సినిమాను మించిన సింగర్‌ లవ్‌ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్‌! | 10 Years Dating check here singer Shreya Ghoshal Love Story | Sakshi

సినిమాను మించిన సింగర్‌ లవ్‌ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్‌!

Published Thu, Jan 30 2025 1:09 PM | Last Updated on Thu, Jan 30 2025 3:11 PM

10 Years Dating check here singer Shreya Ghoshal Love Story

సింగింగ్ సెన్సేషన్ శ్రేయా ఘోషల్(Shreya Ghoshal) తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ ఇలా పలు భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకునే గాయనీమణి ఆమె. ఎన్నో జాతీయ అవార్డులు. ఏ భాషలో పాడినా అత్యంత సహజంగా తన గానమాధుర్యంతో అలరించడం ఆమె స్పెషాల్టీ. అందుకే కోట్లాదిమంది సినీ సంగీతా భిమానులకు, మరెంతోమంది గాయకులకు ఆరాధ్యదైవం. తాజాగా శ్రేయా ఘోషల్‌ లవ్‌ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. సింగర్‌ శ్రేయ భర్త ఎవరు? ఆయనను తొలిసారి ఎక్కడ చూసింది, ఎవరు  ప్రపోజ్‌ చేశారు. ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.

శ్రేయ ఘోషాల్  ప్రేమకథ (Love Story అద్భుతమైన సినిమా స్టొరీ కంటే తక్కువేమీకాదు. శ్రేయా ఘోషల్ భర్త పేరు శిలాదిత్య ముఖోపాధ్యాయ (Shiladitya Mukhopadhyaya). ఖ ట్రూకాలర్  గ్లోబల్‌ హెడ్‌.  వీరి వివాహం 2015, ఫిబ్రవరి 5న జరిగింది. పెళ్లయిన ఆరేళ్లకు 2021లో వీరికి కుమారుడు దేవయాన్ జన్మించాడు.

శ్రేయా ఘోషల్, శిలాదిత్య  ప్రేమకథ
పాఠశాల విద్యార్థులగా ఉన్నప్పటినుంచే వీరి మధ్య ప్రత్యేకమైన అభిమానం  ఉండేది. 10 ఏళ్ల  డేటింగ్ తరువాత వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.  అయితే తనకు లవ్‌ ప్రపోజ్‌  చేయడానికి శిలాదిత్య పడిన కష్టాలను ఒక సందర్భంగా శ్రేయా స్వయంగా వెల్లడించింది.  

శిలాదిత్య తన స్నేహితుడి వివాహంలో శ్రేయాకు ప్రపోజ్ చేశాడట.  చాలా రోజులుగా ఇద్దరి మనస్సులో ఉన్నప్పటికీ  వ్యక్తం చేసుకోవడానికి సమయం దొరకలేదు. ఇద్దరూ కలిసి స్నేహితుడి పెళ్లి పెళ్లారు. ఈ సందర్భంగానే ఎలాగైనా తన మనసులోని మాటను చెప్పేయాలని శిలాదిత్య ప్లాన్‌ చేసుకున్నాడు.  కానీ విషయం అస్సలు శ్రేయాకు తెలియదు. ఇద్దరూ ఒక చోట కూర్చుని ఉండగా, అదిగో ఉడుత అని తన దృష్టి మళ్లించి, మోకాలిమీద కూర్చుని రింగ్‌తో ప్రపోజ్‌ చేశాడు. నిజంగానే నవలల్లో చదివినట్టుగా, సినిమాలో చూపించినట్టుగానే జరిగింది..అస్సలేమీ అర్థం కాలేదు అంటూ  తన మూడో వివాహ వార్షికోత్సవం  (గతంలో) సందర్భంగా వెల్లడించింది.

కాగా శ్రేయా ఘోషల్ 1984లో మార్చి 12,న పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించింది.  రాజస్థాన్ కోట సమీపంలోని రావత్‌భట అనే చిన్న పట్టణంలో పెరిగింది. నాలుగేళ్ల వయసునుంచే శాస్త్రీయ వాయిద్యం, హార్మోనియం నేర్చుకుంది.  గురువు మహేష్ చంద్ర శర్మ నుండి సంగీత పాఠాలు నేర్చుకుంది. శ్రేయ తొలి స్టూడియో ఆల్బమ్ 1998లో బెంధెచ్చి బీనా పేరుతో విడుదలైంది.  సరేగమా  టీవీ రియాలిటీ షో ద్వారా ప్రసిద్ధి చెందింది.  

16 ఏళ్ల వయసులో సంజయ్ లీలా భన్సాలీ రొమాంటిక్ మూవీ దేవదాస్‌ ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తొలిసినిమాకే జాతీయ అవార్డు ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. అప్పటినుంచి సినీ సంగీత లోకాన్ని ఏలుతోంది. 2012లో భారత దేశంలోని ప్రముఖుల ఆదాయం, ప్రజాదరణ ఆధారంగా రూపొందించిన 100 ఫోర్బ్స్ సెలబ్రిటీ జాబితాలో చోటు సంపాదించుకుంది. తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, అనేక జాతీయ అవార్డులు ఆమె ఖాతాలో చేరాయి. 

2017లో, ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారతీయ విభాగంలో మైనపు విగ్రహాన్ని పొందిన తొలి గాయకురాలు కూడా శ్రేయా ఘోషల్‌ కావడమ విశేషం. గాయనిగా, ప్రదర్శకురాలిగా, ప్లేబ్యాక్ సింగర్‌గా, సంగీత కంపోజర్‌గా రాణిస్తున్న ఆమె ఆదాయం సుమారు  రూ. 240కోట్ల మేర ఉంటుందని అంచనా.  ఇక ఆమె భర్త శిలాదిత్య ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.  ట్రూకాలర్‌ కంటే ముందు ఆయన గతంలో కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ కంపెనీలో కూడా పనిచేశారని సమాచారం.

ఇదీ చదవండి : Maha Kumbh Mela 2025: కలియుగ శ్రవణ్‌ కుమరుడు ఇతడు...


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement