వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు | Saudi Mecca Got Extreme rain Fall Video Viral | Sakshi
Sakshi News home page

వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు

Published Tue, Jan 7 2025 6:38 PM | Last Updated on Tue, Jan 7 2025 7:34 PM

Saudi Mecca Got Extreme rain Fall Video Viral

జెడ్డా: సౌదీ అరేబియాలో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత కారణంగా ముస్లిం పవిత్ర మక్కా నగరం చెరువును తలపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం జలమయమైంది. వర్షం కారణంగా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సౌదీ అరేబియాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భారీ నష్టం జరిగింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో ఎడతెరిపలేని వర్షంతో భారీ వరదలు వచ్చాయి. ఉరుములు, మెరుపులతో  సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.

 

 

  మక్కా, మదీన, జెడ్దాలో ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక, మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు నగరాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో సౌదీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు.

 

 

 

 మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా వర్షాల కారణంగా మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో 2009లో సౌదీ కురిసిన వర్షం, వరదల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు. 
 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement