ఆఫీసర్‌ ప్రీ రిలీజ్‌ వేడుకకు స్టార్‌ డైరెక్టర్‌ | Sukumar To Be The Chief Guest For Officer Pre Release Event | Sakshi
Sakshi News home page

Published Sat, May 26 2018 11:58 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Sukumar To Be The Chief Guest For Officer Pre Release Event - Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆఫీసర్‌. చాలా కాలం తరువాత కింగ్‌ నాగార్జున, వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  సినిమా కావటంతో ఆఫీసర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా వర్మ కూడా జాగ్రత్త సినిమా చేశానని చెపుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్‌ ఈ నెల 28న ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించనుంది. ఈ వేడుకకు రంగస్థలం సినిమాతో సూపర్‌ హిట్ కొట్టిన స్టార్‌ డైరెక్టర్ సుకుమార్‌ ముఖ్య అతిథి కానున్నారు. కర్ణాటకు చెందిన ఐపీఎస్‌ అధికారి కేఎం ప్రసన్న జీవితం ఆధారంగా హీరో పాత్రను తీర్చి దిద్దిన ఈ సినిమాలో నాగార్జున పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement