గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య | 310 killed in Haj stampede | Sakshi
Sakshi News home page

గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

Published Thu, Sep 24 2015 3:40 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

రియాద్: మక్కాలో గురువారం జరిగిన పెను విషాదంలో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం  మృతుల సంఖ్య 310కి చేరింది. తొలుత 150మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం  ప్రకటించగా ఆ తర్వాత నుంచి  ఆసంఖ్య వేగంగా పెరిగింది. ఆ వెంటనే 220 తర్వాత 310 ఇలా భారీ స్థాయిలో మృతుల సంఖ్య పెరుగుతోంది.

కాగా గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం.. వారిలో చాలామంది తీవ్రంగా గాయపడటంతో  మృతులు పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది.  15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. ఈ నెల 12వ తేదీన మక్కాలో మసీదు మరమ్మతుల సందర్భంగా భారీ క్రేన్ కూలి 107 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement