరియు, నెటిజనులను మనసులను కదిలించింది. View this post on Instagram A post shared by Dhrumit Merulia (@dhrumitmerulia) కాగా 2024లో, సమంత తన వెడ్డింగ్ గౌను అవార్డుల వేడుక కోసం కొత్తగా డిజైన్ చేయించుకుంది. వైట్ వెడ్డింగ్ గౌనును నల్లటి సాసీ గౌనుగా మార్చి ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ దీనికి న్యూలుక్‌ను తీసుకురావడం విశేషం. దీంతో అభిమానులు దీనిని 'రివెంజ్ డ్రెస్' అని కూడా ట్యాగ్ చేశారు. ఈ డ్రెస్ ఫోటోలను కూడా సమంత ఇన్‌స్టాలో పంచుకుంది. గౌను ధరించిన చిత్రాలను పంచుకుంది. మన భూమాత రక్షణ కోసం, తన జీవన శైలిని సస్టైనబుల్‌గా మార్చుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో మనం తీసుకునే ప్రతీ చిన్న నిర్ణయాత్మక చర్య చాలా ముఖ్యం.అందరూ దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొంది. అంతేకాదు విడాకుల తర్వాత, సాధారణంగా ఒక అమ్మాయి 'సెకండ్ హ్యాండ్', 'ఆమె జీవితం వృధా అయింది' లాంటి ముద్రలు వేస్తారు. ఇది ఆమెకు, ఆమె కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది. ఇక అంతా అయిపోయినట్టు, విఫలమై నట్లు భావిస్తారు. ఇది తనకు చాలా బాధపెట్టిందని, కానీ తాను విడాకులు తీసుకున్నాననే వాస్తవాన్ని జీర్ణించుకుంటున్నట్టు చెప్పింది. అలాగే తన పెళ్లి గౌనును మార్చుకోవడం అనేది ప్రతీకారం కోసం ఎంతమంత్రం కాదని, తన బలానికి అదొక చిహ్నమని సమంతా స్పష్టం చేసింది. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!…సమంతతో విడాకుల తరువాత నాగ చైతన్య డిసెంబర్ 2024లో నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. అలాగే సమత ది ఫ్యామిలీ మ్యాన్ 2 , సిటాడెల్: హనీ బన్నీ లాంటి సిరీస్‌లతో కలిసి పనిచేసిన రాజ్ & డీకే ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందన్న పుకార్లు బాగా వినిపిస్తున్నాయి. -
సోషల్ మీడియాలో ఇంటిపంటల వైభవం!
సేంద్రియ ఇంటిపంటలు / మిద్దె తోటల సాగు ద్వారా పట్టణాలు, నగరాల్లోని గృహస్తులు తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలతో పాటు కొంత వరకు పండ్లను కూడా మేడలపైనే సాగు చేసుకుంటున్నారు. వీరి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ఉంటుంది. గత కొద్ది సంవత్సరాల్లో ఇంటిపంటల సాగు సంస్కృతి ఇబ్బడి ముబ్బడిగా విస్తరించింది. ఇంటిపంటలు / మిద్దె తోట సాగులో ముఖ్య భూమిక మహిళలదే అని చెప్పొచ్చు. అవగాహన పెంచుకొని సంతృప్తికరంగా వంటింటి వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారు చేసుకొని, ఇంటిపంటల సాగుకు ఆ కంపోస్టును ఉపయోగిస్తున్నారు. తమ కుటుంబం ఆరోగ్యం కోసం సేంద్రియ పంటలను పెంచుతున్న సాగుదారులు వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. మిద్దె తోటల నిపుణులు, ప్రచారకర్త తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ మిద్దెతోట అనుభవాలను పంచుకోవటానికి, సందేహాలను నివృత్తి చేసుకోవటానికి ఉపయోగపడే ఫేస్బుక్ పేజీలు, యూట్యూబ్ ఛానళ్లు, వాట్సప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఆయన తన మిద్దె తోట అనుభవాలను ఫేస్బుక్ వాల్‌పై సంవత్సరాల తరబడి సీరియల్‌గా రాశారు.అంతేకాదు, తోటి మిద్దెతోట సాగుదారులతో కూడా అనుభవాలను రాయించారు. వంద మంది రాసిన అనుభవాలతో రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా సంకలనం ప్రచురించటం విశేషం. సుమారు 60కి పైగా వాట్సప్ గ్రూపులను తుమ్మేటి నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా అర్బన్ టెర్రస్ ఫార్మర్స్ చాలా మంది ఎక్కడికక్కడ తమ బంధుమిత్రులతో వాట్సప్ గ్రూప్‌లు లెక్కకు మిక్కిలిగాప్రారంభించారు. మిద్దె తోటల సాగుదారులు యూట్యూబ్ వీడియోలను చూసి ఇతర కిచెన్ గార్డెనర్ల అనుభవాలను తెలుసుకుంటూ తమ కిచెన్ గార్డెనింగ్ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకుంటున్నారు. కొందరు ఇంటిపంటల సాగుదారులు మరో ఒకడుగు మందుకు వేసి తామే సొంతంగా యూట్యూబ్ ఛానళ్లనుప్రారంభించారు. సీనియర్ మిద్దె తోట సాగుదారు, వాట్సప్ గ్రూప్‌ల నిర్వాహకురాలు లతా కృష్ణమూర్తి అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 411 పైగా యూట్యూబ్ ఛానళ్లు సేంద్రియ మిద్దె తోటలకు సంబంధించిన విషయాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి. మిద్దె తోట సాగుదారులు యూట్యూబర్లుగా మారి విస్తృతంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వీరిలో కొందరు తమ యూట్యూబ్ ఛానళ్లను మానిటైజ్ చేయటం ద్వారా మంచి ఆదాయాన్ని సైతం పొందుతుండటం విశేషం. ఆర్థిక సాధికారతతో శక్తి వంతంగా ఎదుగుతున్నారుమిద్దెతోటల పెంపకం ద్వారా మహిళలు, ముఖ్యంగా గృహిణులు, ఇంటికే పరిమితం కాకుండా పది మందిలోకి ధైర్యంగా రాగలుగుతున్నారు. కుటుంబ బాధ్యతలు కొంత తీరిన తర్వాత వారికంటూ కొంత సమయం కేటాయించుకుంటున్నారు. అది కుడా మిద్దెతోటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంచుకుంటున్నారు. రసాయన రహిత ఆహారప్రాముఖ్యతను గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా అందరికీ తెలియజేస్తూ, ఇంటిపంట సాగుదారుల సంఖ్యను పెంచటంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఎంతో కొంత ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. మరొకరిపై ఆధాపడకుండా ఆర్థిక సాధికారతతో శక్తి వంతంగా ఎదగగలుగుతున్నారు. కొందరు మిద్దెతోటలకు కావలసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇంకొంత మంది మిద్దెతోటలను నిర్మాణంతో పాటు మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. మిద్దెతోట సాగుదారులుగా, యూట్యూబర్లుగా సాధారణ మహిళలు సాధికారత సాధించడం ఎంతో అభినందించాల్సిన విషయం. మిద్దెతోటల గురించి అవగాహన కల్పించడానికి 411కి పైగా తెలుగు యూట్యూబ్ ఛానెల్స్ రావడం మంచి విషయం. ఇంకా చాలా మంది మిద్దె తోటలు పెంచడానికి ముందుకు రావాలని మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను.– లతా కృష్ణమూర్తి (94418 03407), సీనియర్ మిద్దెతోట సాగుదారు, హైదరాబాద్– పంతంగి రాంబాబు -
‘పోసాని’పై ఎలాంటి కఠిన చర్యలొద్దు
సాక్షి, అమరావతి/నరసరావుపేట టౌన్/కర్నూలు (టౌన్) : సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సినీనటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని విశాఖపట్నం వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అలాగే, గుంటూరు పట్టాభిపురం, అల్లూరి జిల్లా పాడేరు, మన్యం జిల్లా పాలకొండ పోలీ స్స్టేషన్లలో నమోదైన కేసుల్లో పోసానికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 (3) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ అమలుచేసిన నేపథ్యంలో, తనపై కేసు కొట్టేయాలంటూ పోసాని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏమాత్రం వర్తించని సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తదితరులను కించపరుస్తూ సోషల్ మీడియాలో మాట్లాడారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిపై పట్టాభిపురం, భవానీపురం, పాడేరు, పాలకొండ, విశాఖపట్నం వన్‌టౌన్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పోసాని తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. భవానీపురం పోలీసులు ఇప్పటికే పీటీ వారెంట్‌ను అమలుచేసినందున పోసాని పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యా యమూర్తి జస్టిస్ హరినాథ్.. అదనపు ఏజీ, పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ పోసాని క్వాష్ పిటిషన్‌ను కొట్టేశారు. విశాఖ వన్‌టౌన్ పోలీసులు నమోదుచేసిన కేసులో మాత్రం పోసానిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.పోసానికి బెయిల్ మంజూరు..పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ నరసరావుపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్. ఆశీర్వాదం పాల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇద్దరు జామీన్‌దారులు ఒక్కొక్కరు రూ.10 వేలు పూచీకత్తు చొప్పున సమర్పించేలా ఉత్తర్వులు జారీచేశారు. రాజంపేట సబ్జైల్లో ఉన్న పోసానిని ఈనెల 3న పీటి వారెంట్‌పై నరసరావుపేట టూటౌన్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ అనంతరం గుంటూరు సబ్‌జైలులో ఉన్న ఆయనను పీటి వారెంట్‌పై కర్నూలు పోలీసులు అక్కడ నమోదైన కేసులో తీసుకెళ్లి కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం ఆదోని సబ్జైల్లో పోసాని ఉన్నారు. ఇక పోసానిపై ఆదోని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను సోమవారం కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్‌సీఎం) అపర్ణ డిస్మిస్ చేశారు. అలాగే, బెయిల్ పిటిషన్‌పై వాదనలు కూడా ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. మంగళవారం తీర్పు వెలువడనుంది. -
అవార్డ్ అందుకున్న సుకుమార్ భార్య.. వైట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ పోజులు!
డిఫరెంట్ లుక్స్‌తో ఆదా శర్మ హోయలు..ఐఫా అవార్డ్స్ వేడుకల్లో మెరిసిన కత్రినా కైఫ్..అవార్డ్ అందుకున్న తబిత సుకుమార్..వైట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ పోజులు..వేకేషన్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ నీలం ఉపాధ్యాయ.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
రీల్స్, యూట్యూబ్ మోజులో పిల్లలు, తలలు పట్టుకుంటున్న పేరెంట్స్
నా కూతురు 8వ తరగతితో చదువు మానేసింది. యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంటోంది. భారీ పెట్టుబడి లేకుండానే త్వరగా డబ్బు సంపాదించవచ్చని అంటోంది. కౌన్సెలింగ్ కూడా ఇప్పించా. అయినా ఫలితం లేదు. ఆమె మనసును ఎలా మార్చాలో తెలియడం లేదు..- హైదరాబాద్‌కు చెందిన ఓ తండ్రి బాధ మా అమ్మాయిలు ఒకరు 9, మరొకరు8 చదువుతున్నారు. ఇటీవలే రీల్స్ చేయడంఅలవాటు చేసుకున్నారు. మొదట్లో మేం కూడా సరదాగా ఎంకరేజ్ చేశాం. ఇప్పుడు అదే పనిలో పడిపోయి చదువును పూర్తిగా అటకెక్కించారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. - వరంగల్ జిల్లాకు చెందిన ఓ తల్లి ఆవేదనపిల్లల మనసు మార్చాలని మా వద్దకు తీసుకొస్తే.. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరు అంటూ ఎదురు ప్రశ్నలేస్తున్నారు.. - మానసిక వైద్యులు చెబుతున్నది ఇది బాల్యం సోషల్ మీడియా వలలో చిక్కి విలవిల లాడుతోంది. రీల్స్, యూట్యూబ్ చానల్స్‌తో లక్షలు సంపాదించొచ్చన్న ఇన్ఫ్లుయెన్సర్ల మాటలగారడీలో పడి స్కూలు పిల్లలు కూడా జీవితాలు పాడుచేసుకుంటున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అంతటా ఈ జాడ్యం పెరుగుతోంది. దీంతో స్కూల్ పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి తగ్గిపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు -సాక్షి, హైదరాబాద్చదువు కోసం మొదలై.. కరోనా లాక్డౌన్ సమయంలో పిల్లల చదువు పాడవకూడదని అందరూ ఆన్లైన్ చదువుల వైపు మొగ్గారు. అందుకోసం పిల్లలకు పర్సనల్ కంప్యూటర్స్, ఫోన్లు, ట్యాబులు కొనిచ్చారు. ఇప్పుడు అదే పాపంగా మారింది. ఆన్లైన్లో అధిక సమయం గడపడంతో పిల్లలకు క్విక్ మనీకి బోలెడు మార్గాలు కనిపించాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సహా అనేక అంశాలపై అర్థసత్యాలు, అసత్యాలతో కూడిన అనవసర పరిజ్ఞానాన్ని అందించాయి. ‘హౌ టు మేక్ 30 లాక్స్ ఇన్ 2 ఇయర్స్’వంటి ఊరింపులు టీనేజ్ ఆలోచనలను కలుషితం చేశాయి.సంపాదనకు వెల్కమ్.. స్కూల్‌కు బైబై...సోషల్ మీడియాకు బానిసైన 8 లేదా 9వ తరగతి విద్యార్థుల్లో చాలామంది పాఠశాలకు వెళ్లడానికి కూడా ఇష్టపడడం లేదు. తాము సుఖంగా బతకడానికి సంప్రదాయ విద్య సరిపోదని వీరు బలంగా నమ్ముతున్నారు. ‘సోషల్ మీడియా ద్వారా కొందరు సులభంగా డబ్బు, పాపులారిటీ సంపాదించడాన్ని చూసి తామూ అలాగే చేయగలమని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. పాఠశాలలో గడిపే కాలం వృథా అనే ప్రమాదకర అభిప్రాయం పెంచుకుంటున్నారు’ అని సైకాలజిస్ట్ అరుణ్ చెప్పారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించాలని కొందరు, తమ వ్యాపార ఆలోచనలకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చాలని ఇంకొందరు, సేవా సంస్థను ప్రారంభించాలని/ ఇన్ఫ్లుయెన్సర్ / సింగర్‌గా మారాలని.. ఇలా ఏవేవో కోరుకుంటున్నారు. వీరిలో కొందరు చాలా మొండిగా తయారవుతుండడంతో వారికి కౌన్సెలింగ్ కూడా పనిచేయడం లేదని సైకాలజిస్టులు చెబుతున్నారు. బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువఇటీవల ఈజీ మనీ మీద టీనేజర్లలో బాగా ఆసక్తి పెరిగింది. అది వారి చదువు మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ఇది బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువ కనిపిస్తోంది. గేమింగ్‌తో సహా రకరకాల యాప్స్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లల్ని వాటికి దూరం చేసి ఎలాగోలా చదువు మీద దృష్టిపెట్టేలా చేయమని మమ్మల్ని సంప్రదించే తల్లిదండ్రులు పెరిగారు. అయితే ఈ వ్యసనాన్ని ముదరనీయకుండా ప్రాథమిక దశలోనే గుర్తించి తుంచాల్సిన అవసరం ఉంది. దీనిపై స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫోన్ల ద్వారా కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. - డా. పృథ్వీ రెడ్డి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కరీంనగర్ జాగ్రత్తగా డీల్ చేయాలిస్కూల్ విద్యతో ఉపయోగం లేదని 13–15 ఏళ్ల మధ్య వయస్కులు కొందరు పాఠశాల నుంచి నిష్క్రమించాలని కోరుకుంటున్నారు. దీంతో పిల్లలు కనీసం ఇంటర్ పూర్తి చేసినా చాలని, మందులతోనైనా బాగు చేయాలని వారి తల్లిదండ్రులు అడుగుతున్నారు. నా దగ్గరకు కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చిన ఓ టీనేజ్ అమ్మాయి ఆన్లైన్లో ఓ రీల్ చూపించి తన వయసే ఉన్న ఓ టీనేజర్ రూ.30 లక్షలు సంపాదించిందని.. మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరని చెప్పింది. ఫ్రెండ్స్ అంతా కలిసి ప్లాన్ చేసుకుని మరీ డ్రాప్ అవుట్స్‌గా మారుతున్నారు. వీరిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. గైడెన్స్, అవేర్నెస్ అందించాలి. మన విద్యా విధానం కూడా మారాలి. చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలి.- డా.చరణ్ తేజ, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, హైదరాబాద్ -
చికాగో టూ కశ్మీర్..యువరాణిలా డ్రీమీ వెడ్డింగ్: వావ్ అంటున్న నెటిజన్లు
భారతీయ పెళ్లిళ్లలో తమదైన బ్యూటీతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు పెళ్లి కూతుళ్లు. అత్యంత సుందరంగా ముస్తాబవుతో యువరాణులను మరపిస్తున్నారు. మేకప్ నుంచి డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, మెహిందీ, ఇలా ప్రతీదాంట్లోనూ రాయల్ లుక్స్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. కోరుకున్న కలల రాకుమారుడిని పెళ్లి చేసుకునే క్షణాలను అపురూపంగా దాచు కునేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ఎంచుకుంటున్నారు. ఈ డ్రీమీ వెడ్డింగ్ స్టైల్ చికాగోకు చెందిన ఒక వైద్యురాల్ని విపరీతంగా ఆకర్షించింది. అందాల కశ్మీరంలో.. తన వివాహ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించి ఒక వీడియో నెట్టింట సందడి చేస్తోంది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా!చికాగోకు చెందిన డాక్టర్ పైజ్ రిలే(Paige Riley) తన వివాహ వేడకలతో అందర్నీ అబ్బురవపర్చింది. కాశ్మీరీ వధువుగా మారి తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్ చేసుకుంది. మేకప్ దుస్తులు, అలంకరణ, మెహిందీ ఇలా ప్రతీదీ స్పెషల్‌గా ఉండేలా జాగ్రత్తపడి కశ్మీరీ పెళ్లి కూతురిలా మెరిసి పోయింది. రాహుల్ మిశ్రా రూపొందించిన పీకాక్, పూల డిజైన్‌లో ఐవరీ కలర్ లెహెంగా, షీన్ దుపట్టాతో అందర్మీ మెస్మరైజ్ చేసింది. తన జుట్టును కర్ల్స్‌తో అలంకరించుకుంది. పచ్చల హారం, ఝుంకాలు, గాజులు, ఉంగరంతో చోకర్ ఇలా భారతీయ ఆభరణాల్లో అమె అందం మరింత ఎలివేట్ అయింది. దీనికి తోడుగా సింపుల్‌గా ఐషాడో, బ్లష్, మస్కారా, బిందీతో మేకప్ చేసుకుంది. View this post on Instagram A post shared by JAMMU MAKEUP ARTIST (@sabihabeig) ఇక మెహెందీ వేడుక కోసం హౌస్ ఆఫ్ మసాబా నుండి అందమైన పసుపు-టోన్డ్ లెహంగాను లెహెంగాను ఎంచుకుంది. నక్సీ డిజైన్‌లో వెండి జరీ వర్క్‌తో పాటు గులాబీ రంగుల్లో టెంపుల్ వర్క్‌తో తయారు చేయబడింది. స్లీవ్‌లపై పూల ప్రింట్లు ఉన్నాయి. అలాగే ఈ లెహెంగాతో డ్యూయల్ దుపట్టాలను ధరించింది. View this post on Instagram A post shared by JAMMU MAKEUP ARTIST (@sabihabeig) దీనికి సంబంధించిన వీడియో చూసినెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. ‘‘భలే అందంగా ఉన్నారు’’ ‘ప్రిన్సెస్‌లా ఉన్నారు. డ్రెస్ అద్భుతంగా ఉంది’, "మీరు డ్రెస్ చేసుకున్న విధానం నాకు చాలా నచ్చింది, వావ్ అచ్చం కాశ్మీరీ పండిట్లా ఉన్నారు.. లాంటి కామెంట్స్ వెల్లువెత్తాయి. -
#SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి?
ఒక ప్రొడక్టును సృష్టించడం కంటే.. దాని మార్కెటింగ్ ఎంత బాగా చేశామనేది వ్యాపారంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం. మన దేశంలో.. సినిమా అనే వ్యాపారంలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిని ఈ విషయంలో కొట్టగలిగేవారే లేరని ఇంతకాలం చెప్పుకున్నాం. అయితే తాజా #SSMB29 లీక్‌లతో ఈ విషయంలో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.సినిమా మేకింగ్‌లో రాజమౌళి(Rajamouli)ది ఢిపరెంట్ స్కూల్. హీరోలతో సహా ప్రతీ టెక్నీషియన్‌కు కార్పొరేట్ కల్చర్ తరహాలో ఐడీ కార్డు జారీ చేస్తుంటారు. సెట్స్‌కి మొబైల్స్ తేవడం బ్యాన్.. అంతేకాదు ఈ విషయంలో ప్రత్యేక నిఘా కూడా పెడుతుంటారు. ఇలా.. ఒక సినిమా షూటింగ్ విషయంలో ఇంత జాగ్రత్తలు పాటిస్తుంటాడు దర్శకుధీరుడు. అంతెందుకు ఓ సినిమా మేకింగ్‌నే(RRR) ఏకంగా ఒక డాక్యుమెంటరీగా తీయించి వదిలిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. అలాంటిది మహేష్ బాబుతో తీస్తున్న చిత్రం విషయంలో ఎక్కడ పారపాటు.. కాదు పొరపాట్లు జరుగుతున్నాయి?.సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరో. మళయాళ స్టార్ హీరో ఫృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఓ కీలక పాత్ర. ఏకంగా.. ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్. ఇంకా ఊహించని సర్ప్రైజ్లు ఎన్నెన్నో ఉండొచ్చు. అలాంటిది పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇలాంటి లీక్‌లతో అవన్నీ బయటకు వచ్చేయవా?..ఎక్కడో ఒడిషాలో మారుమూల చోట ప్రత్యేక సెట్టింగులలో షూటింగ్ జరుపుకుంటోంది SSMB20 చిత్రం. తొలుత అక్కడి పోలీస్ అధికారులతో దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ వెంటనే అక్కడి ఛానెల్స్‌లో సెట్స్‌ను లాంగ్‌షాట్స్‌లో లైవ్ చూపించేశాయి. ఆ మరుసటి రోజే.. మహేష్ బాబు పాల్గొన్న షూటింగ్ సీన్.. అదీ చాలా క్లోజప్ షాట్లో బయటకు రావడం ఎంబీఫ్యాన్స్‌నే కాదు.. యావత్ చలనచిత్ర పరిశ్రమేనే షాక్‌కు గురి చేసింది . దీంతో ఆ వీడియోను తొలగించే చర్యలు చేపట్టినట్లు చిత్ర యూనిట్ తరఫు నుంచి ఒక ప్రకటన బయటకు వచ్చింది.ఆర్ఆర్ఆర్ తరహాలోనే.. మహేష్ బాబు సినిమాకు సైతం సెట్స్‌కు ఫోన్లు తేవడం నిషేధించారు. అయినప్పటికీ ఆ సీన్‌ను ఎవరు.. ఎలా షూట్ చేశారు?. అదీ అది అంత దగ్గరగా ఉండి మరీ?. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్‌లకు బయటి వాళ్లను అనుమతించరు. షూటింగ్ కోసం తెచ్చే జూనియర్ ఆర్టిస్టులకు సైతం స్ట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తుంటాయి. అలాంటప్పుడు లీకులకు అవకాశం ఎక్కడిది?. పనిరాక్షసుడిగా పేరున్న ఆయన పెట్టిన రూల్స్ బ్రేక్ చేసిందెవరు?. కొంపదీసి.. ఇది కావాలని చేసిన లీక్ కాదు కదా! అనే చర్చ సైతం ఇప్పుడు జోరుగా నడుస్తోంది. అయితే..సినిమా ప్రమోషన్ విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అంతేగానీ ఇంత చెత్తగా మాత్రం ఉండదు!. సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతతో మంచి నీళ్లలా డబ్బులు ఖర్చు చేయిస్తాడనే విమర్శ కూడా జక్కన్న మీద ఉంది కదా. అలాంటప్పుడు భారీ బడ్జెట్‌తో.. అదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో ఇలా ఎందుకు జరగనిస్తాడు?. ఏది ఏమైనా రాజమౌళి-మహేష్ బాబు సినిమా నుంచి.. అదీ షూటింగ్ మొదలైన తొలినాళ్లలోనే ఇలాంటి లీకులు కావడంతో.. వాట్ ద F*** అని ఒక్కసారిగా అనుకుంది టీఎఫ్ఐ అంతా. ఇంత చర్చ నడుస్తుండడంతో.. ఇకనైనా లీకుల విషయంలో జాగ్రత్త పడతారేమో చూడాలి మరి!.ఇదీ చదవండి: రాజమౌళికి బిగ్ షాక్.. మహేష్ బాబు వీడియో బయటకు! -
వీడియో: అమ్మాయిని పగబట్టిన కుక్కలు.. భయానక దాడి
జైపూర్: ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు రావడమే ఆమెకు శాపమైంది. దాదాపు 10 వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఆమెకు వెంటాడి మరీ గాయపరిచాయి. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని అల్వర్ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. అల్వర్‌లోని జేకే నగర్‌కు చెందిన నవ్య ఫోన్ మాట్లాడుతూ ఇంటి బయటకు వచ్చింది. ఫోన్ మాట్లాడుకుంటూ అలా కొంత దూరం ముందుకు నడిచింది. ఈ క్రమంలో 10-12 కుక్కలు అకస్మాత్తుగా ఆమెపైకి వచ్చి దాడి చేశాయి. అనంతరం నవ్య పరుగులు తీస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కుక్కలు ఆమెపై దాడి చేయడం వల్ల నవ్య కింద పడిపోయింది. అయినప్పటికీ కుక్కలు వదలకుండా ఆమెపై దాడి చేశాయి.ఈ సమయంలో పక్కన ఉన్న ఇంట్లో వారు, స్కూటీపై వెళ్తున్న మహిళ వెంటనే స్పందించి కుక్కలను తరిమేశారు. దీంతో, నవ్యపై దాడిని ఆపేసి పారిపోయాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ఘటన తర్వాత బాధితురాలు, ఫిజియోథెరపీ చదువుతున్న నవ్య మాట్లాడుతూ.. కుక్కల దాడి కారణంగా చాలా భయపడినట్లు చెప్పింది. రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇలా జరిగిందని వెల్లడించింది. పలుచోట్ల గాయాలైనట్టు తెలిపింది.ఇదిలా ఉండగా.. ఈ ఘటన తర్వాత వీధి కుక్కలకు ఆహారం పెట్టే ఓ మహిళను స్థానికులు మందలించారు. వీధి కుక్కల దాడులు పెరగడానికి ఇదే కారణమని చెప్పారు. గత ఐదేళ్లుగా వీధి కుక్కలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని ఈ ప్రాంత కౌన్సిలర్ అన్నారు. ఈ సమస్యను మున్సిపల్ కార్పొరేషన్ బోర్డులో అనేకసార్లు లేవనెత్తానని, కానీ ఎటువంటి పరిష్కారం చూపించలేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. Is there any city in India that does not have to suffer because of street dogs. This is from Alwar in Rajasthan. pic.twitter.com/0dmZaNdFpu— Ravi Handa (@ravihanda) March 8, 2025 -
ఆగని కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు
-
మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ అరుదైన నిర్ణయం
-
వణక్కం.. ఇక అంతా వీళ్ల చేతుల్లోనే!
న్యూఢిల్లీ, సాక్షి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మహిళా దినోత్సవం సందర్భంగా.. నారీశక్తికి వందనం అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి అత్యంత అరుదైన నిర్ణయం తీసుకున్నారాయన. తన సోషల్ మీడియా అకౌంట్ల బాధ్యతలను ఎంపిక చేసిన మహిళలకు అప్పజెప్పారు. ఈ క్రమంలోనే వణక్కం.. అంటూ ఆయన ఖాతా నుంచి ఓ పోస్ట్ అయ్యింది.ఇవాళ తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతను ఇండియన్ గ్రాండ్ చెస్ మాస్టర్ వైశాలి రమేష్‌బాబు(Vaishali Rameshbabu)కి అప్పగించారు. ఇదే విషయాన్ని మోదీ ఎక్స్ ఖాతా నుంచి వైశాలి తెలియజేశారు. తాను చెస్ ప్లేయర్‌నని, దేశం తరఫు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని పోస్ట్ చేశారామె. ప్రధాని ఖాతాను నిర్వహించడం తనకు దక్కిన గౌరవమని అన్నారు. ఈరోజంతా ఆమే ఆయన ఖాతా బాధ్యతలను చూసుకోనున్నారు. ఆరో ఏట నుంచి నేను చెస్ ఆడుతున్నాను. అది నాకొక ఉత్తేజకరమైన ప్రయాణం. మీరు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా మీ కలలు సాకారం చేసుకోవడానికి ముందుకుసాగండి. ఆడపిల్లలకు అండగా నిలవాలని తల్లిదండ్రులు, తోబుట్టువులను ఈసందర్భంగా కోరుతున్నాను. వారి సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. వారు అద్భుతాలు చేయగలరు అని వైశాలి సందేశం ఉంచారు. మరోవైపు.. వైశాలితో పాటు న్యూక్లియర్, స్పేస్ సైంటిస్ట్‌లు అయిన ఎలినా మిశ్రా, శిల్పి సోనీ.. మోదీ ఖాతా నుంచి పోస్టులు పెట్టారు. భారతదేశం సైన్స్ పరిశోధనలకు అత్యంత అనుకూలమైన ప్రదేశమన్నారు. మరింత ఎక్కుమంది మహిళలు ఈ రంగాన్ని ఎంచుకోవాలని కోరారు.నేను అనితా దేవిని.. నలందా జిల్లాకు చెందిన అనితాదేవి ప్రధాని ఖాతా నుంచి తన విజయాలు వెల్లడించారు. ‘‘నేను జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. నా కాళ్ల మీద నిలబడి, సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఉండేది. 2016లో ఆ దిశగా అడుగేశాను. అప్పుడే స్టార్టప్‌లపై క్రేజ్ పెరుగుతోంది. నేను కూడా మాదోపుర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను ప్రారంభించాను. నాతో కలిసి పనిచేసిన మహిళలు స్వయంసమృద్ధి సాధించడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది. వారి కుటుంబాలు బాగుపడటం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆర్థిక స్వాతంత్య్రం మహిళలకు గౌరవాన్ని ఇస్తుందని నా నమ్మకం. మీరు అంకిత భావం, కృషితో ముందుకుసాగాలని బలంగా అనుకుంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు’’ అంటూ తన స్టోరీ వెల్లడించారు.ప్రధాని మోదీ గతంలోనూ ఇలానే తన సోషల్ మీడియా అకౌంట్లను స్ఫూర్తిదాయకమైన మహిళలకు అప్పగించారు కూడా. ఇక.. మహిళా దినోత్సవం(Women's Day 2025) పురస్కరించుకొని ఇవాళ ప్రధాని భద్రతను కూడా పూర్తిగా మహిళా పోలీసులే పర్యవేక్షించనుండడం గమనార్హం. ప్రస్తుతం ఆయన గుజరాత్ పర్యటనలో ఉన్నారు. అంతకు ముందు తన మహిళా దినోత్సవ సందేశంలో.. ‘‘వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీయే ప్రభుత్వం మహిళా సాధికారికతకు కృషి చేస్తోంది’’ అని అన్నారాయన. -
వెంకీకో రూల్, రవితేజకు మరో రూల్ !
-
ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. రాజ్ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్‌ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్‌ఛైర్ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. అయితే.. ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారామె.అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె. -
రష్యాకు ట్రంప్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి ఒప్పందం కుదిరేదాకా రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు, టారిఫ్‌లు విధించాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రష్యా, ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని స్పష్టంచేశారు. ఆలస్యం కాకముందే ఆ పని ప్రారంభిస్తే బాగుంటుందని హితవు పలికారు. నిన్నటిదాకా రష్యా పట్ల సానుకూలంగా మాట్లాడిన ట్రంప్ హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, రష్యాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యాను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని, రష్యా ఉత్పత్తులపై అధికంగా టారిఫ్‌లు వసూలు చేస్తామని తేల్చిచెప్పారు. ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి ఆంక్షలు, టారిఫ్‌లను మరోసారి తెరపైకి తెచి్చనట్లు సమాచారం. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు ఉక్రెయిన్ను, మరోవైపు రష్యాను ఏకకాలంలో దారికి తీసుకురావాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. రష్యాపై కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పుతిన్ ప్రభుత్వం వాటికి తలొగ్గుతుందా? అనేది చూడాలి. -
ఇంటర్నెట్లాగే ఏఐతో కొత్త ఉద్యోగాలొస్తాయ్..
బెంగళూరు: గతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియాతో కొత్త కెరియర్లు వచ్చినట్లే కృత్రిమ మేథతో (ఏఐ) కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయని జోహో సీఈవో మణి వెంబు తెలిపారు. ఏఐ సొల్యూషన్స్‌కి సంబంధించి పాశ్చాత్య దేశాలకు భారత్ గట్టి పోటీదారుగా ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు. పుష్కలంగా నిపుణుల లభిస్తుండటం, దేశీయంగా సొల్యూషన్స్ రూపొందించుకోవాలన్న ఆకాంక్షలు పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలవని వెంబు చెప్పారు. ఏఐ కల్పించగలిగే అవకాశాలను విశాల దృక్పథంతో పరిశీలించి, తగు దిశలో ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఏఐ, కొత్త సాంకేతికతలను ఉపయోగించి తమ ప్రస్తుత సిబ్బంది ఉత్పాదకతను పెంచుకునే మార్గాలపై జోహో ప్రధానంగా దృష్టి పెడుతోందని వెంబు వివరించారు. మరోవైపు, అమెరికాలో విధానాలు, టారిఫ్‌లపరంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావాలను దేశీ ఐటీ పరిశ్రమ ఇప్పుడే అంచనా వేయలేదని, వేచి చూసే ధోరణిని పాటించాల్సి ఉంటుందని వెంబు చెప్పారు. -
ప్రముఖ గాయనితో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం, ఫోటోలు వైరల్
యువ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya)తన ప్రియురాలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ (Singer Sivasri Skanda prasad)ను సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు. మార్చి 6, 2025న బెంగళూరులో జరిగిన ఒక సన్నిహిత, సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిలో కేంద్ర మంత్రి వి. సోమన్న, అన్నామలై, ప్రతాప్ సింహా, అమిత్ మాలవ్య, బి.వై. విజయేంద్ర ఉన్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దీంతో పలువురు నెటిజనులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందించారు.శివశ్రీ స్కంద ప్రసాద్ పసుపు కాంచీపురం పట్టు చీర, బంగారు ఆభరణాలలో కనిపించగా సూర్య వైట్ గోల్డెన్ కలర్ దుస్తులను ధరించారు. మరొక ఫోటోలో, వధువు ఎరుపు-మెరూన్ చీరలో, వరుడు ఆఫ్-వైట్ దుస్తులలో పెళ్లికళతో మెరిసారు.बेंगलुरु दक्षिण से सांसद श्री @Tejasvi_Surya जी एवं संगीत गायिका, भरतनाट्यम की प्रसिद्ध कलाकार शिवश्री स्कंदप्रसाद जी के शुभ विवाह समारोह में सम्मिलित होकर नवदंपत्ति को उनके मंगलमय दांपत्य जीवन के लिए शुभकामनाएँ व आशीर्वाद प्रदान किया। pic.twitter.com/S7n531yxmn— Arjun Ram Meghwal (@arjunrammeghwal) March 6, 2025 భక్తి , శాస్త్రీయ సంగీత అభిమానులకు సుపరిచితమైన శివశ్రీ, మణిరత్నం , AR రెహమాన్ కాంబోలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ మూవీలోని పాటతో చలనచిత్ర సంగీతంలోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ అలరించారు. అలాగే గత సంవత్సరం జనవరిలో అయోధ్యలో రామాలయం ప్రతిష్ట సందర్భంగా ఆమె విద్వత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా దక్కించుకుంది. దీంతోపాటు PVA ఆయుర్వేద ఆసుపత్రి నుండి ఆయుర్వేద కాస్మోటాలజీలో డిప్లొమా కూడా పొందింది. అలాగే 'ఆహుతి' వ్యవస్థాపకురాలు ,డైరెక్టర్ కూడా. శివశ్రీ యూట్యూబ్ చానెల్‌కు 2 లక్షల మందికిపైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.13 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. శివశ్రీ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్, మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ చదివారు. ఇక తేజస్వి సూర్య వృత్తి రీత్యా న్యాయవాది, ప్రస్తుతం ఆయన బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరపున వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 2019, 2024 ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sivasri Skandaprasad (@sivasri.skanda) -
‘సాక్షి’పై సర్కారు అక్కసు
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం నినదిస్తున్న ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతి రేక విధానాలను నిలదీస్తున్న ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులకు తెగబడుతోంది. రెడ్‌బుక్ కుట్రలో తాజా అంకంగా.. కేసు నమోదు చేయాలని రియ ల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)ను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ‘వాట్సాప్ గవర్నెన్స్’ విధానం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ యాప్ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించేదిగా ఉందని పలువురు నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో.. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కు పరిరక్షణకు బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా సాక్షి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్పందించింది. ‘మన మిత్ర.. మరో మారీచుడు’ శీర్షికన గతనెల 3న ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ అంశాలను కూడా ఇందులో ప్రస్తావించింది. ఆ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే అమాంతంగా పెరిగిపోతున్న సోషల్ మీడియా వేధింపులు, సైబర్ నేరాలు బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం వాటిల్లే పరిస్థితి తలెత్తడం అందర్నీ ఆందోళనపరిచింది. కానీ, ఆ కథనం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. ‘సాక్షి’ పత్రికపై కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసు వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
యాంత్రికంగా రిమాండ్లు సరికాదు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తుండటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఫిర్యాదులో లేని అంశాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి, నిందితులను రిమాండ్ కోసం హాజరు పరుస్తున్న సమయంలో మేజిస్ట్రేట్లు పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండానే రిమాండ్ విధించడం సరికాదని అభిప్రాయపడింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్, మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ అరెస్ట్ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో అన్ని అంశాలను లోతుగా పరిశీలిస్తామంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను అక్రమంగా నిర్భంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభియన్ గత ఏడాది హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. అభినయ్ తరఫు న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం కాలరాస్తున్నారన్నారు. ఈ వ్యాజ్యం పరిధిని విస్తృతం చేసి పోలీసులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వ్యంగ్యం కూడా నేరమైంది.. ప్రేమ్‌కుమార్ అరెస్ట్ విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత ఉదయం 8 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు చూపారని మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో అప్పుడే అరెస్ట్ చేసినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ పెద్దలపై వ్యంగ్యంగా విమర్శలు చేసినందుకే కేసులు పెట్టారని, వ్యంగ్యం కూడా నేరం కావడం ఇప్పుడే చూస్తున్నామన్నారు.ప్రేమ్‌కుమార్ బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారంటూ పోలీసులు కేసు పెట్టారని, వాస్తవానికి ఫిర్యాదులో అందుకు సంబంధించి ఎలాంటి ఆరోపణ లేదన్నారు. మేజి్రస్టేట్ ఈ విషయాన్ని పట్టించుకోకుండా రిమాండ్ విధించారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. సమగ్ర పరిశీలన చేయకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయడం సబబు కాదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. -
మా నియంత్రణ ఉండాల్సిందే..
పొద్దున గుడ్‌మార్నింగ్ మొదలు రాత్రి గుడ్‌నైట్ చెప్పే వరకు ఈ రోజుల్లో యువత ఎక్కువగా స్మార్ట్ఫోన్లలోనే గడుపుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరిలో ‘సోషల్’వాడకం పెరిగింది. ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్.. ఇలా ఎన్నో రకాల సోషల్ మీడియా యాప్‌లతోపాటు ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియా అకౌంట్ లేకపోతే నామోషీ అనే స్థాయికి స్కూల్ పిల్లలు సైతం వచ్చేశారు. ఇది చాలా నష్టం చేస్తోందని, పిల్లల సోషల్ మీడియా వాడకంపై కచ్చితంగా నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. వయసు తప్పుగా చూపి.. వాస్తవానికి సోషల్ మీడియా యాప్‌లలో ఖాతా తెరవాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఖాతా తెరవాలంటే వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. కానీ, వయస్సును తప్పుగా చూపిస్తూ 18 ఏళ్లలోపు వారు సొంతంగా సోషల్ మీడియా ఖాతాలు తెరవటం షరా మామూలైంది. దీంతో అవగాహన లేని వయస్సులో పిల్లలు సైబర్ విష ప్రపంచంలో కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఏదో ఒక అనర్థం జరిగేవరకు తల్లిదండ్రులకు తెలియటం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్– 2025ను తీసుకువచి్చంది. ఇందులో పలు కీలక అంశాలను చేర్చారు. 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతా తెరవాలన్నా, ఓటీటీ యాప్‌లు, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో చేరాలన్నా తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి చేశారు. ఈ నూతన నిబంధనలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను లోకల్ సర్కిల్స్ సంస్థ సేకరించింది. దేశవ్యాప్తంగా 349 జిల్లాల్లోని 44 వేలమంది పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను సర్వే చేసి ఈ సంస్థ నివేదికను రూపొందించింది. కాగా, ఏ వయస్సు చిన్నారులు తమ వయస్సును ఎంతశాతం ఎక్కువగా చూపి సోషల్ మీడియా ఖాతాలు తెరుస్తున్నారన్న అంశంపై బ్రిటన్ సంస్థ ఆఫ్కామ్ ఓ నివేదిక విడుదల చేసింది. వయస్సు తప్పుగా నమోదు చేస్తున్న వారిలో 8 నుంచి 17 ఏళ్లలోపు చిన్నారులు 77 శాతం సొంత ప్రొఫైల్స్‌తో సోషల్ మీడియా ఖాతాలు వాడుతున్నట్టు ఆ సంస్థ తెలిపింది. -
ఫోన్ లేకుంటేనే సూపర్ బ్రెయిన్!
మనిషి జీవితం ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌తోనే నడుస్తోంది. అలాంటిది అది లేకుండా ఒక్కరోజైనా ఉండగలమా?. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. అంతలా అడిక్ట్ అయ్యాం మరి!. అయితే ఫోన్ వాడకం వీలైనంత తగ్గించుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తుండడం చూస్తుంటాం. ఈ క్రమంలో తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా(Smart phone Less Use) ఉపయోగించడం వల్ల మెదడు అత్యంత చురుకుగా పని చేస్తుందట. జర్మనీకి చెందిన కోలోగ్నే, హెయిడెల్ బర్గ్ యూనివర్సిటీ సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకోసం త్రీడేస్ చాలెంజ్‌ను కొంతమందిపై ప్రయోగించారు. ఎంపిక చేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు 25 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. సుమారు 72 గంటలపాటు(దాదాపు మూడు రోజులు) కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే వాళ్లకు ఫోన్‌కు అనుమతించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా అడిక్షన్‌ను కూడా పరిశీలించారు. రీసెర్చ్‌కు ముందు.. తర్వాత ఆ వ్యక్తులకు ఎమ్మారై స్కాన్‌తో పాటు కొన్ని మానసిక పరీక్షలు నిర్వహించారు. పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. ఫోన్ తక్కువగా వాడిన వాళ్లలో బ్రెయిన్ అత్యంత చురుకుగా ఉండడం. అంతేకాదు.. వ్యసనానికి సంబంధించిన ‘‘న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థ’’కు సంబంధించిన మెదడు క్రియాశీలతలోనూ మార్పులను గమనించారట. తద్వారా ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే.. బ్రెయిన్ అంత ‘సూపర్’గా మారుతుందని ఒక అంచనాకి వచ్చారు. సుదీర్ఘంగా.. పదే పదే జరిపిన పరిశోధనలన (longitudinal Study) తర్వాతే తాము ఈ అంచనాకి వచ్చినట్లు చెబుతున్న పరిశోధకులు.. భవిష్యత్తులో మరింత స్పష్టత రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఏం చెప్పిందంటే..ఇక్కడో ఆసక్తికరమైన సంగతి చెప్పాలి. ప్రముఖ నటి సమంత ఈ మధ్యే త్రీడేస్ చాలెంజ్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశారు. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన ఆమె.. మూడు రోజులు ఫోన్‌కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఆ అనుభవాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘‘మూడు రోజులపాటు ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది కూడా. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ అభిమానులకు ఆమె సూచన ఇచ్చారు కూడా. -
పెళ్లి కూతురిలా మీనాక్షి చౌదరి.. బ్లూ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ!
బెంగళూరు ఈవెంట్లో డాకు మహారాజ్ బ్యూటీ..పెళ్లి కూతురిలా ముస్తాబైన మీనాక్షి చౌదరి...బ్లూ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ..తమిళంలో మొదటి ఆడిషన్ ఫోటోలు పంచుకున్న డ్రాగన్ బ్యూటీ..ప్రకృతి ఆస్వాదిస్తోన్న టాలీవుడ్ నటి శివాని రాజశేఖర్.. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) -
వారి కోసం జుకర్‌బర్గ్ ఫ్యావరెట్ హుడీ వేలం : మార్క్ డ్యాన్స్ వైరల్ వీడియో
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్‌బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్బుక్ స్టేషనరీలో రూపొందించారట.2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్‌లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్‌బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్‌బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్‌లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్‌బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్‌పైకి అద్భుతమైన నీలిరంగు జంప్‌సూట్‌లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్‌సూట్ కూడా ఇలాంటిదేనట. -
సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు, ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది!
అమ్మాయి..అందులోనూ కొత్త పెళ్లికూతురు అనగానే పదహారణాల పడచులా, ముట్టుకుంటే మాసిపోయేంత మృదువైన కుసుమంలా సుకుమారంగా అందంగా ఉండాలని అందరూ ఊహించుకుంటారు. ఆమె ఏ రంగంలో ఉన్నా, ఎంత సాధికారత సాధించినా, సిగ్గులమొగ్గవుతూ, తలవంచుకొని తాళి కట్టించుకుంటూ అణకువగా ఉండాలనే పద్ధతికి దాదాపు అందరూ అలవాటు అయిపోయారు. కానీ తన సిక్స్ ప్యాక్ కండలు చూపిస్తూ అందరినీ షాక్‌కి గురి చేసిందో పెళ్లికూతురు. నిజానికి ట్రెడిషనల్ కాంజీవరం చీర, నగల ముస్తాబైంది. దీంతోపాటు తనలోని బాడీ బిల్డర్ (Body Builder) విశ్వరూపాన్ని చూపించిందీ ఫిట్నెస్ ఫ్రీక్. బాడీ బిల్డర్, సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కర్ణాటకకు(Karnataka) చెందిన ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ చిత్ర పురుషోత్తమ్(Chitra Purushotham) ఈమె మామూలు పెళ్లి కూతురిలా ముస్తాబైంది. కానీ అసలు సిసలైన ట్రెడిషనల్ లుక్‌లో కూడా తన అసలు సామర్థ్యమేంటో అతిథులందరి ముందూ ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. అందరి ముందూ అద్భుతమైన కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ ఫోజులిచ్చింది. వధువు తన ఫిట్నెస్తో సాంప్రదాయ గోడలను బ్రేక్ చేసిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అద్భుతమైన అందానికి ఫిట్నెస్తోపాటు ఆత్మవిశ్వాసాన్ని జోడించిన వైనం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చాలా అందంగా ఉంది.. మహారాణిలా ఉంది అంటూ తెగ పొగిడేశారు. సాంప్రదాయం, సాధికారత జమిలిగా ‘ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధ్యమే!’ అన్న సందేశాన్నిచ్చింది. దీనిపై కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు ఉన్నప్పటికీ, తన ఫిట్నెస్ కోసం చేసిన కృషి, సాధించిన బాడీపై దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాయి. చాలామంది చిత్రలోని టాలెంట్‌ని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు ఉండాలి, ఇలాంటి ధైర్యవంతులైన మహిళలు సమాజానికి స్ఫూర్తి.ఇదే కదా నిజమైన అందం’ అంటూ చిత్రకు మద్దతుగా వ్యాఖ్యానించడం విశేషం. View this post on Instagram A post shared by CHITRA PURUSHOTHAM 🇮🇳 (@chitra_purushotham)త్వరలోనే తన ప్రియుడ్ని ప్రేమ వివాహం చేసుకోనుంది చిత్ర. వివాహానికి ముందు, ప్రీ-వెడ్డింగ్ షూట్‌కి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. చిత్ర పురుషోత్తమ్ తన ఫిట్నెస్తో ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తోంది. చిత్ర పసుపు , నీలం రంగు కాంజీవరం చీరను ధరించింది.. బ్లౌజ్ లేకుండానే, కష్టపడి సంపాదించిన బాడీని ప్రదర్శించింది. ఇంకా లేయర్డ్ నెక్లెస్‌లు, కమర్బంద్, గాజులు, మాంగ్ టీకా , చెవి పోగులు వంటి సాంప్రదాయ బంగారు ఆభరణాలు, ఇంఒంటినిండా టాటూలు, పొడుగుజడ, జడగంటలు, పూలు ఇలా ఎక్కడా తగ్గకుండా తన గ్లామర్ లుక్‌తో మెస్మరైజ్ చేసింది. చిత్ర పురుషోత్తం ఒక బాడీబిల్డర్ మాత్రమే కాదు మంచి ట్రైనర్ కూడా. వధువుగా చిత్ర వైరల్ కావడం ఇదే తొలిసారి కావచ్చు, కానీ పురుషులకే సొంతం అనుకున్న రంగంలో ప్రతిభ మరోపేరుగా వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. మిస్ ఇండియా ఫిట్నెస్ అండ్ వెల్నెస్, మిస్ సౌత్ ఇండియా, మిస్ కర్ణాటక అండ్ మిస్ బెంగళూరు లాంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. చిత్ర పురుషోత్తం తాజా ఫోటోషూట్ స్టీరియోటైప్ అంచనాలను బద్దలు కొట్టి మరీ తనను తాను ప్రత్యేకంగా నిలబెట్టుకోవడమే కాకుండా, అందం, స్త్రీత్వం సామాజిక ప్రమాణాలను పునర్నిర్వచించింది. అంతేకాదు అంత దృఢమైన దేహాన్ని సాధించడంలోని తన కృషి పట్టుదల,నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. తనలాంటి వారికి ప్రేరణగా నిలుస్తోంది. -
భావోద్వేగాల డిజిటల్ బందిఖానా!
ఇటీవలి కాలంలో కౌమార దశ (టీనేజ్)లో ఉన్న పిల్లల ఆత్మహత్యలు పెరిగిపోతుండటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 8, 9వ తరగతుల వరకు చదువే లోకంగా ఉన్న పిల్లలు... టెన్త్, ఇంటర్లలో చేరిన తర్వాత ఈ స్వీయ హన నానికి పాల్పడుతుండటాన్ని తేలికగా తీసుకోరాదు. సెలవులు, వారాంతాల్లో సోషల్ మీడియాలో గంటల తరబడి రీల్స్ చూస్తూ గడిపిన నవ యువత మళ్లీ స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని వారి మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించినవారి మాట. చదువుల ఒత్తిడి కొత్తదేమీ కాకున్నా... ‘రీల్స్’ భూతం వారి మెదడుపై దుష్ప్రభావాలను చూపు తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలు వెల్లడి స్తున్నాయి. ఇంటి వద్ద రోజూ పదిగంటలకు పైగా స్క్రీన్ చూడటానికి బానిసలైన తర్వాత నియంత్రిత వ్యవస్థలో కళాశాల, పాఠశాల వాతావరణాలకు సర్దుకోలేక చిన్న మనసులు తీవ్ర క్షోభకు గురవుతున్నాయి. ఈ వయసు వారి మెదడు సహజంగా భావోద్వేగాలను నియంత్రించుకోగల శక్తి కలిగి ఉన్నా... స్మార్ట్‌ఫోన్ అధిక వాడకం ఈ సంతులనాన్ని దెబ్బ తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.కౌమార వయసులో మెదడు అభివృద్ధి చెందే దశలోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్లో రసాయన మార్పులు జరుగుతూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడం, ఉద్వేగాల నియంత్రణ ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ద్వారానే జరు గుతూ ఉంటాయి. ఇదే సమయంలో మన భావోద్వేగాల వ్యక్తీకరణకు ఉపకరించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది. మెదడు లోపలి ఈ వ్యవస్థలో అమిగ్దలా అనే భాగం... భయం, కోపం, ఆనందం వంటి అనుభూతులకు కారణమైతే; ఆకలి, దప్పిక, శరీర ఉష్ణోగ్రత, ఉద్వేగాలకు, స్పందన లకు హైపోథాలమస్ కారణం అవుతుంది. ఇవి మాత్రమే కాకుండా... లింబిక్ వ్యవస్థలో హిప్పోకాంపస్, థాలమస్, హైపోథాలమస్, సింగులేట్ గైరస్, బేసల్ గాంగ్లియా వంటి అనేక మెదడు భాగాలు ఉంటాయి. ఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థల మధ్య అసమతౌల్యం ఏర్పడినప్పుడు యువతీ యువకుల్లో భావోద్వేగాలస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అదే సమయంలో మానసిక క్షోభను, కుంగుబాటును నియంత్రించుకోవడం అంతగా సాధ్యపడదు. అయితే సాధారణంగా ఈ లోటుపాట్లు ఉన్నా కౌమార వయస్కులు మానసిక క్షోభను సమర్థంగానే తట్టుకోగలరు. ప్రకృతిసిద్ధంగా ఉండే న్యూరో కెమికల్స్ వల్ల ఇది సాధ్య మవుతుంది. ఉల్లాసానికి కారణమయ్యే డోపమైన్ వంటి న్యూరో రసాయనాల కారణంగా వీరు ఆనందం, సంతృప్తిని వెతుక్కుంటూ ఉంటారు. అలాగే అభివృద్ధి చెందుతూ ఉండే హెచ్‌పీఏ (హైపోథాలమిక్–పిట్యూటరీ–ఎడ్రినల్యాక్సిస్) కూడా ఎక్కువ కాలం నిరాశ, నిçస్పృహలో ఉండకుండా చూస్తుంది.అంటే ఎంతో ప్రేమించే కుటుంబ సభ్యులు అకాల మరణం పాలైనా, తల్లితండ్రుల్లో ఎవరైనా రోజూ తీవ్రంగా హింసిస్తున్నా ఆ వయసు పిల్లల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే రాదు. పిల్లల్లో సహజంగా ఉండే ఈ రక్షణ వ్యవస్థ సుదీర్ఘ స్మార్ట్ఫోన్ల వినియోగంతో ముక్కచెక్కలవుతుంది. ఫలితంగా ఆందోళన, మానసిక ఉద్వేగాలతో అస్థిరతలు ఏర్పడతాయి. మృత్యుకుహరం ఈ డిజిటల్ వలవిద్యార్థులు సెలవు రోజుల్లో రోజుకు పది గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లను వాడుతున్నట్లు అంచనా. సామాజిక మాధ్యమాలను వాడినంత సేపూ మెదడులో ఆనందం కలిగించే డోపమైన్ (హ్యాపీ హార్మోన్) అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది కాస్తా కంపల్సివ్ బిహేవియర్ (వద్దని అనుకున్నా కొన్ని పనులు పదే పదే చేయాలనుకోవడం)కు దారి తీస్తుంది. విద్యార్థులు సెలవులు ముగించుకుని కాలేజీలు, పాఠ శాలల్లో అడుగుపెట్టగానే డోపమైన్ ఉపసంహరణ కారణంగా అసహనం పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే ఆగ్రహం, అకారణ దిగులు ఆవహిస్తాయి. ఈ స్థితిలో ఆత్మహత్య వైపు వారి ఆలోచన మళ్లుతుంది. కాపాడుకోవడం మన చేతుల్లోనే...తల్లితండ్రులు, చదువు చెప్పేవారు, విధాన రూపకర్తలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం సాధించడం కష్టమేమీ కాదు. డిజిటల్ టెక్నాలజీ వాడకానికి సంబంధించి విద్యార్థులకు కొన్ని హద్దులు నిర్ధారించాలి. ఒక క్రమ పద్ధతిలో వారి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ల వాడకాన్ని తగ్గించేలా ప్రోత్సహించాలి. అర్థవంతమైన కంటెంట్‌ను పరిచయం చేయాలి. సెలవుల తర్వాత స్కూళ్లు, కాలేజీలు తెరిచిన వెంటనే సీరియస్‌గా పాఠాల జోలికి పోకుండా మొదటి రెండు రోజులు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించాలి. పిల్లలు ఒక రోజు ఆగి కాలేజీకి వెళ్తామంటే వారిని నిందించడం, బెదిరించడం చేయకుండా తల్లిదండ్రులు తమ కాఠిన్యాన్ని తగ్గించు కోవాలి. పాఠశాలల్లో పరిమిత స్థాయిలో డిజిటల్ టెక్నాలజీలను వాడేలా చేయడం ద్వారా వారు సామాజిక మాధ్యమాల వల నుంచి నెమ్మదిగా బయటపడే అవకాశం ఏర్పడుతుంది. విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్ ఏర్పాట్లు ఉండాలి.ఆరోగ్యకరమైన హద్దులను నిర్ణయించడం, విద్యాపరంగా, సామాజికంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించడం వంటి చర్యల ద్వారా కౌమార వయస్కులు... డిజిటల్ – వాస్తవ ప్రపంచాల మధ్య తేడా తెలుసుకుని సమతుల్యతను సాధించడానికి వీలు కలుగుతుంది. ఇది కేవలం తల్లితండ్రులు, విద్యావేత్తల బాధ్యత కాదు. సమాజం మొత్తానిది. అప్పుడు మాత్రమే యువత భావోద్వేగ సంక్షోభాన్ని నివారించగలం. యువతకు అందమైన భవిష్యత్తును కల్పించగలం!బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్మొబైల్: 90524 72424 -
అనన్య నాగళ్ల సండే లుక్.. ఫ్యాషన్ డ్రెస్‌లో నా సామిరంగ బ్యూటీ!
హీరోయిన్ అనన్య నాగళ్ల సండే లుక్స్...సన్‌సెట్ ఆస్వాదిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత..ఫ్యామిలీ ట్రిప్ ఆస్వాదిస్తోన్న హీరోయిన్ ప్రణీత..నాటీ డ్రెస్‌లో నా సామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్..రానా సతీమణి మిహికా బజాజ్ లేటేస్ట్ లుక్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Seetha🦋🇮🇳 (@kirrakseetha) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) -
తన కంటే చిన్న వాడితో ప్రేమ.. భర్త, పిల్లల్ని కాదని ప్రియుడితో..
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా పరిచయాలు కొందరికి శాపంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం ఓ వివాహిత భర్త, పిల్లలను వదిలేసి పారిపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడితో పారిపోతున్న తన భార్యను భర్త పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. దీంతో, సదరు భర్త పోలీసులను ఆశ్రయించాడు.వివరాల ప్రకారం..ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన గోపి (22) కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కూకట్‌పల్లిలోని హాస్టల్ ఉంటూ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్‌కు చెందిన సుకన్య(35)కు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో, వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. వీరద్దరూ రోజూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. సుకన్యకు అప్పటికే వివాహం జరగగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయినా గోపి లేకుండా ఉండలేనని భావించిన సుకన్య.. ప్రియుడితో పారిపోయేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న ఇంట్లో నుంచి వెళ్లిపోయి గోపితో కలిసి ఉంటోంది.తన భార్య సుకన్య కనిపించకపోవడంతో భర్త జయరాజ్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో సీసీ కెమెరాల ఆధారంగా గోపితో వెళ్లిందని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో జయరాజ్ వారికోసం గాలిస్తుండగా మేడ్చల్‌లోని ఆక్సిజన్ పార్క్ వద్ద బైక్‌పై వెళుతున్న గోపి, సుకన్య కనిపించారు. దీంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. బైక్‌ను అక్కడే వదిలేసి సుకన్య, గోపి రన్నింగ్ బస్ ఎక్కి మళ్లీ పారిపోయారు. ఈ ఘటనలో భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహితమేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన… pic.twitter.com/e0oDcb0593— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025Video Credit: Telugu Scribe -
Vivek Ramaswamy: పాదరక్షలు లేకుండా ఇంటర్వ్యూ.. ట్రోలింగ్ బారిన వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇటీవల చెప్పులు లేకుండా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన కొందరు రామస్వామిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆయనను అమెరికన్ వ్యతిరేకి అని, మొరటువాడని వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే వివేక్ రామస్వామికి మద్దతు పలుకుతున్నారు. గత ఏడాది వివేక్ రామస్వామి ఒక లైవ్ స్ట్రీమింగ్ రికార్డింగ్(Live streaming recording) సమయంలో చెప్పులు లేకుండా ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ రికార్డింగ్ వివేక్ రామస్వామి ఇంట్లో జరిగింది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది. కొందరు ‘వివేక్ రామస్వామి ఎప్పటికీ ఒహియో గవర్నర్ కాలేరు’ అని వ్యాఖ్యానించగా, మరికొందరు ‘అమెరికాలో ఇది ఆమోదయోగ్యం కాదని’ అన్నారు. మరికొందరు ‘ఇంటర్వ్యూ సమయంలో వివేక్ కనీసం సాక్స్ అయినా ధరించి ఉండాల్సిందని’ పేర్కొన్నారు. మరొక యూజర్ ‘వివేక్ రామస్వామి విద్యాభివృద్ధిపై ఉపన్యాసాలు ఇస్తారని, అయితే ఇంటర్వ్యూలో చెప్పులు లేకుండా కనిపించారని, ఇది చాలా అసభ్యకరమైనదని’ వ్యాఖ్యానించారు.వివేక్ రామస్వామికి సోషల్ మీడియాలో మద్దతు పలికినవారు కూడా ఉన్నారు. భారతదేశంతో పాటు దక్షిణ, తూర్పు ఆసియాలో ఇంట్లో పాదరక్షలు(Footwear) తొలగించడం సర్వసాధారణమని కొందరు కామెంట్ బాక్స్‌లో రాశారు. దాదాపు భారతీయులంతా తమ ఇళ్లలో చెప్పులు లేకుండా ఉంటారని ఒక యూజర్ పేర్కొన్నారు. ఇందులో తప్పేమీ లేదని, ఇది అక్కడి సంస్కృతిలో భాగమని పేర్కొన్నవారు కూడా ఉన్నారు. అయితే వివేక్ రామస్వామి ఈ చర్చకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.ఇది కూడా చదవండి: చెఫ్ అవతారంలో సోనూసూద్.. దోశ రేటు రెట్టింపు చేసి.. -
కూతురివేనా నువ్వు.. తల్లిని నిర్బంధించి కిరాతకంగా దాడి(వీడియో)
హిసార్: ఆస్తి కోసం కూతురు తన తల్లిని చిత్రహింసలకు గురిచేసిన హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రక్తం తాగుతాను అంటూ కన్న తల్లినే కూతురు హింసించింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. దీనిపై ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. హర్యానాలోని హిసార్‌కు చెందిన రీటాకు రెండేళ్ల క్రితం రాజ్‌గఢ్ సమీపంలోని గ్రామానికి చెందిన సంజయ్ పునియాతో వివాహం జరిగింది. వీరికి వివాహం జరిగిన సమయంలో పునియాకు ఎలాంటి సంపాదన లేదు. దీంతో, రీటా.. తన తల్లి నిర్మలాదేవి ఇంటికి తిరిగి వచ్చేసింది. తల్లి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఆస్తి కోసం తన తల్లిని నిర్భందించి వేధించడం ప్రారంభించింది.రీటా.. ఇప్పటికే కురుక్షేత్రలో తమ కుటుంబానికి చెందిన పలు ఆస్తులను అమ్మేసి దాదాపు రూ.65 లక్షలు తన దగ్గర ఉంచుకుంది. ఇప్పుడు తల్లి నివసిస్తున్న ఇంటిని తన పేరుమీదకు మార్చాలని వేధింపులకు గురిచేస్తోంది. ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయమని తల్లిని ఇంత దారుణంగా హింసించింది. ఈ సందర్భంగా రీటా.. ఆస్తి ఇస్తావా లేదా? నీ రక్తం తాగుతా అంటూ జుట్టు లాగి కొడుతూ, నోటితో కొరుకుతూ నానా విధాలుగా హింసించింది. దీంతో, నిర్మలాదేవి రోదిస్తూ రెండు చేతులూ జోడించి వేడుకుంటోంది. ఈ వీడియోలో ఒక పురుషుడి మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, తన తల్లిపై దాడి విషయం తెలియడంతో ఆమె కుమారుడు అమర్దీప్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని తెలిపాడు. రీటాపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.A shocking incident of abuse has surfaced from Hisar, Haryana, where a viral video shows a daughter, Rita, physically assaulting her mother, Nirmala Devi, in a desperate attempt to gain control of family property. Police have now intervened, registering a case under the… pic.twitter.com/gpK7xPHHWv— Mojo Story (@themojostory) March 1, 2025 -
ట్రంప్ Vs జెలెన్స్కీ.. వెల్లువెత్తిన జోక్స్, మీమ్స్
ఓవైపు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకరు వచ్చి చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కావాలని అడగాడట. ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని ప్రపంచ దేశాలు ఓవైపు భయపడుతుంటే ఆ భయాలను తొలగించి యుద్ధాన్ని ఆపేందుకు, బదులుగా అత్యంత విలువైన ఖనిజాలపై అజమాయిషీ కోసం అమెరికా చేసిన ప్రయత్నం విఫలం కాగా ఆ ఘటనను మీమర్స్ తమ జోకులకు పెద్ద ముడి సరుకుగా వాడుకుంటున్నారు.శుక్రవారం శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య భేటీ తొలుత మర్యాదపూర్వకంగా, తుదకు అమర్యాదపూర్వకంగా, పరస్పర హెచ్చరికలకు వేదికగా మారి అర్ధంతరంగా ముగిసిన విషయం తెల్సిందే. అమెరికాసహా అంతర్జాతీయ మీడియా సాక్షిగా జరిగిన ఈ రసాభాసా వాగ్వాద భేటీపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ తెగ వెల్లువెత్తుతున్నాయి. తారాస్థాయిలో వాగ్వాదం ఓవల్ ఆఫీస్‌లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ట్రంప్, జెలెన్స్కీ భేటీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివర్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకుని జెలెన్స్కీపై తీవ్ర అసహనం వ్యక్తంచేయడం, అందుకు ట్రంప్ వంతపాడటం, దీనికి దీటైన బదులిస్తూ జెలెన్స్కీ మాట్లాడం చూసిన వారెవరికైనా ట్రంప్, జెలెన్స్కీ కొట్టుకుంటారా అన్న అనుమానం వచ్చింది. వాస్తవంలో సాధ్యంకాని వాళ్ల పిడిగుద్దులు, డిష్యుండిష్యుం ఫైట్ సీన్‌ను కృత్రిమ మేథ సాధ్యం చేసింది. ఒరిజినల్ వీడియోతో ట్రంప్, జెలెన్స్కీ ఫైట్‌సీన్‌ను ఏఐలో సృష్టించి ఆన్లైన్లో షేర్చేశారు. ఆ వీడియో ఎడిటింగ్ మొదటి మూడు, నాలుగు సెకన్లు నిజంగానే కొట్టుకున్నారా అన్నంతగా కుదిరింది. ఇప్పుడీ వీడియో అన్ని సోషల్‌మీడియా యాప్స్‌లో వైరల్‌గా మారింది. ఇంకొక వీడియోను పూర్తి భిన్నంగా సృష్టించారు.Who made this video? 😂AI 😂 pic.twitter.com/r9UuE3Qr1g— War Intel (@warintel4u) March 1, 2025వాస్తవంలో ట్రంప్, జేడీ వాన్స్‌తో జెలెన్స్కీ వాగ్వాదానికి దిగితే ఏఐ వీడియోలో మాత్రం వీళ్లిద్దరినీ జెలెన్స్కీ చేతులు పట్టుకుని మరీ బతిమాలుతూ ‘మా దేశాన్ని కాపాడండి’’అని వేడుకుంటున్నట్లు రూపొందించారు. ఇందులో ‘ఇప్పటికి చేసిన సాయం చాలు, ఇక సాయం సంగతి మర్చిపో’అని ట్రంప్, వాన్స్‌లు జెలెన్స్కీ చేతులను దులిపేసుకుంటున్నట్లు ఏఐ వీడియో క్రియేట్‌చేశారు. ఇది కూడా తెగ నవ్వులు తెప్పిస్తోంది. అత్యంత విలువైన ఖనిజాలపై ఆధిపత్యం సంపాదించి అమెరికన్ పెత్తందార్లు వాటితో వేల కోట్లు గడించాలని భావించి, ఇప్పుడు భంగపడ్డారని తెలిపేలా ఒక వెయిటర్ ‘ఖనిజాల డీల్ రద్దయింది. సారీ. మీకు భోజనాలు లేవు’అంటూ బడా పారిశ్రామికవేత్తలకు చూపిస్తున్నట్లు పాతకాలంనాటి ‘ఫాల్టీ టవర్స్’సీరియల్ ఎపిసోడ్‌ను మీమ్స్‌లో వాడారు. భారతీయ ‘ట్రీట్మెంట్’ భారత్‌లో సాధారణ నిరుపేద కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు నచ్చినట్లు పెంచేందుకు ప్రయత్నిస్తుంటారు. వైట్‌హౌజ్‌లో ట్రంప్, జేడీ వాన్స్ సైతం జెలెన్స్కీని దాదాపు అలాగే మీడియాకు చూపేందుకు ప్రయత్నించారని నెటిజన్లు మరో మీమ్ సిద్ధంచేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. రష్యాతో యుద్ధంలో ఇంత సాయపడిన మాకు శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో అగ్రరాజ్య అధ్యక్షునికి కనీసం గౌరవం ఇవ్వరా?. ఒక్కసారైనా మా ప్రెసిడెంట్‌కు థాంక్యూ అని చెప్పారా? అని జెలెన్స్కీని వాన్స్ నిలదీస్తూ హెచ్చరించడం తెల్సిందే. ఈ సందర్భంలో వాన్స్, ట్రంప్ సగటు భారతీయ తల్లిదండ్రుల్లా అద్భుతమైన పాత్ర పోషించారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్‌లు పెట్టారు.Trump throws Zelensky out of the White House(meme collab with @drefanzor) pic.twitter.com/Mfu85ZHhAf— NautPoso memes 🇮🇪☘️ (@NautPoso) February 28, 2025 పొగుడుతూ పోస్ట్‌లు మరోవైపు జెలెన్స్కీని మీడియా ఎదుటే చక్రబంధంలో ఇరికించే ప్రయత్నంలో వాన్స్, ట్రంప్ దాదాపు సఫలమయ్యారని వీళ్లను పొగిడే వారి సంఖ్యా పెరిగింది. యుద్ధంలో వందల కోట్ల డాలర్లు ఇచ్చిన మాపై మీరు చూపించే మర్యాద ఇదేనా?. మీరు ఇదే ధోరణి కనబరిస్తే దౌత్యబంధం తెగిపోతుందని వాన్స్ హెచ్చరించి జెలెన్స్కీని ఒకింత సందిగ్ధంలో పడేశారని అమెరికన్ మీడియా ఆయనను పొగడ్తల్లో ముంచెత్తింది. అయితే జెలెన్స్కీని పొడిగే వారి సంఖ్యా అమాంతం పెరిగింది. ఇందులో సాధారణ ప్రజలతో పాటు దేశాధినేతలు ఉన్నారు.Always with the drama…Collab with @drefanzor pic.twitter.com/OwMNImIWpU— Lauren3ve (@Lauren3veMemes) March 1, 2025 యూరప్‌దేశాల అధినేతలు ఆయనకు ఫోన్‌చేసిమరీ తమ మద్దతు పలికినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. మిత్రదేశానికి ప్రతిఫలం ఆశించి సాయం చేస్తే ఆ సాయానికి అర్థమే ఉండదని, సహజ సంపదను కాజేసేందుకు కుట్ర పన్నిన అమెరికాను జెలెన్స్కీ సాక్షాత్తూ శ్వేతసౌధంలోనే కడిగిపారేశారని ఆయనను పొగుడుతూ పోస్ట్‌లు వెల్లువెత్తాయి. భవిష్యత్తులో రష్యా మళ్లీ దురాక్రమణకు దిగితే మాకు ఉండే రక్షణ ఏర్పాట్లు ఏమిటి?. ఆ విషయంలో మీరెలా మాకు సాయపడగలరు? అని జెలెన్స్కీ అడిగిన సూటి ప్రశ్నకు ట్రంప్, జేడీ వాన్స్ సరైన సమాధానం చెప్పలేకపోవడం తెల్సిందే. ఇద్దరు అగ్రనేతలు రెచ్చగొట్టినా జెలెన్స్కీ సంయమనం కోల్పోలేదంటూ మరో మీమ్ సందడిచేస్తోంది.Trump tossed Zelensky out 😂(w/@Fuknutz ) pic.twitter.com/1ES3d5l5zq— drefanzor memes (@drefanzor) February 28, 2025ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన ఎయిర్‌ఫోర్స్ సినిమా సీన్లో పైఅధికారి ఇష్టమొచ్చినట్లు తిడుతున్నా టామ్ క్రూజ్ పట్టరాని ఆవేశంతో ఉన్నాసరే సంయమనం పాటించినట్లు జెలెన్స్కీ కూడా నిగ్రహంతో ఉన్నారని మీమ్ క్రియేట్ చేశారు. వైట్‌హౌజ్‌లో ముగ్గురు నేతల వాగ్వాదాన్ని ప్రత్యక్షంగా చూసి హుతాశురాలైన ఉక్రెయిన్ మహిళా రాయబారి ఒక్సానా మార్కరోవా తలపట్టుకోవడంపైనా ఒక మీమ్ బయటికొచి్చంది. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్(అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం) నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కీలక నేతగా జెలెన్స్కీ ఎదిగారంటూ, భేటీలో ఎడముఖం పెడముఖంగా కూర్చున్న ట్రంప్, జెలెన్స్కీ ఫొటోను మరొకరు పోస్ట్‌చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్. -
నెం. 14, మరోసారి తండ్రైన బిలియనీర్ : పేరేంటో తెలుసా?
టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయ్యాడు. మస్క్ భార్య, అతని కంపెనీ న్యూరాలింక్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న షివోన్ జిలిస్‌తో కలిసి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఇప్పటికే మస్క్‌కు 13 మంది పిల్లలున్నారు. దీంతో ఇపుడు మస్క్ సంతానం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.మస్క్ భార్య షివోన్ జిలిస్ ఈ విషయాన్ని ఎక్స్( ట్విటర్) ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ దంపతులు కవలలు (స్ట్రైడర్ , అజూర్) ఏడాది పాప ఆర్కాడియా ఉన్నారు. నాలుగో బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్గా అపుడే పేరు కూడా పెట్టేయడం గమనార్హం. అందమైన ఆర్కాడియా పుట్టినరోజు సందర్బంగా తమ అద్భుతమైన కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ రాక గురించి చెప్పడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు హార్ట్ సింబల్‌తో ఎలాన్ మస్క్ సమాధానమిచ్చాడు. గణనీయంగా క్షీణిస్తున్న జనాభాపై ఎపుడూ ఆందోళన వ్యక్తం చేసే మస్క్ సంతానోత్పత్తి ప్రాముఖ్యతపై దృష్టిపెట్టునట్టున్నాడు అంటోది సోషల్ మీడియా. జనాభా వృద్ధి చెందాలని భావించే మస్క్, ఇప్పటికే తన స్పెర్మ్‌ను స్నేహితులు, పరిచయస్తులకు దానం చేశాడనే వాదనలు కూడా చాలానే ఉన్నాయి. Discussed with Elon and, in light of beautiful Arcadia’s birthday, we felt it was better to also just share directly about our wonderful and incredible son Seldon Lycurgus. Built like a juggernaut, with a solid heart of gold. Love him so much ♥️— Shivon Zilis (@shivon) February 28, 2025కాగా షివోన్ జిలిస్‌తో తనకున్న నలుగురు పిల్లలతో పాటు, మస్క్‌కు మొదటి భార్య జస్టిన్ విల్సన్ ద్వారా ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో కవలలు వివియన్ , గ్రిఫిన్‌తో పాటు, కై, సాక్సన్ , డామియన్ అనే ముగ్గురున్నారు. వీరి తొలి సంతానం బిడ్డ నెవాడా అలెగ్జాండర్ మస్క్ కేవలం 10 వారాల వయసులోనే మరణించాడు. -
టీవీ డిబెట్లో ఐఐటీ బాబాపై దాడి.. వీడియో వైరల్
ఢిల్లీ: కుంభామేళాతో పాపులర్ అయిన ఐఐటీ బాబా అభయ్ సింగ్‌కు బిగ్ షాక్ తగిలింది. కొందరు వ్యక్తులు ఆయనపై కర్రలతో దాడి చేశారు. అభయ్ సింగ్‌లో ఓ టీవీ ఛానల్లో డిబెట్లో పాల్గొన్న సమయంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఐఐటీ బాబా అభయ్ సింగ్ తాజాగా నోయిడాలో ఓ ప్రైవేటు టీవీ ఛానల్లో డిబెట్లో పాల్గొన్నారు. డిబెట్ కొనసాగుతున్న సమయంలో కాషాయ దుస్తులు ధరించి వచ్చిన కొంత మంది వ్యక్తులు అక్కడికి వచ్చారు. అనంతరం, అభయ్‌సింగ్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడి తర్వాత ఆయన డిబెట్ రూమ్ నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా తనకు న్యాయం చేయాలని పోలీస్ అవుట్ పోస్టు ఎదుట బైఠాయించారు. దీంతో, పోలీసులు.. ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.I know, This is all Media Strategy but still I think, Media is mentally exploiting this IIT Baba for its TRP, This Baba should not go to such programs.pic.twitter.com/w7j0z0FAQC— Harsh (@harsht2024) February 28, 2025ఎవరీ ఐఐటీ బాబా..?ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్న అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతరించారు. ఐఐటీ బాబాగా (IIT Baba) పిలుస్తున్నారు. అభయ్ సింగ్‌ది హర్యానా రాష్ట్రం. మహా కుంభమేళా సందర్భంగా ఐఐటీ బాబా పేరుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే ఉద్యోగం.. కొంతకాలం కార్పొరేట్లో పనిచేసిన ఆయన.. దాన్ని వదులుకొన్నారు. ఫొటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. మహా కుంభమేళాకు వచ్చిన ఆయన.. ఓ వార్తా ఛానెల్ ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఐఐటీ బాబా, ఇంజినీర్ బాబాగా నెటిజన్లు ఆయన్ను పేర్కొంటున్నారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. నెటిజన్లకు క్షమాపణలు..ఇదిలా ఉండగా.. చాంపియన్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ గెలవదంటూ ఐఐటీ బాబా (IIT Baba) జోష్యం చెప్పిన విషయం తెలిసిందే. ‘ఈసారి భారత్ గెలవదు. విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే’ అంటూ ఐఐటీ బాబా జోష్యం చెప్పారు. అయితే, మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఐఐటీ బాబాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఇలా జోష్యం చెప్పడం మానేయాలంటూ ఐఐటీ బాబాకు క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌పై ఐఐటీ బాబా తాజాగా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు. ‘నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను జోడించారు. -
కష్టం తీర్చిన కుంభమేళ.. ఆటో కుర్రాడి భావోద్వేగం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం... మహా కుంభమేళ ముగిసింది! త్రివేణీ సంగమ స్థలి ప్రయాగ్‌రాజ్‌లో సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోట్లమంది సందర్శించారు. పవిత్ర గంగలో మునకేసి తమ పాపాలు కడిగేసుకున్న పారవశ్యంలో మునిగితేలారు. వీరందరిది ఒక ఎత్తైతే.. కొందరు పరోపకారాన్ని కూడా అంతే శ్రద్ధాసక్తులతో చేసి ఆత్మానందం పొందారు. అలాంటి ఓ సంఘటన సాగిందిలా...కోట్లమందిలాగే.. స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధ పరచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడం కోసం ఆమె కూడా కుంభమేళాకు వెళ్లారు. ఎక్కడో ఓ మూలనున్న రిసార్టులో మకాం. అక్కడి నుంచి సంగమ స్థలికి వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకున్నారు.. దాన్ని నడుపుతోంది ఓ నూనూగు మీసాల కుర్రాడు. మాట మాట కలిసింది. కుశల ప్రశ్నలయ్యాయి. బడికెందుకు వెళ్లడం లేదన్న ప్రశ్న వచ్చింది. అంత సౌలభ్యం లేదన్న సమాధానంతోపాటు తప్పనిసరి పరిస్థితుల్లోనే... బతుకు కోసం ఆటో నడపాల్సి వస్తుందని ఆ కుర్రాడు తన బాధను వెళ్లబోసుకున్నాడు. ఈ మాటలు ఆమెలో ఆసక్తిని పెంచాయి. మెల్లిగా మాటలతో అతడి నేపథ్యం గురించి ఆరా తీశారు.మేడమ్ జీ.. అంటూ మొదలుపెట్టి తన గురించి మొత్తం చెప్పుకొచ్చాడతను. చదువుకోవాల్సిన వయసులో తల్లిని పోషించాల్సిన భారం ఆ కుర్రాడిపై పడింది. అందుకే బాడుగకు ఆటోను నడిపిస్తున్నట్లు చెప్పాడతను. రోజుకు రూ.వెయ్యి కిరాయి చెల్లిస్తేనే ఆటో నడుపుకోవచ్చునని, చెల్లించని రోజు లేదా తక్కువ మాత్రమే ఇవ్వగలిగిన రోజు ఆటో యజమాని నానా ఇబ్బందులు పెడుతున్నాడని ఆ కుర్రాడు వాపోయాడు. అతని పరిస్థితి గురించి తెలుసుకుని ఆమె చలించిపోయారు. సొంత ఆటో ఉంటే బాగుంటుంది కదా? అని అన్నారామె. నిజమే.. కానీ నాకెవరు ఇస్తారు మేడమ్ జీ?. అంత స్థోమతెక్కడిది నాకు? అన్నాడా కుర్రాడు. అదంతా నేను చూసుకుంటా.. నీ వివరాలివ్వు అన్న ఆ మేడమ్ జీ.. మరుసటి రోజు ఆ కుర్రాడికి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఆటో కొనుగోలుకు సంబంధించిన డౌన్‌పేమెంట్ రసీదును వాట్సప్‌లో అందుకున్న ఆ కుర్రాడి కళ్లల్లో కచ్చితంగా నాలుగు చుక్కల ఆనందభాష్పాలు రాలే ఉంటాయి. అందుకేనేమో.. కష్టాల ఊబి నుంచి తనను బయటకు లాగేసేందుకు విచ్చేసిన ఇంకో తల్లికి కృతజ్ఞతలు చెప్పాడు. తనతోపాటు జన్మనిచ్చిన తల్లితోనూ ఆ మేడమ్ చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పించాడు. ఆడియో మెసేజీ ద్వారా.. ఆ మేడమ్ జీని దేవుడే పంపించాడని మురిసిపోయారు. మళ్లీ సంగం వస్తే తప్పకుండా తమకు ఇంటికి భోజనానికి రావాలంటూ ఆహ్వానించారు. ఇంతకీ ఆ మేడమ్ ఎవరన్నదేనా మీ సందేహం. పేరు.. భారతి చంద్రశేఖర్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరిశ్ధోన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ సతీమణి. ఎస్సీఎస్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలువురి విద్య, ఆరోగ్య అవసరాలకు సాయం చేసిన భారతీ చంద్రశేఖర్ తాజాగా తనకెంతో తృప్తిని కలిగించిన ఈ అనుభవాన్ని ‘సాక్షి.కాం’తో పంచుకున్నారు. -
బీహార్‌లో పోస్టింగ్ ఇచ్చారని టీచర్ తిట్ల దండకం.. తర్వాత ఏమైందంటే?
పాట్నా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అన్నాక బదిలీలు తప్పనిసరి. విధుల్లో భాగంగా వారు ఎక్కడికైనా వెళ్లాల్సిందే. ఇతర రాష్ట్రాలకైనా, దేశ సరిహద్దులకైనా వెళ్లక తప్పదు. ఈ క్రమంలో తమకు నచ్చిన ప్రాంతానికి బదిలీ చేయకపోతే ఉద్యోగులు బాధపడతారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తనకు బీహార్‌లో పోస్టింగ్ ఇచ్చారని ఓ టీచర్ తిట్ల దండకం ఎత్తుకున్నారు. అంతటితో ఆగకుండా బీహార్ ప్రజలను దారుణంగా అవమానించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.వివరాల ప్రకారం.. కేంద్రీయ విద్యాలయంలో ప్రొబేషన్‌లో ప్రైమరీ టీచర్ దీపాలీ షాకు బీహార్‌లోని జెహానాబాద్‌లో పోస్టింగ్ వచ్చింది. దీంతో, ఆమె ఆవేశానికి లోనయ్యారు. బీహార్‌లో పరిస్థితులు నచ్చకపోవడంతో తిట్ట దండకం అందుకున్నారు. ఇదే సమయంలో బీహార్ ప్రజలను అవమానించేలా ఆమె మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోలో టీచర్ దీపాలీ షా మాట్లాడుతూ.. నాకు బీహార్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఇంతకన్నా దేశ సరిహద్దుల్లో జాబ్ వచ్చినా బాగుండేది. అక్కడికి వెళ్లేందుకు కూడా నేను రెడీ ఉన్నాను. నాకు బీహార్‌కు వెళ్లాలని లేదు. బీహార్ ప్రజలకు అసలు పౌర స్పృహే ఉండదు. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా మిగిలిపోయిందంటే దానికి బీహారీలు కూడా ఒక కారణం. బీహార్‌ను భారత్ నుంచి తొలగించిన రోజు మనం అభివృద్ధి చెందిన దేశంగా మారుతాం. మన రైల్వేలను కూడా బీహారీలే భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ బూతులు తిట్టారు.అంతేకాకుండా.. కేంద్రీయ విద్యాలయాలు కేవలం బీహార్‌లో మాత్రమే ఉన్నాయా?. వేరేచోట నాకు పోస్టింగ ఇవ్వొచ్చు కదా?. నాపై వారికున్న శత్రుత్వం ఏమిటో తెలియడం లేదు. దేశంలో అత్యంత చెత్త ప్రాంతానికి నన్ను పంపించారు. కొందరు కోల్‌కతాకు వెళ్లేందుకు ఇష్టపడరు. నేను అక్కడికి వెళ్లేందకు సిద్ధంగా ఉన్నాను. ఈశాన్య రాష్ట్రాలకు కూడా వెళ్లడానికి రెడీ ఉన్నాను. నన్ను గోవాకో, ఒడిశాకో, హిమాచల్ ప్రదేశ్‌కో లేదా దక్షిణాది చివరకు లద్దాఖ్‌కు పంపించినా బాగుండేది’ అంటూ కామెంట్స్ చేశారు.దీంతో, ఆమె వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బీహార్ ఎంపీ శాంభవి దృష్టికి వచ్చింది. దీంతో, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రీయ విద్యాలయ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమెను తక్షణం సస్పెండ్ చేస్తే ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క వీడియోను ఆమెను చిక్కుల్లో పడేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. A primary school teacher in Bihar's Jehanabad has been suspended after a video of her making offensive comments about the state went viral. In the video, she used inappropriate language and expressed dissatisfaction with her posting in Bihar, calling it "India's worst region."… pic.twitter.com/lvy64rULO6— The Tatva (@thetatvaindia) February 28, 2025 -
బ్లూ శారీలో హెబ్బా.. స్విమ్మింగ్‌పూల్‌లో కత్రినా కైఫ్!
బ్లూ శారీలో మెరిసిపోతున్న హెబ్బా పటేల్..స్విమ్మింగ్ పూల్‌లో కత్రినా కైఫ్ చిల్..మజాకా హీరోయిన్ రీతూ వర్మ స్మైలీ లుక్స్...శారీలో అనుపమ పరమేశ్వరన్ ట్రెండీ లుక్..శారీ హీరోయిన్ స్టన్నింగ్ పోజులు.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) -
ఈ సైకోల నుంచి రక్షణ లేదా?
విజయవాడలో అశేష జనవాహిని నడుమ వేదికా రెడ్డి అనే చిన్నారి... మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోన్ రెడ్డిని కలవాలని ఏడ్చింది. అది చూసిన ఆయన చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయత పంచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అంతే... తెలుగుదేశం – జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల్లోని సైకోలు నిద్రలేచారు. బాలిక, ఆమె కుటుంబంపై దుష్ప్రచారానికి తెరతీశారు. ‘ఆమె కుటుంబ నేపథ్యం ఇదీ’ అంటూ తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. తాము స్పాన్సర్ చేస్తున్న సోషల్ మీడియా యాప్స్‌లో మీమ్స్, రీల్స్ (Reels) పెట్టి వ్యక్తిత్వ హనానికి పూనుకున్నారు. వీళ్లకు ఇలా చేయడం కొత్తేమీ కాదు. పాదయాత్ర సమయంలో, వివిధ కార్యక్రమాల్లో జగన్ చిన్నారులను దగ్గరకు తీసుకున్నప్పుడు ఎంతో దారుణంగా ట్రోల్స్ చేశారు.టీడీపీ మొదటి నుంచి సోషల్ మీడియా (Social Media) ద్వారా జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి జనసేన తోడైంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు పార్టీల సోషల్ మీడియా సభ్యులు రెచ్చిపోయి పోస్టులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బెండపూడి విద్యార్థులు అమెరికన్ శ్లాంగ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడారు. దీనిపై టీడీపీ– జనసేన నేతలు, కార్యకర్తలు చేసిన ట్రోల్స్ అంతా ఇంతా కాదు. టీడీపీకి అనుకూలమైన టీవీ, సినిమా సెలబ్రిటీస్ కూడా ఆ జాబితాలోకి ఎక్కారు. అలాగే నాడు జగన్ ప్రభుత్వం చేసిన మంచిని ఓ మహిళ సంతోషంగా చెప్పింది. ఇది ఆ పార్టీల్లోని సైకోలకు నచ్చలేదు. వెంటనే ఆమెపై ట్రోల్స్ (Trolls) మొదలుపెట్టి చివరికి ఆత్మహత్యకు కారణమయ్యారు. అయినా వారిలో మార్పు అనేది రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇటువంటి వికృత చేష్టలు మరింత పెరిగాయి. తాజాగా విజయవాడలో జగన్‌ను కలి సిన చిన్నారిపై చేసిన ట్రోల్స్ ఇందుకు నిదర్శనం.ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. టీడీపీ, జనసేనల సోషల్ మీడియా కార్యకర్తలు అనేక విషయాల్లో చెత్త పోస్టులు పెడుతుంటారు. రాజకీయ ప్రత్యర్థిని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేని ఆ పార్టీల అధిష్ఠానాలు సోషల్ మీడియాలో జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడం కోసం... చాలామంది నిర్వహించే ఖాతాలను (పేజీలను), యూట్యూబ్ చానళ్లను స్పాన్సర్ చేస్తున్నాయి. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రెమ్లా జరుగుతుందనేది నిజం.డబ్బులు తీసుకుని తమ పేజీల్లో బెండపూడి విద్యార్థులు, గీతాంజలి అనే మహిళపై దారుణమైన మీమ్స్ చేసి పెట్టారు. నేడు ఓ చిన్నారిని ట్రోల్ చేస్తూ చైల్డ్ అబ్యూజ్‌కు పాల్పడుతున్నారు. వాస్త వానికి సోషల్ మీడియాలోని ఈ స్పాన్సర్డ్ పేజీలు పైకి వేరే ముసుగుల్లో కనిపిస్తాయి. సినిమా రిలీజ్లు, సమీక్షలు, నటుల ఫొటోలను పెడుతుంటాయి. నవ్వించే మీమ్స్ పోస్టు చేస్తుంటాయి. దీంతో ఫాలోయర్స్ సంఖ్య అధికంగానే ఉంటుంది. దీని వెనుక ఎత్తుగడ ఏంటంటే... మధ్య మధ్యలో వైఎస్సార్సీపీ, జగన్‌పై దారుణమైన పోస్టులు పెడుతూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయడమే! ఇప్పటికే అబద్ధపు రాతలతో ఎల్లో పత్రికలు కొన్ని తరాల మెదళ్లను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఇప్పుడు టీడీపీ మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ పేజీల ద్వారా సమాజానికి హానికరమైన వ్యవస్థను నడుపుతోంది.చదవండి: మీరు చాలా మారాలి సార్!కూటమి ప్రభుత్వంలోని లోపాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇతర అంశాలను ట్రెండింగ్ లోకి తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ట్రోల్ చేయడమనే విష సంస్కృతికి వారు బీజం వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, మహిళలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ ఇప్పుడు జగన్‌ను కలిసిన చిన్నారిపై జుగుప్సాకర రీతిలో పోస్టులు పెట్టినవారిపై ఏ చర్యా తీసుకోకుండా మౌనం దాల్చారు. దీన్ని జనం ముమ్మాటికీ హర్షించరు. సమయం వచ్చినప్పుడు సరైన తీర్పు చెబుతారు.– వెంకట్ -
Comment In X: అసెంబ్లీలో కునుకు తీస్తే.. ఆ కిక్కే వేరబ్బా!
సాధారణంగా.. కీలక సమావేశాల్లో లేదంటే ఉపన్యాసాలు జరుగుతున్న టైంలో మన నేతలు నిద్రపోతూ కనిపించే దృశ్యాలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. అయితే నేతలు ఇక మీదట హుషారుగా పని చేసేందుకు కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly) సమావేశాల టైంలో భోజనం తర్వాత.. సభ్యులు కాసేపు నిద్ర తీసేందుకు ఏర్పాట్లు కలిగించబోతున్నారు. ఈ మేరకు అద్దె ప్రతిపాదిక 15 ‘కునుకు కుర్చీలు’ తెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా నేతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, వాళ్ల పని తీరు మెరుగుపడుతుందని, పైగా సభ్యుల హాజరు శాతం పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.#Karnataka MLAs to get recliners in assembly for quick power naps🙂Speaker UT Khader has approved installing 15 recliners in the Assembly lobby on rent, allowing legislators a quick nap post lunch. Idea is to boost productivity ensuring they stay active for rest of the session… pic.twitter.com/OUMNtVxfuf— Nabila Jamal (@nabilajamal_) February 25, 2025సర్ ఇంగ్లీష్ అంతే!సీనియర్ నేత, తిరువంతపురం ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ట్రంప్-మోదీ భేటీపై ఆయన సానుకూలంగా మాట్లాడడం, బీజేపీ నేతలతో సెల్ఫీ దిగడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని ఊహాజనిత కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆయన వాటన్నింటినీ ఖండించేశారు. అయితే ఆయన ఆంగ్ల పరిజ్ఞానం అత్యంత అరుదు. పలకడానికి కష్టంగా ఉన్న ఇంగ్లీష్ పదాలు తరచూ ఆయన వాడుతుంటారు. అలాగే.. ఆ ఖరీదైన ఇంగ్లీష్‌కు చాలామంది అభిమానులే ఉన్నారు. ఇక.. హిందీ భాషాభిమానంలో బీజేపీని కొట్టేవారు ఈ దేశంలోనే లేరు. అలా.. అమిత్ షా-శశి మధ్య పార్టీ మారడం గురించి చర్చ జరిగితే ఇలా ఉంటుందనే సరదా ప్రయత్నం.. ఈ ఎక్స్ కామెంట్.What say you Shashi T, my old friend? pic.twitter.com/a8sjohnZ71— ParanjoyGuhaThakurta (@paranjoygt) February 25, 2025 సొంత దేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభవమే ఎదురవుతోంది. తీవ్ర స్థాయిలో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే టైంలో జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా.. సోషల్ మీడియాలో జోకులు సైతం పేలుతున్నాయి. ఇక సొంతదేశంలోనే మీమ్ మెటీరియల్‌గా పేరున్న షాహిన్ అఫ్రిదీ(Shaheen Afridi)ని ఇలా.. భారత్‌లోని భాగేశ్వర్ ధామ్‌లో పూరీలు అమ్ముకునేవాడిలా చేసేశారు. Shaheen Afridi Bageshwar Dham mai pooriya nikaal raha 😸 pic.twitter.com/BeTMsC1Lzf— Sachya (@sachya2002) February 25, 2025 Note: ఈ పోస్టులు ఎవరినీ కించపరిచడానికో లేదంటే విమర్శించడానికో కాదు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలియజేయడం కోసమే.. -
'శివ శివ శంకరా..' సాంగ్‌కు 80 మిలియన్ల వ్యూస్
విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నప్పపాత్రను విష్ణు మంచుపోషించగా, రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ తదితరులు ముఖ్యపాత్రలుపోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘శివ శివ శంకరా...’ అనేపాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్‌గా నిలిచినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ– ‘‘శివ శివ శంకరా’పాటని ఇప్పటికే 80 మిలియన్ల (8 కోట్లు) మంది వీక్షించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షలకు పైగా రీల్స్ చేశారు ప్రజలు ఈపాటని ఆదరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంతలా ఈపాట ట్రెండ్ అవుతుందని మేం ఊహించలేదు. శివరాత్రి సందర్భంగా ఈ సాంగ్ మరింతగా చేరువ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. -
ఫోన్‌కు పుణ్యస్నానం..భర్తకు ప్రేమతో!
ప్రయాగ్ రాజ్: ఇప్పుడు ఏదైనా ఆన్ లైనే. ఆనాడు ఓ కవి.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. ఇప్పుడు ఆన్ లైన్ కు కాదు ఏదీ అనర్హం అన్న పరిస్థితులు దాదాపు వచ్చేశాయి. ఇప్పటికే ఆన్ లైన్ నిశ్చితార్థాలు, ఆన్ లైన్ పిండ ప్రదానాలు వంటివి ఎన్నో చూశాం. అయితే తాజాగా ఆన్ లైన్ పుణ్యస్నానం కూడా వచ్చేసింది. మహా కుంభమేళాలో కొందరు వ్యాపార కోణంలో ఆన్ లైన్ పుణ్యస్నానాలకు శ్రీకారం చుడితే. మరికొందరు తమ బంధువులు ఎవరైనా అక్కడకు రాలేని పరిస్థితి ఉంటే ఫోన్ తోనే పుణ్యస్నానం పూర్తి చేయిస్తున్నారు. ఫోన్ ను నీటిలో ముంచి భర్తకు పుణ్య స్నానం చేయించిన ఒక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బెడ్ పై ఉన్న భర్తకు వీడియో కాల్ చేసిన సదరు మహిళ.. ఫోన్ ను నీటిలో పలుమార్లు ముంచింది. ఇలా భర్త పుణ్యస్నానాన్ని పూర్తి చేయించింది ఆ మహిళ. దీనికి సంబంధించిన వీడియోను శిల్పా చౌహాన్ అనే మహిళ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేయగా, అది వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by ❣️Shilpa Chauhan Up54❣️ (@adityachauhan7338) మహా కుంభ్‌లో డిజిటల్ స్నానం రూ.1100 మాత్రమేనట.. ఏం బిజినెస్ ఐడియా గురూ..! -
టాలీవుడ్ అందాల తారలు.. తళుక్కున మెరిశారు!
సినిమాలో కథానాయకలుగా రాణించడం అంత సులభం కాదు. అందం ఉండాలి, ప్రతిభ ఉండాలి. అంతకు మించి అవకాశాలు రావాలి. ఇవన్నీ కలగలిపిన తారలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని ఉండిపోతారు. అలాంటి వారిలో నటి మీనా, రోజా, రంభ వంటి 1990 క్రేజీ కథానాయకలుగా గుర్తింపు పొందారు. నటి మీనా బాల నటిగా రంగప్రవేశం చేసి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆ తరువాత తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో కథానాయకిగా అగ్రస్ధానంలో రాణించారు. ఇక నటి రోజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణించిన తార.అదే విధంగా అందాలకు చిరునామాగా మారిన నటి రంభ. వీరందరూ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి పేరు గడించిన బ్యూటీలే. కాగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న తరుణంలోనే నటి మీనా విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలా ఆనందమయంగా సాగుతున్న మీనా జీవితంతో విధి ఆడుకుంది. ఆమె భర్త అనారోగ్యం కారణంగా కన్ను మూశారు. ఆ సంఘటన నుంచి బయట పడటానికి నటి మీనా చాలా కాలం పట్టింది.కాగా ఇటీవలే మళ్లీ బయట ప్రపంచంలోకి వస్తున్న మీనా ఆదివారం సాయంత్రం చెన్నైలో నటి రోజా, రంభ, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి వంటి స్నేహితురాళ్లను కలిశారు. వీరితో పాటు డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా, నటుడు భరత్ తదితరులు ఉన్నారు. వీరంతా మాటా ఆట పాటలతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలను నటి మీనా తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ప్రేమ, ఆదరణ, గత మధుర జ్ఞాపకాలతో ఒక అందమైన సాయం సమయం అని పేర్కొన్నారు. కాగా ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్.. ఆర్జీవీ శారీ హీరోయిన్ లేటేస్ట్ పోజులు!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్..బార్బీ లుక్‌లో మెరిసిపోతున్న డార్లింగ్ బ్యూటీ నభా నటేశ్..శ్వేతబసు ప్రసాద్ లేటేస్ట్ ఫోటోషూట్ పిక్స్...బ్లాక్ డ్రెస్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ హోయలు..ఎలిఫెంట్స్తో చిల్ అవుతోన్న సురేఖవాణి, కూతురు సుప్రీత..ఆర్జీవీ శారీ హీరోయిన్ లేటేస్ట్ లుక్.. View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
న్యాయ వ్యవస్థకు తాడు మీద నడక
రణవీర్ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్‌కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. రణవీర్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే వెబ్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం. వారికీ రాజ్యాంగ రక్షణ అవసరంకానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్‌లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్‌ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్ లాయర్ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.అభినవ్ చంద్రచూడ్ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్ సిరీస్ (కాలేజ్ రొమాన్స్) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది. న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్’ రణవీర్ అలహాబాదియా పితృస్వామ్య కథనంరణవీర్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్‌లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు. రణవీర్ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ. కోర్టు చిట్టచివరకు రణవీర్‌కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.‘ఇండియా గాట్ లేటెంట్’ వెబ్ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్ వ్యాఖ్యల క్లిప్ అసందర్భంగా లీక్ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్ స్వేచ్ఛను పరిరక్షించాలి. న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది. విచారణ జరగాల్సిన తీరువ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది. రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సోషల్ మీడియాలో హీరోయిన్ అంజలి కొత్త ఫోటోలు హల్ చల్