
ఐడియా ఉండాలే గానీ, వేస్ట్ నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకొంచెం క్రియేటివ్‌గా ఆలోచిస్తే ఎందుకూ పనికి రాదు అనుకున్న వాటి ద్వారా కోట్లకు పడగలెత్తవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.
ఇక అది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు అయితే ఇక తిరుగే లేదు.జపాన్‌లోని ఒసాకాకు చెందిన 38 ఏళ్ల హయాటో కవమురా ఇదే నిరూపించాడు. ఆయన బుర్రలో తట్టిన ఒక ఐడియా ఆయన జీవితాన్నే మార్చేసింది. పాడుబడిన ఇళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని రీమోడలింగ్ చేసి అందంగా తీర్చి దిద్దాడు. ఆ తరువాత వాటిని రెంట్‌కు ఇచ్చాడు. ఇలా ఎంత సంపాదించాడో తెలుసా? ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిది కోట్లు సంపాదించాడు.
‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన వివరాల ప్రకారం..హయతో కవాముర అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి వివిధ ఆకారాల్లో నిర్మించిన ఇళ్లంటే మహా ఇష్టం. అంతేకాదు నగరంలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్లి పైనుంచి కింద ఉన్న వివిధ రకాలైన ఇళ్లను గమనిస్తుండేవాట. 200 పాతబడిన ఎవరూ పట్టించుకోని,శిథిలావస్థలో ఉన్న ఇళ్లు హయాటో కళ్ల బడ్డాయి. అంతే రంగంలోకి దిగాడు. వాటిని అందంగా మలిచి, వాటికి అద్దెకు ఇవ్వడం ద్వారా 8.2 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు.
చిన్నప్పటి రియల్ ఎస్టేట్ పట్ల మక్కువ ఉండేది. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో తనకు డబ్బు లేకపోయినా, తన స్నేహితురాలితో డేటింగ్‌లో భాగంగా సందర్శించే వాడు. చదువు తరువాత జాబ్‌లో చేరాడు. అయితే సీనియర్ మేనేజ్‌మెంట్‌తో వివాదం రావడంతో సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలనే కోరిక పెరిగింది. ఉపాధి నుండి వైదొలగాలనే అతని కోరిక పెరిగింది. ప్రమోషన్లు సామర్థ్యంమీద ఆధారపడి ఉండవు, పై అధికారి మన్నలి ఇష్టపడుతున్నారా లేదా అనే దానిపై ఆధార పడి ఉంటుందని కవామురాకి అర్థమైంది రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.

రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే కవామురా సామర్థ్యం కూడా అతని విజయంలో కీలక పాత్ర పోషించింది. అతని సంబంధాలు ఇతరుల కంటే ముందుగా విలువైన ఆస్తి సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సాయపడ్డాయి. 2018లో, అతను తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన సొంత రియల్ ఎస్టేట్ సంస్థ మెర్రీహోమ్‌ను స్థాపించి ఘన విజయం సాధించాడు. మారుమూల, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను బాగు చేసి అద్దెకు ఇవ్వగలిగాడు. 23 సంవత్సరాల వయసులో, వేలంలో 1.7 మిలియన్ యెన్ (10.1 లక్షలు) కు ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. అద్దె ద్వారా ఆదాయం. రూ. 2 లక్షలు. రెండేళ్ల తరువాత దీన్ని రూ. 25.6 లక్షలకు విక్రయించాడు. “రాత్రికి రాత్రే ధనవంతుడవుతానని అస్సలు ఊహించలేదు. రియల్ ఎస్టేట్‌లో లాభాలు రావాలంటే అపెట్టుబడులకు దీర్ఘకాలికంగా ఉండాలి. దీనికి ఓపిక , జాగ్రత్తగా శ్రద్ధ అవసరం అంటాడు కవామురా. అతని దూరదృష్టి ప్రశంసలు దక్కించుకుంది. భవిష్యత్తులో గొప్ప ఫలితాలను సాధించే అవకాశాలున్నాయంటూ మెచ్చుకున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట సందడి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment