రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులతో నిర్మాత డి. సురేష్ బాబు రెండు కొత్త చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఫిల్మ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్న సతీష్ త్రిపుర, అశ్విన్ గంగరాజు ఈ చిత్రాలకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ– ‘‘సతీష్ త్రిపుర తెరకెక్కించనున్న చిత్రం ఒక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ఉంటుంది.
అదే విధంగా అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్న సినిమా ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులను తెలుగు చిత్ర పరిశ్రమలోనికి తీసుకురావటంలో ఇదో మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ రెండు చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment