ఆర్జీవీ సినీ పాఠాలు | Ram Gopal Varma To Launch His Film Institute | Sakshi
Sakshi News home page

Published Sun, May 27 2018 10:29 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Ram Gopal Varma To Launch His Film Institute - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో అవతారం ఎత్తనున్నారు. ఇండియన్‌ సినిమాకు సరికొత్త టెక్నాలజీలతో పాటు డిఫరెంట్‌ టేకింగ్‌ను పరిచయం చేసిన వర్మ ఫిలిం స్కూల్‌ను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా ప్రకటించారు న్యూయార్క్‌ కు చెందిన డాక్టర్‌ రామ్‌ స్వరూప్‌, డాక్టర్‌ శ్వేతా రెడ్డిలతో కలిసి ఆర్జీవీ అన్‌స్కూల్‌ పేరుతో ఫిలిం స్కూల్‌ను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. పూర్తి వివరాలు ఈ రోజు వెల్లడించనున్నారు.

వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ఆఫీసర్‌ జూన్‌ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నాగ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు. కొంత కాలంగా వరుస డిజాస్టర్లతో ఫాం కోల్పోయిన వర్మ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement