మా నాన్న మాకు మంచి ఫ్రెండ్‌ | My dad is my best friend says Gautam and Sitara | Sakshi
Sakshi News home page

మా నాన్న మాకు మంచి ఫ్రెండ్‌

Published Sun, Jun 21 2020 12:02 AM | Last Updated on Sun, Jun 21 2020 5:01 AM

My dad is my best friend says Gautam and Sitara - Sakshi

లాక్‌డౌన్‌లో కొత్త మేకోవర్‌తో పిల్లలతో సెల్ఫీ దిగిన మహేశ్‌బాబు

‘‘డాడీ ఈజ్‌ బెస్ట్‌. మమ్మల్ని బాగా ఆడిస్తారు. స్ట్రిక్ట్‌గా ఉండరు’’ అంటున్నారు గౌతమ్, సితార. తండ్రి మహేశ్‌బాబు గురించి అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా చెప్పారు.

► సినిమాలతో బిజీగా ఉండే మీ నాన్నగారు ఇప్పుడు కంటిన్యూస్‌గా ఇంట్లో ఉండటం ఎలా ఉంది?
గౌతమ్, సితార: మాకిది క్వాలిటీ టైమ్‌. మూడు నెలలుగా నాన్న ఇంట్లోనే ఉంటున్నారు. మా సమ్మర్‌ మొత్తం నాన్నతో ఫుల్‌గా టైమ్‌ స్పెండ్‌ చేయడం హ్యాపీగా ఉంది.

► మీ నాన్నతో చాలా ఆటలు ఆడుకుంటున్నారట?
స్నేక్‌ అండ్‌ ల్యాడర్‌ ఆడుతున్నాం. నిచ్చెన ఎక్కినప్పుడు భలేగా ఉంటుంది. వీడియో గేమ్స్‌ కూడా ఆడతాం. పీఎస్‌ 4 గేమ్స్, ఆన్‌లైన్‌ టెన్నిస్, బేస్‌ బాల్‌.. ఇలా చాలా చాలా ఆడుకుంటున్నాం. నాన్న మాతో ఫ్రెండ్‌లా ఆడుకుంటారు.

► ఫుడ్‌ సంగతి? మీ నాన్నకు వంట వచ్చా?
క్లీన్‌ అండ్‌ హెల్దీ ఫుడ్‌ మాత్రమే తినాలని అమ్మ అంటుంది. వీకెండ్స్‌లో మాత్రమే పిజ్జా, బర్గర్స్‌ తింటాం. వెజిటెబుల్, ఫ్రూట్స్‌.. ఇలా అన్నీ అమ్మ ప్లాన్‌ చేసినట్లుగానే తింటాం. అమ్మ వంట చేయదు. నాన్న కూడా చేయరు. అయితే మాకు అప్పటికప్పుడు కావాలంటే ఇద్దరూ న్యూడిల్స్‌ చేసి పెడతారు.

► ఈ లాక్‌డౌన్‌లో మీ నాన్నతో కలిసి ఏమేం సినిమాలు చూశారు?
తెలుగుతో పాటు హాలీవుడ్‌ సినిమాలు కూడా చూశాం. ‘ఫ్రోజెన్‌ 2’, ‘ఓక్జా’, రైడర్స్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ ఆర్క్‌’ చూశాం. ఇంకా చాలా టీవీ షోస్‌ కూడా చూస్తున్నాం.

► ఆన్‌లైన్‌ క్లాసులు స్టార్ట్‌ అయ్యాయి కదా? మీ నాన్న దగ్గరుండి గమనిస్తారా?
ఈ మధ్యే స్టార్ట్‌ అయ్యాయి. ఇంతకుముందు రోజులో ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఆడుకునేవాళ్లం. ఇప్పుడు క్లాసులు అయిపోగానే ఆటలే. అయితే క్లాస్‌ జరుగుతున్నప్పుడు మాత్రం నాన్న మమ్మల్ని డిస్ట్రబ్‌ చేయరు. బాగా చదువుకోమంటారు. కానీ ఒత్తిడి చేయరు.  

► సితారా.. నువ్వు మీ నాన్నకు హెడ్‌ మసాజ్‌ చేశావ్‌ కదా.. ఏమన్నారు?
(నవ్వుతూ)... నచ్చిందన్నారు. తన మసాజ్‌ థెరపిస్ట్‌ కన్నా బాగా చేశానట. అమ్మతో చెప్పి నవ్వారు.

► టీనేజ్‌లో ఉన్నట్లున్నావ్‌ అని మీ అత్త మంజుల (మహేశ్‌ సోదరి) ఇటీవల సోషల్‌ మీడియాలో మీ నాన్న మేకోవర్‌ ఫొటో చూసి అన్నారు. మీ నాన్న ఇంకా హ్యాండ్‌సమ్‌గా తయారవడానికి కారణం?
ఊ... లాక్‌డౌన్‌ ఉన్నప్పుడూ లేనప్పుడూ మా నాన్న మాకు ఒకేలానే ఉన్నారు. ఆయనెప్పుడూ హ్యాండ్‌సమ్మే.

► సరే.. ఫాదర్స్‌ డే సందర్భంగా మీ నాన్నకు ఏం గిఫ్ట్‌ ఇవ్వబోతున్నారు?
ప్రతి ఫాదర్స్‌ డేకి నాన్నకు స్పెషల్‌గా కార్డ్‌ తయారు చేసి ఇస్తాం. నాన్న చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. ఈసారి కూడా కార్డ్‌ తయారు చేశాం. నాన్నకు మేం ఏం చేసినా నచ్చుతుంది. చాలా బాగుందని కాంప్లిమెంట్‌ ఇస్తారు. ‘అవర్‌ డాడీ ఈజ్‌ బెస్ట్‌’.

తండ్రికి మసాజ్‌ చేస్తున్న సితార


మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌కి 14 ఏళ్లు. కొడుకు ఎంత ఎత్తు ఎదిగాడో ఈ లాక్‌డౌన్‌లో మహేశ్‌ చెక్‌ చేస్తున్న ఫొటో ఇది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement