copper
-
గిన్నె చూపించి.. రూ.25 లక్షలు స్వాహా!
సాక్షి, హైదరాబాద్: గతంలో రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్ చేతిలో మోసపోయిన ముగ్గురు వ్యక్తులు మోసగాళ్ల అవతారం ఎత్తారు. వీళ్లూ వరుసపెట్టి మోసాలు చేయడం ప్రారంభించారు. రూ.2500 విలువ చేసే రాగి గిన్నెకు అతీంద్రియశక్తులున్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు కాజేశారు. మరో రూ.23 లక్షలు స్వాహా చేయడానికి ప్రయత్నిస్తుండగా ఉత్తర మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. రైస్ పుల్లర్లుగా పిలిచే ఇరీడియం నాణేల పేరుతో మోసం చేసే ముఠాలు గతంలో అనేకం ఉండేవి. 2015లో ఇలాంటి ఓ గ్యాంగ్ బారినపడిన స్నేహితులు ఓల్డ్ అల్వాల్ వాసి పి.శివసంతోష్ కుమార్, ఏపీలోని పలమనేరుకు చెందిన జి.మంజునాథ్‌రెడ్డి, బెంగళూరు వాసి ప్రతాప్ ఎస్సార్ రూ.5 లక్షలు నష్టపోయారు. దీంతో తామూ అదే పంథాలో మోసాలు చేయాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు. మంజునాథ్‌రెడ్డి రాగి గిన్నెను కొని తన వద్ద ఉంచుకున్నాడు. దీనికోసం ఓ గాజు బాక్సు, చుట్టూ ధర్మకోల్ షీట్లు పెట్టి అదేదో అద్భుత వస్తువు అన్నట్లు రూపొందించాడు. నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ తనకు పరిచయమైన వారితో రైస్ పుల్లర్స్ పేరుతో ఎర వేసేవాడు. అతీంద్రియశక్తులు ఉన్న ఈ గిన్నెలు ఎవరి వద్ద ఉంటే వాళ్లు కోటీశ్వరులు అవుతారని, వివిధ రకాలైన ప్రయోగాల్లో వినియోగించే ఆ గిన్నెలకు భారీ రేటు ఉంటుందని నమ్మించేవాడు. ఇలానే ఇతడికి సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన శశికాంత్‌ను నమ్మబలికాడు. ఆ పాత్రను రూ.10 కోట్లకు ఖరీదు చేయడానికి అంతర్జాతీయ సంస్థ అయిన అప్రెచెస్ అండ్ రీసెర్చ్ సిద్ధంగా ఉందని చెప్పాడు. సికింద్రాబాద్‌లోని ఓ హోటల్ వద్ద శశికాంత్‌ను కలిసిన శివ సంతోష్ తాను సదరు కంపెనీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. బెంగళూరులోని డీఆర్డీఓ నుంచి స్కానింగ్ మిషన్ తీసుకువచి్చ, ఈ పాత్రను స్కానింగ్ చేయించి, సైంటిస్టు నుంచి సర్టిఫికెట్ పొందాలని చెప్పాడు. అప్పుడు రంగంలోకి దిగిన ప్రతాప్ డీఆర్డీఓలో పని చేసే సైంటిస్ట్ రవీంద్ర ప్రసాద్‌గా శశికాంత్‌కు పరిచయం అయ్యాడు. స్కానింగ్, సరి్టఫికేషన్ కోసం రూ.25 లక్షలు ఖర్చవుతాయని చెప్పాడు. ఇలా ముగ్గురి మాటలు నమ్మిన బాధితుడు ఈ నెల 6న వారికి రూ.25 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ స్కానింగ్ మిషన్ తీసుకురాని మంజునాథ్ కాలయాపన చేస్తూ వచ్చాడు. అదేమిటంటూ నిదీయగా... మరో రూ.23 లక్షలు అవసరమని చెప్పాడు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మార్కెట్ ఠాణాలో కేసు నమోదైంది. వీరి వ్యవహారంపై నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో రంగంలోకి దిగిన ఎస్సైలు పి.గగన్‌దీప్, శ్రీనివాసులు దాసు వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.25 లక్షల నగదు, రాగి గిన్నె తదితరాలు స్వా«దీనం చేసుకున్నారు. 2016 నుంచి ఈ తరహా మోసాలు చేస్తున్న ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు దాదాపు రూ.10 కోట్లు కాజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎవరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయకపోవడం వీరికి కలిసి వచ్చింది. -
శ్రావణమాసం : రాగి, ఇత్తడి, పూజా పాత్రలు తళ తళలాడాలంటే, చిట్కాలివిగో!
శ్రావణమాసంలో కొత్త పెళ్లికూతుళ్లు మాత్రమే కాదు, ప్రతి ఇల్లు అందంగా ముస్తాబవుతుంది. ముత్తయిదువులందరూ ఇంటి అందాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా అలంకరించిని ఇంట్లో స్వయంగా ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. ఇంటిని పూలతోరణాలు, మామిడాకులతో అందంగా తీర్చిదిద్దుదాం. ఇంట్లో పూజ గది నుండి వంటగది వరకు ప్రతిదీ శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే అలంకరణ నిమిత్తం ఇంటి ముందు, వసారాలో పెద్ద పెద్ద ఇత్తడి పాత్రలను, దీపపు కుందులను అమర్చుతారు. ఆరోగ్యంపై పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో ఇత్తడి, రాగి , కంచు పాత్రల వాడకం బాగా పెరిగింది.చింతపండు:ఇత్తడి, రాగి పాత్రల మురికి వదిలించాలంటే అందరికీ గుర్తొచ్చేది చింతపండు గుజ్జు. చింతపండుతో, ఆ తరువాత మట్టితో తోమడం పెద్దల నాటినుంచి వస్తున్నదే. చింతపండును నీళ్లలో నానబెట్టి ఆ గుజ్జుతో రుద్దితే ఇత్తడి సామానులకు పట్టిన మకిలి, చిలుము అంతా పోయి గిన్నెలు మెరుస్తాయి. నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు. వీటిని ఆరనిచ్చి మెత్తని గుడ్డతో తుడిచి ఎండలో కాసేపు ఆరనివ్వాలి.వంట సోడా: రాగి, ఇత్తడి మెరిసేలా చేయడానికి దానిపై బేకింగ్ సోడా, సబ్బును అప్లయ్ చేయాలి. ఆ తరువాత శుభ్రంగా తోమాలి. గోధుమ పిండి: గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, టీస్పూన్ వైట్ వెనిగర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి. తరువాత ఈ పేస్ట్‌ను ఇత్తడి లేదా రాగి పాత్రలపై అప్లై చేసి, కాసేపు అలాగే ఉంచండి. స్క్రబ్బింగ్, క్లీనింగ్ తర్వాత అది మెరుస్తుంది.వెనిగర్: ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి, పాలిష్ చేయడానికి వైట్ వెనిగర్ ఒక అద్భుతంగా పని చేస్తుంది. గ్లాసు నీటిలో రెండు చెంచాల వెనిగర్ ఉడికించింది. దీనికి లిక్విడ్ డిష్ వాషర్ కానీ, విమ్ పౌడర్ గానీ మిక్స్ చేసి తోమి కడిగితే, పూజా వస్తువులు మెరుస్తాయి.నిమ్మ ఉప్పు: ఇత్తడి పాత్రలు కొత్తవిలా మెరిసిపోయేలా చేయడానికి నిమ్మ ఉప్పు ఉపయోగించండి. నిమ్మరసం, ఉప్పు కలపడం ద్వారా ఒక ద్రావణాన్ని సిద్ధం చేసి, దానిని ఇత్తడి పాన్‌కు అప్లై చేసి పాన్‌ను రుద్దండి. ఇలా చేయడం వల్ల ఇత్తడిపై నలుపు పోయి, ఇత్తడి పాత్రలు మెరుస్తాయి.పీతాంబరీ: ఇత్తడి, రాగి పాత్రలను శుభ్రం చేయడానికి పీతాంబరిమరో బెస్ట్ ఆప్షన్. బాగా కడిగిన మెత్తటి గుడ్డతోతుడిచి ఆరనివ్వాలి. -
అదానీ గ్రూప్ ప్రపంచ అతిపెద్ద కాపర్ ప్లాంట్
గుజరాత్‌లోని ముంద్రాలో అదానీ గ్రూప్ భారీ కాపర్ ప్లాంటు తొలి దశను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే సింగిల్ లొకేషన్లో ఏర్పాటైన అతి పెద్ద కాపర్ తయారీ కర్మాగారంగా నిలవనుంది. దీనితో దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కొంత తగ్గనుంది. అంబుజాలో అదానీ వాటా అప్ రూ. 6,661 కోట్ల పెట్టుబడులు డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా అంబుజా సిమెంట్స్‌లో వాటాను పెంచుకుంది. 21.2 కోట్ల వారంట్లను ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసుకోవడం ద్వారా 3.6 శాతం అదనపు వాటాను పొందింది. ఇందుకు రూ. 6,661 కోట్లు వెచ్చించగా.. ప్రస్తుతం అంబుజాలో అదానీ వాటా 66.7 శాతానికి చేరింది. దేశీయంగా సిమెంట్ తయారీలో రెండో పెద్ద కంపెనీగా నిలుస్తున్న అంబుజాలో ప్రమోటర్ సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ షేరుకి రూ. 314.15 సగటు ధరలో వారంట్లను మార్పిడి చేసుకుంది. ఇంతక్రితం 2022 అక్టోబర్‌లోనూ ప్రమోటర్ సంస్థ వారంట్లను అందుకోవడం ద్వారా రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా హార్మోనియాకు 47.74 కోట్ల మార్పిడికి వీలయ్యే వారంట్లను అంబుజా సిమెంట్స్ జారీ చేసింది. -
రూ.10 వేలకోట్లతో అదానీ కాపర్‌ప్లాంట్..
గుజరాత్‌లోని ముంద్రాలో అదానీ గ్రూప్ 1.2 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10వేలకోట్లు)తో గ్రీన్‌ఫీల్డ్ కాపర్ ఫెసిలిటీని ప్రారంభించనుంది. మొదటిదశలో ఏటా 5 లక్షల టన్నుల సామర్థ్యంతో దీన్ని రూపొందించనున్నట్లు సమాచారం. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ బంగారం, వెండి, నికెల్, సెలీనియంకు సంబంధించిన ఉప ఉత్పత్తులతో పాటు కాపర్ కేథోడ్‌లు, రాడ్లను తయారుచేయనున్నారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌తో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కూడా తయారుచేయనున్నారు. ఈ మిశ్రమం ఎరువులు, డిటర్జెంట్లు, ఫార్మాస్యూటికల్స్, పేపర్, షుగర్ బ్లీచింగ్, వాటర్ ట్రీట్మెంట్తోపాటు ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కాపర్‌ను విద్యుత్ పరికరాల ఉత్పత్తికి, పవర్ ట్రాన్స్మిషన్, పునరుత్పాదక ఇంధన రంగానికి విరివిగా వాడుతారు. దాంతో భవిష్యత్తులో కాపర్‌కు చాలా డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. కానీ దేశంలో దాని నిలువలు పరిమితంగానే ఉన్నాయి. అదానీ ప్లాంట్ ఉత్పత్తులు తయారీ ప్రారంభిస్తే దేశ కాపర్ దిగుమతులు తగ్గుతాయని, గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ కావడంలో సాయపడుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అతిపెద్ద సింగిల్ లొకేషన్ ప్లాంట్‌ను 2029 మార్చి నాటికి పూర్తి చేయాలని అదానీ గ్రూప్ చూస్తోంది. రెండు దశల్లో ప్లాంట్ పూర్తకానుండగా, మొదటి దశలో ఏడాదికి 5 లక్షల టన్నుల కెపాసిటీతో అందుబాటులోకి రానుంది. ఈ కాపర్ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి కచ్ కాపర్ లిమిటెడ్ (కేసీఎల్) పేరుతో ఓ సబ్సిడరీ కంపెనీని అదానీ గ్రూప్ ఏర్పాటు చేసింది.ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి అదానీ గ్రూప్ బ్యాంక్‌ల నుంచి అప్పు పొందింది. కాగా, 2022 ఏప్రిల్ – 2023 మార్చి మధ్య 1,81,000 టన్నుల ముడి కాపర్ మెటీరియల్‌ను దిగుమతి చేసుకుంది. 2027 నాటికి దేశంలో 7,50,000 టన్నుల కాపర్ అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశీయంగా హిందాల్కో వంటి కంపెనీలు కాపర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న పేటీఎం షేర్.. అసలేం జరుగుతోందంటే.. పారిశ్రామికంగా వినియోగించే లోహాల్లో స్టీల్, అల్యూమినియం తర్వాత స్థానంలో రాగి ఉంటుంది. భారతదేశంలో లోహల పరంగా తలసరి వినియోగం కేవలం 0.6 కిలోలు. అదే ప్రపంచ సగటు 3.2 కిలోలుగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దేశంలోని రాగి ఎగుమతులు ఇటీవల క్షీణించాయని కచ్ కాపర్ దీన్ని భర్తీ చేస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాపర్ ప్లాంట్ ఉప ఉత్పత్తులను తమ గ్రూప్ సంస్థ అదానీ సిమెంట్స్ వినియోగించుకోగలదని కంపెనీ తెలిసింది. -
రాగితో చౌకగా క్యాన్సర్ మందులు తయారు చేయొచ్చు: సైంటిస్టులు
ఆరోగ్యపరంగా రాగి లోహానికి ఉన్న ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో రాగిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు రాగిని ఉపయోగించి క్యాన్సర్ డ్రగ్స్ మెడిసిన్స్‌ను చవకగా తయారు చేయొచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ సైంటస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధరణంగా క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు తయారు చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ. 2 లక్షల 60 వేలకు పైగా ఖర్చు అయితే, రాగిని ఉపయోగించి మెడిసిన్స్ చేయడం వల్ల ఒక గ్రాముకు కేవలం రూ. 250 రూపాయలే అవుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో తేల్చారు. దీని వల్ల భవిష్యత్తులో చవకగా ఔషధాలు తయారు చేసేందుకు మార్గం సుగుమం అయ్యింది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. మనిషి మొదటగా కనుక్కొని వాడిన లోహం రాగి. కొన్ని వేల ఏళ్లుగా మనం రాగి వస్తువులను, రాగి పాత్రలను వాడుతూనే ఉన్నాం. దీన్ని తామ్రము అని, క్యూప్రమ్ అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్రలను వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే రుజువైంది. నీటిలో ఉండే బాక్టీరియాను నశింపజేసే శక్తి కూడా రాగికి ఉందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. రాగి లోహాలను వాడటం వల్ల అనేక రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా,చవకగా దొరికే లోహాల్లో రాగి ఒకటి. దీనికి ఉండే ఔషధ గుణాల రీత్యా క్యాన్సర్ చికిత్సలోనూ వాడేందుకు అనువుగా ఉందని ప్రొఫెసర్ ఓహ్యున్ క్వాన్ అన్నారు. క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా వాడే మందుల తయారీకి ఒక గ్రాముకు రూ. 2లక్షల 60 వేల(3వేల డాలర్లు)ఖర్చవగా, రాగిని ఉపయోగించి అదే ఔషధాన్ని తయారు చేసేందుకు కేవలం రూ.250 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా క్యాన్సర్ వ్యతిరేక c-Jun N- టెర్మినల్ కినేస్ ఇన్హిబిటర్ను కేవలం మూడు దశల్లోనే ఉత్పత్తి చేయగలిగారు. సాధారణంగా దీనికి 12 రసాయనిక చర్యలు అవసరం అవుతాయి. ఇందులో అడెనోసిన్, N6-మిథైలాడెనోసిన్ను సులువుగా అమైన్గా మార్చగలదు. కణాలు, వ్యాధి ప్రక్రియలు మరియు అభివృద్ధిలో జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఈ అమైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతమున్న క్యాన్సర్ చికిత్సలో దీన్ని ఉత్పత్తి చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ.8వేల 500($103)కు పైగా ఖర్చవుతుంది. అదే రాగిని ఉపయోగించడం వల్ల చాలా చవకగా ఔషధాలను తయారు చేయొచ్చని, భవిష్యత్తులో ఈ పద్దతి మరింత సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
రాగిపాత్రల్లో ఈ పానీయాలను అస్సలు తాగొద్దు!
రాగి గిన్నెల్లో నీరు తాగడం మంచిదని, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెగ వాడేస్తుంటారు. రాగి పాత్రలో తినడం కూడా మంచిదే కానీ కొన్నింటికి దీన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. కేవలం కొన్ని పదార్థాలకే పరిమితం. భోజనానికి కూడా రాగి ప్లేట్లు వాడుతుంటారు. కానీ కొన్ని రకాలు పులుపు వంటి పదార్థాలు రాగి గిన్నెలో తినకపోవటమే మంచిది. ముఖ్యంగా పెరుగు లాంటివి తింటే చాలా ప్రమాదం. అసలు రాగి పాత్రలో ఎలాంటి పదార్థాలు ఎలాంటి పానీయాలు తాగకూడాదో చూద్దామా! ముఖ్యంగా మామిడికాయ, పచ్చళ్లు, జామ్‌లు ఎప్పుడు రాగిపాత్రల్లో తినకూడదు, భద్రపరచకూడదు. ఈ ఆహారాలతో రాగి రియాక్షన్ చెందుతుంది. తత్ఫలితంగా వికారం లేదా వాంతులు వంటివి రావొచ్చు. లేదా పాయిజనింగ్‌కి దారితీయొచ్చు. ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం, తేనె కలుపుకుని తాగే అలవాటు ఉంటుంది చాలమందికి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. అయితే ఇలాంటి పానీయాలు కూడా రాగి గిన్నెల్లో తాగకపోవడమే మంచిది. ఎందుకంటే నిమ్మకాయలోని ఆమ్లం రాగితో చర్య పొంది కడుపు నొప్పి, గ్యాస్, వాంతులు సంబంధిత సమ్యలు తలెత్తుతాయి. అలాగే రాగి పళ్లెంలో అన్నం తినేటప్పుడు పెరుగు అన్నం అస్సలు తినొద్దు. పెరుగులోని గుణాలు రాగితో ప్రతిస్పందిస్తాయి దీంతో జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఇక ఇతర పాల ఉత్పత్తులను రాగి పాత్రలో ఉంచడం కూడా హానికరమే. పాలలోని ఖనిజాలు విటమిన్లలు రాగితో రియాక్షన్ చెంది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అవుతుంది. (చదవండి: రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్!) -
ఏటా 10లక్షల టన్నుల సామర్థ్యంతో అదానీ కాపర్ ఫెసిలిటీ
గుజరాత్‌లోని ముంద్రాలో అదానీ గ్రూప్ 1.1 బిలియన్ డాలర్లతో గ్రీన్‌ఫీల్డ్ కాపర్ ఫెసిలిటీని మార్చి 2024లో ప్రారంభించనుంది. ఏటా 10లక్షల టన్నుల సామర్థ్యంతో దీన్ని రూపొందిచనున్నట్లు సమాచారం. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ బంగారం, వెండి, నికెల్, సెలీనియంకు సంబంధించిన ఉప ఉత్పత్తులతో పాటు కాపర్ కేథోడ్‌లు, రాడ్లను ఉత్పత్తి చేయనుంది. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌తో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కూడా తయారుచేయనున్నారు. ఈ మిశ్రమం ఎరువులు, డిటర్జెంట్లు, ఫార్మాస్యూటికల్స్, పేపర్, షుగర్ బ్లీచింగ్, వాటర్ ట్రీట్మెంట్తోపాటు ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కాపర్‌ను విద్యుత్ పరికరాల ఉత్పత్తికి, పవర్ ట్రాన్స్మిషన్, పునరుత్పాదక ఇంధన రంగానికి విరివిగా వాడుతారు. దాంతొ భవిష్యత్తులో కాపర్‌కు చాలా డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. కానీ దేశంలో దాని నిలువలు పరిమితంగానే ఉన్నాయి. దేశీయ కంపెనీలు దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఈ ప్లాంట్‌కు సంబంధించిన ముడిసరుకును లాటిన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. ఇప్పటికే దేశీయంగా హిందాల్కో వంటి కంపెనీలు కాపర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. పారిశ్రామికంగా వినియోగించే లోహాల్లో స్టీల్, అల్యూమినియం తర్వాత స్థానంలో రాగి ఉంటుంది. భారతదేశంలో లోహల పరంగా తలసరి వినియోగం కేవలం 0.6 కిలోలు. అదే ప్రపంచ సగటు 3.2 కిలోలుగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దేశంలోని రాగి ఎగుమతులు ఇటీవల క్షీణించాయని కచ్ కాపర్ దీన్ని భర్తీ చేస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాపర్ ప్లాంట్ ఉప ఉత్పత్తులను తమ గ్రూప్ సంస్థ అదానీ సిమెంట్స్ వినియోగించుకోగలదని కంపెనీ తెలిపింది. -
ఎక్స్‌ట్రూజన్‌పై హిందాల్కో దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ రవాణా వ్యాగన్లు, కోచ్‌ల తయారీకి వీలుగా ఎక్స్‌ట్రూజన్ సౌకర్యాలపై పెట్టుబడులకు సిద్ధపడుతోంది. దీంతోపాటు కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లపై మొత్తం రూ. 4,000 కోట్లవరకూ వెచి్చంచేందుకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తాజాగా పేర్కొన్నారు. ప్రధానంగా వందే భారత్ రైళ్ల కోచ్‌లకోసం ఎక్స్‌ట్రూజన్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు మరో రూ. 2,000 కోట్లు పెట్టుబడులు కేటాయించనున్నట్లు కంపెనీ 64వ వార్షిక వాటాదారుల సమావేశం(ఏజీఎం)లో తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే అధిక వేగం, అధిక లోడ్‌కు వీలున్న పూర్తి అల్యూమినియంతో తయారయ్యే తేలికపాటి రేక్‌ల నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఇక సిమెంట్ బ్యాగులు, ఆహారధాన్యాలు తదితరాల కోసం మరో మూడు డిజైన్లతో రవాణా వ్యాగన్లను రూపొందించేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇతర సంస్థల సహకారంతో బ్యాటరీ ఎన్‌క్లోజర్స్, మోటార్ హౌసింగ్స్ తదితర కీలక విడిభాగాల తయారీ, అభివృద్ధిని చేపట్టనున్నట్లు బిర్లా వివరించారు. -
సింగరేణికి దొంగల బెడద..
కరీంనగర్: సింగరేణి రామగుండం రీజియన్ ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని ఓసీపీల్లో ఉన్న కాపర్ కేబుళ్లే లక్ష్యంగా దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. గతంలో స్క్రాప్ యార్డులపై కన్నేసిన దొంగలు అందినకాడికి ఎత్తుకెళ్లి, అక్రమ మార్గాన విక్రయించి, సొమ్ము చేసుకునేవారు. చోరీలను నివారించేందుకు యాజమాన్యం స్క్రాప్ యార్డులు, గనుల వద్ద సెక్క్యూరిటీ పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. స్క్రాప్ నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఈ చోరీలు తగ్గిపోయాయి. అంతేకాకుండా స్క్రాప్ చోరీలవల్ల ప్రయాస ఎక్కువగా ఉండటం, లాభాలు కూడా తక్కువగా ఉండటంతో దొంగలు తమ రూట్ మార్చారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వచ్చే కాపర్ కేబుళ్లపై కన్నేశారు. భారీ యంత్రాల పవర్ కేబుళ్లు చోరీ వర్షాకాలం కావడంతో ఓసీపీ క్వారీలోని పనిస్థలాల వద్దకు సెక్యూరిటీ సిబ్బంది, సింగరేణి అధికారులు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇదు అదనుగా దొంగలు రెచ్చి పోతున్నారు. విద్యుత్‌తో నడిచే భారీ యంత్రాలకు ఉన్న పెద్ద కాపర్ కేబుళ్లను కట్ చేసుకొని, ఎత్తుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో హెచ్‌టీ లైన్ విద్యుత్ సరఫరా ఉండగానే పెద్ద గొడ్డళ్లతో కేబుళ్లను నరికి, క్షణాల్లో వాహనంలో వేసుకొని, పరారవుతున్నారు. దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టంతోపాటు యంత్రానికి విద్యుత్ లేక పని నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దొరికినా చర్యలు లేవు దొంగతనాలు జరిగిన కొన్ని సందర్భాల్లో దొంగలు రెడ్‌హ్యాండెడ్‌గా సెక్యూరిటీ సిబ్బందికి దొరికినా సరైన చర్యలు లేకపోవడంతో ముఠాలు రెచ్చిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సింగరేణి సంస్థకు, పోలీసు శాఖకు మధ్య సరైన సమన్వయం లేక దొంగలు తిరిగి అదే పనికి అలవాటు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. స్క్రాప్, కాపర్ కేబుళ్ల ముఠాల వివరాలు, విషయాలు తెలిసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయడంతో సింగరేణిలో చోరీలకు అడ్డుకట్ట పడటం లేదన్న ఆరోపణలున్నాయి. ఇంటి దొంగల అండతోనే! ఇంటి దొంగల అండతో కాపర్ కేబుళ్ల చోరీ ముఠాలు రెచ్చిపోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఎంతో కొంత ముట్టజెప్పి, చోరీ సమయంలో సహకరించాలని కోరడంతో కొందరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే స్టోర్స్‌లోని 600 మీటర్ల కాపర్ కేబుల్ దొంగతనం జరిగిందని పలువురు అంటున్నారు. దీనిపై కొందరికి సస్పెండ్ కమ్ పెండింగ్ ఎంకై ్వరీ పెట్టి, విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
రాగి బాటిల్లో నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఈమధ్య యోగా, ఫిట్నెస్, ఆయుర్వేదం వంటివాటిపై అవగాహన పెరిగింది. ప్లాస్టిక్ అతిగా వాడితే మంచిది కాదని, స్టీల్, గాజు, రాగ్రి పాత్రల్లో నీళ్లు తాగేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. రాగిలో శుద్దీకరణ లక్షణాలు ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాగి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రాగి చెంబులో నీళ్లు నిలువ చేసి పరగడుపున త్రాగడం వల్ల కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి.రాగి పాత్రలోని నీరు తాగితే కలిగే ప్రయోజనాలే కాదు.. వాటితో వచ్చే ప్రమాదాలను కూడా తెలుసుకోవడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. రాగి పాత్రల్లో సరైన పద్దతిలో నీళ్లు తాగితేనే అది శరీరానికి మేలు చేస్తుందని, ప్రతిరోజూ రాగి బాటిల్లో నీళ్లు తాగాలనుకునేవాళ్లు కశ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. రాగినీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: ► రాగిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపులో హానికరమైన బ్యాక్టీరియా, మంటను సమర్థవంతంగా ఎదుర్కోగలవు. ► రాగి బాటిల్స్‌లో నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేస్తుంది. ► హైపర్ టెన్షన్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. రాగి నీళ్లు కొలెస్ట్రాల్‌ని తగ్గించగలదు. ► ఫలితంగా రాగి సీసాలోని నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు, అల్సర్లు, అజీర్ణం సమర్ధవంతంగా తగ్గుతాయి. ► కిడ్నీ, కాలేయం పనితీరును మెరుగుపర్చడంలో రాగి సహాయపడుతుంది. ► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ► ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ రాగినీళ్లను తాగితే రిలీఫ్ కలుగుతుంది. ► రాగి పాత్రలను నిత్యం ఉపయోగించడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. రాగి నీళ్లు తాగుతున్నారా? ఇవి గుర్తుపెట్టుకోండి ♦ రాగి బాటిల్లో ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు నీళ్లను నిల్వ చేయరాదు. ♦ రాత్రి నిల్వ చేసిన నీళ్లను పరగడుపున తాగితే చాలా మంచిది. దీని వల్ల కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. ♦ నిపుణుల సూచనల ప్రకారం రాగి బాటిల్స్‌ను ఫ్రిడ్జ్‌లో అస్సలు నిల్వ చేయరాదు.దీనివల్ల రాగి ప్రయోజనాలు శరీరానికి ఏమాత్రం అందవు. ♦ రాగి పాత్రలో నీళ్లు తాగితే మంచిది కదా అని రోజంతా అవే నీళ్లు తాగొద్దు. దీనివల్ల కాపర్ టాక్సిసిటీ అయ్యే ప్రమాదం ఉందట. ఫలితంగా వికారం, కడుపునొప్పి వంటివి వచ్చే అవకాశం ఉందట. ♦ రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లను వేటితోనూ మిక్స్ చేయొద్దు. పరగడుపున రాగి నీళ్లు తీసుకునేటప్పుడు కొందరు నిమ్మరసంతో కలిసి తాగేస్తున్నారు. కానీ ఇలా అస్సలు చేయకండి. ఎందుకంటే నిమ్మరసంలోని యాసిడ్ కాపర్‌తో రియాక్ట్ అయి ఎసిడిటీ, వాంతులు వచ్చే అవకాశం ఉంది. -
173 కేసుల్లో నిందితులు.. పోలీసులు పక్కా స్కెచ్.. చివరికి..
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్ఫార్మర్ల కాపర్ కాయిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ఏడు మంది ముఠా సభ్యులను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 కిలోల కాపర్ కాయిల్స్, టాటా ఇండికా కారు, బజాజ్ పల్సర్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ కమీషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధి సీసీఎస్ క్రైం డీసీపీ మధుకర్ స్వామి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తన బృందంతో నెల రోజుల పాటు శ్రమించి మూడు నాలుగు కమిషనరేట్‌లో పరిధిలో 173 కేసుల్లో ప్రమేయం ఉన్న ఏడు మంది దొంగల గ్యాగ్ ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రధానంగా ఈ ముఠా దొంగలించిన సొత్తు చిన్నది కావచ్చు కానీ ప్రభుత్వానికి, ప్రజలకు చాలా నష్టం చేకురుస్తుందని డీసీపీ తెలిపారు. ఏడుగురు నిందితులు చేసిన దొంగతనాలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 60, సైబరాబాద్ పరిధిలో 7, వికారాబాద్‌లో 68,సంగారెడ్డి జిల్లాలో 20, సిద్దిపేట జిల్లాలో 22 మొత్తం ఈ ముఠా 306 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసినట్టు సీపీ వివరించారు. చదవండి: 3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో.. ప్రధాన నిందితుడు సహదేవ్ హిజ్రా, అభిమన్యు రాజ్ బార్, నందులాల్ రాజ్ బార్, రాహుల్ రాజ్ బార్, రాంచందర్, కుర్వ చిన్న నర్సింహులు, ఉట్టల మహేష్, తులుగు రమణ రెడ్డి, రాంజానీ జయశ్రీలను అరెస్ట్ చేయగా, రాహుల్ రాజ్ బార్, రాంచందర్ కుర్వ చిన్న నర్సింహులు, ఉట్టల మహేష్ పరారీలో ఉనట్లు సీపీ తెలిపారు. నెల రోజులు కష్టపడి కేసును చేధించిన అధికారులను సీపీ అభినందించారు. -
మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్.. ఇంకా..
Summer Health Tips: అసలే ఎండాకాలం.. దాహం వేస్తుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడంటే కావలసినప్పుడల్లా నీళ్లు తాగుతుంటాం. మరి బయటికి వెళ్లేటప్పుడు? అందులో ఆలోచించేదేముంది... ఒక వాటర్ బాటిల్ తీసుకెళతాం.. అంతేకదా అని సింపుల్‌గా చెప్పేస్తాం. అయితే ఆ బాటిల్ దేనితో తయారు చేసింది... అంటే నూటికి తొంభై పాళ్లు ‘ప్లాస్టిక్ బాటిల్’ అనే సమాధానం వస్తుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎంత ఉపయోగమో, ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగడం అంత ప్రమాదం. అది ఎండాకాలం అయితే కనక ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ ఏమిటా నష్టాలు అంటారా? అదే చూద్దాం.. ప్లాస్టిక్ వాడకం ఎందుకంటే! ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు అని పదే పదే చెబుతున్నా కూడా ప్లాస్టిక్ ఇంకా వాడకంలోనే ఉండటానికి కారణం ఏమిటంటే, దానిని క్యారీ చేయడం చాలా సులువు. నిర్వహించడం ఇంకా సులువు. ఒకవేళ ఎక్కడైనా పెట్టి మరచిపోయినా పెద్ద ఖరీదు ఉండదు కాబట్టి దిగులు పడనక్కరలేదు. అందువల్ల పర్యావరణ ప్రేమికులు ఎంతగా నెత్తీ నోరు బాదుకుంటున్నా, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే విషయంలో వెనకబడవలసి వస్తోంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా, భారీ ప్లాస్టిక్ కంటైనర్లు అయినా వాటి నుంచి నీరు తాగడం ప్రమాదకరం. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీటిని అసలు తాగకూడదు. పరిశోధన ప్రకారం.. ►ప్లాస్టిక్ బాటిల్స్ మీద ఎండ పడితే.. అవి మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ నీటిని తాగితే.. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడే.. ఎండోక్రైన్ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఇలాంటి నీటిని ఎక్కువగా తీసుకుంటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయాన్ని కూడా పాడు చేస్తుంది. ►ఎండలో ఉండే.. ప్లాస్టిక్ బాటిల్ నుంచి డయాక్సిన్ లాంటి టాక్సిన్ నీటిలోకి విడుదల అవుతుంది. ఈ డయాక్సిన్ నీటిని తాగితే.. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగితే.. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మగవారిలో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గవచ్చు. ►బాటిల్ వాటర్‌లో మైక్రో ప్లాస్టిక్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ►మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే పొత్తి కడుపునకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యం, పీసీఓఎస్, ఒవేరియన్ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు రావొచ్చు. ►ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లకు ఎండ తగిలితే.. అస్సలే తాగొద్దు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను కొంతమంది అలానే ఉపయోగిస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. ఇది ఇంకా అపాయకరమైనది. ఇలా అస్సలు చేయొద్దు ఎప్పుడూ. ఏం చేయాలి మరి? ►ప్లాస్టిక్ బాటిల్స్ అంతగా వాడుకలోకి రాని రోజుల్లో పెద్దవాళ్లు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు స్టీలు లేదా ఇత్తడి మరచెంబులు తీసుకు వెళ్లేవారు. ఇప్పుడు కూడా అదే మంచిది. అందుకు తగ్గట్టు ఇప్పుడు మార్కెట్లో రకరకాల సైజుల్లో, ఆకారాలలో రాగి, స్టీలు, ఇత్తడి బాటిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాస్తంత ఖరీదు ఎక్కువైనా, ప్లాస్టిక్ వాడకం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో పోల్చుకుంటే ఫరవాలేదనిపిస్తుంది. ►ప్లాంట్ బేస్డ్ బాటిల్స్, గాజుసీసాలు, అల్యూమినియం వాటర్ క్యాన్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మనం వాడకం మొదలు పెడితే ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. చదవండి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా.. -
సౌదీలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు
న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశానికి చేరుతున్న తరుణంలో దుబాయ్‌కు జాక్ పాట్ తగిలింది. సౌదీ అరేబియా పశ్చిమ భాగంలోని మదీనాలో భారీ ఎత్తున బంగారం, రాగి ధాతువు నిక్షేపాలను గుర్తించినట్టు సౌదీ ఆరేబియా ప్రకటించింది. సౌదీ జియోలాజికల్ సర్వే మదీనా ప్రాంతంలోని అబా అల్-రాహా సరిహద్దుల్లో బంగారు ఖనిజాన్ని కనుగొన్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మదీనాలోని వాడి అల్-ఫరా ప్రాంతంలోని అల్-మాదిక్ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాలలో రాగి ఖనిజాన్ని కనుగొన్నట్లు వారు తెలిపారు. కొత్త మైనింగ్ ప్రాంతాల వల్ల సుమారు 533 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఆకర్షించవచ్చు అని, దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా సౌదీ అరేబియాలో దాదాపు 5,300 మినరల్ లొకేషన్లు ఉన్నాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీజ్ బిన్ లాబోన్ గత జనవరిలో తెలిపారు, వీటిలో విభిన్నమైన మెటల్ ,నాన్-మెటల్ శిలలు, నిర్మాణ వస్తువులు, అలంకరణ శిలలు , రత్నాలు ఉన్నాయన్నారు.తాజా ఆవిష్కరణలతో, ప్రపంచ దేశాలనుంచి ఆశాజనకమైన పెట్టుబడి అవకాశాలు రానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.. కాగా సౌదీ అరేబియాలో భూగర్భ బంగారం నిల్వలు 323.7 టన్నులుగా అంచనా. వార్షిక రాగి, జింక్ ఫాస్ఫేట్ల ఉత్పత్తి 68,000 టన్నులు, 24.6 మిలియన్ టన్నులుగా ఉంటుంది అక్కడి ప్రభుత్వ అంచనా. -
అదానీ కాపర్ యూనిట్‌కు రూ,6,071 కోట్ల రుణం
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కాపర్ తయారీ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం ఎస్బీఐ సహా ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.6,071 కోట్ల రుణాన్ని సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఏడాదికి మిలియన్ టన్నుల కాపర్ తయా రీ యూనిట్‌ను గుజరాత్‌లోని ముంద్రాలో, అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ ‘కుచ్ కాపర్ లిమిటెడ్’ ఏర్పాటు చేయనుంది. రెండు దశల్లో గ్రీన్‌ఫీల్డ్ కాపర్ రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. ఇందులో భాగంగా 0.5 మిలియన్ టన్నులతో కూడిన మొదటి దశకు సిండికేటెడ్ క్లబ్ లోన్ రూపంలో ఫైనాన్షియల్ క్లోజర్ (రుణ ఒప్పందాలు) పూర్తయినట్టు తెలిపింది. ఎస్ బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం (బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, పీఎన్బీ, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర)తో ఒప్పందం చేసుకున్న ట్టు ప్రకటించింది. ప్రాజెక్టు తొలి దశ 2024లో మొదలవుతుందని అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ వినయ్ ప్రకాశ్ తెలిపారు. ‘‘ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ రిఫైనరీ కాంప్లెక్స్‌ల్లో ఒకటి అవుతుంది. బెంచ్‌మార్క్ ఈఎస్జీ (పర్యావరణ అను కూల) పనితీరు ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, డిజిటైజేషన్‌తో ఉంటుంది’’ అని చెప్పారు. -
పోలీస్ కమాండ్ కంట్రోల్ భవన్ లో భారీ చోరీ
-
ఉదయగిరి కొండల్లో బంగారు, రాగి నిక్షేపాలు
సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): మండలంలోని మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్ క్వార్ట్›్జ నిక్షేపాలు వెలుగులో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అన్వేషణ సాగించి గుర్తించి ముమ్మరంగా డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్ నిర్వహించి కొండలో ఎంత మేర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కొంత కాలంగా డ్రిల్లింగ్ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొండపై ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1000 అడుగుల మేర డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు అందజేశారు. ఈ ప్రాంతంలో సుమారు రెండు వేల హెక్టార్లకు పైగా భూముల్లో బంగారు, రాగి, వైట్‌క్వార్‌ట్ట్జ నిక్షేపాలున్నట్లు గుర్తించింది. సోమవారం హైదరాబాద్ నుంచి అధికారుల బృందంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాహనంతో డ్రిల్లింగ్ చేసే ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. 150 మీటర్ల మేర డ్రిల్లింగ్ వేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపి సేకరిస్తున్నారు. ఖనిజ నిక్షేపాలతోనైనా ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్ దాటితే మళ్లీ డిసెంబరే) -
ఉపాధి పనుల్లో బయటపడిన 229 రాగి నాణేలు
బాలానగర్: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు మట్టికుండలో 229రాగి నాణేలు లభించాయి. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం నందారంలోని లక్ష్మికి చెందిన భూమి (సర్వే నం.83) లో సోమవారం ఈజీఎస్ సిబ్బంది లెవలింగ్ పనులు చేపట్టారు. అడుగులోతు తవ్వగా మట్టికుండ కనిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి నరేష్ చేరుకుని దానిని విప్పిచూడగా 229 రాగి నాణేలు బయటపడ్డాయి. ఇవి నిజాం కాలం నాటివిగా గుర్తించి ఎస్ఐ వెంకటేశ్వర్లుకు స్వాధీనపర్చారు. ఈ సంఘటనతో సదరు భూ యజమాని లెవలింగ్ పనులను నిలిపివేయించారు. -
వైద్యశాస్త్రం విస్తుపోయేలా.. చనిపోయే కొడుకు కోసం..తండ్రే స్వయంగా మందు కనిపెట్టాడు!!
కుమ్మింగ్: తమ పిల్లలు అనారోగ్యం కారణంగా మరికొద్ది రోజుల్లో చనిపోతున్నారంటే తల్లిదండ్రులు ఎవరైన తట్టుకోగలరా. పైగా ఆ బిడ్డను రక్షించుకొనేందుకు తిరగని ఆసుపత్రి ఉండదు. అంతేకాదు ఖర్చుకు కూడా వెనకడుగు వేయరు. అయితే తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవటం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని అందరకీ తెలుసు. కానీ ఇక్కడొక తండ్రి తన బిడ్డకు వచ్చిన అరుదైన వ్యాధికి మందు లేకపోవడంతో తానే స్వయంగా మందు కనిపెట్టి తన బిడ్డను కాపాడుకోవాలని తాపత్రయపడతాడు. (చదవండి: బల్గేరియాలో దారుణం..బస్సు ప్రమాదంలో 48 మంది మృతి) అసలు విషయంలోకెళ్లితే... చైనాలోని జు వీ అనే వ్యక్తికి హయోయాంగ్ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అతడు ‘మెంకేస్ సిండ్రోమ్’ అనే జన్యు పరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. జు వీ కొడుకు హయోయాంగ్‌ని పరీక్షించిన వైద్యులు అతడు కొద్ది నెలల మాత్రమే బతుకుతాడు అని తెలిపారు. పైగా ఈ వ్యాధి నాడివ్యవస్థను ప్రభావితం చేయడంతో కదలలేని స్థితిలో మంచానికే పరిమితమౌతాడన్నారు. నిజం చెప్పాలంటే ఈ వ్యాధితో పోరాడే బాధితులు ఎలాంటి భావోద్వేగాన్ని తెలియజేయలేరు పైగా మూడు సంవత్సరాల వయసుకు మించి జీవించడమనేది అసాధ్యం అన్నారు వైద్యులు. అయితే చైనాలో ఈ అరుదైన వ్యాధికి ఇంతవరకు ఎలాంటి మందు కనిపెట్టలేదని ఆ పిల్లాడి తండ్రి జు వీ తెలుసుకుంటాడు. మరోవైపు ఈ కరోనా మహమ్మరీ కారణంగా చికిత్స నిమిత్తం దేశాలు దాటి వెళ్లడం అసాధ్యం. దీంతో ఆ పిల్లాడి తండ్రి జువీ తానే ఈ వ్యాధికి మందు కనిపెట్టాలని నిర్ణయించుకుటాడు. అనుకున్నదే తడువుగా కుమ్మింగ్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌ని ప్రయోగశాలగా మారుస్తాడు. అయితే జువీ కేవలం హైస్కూల్ చదువు మాత్రమే చదువుకున్నాడు. అంతేకాదు జు వీ తన కొడుకు అనారోగ్యానికి గురికాక మునుపు ఆన్లైన్ వ్యాపారం చేస్తుండేవాడు. ఎప్పుడైతే తన కొడుకు ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్నాడో అప్పటి నుంచి అతను పరిశోధనలతోనే గడుపుతుంటాడు. ఈ మేరకు జు వీ ఈ వ్యాధి నయం చేయలేనిదని కేవలం మందులతో ఈ వ్యాధి లక్షణాలను తగ్గించగలమనే విషయాన్ని తెలుసుకుంటాడు. అంతేకాదు ఫార్మాకి సంబంధించిన విషయాలను ఆంగ్లంలో ఉండటంతో వాటిని అనువాద సాఫ్టవేర్ సాయంతో విశ్లేషించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఈ వ్యాధి లక్షణాలను తగ్గించడంలో కాపర్ హిస్టాడిన్(రాగి) సహాయం చేయగలదని కనుగొంటాడు. కాపర్ క్లోరైడ్ డైహైడ్రేట్ను హిస్టిడిన్, సోడియం హైడ్రాక్సైడ్, నీరు కలిస్తే కాపర్ హిస్టాడిన్ని తయారువుతుందని తెలుసుకుంటాడు. అంతేకాదు ఈ మందు తయారు చేయడానికి ఒక ప్రత్యేక పరికరాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయితే జు వీ తన కొడుకు హయోయాంగ్ తాను స్వయంగా తయారు చేసిన మందును ఇవ్వడం ప్రారంబిస్తాడు. ఈ మేరకు జు వీ తన కొడుకుకి తను స్వయంగా తయారు చేసిన మందుతో చికిత్స చేయడం ప్రారంభించిన రెండు వారాల తర్వాత చేసిన రక్తపరీక్షల్లో రక్తం సాధారణ స్థాయిలో ఉన్నట్లు రసాయన శాస్రవేత్తలు గుర్తిస్తారు. అంతేకాదు పిల్లవాడు మాట్లాడలేడు కానీ తన తండ్రి ఆ పిల్లవాడి తల మీద చేయవేయంగానే చిరు నవ్వుతో తన భావోద్వేగాన్ని తెలియజేశాడని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ మెంకేస్ సిండ్రోమ్ బాలికల కంటే అబ్బాయిల్లోనే ఎక్కువగా ఉంటుందని పైగా ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి లక్ష మంది శిశువులలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు ఆ పిల్లాడి తండ్రి జు వీ మాట్లాడుతూ..."తాను తయారు చేసిన కాపర్ హిస్తాడిన్ మందుని మొదట కుందేళ్లపై ప్రయోగించాను. అవి బాగానే ఉన్నాయి కాబట్టి నా కొడుకుకి ఏం కాదు అని నిర్థారించుకున్నా. అంతేకాదు ఈ చికిత్స కోసం ఇతర తల్లిదండ్రులు నన్ను సంప్రదించారు కానీ నా కొడుకుకి మాత్రమే బాధ్యత వహించగలనని చెప్పాను. పైగా నా కొడుకుకి తాను ఏ చికిత్స చేసిన హెల్త్ అధికారులు జోక్య చేసుకోరు" అని కూడా చెబుతాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని టూర్స్ యూనివర్శిటి హాస్పిటల్‌లోని అరుదైన వ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ అన్నీక్ టౌటెన్ మాట్లాడుతూ... "ఒక వైద్యుడిగా జు కేసు గురించి విని "సిగ్గుపడుతున్నాను" . అభివృద్ధి చెందుతున్న దేశంగా అటువంటి కుటుంబాలకు మెరుగైన సహాయం చేయడానికి మన వైద్య వ్యవస్థను మెరుగుపరచగలం. అంతేకాదు ఆ పిల్లాడి తండ్రి జువీతో కలిసి మెంకేస్ సిండ్రోమ్ జన్యు చికిత్స పరిశోధనను ప్రారంభిస్తున్నాం" అని అన్నారు. (చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా?) -
తగ్గడంలే... ఇళ్ల ధరలు పెరుగుతాయట!
