
717 దాటిన మృతుల సంఖ్య
రియాద్: మక్కాలో జరిగిన హజ్ యాత్రికుల తొక్కిసలాట ప్రమాదంలో మృతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అంతకుముందు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 453 ఉండగా అనూహ్యంగా 717 దాటింది. ఇక గాయపడిన వారు కూడా అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారు అంతకుముందు అందిన సమాచారం ప్రకారం 500మందికి పైగా ఉన్నట్లు తెలియగా గాయపడినవారి సంఖ్య తాజాగా 750 దాటినట్లు అధికార వర్గల సమాచారం.
మక్కాలో గురువారం మరో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది. 15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. గతంలో మక్కాలో మసీదు మరమ్మతుల సందర్భంగా భారీ క్రేన్ కూలి 107 మంది చనిపోయిన విషయం తెలిసిందే.