హీరోగా మహేశ్‌బాబు తనయుడు.. అమెరికాలో శిక్షణ! | Mahesh Babu Son Gautam Ghattamaneni Taking Acting Coaching In USA, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

హీరోగా మహేశ్‌బాబు తనయుడు.. అమెరికాలో శిక్షణ!

Published Sun, Jul 14 2024 10:46 AM | Last Updated on Sun, Jul 14 2024 1:13 PM

Mahesh Babu Son Gautam Taking Acting Coaching In USA

టాలీవుడ్‌లో ఘట్టమనేని ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ, ఆ తర్వాత మహేశ్‌ బాబు వరుసగా తమ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కృష్ణ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే తన కొడుకును  తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు మహేశ్‌ కూడా తన కొడుకును హీరో చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే దీనికి ఇంకో ఐదారేళ్ల సమయం ఉంది. మహేశ్‌ కొడుకు గౌతమ్‌ ఇప్పుడు ప్లస్‌ టూ పూర్తి చేశాడు. బ్యాచిలర్‌ డిగ్రీ కోసం అమెరికా వెళ్లాడు. అది పూర్తయిన తర్వాత కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని మహేశ్‌ ఆలోచన.

(చదవండి:  గేమ్‌ ఛేంజర్‌ ఆసల్యం.. మనసు మార్చుకున్న రామ్‌ చరణ్‌)

దాని కోసం ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకుంటున్నాడు మహేశ్‌. గౌతమ్‌కి నటనలో శిక్షణ ఇప్పించాలనుకుంటున్నాడట. న్యూయార్క్‌లోని ఓ ప్రముఖ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో గౌతమ్‌ని జాయిన్‌ చేయించబోతున్నట్లు తెలుస్తోంది. బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు యాక్టింగ్‌ కోచింగ్‌ కూడా పూర్తి చేయించాలనుకుంటున్నారట. 

(చదవండి: అంబానీల పెళ్లి.. వాళ్లకు బహుమతిగా కోట్ల రూపాయల వాచీలు)

ఇదంతా జరగాలంటే నాలుగైదేళ్ల సమయం పడుతుంది. ఆలోపు గౌతమ్‌కి పాతికేళ్ల వయసు వస్తుంది. అప్పుడు హీరోగా ఎంట్రీ చేయాలని మహేశ్‌ ప్లాన్‌. ఇక కూతురు సితారకు కూడా సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టం..ఆమెను కూడా ఇండస్ట్రీలోకే తీసుకురావాలనుకుంటున్నారట. అయితే సితార ఎంట్రికి చాలా సమయం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement