అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.
సంధ్య థియేటర్ విషాదం..
అయితే పుష్ప-2 విడుదలకు ముందు రోజే తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లు అర్జున్ అరెస్ట్..
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం చంచల్ గూడ నుంచి విడుదలయ్యారు. ఇటీవల బన్నీకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.
అరెస్ట్ తర్వాత బన్నీ భార్య ఎమోషనల్..
హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ తీవ్ర భావోద్వేగానికి గురైంది. బన్నీ అరెస్ట్ సమయంలో ఆయనను హత్తుకుంది. ధైర్యంగా ఉండమని భార్యకు అల్లు అర్జున్ భరోసా ఇచ్చి పోలీసుల వెంట వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.
(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్)
అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్..
బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్‌లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో తన పిల్లలు అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అరెస్ట్ తర్వాత ఆమె చేసిన తొలి పోస్ట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. పుష్ప సినిమాకు స్వీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో 2021లో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. అదే ఉత్సాహంతో పుష్ప-2 ది రూల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు రికార్డులు సృష్టించింది.
(ఇది చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్)
బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్..
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే
ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది. అయితే దంగల్ రికార్డ్‌ను పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment