
ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ జోరుగా నడుస్తోంది. ప్రముఖ్యంగా ఈ సీజన్‌లో చాలామంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. బ్యాచిలర్స్ జీవితానికి బై బై చెప్పేస్తున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ విపుల్ ధనాకర్ క్లబ్‌లో చేరారు. తన లేడీలవ్‌తో ఏడడుగులు వేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఈ జంటను అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.
విలేన్‌గా పాపులర్ సింగర్ విపుల్ ధనాకర్. తాజాగా ( మార్చి 16)తన ప్రేయసి దివ్య దహియాతో వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం గురించి చాలా గోప్యంగా ఉండే, విలేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఈ సడన్ సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్‌సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. "మా ఈ ప్రయాణం లోతు ఎంతో మాకు మాత్రమే తెలుసు మా కష్టాలు, బాధలు, అనుభవించిన, బాధ , ప్రేమ అన్నీ.. చివరకు ఇలా.. జీవితాంతం కలిసి పయనించబోతున్నాం’’ తన జీవితంలో ముఖ్యమైన రోజు గురించి వార్తను షేర్ చేశాడు. దీంతో కొన్ని అందమైన ఫోటోలను కూడా పంచుకున్నాడు.
విలేన్,దివ్య దహియా పెళ్లిదుస్తుల్లో అత్యద్భుతంగా కనిపించారు. తెల్లటి, సిల్వర్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో రాయల్ లుక్‌తో అదిరిపోయాడు. ముత్యాల హారం, ముత్యాలు, కుందన్ కల్గితో అలంకరించిన తెల్లటి పగ్డితో, గడ్డంతో విలేన్ లుక్ మరింత ఎలివేట్ అయింది.
ఇకవధువు దివ్య పాస్టెల్ పింక్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది. ఎంబ్రాయిడరీ స్కర్ట్, సరిపోలే బ్లౌజ్‌తో మహారాణిలా మెరిసిపోయింది. తలపై షీర్ దుపట్టా, క్లాసీగా కనపించింది. డైమండ్ నెక్లెస్, గ్యాజులు మ్యాచింగ్ చెవిపోగులు ,మాంగ్ టీకాతో లుక్‌ను మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అద్భుతంగా ఉన్నారు..దిష్టి తగిలేను జాగ్రత్త అంటూ నెటిజన్లు కొత్త జంటను అభినందించారు.

గాయకుడిగా విలేన్
న్యూ ఢిల్లీకి విపుల్ దనాకర్ యూట్యూబ్‌లో తన మ్యూజిక్ వీడియోలకు బాగా ప్రాచుర్యం పొందాడు. 2018లో ‘ఏక్ రాత్’,చిడియా (2019) పాటలతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూత లూగించాడు.అలాగే సావన్, జవానీ లాంటి పాటలతోపాటు, కనికా కపూర్ తో పాడిన తాజా పాట ‘చురాకే’ మరింత ప్రజాదారణ పొందాడు. గాయకుడిగా, స్వరకర్తగా,రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ప్రయాణంలో చాలా కష్టపడ్డాను. ప్రతిదీ అర్థం చేసుకోవాలి, దర్శకత్వం , స్క్రీన్ ప్లే రాయాలి, ఎడిటింగ్ కంపోజింగ్, సాహిత్యం ఎలా రాయాలి వీటన్నింటిలోనూ పట్టు ఉండాలి,అప్పడేరాణిస్తాం అంటాడు విలేన్.
Comments
Please login to add a commentAdd a comment