హజ్‌ ఫీజు చెల్లింపునకు 19 తుది గడువు | haj fee should paid within 19th | Sakshi
Sakshi News home page

హజ్‌ ఫీజు చెల్లింపునకు 19 తుది గడువు

Published Mon, Jun 5 2017 12:27 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

హజ్‌ యాత్రికులు రెండో విడత ఫీజు చెల్లింపునకు ఈనెల 19వ తేదీ వరకు గడువు ఉంటుందని జిల్లా హజ్‌ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్‌ఖాన్‌ వెల్లడించారు.

– జిల్లా హజ్‌ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్‌ఖాన్‌ 
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్‌ యాత్రికులు రెండో విడత ఫీజు చెల్లింపునకు ఈనెల 19వ తేదీ వరకు గడువు ఉంటుందని జిల్లా హజ్‌ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్‌ఖాన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గ్రీన్‌ కేటగిరీ హజ్‌ యాత్రికులు రూ. 1,54,150 (ఖుర్బానీతో అయితే రూ. 1,62,150)  చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే అజీజియా కేటగిరీలో రూ. 1,20,800 (ఖుర్బానీతో అయితే రూ. 1,28,800) చెల్లించాలన్నారు. జిల్లా హజ్‌ కమిటీ వారి వద్ద చలానా ఫారాలు తీసుకెళ్లి డబ్బును స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో చెల్లించాలని కోరారు. చలానా ఫారాలు పెద్దమార్కెట్‌ సమీపంలోని అబూబకర్‌ మసీదులో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు లభిస్తాయని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement