న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశానికి చేరుతున్న తరుణంలో దుబాయ్‌కు జాక్ పాట్ తగిలింది. సౌదీ అరేబియా పశ్చిమ భాగంలోని మదీనాలో భారీ ఎత్తున బంగారం, రాగి ధాతువు నిక్షేపాలను గుర్తించినట్టు సౌదీ ఆరేబియా ప్రకటించింది. సౌదీ జియోలాజికల్ సర్వే మదీనా ప్రాంతంలోని అబా అల్-రాహా సరిహద్దుల్లో బంగారు ఖనిజాన్ని కనుగొన్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మదీనాలోని వాడి అల్-ఫరా ప్రాంతంలోని అల్-మాదిక్ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాలలో రాగి ఖనిజాన్ని కనుగొన్నట్లు వారు తెలిపారు.
కొత్త మైనింగ్ ప్రాంతాల వల్ల సుమారు 533 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఆకర్షించవచ్చు అని, దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా సౌదీ అరేబియాలో దాదాపు 5,300 మినరల్ లొకేషన్‌లు ఉన్నాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీజ్ బిన్ లాబోన్ గత జనవరిలో తెలిపారు, వీటిలో విభిన్నమైన మెటల్ ,నాన్-మెటల్ శిలలు, నిర్మాణ వస్తువులు, అలంకరణ శిలలు , రత్నాలు ఉన్నాయన్నారు.తాజా ఆవిష్కరణలతో, ప్రపంచ దేశాలనుంచి ఆశాజనకమైన పెట్టుబడి అవకాశాలు రానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు..
కాగా సౌదీ అరేబియాలో భూగర్భ బంగారం నిల్వలు 323.7 టన్నులుగా అంచనా. వార్షిక రాగి, జింక్ ఫాస్ఫేట్ల ఉత్పత్తి 68,000 టన్నులు, 24.6 మిలియన్ టన్నులుగా ఉంటుంది అక్కడి ప్రభుత్వ అంచనా.
Comments
Please login to add a commentAdd a comment