#SSMB29: వాట్‌ ద ఎఫ్‌.. రాజమౌళి? | Where Is Rajamouli Mark In SSMB 29 Movie Shooting | Sakshi
Sakshi News home page

#SSMB29: వాట్‌ ద ఎఫ్‌.. రాజమౌళి?

Published Mon, Mar 10 2025 7:45 AM | Last Updated on Mon, Mar 10 2025 7:58 AM

Where Is Rajamouli Mark In SSMB 29 Movie Shooting

ఒక ప్రొడక్టును సృష్టించడం కంటే.. దాని మార్కెటింగ్‌ ఎంత బాగా చేశామనేది వ్యాపారంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం. మన దేశంలో.. సినిమా అనే వ్యాపారంలో దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళిని ఈ విషయంలో కొట్టగలిగేవారే లేరని ఇంతకాలం చెప్పుకున్నాం. అయితే తాజా #SSMB29 లీక్‌లతో ఈ విషయంలో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.

సినిమా మేకింగ్‌లో రాజమౌళి(Rajamouli)ది ఢిపరెంట్‌ స్కూల్‌. హీరోలతో సహా ప్రతీ టెక్నీషియన్‌కు కార్పొరేట్‌ కల్చర్‌ తరహాలో ఐడీ కార్డు జారీ చేస్తుంటారు. సెట్స్‌కి మొబైల్స్‌ తేవడం బ్యాన్‌.. అంతేకాదు ఈ విషయంలో ప్రత్యేక నిఘా కూడా పెడుతుంటారు. ఇలా.. ఒక సినిమా షూటింగ్‌ విషయంలో ఇంత జాగ్రత్తలు పాటిస్తుంటాడు దర్శకుధీరుడు. అంతెందుకు ఓ సినిమా మేకింగ్‌నే(RRR) ఏకంగా ఒక డాక్యుమెంటరీగా తీయించి వదిలిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. అలాంటిది మహేష్‌ బాబుతో తీస్తున్న చిత్రం విషయంలో ఎక్కడ పారపాటు.. కాదు పొరపాట్లు జరుగుతున్నాయి?.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరో. మళయాళ స్టార్‌ హీరో ఫృథ్వీ రాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) ఓ కీలక పాత్ర. ఏకంగా.. ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌. ఇంకా ఊహించని సర్ప్రైజ్‌లు ఎన్నెన్నో ఉండొచ్చు. అలాంటిది పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇలాంటి లీక్‌లతో  అవన్నీ బయటకు వచ్చేయవా?..

ఎక్కడో ఒడిషాలో మారుమూల చోట ప్రత్యేక సెట్టింగులలో  షూటింగ్‌ జరుపుకుంటోంది SSMB20 చిత్రం. తొలుత అక్కడి పోలీస్‌ అధికారులతో దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ వెంటనే అక్కడి ఛానెల్స్‌లో సెట్స్‌ను లాంగ్‌షాట్స్‌లో లైవ్‌ చూపించేశాయి. ఆ మరుసటి రోజే.. మహేష్‌ బాబు పాల్గొన్న షూటింగ్‌ సీన్‌.. అదీ చాలా క్లోజప్‌  షాట్‌లో బయటకు రావడం ఎంబీఫ్యాన్స్‌నే కాదు.. యావత్‌ చలనచిత్ర పరిశ్రమేనే షాక్‌కు గురి చేసింది . దీంతో ఆ వీడియోను తొలగించే చర్యలు చేపట్టినట్లు చిత్ర యూనిట్‌ తరఫు నుంచి ఒక ప్రకటన బయటకు వచ్చింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ తరహాలోనే.. మహేష్‌ బాబు సినిమాకు సైతం సెట్స్‌కు ఫోన్లు తేవడం నిషేధించారు.  అయినప్పటికీ ఆ సీన్‌ను ఎవరు.. ఎలా షూట్‌ చేశారు?. అదీ అది అంత దగ్గరగా ఉండి మరీ?. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్‌లకు బయటి వాళ్లను అనుమతించరు. షూటింగ్‌ కోసం తెచ్చే జూనియర్‌ ఆర్టిస్టులకు సైతం స్ట్రిక్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ వెళ్తుంటాయి. అలాంటప్పుడు లీకులకు అవకాశం ఎక్కడిది?. పనిరాక్షసుడిగా పేరున్న ఆయన పెట్టిన రూల్స్‌ బ్రేక్‌ చేసిందెవరు?.  కొంపదీసి.. ఇది కావాలని చేసిన లీక్‌ కాదు కదా! అనే చర్చ సైతం ఇప్పుడు జోరుగా నడుస్తోంది. అయితే..

సినిమా ప్రమోషన్‌ విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అంతేగానీ ఇంత చెత్తగా మాత్రం ఉండదు!. సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతతో మంచి నీళ్లలా డబ్బులు ఖర్చు చేయిస్తాడనే విమర్శ కూడా జక్కన్న మీద ఉంది కదా. అలాంటప్పుడు భారీ బడ్జెట్‌తో.. అదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో ఇలా ఎందుకు జరగనిస్తాడు?. 

ఏది ఏమైనా రాజమౌళి-మహేష్‌ బాబు సినిమా నుంచి.. అదీ షూటింగ్‌ మొదలైన తొలినాళ్లలోనే ఇలాంటి లీకులు కావడంతో.. వాట్‌ ద F*** అని ఒక్కసారిగా అనుకుంది టీఎఫ్‌ఐ అంతా. ఇంత చర్చ నడుస్తుండడంతో.. ఇకనైనా లీకుల విషయంలో జాగ్రత్త పడతారేమో చూడాలి మరి!.

ఇదీ చదవండి: రాజమౌళికి బిగ్‌ షాక్‌.. మహేష్‌ బాబు వీడియో బయటకు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement