రూ. 5 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం.. పదేళ్లలో రాని ఒక్క రోగి.. కారణమిదే!
ఎక్కడైనా ఆసుపత్రులను నిర్మించడం పెద్ద సవాలుతో కూడుకొని ఉంటుంది. నిధుల సేకరణ, బిల్డింగ్‌ను కట్టడం, వైద్య పరికరాలు అమర్చడం, వైద్యులను నియమించడం, వసతులు కల్పించడం ఇలా ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉంటాయి. కానీ అదే ఆసుపత్రిని కట్టడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనేక జబ్బులను నయం చేయవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకంటే..బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కోట్లాది రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిని అయితే నిర్మించారు కానీ గత పదేళ్లుగా అక్కడ ఒక్క రోగి కూడా వైద్యం అందలేదు. ఇందుకు ఇంకా ఆ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయకపోవడమే కారణం. అవును నిజమే..చాంద్ పురా ప్రాంతంలో ఆరు ఎకరాల్లో 30 పడకల ఆసుపత్రిని 2015లో రూ.5 కోట్లతో నిర్మించారు. అత్యాధునిక వసతులు కల్పించారు. కానీ ప్రారంభోత్సవం చేయకుండానే వదిలేయడంతో పొలం మధ్యలో శిథిలావస్థకు చేరుకుని దొంగలు, మందుబాబులుగా అడ్డాగా మారింది. అక్కడ ఒక్క రోగికి కూడా వైద్యం అందకపోవడంతో వైద్య పరికరాలు పాడైపోయాయి. ఆసుపత్రిని నిర్మించి పదేళ్లు కావస్తున్నా దీనినివైద్యారోగ్య శాఖ ఆధీనంలోకి తీసుకోలేదని, ఈ సౌకర్యాల గురించి అసలు తమకు తెలియదని అధికారులు చెబుతుండటం గమనార్హం.ఈలోపు దొంగలు ఆసుపత్రి కిటికీలు, డోర్ ఫ్రేమ్‌లు, తలుపులు, గ్రిల్స్, గేట్లు, కప్బోర్డ్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో ఆసుపత్రి ఓ అస్థిపంజరంలా మిగిలిపోయింది. ఆసుపత్రి క్యాంపస్‌లో మూడు భవనాలు ఉండగా.. ఆరోగ్య కార్యకర్తల నివాసం, పరీక్షా కేంద్రం, ప్రధాన భవనాలుగా నిర్మించారు.#Bihar Hospital Abandoned for 10yrs Becomes Haven for Thieves Government hospital in #Muzaffarpur Bihar built in 2015 at cost of ₹5 Crs, has never been inaugurated or opened for patients. The 30-bed hospital, equipped with modern facilities, has been left to deteriorate, with… pic.twitter.com/In9CAFQZW3— Nabila Jamal (@nabilajamal_) September 6, 2024ఆసుపత్రి నానాటికీ క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం నగరవాసులు నగరానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపు లక్ష జనాభా నివాసం ఉంటుంది. ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నప్పుడు, దాని గొప్పతనాన్ని చూసి, చుట్టుపక్కల ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇకపై నగరానికి 50 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం లేదని భావించారు. కానీ ఈ ఆసుపత్రి ఇప్పటి వరకు తెరుచుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు నగరానికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయంపై సబ్ డివిజనల్ ఆఫీసర్ షెరియాను ఆరా తీయగా.. ఆసుపత్రి గురించి తనకు తెలియదని, పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. సివిల్ సర్జన్, సర్కిల్ అధికారి వారి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని, విచారణ అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని చెప్పారు.