Film Institute
-
హీరోగా మహేశ్‌బాబు తనయుడు.. అమెరికాలో శిక్షణ!
టాలీవుడ్లో ఘట్టమనేని ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ, ఆ తర్వాత మహేశ్ బాబు వరుసగా తమ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కృష్ణ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే తన కొడుకును తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు మహేశ్ కూడా తన కొడుకును హీరో చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే దీనికి ఇంకో ఐదారేళ్ల సమయం ఉంది. మహేశ్ కొడుకు గౌతమ్ ఇప్పుడు ప్లస్ టూ పూర్తి చేశాడు. బ్యాచిలర్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లాడు. అది పూర్తయిన తర్వాత కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని మహేశ్ ఆలోచన.(చదవండి: గేమ్ ఛేంజర్ ఆసల్యం.. మనసు మార్చుకున్న రామ్ చరణ్)దాని కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు మహేశ్. గౌతమ్‌కి నటనలో శిక్షణ ఇప్పించాలనుకుంటున్నాడట. న్యూయార్క్‌లోని ఓ ప్రముఖ ఫిలిం ఇన్స్టిట్యూట్లో గౌతమ్‌ని జాయిన్ చేయించబోతున్నట్లు తెలుస్తోంది. బ్యాచిలర్ డిగ్రీతో పాటు యాక్టింగ్ కోచింగ్ కూడా పూర్తి చేయించాలనుకుంటున్నారట. (చదవండి: అంబానీల పెళ్లి.. వాళ్లకు బహుమతిగా కోట్ల రూపాయల వాచీలు)ఇదంతా జరగాలంటే నాలుగైదేళ్ల సమయం పడుతుంది. ఆలోపు గౌతమ్‌కి పాతికేళ్ల వయసు వస్తుంది. అప్పుడు హీరోగా ఎంట్రీ చేయాలని మహేశ్ ప్లాన్. ఇక కూతురు సితారకు కూడా సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టం..ఆమెను కూడా ఇండస్ట్రీలోకే తీసుకురావాలనుకుంటున్నారట. అయితే సితార ఎంట్రికి చాలా సమయం ఉంది. -
ఘనంగా వినోద్ ఫిల్మ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవం
వినోద్ ఫిల్మ్ అకాడమీ దిన దిన ప్రవర్ధమానమై మరింతగా ఎదగాలని ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ అన్నారు. మంగళవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగిన వినోద్ ఫిల్మ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అకాడమీతో తన అనుబంధాన్ని వివరించారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడే విజయం వరిస్తుందని ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీదేవి ప్రసాద్ అన్నారు. నటుడు ప్రదీప్ మాట్లాడుతూ నటనలో ఉండే టెక్నిక్ ను పట్టుకోవాలని అన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రముఖ దర్శకుడు ఏ మోహన్ గాంధీ విద్యార్థులను ఆశీర్వదించారు. దొరసాని చిత్ర దర్శకుడు శ్రీ కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ కొత్త నటులకు అవకాశం ఇస్తూ ఉంటానని ప్రకటించారు. మాటల రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కోద్ది మంది మాత్రమే ఉంటారని అందులో తాము ఉండడం ఎంతో అదృష్టమని అన్నారు. అకాడమీ వ్యవస్థాపకుడు వినోద్ ప్రసంగిస్తూ.. తమ సంస్థ అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ టెక్నాలజీ నిపుణులు నల్లమోతు శ్రీధర్, జబర్దస్త్ అప్పారావు, యూ ట్యూబ్ ఫాదర్ సతీష్ , టిఏంటి డి ఎ యూ అధ్యక్షుడు రాజశేఖర్ ,బబ్లు, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
అల్లు అరవింద్-దిల్ రాజు సహాయం మరువలేనిది: దర్శకుడు
దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్‌కు సంబంధించి అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతల సలహాలు-సూచనలు, సహాయ సహకారాలు మరువలేనివని ప్రముఖ దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు అన్నారు. ‘అంకురం’తో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉమామహేశ్వరరావు.. ఇటీవల ‘ఇట్లు అమ్మ’తో తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి తెలియజేశాడు. అంతర్జాతీ స్థాయిలో ఈ చిత్రం 76 అవార్డులను దక్కించుకుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు‘దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్’ నిర్వహిస్తూ..ఎంతో మంది కళాకారులను టాలీవుడ్‌కు అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ 5 వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. దిగువ మధ్య తరగతివారిలో ఉన్న ప్రతిభావంతుల్ని వెండితెరకు పరిచయం చేయడమే లక్ష్యంగా అత్యున్నత ప్రమాణాలతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు చేసిన సహాయం మరువలేని అన్నారు. తదుపరి చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే అధికారికంగా పూర్తి వివరాలు ప్రకటిస్తామని అన్నారు. -
పూర్వ విద్యార్థులతో సినిమాలు
రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులతో నిర్మాత డి. సురేష్ బాబు రెండు కొత్త చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న సతీష్ త్రిపుర, అశ్విన్ గంగరాజు ఈ చిత్రాలకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ– ‘‘సతీష్ త్రిపుర తెరకెక్కించనున్న చిత్రం ఒక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. అదే విధంగా అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్న సినిమా ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులను తెలుగు చిత్ర పరిశ్రమలోనికి తీసుకురావటంలో ఇదో మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ రెండు చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. -
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడతాం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు శంషాబాద్‌లో అవసరమైన స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో సీనియర్ సినీనటులు చిరంజీవి, నాగార్జునలతో మంత్రి సమావేశమయ్యారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, కళాకారుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం కోసం అన్ని విధాలుగా అందుబాటులో ఉండేలా స్థలం కేటాయించాలని చిరంజీవి, నాగార్జున మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళను అవసరమైన స్థలాన్ని వెంటనే సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సినీ, టీవీ కళాకారుల ఇళ్ల నిర్మాణం కోసం చిత్రపురి కాలనీ తరహాలో పరిసర ప్రాంతాల్లో మరో 10 ఎకరాల స్థలం కేటాయించాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, 24 విభాగాల సినీ కళాకారులకు సాంకేతిక నైపుణ్యం పెంపుకోసం అవసరమైన శిక్షణా కేంద్రం నిర్మాణానికి జూబ్లీహిల్స్, నానక్‌రాం గూడ ప్రాంతాలలో స్థలాలు కేటాయించా లని సినీనటులు ప్రతిపాదిం చారు. రూ.కోట్లతో సినిమాలు నిర్మిస్తే పైరసీతో నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తుందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని కోరారు. పైరసీని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చారు. సినిమా షూటింగుల అనుమతుల కోసం వివిధ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకురాగా, సింగిల్ విండో విధానంలో ఎఫ్డీసీ ఆధ్వర్యంలో షూటింగ్ అనుమతులిచ్చేలా వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి చెప్పారు. ఆరోగ్య బీమా అమలు చేయండి.. చలనచిత్ర రంగంలో పనిచేస్తున్న సుమారు 28 వేల మంది కళాకారులకు ఎఫ్డీసీ ద్వారా గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని, కేన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు అవసరమైన ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని సినీనటులు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా ఉంటే వారి వివరాలు ఇస్తే సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటామని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ రాంమోహన్‌రావు, నిర్మాత నిరంజన్, ఎఫ్డీసీ ఈడీ కిషోర్‌బాబు, హోంశాఖ డిప్యూటీ సెక్రెటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
దేవదాస్ కనకాలకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: సీనియర్ నటుడు, దర్శకుడు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు దేవదాస్ కనకాల (75) అంత్యక్రియలు శనివారం బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్ కనకాల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చితికి నిప్పంటించే సమయంలో రాజీవ్ కనకాల రోదించడం అందరినీ కలచి వేసింది. అంతకుముందు మణికొండలోని దేవదాస్ నివాసానికి ఆయన వద్ద నటనలో శిక్షణ పొందిన అనేక మంది శిష్యులు చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేవదాస్‌కు నివాళులు అర్పించి కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మిని ఓదార్చారు. భార్య మరణించినప్పటి నుంచి దేవదాస్ ముభావంగా ఉంటున్నారని, ఈ క్రమంలో ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆయన బంధువులు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మణికొండ, రాయదుర్గం మీదుగా విస్పర్ వ్యాలీ కూడలి నుంచి మహాప్రస్థానానికి దేవదాస్ కనకాల భౌతికకాయాన్ని తరలించారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో సినీనటులు, ఆయన శిష్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. -
నాలాంటి ఉగ్రవాదులను తయారు చేస్తా: వర్మ
సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘ఆర్జీవీ అన్ స్కూల్’ పేరుతో ఫిలిం స్కూల్ ప్రారంభించారు. న్యూయార్క్‌కు చెందిన డాక్టర్ రామ్ స్వరూప్, డాక్టర్ శ్వేతా రెడ్డిలతో కలిసి ఈ ఫిలిం స్కూల్‌ను ప్రారంభిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వర్మ తనను తాను వెండితెర ఉగ్రవాదిగా ప్రకటించుకున్నారు. ‘అన్‌స్కూల్ ద్వారా సినిమాకు సంబంధించి ఓనమాలు కూడా తెలియని వారికి శిక్షణ ఇస్తాం. యువతీ యువకుల అభిరుచిని బట్టి వివిధ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాం. సినీరంగానికి సంబంధించి దాదాపు అన్ని విభాగాల్లోనూ శిక్షణ ఇస్తాం. మా స్కూళ్లో చేరాలంటే 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంద’న్నారు వర్మ. నా లాంటి ఉగ్రవాదులను తయారు చేసి పరిశ్రమలోకి వదలడమే నా లక్ష్యం అన్నారు ఆర్జీవీ. -
ఆర్జీవీ సినీ పాఠాలు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో అవతారం ఎత్తనున్నారు. ఇండియన్ సినిమాకు సరికొత్త టెక్నాలజీలతో పాటు డిఫరెంట్ టేకింగ్‌ను పరిచయం చేసిన వర్మ ఫిలిం స్కూల్‌ను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా ప్రకటించారు న్యూయార్క్ కు చెందిన డాక్టర్ రామ్ స్వరూప్, డాక్టర్ శ్వేతా రెడ్డిలతో కలిసి ఆర్జీవీ అన్‌స్కూల్ పేరుతో ఫిలిం స్కూల్‌ను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. పూర్తి వివరాలు ఈ రోజు వెల్లడించనున్నారు. వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ఆఫీసర్ జూన్ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. కొంత కాలంగా వరుస డిజాస్టర్లతో ఫాం కోల్పోయిన వర్మ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. -
శ్రీదేవి సినిమాలే పాఠ్యాంశాలు..!
అతిలోక సుందరి శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంటి వారు తమ అభిమానాన్ని బహిరంగంగానే ప్రకటించగా ఓ వ్యాపారి తన రెస్టారెంట్ లో శ్రీదేవి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతీష్టించుకున్నాడు. తాజాగా మరో అభిమానాన్ని తన శ్రీదేవిపై తన ప్రేమను చాటుకునేందుకు రెడీ అవుతున్నాడు. చెన్నై కి చెందిన అనీష్ నాయర్ అనే వ్యక్తి శ్రీదేవి పేరుతో ఫిలిం ఇన్సిస్టిట్యూట్ లను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. 2018లో ఒకేసారి చెన్నై హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, బెంగళూరులతో పాటు మరికొన్ని నగరాల్లో ఇన్సిస్టిట్యూట్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇన్సిస్టిట్యూట్ లో పాఠాలుగా కేవలం శ్రీదేవి నటించిన సినిమాల్లోని సన్నివేశాలను మాత్రమే చూపించనున్నారట. అంతేకాదు డబ్బులేని కారణంగా సినిమాల్లోకి రాలేకపోతున్న ఔత్సాహికులకు ఈ ఇన్సిస్టిట్యూట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారట. ఇప్పటికే అనీష్ నాయర్ స్వయంగా శ్రీదేవిని కలిసి ఇన్సిస్టిట్యూట్ కు ఆమె పేరు పెట్టేందుకు అనుమతి కూడా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
సినిమాలకు.. సింగిల్ విండో!
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని - దసరాకు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశం - చిన్న సినిమాలకు ఐదో ఆటకు అనుమతిలో జాప్యం వద్దు.. - బ్లాక్‌ను అరికట్టేందుకు ఆన్లైన్ టికెటింగ్ సాక్షి, హైదరాబాద్: చలనచిత్ర నిర్మాణానికి వివిధ శాఖల నుంచి అనుమతులు ఇచ్చే విధానానికి స్వస్తి పలికి సింగిల్ విండో సిస్టమ్‌ను అమల్లోకి తెస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రక్రియను దసరా పండుగ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చలనచిత్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఉన్నతాధికారులతో చర్చించారు. చలనచిత్ర నిర్మాణాలకు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు నిర్మాతలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారని, కాలయాపన జరుగుతోందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సింగిల్ విండో విధానం ద్వారా ఆన్లైన్లో షూటింగ్‌లకు అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బ్లాక్ టికెటింగ్‌ను నిరోధించేందుకు ఆన్లైన్ టికెట్ విధానాన్ని అన్ని థియేటర్లలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఇప్పటికే జిల్లాల్లోని సంబంధిత అధికారులకు, రాష్ట్రంలోని 437 థియేటర్ల యాజమాన్యాలకు సమాచారం పంపినట్లు వివరించారు. 100 ఎకరాల్లో.. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి అనువైన 100 ఎకరాల స్థలాన్ని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, కోహెడ ప్రాంతాల్లో గుర్తించామని తలసాని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి సంబంధించి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. 200 నుంచి 300 సీట్ల సామర్థ్యమున్న మినీ సాంస్కృతిక కేంద్రాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలన్నారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో థియేటర్లలో ఐదో ఆట ప్రదర్శనకు అనుమతులు మంజూరు చేయడంలో జాప్యాన్ని నివారించాలని సూచించారు. చిన్న బడ్జెట్ చిత్రాల అర్హతను 35 నుంచి 100 స్క్రీన్లకు పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపినందున వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవంబర్ 8 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న బాలల చలనచిత్ర ఉత్సవాల కోసం రూ.8 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. -
రజనీ జీవితకథతో కన్నడ సినిమా
రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరంలేదు. ఈ సూపర్ స్టార్ కారణంగా ఆయన స్నేహితుడు రాజ్ బహదూర్‌కి కూడా ఎంతో కొంత పాపులార్టీ వచ్చింది. రజనీ జీవితంలో అతి కీలకమైన వ్యక్తుల్లో బహూదూర్కి ముఖ్యమైన స్థానమే ఉంటుంది. రజనీ బస్ కండక్టర్‌గా చేసినప్పుడు బహదూర్ ఆ బస్కి డ్రైవర్‌గా చేసేవారు. అప్పుడు తన స్నేహితునిలో నటనాసక్తిని గ్రహించి, ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరడానికి తన వంతు సహాయం చేశారు బహదూర్. అనంతరం రజనీ నటునిగా మారడం, సూపర్ స్టార్‌గా ఎదగడం అందరికీ తెలిసిందే. ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత పాత స్నేహితులను కొంతమంది మర్చిపోతారు. రజనీ మాత్రం అలాంటి వ్యక్తి కాదు. ఇప్పటికీ రాజ్ బహదూర్‌తో తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరి స్నేహం ఆధారంగా కన్నడంలో ‘వన్ వే’ అనే చిత్రం రూపొందుతోంది. తమిళంలో ‘ఒరు వళి శాలై’ అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో స్నేహితుని పాత్రను రాజ్ బహదూరే స్వయంగా పోషిస్తున్నారు. రజనీ పాత్రను ఎవరు చేస్తున్నారనేది రహస్యంగా ఉంచారు. ఈ చిత్రం గురించి రాజ్ బహదూర్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా గురించి రజనీ దగ్గర అనుమతి కోరగానే, వెంటనే పచ్చజెండా ఊపేశారు. ‘మనిద్దరం కలిసి చూద్దాం’ అని కూడా అన్నారు. రజనీకాంత్‌కి ఉన్న ఖ్యాతిని సొమ్ము చేసుకోవడానికి ఈ సినిమా చేయడంలేదు. ఓ మంచి సందేశం ఇస్తున్నాం. మేం రంగస్థలం కళాకారులుగా ఉన్నప్పట్నుంచీ ఇప్పటివరకు మా మధ్య స్నేహం ఎలా ఆరంభమైంది? విడదీయ లేనంత ఆప్తమిత్రులుగా ఎలా మారాం? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. రుషి రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.