telugu film indurstry
-
కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు
-
అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది: నరేశ్ వీకే
‘‘మంచి నటుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. 50 ఏళ్లు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం ప్రేక్షకుల ప్రేమ, అభిమానాల వల్లే సాధ్యమైంది. నా జీవితాంతం చిత్ర పరిశ్రమకు సేవ చేస్తాను’’ అని నటుడు డా. నరేశ్ వీకే అన్నారు. నటుడిగా ఆయన ప్రయాణం మొదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి. నేడు (జనవరి 20) నరేశ్ పుట్టినరోజు. (చదవండి: ప్రముఖ హీరో మంచి మనసు... ఆరుగురు ఖైదీలు విడుదల) ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని శుక్రవారం నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా తొమ్మిదో ఏట ‘పండంటి కాపురం’ (1972)తో బాలనటుడిగా అడుగుపెట్టాను. మా అమ్మ విజయ నిర్మల, జంధ్యాల, కె. విశ్వనాథ్, బాపు, రమణ, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నరసింహారావు వంటి మహనీయులతో సినిమాలు చేసే అదృష్టం దక్కింది. రాజకీయాలు, ఆ తర్వాత సమాజ సేవ వల్ల దాదాపు పదేళ్లు పరిశ్రమకి దూరమయ్యాను. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, బిజీగా ఉన్నాను. నాకు నెగటివ్ రోల్స్ చేయాలని ఉంది. ఇక ఏ ప్రభుత్వమైనా సినీ పరిశ్రమకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలి. నంది అవార్డులని పరిశ్రమ గౌరవంగా చూస్తుంది. కానీ ఇప్పుడా అవార్డులని ఇవ్వడం లేదు.. మళ్లీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా అబ్బాయి నవీన్‌కి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నాను. మా విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్‌ని మోడ్రన్ స్టూడియోగా చేస్తున్నాం’’ అన్నారు. -
సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జరిగిన టాలీవుడ్ ప్రముఖుల భేటీపై తాజాగా మాజీ ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ స్పందించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. రీసెంట్గా సీఎం జగన్‌తో జరిగిన సినీ పెద్ద సమావేశం అభినందనీయమని పేర్కొన్నాడు. ఈ భేటీపై నరేశ్ హర్షం వ్యక్తం చేస్తూనే.. ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో వర్క్ షాప్ అవసరమని సోషల్ మీడియా వేదిక అభిప్రాపడ్డాడు. చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్ ఈ మేరకు ‘సీఎం జగన్‌తో భేటీ ప్రశంసించదగ్గదని. కానీ ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో పరిశ్రమ ప్రయోజనాల కోసం ఒక వర్క్ షాప్ పెట్టడం అవసరం. తెలుగు చిత్ర పరిశ్రమ ఐక్యతను ప్రతిబింబించే విధంగా.. ప్రభుత్వం, ప్రజల గౌరవాన్ని పొందేలా అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరిపి అధికారికంగా తీర్మానాలు జారీ చేయాలి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరుగుతుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. చదవండి: ఆ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ అన్ని కోట్లు ఖర్చు పెట్టిందా? కాగా ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న సీఎం జగన్‌తో జరిగిన ఈ సమావేశానికి టాలీవుడ్ తరపున మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి, పోసాని కృష్ణ మొరళితో పాటు ఇతర ప్రముఖులు హజరయ్యారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ల రేట్ల అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వారి వినతి మేరకు సీఎం జగన్ ఏపీలో 5వ షోకు అంగీకారం తెలిపారు. ఇక ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సినీ పెద్దలు.. త్వరలోనే పరిశ్రమకు శుభవార్త వస్తుందని చెప్పారు. The meeting with cm is laudable. But the need of the hour is a work shop led by FILM CHAMBER on larger interests of TFi,amicable solutions & resolutions passed OFFICIALY & democratically reflecting the unity of TFI & earning da respect of da govt & people. Hopefully soon — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 12, 2022 -
పూర్వ విద్యార్థులతో సినిమాలు
రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులతో నిర్మాత డి. సురేష్ బాబు రెండు కొత్త చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న సతీష్ త్రిపుర, అశ్విన్ గంగరాజు ఈ చిత్రాలకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ– ‘‘సతీష్ త్రిపుర తెరకెక్కించనున్న చిత్రం ఒక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. అదే విధంగా అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్న సినిమా ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులను తెలుగు చిత్ర పరిశ్రమలోనికి తీసుకురావటంలో ఇదో మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ రెండు చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. -
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి జగన్ భరోసా ఇచ్చారు
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారిని నేను కలిసినప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలపైన చర్చ జరిగింది. తెలుగు పరిశ్రమ అభివృద్ధికి ఏం కావాలన్నా చేస్తానని భరోసా ఇచ్చారు. నంది అవార్డులు గత రెండేళ్లుగా ఇవ్వకుండా ఆపేశారు.. వాటిని మళ్లీ అందివ్వాలని కోరాను. అందుకు ఆయన ‘చెప్పండి అన్నా.. మీరందరూ అనుకుని చెబితే తిరిగి ప్రారంభిద్దామని సుముఖంగా స్పందించారు’’ అన్నారు చిరంజీవి. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’(మా) 2020 డైరీ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, టీఎస్సాయర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– జగన్ గారితో ‘సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు?’ అని అడిగితే.. ‘ఆ శాఖని ఇంకా కేటాయించలేదు. త్వరలో పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్‌కి లేక మరొకరికి కేటాయిస్తాను. సంబంధిత శాఖ కార్యదర్శిని మీ వద్దకు పంపిస్తా.. ఎలా చేద్దాం ఏంటన్నది మీరందరూ మాట్లాడండి’ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. జగన్‌గారికి చిత్ర పరిశ్రమకు ఎంతో చేయాలని ఉంది. అయితే వారు వెళుతున్న విధానంలోకి మనలాంటి వాళ్లు వెళితే కానీ ఒక రూపం రాదనుకుంటున్నా. మోహన్‌బాబు, మురళీమోహన్గార్లు, నేను... మరికొందరు కలిసి వెళ్లి మార్చికో, ఉగాదికో ‘నంది’ అవార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ‘చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా చేస్తాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చెప్పారు. ‘మా’ సంఘానికి 3 ఎకరాలు స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సాయంతో చిత్ర పరిశ్రమను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఏకాభిప్రాయంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి తెలుగు ఇండస్ట్రీకి, ‘మా’కి మంచి పేరు తీసుకురావాలి. చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోదాం. మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం. ‘మా’లో గతంలో పెద్దగా విభేదాలు లేవు. కానీ మాకంటే ఎక్కువ సేవ చేయాలనే కసితో ప్రస్తుత బాడీ ఉంది. దానివల్ల కొన్ని విభేదాలు తలెత్తాయి. వాటిని సమన్వయం చేసుకుందాం. స్వలాభం కోసం కాకుండా కళామతల్లి గర్వపడే బిడ్డలుగా ముందుకు వెళ్లాలి’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అసోసియేషన్ అంటే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి.. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. ‘మా’ గురించి ఎవరూ బయట మాట్లాడకూడదు. ‘మా’ గౌరవాన్ని నిలబెట్టాలి’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కళాకారులను గౌరవించి, సాయం చేసే టి.సుబ్బరామిరెడ్డిగారిలాంటి గొప్ప వ్యక్తి ముందు నేడు ఇలాంటి గొడవలు జరగడం బాధాకరం. భగవంతుడి సాక్షిగా నాకు, చిరంజీవికి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నా కుటుంబమే ఆయన కుటుంబం. ఆయన కుటుంబమే నా కుటుంబం. ‘మా’లో గొడవలు జరుగుతున్న మాట వాస్తవం. ‘మా’ ఎవడి సొత్తు కాదు. సవాళ్లు చేసుకోవడం మానేసి కలిసి పనిచేద్దాం’’ అన్నారు. ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘మార్చిలో జరిగిన ‘మా’ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ అసోసియేషన్ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో సినిమా కూడా చేయలేకపోయాను. ‘మా’ కోసం చాలా మెంటల్ టెన్షన్‌తో వర్క్ చేస్తున్నందుకు మా ఇంట్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. వాటివల్లే ఇటీవల నా కారుకి ప్రమాదం చోటు చేసుకుంది. ‘మా’లో ఉన్నవి చిన్న చిన్న సమస్యలే కాబట్టి సర్దుకుపోయి పని చేయాలని చిరంజీవిగారు చెప్పడం సంతోషమే. కానీ ‘మా’లో పెద్ద గొడవలున్నాయి. నిప్పును కప్పిపుచ్చితే పొగ రాకుండా ఉండదు. రీల్ లైఫ్‌లోలా రియల్ లైఫ్‌లోనూ హీరోలా పని చేద్దామంటే కొందరు నొక్కేస్తున్నారు.. తొక్కేస్తున్నారు’’ అన్నారు. ‘‘రాజశేఖర్గారిది చిన్నపిల్లల మనస్తత్వం. ఆయన మాటలకు క్షమాపణ కోరుతున్నా’’ అన్నారు జీవిత. అందుకే రాజీనామా చేశా – రాజశేఖర్ గురువారం ఉదయం ‘మా డైరీ’ ఆవిష్కరణ అనంతరం సాయంత్రం రాజశేఖర్ ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా ఓ ప్రకటన ద్వారా వివరించారు. ‘‘మా’ అసోసియేషన్‌కు ఎంతో మంచి చేయాలనుకున్నాను. కానీ ‘మా’ ప్రెసిడెంట్ నరేశ్‌గారు కమిటీ సభ్యులను కించపరుస్తూ, తక్కువ చేస్తూ వస్తున్నారు. వీటన్నింటినీ పరిష్కరించుకొని ముందుకువెళ్లాలని నా వంతు కృషి చేశాను. కానీ నరేశ్‌గారు పారదర్శకతను మరిచి తనకు నచ్చిన విధంగా నడుచుకుంటున్నారు. ‘మా’ డైరీ వేడుకలో నరేశ్‌గారు మాట్లాడింది ఏదీ కమిటీ సభ్యులతో చర్చించలేదు. జీవితకు వాట్సాప్ మెసేజ్ మాత్రం పంపారు. ఇండస్ట్రీ పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో మాకున్న విభేదాలను చర్చించాం. కానీ ఆయనలో మార్పేం లేదు. అందుకే ఈ రోజు వేడుకలో నా ఎమోషన్స్ బయటపెట్టాను. నేను చాలా సున్నితమైన మనిషిని. ముక్కుసూటిగా వ్యవహరిస్తాను. నరేశ్‌గారు వ్యవహరిస్తున్న తీరు నచ్చడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నా ఎమోషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటారనుకుంటున్నా’’ అని రాజశేఖర్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘మా’ వేడుకలో ఆత్మీయంగా మోహన్‌బాబు, చిరంజీవి చదవండి: హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం మోహన్‌బాబును ఆలింగనం చేసుకున్న చిరంజీవి ‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్ ‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం నాకు పదవీ వ్యామోహం లేదు -
మహేశ్@ 39
అవును... శుక్రవారంతో మహేశ్బాబులోని నటుడు 39 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అదేంటీ? మహేశ్ హీరోగా చేసిన ఫస్ట్ సినిమా ‘రాజకుమారుడు’ విడుదలైంది 1999లో కదా. అప్పుడే 39 ఏళ్లా? లెక్క తప్పారు అనుకుంటున్నారా? ఊహూ.. ఈ లెక్క మహేశ్ బాలనటుడిగా చేసిన సినిమాతో కలిపి. 1979లో మహేశ్‌కు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ‘నీడ’ అనే సినిమాలో ఓ రోల్ చేశారు. అంతేకాదు చైల్డ్ ఆర్టిస్టుగా ఆయన తొమ్మిది సినిమాల్లో నటించారు. ఇప్పుడు అర్థం అయ్యింది కదా. నటుడిగా మహేశ్‌కు 39 ఏళ్ల సినీ ప్రస్థానం ఎలా పూర్తయిందో. ప్రస్తుతం కెరీర్లో 25వ చిత్రం ‘మహర్షి’తో బిజీగా ఉన్నారాయన. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. జయసుధ, సాయికుమార్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన విలేజ్ సెట్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు టీమ్. మరో 16 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని సమాచారం. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. -
33 ఏళ్ల సినీ ప్రస్థానంలో..!
కామెడీ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు ఎస్. శ్రీనివాస రెడ్డి 33 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని శ్రీ కృష్ణా మూవీ మేకర్స్ ఆఫీస్ లో వేడుకలు జరుపుకున్నారు. 1984లో ప్రముఖ కన్నడ దర్శకుడు విజయారెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత, అంకుశం చిత్రానికి పనిచేశారు. వై. నాగేశ్వరరావు, శివ నాగేశ్వరరావు వంటి ప్రముఖ దర్శకుల దగ్గర చాలా చిత్రాలకు పనిచేశారు. కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళ్లి చూడదగ్గ కామెడీ సినిమాలు అంటే అందరికీ గుర్తొచ్చే దర్శకుడు శ్రీనివాస రెడ్డి. ఆయన సినిమా టైటిల్స్ ఎంపిక దగ్గర నుంచే కామెడీ టచ్ ఉండేలా చూసుకుంటారు. అదిరిందయ్యా చంద్రం చిత్రంతో సూపర్ హిట్ అందుకుని.. ఆ తరువాత, టాటా బిర్లా మధ్యలో లైలా, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, కుబేరులు వంటి కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. యమగోల మళ్లీ మొదలైంది చిత్రంతో సోషియో ఫ్యాంటసీ సబ్జెక్టుల్ని కూడా అద్భుతంగా డీల్ చెయ్యగలరని నిరూపించుకున్నారు. తక్కువ బడ్జెట్ లోనే... స్పెషల్ ఎఫెక్ట్స్ మేళవించి తీసిన ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత, నాగార్జున హీరోగా తెరకెక్కించిన ఢమరుకం చిత్రం.. అప్పటి వరకూ నాగ్ కెరీర్లోనే టాప్ గ్రాసర్‌గా నిలిచింది. తెలుగులో గంటకు పైగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ఓ సినిమా చేయడం అదే ప్రథమం. -
కృష్ణ, విజయనిర్మలకు పెళ్లి చేసింది నేనే..
ఉన్నత చదువు... మంచి మనసు... మాటల్లో నిజాయితీ...చేతల్లో నిబద్ధత వెరసి ఆయనకు తెలుగు, కన్నడ సినీ చరిత్రలో మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయనే ఏకాంబరేశ్వరరావు. నిర్మించింది దశ చిత్రాలే అయినా దశాబ్దాల కాలం గుర్తుండిపోయేలా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మలకు ప్రేమ పెళ్లి చేసింది కూడా ఏకాంబరేశ్వరరావే. ఆయన మనోగతం ఏంటో ఆయన మాటల్లోనే ... తమిళ సినిమా: మాది ఆంధ్రప్రదేశ్, బాపట్ల సమీపంలోని జమ్మిలపాలెం. పువ్వాడ బసవయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు 1934 సెప్టెంబర్ 27న పుట్టాను. మచిలీపట్టణంలో డిగ్రీ పట్టా పొందాను. ఆ తరువాత ఎస్ఐగా పరీక్షలో సెలెక్ట్ అయినా చేరలేదు. కాంట్రాక్టర్ వృత్తి చేపట్టాను. తరువాత చిత్ర రంగంపై దృష్టి మళ్లింది. చదువుకునే రోజుల నుంచే నటనపై ఆసక్తి. పలు నాటకాలు ఆడాను కూడా. అప్పట్లో నా మిత్రుడు కొన ప్రభాకర్, హీరోగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆయన స్ఫూర్తితో చెన్నైకి పయనం అయ్యాను. అక్కడ లోటుపాట్లను ఆరు నెలలు సునితంగా పరిశీలించాను. తొలి ప్రయత్నంగా పంపిణీ రంగంలోకి ప్రవేశించాను. మిత్రులు ఎన్ ఎన్భట్, ఎన్ ఎస్ మూర్తిలతో కలిసి భీమాంజనేయ యుద్ధం, సత్యమే జయం చిత్రాలను పంపిణీ చేశాను. ఆ తరువాత తానే చిత్రం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే నిర్మాతనయ్యాను. ఎన్ఎన్ భట్‌తో కలిసి విజయాభట్ మూవీస్ పతాకంపై 'సుఖ దుఃఖాలు' చిత్రం నిర్మించాను. తమిళంలో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన మేజర్ చంద్రకాంత్ చిత్రానికిది రీమేక్. ఎస్.వి.రంగారావు గారు ప్రధానపాత్ర పోషించారు. నేటి మాజీ ముఖ్యమంత్రి జయలలిత హీరోయిన్. అప్పటి వరకు హాస్యపాత్రలు పోషిస్తున్న వాణిశ్రీని రెండో హీరోయిన్గా పరిచయం చేశాను. ఈ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఇది మల్లెల వేళయని పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. నాలుగు లక్షలతో నిర్మించిన ఈ చిత్రాన్ని 1967లో విడుదల చేశాం. ఇదే చిత్రంలోని మేడంటే మేడే కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది పాటలోనే గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం ప్రాచుర్యం పొందారు. ఇక నేను కాంట్రాక్టర్‌గా సంపాదించిన రూ.30వేలతో పరిశ్రమలో అడుగుపెట్టాను. వాటిలో సగం తొలి చిత్ర నిర్మాణానికి ఖర్చు కాగా ఇక 15వేలు మిగిలాయి. తన బంధువు సునీల్‌చౌదరి రూ.15 వేలు పెట్టుబడి పెడుతానన్నారు. తరువాత కె.రాఘవ కూడా పార్టనర్‌గా చేరారు. ఎన్.వి.సుబ్బరాజు మరో భాగస్వామిగా చేరడంతో మొత్తం రూ.51వేలతో జగత్ కిలాడీలు చిత్రం మొదలెట్టాం. కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్, సంభాషణలు రాశారు. ఈ చిత్రం నిర్మాణ సమయంలోనే కృష్ణ, విజయనిర్మలు ప్రేమలో పడ్డారు. కృష్ణగారి కుటుంబం వీరి ప్రేమను అంగీకరించ లేదు. కృష్ణ, విజయనిర్మలను వదిలి ఉండలేని పరిస్థితి రావడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. నేను కె.రాఘవ పూనుకుని తిరుపతిలో వారి పెళ్లి చేయించాం. జగత్ కిలాడీలు మంచి విజయం సాధించింది. తదుపరి జగత్ జట్టీలు చిత్రం నిర్మాణానికి సిద్ధం అయ్యాం. ఈ చిత్రంలోను కృష్ణనే హీరోగా నటించమని అడిగాం. అందుకాయన హీరోయిన్గా విజయనిర్మలను చూపించారు. ఈ విషయంలో విభేదాలొచ్చాయి. దీంతో శోభన్‌బాబును ఎంపిక చేశాం. కేవీ నందనరావు దర్శకుడు. ఆయన వద్ద దాసరి నారాయణరావు సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. జగత్‌జెట్టీలు పేరుతో విజయ బాపినీడు ఒక నవలనురాశారని తెలిసి ఆయన్ని పిలిచి మా చిత్రానికి పని చేయమని అడిగాం. అందుకాయన సంతోషంగా అంగీకరించారు. ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్. అప్పటి వరకు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న రావుగోపాలరావు గారిని ఈ చిత్రం ద్వారా నటుడిగా పరిచయం చేశాను. అందుకాయన శోభన్‌బాబు చిత్రంలో నేను సెకండ్ హీరోనా అంటూ నిరాకరించడంతో ఆ వేషం నేనే ధరించాను. ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినా నిర్మాతగా బాగానే ఉన్నాను కదా అని నటనపై ఆసక్తి చూపలేదు. మూడవ చిత్రం జగత్జంత్రీలు చేశాం. ఈ చిత్రం తరువాత విభేదాల కారణంగా రాఘవ, నేను విడిపోయాం. ఆ తరువాత నేను పల్గుణ పిక్చర్స్ పతాకంపై ఎస్.వి.రంగారావు, చలం, వాణిశ్రీలతో రాముడే దేవుడు చిత్రం చేశాను. బి.వి.ప్రసాద్ దర్శకుడు. కన్నడ చిత్ర రంగ ప్రవేశం మధ్యలో భట్‌తో కలిసి అతై కొందుకల శశికందుకల అనే చిత్రం చేశాను. కల్యాణ్‌కుమార్ హీరో. ఆ అనుభవంతో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ హీరోగా మూరువరె వజ్ర అనే భారీ పౌరాణిక చిత్రం చేశాను ఈ చిత్రంలో రాజ్‌కుమార్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో నారద వినోదం పేరుతో అనువాదం చేశాను. దాసరిగారితో అత్యం త సాన్నిహిత్యం ఉన్నా ఆయనతో చిత్రం చేయలేకపోయాను. తెలుగులో గమ్మత్తు గూఢచారి పేరుతో బాలల ప్రధాన ఇతివృత్తంతో ఒక చిత్రం చేశాను. మోహన్‌బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. ఆ తరువాత పంపిణీదారుల వ్యవస్థ పోయి కొనుగోలుదారుల పద్ధతి రావడంతో 1983 తరువాత చిత్ర నిర్మాణానికి దూరంగా వున్నాను. నా జీవిత భాగస్వామి అనురేశ్వరి. ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు పేరు సుందర్. సినీరంగంలో కొనసాగుతున్నాడు. రెండో కొడుకు చంద్రబాబు హైదరాబాదులోనే ఫిలిం ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. మూడవ కొడుకు సాప్టువేర్ ఇంజనీర్, స్టేట్స్లో ఉంటున్నారు. కూతురు హేమలత పెళ్లి చేసుకుని బాపట్లలో ఉంటోంది. 80 వసంతాలు పూర్తి చేసుకున్న నేను ఇప్పటికీ ఆనందంగా గడిపేస్తున్నాను.