దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్‌కు సంబంధించి అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతల సలహాలు-సూచనలు, సహాయ సహకారాలు మరువలేనివని ప్రముఖ దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు అన్నారు. ‘అంకురం’తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉమామహేశ్వరరావు.. ఇటీవల ‘ఇట్లు అమ్మ’తో తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి తెలియజేశాడు. అంతర్జాతీ స్థాయిలో ఈ చిత్రం 76 అవార్డులను దక్కించుకుంది.
ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు‘దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్’ నిర్వహిస్తూ..ఎంతో మంది కళాకారులను టాలీవుడ్‌కు అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ 5 వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. దిగువ మధ్య తరగతివారిలో ఉన్న ప్రతిభావంతుల్ని వెండితెరకు పరిచయం చేయడమే లక్ష్యంగా అత్యున్నత ప్రమాణాలతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు చేసిన సహాయం మరువలేని అన్నారు. తదుపరి చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే అధికారికంగా పూర్తి వివరాలు ప్రకటిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment