
గచ్చిబౌలి: నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే రండి డబ్బులు ఇస్తానంటూ ఓ యూ ట్యూబర్ హల్‌చల్ చేసిన సంఘటన కొత్తగూడలోని శరత్ సిటీ క్యాపిటల్ (ఏఎంబీ)మాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..శుక్రవారం బౌన్సర్‌లతో మాల్‌లోకి వచి్చన యూ ట్యూబర్ పవర్ వంశీ నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే త్వరగా సెకండ్ ఫ్లోర్‌కు త్వరగా రండి ముందు వచ్చిన వారికే డబ్బులు వస్తాయని హల్‌చల్ చేశాడు.
దీనిని గుర్తించిన శరత్‌సిటీ క్యాపిటల్ మాల్ సెక్యూరిటీ సిబ్బంది వీడియో తీసేందుకు అనుమతి లేదని చెప్పి సదరు యూ ట్యూబర్‌ను బయటికి పంపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని గచి్చ»ౌలి పోలీసులు తెలిపారు. కాగా మాల్‌లో యూ ట్యూబర్ వంశీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలోనూ అతను కూకట్‌పల్లిలో రోడ్డుపై డబ్బులు విసిరిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు.
గతంలో కూకట్‌పల్లిలో రోడ్లపై డబ్బులు విసిరిన యువకుడు. pic.twitter.com/5N7YzDrVmn— greatandhra (@greatandhranews) December 28, 2024