భారతీయ ఉద్యోగిని కాల్చి చంపిన యజమాని కుమారుడు
Published Sun, May 25 2014 3:19 PM | Last Updated on Mon, Aug 20 2018 7:34 PM
మక్కా: యజమాని కుమారుడు ఓ ఉద్యోగిని కాల్చి చంపిన సంఘటన సౌదీ ఆరేబియాలోని మక్కాలో సంచలనం రేపింది. వారం రోజుల క్రితం డ్రైవర్ ఉద్యోగంలో చేరిన కేరళవాసి అనాస్ పుదవ్విలికల్వీ అనే 24 ఏళ్ల యువకుడిని యజమాని కుమారుడే కాల్చి చంపినట్టు మక్కా పోలీస్ అధికారి ఆతీ అల్ ఖురేషీ వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన డ్రైవర్ చికిత్స పొందుతూ శనివారం మరణించినట్టు పోలీసులు తెలిపారు.
శుక్రవారం రాత్రి యజమాని కుటుంబంతో ఓ కార్యక్రమానికి హాజరై మక్కాకు చేరుకున్నారని.. ఆతర్వాత ఇలాంటి దారుణ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే హత్యకు కారణాలు తెలియరాలేదని.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement