వారెవ్వా..! ఏం సందేశం ఇది..! | Dairy Milk Indias New Ad Goes Viral Impressed Social Media Users | Sakshi
Sakshi News home page

వారెవ్వా..! ఏం సందేశం ఇది..! వైరల్‌గా డైరీ మిల్క్‌ అడ్వర్టైస్‌మెంట్

Published Thu, Mar 13 2025 2:37 PM | Last Updated on Thu, Mar 13 2025 2:38 PM

Dairy Milk Indias New Ad Goes Viral Impressed Social Media Users

కొన్ని అడ్వైర్టైస్‌మెంట్‌లు ఆలోచనాత్మకంగానూ, సందేశాత్మకంగానూ ఉంటాయి. మరికొన్ని విదాస్పదంగా కూడా ఉంటాయి. అందుకే మీడియాలోనూ, ఇలాంటి మార్కెటింగ్‌ అడ్వర్టైస్‌మెంట్‌లలో ఏమరపాటు పనికిరాదని అంటారు నిపుణులు. ఇప్పుడిదంతా ఎందుకంటే నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నఈ డైరీ మిల్క్‌ అడ్వర్టైస్‌మెంట్‌ చూస్తే ఏం ఉందబ్బా అని అనుకుండా ఉండలేరు. ఒక్కసారిగా భాషా అతర్యం పెద్ద సమస్యకాదని చిటికెలో తీసిపారేసింది. నెటిజన్ల మనసు దోచుకున్న ఆ డైరీ మిల్క్‌ అడ్వర్టైస్‌మెంట్‌లో ఏముందంటే..

డైరీ మిల్క్‌ కొత్త అడ్వర్టైస్‌మెంట్‌లో ఉత్తర దక్షిణ భారతదేశ భాషల ఆంతర్యంపై ఆలోచనాత్మక సందేశాన్ని అందించింది. ఒక ఇంటిపై హిందీ మాట్లాడే మహిళల గుంపు కూర్చొని ఉంటుంది. వారి మధ్యలోని చెన్నైకి చెందిన పోరుగింటామె కూడా వారి సంభాషణలో చేరుతుంది. అయితే ఆమెకు హిందీ రాక ఇబ్బందిపడుతుంది. అక్కడ తన ఉనికే ప్రశ్నార్థకంగా ఉంటుంది. 

దాంతో ఆమె మిగతా మహిళలు సంభాషణను వింటూ మౌనంగా ఉండిపోతుంది. అయితే మరో మహిళ కల్పించకుని మాట్లాడమని సైగ చేస్తుంది. తనకు హిందీ కొంచెం కొంచెమే వచ్చు అని చెబుతుంది. దాంతో అవతల మహిళ వచ్చిరాని ఇంగ్లీష్‌లో జరిగింది వివరిస్తుంది. ఆ తర్వాత తనకు కూడా ఇంగ్లీష్‌ కొంచెం కొంచెమే వచ్చు అనేసి..డైరీ మిల్క్ ఇస్తుంది. అయినా మనుషులతో కలవాలని ఉంటే చాలు ..భాషతో సమస్య ఏం ఉందని నవ్వేస్తుంది. 

ఆ తర్వాత ఇరువురు ఆ డైరీ మిల్స్‌ని షేర్‌ చేసుకుని ఆస్వాదించడంతో ఆ యాడ్‌ ముగిసిపోతుంది. ఇక్కడ ఇందులో మన భాషలు వేరైతేనేం ఈ తియ్యటి చాక్లెట్‌తో కనెక్ట్‌ అవుదాం అన్నట్లుగా ఉంది. అందరం ఏదో ఒక సమయంలో లేదా ఏదో ఒక టైంలో ఇలాంటి సమస్యను ఫేస్‌ చేసే ఉంటాం కదా. నెట్టింట వైరల్‌అవుతున్న ఈ వీడియో నెటిజన్ల మనసును దోచుకోవడమే గాక..ఎంత అందంగా భాషభేధం పెద్ద సమస్య కాదని చెప్పిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 

(చదవండి: కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లినా.. నొప్పి తెలియదట ఆమెకు..! వైద్యనిపుణులకే అంతుపట్టని కేసు.)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement