haj
-
ఈ డజన్ కొత్త విజన్
మిలిటరీ దుస్తుల్లో కనిపిస్తున్న ఆమె హజ్ యాత్రికులకు సూచనలు ఇస్తుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఓపికగా తీరుస్తుంది. నడవడానికి ఇబ్బంది పడుతున్నవారికి సహాయపడుతుంది. సైనిక దుస్తుల్లో కనిపించే గంభీరత్వం మాట ఎలా ఉన్నా, ఆమె మాత్రం పక్కింటి ఆత్మీయనేస్తం లానే కనిపిస్తుంది. పవిత్ర మక్కా, మదీనాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా సైనికుల చిత్రాలు ఒక చారిత్రక మార్పుకు సూచనగా నిలిచాయి. ఎందుకీ మార్పు? సౌదీ యువరాజు మహ్మద్‌బిన్ సల్మాన్ (ఎంబీఎస్) విజన్ 2030 ప్రణాళిక రూపొందించాడు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం. అది జరగాలంటే ప్రధాన స్రవంతికి దగ్గరవ్వాలి. ఇందులో భాగంగా సంప్రదాయ విధానం నుంచి కాస్త పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సౌదీ ప్రభుత్వం. మహిళలు సైన్యంలో చురుకైన పాత్ర నిర్వహించడమనేది ఈ మార్పుకు సంకేతంలా నిలుస్తుంది. సైన్యంలో పనిచేయాలనేది మోనా చిన్నప్పటి కల. అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో అది కలకే పరిమితమనే కఠిన వాస్తవం తెలిసింది. ఆ కఠిన వాస్తవం కరిగిపోయి మోనా సైన్యంలో చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘నాన్నలాగే సైన్యంలో పనిచేయాలనిది నా కోరిక. అది నెరవేరినందుకు చాలా గర్వంగా ఉంది. పవిత్రభూమిలో విధులు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది మోనా. మక్కా, మదీనాలలో సైనిక విధులు నిర్వహిస్తున్న పన్నెండు మంది మహిళలలో మోనా ఒకరు. కాబా సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమర్ సైకాలజీలో పట్టా పుచ్చుకుంది. ‘సైన్యంలో పనిచేయాలనుకుంటున్నాను’ అని తన మనసులో మాటను ఒకరోజు కుటుంబసభ్యులకు చెప్పింది. వారు సంతోషించారు. ప్రోత్సహించారు. తల్లిదండ్రుల మానసిక దృక్కోణంలో వచ్చిన కీలక మార్పుగా దీన్ని చెప్పుకోవచ్చు. ‘ఇదొక ఉద్యోగం అనుకోవడం లేదు. పవిత్ర బాధ్యతగా భావిస్తున్నాను’ అంటుంది సమర్. 2019లోనే సైన్యంలోకి మహిళలు రావడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సోల్జర్ నుంచి సార్జెంట్ వరకు వివిధ హోదాల్లో మహిళలు పనిచేడానికి దారి పడింది. ‘మహిళలను సైన్యంలోకి తీసుకోవాలా? వద్దా? అనేది గత 30 సంవత్సరాలుగా రగులుతున్న వివాదస్పద అంశం. ఏది ఏమైనా సైన్యంలోకి మహిళల రాక అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం’ అంటున్నారు ఆపరేటింగ్ సిస్టమ్స్ స్పెషలిస్ట్ హలహ్. ఇక షాపింగ్ మాల్స్‌లో మహిళలు క్యాషియర్లుగా కనిపించడం సాధారణ దృశమైంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్‌లో పబ్లిక్ నోటరీలుగా వందమంది మహిళలను నియమించారు. త్వరలో మహిళా జడ్జీల నియామకానికి సన్నాహాలు చేస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే వివిధ రంగాలలో మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. మహిళలపై పరిమితులు విధించే సంరక్షణ విధానానికి చెల్లుచీటి ఇచ్చింది ప్రభుత్వం. మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని కూడా పక్కన పెట్టింది. రాబోయే రోజుల్లో సౌదీ అరేబియాలో మరెన్ని మార్పులు జరగనున్నాయో వేచిచూద్దాం. -
హజ్ యాత్రికులకు జగన్ అభిమానుల సేవలు
మక్కా : ముస్లింల పవిత్ర హజ్‌యాత్ర ఆదివారం ప్రారంభమైంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షలకుపైగా ముస్లింలు సౌదీ అరేబియాకు చేరుకున్నారు. హజ్ యాత్రికులందరూ ఆదివారమే మక్కాలో ప్రార్థనలు చేసి అక్కడి నుండి అరాఫత్‌కు బయలుదేరారు. సోమవారం అరాఫత్‌లో బసచేసి ప్రార్థనల అనంతరం మంగళవారం ఉదయం ఈదుల్ అజ్ హా నమాజు తర్వాత మీనాకు చేరుకున్నారు. మీనాలో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో మూడు రోజులు బస చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. లక్షలాదిమంది ఒకే చోట చేరడంతో బస చేసే క్యాంపుల వద్ద జనప్రవాహ తాకిడికి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా సౌదీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. అదే విధంగా హజ్ యాత్రికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొన్ని సంఘాలు తమవంతుగా యాత్రికులకు సేవలందిస్తున్నాయి. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా ప్రవాసాంధ్రులు కూడా వాలంటీర్లుగా ఏర్పడి మీనాలో సేవ చేసేందుకు ముందుకొచ్చి, హాజ్ యాత్రికులకు సేవలందిస్తున్నారు. గతంలో ప్రజాసంకల్పయాత్ర సజావుగా సాగాలని మక్కాలో ప్రార్ధనలు చేసి, అక్కడి నుండి తెచ్చిన జమ్ జమ్ నీటిని, మసీదు జ్ఞాపికను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని పాదయాత్రలో కలిసి అందజేసిన గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన షేక్ సలీం తన మిత్రబృందంతో కలిసి హాజ్ యాత్రికులకు సేవలందిస్తున్నారు. హజ్ యాత్రకు వచ్చిన తెలుగువారిని కలుస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి షేక్ సలీం, అతని స్నేహితులు అందుబాటులో ఉంటున్నారు. ఈ సందర్భంగా షేక్ సలీం మాట్లాడుతూ.. ఇస్లాం ఐదు మూలస్థంబాలలో ఐదవదైన హజ్ యాత్ర చేయాడానికి వచ్చిన మన ప్రాంత ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రహదారులు మరిచిన వారికి తోడుగా ఉంటూ వారు బస చేసే క్యాంపునకు తీసుకువెళ్ళటం, అలసట బారిన పడిన వారికి మంచినీరు సదుపాయాలు సమకూర్చడం, నడవలేని వారికి వీల్ ఛైర్ తో వారి గమ్యస్థానలకు చేర్చి తమవంతుగా సహాయసహకారాలు అందిస్తున్నామన్నారు. హజ్ యాత్రలో అవలంబించాల్సిన పద్దతులు, అలవాట్లను యాత్రికులకు క్షుణ్ణంగా వివరించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సలీం మండిపడ్డారు. యాత్రలో కలిసిన గుంటూరు, కడప జిల్లాల వాసులు వారి ఆవేదనను తమతో పంచుకున్నారని తెలిపారు. రాష్ట్రం నుండి నేరుగా సౌదీకు చేరుకునే సదుపాయం కల్పించి ఉంటే హజ్ యాత్రికులకు కష్టాలు ఉండేవి కాదన్నారు. అలానే వరదలతో అస్తవ్యస్తమైన కేరళ ప్రజల కోసం ప్రార్ధించాలని హాజీలను కోరుతున్నామని సలీం తెలిపారు. నాలుగు రోజుల పాటు హాజ్ యాత్రికులకు సేవలందించేందుకు షేక్ సలీంతో పాటు, అబ్దుల్ హమీద్, షేక్ ఫరిద్, రఫీ, సయిద్, అలీమ్, మోయిన్, మోషిన్ తదితరులు అక్కడే ఉంటున్నారు. -
హజ్ యాత్రికుల సబ్సిడీ ఎత్తివేత
-
హజ్ యాత్రికులకు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : హజ్ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షాక్ ఇచ్చింది. హజ్ యాత్రికులకు అందిస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే 1.75 లక్షల మందిపై సబ్సిడీ భారం పడనుంది. ఇప్పటివరకూ హజ్ యాత్రకు వెళ్లేవారికి ప్రతి ఏటా రూ. 700 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ వచ్చింది. హజ్ యాత్రకు సబ్సిడీ నిలుపుదల వల్ల మిగిలే డబ్బును మైనార్టీ బాలికలు, మహిళల సంక్షేమానికి వినియోగిస్తామని నక్వీ పేర్కొన్నారు. హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీ ద్వారా ఏజెంట్లు మాత్రమే లాభపడుతున్నారని, ముస్లింలు లాభం పొందడం లేదని అన్నారు. -
హజ్ ఫీజు చెల్లింపునకు 19 తుది గడువు
– జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్‌ఖాన్ కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్ యాత్రికులు రెండో విడత ఫీజు చెల్లింపునకు ఈనెల 19వ తేదీ వరకు గడువు ఉంటుందని జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్‌ఖాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గ్రీన్ కేటగిరీ హజ్ యాత్రికులు రూ. 1,54,150 (ఖుర్బానీతో అయితే రూ. 1,62,150) చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే అజీజియా కేటగిరీలో రూ. 1,20,800 (ఖుర్బానీతో అయితే రూ. 1,28,800) చెల్లించాలన్నారు. జిల్లా హజ్ కమిటీ వారి వద్ద చలానా ఫారాలు తీసుకెళ్లి డబ్బును స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెల్లించాలని కోరారు. చలానా ఫారాలు పెద్దమార్కెట్ సమీపంలోని అబూబకర్ మసీదులో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు లభిస్తాయని తెలిపారు. -
హజ్‌యాత్ర పుణ్యకార్యం
– అల్హాజ్ ముఫ్తి అబ్దుర్‌రహిమాన్ – రాయలసీమ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్‌యాత్రికులకు శిక్షణ తరగతులు కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్‌యాత్ర పుణ్యకార్యమని దారుల్ ఉలూమ్ ఐనుల్ హుదా ప్రిన్సిపల్ అల్హాజ్ ముఫ్తి అబ్దుర్ రహిమాన్ సాహబ్ పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ మక్కాకు వెళ్లిరావాలని సూచించారు. రాయలసీమ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం హజ్ యాత్రికులకు స్థానిక మెరీడియన్ ఫంక్షన్ హాల్లో ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్ యాత్రలో చేసే దువా తప్పకుండా ఫలిస్తుందని, అక్కడ లోక కల్యాణం కోసం ప్రార్థించాలని సూచించారు. కార్యక్రమానికి రబ్బాని గోదాము అధినేత అల్హాజ్ తాటిపాడు మహబూబ్‌బాషా, మెరీడియన్ ఫంక్షన్ హాల్ అధినేత బషీర్‌అహ్మద్, మౌలానా సులేమాన్ నద్వి, చాంద్‌బాషా (గద్వాల), ముస్తాఖ్అహ్మద్ (ఆదోని) తదితరులు అతిథులుగా హాజరై మాట్లాడారు. -
1న హజ్ యాత్రికులకు శిక్షణ తరగతులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాయలసీమలోని హజ్ యాత్రికులకు ఈనెల 1వ తేదీన కర్నూలులో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు రాయలసీమ హజ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు జె.అబ్దుల్ రహిమాన్ ఖాన్, ఎం.మొహమ్మద్పాషా (రాష్ట్ర హజ్‌కమిటీ మాజీ సభ్యుడు) తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉల్మాయే ఇక్రామ్ల ద్వారా హజ్, ఉమ్రాలలో ఫరాయిజ్, వాజీబాత్ల గురించి క్షుణ్ణంగా తెలియజేస్తామన్నారు. శిక్షణ పొందాలుకునే హజ్ యాత్రికులు సోమవారం ఉదయం 9.30 గంటలకు బుధవారపేటలోని మెరీడియన్ ఫంక్షన్ హాల్‌కు హాజరు కావాలని కోరారు. యాత్రికులకు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
హజ్ దరఖాస్తుల పంపిణీ ప్రారంభం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్ దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం సోమవారం స్థానిక పెద్దమార్కెట్ సమీపంలోని అబూబకర్ సిద్ధీక్ మసీదులో ప్రారంభమైంది. హజ్ యాత్రికులు దరఖాస్తులో పొందు పరిచే వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తామని జిల్లా హజ్ సొసైటీ ఉపాధ్యక్షుడు మౌలానా జుబేర్ అహ్మద్ ఖాన్ రషాది పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సలీంఅహ్మద్, సంయుక్త కార్యదర్శి అష్వాక్ హుసేని, సభ్యులు అబ్దుల్సలాం, మునీర్ అహ్మద్‌తో పాటు ఎం.ఎ.సలాం, సయ్యద్ అబ్దుల్లా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి అబూబకర్ మసీదులో హజ్ దరఖాస్తుల స్వీకరణ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్‌యాత్ర–2017కు సంబంధించిన దరఖాస్తులను సోమవారం ఉదయం 11 గంటల నుంచి స్థానిక పెద్దమార్కెట్ సమీపంలోని అబూబకర్ సిద్దీఖ్ మసీదులో స్వీకరించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు పాస్‌పోర్టు, ఆధార్, బ్యాంకుఖాతా జిరాక్స్ కాపీలు, ఫొటోలు తీసుకోరావాలని జిల్లా హజ్ సొసైటీ కార్యదర్శి సలీంఅహ్మద్, సంయుక్త కార్యదర్శి అష్వాక్హుసేని ఆదివారం ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 99123 78586, 98662 86786 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
జిల్లా హజ్ సొసైటీకి రాష్ట్రస్థాయి బహుమతి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్ యాత్రికులకు శిక్షణ తరగతులు, దరఖాస్తుల స్వీకరణ, వ్యాక్సినేషన్ వంటి సేవలు అందిస్తున్న జిల్లా హజ్ సొసైటీకి రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి లభించింది. లభించింది. రాష్ట్ర హజ్ కమిటీ తరపున అందజేసిన ఈబహుమతిని ఇటీవల ఆసొసైటీ జిల్లా సంయుక్త కార్యదర్శి సయ్యద్ అష్వాక్ హుసేని విజయవాడలో అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యుడు అబ్దుస్సలాం కూడా పాల్గొన్నట్లు ఆష్వాక్ హుసేన్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. -
రేపటి నుంచి హజ్ దరఖాస్తుల స్వీకరణ
– రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు ఎం.మొహమ్మద్ పాషా వెల్లడి కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్ దరఖాస్తులను జనవరి 2 నుంచి ఆన్లైన్లో స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు ఎం.మొహమ్మద్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు నగర హజ్ యాత్రికులతో ఆదివారం.. కేవీఆర్ గార్డెన్స్‌లోని సూపర్ ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నామన్నారు. దరఖాస్తులకు రూ. 300 రిజిస్ట్రేషన్ ఫీజు, పాస్‌పోర్ట్ జిరాక్స్ కాపీ, ఆధార్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్టు ఫొటోలు జత చేయాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్లో స్వీకరించేందుకు నగరంలో 10 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంప్రదించాల్సిన చిరునామా.. ఫోన్ నంబర్ అల్ముజమ్మిల్ హజ్టూర్, యూకాన్ప్లాజా, కర్నూలు 94405 54142 అల్ఫరా హజ్టూర్, యూకాన్షాపీ, కర్నూలు 98494 65868 అల్ జమ్జమ్ హజ్, ఉమ్రా గ్రూప్, కర్నూలు 98661 19631 రాయలసీమ హజ్సొసైటీ, ఉస్మానియాకాలేజ్ రోడ్, కర్నూలు 99633 18255 దారుల్ ఉలూమ్ ఐనుల్హుదా, నందికొట్కూరు 94405 84775 షాలిమియ్య మసీద్, కర్నూలు 99481 07932 అల్హాజ్ మహబూబ్‌బాషా , డోన్ 97039 42049 నబీసాబ్, బిలాల్మసీద్, ఎమ్మిగనూరు 98855 85930 అల్హాజ్ హాఫిజ్ అబ్దుల్మజీద, యూనిక్ స్కూల్, కర్నూలు 70136 58051 అబ్దుల్సాహబ్, సూపర్ ఫంక్షన్ హాల్, కర్నూలు 94402 44399 -
నేడు మిలాదున్ నబీ
- ఉదయం 8.30 గంటలకు లతీఫ్‌లౌబాలి దర్గా నుంచి భారీ ర్యాలీ - 10.30 గంటలకు రాజ్‌విహార్ వద్ద మిలాదున్నబీ జులూస్ కర్నూలు(రాజ్‌విహార్): మహమ్మద్ ప్రవక్త (స.అ.వ) జన్మదినం సందర్భంగా నిర్వహించే పండుగ మిలాదున్ నబీ. ఈయన పుట్టకకు 50 రోజుల ముందు దుష్ట శక్తులు ఆయన తల్లి అమినాపై దాడి చేసేందుకు యత్నించగా అల్లాహ్ అనుగ్రహంతో ఆ దుష్ట శక్తులు నాశనం అయ్యాయని మౌలానా జాకీర్ తెలిపారు. ఈ ఘటన జరిగిన 50 రోజులకు ఇస్లామిక్ క్యాలెండరులోని రబ్బీవుల్ అవ్వల్ మాసంలో 12వ తేదీన ప్రవక్త జన్మించారని పేర్కొన్నారు. తర్వాత ఈయన ఇస్లాం మత వ్యాప్తితోపాటు అల్లాహ్ ఒకే దైవం అని, ఆయనకు సాటెవ్వరు లేరని బోధనలు చేశారు. కలిమా చదివి ఇమాన్ తీసుకున్న ప్రతి వ్యక్తి రోజుకు ఐదు పూటలా నమాజ్ చదవాలని, ప్రతి ఏటా రంజాన్ మాసంలో పవిత రోజాలు (ఉపవాసాలు) పాటించాలని, పేదలకు జకాత్ పేరుతో దానధర్మాలు చేయాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా పవిత్ర హజ్ యాత్రకు వెళ్లి రావాలని సూచించారు ప్రవక్త. దీంతో ప్రతీ ఏటా ఆయన జన్మదినాన్ని మిలాదున్ నబీగా ముస్లింలు పండుగ చేసుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ వేడుకలను కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించేందుకు లతీఫ్ లౌవుబాలి దర్గా పీఠాథిపతులు ఏర్పాట్లు చేశారు. 12వ తేదీ ఉదయం 10.30 గంటలకు మిలాదున్ నబీ జులూస్ (ఊరేగింపు) కార్యక్రమాన్ని రాజ్విహార్సెంటర్లో నిర్వహించనున్నారు. అంతకు ముందుగానే ఉదయం 8.30 గంటలకు హజరత్ లతీఫ్ లౌబాలి దర్గా నుంచి లాల్ మసీద్ రోడ్ మీలాద్ చౌక్, రాజ్‌విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఇందులో ఎంపీలు టీజీ వెంకటేష్, బుట్టారేణుక, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఎస్పీ ఆకే రవికృష్ణ, వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ పాల్గొననున్నారు. -
పవిత్ర యాత్ర మక్కా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మక్కా.. పవిత్రయాత్ర అని జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. అల్‌హరమైన్ హజ్, ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్రా యాత్రికులకు స్థానిక పెద్ద మార్కెట్ సమీపంలోని ఉర్దూ ఘర్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. నూర్ అహ్మద్ ఖాన్‌తో పాటు నాయబ్ ఖాజీ సలీం అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్‌కు వెళ్లాలని చెప్పారు. ఆ తర్వాత ఉమ్రా యాత్ర చేయాలన్నారు. సంస్థ ఎండీ ఎం.ఎ.ఆసిఫ్‌పాషా, సభ్యుడు ఎం.ఎ.ఆరిఫ్ మాట్లాడుతూ 49 మంది యాత్రికులతో ఈనెల 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్లైట్ బయలుదేరనున్నట్లు తెలిపారు. -
రేపే ఫ్లైటు.. వెళ్లే దారేదీ?
హజ్ యాత్రికుల కష్టాలు హైదరాబాద్‌కు బస్సులు, రైళ్లు కిటకిట సకాలంలో చేరుకోకుంటే విమానం మిస్సే సాక్షి,విజయవాడ: విజయవాడ నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఏడాదికి 250 మంది వరకు హజ్‌కు వెళ్తూ ఉంటారు. ఈ నెల 27వ తేది మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హజ్ వెళ్లే విమానం బయలుదేరుతుంది. హజ్ వెళ్లే యాత్రికులంతా గురువారం సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పుష్కరాలకు వచ్చిన భక్తులతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. దీంతో హైదరాబాద్‌కు వెళ్లేందుకు యాత్రికులకు చోటు లభించడం లేదని తెలిసింది. కొందరు సొంత, అద్దె వాహనాల్లో హైదరాబాద్‌కు వెళ్లిపోగా, స్తోమత లేనివారు అవస్థలు పడుతున్నారు. సహకారం.. సమాచారం కరువు ఇదిలా ఉండగా.. తొలిసారి హజ్‌కు వెళ్లేవారుకి అక్కడ సమాచారం, వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పేవారే కరువయ్యారు. గత ఏడాది మైనార్టీ నాయకులు కొంతమంది చొరవ చూపించి ఒక ప్రముఖ ట్రావెల్స్ ద్వారా హజ్ యాత్రికులు హైదరాబాద్ వెళ్లే తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సహకారం అందిస్తారని టీడీపీలోని ముస్లిం పెద్దలంతా పెట్టుకున్న ఆశ అడియాసే అయ్యింది. యాత్రికుల ఇబ్బందుల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు సొంతపనుల్లో నిమగ్నమయ్యారు. మరొకవైపు సమయం దగ్గరపడటంతో ఏం చేయాలో తెలియక హజ్యాత్రికలు గాభరా పడుతున్నారు. సకాలంలో హజ్ విమానం ఎక్కేందుకు ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. -
అదృష్టం.. హజ్‌యాత్ర భాగ్యం
– యాత్రికులకు అన్ని సదుపాయాలు – అదనపు కోటా వస్తే మరో 2వేల మందికి అవకాశం – రాష్ట్ర కమిటీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుసేన్ కర్నూలు(ఓల్డ్‌సిటీ): మహ్మద్ ప్రవక్త పుట్టి పెరిగిన ప్రాంతాన్ని సందర్శించే భాగ్యం కలగడం హజ్ యాత్రికుల అదష్టమని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుసేన్ అన్నారు. హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందన్నారు. స్థానిక ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాలులో రాయలసీమ హజ్ సొసైటీ, జిల్లా హజ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో హజ్ యాత్రికులకు ఉచిత వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించారు. ఆయనతో పాటు ప్రముఖ ముస్లిం నాయకుడు తాటిపాడు మాబ్బాషా ముఖ్యSఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర వి¿¶ జన తర్వాత ఏపీ ప్రభుత్వం విజయవాడ, కడప జిల్లాలో హజ్ హౌస్‌ల నిర్మాణం చేపడుతోందన్నారు. హజ్ యాత్రికుల మొదటి ఫై ్లట్ ఈ నెల 25 లేక 26వ తేదీన బయలుదేరుతుందన్నారు. ప్రభుత్వం అదనపు కోటా మంజూరు చేస్తే వెయిటింగ్ లిస్టులో ఉన్న మరో 2వేల మందికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాయలసీమ హజ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ రహ్మాన్ ఖాన్, ఎం.మొహ్మద్ పాషా, జిల్లా సొసైటీ అధ్యక్షుడు నూర్ అహ్మద్ ఖాన్, సొసైటీ సభ్యుడు ఉస్మాన్, నోబుల్ సర్వీసెస్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, ముఫ్తి అబ్దుర్రహ్మాన్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 70 ఏళ్లకు పైబడ్డ యాత్రికులకు అందని వ్యాక్సిన్ ఆదివారం ఈడెన్ గార్డెన్లో నిర్వహించిన శిబిరంలో 70 ఏళ్లకు లోపున్న హజ్ యాత్రికులకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ పైన వయసు వారికి ప్రత్యేక వ్యాక్సిన్ అవసరమవుతుంది. ఆ కోవకు చెందిన వ్యాక్సిన్ సరఫరా లేకపోవడంతో వారంతా వెనుదిరిగారు. -
రాష్ట్రం నుంచి హజ్‌యాత్రకు 2వేల మంది
నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం హజ్‌యాత్రకు 2వేల మంది ఎంపిక చేసిందని ఏపీ హజ్‌కమిటీ చైర్మన్ అహమ్మద్ హుసేన్ చెప్పారు. స్థానిక నేషనల్ పీజీ కాలేజీలో ప్రభుత్వం ఎంపిక చేసిన హజ్‌యాత్రలకు ఆదివారం నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 20 నుంచి 27వ తేదీ మధ్యలో 2వేల మంది హజ్‌కు బయల్దేరుతారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి మన రాష్ట్రంలోని విజయవాడ, కడప నుండే హజ్‌యాత్రలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ, కడపలలో హజ్‌హౌస్‌ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేశారని చెప్పారు. నేషనల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్అహమ్మద్ మాట్లాడుతూ.. హజ్‌యాత్రలకు వెళ్లేవారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. కర్నూలు నుంచి వచ్చిన అలిజనాబ్ హఫీజ్ అబ్దుల్‌మజీద్, ఆఫీసుజుబేర్ హజ్‌యాత్ర ప్రారంభం నుండి చివరి వరకు చేయాల్సిన ప్రార్థనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు ముఫ్తీ మహమ్మద్‌రఫీ, జమాతే అమీర్ఖరీమ్, నేషనల్ విద్యాసంస్థల ఏఓ రఫీఅహమ్మద్, లెక్చరర్లు అసదుల్లా, షబ్బీర్‌హుసేన్, జమాల్, ఆరీఫ్‌బాషా, ఫజిలుల్లాలు పాల్గొన్నారు. -
గర్భిణులకు హజ్ యాత్ర నిషేధం!
బారెల్లీ: సెంట్రల్ హజ్ కమిటీ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. హజ్ యాత్రకు నాలుగు నెలలు దాటిన గర్భిణిలు రాకూడదంటూ నిషేధం విధించింది. దరఖాస్తులు పెట్టుకునే సమయానికి గర్భం ధరించి ఉన్నవారు యాత్రను కొనసాగించేముందు ఆలోచించి అడుగు వెయ్యాలని హెచ్చరించింది. వాస్తవాన్ని దాచిపెట్టి హజ్ యాత్రను కొనసాగించినవారిని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించేది లేదని, అయితే విమానంలో మహిళలపై ఎటువంటి తనిఖీలు జరుపుతారన్న విషయంలో ఇంకా స్పష్టత లేదని హజ్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది హజ్ యాత్ర సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుందని బారెల్లీ హజ్ సేవా సమితి సెక్రెటరీ నజీమ్ బేగ్ తెలిపారు. అయితే కొత్తగా తీసుకున్న నిర్ణయాల మేరకు గర్భం దాల్చి నాలుగు నెలలు నిండిన వారిని తీర్థయాత్రకు అనుమతించేది లేదని, ఆ విషయాన్ని ధరఖాస్తు చేసుకునే ముందే మహిళలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ విషయం తెలియక యాత్రకు బయల్దేరినా వారు తనిఖీల్లో పట్టుబడితే వెనక్కు పంపించేస్తామని, ఎట్టిపరిస్థితిలో తీర్థయాత్రకు అనుమతించేంది లేదని స్సష్టం చేశారు. అంతేకాక వారి సీట్లను రద్దు చేసి డబ్బును వెనక్కు తిరిగి ఇచ్చేస్తామని హజ్ కమిటి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెహ్మాన్ తెలిపారు. హజ్ యాత్రలోని మొదటి ఐదు రోజులు మనుషుల్లో సహన శక్తికి, ఓర్పుకు పరీక్షలాంటిదని, వారిని ఒకచోటనుంచి మరోచోటకు త్వరితగతిన తరలించడం జరుగుతుంటుందని, యాత్రలో భాగంగా అక్కడి పుణ్య స్థలాల్లో ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని, అటువంటి సమయంలో గర్భిణుల ఆరోగ్యం, భద్రత కోసమే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు హజ్ కమిటి సెక్రెటరీ బేగ్ తెలిపారు. మరోవైపు యాత్రలో ఉండగా గర్భిణులకు నొప్పులు వస్తే హజ్ కమిటి ఆస్పత్రిలో చేర్పించి తమ ఖర్చులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందని, అందుకే అటువంటి మహిళల యాత్రపై నిషేధం విధించాల్సి వచ్చిందని, దీంతో వారిని ముందుగానే పరీక్షించేందుకు కోరుతున్నామని బేరెల్లీ హజ్ సేవా సమితి ప్రెసిడెంట్, బహేరీ ఎమ్మెల్యే అతౌర్ రెహ్మాన్ తెలిపారు. -
హజ్ యాత్రలో పెను విషాదం
♦ మినాలో తొక్కిసలాట.. 717 మంది మృతి ♦ 863 మందికి గాయాలు.. మృతుల్లో ఒక హైదరాబాద్ మహిళ సహా నలుగురు భారతీయులు మినా: సౌదీ అరేబియాలో కొనసాగుతున్న హజ్ యాత్రలో గురువారం పెను విషాదం చోటు చేసుకుంది. మినాలో జరిగిన ఘోర తొక్కిసలాటలో 717 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 863 మంది గాయపడ్డారు. మృతుల్లో.. నలుగురు భారతీయులు, 90 మంది ఇరాన్ పౌరులు సహా వివిధ దేశాలకు చెందిన హజ్ యాత్రికులు ఉన్నారు. తొక్కిసలాటకు కారణమేమిటనేది నిర్దిష్టంగా తెలియరాలేదు. అయితే.. మినాలో జమారత్ వద్ద ‘సైతానును రాళ్లతో కొట్టేందుకు’ భారీ సంఖ్యలో యాత్రికులు తోసుకోవటంతో ఈ తొక్కిసలాట సంభవించిందని.. జమారత్‌కు వెళ్లే దారిలో రెండు రోడ్ల కూడలి వద్ద ఈ దుర్ఘటన జరిగిందని ప్రభుత్వ సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఏటా పాల్గొనే హజ్ యాత్రలో తరచుగా తొక్కిసలాటల వంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. అయితే.. గురువారం నాటి దుర్ఘటన గత 25 సంవత్సరాల్లో రెండో పెద్ద దారుణం. ఈ ఏడాది హజ్ యాత్ర ఆరంభంలోనే.. రెండు వారాల కిందటే ఈ నెల 11వ తేదీన మక్కాలో ప్రధాన మసీదు వద్ద భారీ క్రేన్ కూలి 11 మంది భారతీయులు సహా 115 మంది హజ్ యాత్రికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో భారీ ఘోరం సంభవించటం ప్రపంచాన్ని విచారంలో ముంచింది. మక్కాకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని మినాలో.. భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. యాత్ర చివరి ఘట్టంలో ఘోరం: ఈ ఏడాది హజ్ యాత్ర మంగళవారం మొదలైంది. భారతదేశం నుంచి దాదాపు లక్షన్నర మంది సహా 20 లక్షల మందికి పైగా యాత్రికులు ఈ ఏడాది హజ్లో పాల్గొంటున్నారు. యాత్రికులు రెండు రోజుల కిందట మక్కా నుంచి హజ్ యాత్ర కోసం శిబిరాల నగరమైన మినాకు వచ్చారు. అక్కడ వారు రాత్రి పూట విశ్రమించేందుకు దాదాపు 1.60 లక్షల శిబిరాలను ఏర్పాటు చేశారు. దీనినిబట్టే యాత్రికుల వెల్లువ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహమ్మద్ ప్రవక్త దాదాపు 1400 సంవత్సరాల కిందట తుది హజ్ ధర్మోపదేశం ఇచ్చిన చోటు అయిన అరాఫాలో యాత్రికులు బుధవారం ప్రార్థనలు నిర్వహించి.. సైతానును రాళ్లతో కొట్టే కార్యక్రమంలో పాల్గొనేందుకు మళ్లీ మినాకు తిరిగివచ్చారు. హజ్ యాత్రలో ముఖ్యమైన ఘట్టాల్లో ఇదే చివరి ఘట్టం. జమారాత్ వంతెనగా పేర్కొనే ఐదంతస్తుల కట్టడం వద్ద ఈ మతవిశ్వాస ఆచారం పాటించటం జరుగుతోంది. ఇక్కడ సైతానుకు సంకేతంగా మూడు స్తూపాలు ఉంటాయి. కిలోమీటరు నిడివి ఉండే ఈ కట్టడం నుంచి గంటలో 3 లక్షల మంది ఆచారాన్ని పాటించేందుకు వీలు ఉంటుంది. రాళ్లు విసిరిన తర్వాత.. ప్రవక్త ఇబ్రహీం తన ఏకైక కుమారుడు ఇస్మాయిల్‌ను దేవునికి బలిచ్చేందుకు సంసిద్ధతను తెలిపే ఘటన కు స్మారకంగా యాత్రికులు జంతు బలి ఆచారాన్ని పాటిస్తారు. బలి విందు ఈద్-అల్-అదా అనంతరం యాత్ర ముగుస్తుంది. నిమిషాల్లోనే వందల మంది మృతి: ఈద్-అల్-అదా తొలి రోజు అయిన గురువారం నాడే మినాలో భారీ తొక్కిసలాట సంభవించింది. వేల సంఖ్యలో ఉన్న యాత్రికుల మధ్య ఒక్కసారిగా తోపులాటతో వందలాది మంది కిందపడిపోయారు. పెను విషాద ఘటన చోటుచేసుకోగానే సౌదీ భద్రతా సిబ్బంది, సహాయకులు నిమిషాల్లో రంగంలోకి దిగారు. కానీ అప్పటికే వందల మంది చనిపోయారు. ఘటనా స్థలంలో మృతదేహాలు కుప్పలుగా పడివుండగా.. గాయపడ్డవారు ఆ మృతదేహాల మధ్యనే కూలబడి కనిపించారు. మృతుల బంధువులు, గాయపడిన మహిళలు, వృద్ధులు ఆర్తనాదాలు చేస్తున్నారు. నాలుగు వేల మందికి పైగా సహాయక సిబ్బంది, 220 అంబులెన్స్‌ల్లో గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. కారణాలపై భిన్న కథనాలు: ఆఫ్రికా దేశాలకు చెందిన కొందరు యాత్రికుల వల్లే తొక్కిసలాట జరిగిందని సెంట్రల్ హజ్ కమిటీ అధిపతి ప్రిన్స్ ఖాలిద్ అల్-ఫైసల్ ఆరోపించినట్లు సౌదీ ప్రభుత్వానికి చెందిన అల్ అరేబియా టీవీ పేర్కొంది. అయితే.. జమారత్ స్తూపాల వద్దకు వెళ్లే రెండు మార్గాలను సౌదీ అధికారులు ఎందుకో మూసివేశారని.. దీంతో లక్షలాదిగా వస్తున్న యాత్రికులు ఒక్కచోట నిలిచిపోయి తొక్కిసలాట జరిగిందని.. ఇరాన్ హజ్ సంస్థ అధినేత సయ్యద్ ఒహాది ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థతో పేర్కొన్నారు. తొక్కిసలాట సరిగ్గా ఎక్కడ జరిగిందనే అంశంపైనా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. హజ్ ఆచారాల్లో భాగంగా ‘సైతానును రాళ్లతో కొట్టే’ ప్రాంతం వద్ద రద్దీలో ఈ తొక్కిసలాట జరిగిందని సౌదీ సర్కారు పేర్కొంటే.. తొక్కిసలాట జరిగింది అక్కడ కాదని.. యాత్రికుల శిబిరాల మధ్య 204 నంబరు మార్గంలో జరిగి యాత్రికులు చనిపోయారని అల్‌జజీరా టీవీ ప్రతినిధి చెప్పారు. తొక్కిసలాటపై దర్యాప్తునకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ నయేఫ్ ఆదేశించారు. ప్రణబ్, మోదీ సహా ప్రముఖుల సంతాపాలు.. హజ్ యాత్రలో భారీ తొక్కిసలాటలో వందలాది మంది యాత్రికులు చనిపోవటం పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలు గురువారం వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాగా పవిత్ర హజ్ యాత్ర సందర్భంగా మక్కాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. భారత్ నిరంతర పర్యవేక్షణ.. ఈ తొక్కిసలాటలో నలుగురు భారతీయులు చనిపోయినట్లు జెడ్డాలోని భారత దౌత్యకార్యాలయం పేర్కొంది. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ, ఒక వాలంటీర్, కేరళకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారని తెలిపింది. భారతీయ హజ్ కార్యక్రమ వైద్యులను మినా, మక్కాల్లోని అన్ని ఆస్పత్రులకూ పంపించామని.. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. మరోవైపు తెలంగాణ హజ్ కమిటీ ఆధ్వర్యంలో బయలుదేరిన యాత్రికులు మినా ఘటనలో గాయపడినట్లు సమాచారం లేదని కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్ వెల్లడించారు. హజ్ యాత్రికుల కోసం హెల్ప్లైన్లు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మక్కా దుర్ఘటనకు సంబంధించి సచివాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. 040-23214125కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్‌తోపాటు రాష్ట్ర హజ్ కమిటీ ఎప్పటికప్పుడు అక్కడి వివరాలను సేకరిస్తున్నారు. అటు హజ్హౌస్లోనూ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ యాత్రికులకు 040-23214193, ఏపీ యాత్రికులకు 040-23298793 నెంబర్ల ను కేటాయించారు. అదేవిధంగా కేంద్ర హజ్ కమిటీ 022-22717100/101/102 నంబర్లతో, సౌదీ లోని భారత దౌత్యకార్యాలయం భారతదేశం నుంచి ఫోన్ చేసే వారి కోసం 00966125458000, 00966125496000 నంబర్లతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. అలాగే సౌదీ నుంచి ఫోన్ చేసే భారతీయ యాత్రికుల కోసం 8002477786 నంబరుతో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఎల్బీనగర్ వాసి మృతి హైదరాబాద్: మక్కాలో జరిగిన తోక్కిసలాటలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నివాసి బీబీజాన్ (62)అనే మహిళ మృతి చెందా రు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన షేక్ మజీద్, ఆయన భార్య బీబీజాన్ 25 ఏళ్ల కిందట ఎల్బీనగర్కు నివాసం వచ్చారు. ఆయన తన భార్య బీబీజాన్, బీహెచ్‌ఇఎల్‌లో నివసిస్తున్న తన సోదరుడు షేక్ రవూఫ్, అతని భార్య షహనాజ్‌లు కలిసి ఈ నెల 2న హజ్ యాత్రకు వెళ్లారు. గురువారం ఉదయం మినాలో సైతాన్‌పై రాళ్లు వేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు జరిగిన తొక్కిసలాటలో బీబీజాన్ మృతిచెందారు. ఆమె మృతి వార్తను మజీద్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు గతంలో జరిగిన ప్రమాదాలు జూలై 2, 1990: మక్కా నుంచి మీనాకు వెళ్లే దారిలో పాదచారుల సొరంగ మార్గంలో తొక్కిసలాట. 1,426 మంది మృతి. వీరిలో ఎక్కువ మంది మలేసియా, ఇండోనేషియా, పాకిస్తాన్ పౌరులున్నారు. మే 23, 1994: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 270 మంది మృతి. ఏప్రిల్ 9, 1998: జమారత్ వంతెనపై ప్రమాదం 118 మంది మృతి మార్చి 5, 2001: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 35 మంది మృతి. ఫిబ్రవరి 11, 2003: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 14 మంది మృతి. ఫిబ్రవరి 1, 2004: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 251 మంది మృతి. జనవరి 12, 2006: హజ్ చివరి రోజున సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 346 మంది మృతి సెప్టెంబర్ 11, 2015: క్రేన్ కుప్పకూలి 111 మంది మృతి. 394మందికి గాయాలు. సెప్టెంబర్ 24, 2015: జమారత్ వంతెనపై తొక్కిసలాట. 717 మంది మృతి. 500 మందికి గాయాలు.హజ్ యాత్ర అంటే.. ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా నగరానికి తీర్థయాత్ర చేయటం.. ఇస్లాంలో ముఖ్యంగా అయిదు ఆచరణీయ అంశాలను మూలస్తంభాలుగా విశ్వసిస్తారు. మత విశ్వాసము, నిత్య ప్రార్థనలు, దయ, రంజాన్ మాస ఉపవాసము, జీవితంలో ఒకసారి మక్కా యాత్ర అన్నవి ఇస్లాంలో ప్రతి ఒక్కరు ప్రధానంగా ఆచరించాల్సిన అంశాలు. హజ్ యాత్ర(మక్కా తీర్థయాత్ర) ఇందులో అయిదవది. షియాలు, సున్నీలు అంతా ఆచరించే అంశాలు ఇవి. ఇందులో హజ్ యాత్ర చాలా ముఖ్యమైంది. ఇస్లాం కేలండర్లోని 12వ నెల జుల్ హిజా(బక్రీద్ నెల)లో హజ్ యాత్ర చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది ముస్లింలు ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ యాత్రను ముస్లింలు చాలా నిష్టగా చేయాల్సి ఉంటుంది. ఈ యాత్ర చేసేందుకు అనేక ఆంక్షలను కూడా ఇస్లాం విధించింది. అప్పులు ఉన్న వాళ్లు కానీ, వడ్డీలు, దానధర్మాల ద్వారా వచ్చిన డబ్బులతో కానీ, కుటుంబ బాధ్యతలను పూర్తిగా తీర్చని వాళ్లు, పెళ్లి కాని కూతుళ్లు ఉన్న వాళ్లు, అనారోగ్యంతో ఉన్న వాళ్లు హజ్ యాత్ర చేయటానికి అనర్హులని ఇస్లాం చెప్తోంది. హజ్ యాత్ర చేయటంలో మక్కాకు చేరుకున్న తరువాత పాటించాల్సిన పద్ధతులు కూడా కఠినంగానే ఉంటాయి. హజ్ యాత్రలో ప్రధానంగా పాటించే ఆచారాలు 1. ఉమ్రా(యాత్ర) చేసేందుకు ఇహ్రాం చేరుకోవాలి. 2. కాబా చుట్టూ అపసవ్య దిశలో ఏడు ప్రదక్షిణలు(తవాఫ్ అల్ ఉమ్రా) చేయాలి 3. సఫా, మార్వా కొండల మధ్య 7 సార్లు ప్రయాణించాలి 4. క్షవరం చేయించుకోవటం ద్వారా ఉమ్రాను పూర్తి చేయాలి 5. జుల్హిజా మాసం 8వ రోజున హజ్ నిర్వహించటానికి ఇహ్రాం చేరుకోవాలి 6. మక్కాకు అయిదు కిలోమీటర్ల దూరంలోని మీనా చేరుకుని అక్కడ కేటాయించిన టెంట్లో ఒక పగలు, ఒక రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. 7. 9వరోజున అరాఫా ఎడారి మైదాన ప్రాంతంలో మధ్యాహ్న వేళ ప్రార్థనలు చేయాలి. 8. 9వ రోజు రాత్రి ముజ్ద్ అలీఫా చేరుకుని అవసరమైన రాళ్లను సేకరించుకోవాలి. అక్కడి ఇసుక తిన్నెలపై రాత్రి నిద్రపోవాలి 9. 10వ రోజు ఉదయం తిరిగి మీనాలోని శిబిరానికి చేరుకోవాలి. 10. పవిత్రమైన త్యాగం నిర్వహించాలి(జంతుబలి) 11. మరోసారి క్షవరం చేసుకోవాలి. 12. తరువాత తవాఫ్ అల్ జియారా (ప్రదక్షిణ) నిర్వహించి తిరిగి మీనాలోని శిబిరానికి చేరుకోవాలి 13. 11వ రోజున మూడు జమారత్‌ల దగ్గర రాళ్లు విసిరి, మీనాలోని శిబిరానికి చేరుకోవాలి 14. 12వ రోజున మూడు జమారత్‌ల దగ్గర రాళ్లు విసిరి సూర్యాస్తమయం కాకముందే మీనా శిబిరాన్ని విడిచి వెళ్లిపోవాలి 15. మక్కాను విడిచి వెళ్లే ముందు తవాఫ్ అల్వదా నిర్వహించాలి. -
717 దాటిన మృతుల సంఖ్య
రియాద్: మక్కాలో జరిగిన హజ్ యాత్రికుల తొక్కిసలాట ప్రమాదంలో మృతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అంతకుముందు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 453 ఉండగా అనూహ్యంగా 717 దాటింది. ఇక గాయపడిన వారు కూడా అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారు అంతకుముందు అందిన సమాచారం ప్రకారం 500మందికి పైగా ఉన్నట్లు తెలియగా గాయపడినవారి సంఖ్య తాజాగా 750 దాటినట్లు అధికార వర్గల సమాచారం. మక్కాలో గురువారం మరో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది. 15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. గతంలో మక్కాలో మసీదు మరమ్మతుల సందర్భంగా భారీ క్రేన్ కూలి 107 మంది చనిపోయిన విషయం తెలిసిందే. -
గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య
-
మక్కా మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారా?
తిరువనంతపురం: పెను విషాదాన్ని నింపిన మక్కా తొక్కిసలాటలో భారతీయులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేరళ, లక్షద్వీప్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళిన యాత్రికులు గాయపడినట్లు సమాచారం. తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గాయపడ్డాడా లేక ఆ తొక్కిసలాటలో చనిపోయాడా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాలా తెలిపారు. అయితే లక్షద్వీప్‌కు చెందిన ఓ వ్యక్తి గాయపడినట్లు తమకు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 310 మంది ఈ ఘోరకలిలో ప్రాణాలు కోల్పోగా, మరో 450మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ ప్రదేశమంతా బాధితుల ఆర్తనాదాలతో మార్మోగుతున్నట్టుగా సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధుల హాహాకారాలు రికార్డ్ అయినట్లు సమాచారం. దీంతో భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లినవారి ఆచూకీ కోసం వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి బాధితులను తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సివిల్ డిఫెన్స్ అథారిటీ ప్రకటించింది. సుమారు నాలుగువేల మంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది. కాగా ముస్లింలు పవిత్రంగా భావించే ఈ హజ్ యాత్రకు భారత నుంచి లక్షలాదిమంది ముస్లింలు మక్కాకు తరలి వెళ్లడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం సుమారు లక్షా 36 వేల మంది యాత్రికులు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది. -
గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య
రియాద్: మక్కాలో గురువారం జరిగిన పెను విషాదంలో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 310కి చేరింది. తొలుత 150మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం ప్రకటించగా ఆ తర్వాత నుంచి ఆసంఖ్య వేగంగా పెరిగింది. ఆ వెంటనే 220 తర్వాత 310 ఇలా భారీ స్థాయిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కాగా గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం.. వారిలో చాలామంది తీవ్రంగా గాయపడటంతో మృతులు పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది. 15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. ఈ నెల 12వ తేదీన మక్కాలో మసీదు మరమ్మతుల సందర్భంగా భారీ క్రేన్ కూలి 107 మంది చనిపోయిన విషయం తెలిసిందే. -
సుమారు లక్షమందికి హజ్ యాత్రికులకు నో ఎంట్రీ!
రియాద్: సరైన అనుమతి లేని హజ్ యాత్రికులు మక్కాలోకి ప్రవేశించకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధాజ్క్షల్ని జారీ చేసింది. సుమారు 98 వేల మంది యాత్రికులకు సరియైన అనుమతి పత్రాలు లేవని సౌదీ అరేబియా గుర్తించింది. హజ్ యాత్రకు సంబంధించిన నియమ, నిబంధనల్ని ఉల్లంఘించిన 85 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మక్కా నగరంలోకి ప్రవేశించే ప్రధాన రహదారులు, ఇతర చెక్ పాయింట్ల వద్ద మక్కా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ అబ్దుల్లా భారీ బందోబస్తు విధించారు. గత సంవత్సరం అనుమతి లేని 4 వేల మందిని అడ్డకున్నట్టు సమాచారం. అనుమతుల్లేకుండా ప్రవేశిస్తే దేశ బహిష్కరణతోపాటు, పదేళ్ల నిషేధాన్ని కూడా విధిస్తామన్నారు. -
హజ్ యాత్రకు ‘రూపాయి’ దెబ్బ!
దుబాయ్: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ పతనం ప్రభావం పవిత్ర హజ్ యాత్రపైనా పడింది. దీనికితోడు మక్కాలో ఈ ఏడాది హజ్ యాత్రికులకు మౌలిక వసతుల ఏర్పాట్ల ఖర్చు కూడా పెరగడంతో యాత్ర వ్యయం భారీగా పెరిగింది. ఈ కారణంగా ఈ ఏడాది ఇప్పటికే వందలాది మంది భారత ముస్లింలు హజ్‌ను రద్దు చేసుకున్నట్లు దుబాయ్‌కు చెందిన అరబ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సెంట్రల్ హజ్ కమిటీ (సీహెచ్‌సీ) ద్వారా యాత్రకు ఎంపికైన 400 మంది యాత్రికులు యాత్రను రద్దు చేసుకున్నట్లు చెప్పింది. భారత్ నుంచి ఈ ఏడాది మొత్తం 1,36,020 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లాల్సి ఉంది. యాత్రికులకు మక్కాలో రెండు రకాల వసతి సౌకర్యం ఉంది. చవకైన అజీజియా ఒకటికాగా ఖరీదైన గ్రీన్ కేటగిరీ మరొకటి. అజీజియా విభాగం కింద గత ఏడాది యాత్రికులు ఒక్కొక్కరూ రూ. 1,36,264 చెల్లించగా ఈసారి ఆ ఖర్చు 1,49,450కి పెరిగింది. అలాగే గ్రీన్ కేటగిరీలో గత ఏడాది రూ. 1,64,905 ఉండగా ఈసారి అది రూ.1,79,800కు పెరిగింది. మరోవైపు సబ్సిడీ విమాన ప్రయాణ చార్జీలు కూడా భారీగా పెరిగాయి. గత ఏడాది ఎయిర్ ఇండియా రూ. 20 వేలు వసూలు చేయగా ఈ ఏడాది ఆ చార్జీ రూ. 28 వేలకు పెరిగింది.