
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఆయన నటించిన తొలి చిత్రం అల్లుడు శ్రీను రిలీజై నేటికి (జూలై 25, 2014) పదేళ్లు పూర్తయింది. ఈ దశాబ్ద కాలంలో విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు.

రాక్షసుడు, జయ జానకి నాయక చిత్రాలతో పేరు గడించాడు. ఇండస్ట్రీలో పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న అతడు తాజాగా ఓ మంచి పని చేశాడు. నాకెంతో ఇచ్చిన ఈ సమాజానికి ఇలాంటి అద్భుతమైన రోజున ఏదైనా ఇవ్వాలనిపించింది.

అందుకే ఇలా నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నానంటూ అంధులకు సాయం చేశాడు. అంధ విద్యార్థులకు దుస్తులు, ఆహారం అందించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అతడి మంచి మనసును మెచ్చుకుంటున్నారు.

ఇకపోతే జయ జానకి నాయక హిందీ వర్షన్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఖూన్ఖర్ పేరుతో యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇప్పటిదాకా 848 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ రాబట్టింది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ అందుకున్న సినిమాగా రికార్డుకెక్కింది.







