ప్రపంచ ప్రసిద్ధమైనవి... | World famous ... | Sakshi
Sakshi News home page

ప్రపంచ ప్రసిద్ధమైనవి...

Published Fri, Jul 4 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

ప్రపంచ ప్రసిద్ధమైనవి...

ప్రపంచ ప్రసిద్ధమైనవి...

ముస్లింల ప్రార్థనా స్థలాలుగా పేరుపొందినవి మస్జిద్‌లు. మనదేశంలోనే కాదు  ప్రపంచమంతటా అత్యుద్భుతమైన, ఆకర్షణీయమైన మస్జిద్‌లు ఎన్నో ఉన్నాయి.  వాటిలో ప్రపంచప్రఖ్యాతి పొందిన కొన్ని మస్జిద్‌లు...
 
అల్-హరామ్: మక్కా, సౌదీ అరేబియా
ప్రపంచంలోనే అతి పెద్ద మస్జిద్‌లలో మక్కా ముందు వరస లో ఉంది. ఈ మస్జిద్ బయట నిర్మాణం అత్యద్భుతం అనిపిస్తే, లోపల గోడల దర్శనం అదృష్టంగా భావిస్తారు ముస్లిమ్‌లు. ఇస్లామ్ మత పద్ధతులకు అనుగుణంగా నిర్మించిన ఈ కట్టడం ఏడాది పొడవునా ఉండే అందం రమదాన్ నెలలో రెట్టింపు అవుతుంది.
 
అల్-నబావీ: మదీనా, సౌదీ అరేబియా
ఇస్లామ్‌లోని రెండవ అతిపవిత్రమైన నగరం మదీనా. మహమ్మద్ సమాధి గల నగరంగానూ మదీనా వెలుగొందుతోంది. ఈ నగరంలోనే మక్కా తర్వాత ప్రపంచంలో అతి పెద్ద మస్జిద్ అల్-నబావీ రెండవస్థానాన్ని ఆక్రమించింది. 12వ శతాబ్ధంలో నిర్మించిన ఈ కట్టడం సౌదీ అరేబియాకు పశ్చిమాన ఉంది. ఈ మస్జిద్ మూల నిర్మాణ నమూనానే ప్రపంచంలోని మస్జిద్‌లలో ఉపయోగించారు. ఖర్జూరపు చెట్ల కాండాలను, మట్టిని ఉపయోగించి ఈ మస్జిద్ గోడలు నిర్మించారని చెబుతారు.
 
అల్ అక్సా: జెరూసలెం
ఇస్లామ్‌ల మూడవ అతిపెద్ద పవిత్ర క్షేత్రంగా జెరూసలెంలోని అల్ అక్సా మస్జిద్ పేరు పొందింది. ఇస్త్రా, మేరాజ్ కోసం మహమ్మద్ ప్రవక్త బయల్దేరింది ఈ మస్జిద్ నుంచేనని ముస్లిమ్‌ల విశ్వాసం. నిజానికి ఇది కొన్ని మస్జిద్‌ల సమూహం. మక్కానగరంలోని కాబా గృహం ఖిబ్లాగా ప్రకటించబడటానికి ముందు ఈ మస్జిద్ ఎ అక్సా మొదటి ఖిబ్లాగా వ్యవహరింపబడేది.
 
ఫైజల్ మస్జిద్: పాకిస్తాన్
ఇస్లామాబాద్‌లో ఉన్న ఫైజల్ మస్జిద్ దక్షిణ ఆసియాలోనే అతి పెద్దది. 1993కు ముందు ప్రపంచంలోని అతిపెద్ద మస్జిద్‌లలో నాలుగవ స్థానంలో ఉంది. 1990కి ముందు మక్కాలోని అల్-హరామ్, మదీనాలోని అల్-నబావి మస్జిద్‌ల తర్వాత ఫైజల్ మస్జిద్ అతి పెద్ద మస్జిద్‌లలో స్థానం ఉంది.
 
జహీర్ మస్జిద్: మలేషియా
మలేషియాలోని కెడా రాష్ట్రంలో సుల్తాన్ దాజుద్దిన్ ముకర్రమ్ షా కుమారుడు టున్‌కూ మహమ్మద్ 1912లో ఈ మస్జిద్‌ను నిర్మించాడు. ఇది మలేషియాలోనే అతి ప్రాచీనమైన కట్టడం. ఐదు అతి పెద్ద బురుజులు, ఐదు మినార్‌లతో ఈ మస్జిద్ విలసిల్లుతోంది.
 
బైతుల్ ముకర్రమ్ మస్జిద్: బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ జాతీయ మస్జిద్‌గా పేరున్న బైతుల్ ముకర్రమ్ ఢాకా రాజధానిలో ఉంది. 1960లో ఈ మస్జిద్ నిర్మాణం పూర్తయ్యింది. 30 వేల మంది ఒకేసారి నమాజు చేసుకునే సామర్థ్యం గల ఈ మస్జిద్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన మస్జిద్‌లలో పేరెన్నికగన్నది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement