సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘ఆర్జీవీ అన్ స్కూల్’ పేరుతో ఫిలిం స్కూల్ ప్రారంభించారు. న్యూయార్క్‌కు చెందిన డాక్టర్ రామ్ స్వరూప్, డాక్టర్ శ్వేతా రెడ్డిలతో కలిసి ఈ ఫిలిం స్కూల్‌ను ప్రారంభిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వర్మ తనను తాను వెండితెర ఉగ్రవాదిగా ప్రకటించుకున్నారు.
‘అన్‌స్కూల్ ద్వారా సినిమాకు సంబంధించి ఓనమాలు కూడా తెలియని వారికి శిక్షణ ఇస్తాం. యువతీ యువకుల అభిరుచిని బట్టి వివిధ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాం. సినీరంగానికి సంబంధించి దాదాపు అన్ని విభాగాల్లోనూ శిక్షణ ఇస్తాం. మా స్కూళ్లో చేరాలంటే 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంద’న్నారు వర్మ. నా లాంటి ఉగ్రవాదులను తయారు చేసి పరిశ్రమలోకి వదలడమే నా లక్ష్యం అన్నారు ఆర్జీవీ.
Comments
Please login to add a commentAdd a comment