త్వరలో హాలీవుడ్‌ సినిమాకు సంగీతం | Officer Music Director Ravi Shankar Compose To HollyWood Movie | Sakshi
Sakshi News home page

త్వరలో హాలీవుడ్‌ సినిమాకు సంగీతం

Published Mon, Jun 4 2018 11:29 AM | Last Updated on Mon, Jun 4 2018 12:33 PM

Officer Music Director Ravi Shankar Compose To HollyWood Movie - Sakshi

సంగీత దర్శకుడు సదరం రవిశంకర్‌

విశాఖ సిటీ, అనకాపల్లి టౌన్‌: హాలీవుడ్‌ సినిమాల్లో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తనకు అవకాశం వచ్చిందని సినీ సంగీత దర్శకుడు సదరం రవిశంకర్‌ చెప్పారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునగపాక మండలం చూచుకొండ గణపర్తిలో జన్మించానని, అనకాపల్లి ఏఎంఏఎల్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశానని తెలిపారు.

చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఇష్టమని, చాలా ప్రదర్శనలు ఇచ్చానన్నారు. గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద తన ప్రోగ్రాం చూసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మద్రాస్‌లోని జి.ఆనంద్‌ అనే సంగీత దర్శకుడికి పరిచయం చేశారని ఆయన తెలిపారు. అప్పటి నుంచీ సినీ రంగంలో అంచలంచెలుగా ఎదిగానని, ఇటీవల విడుదలైన  ఆఫీసర్‌ సిని మాకు సంగీతం అందించానని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

సదరం రవిశంకర్‌ను సత్కరిస్తున్న లాఫింగ్‌ క్లబ్‌ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement