హజ్ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షాక్ ఇచ్చింది. హజ్ యాత్రికులకు అందిస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ ప్రకటించారు. దీంతో ఏటా హజ్ యాత్రకు వెళ్లే 1.75 లక్షల మందిపై సబ్సిడీ భారం పడనుంది.