నెం. 14, మరోసారి తండ్రైన బిలియనీర్‌ : పేరేంటో తెలుసా? | Elon Musk Welcomes 14th Child, His 4th With Partner Shivon Zilis | Sakshi
Sakshi News home page

నెం. 14, మరోసారి తండ్రైన బిలియనీర్‌ : పేరేంటో తెలుసా?

Published Sat, Mar 1 2025 12:27 PM | Last Updated on Sat, Mar 1 2025 3:27 PM

Elon Musk Welcomes 14th Child, His 4th With Partner Shivon Zilis

టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయ్యాడు. మస్క్‌ భార్య, అతని కంపెనీ న్యూరాలింక్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న షివోన్ జిలిస్‌తో  కలిసి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఇప్పటికే మస్క్‌కు  13 మంది పిల్లలున్నారు. దీంతో ఇపుడు మస్క్‌ సంతానం సోషల్‌ మీడియాలో  చర్చకు దారి తీసింది.

మస్క్‌ భార్య షివోన్ జిలిస్‌ ఈ విషయాన్ని  ఎక్స్‌( ట్విటర్) ద్వారా వెల్లడించింది.  ఇప్పటికే ఈ దంపతులు  కవలలు (స్ట్రైడర్ , అజూర్)  ఏడాది పాప ఆర్కాడియా  ఉన్నారు. నాలుగో బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్‌గా అపుడే  పేరు కూడా పెట్టేయడం గమనార్హం. అందమైన ఆర్కాడియా పుట్టినరోజు సందర్బంగా  తమ  అద్భుతమైన  కుమారుడు  సెల్డాన్ లైకుర్గస్  రాక  గురించి చెప్పడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు హార్ట్ సింబల్‌తో ఎలాన్ మస్క్ సమాధానమిచ్చాడు. 

గణనీయంగా క్షీణిస్తున్న జనాభాపై ఎపుడూ ఆందోళన వ్యక్తం చేసే మస్క్‌ సంతానోత్పత్తి ప్రాముఖ్యతపై దృష్టిపెట్టునట్టున్నాడు అంటోది సోషల్‌ మీడియా. జనాభా వృద్ధి చెందాలని భావించే మస్క్‌, ఇప్పటికే తన స్పెర్మ్‌ను స్నేహితులు, పరిచయస్తులకు దానం చేశాడనే  వాదనలు కూడా  చాలానే ఉన్నాయి. 

కాగా షివోన్ జిలిస్‌తో తనకున్న నలుగురు పిల్లలతో పాటు, మస్క్‌కు  మొదటి భార్య జస్టిన్ విల్సన్‌  ద్వారా  ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో కవలలు వివియన్ , గ్రిఫిన్‌తో పాటు, కై, సాక్సన్ , డామియన్ అనే ముగ్గురున్నారు.  వీరి తొలి సంతానం బిడ్డ నెవాడా అలెగ్జాండర్ మస్క్ కేవలం 10 వారాల వయసులోనే మరణించాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement