Goutam
-
హీరోగా మహేశ్‌బాబు తనయుడు.. అమెరికాలో శిక్షణ!
టాలీవుడ్లో ఘట్టమనేని ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ, ఆ తర్వాత మహేశ్ బాబు వరుసగా తమ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కృష్ణ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే తన కొడుకును తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు మహేశ్ కూడా తన కొడుకును హీరో చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే దీనికి ఇంకో ఐదారేళ్ల సమయం ఉంది. మహేశ్ కొడుకు గౌతమ్ ఇప్పుడు ప్లస్ టూ పూర్తి చేశాడు. బ్యాచిలర్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లాడు. అది పూర్తయిన తర్వాత కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని మహేశ్ ఆలోచన.(చదవండి: గేమ్ ఛేంజర్ ఆసల్యం.. మనసు మార్చుకున్న రామ్ చరణ్)దాని కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు మహేశ్. గౌతమ్‌కి నటనలో శిక్షణ ఇప్పించాలనుకుంటున్నాడట. న్యూయార్క్‌లోని ఓ ప్రముఖ ఫిలిం ఇన్స్టిట్యూట్లో గౌతమ్‌ని జాయిన్ చేయించబోతున్నట్లు తెలుస్తోంది. బ్యాచిలర్ డిగ్రీతో పాటు యాక్టింగ్ కోచింగ్ కూడా పూర్తి చేయించాలనుకుంటున్నారట. (చదవండి: అంబానీల పెళ్లి.. వాళ్లకు బహుమతిగా కోట్ల రూపాయల వాచీలు)ఇదంతా జరగాలంటే నాలుగైదేళ్ల సమయం పడుతుంది. ఆలోపు గౌతమ్‌కి పాతికేళ్ల వయసు వస్తుంది. అప్పుడు హీరోగా ఎంట్రీ చేయాలని మహేశ్ ప్లాన్. ఇక కూతురు సితారకు కూడా సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టం..ఆమెను కూడా ఇండస్ట్రీలోకే తీసుకురావాలనుకుంటున్నారట. అయితే సితార ఎంట్రికి చాలా సమయం ఉంది. -
బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు..
ఈర్ష్య, అసూయ, ద్వేషం – ఈ మూడు దుర్గుణాలు మూర్తీభవించినవాడు చలమ దీప్తుడు. తానే పెద్ద తత్వవేత్తననీ, తనకంటే గొప్ప ప్రబోధకుడు ఎవరూ లేరని, తాను గురువులకే గురువని భ్రమించేవాడు. ఇతరుల్ని ఎవ్వరినీ గౌరవించేవాడు కాదు. అతని శిష్యుడు అహితుడు అన్నింటా గురువుని మించిన శిష్యుడే! రాజగృహ నగరానికి ఉత్తర దిక్కులో ఉన్న ఒక పర్వతంపై అతని నివాసం. తనకంటే బుద్ధునికి ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కలగడం అతనిలో కోపాన్ని పెంచింది. కుటిలత్వాన్ని రేపింది. బుద్ధుణ్ణి ఇబ్బందుల పాలు చేయాలనీ, అపకీర్తి కలిగించాలనీ పథకం వేశాడు. అలా చేస్తే తనకు అధిక గౌరవ మర్యాదలు కలుగుతాయని నమ్మాడు. వెంటనే తన ప్రియ శిష్యుడు అహితుణ్ణి పిలిచి, తన మనస్సులోని పథకాన్ని చెప్పాడు. అహితుడు అందుకు అంగీకరించి, నగరంలోకి నడిచాడు. ఆరోజు ఒక రాజపురోహితుడు బుద్ధునికీ, బుద్ధ సంఘానికీ ఆతిథ్యం ఇచ్చాడు. బుద్ధుడు భిక్ష స్వీకరించాక ధర్మోపదేశంప్రారంభించాడు. ఆ సమయానికి అహితుడు అక్కడికి చేరాడు. ఉపదేశానంతరం బుద్ధునికి నమస్కరించి‘‘భగవాన్! నన్నూ మీ భిక్షుసంఘంలో చేర్చుకోండి’’ అని వేడుకున్నాడు. బుద్ధుడు అంగీకరించాడు. కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు బుద్ధుడు తన భిక్షుసంఘంతో కలసి నగరంలో భిక్షార్థం బయలు దేరాడు. తన భిక్షా పాత్రను తీసుకోవడానికి చేశాడు. అది కనిపించలేదు. ఆరామం బయట ద్వారం దగ్గర నిలబడిన అహితుడు అటూ ఇటూ చూస్తూ–‘‘భగవాన్! మీ భిక్షాపాత్ర కోసం నేను వెదకనా?’’ అని అడిగి ఆరామం నలుమూలలా చూశాడు. బుద్ధుడు అతని వంక చూసి, చిరునవ్వు నవ్వాడు.‘‘అహితా! వెదకనవసరం లేదు. పద’’ అంటూ బయటకు నడచాడు. బుద్ధుని వెనకే అహితుడు నడచాడు. భిక్షు సంఘం రాజగృహ నగరానికి వెళ్ళే దారిలో ఒక తటాకం ఉంది. బుద్ధుడు ఆ తటాకం వైపు నడచాడు. అది చూసి అహితుడు. ‘నేను ఆ భిక్షాపాత్రను, పగులగొట్టి, ఈ తటాకంలో పడవేసిన విషయం బుద్ధునికి తెలిసింది’ అని భయపడ్డాడు. బుద్ధుడు తటాకం లో దిగి విశాలమైన తామరాకుని తుంచి, దాన్ని, శుభ్రపరిచాడు. దాని అంచులు గిన్నెలా మలిచాడు. ఆరోజు బుద్ధుని భిక్షాపాత్ర అది! మరో రెండు రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి బుద్ధుడు పడుకోడానికి తన సంఘాటి (దుప్పటి) కోసం చూశాడు. అది కనిపించలేదు. బుద్ధుడు అలా వెదకడం గమనిస్తూనే, లోలోపల నవ్వుకుంటున్నాడు అహితుడు. అంతలో... ‘‘అహితా!’’ అనే బుద్ధుని పిలుపు విని ఉలిక్కిపడ్డాడు అహితుడు. ‘‘భగవాన్! సెలవియ్యండి’’ అన్నాడు అతివినయం గా ‘‘నీకు సంఘాటి ఉందిగా’’ అని అడిగాడు. ‘‘భగవాన్! ఉంది’’ ‘‘నీవు పక్క పరుచుకొని పడుకో’’ అని, నేలను శుభ్రం చేసుకుని, తన చీవరాన్ని పక్కగా పరచుకుని బుద్ధుడు పడుకున్నాడు. ఆ రాత్రి బుద్ధునితో సహా భిక్షువులందరూ హాయిగా నిద్ర΄ోయారు. అహితునికి కంటిమీద కునుకే రాలేదు. వేకువ కాకముందే లేచి, తన గురువు చలమదీప్తుని దగ్గరకు వెళ్లి చేరాడు. తెల్లారింది. ‘‘అహితుడు ఏమయ్యాడు?’’అని అందరూ ఆలోచించసాగారు. ఇంతలో... ‘‘అదిగో... అటు చూడండి. అహిత భిక్షు ఎవరినో తీసుకుని వస్తున్నాడు అన్నాడు ఒక భిక్షువు. అహితుడు తన గురువును వెంటబెట్టుకుని వచ్చాడు. ఇద్దరూ బుద్ధుని పాదాలకు నమస్కరించారు.‘‘భగవాన్! మీ మీద క్రోధంతో, అసూయ తో వచ్చాను. మీ భిక్షాపాత్ర నేనే పగులగొట్టాను. మీ సంఘాటిని తుప్పల్లో దాచాను. ఆ విషయం మీరు గ్రహించారు. అయినా నన్ను మందలించలేదు. అందరిముందు అవమానం చేయలేదు. ఈ పనులు చేసిన రెండుసార్లూ నేను నిద్రకు దూరమయ్యాను. మనశ్శాంతి కోల్పోయాను. తప్పు తెలుసుకున్నాను. ద్వేషం కంటే ప్రేమ గొప్పదని తెలుసుకున్నాను. వెళ్ళి మా గురువు గారికి విషయం చెప్పాను. మేమిద్దరం తప్పు తెలుసుకున్నాం. మీ శరణు వేడుకుంటున్నాం’’ అన్నాడు అహితుడు. బుద్ధుడు ప్రేమతో వారిని దగ్గరకు పిలిచి భిక్షు దీక్ష ఇచ్చాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: స్నాతక పాఠం అంటే..? -
వివాహేతర సంబంధమే కారణం! చివరికి..
తూర్పుగోదావరి: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జొన్నకూటి గౌతంనాయుడును వీసీ ఆచార్య కె.పద్మరాజు సస్పెండ్ చేశారు. యూనివర్సిటీలోనే పనిచేస్తున్న ఒక మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై అతనిని అరెస్టు చేసి, రిమాండ్‌కి పంపించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో రెగ్యులర్ ఉద్యోగి అయిన అతనిని బుధవారం సస్పెండ్ చేశారు. సైన్స్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గౌతంనాయుడు ఏడాది క్రితం వరకు ఎగ్జామ్స్ విభాగంలో పనిచేసేవాడు. యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే స్వీపర్స్ ఉదయాన్నే 8 గంటలకు వచ్చి, గదులను తుడుస్తుంటారు. ఆ విధంగా విధులు నిర్వర్తిస్తున్న ఒక వివాహిత అయిన స్వీపర్‌పై కన్నేసిన గౌతంనాయుడు ఒకరోజు ఉదయం 8 గంటలకే చేరుకున్నాడు. ఆమె లోనికి వచ్చి గదిని తుడుస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చి తలుపులు వేసి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాను రెగ్యులర్ ఉద్యోగినని, అరచినా, ఎవరికైనా చెప్పినా నీ ఉద్యోగమే పోతుందని బెదిరించాడు. ఆ బెదిరింపులకు తలొంచిన ఆమెతో ఏడాది కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న ఆరోగ్యం బాగోలేదని ఆమె విధులకు రాలేదు. దీంతో లాలాచెరువులో ఉండే ఆమె ఇంటికే నేరుగా వెళ్లి, తన ఆరోగ్యం బాగోలేదని వారిస్తున్నా వినకుండా మరోసారి ఆమైపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన సంఘటనలపై ఆమె తన భర్త సహకారంతో నవంబర్ 27న రాజానగరం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. రాజానగరం పోలీసులు ఈ కేసును రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్‌కు బదలాయించారు. పరారీలో ఉన్న నిందితుడిని ఈనెల 17న తాడేపల్లిగూడెంలో అరెస్టు చేసి, రిమాండ్‌కి పంపించారు. దీంతో అతనిని సస్పెండ్ చేశారు. కాగా ఈ విషయమై వీసీ ఆచార్య కె. పద్మరాజును వివరణ కోరగా సస్పెండ్ చేసిన మాట వాస్తవమేనన్నారు. ఇవి చదవండి: కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు -
గౌతమ్ సింఘానియా, నవాజ్ విడాకుల వ్యవహారంలో ఊహించని పరిణామం!
దిగ్గజ పారిశ్రామికవేత్త, రేమండ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విడాకుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా నెల రోజుల క్రితం గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ సింఘానియాల 32 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. ఇక నుంచి తాము వేర్వేరు దారుల్లో ప్రయణిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన తర్వాత ఇచ్చిన వరుస ఇంటర్వ్యూల్లో గౌతమ్ సింఘానియా నుంచి ఎదురైన వేధింపులు, జరిపిన దాడుల గురించి సంచలన విషయాల్ని బయట పెడ్తూ వచ్చారు. విడాకులు వ్యవహారం సాఫీగా జరిగేలా గౌతమ్ సింఘానియాకు చెందిన రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటాను కుమార్తెలు నిహారిక, నిషాతో పాటు తన కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని సైతం నవాజ్ మోదీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో’ దీనిపై స్పందించిన గౌతమ్ సింఘానియా ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో’ అని అన్నారన్న విషయాన్ని లేవనెత్తారు. ఈ వ్యవహారం ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేశాయి. కంపెనీ షేర్లు కుప్పకూలిపోవడంతో పాటు ఇన్వెస్టర్లలలో కంపెనీపై నమ్మకం సన్నగిల్లింది. ఈ తరుణంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లోని ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు సలహాలు ఇచ్చే ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఎల్ఐఏఎస్ రంగంలోకి దిగింది. సీఎండీ గౌతమ్ సింఘానియాపై వచ్చిన దాడి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించాలని రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లను కోరింది. గౌతమ్ సింఘానియా ఒప్పుకున్నారా? ఈ వరుస పరిణామాల నేపథ్యంలో విడుదల గౌతమ్ సింఘానియా - నవాజ్ మోదీ సింఘానియాల విడుకులపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గౌతమ్ సింఘానియా నుంచి నవాజ్ మోదీ సింఘానియా ఆశిస్తున్న 75 శాతం కాకుండా.. చట్టపరంగా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేందుకు గౌతమ్ ఒప్పుకున్నారని, ఆమొత్తాన్ని తీసుకునేందుకు నవాజ్ మోదీ అంగీకరించారని నివేదికలు హైలెట్ చేశాయి. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయని చెప్పాయి. బెర్జిస్ దేశాయ్ నియామకం దీనిపై రేమాండ్ బోర్డు స్పందించింది. గౌతమ్ సింఘానియా, అతని భార్య నవాజ్ మోదీ సింఘానికి మధ్య కొనసాగుతున్న వివాదానికి సంబంధించి బోర్డుకు సలహా ఇవ్వడానికి సీనియర్ స్వతంత్ర న్యాయవాది బెర్జిస్ దేశాయ్‌ను నియమించినట్లు తెలిపింది. ఈ విషయం తమ పరిధికి వెలుపల ఉందని బోర్డు స్పష్టం చేసింది. అయితే పరిణామాలను పర్యవేక్షించడంలో, బోర్డుకి సమాచారం ఇవ్వడంలో దేశాయ్ పాత్ర ఉందని రేమాండ్ బోర్డు అంగీకరించింది. లాభాల్లో రేమాండ్ షేర్లు కాగా రేమాండ్ యాజమాన్యం వ్యక్తిగత వివాదం కారణంగా ఆ కంపెనీ స్టాక్స్ క్షీణిస్తూ వచ్చాయి. అయితే గత వారం చివరి ట్రేడింగ్ రోజున కంపెనీ షేర్లు 4 శాతానికి పైగా పెరిగి రూ.1,563 వద్ద ముగిసింది. తాజా నివేదికలతో ఈరోజు స్టాక్ మార్కెట్లో రేమాండ్ షేర్లు 1.4శాతం పెరిగాయి. ఒక్కో షేర్ విలువ రూ.1,578.80కి చేరాయి. -
‘కన్న కూతుర్ని కొట్టడానికి ఆయనకు చేతులెలా వచ్చాయో’, అంబానీలే లేకపోతే
రేమండ్ ఛైర్మన్, ఎండీ గౌతమ్ సింఘానియాపై ఆయన భార్య నవాజ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త గౌతమ్ సింఘానియా నుంచి విడిపోవడానికి దారితీసిన పరిస్థితులు, కుమార్తె నిహారికపై గౌతమ్ శారీరక దాడి, తమని రక్షించేందుకు అంబానీ సాయం చేసిన అంబానీ సోదరుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘సెప్టెంబర్ 10 న ముంబైలోని తన ఇంట్లో గౌతమ్ సింఘానియా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకల తర్వాత సింఘానియా దాదాపూ 15 నిమిషాల పాటు కూతురు, భార్య కనికరం లేకుండా నాపై , నా కుమార్తె నిహారికను కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. మారణాయుధాలు తీసుకుని వస్తాడని అనుకున్నాను. వెంటనే నా కూతుర్ని రక్షించుకునేందుకు ఇంట్లోని ఓ రూంలో దాచిపెట్టాను. రక్షించమని పోలీసులకు ఫోన్ చేశా. నా స్నేహితురాలు అనన్య గోయెంకాను ఫోన్ చేసి పరిస్థితి వివరించా. ఆమె వచ్చి పోలీసులు రావడం లేదని నిర్ధారించింది. గౌతమ్ సింఘానియా పోలీసులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది. ఏం చేయాలో పాలు పోక ఆ సమయంలోనే నీతా అంబానీ, అనంత్ అంబానీలకు ఫోన్ చేశా. అంబానీ కుటుంబం రంగంలోకి దిగింది. పోలీసులు చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేశారు. వాళ్లు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో ’’ అంటూ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నవాజ్ మోడీ ఆరోపణలపై ఆమె భర్త గౌతమ్ సింఘానియా స్పందించారు. ‘నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ ఇద్దరు కుమార్తెల కోసం ఎటువంటి ప్రకటనలు చేయకూడదని, గోప్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు. గౌతమ్ సింఘానియా, నవాజ్‌మోడీ సింఘానియా విడాకులు 58 ఏళ్ల గౌతమ్ సింఘానియా 1999లో న్యాయవాది నాడార్ మోడీ కుమార్తె నవాజ్ మోడీని వివాహం చేసుకున్నారు. ఈ నవంబర్ 13న సింఘానియా తమ 24 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకున్నట్లు వెల్లడించారు. అయితే విడాకుల విషయంలో నవాజ్ మోడీ ఓ షరతు విధించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు కుమార్తెలు నిహారిక, నిషా, తన కోసం నవాజ్ మోడీ సింఘానియా భర్తకు గౌతమ్ సింఘానియాకు చెందిన మొత్తం రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్‌ని ఏర్పాటు చేసేలా గౌతమ్ సైతం భార్య నవాజ్ మోడీ అడిగిన మొత్తం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఈ మెుత్తాన్ని బదిలీ చేసేందుకు కుటుంబ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే గౌతమ్ సింఘానియా తన మరణానంతరం తర్వాత భార్య నవాజ్‌కు ఆమోదయోగ్యం కాని ఆస్తిని తన కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుమతించాలని కోరినట్లు కూడా నివేదిక హైలెట్ చేసింది. -
TS Election 2023: ‘సీ–విజిల్’ యాప్ ఫిర్యాదుతో.. ఇకపై ప్రలోభాలకు చెక్!
ఖమ్మం: శాసనసభ ఎన్నికల నేపథ్యాన ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు యత్నించే అవకాశముంది. ఈ నేపథ్యాన వీరికి చెక్ పెట్టేందుకు, ఓటర్లు ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం సీ–విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫొటోలు, వీడియోల ఆధారంగా నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. డౌన్లోడ్ ఇలా.. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారెవరైనా ప్లే స్టోర్ నుంచి సీ–విజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. అనంతరం ఫొటో, వీడియో, ఆడియో మూడు రకాల ఆప్షన్లు వస్తాయి. లైవ్ లొకేషన్ ఆన్ చేసి అక్కడి పరిస్థితుల ఆధారంగా ఆప్షన్ ఎంపిక చేసుకుని ప్రొసీడ్ కొడితే నేరుగా సంబంధిత అధికారులకు విషయం చేరిపోతుంది. వంద నిమిషాల్లోనే.. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా మద్యం, డబ్బు, ఇతర సామగ్రి పంపిణీ చేస్తున్నట్లయితే సీ–విజిల్ యాప్ ద్వారా ఫొటో, వీడియో ఆధారంగా ఫిర్యాదు చేయొచ్చు. ఈ వివరాలు అధికారులకు చేరిన 100నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాక బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారనే అంశాన్ని కూడా ఫిర్యాదుదారులకు చేరవేస్తారు. అంతేకాక ఫిర్యాదు చేసిన వారి వివరాలను బయటకు వెల్లడించబోమని అధికార యంత్రాంగం చెబుతోంది. కాగా, సీ విజిల్ యాప్‌ను ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకునేలా, ప్రలోభాలపై ఫిర్యాదు చేసేలా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వీ.పీ.గౌతమ్ వెల్లడించారు. -
మా నాన్న మాకు మంచి ఫ్రెండ్
‘‘డాడీ ఈజ్ బెస్ట్. మమ్మల్ని బాగా ఆడిస్తారు. స్ట్రిక్ట్‌గా ఉండరు’’ అంటున్నారు గౌతమ్, సితార. తండ్రి మహేశ్‌బాబు గురించి అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా చెప్పారు. ► సినిమాలతో బిజీగా ఉండే మీ నాన్నగారు ఇప్పుడు కంటిన్యూస్‌గా ఇంట్లో ఉండటం ఎలా ఉంది? గౌతమ్, సితార: మాకిది క్వాలిటీ టైమ్. మూడు నెలలుగా నాన్న ఇంట్లోనే ఉంటున్నారు. మా సమ్మర్ మొత్తం నాన్నతో ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేయడం హ్యాపీగా ఉంది. ► మీ నాన్నతో చాలా ఆటలు ఆడుకుంటున్నారట? స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతున్నాం. నిచ్చెన ఎక్కినప్పుడు భలేగా ఉంటుంది. వీడియో గేమ్స్ కూడా ఆడతాం. పీఎస్ 4 గేమ్స్, ఆన్లైన్ టెన్నిస్, బేస్ బాల్.. ఇలా చాలా చాలా ఆడుకుంటున్నాం. నాన్న మాతో ఫ్రెండ్‌లా ఆడుకుంటారు. ► ఫుడ్ సంగతి? మీ నాన్నకు వంట వచ్చా? క్లీన్ అండ్ హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలని అమ్మ అంటుంది. వీకెండ్స్‌లో మాత్రమే పిజ్జా, బర్గర్స్ తింటాం. వెజిటెబుల్, ఫ్రూట్స్.. ఇలా అన్నీ అమ్మ ప్లాన్ చేసినట్లుగానే తింటాం. అమ్మ వంట చేయదు. నాన్న కూడా చేయరు. అయితే మాకు అప్పటికప్పుడు కావాలంటే ఇద్దరూ న్యూడిల్స్ చేసి పెడతారు. ► ఈ లాక్డౌన్లో మీ నాన్నతో కలిసి ఏమేం సినిమాలు చూశారు? తెలుగుతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా చూశాం. ‘ఫ్రోజెన్ 2’, ‘ఓక్జా’, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ చూశాం. ఇంకా చాలా టీవీ షోస్ కూడా చూస్తున్నాం. ► ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా? మీ నాన్న దగ్గరుండి గమనిస్తారా? ఈ మధ్యే స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు రోజులో ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఆడుకునేవాళ్లం. ఇప్పుడు క్లాసులు అయిపోగానే ఆటలే. అయితే క్లాస్ జరుగుతున్నప్పుడు మాత్రం నాన్న మమ్మల్ని డిస్ట్రబ్ చేయరు. బాగా చదువుకోమంటారు. కానీ ఒత్తిడి చేయరు. ► సితారా.. నువ్వు మీ నాన్నకు హెడ్ మసాజ్ చేశావ్ కదా.. ఏమన్నారు? (నవ్వుతూ)... నచ్చిందన్నారు. తన మసాజ్ థెరపిస్ట్ కన్నా బాగా చేశానట. అమ్మతో చెప్పి నవ్వారు. ► టీనేజ్‌లో ఉన్నట్లున్నావ్ అని మీ అత్త మంజుల (మహేశ్ సోదరి) ఇటీవల సోషల్ మీడియాలో మీ నాన్న మేకోవర్ ఫొటో చూసి అన్నారు. మీ నాన్న ఇంకా హ్యాండ్సమ్గా తయారవడానికి కారణం? ఊ... లాక్డౌన్ ఉన్నప్పుడూ లేనప్పుడూ మా నాన్న మాకు ఒకేలానే ఉన్నారు. ఆయనెప్పుడూ హ్యాండ్సమ్మే. ► సరే.. ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ప్రతి ఫాదర్స్ డేకి నాన్నకు స్పెషల్‌గా కార్డ్ తయారు చేసి ఇస్తాం. నాన్న చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. ఈసారి కూడా కార్డ్ తయారు చేశాం. నాన్నకు మేం ఏం చేసినా నచ్చుతుంది. చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు. ‘అవర్ డాడీ ఈజ్ బెస్ట్’. తండ్రికి మసాజ్ చేస్తున్న సితార మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌కి 14 ఏళ్లు. కొడుకు ఎంత ఎత్తు ఎదిగాడో ఈ లాక్డౌన్లో మహేశ్ చెక్ చేస్తున్న ఫొటో ఇది. -
ద్వితీయ విఘ్నం దాటారండోయ్
ఇండస్ట్రీలో ఒక గమ్మల్తైన గండం ఉంది. ఫస్ట్ సినిమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినా కూడా రెండో సినిమాకు తడబడుతుంటారు దర్శకులు. సినిమా భాషలో దీనికి ‘సెకండ్ మూవీ సిండ్రోమ్’ అనే పేరు కూడా పెట్టారు. ఇండస్ట్రీలో ఇది తరచూ కనిపించేదే. దర్శకులు మొదటి సినిమాతో ఎంతలా మెప్పించినా, రెండో సినిమాతో నిరాశపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరు దర్శకులు మాత్రం సెకండ్ హిట్ కూడా ఇచ్చేస్తారు. అలా తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన కొందరు దర్శకులు ఈ ఏడాది తమ రెండో సినిమాతో వచ్చారు. కానీ ముగ్గురు దర్శకులు మాత్రం ద్వితీయ విఘ్నాన్ని విజయవంతంగా దాటేశారు. ఈ ‘సెకండ్ మూవీ సిండ్రోమ్’ను సక్సెస్‌ఫుల్‌గా దాటేసిన సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ స్టోరీ. శివ మజిలీ ‘నిన్ను కోరి’ (2017) సినిమాతో ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు శివ నిర్వాణ. ప్రేమలో ఓడిపోయినా జీవితాన్ని ముందుకు సాగించొచ్చు అని ‘నిన్ను కోరి’లో చెప్పారు. ఈ చిత్రంలో నాని, నివేదా థామస్, ఆది ముఖ్య పాత్రల్లో నటించారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లే, టేకింగ్, పాటలు, ఫెర్ఫార్మెన్స్‌లతో ఈ సినిమా సక్సెస్ కొట్టింది. రెండో సినిమాగా టాలీవుడ్ యంగ్ కపుల్ నాగచైతన్య, సమంతలతో ‘మజిలీ’ తీశారు శివ నిర్వాణ. వివాహం తర్వాత చైతన్య, సమంత స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమిదే. మనం కోరుకున్నవాళ్లు మనకు కొన్నిసార్లు దక్కకపోవచ్చు. మనల్ని కోరుకునేవాళ్లూ మనకోసం ఉండే ఉంటారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు శివ. ఎమోషనల్ మీటర్ కరెక్ట్‌గా వర్కౌట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం నాగచైతన్య, సమంత గుర్తుంచుకునే చిత్రం అయింది. ప్రస్తుతం తన తొలి హీరో నానీతో ‘టక్ జగదీష్’ చేస్తున్నారు శివ. మళ్ళీ హిట్ మొదటి చిత్రానికి ప్రేమకథను ఎన్నుకున్నారు గౌతమ్ తిన్ననూరి. కథను చెప్పడంలో, కథను ఎంగేజ్ చేయడంలో తనదైన శైలిలో ‘మళ్ళీ రావా’ని తెరకెక్కించారు. ఇందులో సుమంత్, ఆకాంక్షా సింగ్ జంటగా నటించారు. మన ఫస్ట్ లవ్ మళ్లీ మన జీవితంలోకి ప్రవేశిస్తే? ఆమెను వదులుకోకూడదనుకునే ఓ ప్రేమికుడి ప్రయాణమే ఈ సినిమా. ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. రెండో సినిమాగా నానీతో ‘జెర్సీ’ని తెరకెక్కించారు గౌతమ్. వందమందిలో గెలిచేది ఒక్కడే. ఆ ఒక్కడి గురించి అందరూ చర్చించుకుంటారు. మిగతా 99 మందికి సంబంధించిన కథే ‘జెర్సీ’. 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెటర్‌గా టీమ్‌లో సెలక్ట్ కావాలనుకున్న ఓ ప్లేయర్ కల నెరవేరిందా లేదా అనేది కథ. నాని కెరీర్లో మైలురాయిగా ఈ సినిమా ఉండిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. నో కన్ఫ్యూజన్ ‘దర్శకుడిగా వివేక్ ఆత్రేయకు ‘మెంటల్ మదిలో’ తొలి సినిమా. శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్ జంటగా నటించారు. ఏ సందర్భంలో అయినా ఏదైనా ఎంపిక చేసుకోవాలంటే కన్ఫ్యూజ్ అయ్యే మనస్తత్వం హీరోది. అలాంటి అతను లైఫ్ పార్ట్నర్ని ఎలా ఎంచుకున్నాడన్నది కథ. హీరో కన్ఫ్యూజ్డ్ అయినప్పటికీ ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకుండా బావుందనేశారు. దాదాపు అదే టీమ్‌తో ‘బ్రోచేవారెవరురా’ తెరకెక్కించారు వివేక్. క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా వినోదం పంచింది. లైంగిక వేధింపులు అనే సున్నితమైన సబ్జెక్ట్‌ను ఈ చిత్రంలో అతి సున్నితంగా చర్చించారు వివేక్. ప్రస్తుతం మూడో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులూ ద్వితీయ విఘ్నాన్ని దాటేశారు. ప్రస్తుతం మూడో సినిమా పనిలో ఉన్నారు. మూడో హిట్‌ని కూడా ఇస్తే ‘హ్యాట్రిక్ డైరెక్టర్స్’ అనిపించుకుంటారు. – గౌతమ్ మల్లాది -
నేను సైతం...
-
సినిమా రివ్యూ: బసంతి
2004లో పల్లకిలో పెళ్లి కూతురు చిత్రం ద్వారా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన గౌతమ్, 'బాణం' చిత్రంతో విమర్శకుల్ని ఆకట్టుకున్న చైతన్య దంతులూరి కలయికలో 'బసంతి' చిత్రం రూపొందింది. 'బసంతి' చిత్ర విడుదలకు ముందే అగ్రహీరోల ప్రమోషన్ తో అదరగొట్టడం, మణిశర్మ సంగీతం 'బసంతి' మీద ఆశలు పెంచుకోవడానికి కారణమయ్యాయి. గౌతమ్ కి ఈ చిత్రం మూడవది. అయితే చైతన్య దంతులూరికి ఈ చిత్రం ద్వితీయ విఘ్నంగా మారిన నేపథ్యంలో 'బసంతి' ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అర్జున్(గౌతమ్) జీవితం మీద ఎలాంటి క్లారిటీ లేకుండా మిత్రులతో సరదాగా కాలం గడిపే బసంతి కాలేజ్ స్టూడెంట్. తన మిత్రుడి చెల్లెలు వివాహంలో నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కూతురు రోష్ని(అలీషా బేగ్)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. రోష్నిని గౌతమ్ అనుకోకుండా ఓ సంఘటనతో కలుస్తాడు. తర్వాత వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో జరిగే జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనే విదేశీ ప్రతినిధులను చంపేందుకు ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర పన్నుతారు. ఆ కుట్రను పోలీసులు భగ్నం చేసి దాడులకు దిగుతారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉగ్రవాదులు బసంతి కాలేజిలోకి వెళ్లి, కాలేజి విద్యార్థులను బందీలుగా పట్టుకుంటారు. ఆ బందీలలో కమిషనర్ కూతురు కూడా ఉంటుంది. రోష్ని ఉగ్రవాదుల చెరలో ఎలా చిక్కుకుంది? ఉగ్రవాదుల చెర నుంచి రోష్నిని గౌతమ్ ఎలా రక్షించుకున్నాడు? అందుకు ఉగ్రవాదులు విధించిన కండీషన్స్ ఏంటీ? చివరకు అర్జున్, రోష్నీల కథ సుఖాంతమైందా? ఇలా కథలో భాగంగా వచ్చే పలు ప్రశ్నలకు సమాధానమే 'బసంతి' చిత్రం. అర్జున్ గా గౌతమ్ ఓ అసాధారణ కార్యక్రమాన్ని భుజాన వేసుకున్న ఓ సాధారణ కుర్రాడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. కానీ అర్జున్ పాత్ర తనకు మించిన భారమే అనే ఫీలింగ్ ను కలిగించాడు. అన్ని ఎమోషన్స్ కు ఒకే ఫీలింగ్ పలికించాడనే విమర్శ ప్రధానంగా వినిపించింది. బ్రహ్మనందం ఇమేజ్ తో తెలుగు తెరకు పరిచయమైన గౌతమ్ కు 'బసంతి' మూడవ చిత్రం. తన మూడవ చిత్రం ద్వారా సామర్ధ్యానికి మించి సాహసం చేశాడమో అనే ఫీలింగ్ కలిగించింది. తెలుగు తెరపై నటుడిగా, స్టార్ గా క్రెడిట్ ను సంపాదించుకోవాలంటే గౌతమ్ చాలా కష్టపడాల్సిందేన్న విషయం ఒకటి అర్ధమైంది. మంచి ఫెర్మార్మెన్స్ కు చాన్స్ ఉన్న రోష్ని పాత్ర అలీషా బేగ్ కు లభించింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో అలీషా విఫలమైంది. గౌతమ్ తండ్రిగా తనికెళ్ల భరణి, రోష్నికి తండ్రిగా షియాజే షిండేలు తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. గౌతమ్ స్నేహితుడి గా రణధీర్, ధన్ రాజ్ లు, మిగతా పాత్రలలో కనిపించిన వారు ఓకే అనిపించారు. 'బాణం' తర్వాత సత్తా ఉన్న యువ దర్శకుడిగా చైతన్య దంతులూరిపై అన్నివర్గాల్లోనూ ఓ అభిప్రాయం నెలకొంది. దాంతో రెండో చిత్రం బసంతిని స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారనే వార్తతో అంచనాలు రెండింతలు పెరిగాయి. అయితే బసంతితో చైతన్య ఓ రకంగా ప్రేక్షకులకు అసంతృప్తి, నిరాశను పంచారనే చెప్పవచ్చు. కథ ఎంపిక ప్రధాన లోపమని ఎక్కువ మంది వెల్లడించిన అభిప్రాయం. రక్తి కట్టించే విధంగా కథనం లేకపోవడం మరో మైనస్ పాయింట్. ఉగ్రవాదం, ప్రేమ అనే యాంగిల్ లో వచ్చే చిత్రాలపై భారీ అంచనాలు ఉంటాయన్న సంగతికి దర్శకుడికి తెలిసే ఉంటుంది. వాటికి ధీటుగా 'బసంతి'ని మలచకపోవడంతో ఆకట్టుకోలేకపోయిందనే టాక్ తొలి ఆటకే నెలకొంది. సినిమా ద్వితీయార్ధం ఆ మధ్యలో వచ్చిన 'గగనం' చిత్రం మాదిరిగా ఉండటం ఆలరించలేకోయిందనే చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో ప్రధానంగా ఆకట్టుకున్న కొన్ని అంశాల గురించి ప్రస్తావించుకుందాం. చక్కని డైలాగ్స్, ఆకట్టుకునే ఫొటోగ్రఫీ, పేలవమైన కథ, కథనాన్ని మరుగున పరిచే విధంగా చిత్రానికి కొంత ఊపిరి పోసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటి అంశాలు బసంతి చిత్రానికి ఎస్సెట్ గా నిలిచాయి. పాజిటివ్ పాయింట్స్ కంటే నెగిటివ్ పాయింట్సే ఎక్కువగా కనిపించే ఈ చిత్రం ఓ మోస్తరు విజయం సాధించినా.. చైతన్య దంతులూరి ద్వితీయ విఘ్నాన్ని అధిగమించినట్టే అని భావించవచ్చు. -రాజబాబు అనుముల