Mecca
-
వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు
జెడ్డా: సౌదీ అరేబియాలో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత కారణంగా ముస్లిం పవిత్ర మక్కా నగరం చెరువును తలపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం జలమయమైంది. వర్షం కారణంగా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సౌదీ అరేబియాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భారీ నష్టం జరిగింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో ఎడతెరిపలేని వర్షంతో భారీ వరదలు వచ్చాయి. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.#Breaking: 🇸🇦 Mecca is floating: Torrential rain with hail have led to severe flooding in the holy city for Muslims in Saudi Arabia.😭May Allah protect us from this danger.pic.twitter.com/OgUwGwNhp6— Md.Sakib Ali (@iamsakibali1) January 7, 2025 Scenes of heavy rain falling on Mecca and Jeddah in the Kingdom of #SaudiArabia pic.twitter.com/2EsGyc3IC5— Hamdan News (@HamdanWahe57839) January 6, 2025 SAUDI ARABIA :📹 POWERFUL STORM HIT JEDDAH CITY TODAYScenes from KING ABDULAZIZ International Airport pic.twitter.com/KBta0A0gDD— 𝛎í⸦𝛋𝚼 (@iv1cky) January 7, 2025 మక్కా, మదీన, జెడ్దాలో ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక, మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో సౌదీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. #Mecca after rain outside.Haram Shareef pic.twitter.com/XYrR0FNdep— Saeed Hameed (@urdujournosaeed) January 7, 2025 Mecca, Saudi Arabia, experienced heavy rainfall today, leading to significant flooding. The city received an unusually high amount of rain within a short time. Thankfully, emergency teams are working hard, and the situation is under control. Rain is rare in Mecca, but it’s always… pic.twitter.com/KNfJyy16My— مدقق لغوي 👓 (@Lang_checker) January 6, 2025 మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా వర్షాల కారణంగా మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో 2009లో సౌదీ కురిసిన వర్షం, వరదల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు. Heavy rainfall in the outskirts of *Al-Awali* near Mecca, Saudi Arabia, has caused many areas to flood. 🌧️🚗 Several vehicles were submerged in the floodwaters, and citizens faced severe difficult. #Flood #AlAwali #Rain pic.twitter.com/pOSvkaua1m— rebel (@Asifahm07207201) January 7, 2025 Heavy rain in Mecca.. pic.twitter.com/ciZh7odU66— TAJNIMUL (@tajnimul11606) January 6, 2025 Massive flooding due to extreme rainfall in Mecca, Saudi Arabia 🇸🇦 Today #Rain #macca #TodayNews #UPDATE pic.twitter.com/cCIRcbH0oL— ✩𝐒𝐇𝐀𝐇𝐈𝐃 𝐌𝐔𝐒𝐓𝐀𝐅𝐀✩ (@Shahidmustafa_m) January 6, 2025 -
Eid ul-Adha 2024: పరిపూర్ణ ఆరాధన హజ్జ్
ఇస్లామ్ ధర్మం ఐదు మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. ఇందులో ఏ ఒక్కదాన్ని విస్మరించినా విశ్వాసం పరిపూర్ణం కాదు. మొట్టమొదటిది సృష్టికర్త ఒక్కడే అన్న విశ్వాసం. రెండవది నమాజ్, మూడవది రోజా, నాల్గవది జకాత్, ఐదవది హజ్జ్. దైవ విశ్వాస ప్రకటనకు ఇవి ఆచరణాత్మక సాక్ష్యాలు. ఒక మనిషి విశ్వాసి/ ముస్లిమ్ అనడానికి రుజువులు. అన్ని ఆరాధనలకూ ‘హజ్జ్’ ఆత్మ వంటిది. ఆర్ధిక స్థోమత కలిగిన ప్రతి ముస్లింపై హజ్ విధిగా నిర్ణయించడం జరిగింది. అందుకని ఆర్థిక స్థోమత కలిగినవారు జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కాబా సందర్శన యాత్ర చేయడం తప్పనిసరి. ఈ‘హజ్’ జిల్ హజ్ మాసం పదవ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో జరుగుతుంది. ఆ రోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్ అజ్ హా’. దీన్ని బక్రీద్ పండుగ అని, ఈదె ఖుర్బాన్ అని కూడా అంటారు. ‘హజ్జ్ ’ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేద భావం మచ్చుకు కూడా కనిపించదు. ‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. మక్కా నగర ఆవిర్భావంమక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ్రపాంతంలో మహనీయ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హజ్రత్ హాజిరా అలైహిస్సలాంను, తనయుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు, శ్రీమతి హాజిరా, ’అదేమిటీ.. నన్నూ, నాబిడ్డను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటీ.?’అని ప్రశ్నించగా..,’ఇది దైవాజ్ఞ.’ అని మాత్రమే చెప్పి, అల్లాహ్‌పై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్ళిపోతారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం.కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్క నీరులేని ఆఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడమలు రాసుకుపోయిన చోట అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది. ‘జమ్ జమ్ ’అనే పేరుగల ఆ పవిత్ర జలంతో తల్లీ తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్ జమ్’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఆనాడు కేవలం రెండు ్రపాణాలకోసం వెలసిన ఆ జలం ఈనాడు హజ్ యాత్ర నిమిత్తం మక్కావెళ్ళే లక్షలాదిమంది ప్రజలతోపాటు, స్థానికులకూ నిరంతరం సమృద్ధి్ధగా సరఫరా అవుతూ, యాత్రికులందరూ తమ తమ స్వస్థలాలకు తీసుకు వెళుతున్నా ఏమాత్రం కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం అల్లాహ్ ప్రత్యక్ష మహిమకు నిదర్శనం. ఆ నాటి ఆ నిర్జీవ ఎడారి ్రపాంతమే ఈనాడు అత్యద్భుత సుందర మక్కానగరంగా రూపుదిద్దుకొని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తరువాత కొంతకాలానికి అల్లాహ్ ఆదేశం మేరకు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్ సహాయంతో ‘కాబా’ ను నిర్మించారు. చతుస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్ ఇబ్రాహీం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంలు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు. దీంతో కాబా దైవగృహంగా పేరు΄÷ందింది.అలౌకికానందంమక్కా చేరగానే ప్రతి హాజీ (యాత్రికుడు) కాబావైపు పరుగులు తీస్తాడు. పవిత్ర కాబాను చూడగానే భక్తులు ΄÷ందే ఆనంద పారవశ్యాలు వర్ణనాతీతం. ఒకానొక అలౌకిక ఆనందంతో, భక్తిపారవశ్యంతో కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్ని’తవాఫ్’ అంటారు. ప్రతి తవాఫ్ లోనూ హాజీలు కాబాగోడలో అమరి ఉన్న ’హజ్రె అస్వద్ ’ (నల్లనిశిల) ను ముద్దాడడానికి ప్రయత్నిస్తారు. దైవ గృహమైన కాబాకు సమీపంలో క్రీ. శ. 570 లో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. కనుక భక్తులు ఆ జ్ఞాపకాలనూ నెమరు వేసుకుంటారు. ’జమ్ జమ్ ’బావిలోని పవిత్ర జలాన్ని తనివి తీరా సేవిస్తారు. తరువాత సఫా, మర్వా కొండల మధ్య ’సయీ’చేస్తారు. దీని తరువాత కొన్నిరోజులు ఎవరి నివాసాల్లో వారు దైవచింతన, నమాజులతో కాలం గడిపి, ’జిల్ హజ్ ’మాసం ఎనిమిదవ తేదీన ’మినా’ గ్రామం వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉంటారు. తొమ్మిదవ తేదీన ప్రపంచం నలుమూలలనుండీ వచ్చిన హాజీలంతా ‘అరఫాత్ ’మైదానంలో గుమిగూడి దైవకారుణ్యాన్ని అభిలషిస్తూ ్రపార్ధనలు చేస్తారు. ఈ సందర్భంలోనే ఆనాడు ముహమ్మద్ ప్రవక్త (స) అశేష భక్తజనాన్ని ఉద్దేశించి తమ అంతిమ సందేశం వినిపించారు. అందుకని భక్తులు ఆ మహనీయుడు నిలిచిన ప్రదేశాన్ని కూడా దర్శించి పులకించి పోతారు. సూర్యాస్తమయానికి తిరుగు ప్రయాణం ్రపారంభించి’ముజ్దలఫా’ దగ్గర రాత్రి మజిలీ చేస్తారు. అక్కడే మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి సామూహికంగా చేస్తారు. మదీనాసాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్ ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడి లాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదె నబవిని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒకహాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్రకాబా గహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం గార్ల సహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశపాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలుపరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్ . ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్థం. అల్లాహ్ మనందరికీ ఈ విషయాలను అర్థం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. తఖ్వా ప్రధానందేవుని ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల ఉపాసనా రీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయీల్ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనా రీతులన్నీ పరిపూర్ణతను సంతరించు కున్నాయి. యాత్ర, నిరాడంబర సాధు వస్త్రధారణ, దైవ్రపార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహ సందర్శనార్ధం చేసే హజ్జ్ వల్ల ఉపాసనా రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం ΄÷ందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం స్త్రీ పురుషులందరూ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యంకోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. – యండి. ఉస్మాన్ ఖాన్ -
బాబ్రీ మసీదును ఎక్కడ నిర్మిస్తున్నారు? నిధుల సేకరణ ఎలా?
అయోధ్యలో మసీదు నిర్మాణానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాబ్రీ మసీదు స్థానంలో మహ్మద్ బిన్ అబ్దుల్లా మసీదును నిర్మించనున్నారు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని వాక్యాలను లిఖించిన ఇటుకలను మసీదు నిర్మాణం కోసం వినియోగించనున్నారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థానంలో నిర్మించబోయే ఈ మసీదుకు మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అని పేరు పెట్టారు. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్ గ్రామంలో ఈ మసీదును నిర్మించనున్నారు. అయోధ్య భూ వివాదంపై 2019లో తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.. ఐదు ఎకరాల స్థలంలో మసీదు నిర్మించాలని ఆదేశించింది. మసీదు నిర్మాణ బాధ్యతను ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అనుసంధానంగా ఉన్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చేపట్టింది. మీడియాకు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సీనియర్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యలో మసీదు నిర్మాణం రాబోయే మే నెలలో ప్రారంభం కానుంది. నిర్మాణం పూర్తికావడానికి నాలుగేళ్లు పట్టవచ్చని భావిస్తున్నారు. మసీదు నిర్మాణం కోసం క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ద్వారా నిధులను సేకరించనున్నారు. ఈ మసీదులో ఐదు మినార్లు ఉండనున్నాయి. అతిపెద్ద ఖురాన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. మసీదు కాంప్లెక్స్‌లో ఆసుపత్రి, మ్యూజియం, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, ఇండో-ఇస్లామిక్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. మసీదు పునాదికి ఉపయోగించే పవిత్ర ఇటుకను మసీదు అభివృద్ధి కమిటీ అధిపతి హాజీ అరాఫత్ షేక్ భారతదేశానికి తీసుకువచ్చారు. ఈ ఇటుకపై మహ్మద్ ప్రవక్త ప్రవచనాలను బంగారంతో లిఖించారు. మసీదులో మొదటి ప్రార్థనను మక్కా ఇమామ్ ఇమామ్-ఎ-హరమ్ అబ్దుల్ రెహమాన్ అల్-సుదైస్ చేస్తారని సమాచారం. -
ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికులు దుర్మరణం
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హజ్ యాత్రికులతో వెళుతున్న బస్సు సోమవారం అదుపుతప్పి వంతెనను ఢీట్టింది. దీంతో బస్సు బోల్తా పడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 20 మంది ప్రయాణికులు మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడినట్లు సౌదీ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఖమీస్ ముషైత్ నుంచి అభాకు వెళ్తుండగా అసిర్ ప్రావిన్స్‌లోని అకాబత్ షార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 20కు చేరింది. మరో 29 మంది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా బస్సులో ప్రయాణిస్తున్న బాధితులందరూ వివిధ దేశాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో వాళ్లంతా మక్కా, మదినా యాత్ర కోసం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 2019 అక్టోబర్‌లోనూ మదీనా సమీపంలో బస్సు మరొక భారీ వాహనాన్ని ఢీకొనడంతో 35 మంది విదేశీయులు మరణించారు. చదవండి: ఇదోక జబ్బులా ఉంది! స్కూల్లో కాల్పులు ఘటనపై జోబైడెన్ ఫైర్ -
ఈ డజన్ కొత్త విజన్
మిలిటరీ దుస్తుల్లో కనిపిస్తున్న ఆమె హజ్ యాత్రికులకు సూచనలు ఇస్తుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఓపికగా తీరుస్తుంది. నడవడానికి ఇబ్బంది పడుతున్నవారికి సహాయపడుతుంది. సైనిక దుస్తుల్లో కనిపించే గంభీరత్వం మాట ఎలా ఉన్నా, ఆమె మాత్రం పక్కింటి ఆత్మీయనేస్తం లానే కనిపిస్తుంది. పవిత్ర మక్కా, మదీనాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా సైనికుల చిత్రాలు ఒక చారిత్రక మార్పుకు సూచనగా నిలిచాయి. ఎందుకీ మార్పు? సౌదీ యువరాజు మహ్మద్‌బిన్ సల్మాన్ (ఎంబీఎస్) విజన్ 2030 ప్రణాళిక రూపొందించాడు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం. అది జరగాలంటే ప్రధాన స్రవంతికి దగ్గరవ్వాలి. ఇందులో భాగంగా సంప్రదాయ విధానం నుంచి కాస్త పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సౌదీ ప్రభుత్వం. మహిళలు సైన్యంలో చురుకైన పాత్ర నిర్వహించడమనేది ఈ మార్పుకు సంకేతంలా నిలుస్తుంది. సైన్యంలో పనిచేయాలనేది మోనా చిన్నప్పటి కల. అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో అది కలకే పరిమితమనే కఠిన వాస్తవం తెలిసింది. ఆ కఠిన వాస్తవం కరిగిపోయి మోనా సైన్యంలో చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘నాన్నలాగే సైన్యంలో పనిచేయాలనిది నా కోరిక. అది నెరవేరినందుకు చాలా గర్వంగా ఉంది. పవిత్రభూమిలో విధులు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది మోనా. మక్కా, మదీనాలలో సైనిక విధులు నిర్వహిస్తున్న పన్నెండు మంది మహిళలలో మోనా ఒకరు. కాబా సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమర్ సైకాలజీలో పట్టా పుచ్చుకుంది. ‘సైన్యంలో పనిచేయాలనుకుంటున్నాను’ అని తన మనసులో మాటను ఒకరోజు కుటుంబసభ్యులకు చెప్పింది. వారు సంతోషించారు. ప్రోత్సహించారు. తల్లిదండ్రుల మానసిక దృక్కోణంలో వచ్చిన కీలక మార్పుగా దీన్ని చెప్పుకోవచ్చు. ‘ఇదొక ఉద్యోగం అనుకోవడం లేదు. పవిత్ర బాధ్యతగా భావిస్తున్నాను’ అంటుంది సమర్. 2019లోనే సైన్యంలోకి మహిళలు రావడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సోల్జర్ నుంచి సార్జెంట్ వరకు వివిధ హోదాల్లో మహిళలు పనిచేడానికి దారి పడింది. ‘మహిళలను సైన్యంలోకి తీసుకోవాలా? వద్దా? అనేది గత 30 సంవత్సరాలుగా రగులుతున్న వివాదస్పద అంశం. ఏది ఏమైనా సైన్యంలోకి మహిళల రాక అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం’ అంటున్నారు ఆపరేటింగ్ సిస్టమ్స్ స్పెషలిస్ట్ హలహ్. ఇక షాపింగ్ మాల్స్‌లో మహిళలు క్యాషియర్లుగా కనిపించడం సాధారణ దృశమైంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్‌లో పబ్లిక్ నోటరీలుగా వందమంది మహిళలను నియమించారు. త్వరలో మహిళా జడ్జీల నియామకానికి సన్నాహాలు చేస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే వివిధ రంగాలలో మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. మహిళలపై పరిమితులు విధించే సంరక్షణ విధానానికి చెల్లుచీటి ఇచ్చింది ప్రభుత్వం. మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని కూడా పక్కన పెట్టింది. రాబోయే రోజుల్లో సౌదీ అరేబియాలో మరెన్ని మార్పులు జరగనున్నాయో వేచిచూద్దాం. -
మక్కాలో వైఎస్ జగన్ కోసం ప్రత్యేక ప్రార్థనలు..
మక్కా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు పవిత్ర మక్కాలో ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ ప్రచార కన్వీనర్, జగన్ కోసం టీం సభ్యుడు షేక్ సలీం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందాలని మక్కాలో ప్రార్థనలు చేశారు. వైఎస్సార్సీపీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందాలని కోరుకుంటూ మక్కా మసీదులో ప్రావాసాంధ్రులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి దువా చేశారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నీ వర్గాల ప్రజలను ఆదుకున్నారని, కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని ప్రవాసాంధ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కేవలం ఒక వర్గానికే మేలు చేకూరుస్తున్నారని సలీమ్ మండిపడ్డారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం అధోగతిపాలైందన్నారు. మైనార్టీలు బాగుపడాలంటే రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదర సోదరీమణులు అందరూ కలిసి మెలిసి ఏకతాటిపై నడిచి రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌కి మద్దతు తెలిపి ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, యువత భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకోడానికి ముస్లిం మైనారిటీలు అందరూ ఏకం అవ్వాలని సలీమ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహ్మద్ సిరాజ్, షేక ఫరీద్, సిరాజుద్దీన్ పాల్గోన్నారు. -
శత్రువును క్షమించిన శాంతిదూత జన్మదినం
ద్వేషించినవారిని ప్రేమించడం... తిట్టినవారిని దీవించడం... శత్రువును క్షమించడం... ప్రేమించడం మాత్రమే తప్ప మరొకటి తెలియకపోవడం... మానవజాతిని సాఫల్య శిఖరాలకు చేర్చడానికి అహర్నిశలూ శ్రమించడం... ఇవి కేవలం ప్రవక్తల్లో మాత్రమే కనిపించే లక్షణాలు. అలాంటి ప్రవక్తల పరంపరలో చివరివారు, మానవ మహోపకారి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం. ఈయన మక్కా నగరంలో జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్ తల్లిదండ్రులు. జననానికి రెండునెలల ముందే తండ్రినీ, ఆరేళ్ళప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య పెంచారు. ముహమ్మద్ ప్రవక్త చదవడం, రాయడం రాని నిరక్షరాస్యులు. అయినా ఆయన బోధనలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. మానవ సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు, సవాళ్ళకు ఆయన పరిష్కారం చూపారు. ఒక కులానికో, మతానికో ఆయన బోధనలు పరిమితం కాలేదు. సమాజంలోని సమస్త అసమానతలు, అమాన వీయతలతో పాటు, అన్ని రకాల దుర్మార్గాలు, దౌర్జన్యాలను రూపుమాపారు. మానవులంతా ఒక్కటేనని, మనిషీ మనిషికి మధ్య ఎలాంటి వ్యత్యాసంగాని, ఆధిక్యత లేదని చాటి చెప్పారు. ఆధిక్యతకు, గౌరవానికి అసలైన కొలమానం నీతి నిజాయితీ, సత్ ప్రవర్తనే అన్నది ఆ మహనీయుని నిర్వచనం. మానవ సమానత్వానికి, సామరస్యం, సోదరభావాలకు ఇది నిలువెత్తు నిదర్శనం. సాటి మానవుల ధన, ప్రాణాలను హరించడం, వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించడం, వారి మనోభావాలను గాయపరచడం, ఒకరిపై నిందలు వేయడం, చాడీలు చెప్పడం, వారి హక్కులను కాల రాయాలనుకోవడం ఆయన దృష్టిలో మహా పాతకం. క్షంతవ్యం కాని నేరం. ఆ మహాత్ముని హితోపదేశాలు మానవ హక్కుల పరిరక్షణకు అద్భుతమైన కవచాలు. శ్రామికుల స్వేద బిందువుల తడి ఆరకముందే వారి వేతనం చెల్లించి వేయాలన్న కారుణ్య బోధ కష్టజీవుల పట్ల ఆ మమతల మూర్తికున్న కరుణకు తిరుగులేని నిదర్శనం. మానవాళి కారుణ్య కెరటం మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం బోధనలు నేటి మన సమాజానికి జీవధార. నేడు సమాజంలో రాజ్యమేలుతున్న ఈ చెడులన్నీ సమసి పోయి ఓ మానవీయ సమాజం ఆవిష్కృతం కావాలంటే ప్రవక్త మహనీయులవారి బోధనల వైపు దృష్టి సారించడం తప్ప మరో మార్గం లేదు. ఈనాడు మనం అనేక రంగాల్లో అద్భుతాలు సాధించామనడంలో ఏమాత్రం సందేహం లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన ప్రగతి అంబ రాన్ని చుంబి స్తోంది. కాని నైతికంగా, ధార్మికంగా, విలువల పరంగా మనం ఏ దిశగా పయ నిస్తున్నా మన్నది ప్రశ్నగానే మిగిలి ఉంది. కనుక, ఇకనైనా మనం మరిచిపోయిన పాఠాన్ని మననం చేసుకోవాలి. ముహమ్మద్ ప్రవక్త (స) బోధనలు, ఉపదేశాలవైపు మరలాలి. ఎందుకంటే, ఆ మహనీయులు గొప్ప దైవప్రవక్త అయి ఉండి కూడా ఒక సామాన్యుడిలా, సామాజిక కార్యకర్తలా సమాజానికి సేవ చేస్తూ, ప్రజల్ని సన్మార్గపథాన నడిపించారు. ఇహపర వైఫల్యాల నుండి రక్షించారు. (21, బుధవారం ముహమ్మద్ ప్రవక్త జయంతి – మిలాదున్నబీ – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వైఎస్ జగన్ కోలుకోవాలని మక్కాలో ప్రార్థనలు
జెడ్దా(మక్కా): విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ జగన్‌కు అల్లా మరింత శక్తిని ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలందరికి కూడా అల్లా దీవెనలు ఉండాలని ప్రార్థించారు. ప్రజల కోసం నిరంతరం తపించే జననేతపై గురువారం జరిగిన హత్యాయత్నాన్ని వారు ఖండించారు. దాడి వార్త వినగానే చాలా ఆవేదన చెందామని గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన షేక్ సలీం తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగడం బాధకరమన్నారు. దేశంలోనే మెండుగా ప్రజాదరణ కలిగిన నేతకు రక్షణ కల్పించలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. విమానాశ్రయంలో రక్షణ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని ఏపీ మంత్రులు తల తోక లేకుండా పిచ్చి పట్టినట్టు మాట్లాడటం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించే దయ గుణం లేని వారు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజల దౌర్భగ్యమని అన్నారు. వారి శాఖలపైన అవగాహన లేని మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకుంటే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. జననేతకు రక్షణ కల్పించమని గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంపైన కుట్ర పూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. దాడి చేసిన వ్యక్తికి జైల్లో మర్యాదలు చేస్తూ.. కట్టుకథలు అల్లడం, పోలీసులను అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం చంద్రబాబుకే చెల్లిందని సలీం విమర్శించారు. పరామర్శలను కూడా రాజకీయం చేయడం ద్వారా వైఎస్ జగన్‌కు చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో తెలుస్తోందన్నారు. పచ్చ పత్రికలు, అమ్ముడుపోయిన మీడియా ఎంత ప్రయత్నం చేసినా.. నిజం దాగదని పేర్కొన్నారు. వారందరికి అల్లా తగిన బుద్ది చెబుతారని.. ఇలాంటి చౌకబారు చర్యలకు వైఎస్ జగన్ భయపడరని తెలిపారు. అల్లా దీవెనలు వైఎస్ జగన్‌పై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన మళ్లీ వైఎస్ జగన్ రూపంలో రావాలని కోరుతూ.. ఇదే నియ్యత్తో తవాఫ్ పూర్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో సలీంతో పాటు షేక్ అప్సర్, మహ్మద్ సిరాజ్, షేక్ ఫరీద్‌లు పాల్గొన్నారు. -
హజ్ యాత్రికులకు జగన్ అభిమానుల సేవలు
మక్కా : ముస్లింల పవిత్ర హజ్‌యాత్ర ఆదివారం ప్రారంభమైంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షలకుపైగా ముస్లింలు సౌదీ అరేబియాకు చేరుకున్నారు. హజ్ యాత్రికులందరూ ఆదివారమే మక్కాలో ప్రార్థనలు చేసి అక్కడి నుండి అరాఫత్‌కు బయలుదేరారు. సోమవారం అరాఫత్‌లో బసచేసి ప్రార్థనల అనంతరం మంగళవారం ఉదయం ఈదుల్ అజ్ హా నమాజు తర్వాత మీనాకు చేరుకున్నారు. మీనాలో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో మూడు రోజులు బస చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. లక్షలాదిమంది ఒకే చోట చేరడంతో బస చేసే క్యాంపుల వద్ద జనప్రవాహ తాకిడికి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా సౌదీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. అదే విధంగా హజ్ యాత్రికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొన్ని సంఘాలు తమవంతుగా యాత్రికులకు సేవలందిస్తున్నాయి. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా ప్రవాసాంధ్రులు కూడా వాలంటీర్లుగా ఏర్పడి మీనాలో సేవ చేసేందుకు ముందుకొచ్చి, హాజ్ యాత్రికులకు సేవలందిస్తున్నారు. గతంలో ప్రజాసంకల్పయాత్ర సజావుగా సాగాలని మక్కాలో ప్రార్ధనలు చేసి, అక్కడి నుండి తెచ్చిన జమ్ జమ్ నీటిని, మసీదు జ్ఞాపికను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని పాదయాత్రలో కలిసి అందజేసిన గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన షేక్ సలీం తన మిత్రబృందంతో కలిసి హాజ్ యాత్రికులకు సేవలందిస్తున్నారు. హజ్ యాత్రకు వచ్చిన తెలుగువారిని కలుస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి షేక్ సలీం, అతని స్నేహితులు అందుబాటులో ఉంటున్నారు. ఈ సందర్భంగా షేక్ సలీం మాట్లాడుతూ.. ఇస్లాం ఐదు మూలస్థంబాలలో ఐదవదైన హజ్ యాత్ర చేయాడానికి వచ్చిన మన ప్రాంత ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రహదారులు మరిచిన వారికి తోడుగా ఉంటూ వారు బస చేసే క్యాంపునకు తీసుకువెళ్ళటం, అలసట బారిన పడిన వారికి మంచినీరు సదుపాయాలు సమకూర్చడం, నడవలేని వారికి వీల్ ఛైర్ తో వారి గమ్యస్థానలకు చేర్చి తమవంతుగా సహాయసహకారాలు అందిస్తున్నామన్నారు. హజ్ యాత్రలో అవలంబించాల్సిన పద్దతులు, అలవాట్లను యాత్రికులకు క్షుణ్ణంగా వివరించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సలీం మండిపడ్డారు. యాత్రలో కలిసిన గుంటూరు, కడప జిల్లాల వాసులు వారి ఆవేదనను తమతో పంచుకున్నారని తెలిపారు. రాష్ట్రం నుండి నేరుగా సౌదీకు చేరుకునే సదుపాయం కల్పించి ఉంటే హజ్ యాత్రికులకు కష్టాలు ఉండేవి కాదన్నారు. అలానే వరదలతో అస్తవ్యస్తమైన కేరళ ప్రజల కోసం ప్రార్ధించాలని హాజీలను కోరుతున్నామని సలీం తెలిపారు. నాలుగు రోజుల పాటు హాజ్ యాత్రికులకు సేవలందించేందుకు షేక్ సలీంతో పాటు, అబ్దుల్ హమీద్, షేక్ ఫరిద్, రఫీ, సయిద్, అలీమ్, మోయిన్, మోషిన్ తదితరులు అక్కడే ఉంటున్నారు. -
అన్ని ఆరాధనలకూ ఆత్మ ‘హజ్జ్’
శక్తి కలిగిన ప్రతిముస్లిం విధిగా హజ్ చేయాలన్నది ఖురాన్ వాక్యం. ఈ ‘హజ్’ జిల్‌హజ్ మాసం పదవతేదీన అరేబియాదేశంలోని మక్కానగరంలో జరుగుతుంది. ఆరోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్ అజ్ హా’. దీన్ని బక్రీద్ పండుగ అని, ఈదె ఖుర్బాన్ అని కూడా అంటారు. ‘హజ్జ్’ ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేదభావం మచ్చుకు కూడా కనిపించదు.‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. అందుకే సర్వం మరచి, ఆడంబరాలు త్యజించి, సాధు స్వభావంతో దైవధ్యానంలో కాలం గడపాలని ఉవ్విళ్ళూరుతూ హాజీలు యాత్రకు సన్నద్ధమవుతారు. ఎందుకంటే, సంకల్పశుద్ధితో హజ్ సాంప్రదాయాలను నియమబద్ధంగా పాటిస్తూ ఆరాధన జరిపేవారికి ఇహపరలోకాల్లో అనంతమైన శుభాలు ప్రసాదించబడతాయి. అపారమైన అల్లాహ్ కరుణాకటాక్షాలు, మన్నింపు వారికి ప్రాప్తమవుతాయి. సమస్త గుణదోషాలనుండి వారు పునీతులవుతారు. హజ్రత్ అబూహురైరా(ర)ప్రకారం, ముహమ్మద్ ప్రవక్త ఇలా చెప్పారు. ‘హజ్జ్, ఉమ్రాహ్ల కోసం మక్కాకు వెళ్ళేవారు అల్లాహ్ అతిథులు. వారు అల్లాహ్‌ను ఏది కోరుకుంటే ఆయన వారికది ప్రసాదిస్తాడు. వారు మన్నింపును కోరుకుంటే ఆయన వారిని మన్నించి వేస్తాడు. (ఇబ్నెమాజ)మక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ప్రాంతంలో మహనీయ ఇబ్రాహీం దైవాజ్ఞ మేరకు తన ధర్మపత్ని హజ్రత్ హాజిరాను, తనయుడు ఇస్మాయీల్ను వదిలేసి వెళ్ళిపోతారు. కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్కనీరులేని ఆ ఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడిమెలు రాసుకు పోయిన చోట అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది.‘జమ్ జమ్’ అనే పేరుగల ఆ పవిత్రజలంతో తల్లీతనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్ జమ్’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. తరువాత కొంతకాలానికి అల్లాహ్ ఆదేశం మేరకు హజ్రత్ ఇబ్రాహీం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్ సహాయంతో ‘కాబా’ను నిర్మించారు. చతురస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్ ఇబ్రాహీం, హజ్రత్ ఇస్మాయీల్‌లు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు. పవిత్రఖురాన్‌లో ఇలా ఉంది: ‘మానవుల కోసం ప్రప్రథమంగా నిర్మించబడిన ఆరాధనా కేంద్రం నిస్సందేహంగా మక్కాలో ఉన్నదే. దానికి సకలశుభాలూ ప్రసాదించబడ్డాయి. ప్రపంచ ప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలున్నాయి. ఇబ్రాహీం ప్రార్థనా స్థలమూ ఉంది. దానిలో ప్రవేశించినవారు రక్షణ పొందుతారు. ఈ గృహానికి వెళ్ళే శక్తి, స్థోమత కలవారు దాని హజ్ ను విధిగా నెరవేర్చాలి. ‘(3–96,97) అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల ఉపాసనారీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు. హజ్రత్ ఇబ్రాహీం తన కుమారుడు ఇస్మాయీల్ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనారీతులన్నీ పరిపూర్ణతను సంతరించుకున్నాయి. యాత్ర, నిరాడంబర వస్త్రధారణ, దైవప్రార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహసందర్శనార్థం చేసే హజ్జ్ వల్ల ఉపాసనా రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం పొందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం స్త్రీపురుషులందరూ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యం కోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. సాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడిలాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదెనబవీని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒక హాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర కాబా గృహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం గార ‡్లసహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశ పాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలు పరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్. ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్ధం. అల్లాహ్ మనందరికీ ఈ విషయాలను అర్ధం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 226 మంది సాక్ష్యులను విచారణ చేపట్టింది. ఛార్జీషీట్లో 10 మంది పేర్లను చేర్చగా.. వారిలో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేవలం రెండే నిమిషాల్లో కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురు నిందితులు స్వామి అసిమానంద, భరత్, దేవెందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలలో ఏ ఒక్కరిపైనా ఆరోపణలను ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. దీంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే మిగతా వారిపై మాత్రం ఛార్జీ షీట్ కొనసాగుతుందని కోర్టు(A-5.సునీల్ జోషి మృతి చెందారు) తెలిపింది. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్‌లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోయారు. తర్వాత చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా.. ఐదుగురు మృతి చెందారు. అల్లర్లలో 58 మందికి గాయాలయ్యాయి. ఇక మక్కా బ్లాస్ట్ కేసులో 10 మంది నిందితులను గుర్తించిన ఎన్ఐఏ.. ఐదుగురి పేర్లను మాత్రం చార్జీషీట్లో చేర్చింది. హిందూ దేవాలయాల్లో బాంబులు పేలుస్తున్నారన్న ఆరోపణలకు ప్రతీకారంగానే నిందితులు ఈ దాడులకు పాల్పడినట్లు ఎన్ఐఏ కోర్టుకి తెలిపింది. తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో అలర్ట్ ప్రకటించిన పోలీస్ శాఖ.. పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ప్రత్యేక బలగాలతో భారీ భద్రత కట్టుదిట్టం చేసింది. మే 18, 2007 : మక్కా మసీదులో పేలుడు.. 9 మంది మృతి, 58 మందికి గాయాలు. 29 డిసెంబర్ 2007: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో సునీల్ చనిపోయాడు. జూన్ 2010: ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్లో సునీల్ జోషి పేరు నిందితుడిగా ఉంది నవంబర్ 19, 2010: హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) సీబీఐ అరెస్ట్ చేసింది. కొద్దిరోజులకే దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసింది. డిసెంబర్ 18, 2010: మక్కా మసీదు పేలుడు ఘటనలో తన పాత్రను అసీమానంద అంగీకరించాడు. 2011 డిసెంబర్ 3: గుజరాత్ వల్సాద్కు చెందిన భారత్ మోహన్‌లాల్ రతేశ్వర్ అలియాస్ భారత్‌భాయి అరెస్ట్. ఏప్రిల్ 2011: కేసు విచారణ సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ)కి బదిలీ అయ్యింది. 2013 మార్చి 2: మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ అరెస్ట్ మార్చి 23, 2017: హైదరాబాద్ కోర్టు అసిమానందకు బెయిల్ మార్చి 31, 2017: ఏడేళ్ల తర్వాత అసిమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు ఏప్రిల్ 16, 2018: ఈ కేసులో ఐదుగురు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది ఎన్ఐఏ సమర్పించిన జాబితాలో నిందితులు పేర్లు... A-1. దేవేందర్ గుప్తా A-2.లోకేష్ శర్మ, A-6.స్వామి ఆసిమానందా A-7.భరత్ భాయ్ A-8.రాజేందర్ చౌదరి పరారీలో ఉన్న వారు. A-3.సందీప్ డాంగే A-4.రామచంద్ర కళా సంగ్రా A-10.అమిత్ చౌహన్. ఈ కేసులో చనిపోయిన వ్యక్తి. A-5.సునీల్ జోషి. ఈ కేసులో బెయిల్ పై ఉన్న వాళ్లు A-6 .స్వామి ఆసిమానందా A-7.భరత్ భాయ్. A-9.తేజ్ పరమార్ -
మక్కాలో ఆత్మాహుతి దాడి
మక్కా: సౌదీ అరేబియాలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం మక్కా మసీదులో దాడులకు పాల్పడేందుకు సిద్ధమైన ఉగ్రవాదులపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో ఐదుగురు పోలీసులతో సహా 11 మందికి గాయాలయ్యాయి. దాడికి యత్నించిన మహిళతో సహా ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం వెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి కుట్ర చేశారని పోలీసులు వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
మకుటంలేని మహారాజు
ముహమ్మద్ ప్రవక్త (స), ఆయన అనుచరులు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిన దగ్గరి నుండి మక్కా ఖురైషీలు ఆగ్రహంతో రగిలిపోయేవారు. చివరికి భావికార్యాచరణ గురించి సమాలోచనలు జరిపి మదీనాపై దాడికి పథకం రచించారు. మక్కాలో శతృవుల పోరుపడలేక ప్రవక్త, ఆయన అనుచరులు మదీనాకు వలస వస్తే, ఇక్కడ కూడా కొంతమంది విశ్వాసుల రూపంలో కపటులు పోగయ్యారు. అబ్దుల్లాబిన్ ఉబై వీరికి నాయకుడు. అయినా ప్రవక్త మహనీయులు ఈ దుష్టుల కుటిల పన్నాగాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. రోజురోజుకూ ఆగడాలు మితిమీరిన క్రమంలో జరిగిన కొన్ని పరిణామాల నేప«థ్యంలో ఆత్మరక్షణకోసం శతృవుతో తలపడడం అనివార్యమంది. ‘బద్ర్’ పేరుతో ప్రసిద్ధిగాంచిన ఈ సమరంలో విజయం విశ్వాసులనే వరించినప్పటికీ, ముహమ్మద్ ప్రవక్త (స) జీవితం నిరంతరం సంఘర్షణలతోనే గడిచిపోయింది. సత్యాసత్యాల పోరులో ఎన్నో త్యాగాలు చేయవలసివచ్చింది. దుష్టశక్తులతో పోరాటాలు సలుపవలసి వచ్చింది. తరువాతి పరిణామ క్రమంలో ఉహద్, కందక పోరాటాలు కూడా సంభవించాయి. ఒప్పందాలూ, ఒడంబడికలూ జరిగాయి. ఎట్టి పరిస్థితిలోనూ పోరుకంటే సంధికే అధిక ప్రాధాన్యతనిచ్చేవారు ప్రవక్త మహనీయులు. విలువల పునాదులపైనే చివరికి మక్కాను కూడా జయించారు. విజేతగా మక్కాలో అడుగు పెట్టిన ప్రవక్త మహనీయులు ఒక ప్రకటన చేశారు. కాబా గృహంలో రక్షణ పొందినవారిని మన్నించడం జరుగుతుంది. తమతమ ఇళ్ళలోనే ద్వారాలు మూసుకొని ఉన్నవారికి రక్షణ ఉంటుంది. అబూసుఫ్యాన్ ఇంట రక్షణ పొందిన వారికీ మన్నింపు ఉంటుంది. జన్మభూమిని వదిలి ఒంటరిగా, అవమానభారంతో మదీనాకు వలసవెళ్ళడానికి కారణమైన, చంపడానికి పథకాలు రచించిన శతృవులను సైతం కారుణ్యమూర్తి కనికరించారు. వారిపై ఎలాంటి పగ, ప్రతీకారమూ లేకుండా మనసారా మన్నించారు. ఈ విజయం సందర్భంగా ఆయన ఒక చారిత్రక ప్రసంగం చేశారు. దేవుని ఏకత్వాన్ని, ఆయన గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడారు. పగలు ప్రతీకారాలు, హత్యలు ప్రతిహత్యలను అంతం చేస్తున్నట్లు ప్రకటించారు. సమాజంలో మానవ హక్కుల్ని, మానవ సమానత్వాన్ని విశదీకరించారు. ఉచ్చనీచాల నిమ్నోన్నతాభేదభావాల్ని అంతమొందించారు. వడ్డీ వ్యవస్థను, జూదం, మద్యం లాంటి దురలవాట్లను నిషేధించారు. స్త్రీ పురుష హక్కుల్ని నిర్వచించారు. మానవులంతా ఒకే రాశికి చెందినవారని, ఎవరికీ ఎవరిపై ఎలాంటì æఆధిక్యమూ లేదని విడమరచి చెప్పారు. మూగజీవాల పట్ల బాధ్యతను ప్రోదిచేశారు. దైవాన్ని నమ్ముకున్నవాడు, సత్యధర్మంపై స్థిరంగా ఉన్నవాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడని భరోసా ఇచ్చారు. ఆయన ఏనాడూ మానవీయ విలువలను, ఆదర్శాలను విడనాడలేదు. రణరంగానికి సైతం మానవత్వం నేర్పి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రేమ, దయ, జాలి, కరుణ, సహనం, త్యాగం, పరోపకారం, న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఆ మహనీయుని సుగుణాలలో కొన్ని. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మదీనాలో మస్జిద్ నిర్మాణం
సురాఖ సిగ్గుతో చితికిపోతూ, పశ్చాత్తాప హృదయంతో ప్రవక్త సన్నిధిలో తలవంచుకొని నిలుచున్నాడు. తాను తప్పుచేశానని, క్షమించమని అభ్యర్థించాడు. ప్రవక్త మహనీయులు అతణ్ని క్షమించారు. తరువాత యధాప్రకారం ప్రయాణం కొనసాగిస్తూ మదీనాకు సమీపంలో ఉన్నటువంటి ’ఖుబా’ అనే గ్రామానికి చేరుకున్నారు. ఈలోపు హజ్రత్ అలీ కూడా మక్కా నుండి వచ్చి ప్రవక్తను కలుసుకున్నారు. అలీ రాకతో మక్కా విషయాలు కూడా తెలిశాయి. ప్రవక్తమహనీయులు ఖుబాలో బసచేస్తున్నందున ప్రార్థనకోసం అక్కడ ఒక మస్జిద్ నిర్మించారు. ప్రవక్త స్వయంగా ఆ మస్జిద్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. దైవారాధనకోసం నిర్మించిన మొట్టమొదటి మస్జిద్ అదే. ఖుబా మస్జిద్ లో నమాజ్ చేసిన వారికి ‘ఉమ్రా’ (కాబా దర్శనం) చేసినంత పుణ్యం లభిస్తుంది. ప్రవక్త మహనీయులు ఖుబా చేరుకున్నారన్న శుభవార్త మదీనా అంతటా పాకడంతో అక్కడి ప్రజల ఆనందం అవధులు దాటింది. కనీవినీ ఎరుగని రీతిలో మదీనా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆ మహనీయుని ఆతిథ్యభాగ్యం తమకే దక్కాలని ప్రతి ఒక్కరూ భావించారు. కాని ప్రవక్త వాహనం ఒక్కొక్క ఇంటినీ దాటుకుంటూ చివరికి అబూ అయ్యూబ్ అన్సారీ అనే ఒక సహచరుని ఇంటివద్ద ఆగి అక్కడే కూర్చుండి పోయింది. ప్రవక్తవారి ఆతిథ్యభాగ్యం తమకే లభించినందుకు అబూ అయ్యూబ్ దంపతులు ఆనందంతో పొంగిపొయ్యారు. భూప్రపంచంలో ఎవరికీ దక్కని అదృష్టం తమకే దక్కినందుకు మురిసిపోయారు. కొన్నాళ్ళపాటు వారి ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న ప్రవక్త, మదీనాలో దైవారాధనకోసం ఒక మస్జిద్ నిర్మించాలని సంకల్పించారు. దానికోసం స్థలాన్ని కూడా ఎంపికచేశారు. ఆ స్థలం నజ్జార్ తెగకు చెందిన ఇద్దరు అనాథ అన్నదమ్ములది. వారు సంతోషంగా స్థలం దానం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రవక్త వారిని అభినందిస్తూ, ఉచిత ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి స్థలానికి పైకం చెల్లించారు. తరువాత కొద్దిరోజుల్లోనే మస్జిద్ నిర్మాణం పూర్తయింది. అదే ‘మస్జిదె నబవి’ గా ప్రసిద్ధిగాంచింది. తరువాత ప్రవక్తమహనీయులు ఎక్కువ సమయం మసీదులోనే గడిపేవారు. ధర్మానికి సంబంధించిన విధివిధానాలు, నైతిక, మానవీయ విలువలను గురించి ప్రజలకు తెలియజెప్పేవారు. ప్రేమ, దయ, జాలి, కారుణ్యం, సహనం, సానుభూతి, పరోపకారం తదితర విషయాలు బోధించేవారు. విశ్వాసం అంటే ఏమిటి, విశ్వసించినవారి బాధ్యతలేమిటి, దైవప్రసన్నత, పరలోక సాఫల్యం పొందడానికి ఏంచేయాలి? అన్నటువంటి అనేక ప్రాపంచిక, పారలౌకిక విషయాలను విడమరచి చెప్పేవారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మరికొన్ని విశేషాలు వచ్చేవారం) -
మహాద్భుతం ఈ హోటల్
మక్కా: సాధారణంగా హోటల్ అంటే ఓ వందనో లేదంటే ఓ వెయ్యో గదులతో ఉంటుంది. కానీ, ఏకంగా పది వేల గదులతో ఉంటే.. అందులో 70 రెస్టారెంట్లు ఉంటే.. ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజమే పది వేల రూములు, డెబ్బై రెస్టారెంట్లతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ వచ్చే ఏడాది తొలిరోజుల్లో ప్రారంభం కానుంది. దీనిని సంపన్న దేశం అయిన సౌదీ అరేబియాలోని మక్కాలో నిర్మించారు. అబ్రాజ్ కుడాయ్ అనే పేరుగల ఈ హెటల్ ని దాదాపు 3.5 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. అనుకున్న ప్రకారం అన్ని పనులు పూర్తయితే.. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి వస్తుంది. దీనిని సౌదీ అరేబియా ఆర్థికశాఖనే స్వయంగా నిర్మించగా దీనికి దార్ అల్-హంద్షా గ్రూప్ డిజైన్ ఇచ్చింది. ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాకు రెండు కిలో మీటర్ల దూరంలో ఈ నిర్మాణం కొలువు దీరింది. -
ఫేమస్ మసీదులు ఇవే..
-
మక్కాలో తొక్కిసలాట
రియాద్: ముస్లింల పవిత్ర ప్రదేశం మక్కాలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 18 మందికి గాయాలయినట్టు ఆదేశ పత్రిక అల్ రియాద్ వెల్లడించింది. రంజాన్ మాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరళిరావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండానే వైద్యం అందించినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. గతేడాది మక్కాలో జరిగిన తొక్కిసలాటలో రెండు వేలకు పైగా యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఏటా లక్షలాదిమంది ముస్లింలు మక్కాను సందర్శిస్తుంటారు. -
'ఉగ్ర'వాద దంపతులు కలిసింది అక్కడే!
వాషింగ్టన్: కాలిఫోర్నియాలో కాల్పులకు పాల్పడి 14 మంది మృతికి కారణమైన ఉగ్రవాద దంపతులు మొదట కలిసింది మక్కా యాత్రలో అని విచారణ సందర్భంగా తేలింది. ఆన్లైన్ ద్వారా పరిచయం అయిన ఫరూక్, తష్ఫిన్ మాలిక్‌లు మక్కాలో కలుసుకున్నారని వారి వీసాల వివరాలను పరిశీలించడం ద్వారా న్యాయవిచారణ కమిటీ గుర్తించింది. 2013లో ఉగ్రవాద దంపతుల కుటుంబాలు సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించాయి. ఈ సందర్భంగానే ఇరుకుటుంబాల మధ్య ఫరూక్, తష్ఫిన్ల పెళ్లి ప్రతిపాదన వచ్చిందని, ఫరూక్ కాలిఫోర్నియాలో ఉద్యోగం పొందిన అనంతరం వీరి వివాహం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. -
హజ్ యాత్రలో పెను విషాదం
♦ మినాలో తొక్కిసలాట.. 717 మంది మృతి ♦ 863 మందికి గాయాలు.. మృతుల్లో ఒక హైదరాబాద్ మహిళ సహా నలుగురు భారతీయులు మినా: సౌదీ అరేబియాలో కొనసాగుతున్న హజ్ యాత్రలో గురువారం పెను విషాదం చోటు చేసుకుంది. మినాలో జరిగిన ఘోర తొక్కిసలాటలో 717 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 863 మంది గాయపడ్డారు. మృతుల్లో.. నలుగురు భారతీయులు, 90 మంది ఇరాన్ పౌరులు సహా వివిధ దేశాలకు చెందిన హజ్ యాత్రికులు ఉన్నారు. తొక్కిసలాటకు కారణమేమిటనేది నిర్దిష్టంగా తెలియరాలేదు. అయితే.. మినాలో జమారత్ వద్ద ‘సైతానును రాళ్లతో కొట్టేందుకు’ భారీ సంఖ్యలో యాత్రికులు తోసుకోవటంతో ఈ తొక్కిసలాట సంభవించిందని.. జమారత్‌కు వెళ్లే దారిలో రెండు రోడ్ల కూడలి వద్ద ఈ దుర్ఘటన జరిగిందని ప్రభుత్వ సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఏటా పాల్గొనే హజ్ యాత్రలో తరచుగా తొక్కిసలాటల వంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. అయితే.. గురువారం నాటి దుర్ఘటన గత 25 సంవత్సరాల్లో రెండో పెద్ద దారుణం. ఈ ఏడాది హజ్ యాత్ర ఆరంభంలోనే.. రెండు వారాల కిందటే ఈ నెల 11వ తేదీన మక్కాలో ప్రధాన మసీదు వద్ద భారీ క్రేన్ కూలి 11 మంది భారతీయులు సహా 115 మంది హజ్ యాత్రికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో భారీ ఘోరం సంభవించటం ప్రపంచాన్ని విచారంలో ముంచింది. మక్కాకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని మినాలో.. భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. యాత్ర చివరి ఘట్టంలో ఘోరం: ఈ ఏడాది హజ్ యాత్ర మంగళవారం మొదలైంది. భారతదేశం నుంచి దాదాపు లక్షన్నర మంది సహా 20 లక్షల మందికి పైగా యాత్రికులు ఈ ఏడాది హజ్లో పాల్గొంటున్నారు. యాత్రికులు రెండు రోజుల కిందట మక్కా నుంచి హజ్ యాత్ర కోసం శిబిరాల నగరమైన మినాకు వచ్చారు. అక్కడ వారు రాత్రి పూట విశ్రమించేందుకు దాదాపు 1.60 లక్షల శిబిరాలను ఏర్పాటు చేశారు. దీనినిబట్టే యాత్రికుల వెల్లువ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహమ్మద్ ప్రవక్త దాదాపు 1400 సంవత్సరాల కిందట తుది హజ్ ధర్మోపదేశం ఇచ్చిన చోటు అయిన అరాఫాలో యాత్రికులు బుధవారం ప్రార్థనలు నిర్వహించి.. సైతానును రాళ్లతో కొట్టే కార్యక్రమంలో పాల్గొనేందుకు మళ్లీ మినాకు తిరిగివచ్చారు. హజ్ యాత్రలో ముఖ్యమైన ఘట్టాల్లో ఇదే చివరి ఘట్టం. జమారాత్ వంతెనగా పేర్కొనే ఐదంతస్తుల కట్టడం వద్ద ఈ మతవిశ్వాస ఆచారం పాటించటం జరుగుతోంది. ఇక్కడ సైతానుకు సంకేతంగా మూడు స్తూపాలు ఉంటాయి. కిలోమీటరు నిడివి ఉండే ఈ కట్టడం నుంచి గంటలో 3 లక్షల మంది ఆచారాన్ని పాటించేందుకు వీలు ఉంటుంది. రాళ్లు విసిరిన తర్వాత.. ప్రవక్త ఇబ్రహీం తన ఏకైక కుమారుడు ఇస్మాయిల్‌ను దేవునికి బలిచ్చేందుకు సంసిద్ధతను తెలిపే ఘటన కు స్మారకంగా యాత్రికులు జంతు బలి ఆచారాన్ని పాటిస్తారు. బలి విందు ఈద్-అల్-అదా అనంతరం యాత్ర ముగుస్తుంది. నిమిషాల్లోనే వందల మంది మృతి: ఈద్-అల్-అదా తొలి రోజు అయిన గురువారం నాడే మినాలో భారీ తొక్కిసలాట సంభవించింది. వేల సంఖ్యలో ఉన్న యాత్రికుల మధ్య ఒక్కసారిగా తోపులాటతో వందలాది మంది కిందపడిపోయారు. పెను విషాద ఘటన చోటుచేసుకోగానే సౌదీ భద్రతా సిబ్బంది, సహాయకులు నిమిషాల్లో రంగంలోకి దిగారు. కానీ అప్పటికే వందల మంది చనిపోయారు. ఘటనా స్థలంలో మృతదేహాలు కుప్పలుగా పడివుండగా.. గాయపడ్డవారు ఆ మృతదేహాల మధ్యనే కూలబడి కనిపించారు. మృతుల బంధువులు, గాయపడిన మహిళలు, వృద్ధులు ఆర్తనాదాలు చేస్తున్నారు. నాలుగు వేల మందికి పైగా సహాయక సిబ్బంది, 220 అంబులెన్స్‌ల్లో గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. కారణాలపై భిన్న కథనాలు: ఆఫ్రికా దేశాలకు చెందిన కొందరు యాత్రికుల వల్లే తొక్కిసలాట జరిగిందని సెంట్రల్ హజ్ కమిటీ అధిపతి ప్రిన్స్ ఖాలిద్ అల్-ఫైసల్ ఆరోపించినట్లు సౌదీ ప్రభుత్వానికి చెందిన అల్ అరేబియా టీవీ పేర్కొంది. అయితే.. జమారత్ స్తూపాల వద్దకు వెళ్లే రెండు మార్గాలను సౌదీ అధికారులు ఎందుకో మూసివేశారని.. దీంతో లక్షలాదిగా వస్తున్న యాత్రికులు ఒక్కచోట నిలిచిపోయి తొక్కిసలాట జరిగిందని.. ఇరాన్ హజ్ సంస్థ అధినేత సయ్యద్ ఒహాది ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థతో పేర్కొన్నారు. తొక్కిసలాట సరిగ్గా ఎక్కడ జరిగిందనే అంశంపైనా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. హజ్ ఆచారాల్లో భాగంగా ‘సైతానును రాళ్లతో కొట్టే’ ప్రాంతం వద్ద రద్దీలో ఈ తొక్కిసలాట జరిగిందని సౌదీ సర్కారు పేర్కొంటే.. తొక్కిసలాట జరిగింది అక్కడ కాదని.. యాత్రికుల శిబిరాల మధ్య 204 నంబరు మార్గంలో జరిగి యాత్రికులు చనిపోయారని అల్‌జజీరా టీవీ ప్రతినిధి చెప్పారు. తొక్కిసలాటపై దర్యాప్తునకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ నయేఫ్ ఆదేశించారు. ప్రణబ్, మోదీ సహా ప్రముఖుల సంతాపాలు.. హజ్ యాత్రలో భారీ తొక్కిసలాటలో వందలాది మంది యాత్రికులు చనిపోవటం పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలు గురువారం వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాగా పవిత్ర హజ్ యాత్ర సందర్భంగా మక్కాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. భారత్ నిరంతర పర్యవేక్షణ.. ఈ తొక్కిసలాటలో నలుగురు భారతీయులు చనిపోయినట్లు జెడ్డాలోని భారత దౌత్యకార్యాలయం పేర్కొంది. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ, ఒక వాలంటీర్, కేరళకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారని తెలిపింది. భారతీయ హజ్ కార్యక్రమ వైద్యులను మినా, మక్కాల్లోని అన్ని ఆస్పత్రులకూ పంపించామని.. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. మరోవైపు తెలంగాణ హజ్ కమిటీ ఆధ్వర్యంలో బయలుదేరిన యాత్రికులు మినా ఘటనలో గాయపడినట్లు సమాచారం లేదని కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్ వెల్లడించారు. హజ్ యాత్రికుల కోసం హెల్ప్లైన్లు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మక్కా దుర్ఘటనకు సంబంధించి సచివాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. 040-23214125కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్‌తోపాటు రాష్ట్ర హజ్ కమిటీ ఎప్పటికప్పుడు అక్కడి వివరాలను సేకరిస్తున్నారు. అటు హజ్హౌస్లోనూ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ యాత్రికులకు 040-23214193, ఏపీ యాత్రికులకు 040-23298793 నెంబర్ల ను కేటాయించారు. అదేవిధంగా కేంద్ర హజ్ కమిటీ 022-22717100/101/102 నంబర్లతో, సౌదీ లోని భారత దౌత్యకార్యాలయం భారతదేశం నుంచి ఫోన్ చేసే వారి కోసం 00966125458000, 00966125496000 నంబర్లతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. అలాగే సౌదీ నుంచి ఫోన్ చేసే భారతీయ యాత్రికుల కోసం 8002477786 నంబరుతో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఎల్బీనగర్ వాసి మృతి హైదరాబాద్: మక్కాలో జరిగిన తోక్కిసలాటలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నివాసి బీబీజాన్ (62)అనే మహిళ మృతి చెందా రు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన షేక్ మజీద్, ఆయన భార్య బీబీజాన్ 25 ఏళ్ల కిందట ఎల్బీనగర్కు నివాసం వచ్చారు. ఆయన తన భార్య బీబీజాన్, బీహెచ్‌ఇఎల్‌లో నివసిస్తున్న తన సోదరుడు షేక్ రవూఫ్, అతని భార్య షహనాజ్‌లు కలిసి ఈ నెల 2న హజ్ యాత్రకు వెళ్లారు. గురువారం ఉదయం మినాలో సైతాన్‌పై రాళ్లు వేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు జరిగిన తొక్కిసలాటలో బీబీజాన్ మృతిచెందారు. ఆమె మృతి వార్తను మజీద్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు గతంలో జరిగిన ప్రమాదాలు జూలై 2, 1990: మక్కా నుంచి మీనాకు వెళ్లే దారిలో పాదచారుల సొరంగ మార్గంలో తొక్కిసలాట. 1,426 మంది మృతి. వీరిలో ఎక్కువ మంది మలేసియా, ఇండోనేషియా, పాకిస్తాన్ పౌరులున్నారు. మే 23, 1994: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 270 మంది మృతి. ఏప్రిల్ 9, 1998: జమారత్ వంతెనపై ప్రమాదం 118 మంది మృతి మార్చి 5, 2001: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 35 మంది మృతి. ఫిబ్రవరి 11, 2003: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 14 మంది మృతి. ఫిబ్రవరి 1, 2004: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 251 మంది మృతి. జనవరి 12, 2006: హజ్ చివరి రోజున సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 346 మంది మృతి సెప్టెంబర్ 11, 2015: క్రేన్ కుప్పకూలి 111 మంది మృతి. 394మందికి గాయాలు. సెప్టెంబర్ 24, 2015: జమారత్ వంతెనపై తొక్కిసలాట. 717 మంది మృతి. 500 మందికి గాయాలు.హజ్ యాత్ర అంటే.. ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా నగరానికి తీర్థయాత్ర చేయటం.. ఇస్లాంలో ముఖ్యంగా అయిదు ఆచరణీయ అంశాలను మూలస్తంభాలుగా విశ్వసిస్తారు. మత విశ్వాసము, నిత్య ప్రార్థనలు, దయ, రంజాన్ మాస ఉపవాసము, జీవితంలో ఒకసారి మక్కా యాత్ర అన్నవి ఇస్లాంలో ప్రతి ఒక్కరు ప్రధానంగా ఆచరించాల్సిన అంశాలు. హజ్ యాత్ర(మక్కా తీర్థయాత్ర) ఇందులో అయిదవది. షియాలు, సున్నీలు అంతా ఆచరించే అంశాలు ఇవి. ఇందులో హజ్ యాత్ర చాలా ముఖ్యమైంది. ఇస్లాం కేలండర్లోని 12వ నెల జుల్ హిజా(బక్రీద్ నెల)లో హజ్ యాత్ర చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది ముస్లింలు ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ యాత్రను ముస్లింలు చాలా నిష్టగా చేయాల్సి ఉంటుంది. ఈ యాత్ర చేసేందుకు అనేక ఆంక్షలను కూడా ఇస్లాం విధించింది. అప్పులు ఉన్న వాళ్లు కానీ, వడ్డీలు, దానధర్మాల ద్వారా వచ్చిన డబ్బులతో కానీ, కుటుంబ బాధ్యతలను పూర్తిగా తీర్చని వాళ్లు, పెళ్లి కాని కూతుళ్లు ఉన్న వాళ్లు, అనారోగ్యంతో ఉన్న వాళ్లు హజ్ యాత్ర చేయటానికి అనర్హులని ఇస్లాం చెప్తోంది. హజ్ యాత్ర చేయటంలో మక్కాకు చేరుకున్న తరువాత పాటించాల్సిన పద్ధతులు కూడా కఠినంగానే ఉంటాయి. హజ్ యాత్రలో ప్రధానంగా పాటించే ఆచారాలు 1. ఉమ్రా(యాత్ర) చేసేందుకు ఇహ్రాం చేరుకోవాలి. 2. కాబా చుట్టూ అపసవ్య దిశలో ఏడు ప్రదక్షిణలు(తవాఫ్ అల్ ఉమ్రా) చేయాలి 3. సఫా, మార్వా కొండల మధ్య 7 సార్లు ప్రయాణించాలి 4. క్షవరం చేయించుకోవటం ద్వారా ఉమ్రాను పూర్తి చేయాలి 5. జుల్హిజా మాసం 8వ రోజున హజ్ నిర్వహించటానికి ఇహ్రాం చేరుకోవాలి 6. మక్కాకు అయిదు కిలోమీటర్ల దూరంలోని మీనా చేరుకుని అక్కడ కేటాయించిన టెంట్లో ఒక పగలు, ఒక రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. 7. 9వరోజున అరాఫా ఎడారి మైదాన ప్రాంతంలో మధ్యాహ్న వేళ ప్రార్థనలు చేయాలి. 8. 9వ రోజు రాత్రి ముజ్ద్ అలీఫా చేరుకుని అవసరమైన రాళ్లను సేకరించుకోవాలి. అక్కడి ఇసుక తిన్నెలపై రాత్రి నిద్రపోవాలి 9. 10వ రోజు ఉదయం తిరిగి మీనాలోని శిబిరానికి చేరుకోవాలి. 10. పవిత్రమైన త్యాగం నిర్వహించాలి(జంతుబలి) 11. మరోసారి క్షవరం చేసుకోవాలి. 12. తరువాత తవాఫ్ అల్ జియారా (ప్రదక్షిణ) నిర్వహించి తిరిగి మీనాలోని శిబిరానికి చేరుకోవాలి 13. 11వ రోజున మూడు జమారత్‌ల దగ్గర రాళ్లు విసిరి, మీనాలోని శిబిరానికి చేరుకోవాలి 14. 12వ రోజున మూడు జమారత్‌ల దగ్గర రాళ్లు విసిరి సూర్యాస్తమయం కాకముందే మీనా శిబిరాన్ని విడిచి వెళ్లిపోవాలి 15. మక్కాను విడిచి వెళ్లే ముందు తవాఫ్ అల్వదా నిర్వహించాలి. -
అసలైన హజ్ యాత్ర!
ఒకసారి హజరత్ అబ్దుల్లా బిన్ ముబారక్ (రహ్మ)హజ్ యాత్రకోసం మక్కాకు బయల్దేరారు. అయితే ఆయన అలా కొన్ని మైళ్లు ప్రయాణించిన తరువాత, ఒక ఊరి పొలిమేరలోకి వెళ్లేసరికి అక్కడ ఒక బాలిక దేనికోసమో వెదుకులాడుతూ కనిపించింది. కడు పేదరికంలో ఉన్నట్టు కనిపిస్తున్న ఆ పదేళ్ల బాలిక వెదుకులాట ఆయన్ను ముందుకు సాగనివ్వలేదు. అంతలో ఆ బాలిక అటూ ఇటూ చూసి, ఓ చచ్చిన పక్షిని ఒళ్లో వేసుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన ముబారక్ గారు వెంటనే ఆ అమ్మాయిని సమీపించి, ‘‘పాపా! చచ్చిన ఆ పక్షి ఎందుకు పనికొస్తుంది, దీన్నేం చేసుకుంటావు?’’ అని అడిగారు. ఆ బాలిక దుఃఖాన్ని దిగమింగుకుంటూ గద్గదస్వరంతో ఇలా చెప్పింది. ‘‘అయ్యా! నేను అనాథను. నాకో తమ్ముడున్నాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేక చాలా బాధపడుతున్నాం. రెండు రోజుల నుండి తిండి దొరకలేదు. నేనెలాగో తట్టుకోగలను కానీ, తమ్ముడు తట్టుకోలేకపోతున్నాడు. వాడి ఆకలి బాధను చూడలేక దీన్నయినా వాడికి పెడితే ప్రాణాలు నిలుస్తాయన్న ఆశతో దీన్ని ఒళ్లో వేసుకున్నా’’ అని చెప్పింది. ఈ మాటలు విన్న అబ్దుల్లా బిన్ ముబారక్ (రజి)కదిలిపోయారు. బాలికను దగ్గరకి తీసుకుని ‘‘పాపా! ఏడవకు. దైవం తప్పకుండా నీ బాధను దూరం చేస్తాడు’’ అంటూ తన హజ్‌యాత్రకోసం తెచ్చుకున్న పైకమంతా ఆమె చేతిలో పెట్టి, వీటితో మీకు కావలసిన వస్తు సామగ్రి, బట్టలు కొనుక్కుని, దిగుల్లేకుండా హాయిగా జీవించండి. ఈ ఏర్పాటు చేసిన దైవానికి కృతజ్ఞతలు తెల్పుకోండి’’అన్నారు. ఒక్కసారిగా అన్ని డబ్బులు చేతిలో పడేసరికి, ఆ బాలిక బాలిక ముఖంలో మెరిసిన ఆనందాన్ని చూసి ముబారక్ గారి మనసు పులకరించిపోయింది. ‘‘అమ్మా! ఇక వెళ్లు. తమ్ముడు ఎదురు చూస్తుంటాడు. త్వరగా అతనికి భోజనం పెట్టు’’ అంటూ అనునయించారు. బాలిక కృతజ్ఞతగా ఆయన వైపు చూస్తూ సంతోషంతో ఇంటిదారి పట్టింది. బాలిక వెళ్లిన వైపే తృప్తిగా చూస్తూన్న ముబారక్ గారితో ఆయన శిష్యుడు ‘‘అయ్యా! డబ్బంతా ఇచ్చేశారు. మరి తమరి హజ్ యాత్ర ఎలా?’’ అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ముబారక్‌గారు ఇలా అన్నారు. ‘మన హజ్ ఇక్కడే నెరవేరింది. ప్రస్తుతం ఇది కాబా యాత్ర కన్నా గొప్ప ఆరాధన. దైవచిత్తమైతే వచ్చే యేడాది మళ్లీ హజ్ యాత్రకు వెళదాం. ఈ యేడు మాత్రం హజ్‌ను అల్లాహ్ ఇక్కడే స్వీకరించాడు’’ అని దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొని వెనుదిరిగి వెళ్లిపోయారు. తలపెట్టింది దైవకార్యమైనా, ఆయన దాసులు ఆకలితో అలమటిస్తుంటే, వస్త్రాలు లేక విలవిల్లాడుతుంటే, దైవకార్యాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి అన్నార్తుల క్షుద్బాధను తీర్చడం, వారికి వస్త్రాలు సమకూర్చడం అన్నిటికన్నా శ్రేష్ఠతర కార్యమన్న ప్రవక్త సందేశం దీని ద్వారా మనకు అర్థమవుతోంది. అందుకే నేలపై ఉన్నవారిని కరుణించండి, నింగిపై వాడు మిమ్మల్ని కరుణిస్తాడు’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త(స). -
717 దాటిన మృతుల సంఖ్య
రియాద్: మక్కాలో జరిగిన హజ్ యాత్రికుల తొక్కిసలాట ప్రమాదంలో మృతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అంతకుముందు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 453 ఉండగా అనూహ్యంగా 717 దాటింది. ఇక గాయపడిన వారు కూడా అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారు అంతకుముందు అందిన సమాచారం ప్రకారం 500మందికి పైగా ఉన్నట్లు తెలియగా గాయపడినవారి సంఖ్య తాజాగా 750 దాటినట్లు అధికార వర్గల సమాచారం. మక్కాలో గురువారం మరో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది. 15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. గతంలో మక్కాలో మసీదు మరమ్మతుల సందర్భంగా భారీ క్రేన్ కూలి 107 మంది చనిపోయిన విషయం తెలిసిందే. -
మక్కాలో తొక్కిసలాట
-
గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య
-
గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య
రియాద్: మక్కాలో గురువారం జరిగిన పెను విషాదంలో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 310కి చేరింది. తొలుత 150మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం ప్రకటించగా ఆ తర్వాత నుంచి ఆసంఖ్య వేగంగా పెరిగింది. ఆ వెంటనే 220 తర్వాత 310 ఇలా భారీ స్థాయిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కాగా గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం.. వారిలో చాలామంది తీవ్రంగా గాయపడటంతో మృతులు పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది. 15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. ఈ నెల 12వ తేదీన మక్కాలో మసీదు మరమ్మతుల సందర్భంగా భారీ క్రేన్ కూలి 107 మంది చనిపోయిన విషయం తెలిసిందే. -
'25 ఏళ్లుగా ఆగని మృత్యుఘోష'
గత పాతికేళ్లుగా ఇదే వరుస. హజ్ యాత్ర ప్రారంభం అవుతున్న ప్రతిసారి ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎలా ప్రమాదం చోటు చేసుకుంటుందో ఊహించకుండానే జరగాల్సింది జరిగిపోతుంది. మృత్యుఘోష వినిపిస్తోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రలో గత 25 సంవత్సరాలలోనే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. యాత్రా నిర్వాహకులు ఎంతో అప్రమత్తంగా ఉన్న ఏదో ఒక రూపంలో యాత్రికులను మృత్యువు కభళిస్తోంది. హజ్ యాత్ర కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి లక్షల్లో ముస్లింలు వస్తుంటారు. తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్రను సందర్శించాలని ముస్లింలు కోరుకుంటారు. ఎంతో పవిత్రంగా ఆ కార్యక్రమం పూర్తి చేసేందుకు వారు పెద్ద ఎత్తున తరలి వెళుతుంటారు. అలా వెళ్లిన వారికి నిర్వహణా అధికారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడమో లేక ఏదో ఒక కారణంతో తొక్కిసలాట చోటుచేసుకోవడమో జరుగుతుండటం సర్వసాధరణంగా తయారైంది. ఫలితంగా అదే ప్రాణ నష్టం. వీటికి భిన్నంగా ఇదే నెల 12న మక్కాలోని ఓ భారీ క్రేన్ యాత్రికులపై కూలిపోయి దాదాపు 107 మంది చనిపోవడం, పదిహేను రోజులు తిరగకుండానే తొక్కిసలాట చోటుచేసుకుని 453మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అక్కడి అధికారులనే కాక, యాత్రికులను కూడా తీవ్రంగా కలవర పెడుతోంది. ఇప్పటి వరకు గత 25 ఏళ్లలో హజ్ యాత్రలో చోటుచేసుకున్న విషాదాలను పరిశీలిస్తే.. 1987 లో ఇరానియన్ యాత్రికులకు సౌదీ అధికారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుని 402 మంది చనిపోగా.. 650మందికి పైగా గాయాలపాలయ్యారు. 1989లో రెండు బాంబులు పేలుళ్లు చోటుచేసుకొని ఓ యాత్రికుడు చనిపోగా 16మంది గాయాలపాలయ్యారు. 1990లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టన్నెల్‌ను పాదయాత్రగా వెళుతున్న యాత్రికుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుని దాదాపు 1426మంది మృత్యువాత పడ్డారు. 1997 లో ఓ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 340మంది చనిపోగా.. 1500మంది గాయాలపాలయ్యారు. 1998లో ఓ ఇరుకైన మార్గం ద్వారా ఎక్కువమంది యాత్రికులను వెళ్లేందుకు అనుమతించడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకుని 180మంది యాత్రికులు చనిపోగా పలువురు గాయాలపాలయ్యారు. 2001లో ఓ తొక్కిసలాట చోటుచేసుకుని 35మంది చనిపోయారు. 2004లో సైతాన్ స్టోన్పై రాళ్లు విసిరే సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుని దాదాపు 250మంది ప్రాణాలు విడిచారు. 2006లో కూడా సైతాన్ స్టోన్పై రాళ్లు విసిరే క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని 350మంది చనిపోయారు. 2015 సెప్టెంబర్ 12న మక్కామసీదులో ఓ భారీ క్రేన్ కూలిపోయి దాదాపు 110మంది ప్రాణాలు విడిచారు. 2015 సెప్టెంబర్ 24న తొక్కిసలాట చోటుచేసుకుని 453 మంది చనిపోగా 750 మందికి పైగా గాయాలపాలయ్యారు.