జిల్లా హజ్ సొసైటీకి రాష్ట్రస్థాయి బహుమతి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్ యాత్రికులకు శిక్షణ తరగతులు, దరఖాస్తుల స్వీకరణ, వ్యాక్సినేషన్ వంటి సేవలు అందిస్తున్న జిల్లా హజ్ సొసైటీకి రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి లభించింది. లభించింది. రాష్ట్ర హజ్ కమిటీ తరపున అందజేసిన ఈబహుమతిని ఇటీవల ఆసొసైటీ జిల్లా సంయుక్త కార్యదర్శి సయ్యద్ అష్వాక్ హుసేని విజయవాడలో అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యుడు అబ్దుస్సలాం కూడా పాల్గొన్నట్లు ఆష్వాక్ హుసేన్ ఆదివారం ప్రకటనలో తెలిపారు.