సాక్షి, వెబ్‌డెస్క్: అద్దె ఇళ్లలో ఉండే సవాలక్ష నిబంధనలకు తోడు కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో సొంతిళ్లు అవసరమనుకునే వారి సంఖ్య పెరిగింది. అప్పు చేసైనా సరే ఇది నా ఇల్లు అనిపించుకుందామనే ప్రయత్నాలు పెరిగాయి. అయితే అంతకు ముందే ఇంటి నిర్మాణ రంగంలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సొంతింటికి కల మరోసారి మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతోంది. స్టీలు ధరలకు రెక్కలు ఇంటి నిర్మాణ రంగంలో కీలకమైన స్టీలు ధరలు ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. లాక్డౌన్ కంటే ముందు హోల్‌సేల్ మార్కెట్లో 8 మిల్లీమీటరు స్టీలు టన్ను ధర రూ.42,000 ఉండగా ఇప్పుడు టన్ను స్టీలు ధర రూ.57,00లకు చేరుకుంది. ఇదే తరహాలో సిమెంటు బ్యాగు ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. వీటితో పాటు ఇంటి నిర్మాణంలో కీలకమైన కాపర్ ధర 40 శాతం, అల్యుమినియం ధర 60 శాతం పెరిగినట్టు డెవలపర్లు చెబుతున్నారు. డిమాండ్ పెరిగింది కరోనా కల్లోల సమయంలో అద్దె ఇళ్లలో ఎదురైన ఇబ్బందులతో సొంత ఇల్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరిగింది. అయితే పెరిగిన ధరలు వారికి షాక్ ఇస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే సేవింగ్స్ చాలా ఖర్చుకావడం, ఎక్కువ మందికి జీతాల్లో కోతలు పడ్డాయి. ఈ తరుణంలో లోన్లు తీసుకుని ఇళ్లు కొందామనుకునే వారికి పెరుగుతున్న ధరలు అశనిపాతంలా మారాయి. కట్టాలన్నా కష్టమే డెవలపర్లు ఒకేసారి పెద్ద ఎత్తున సిమెంటు, స్టీలు కొనడం వల్ల హోల్‌సేల్ ధరలకు లభిస్తున్నాయి. కానీ జిల్లా కేంద్రాలు, ఇతర చిన్న పట్టణాల్లో ఇంటి నిర్మాణం స్వంతంగా చేపట్టాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో టన్ను స్టీలు ధర 65,000 దగ్గర ఉంది. సిమెంటు బ్యాగు రూ. 400 దగ్గర లభిస్తోంది. దీంతో సొంతింటి కల భారంగా మారుతోంది. పెరిగిన లేబర్ కష్టాలు గతంలో బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిషాల నుంచి లేబర్ పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌తో పాటు పెద్ద ప్రాజెక్టులు, జిల్లా కేంద్రాల్లో పనికి వచ్చే వారు. లోకల్ లేబర్‌తో పోల్చితే వీరు తక్కువ కూలీలకే పనులకు వచ్చేవారు. వరుస లాక్డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన లేబర్‌లో చాలా మంది అక్కడే ఉండి పోయారు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల కొరత ఏర్పడింది. డబుల్ కూలీ ఇస్తే తప్ప లేబర్ దొరికే పరిస్థితి లేదంటున్నారు డెవలపర్స్. 30 శాతం పెరుగుతాయి కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. మరోవైపు క్రమంగా నిర్మాణ రంగం కూడా గాడిన పడుతోంది. ధీర్ఘకాలం పాటు మధ్యలో ఆగిపోయిన భవనాల్లో తిరిగి పనులు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్ల ధరలు పెరిగిన మాట వాస్తవమేని, అయినా సరే ఇప్పుడు ఇళ్లు కొనడమే మంచిందని, పెరిగిన ముడి పదార్థాల ధరల వల్ల రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు కనీసం 30 శాతం వరకు పెరగవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు అంటున్నారు. స్టీలు ధరల పెరుగుదల (టన్ను ధర ) స్టీలు సైజు 2020 ఫిబ్రవరి 2021 ఆగస్టు 8 ఎంఎం రూ.42,000 రూ.57,000 10 ఎంఎం రూ. 41,000 రూ.56,000 12 ఎంఎం రూ.40,5000 రూ 56,000 14 ఎంఎం రూ.41,000 రూ.56,000 16 ఎంఎం రూ.41,000 రూ. 56,000 -
దీపం లేని దేవుడు!
సాక్షి, హైదరాబాద్: మనం ఉంటున్న ఇంట్లో వసతులు లేకుంటే ఏం చేస్తాం.. మరో ఇంటికి మారతాం. మరి ఓ దేవుడి గుడిలో సమస్యలు ఏర్పడితే దేవుడు కూడా మరో కోవెలకు మారతాడా! కచ్చితంగా మారేవాడు అంటోంది ఓ శాసనం. ఆలనాపాలనా కరువై ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది వస్తే, ఆ దేవాలయంలోని స్వామివారిని అనుకూ లంగా ఉన్న మరో ఆలయంలోకి మార్చేవారు. అలాంటి స్వామిని బే చిరాగ్ దేవుడిగా పేర్కొనేవారు. అంటే దీపం కరువైన దేవుడని అర్థం. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాళ్ల సంకీస గ్రామంలోని శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో ఓ రాగి శాసనం వెలుగు చూసింది. 1236 హిజరీ సంవత్సరంగా అందులో పేర్కొన్నారు. అంటే 1820వ సంవత్సరమన్నమాట. ఆలయంలో భద్రపరిచిన ఈ శాసనాన్ని చరిత్ర పరిశోధకుడు కట్టా శ్రీనివాస్ పరిశీలించి దాన్ని వెలుగులోకి తెచ్చారు. శాసనంలోని వివరాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. వెలుగొందుతున్న ఆలయం.. మన్నెగూడెంకు చెందిన అంకం బాలన్న తూర్పు నుంచి స్వామివారిని తీసుకొచ్చి మంగళగిరి భావనాచార్యుల సహకారంతో మన్నెగూడెంలో కొంతకాలం కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత దీపం పెట్టే దిక్కుకూడా లేకపోవడంతో విక్రమనామ సంవత్సరంలో మంగళగిరి పెదనర్సయ్య భూదానం చేసి ఆ స్వామివారిని సంకీస గ్రామానికి రప్పించారు. ఆ తర్వాతనే గ్రామం పెరుమాళ్ల సంకీసగా మారిందని చెబుతారు. కీర్తి గడించిన ఆ దేవాలయం నాటి నుంచి వెలుగొందుతూనే ఉంది. స్వామివారి ప్రతిష్ట సందర్భంగా భూదానం, అర్చకులకు చెల్లించాల్సిన మొత్తం, స్వామివారి కైంకర్య వివరాలు, ఆలయ ఆదాయం, పులిహోర, ఇతర ప్రసాదాల్లో వాడాల్సిన దినుసుల పాళ్లు తదితర వివరాలను పత్రాల్లో రాశారు. రాగి ప్రతిపై శాసనం ఆ తర్వాత ఆ పత్రాలు జీర్ణమయ్యే పరిస్థితి రావటంతో రాగి శాసనంపై వివరాలు చెక్కించారు. కుంచెడు, అడ్డెడు, మానెడు, తక్కెడు లాంటి నాటి కొలమాన పదాలను అందులో వాడారు. స్వామి కల్యాణానికి 300 గ్రామాల వారు హాజరయ్యారని, ఆడపెండ్లి వారికి అర్ధరూపాయి, మగపెండ్లి వారికి రూపాయి చొప్పున కట్నం చదివించేవారు. శాసనంలో పేర్కొన్న విధంగా పద్ధతులు ఆచరించాలని పేర్కొంటూ అతిక్రమించిన వారికి శాపనార్థాలు పెట్టిన తీరు కూడా అందులో ఉండటం విశేషం. దస్తూరి, సాక్షుల పేర్లు కూడా రాయించారు. శాసనం వేయించినట్టు భావిస్తున్న ముగ్గురు దేశ్‌ముఖ్‌ల పేర్లు యర్రసాని వెంకట తిమ్మయ దేశ్‌ముఖ్, యర్రసాని చిన నర్సయ్య దేశ్‌ముఖ్, యర్రసాని గోపాల రాయుడు దేశ్‌ముఖ్‌ల పేర్లు చివరలో వేయించారు. -
తాగునీటి శుద్ధికి జనుము + రాగి!
సాక్షి, హైదరాబాద్: తాగునీటిలో హానికారక సూక్ష్మజీవుల చేరికను నిరోధించేందుకు ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. చౌకగా అందుబాటులో ఉండే జనపనారకు రాగిపూత పూసి వాడటం ద్వారా తాగునీటి కాలుష్యాన్ని అడ్డుకోవచ్చునని, తద్వారా కలుషిత నీటితో వచ్చే వ్యాధులను నివారించవచ్చునని వీరు చెబుతున్నారు. బిందెలు, కుండల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం మనమందరం చేసే పనే. అయితే ఇలా నిల్వచేసిన నీటిలో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు ఉత్పత్తయ్యే అవకాశాలెక్కువ. ఈ సూక్ష్మజీవుల వల్ల కలరా, మలేరియా, టైఫాయిడ్, అతిసార వంటి అనేక రోగాలు వస్తాయి. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నీటిని కాచి వడబోసి వాడాలని చెబుతారు. కానీ నీటిని కాచేందుకు ఎంతో కొంత ఖర్చవుతుంది. పైగా పర్యావరణానికీ అంత మంచిది కాదు. పోనీ రివర్స్ ఆస్మాసిస్ వంటి టెక్నాలజీలను వాడే వాటర్ ఫిల్టర్లను కొందామా? అంటే చాలామంది ఈ ఖర్చు భరించలేరు. వీటితో నీటివృథా కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో వీలైనంత చౌకగా నీటిని శుద్ధిచేసే లక్ష్యంతో మద్రాస్ ఐఐటీలోని రసాయన శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దిలీప్‌కుమార్ చాంద్ ప్రయోగాలు చేపట్టారు. జనుము, రాగితో మెరుగైన ఫలితాలు బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను చంపేందుకు రాగి భేషుగ్గా ఉపయోగపడుతుందని మనకు తెలుసు. రాగి చెంబు లేదా గ్లాస్లో ఉంచిన నీటిని తాగడం కూడా ఇందుకే. అయితే ఒక పరిమితి దాటాక రాగితో మనిషికి ప్రమాదం ఏర్పడవచ్చునని, అది నీటిలోకి చేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ దిలీప్‌కుమార్ చాంద్ తెలిపారు. రాగిని మెరుగ్గా వాడేందుకు తాము చేసిన పరిశీలనల్లో జనుము గురించి తెలిసిందని, చౌకగా లభించడం, నీటిపై తేలియాడే లక్షణం కారణంగా దీన్ని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. జనుమును చిన్నచిన్న పూసల్లా చేసి దానిపై కుప్రస్ ఆక్సైడ్ లేదా రాగిని పూతగా పూసి నీటిని నిల్వ ఉంచిన పాత్రలో వేస్తే వాటిల్లో సూక్ష్మజీవులు అసలు ఉత్పత్తి కాలేదని ప్రయోగపూర్వకంగా గుర్తించామని చెప్పారు. సాధారణ నీటితో పోల్చినప్పుడు ఐదు రోజుల తరువాత కూడా రాగితో కూడిన జనుము పూసలు ఉన్న నీటిలో బ్యాక్టీరియా అతి తక్కువగా పెరిగిందని తెలిపారు. ఈ ప్రయోగాల్లో ఐఐటీ మద్రాస్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఎన్.గుమ్మడి సత్యనారాయణ, రణధీర్ రై కూడా పాల్గొన్నారు. పరిశోధన వివరాలు ఏసీఎస్ ఒమేగా జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
కరోనా: రాగి పూత.. 4 గంటల్లోనే వైరస్ ఖతం!
మానవ జీవితంలో రాగికి ఉన్న ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. యాంటీ బాక్టీరియల్ గుణాలున్న రాగి.. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది ఈ లోహంతో తయారు చేసిన పాత్రలో నిల్వచేసిన నీటిని తాగుతారు. అంతేగాక గాయాలను త్వరగా నయం చేయడమే గాకుండా రక్తహీనతను అరికట్టే శక్తి దీనికి ఉంటుంది. ఇక రాగిని శరీరానికి అందించడం ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చని అమెరికాకు శాస్త్రవేత్తలు గతంలో వెల్లడించారు. ఇవే కాకుండా మరెన్నో గొప్ప లక్షణాలున్న రాగితో తయారు చేసిన లేదా రాగి పూత ఉన్న వస్తువుల వాడకం మహమ్మారి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగపడుతుందని బ్రిటీష్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ విలియం కీవిల్ తాజాగా వెల్లడించారు. మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు కనిపెడతారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవిస్తూనే...వైరస్ మన దరి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడమే ఉత్తమైన మార్గమని నిపుణులు అంటున్నారు. ఇక కరోనా కాలంలో మాస్కు ధరించడం, సామాజిక ఎడబాటు పాటించడం తప్పనిసరి చేసిన ప్రపంచ దేశాలు.. అధిక జనసంచారం ఉండే రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు సహా ఇంట్లోనూ రాగి పూత ఉన్న వస్తువులను వాడేలా ప్రజలను ప్రోత్సహించాలంటున్నారు ప్రొఫెసర్ విలియం కీవిల్.(ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?) 4 గంటల్లో వైరస్ ఖతం! యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ సీనియర్ మైక్రోబయోలజిస్ట్ అయిన ప్రొఫెసర్ విలియం దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ లోహాల యాంటీ బాక్టీరియల్ గుణాలపై పరిశోధనలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన పరిశోధనలు మరింత ముమ్మరం చేసిన ఆయన.. రాగితో తయారు చేసిన లేదా రాగి పూత ఉన్న వస్తువులపై వైరస్ చేరినట్లయితే కేవలం నాలుగు గంటల్లోనే అది అంతమవుతుందని పేర్కొన్నారు. కాపర్‌పై వైరస్ చేరినపుడు దానిలోని అయాన్లు, ఎలక్ట్రాన్లు వైరస్ మెంబ్రేన్(సంరక్షక పొర)పై దాడి చేసి.. డీఎన్ఏను నిర్వీర్యపరిచి.. దానిని పూర్తిగా నాశనం చేస్తుందని వెల్లడించారు. ఈ విషయం గురించి విలియం ది టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘స్టీలుపై కరోనా మూడు రోజుల పాటు బతికి ఉంటుంది. అదే రాగిపై కేవలం నాలుగు గంటలు మాత్రమే జీవించి ఉండగలదు. సాధారణంగా బయటకు వెళ్లినపుడు చాలా మంది హ్యాండ్ రెయిల్స్ వంటి కంటామినేటెడ్ ఉపరితలాలను తాకుతూ ఉంటారు. ఆ తర్వాత అదే చేతిని ముఖంపై ఆనించినట్లయితే కళ్లు, నోరు లేదా ముక్కు నుంచి వైరస్ లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి మనం రోజూ ఎక్కువగా ఉపయోగించే డోర్ హ్యాండిల్స్, షాపింగ్ ట్రాలీలు, హ్యాండ్ రెయిల్స్, జిమ్ పరికరాలు, క్యాష్ మెషీన్లపై కాపర్ పూత వేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఆ దేశాల్లో ఇప్పటికే వాడకం ఇక వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న యూకేలో జనసమ్మర్ధం ఉన్నచోట రాగి పూత వేసిన వస్తువులు ఎక్కువగా వాడాల్సి ఉందని విలియం సూచించారు. పోలాండ్‌లో బస్సుల్లో రాగితో తయారు చేసిన హ్యాండ్రెయిల్స్ వాడుతున్నారని, చిలీ ఎయిర్‌పోర్టుల్లో, బ్రెజిల్ ఇమ్మిగ్రేషన్ కియోస్కుల్లో రాగి వాడకం ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. యూకేలోనూ ప్రభుత్వ భవనాలు, రైల్వే, బస్సు స్టేషన్లలో రాగి హ్యాండ్ రెయిల్స్, తలుపు బెడాలను ఉపయోగించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా గతంలో అమెరికా శాస్త్రవేత్తల బృందం సైతం.. ఇంటెన్సివ్ కేర్‌లో రాగి పూత ఉన్న పరికరాలను వాడినపుడు.. మిగతా లోహాలతో పోలిస్తే బాక్టీరియాను చంపగల శక్తి 95 శాతం ఎక్కువగా ఉందని వెల్లడించింది. అదే విధంగా దక్షిణ కరోలినాలోని ది మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక వెంటిలేషన్ సరిగా లేని చోట్ల వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వుహాన్ వైద్య నిపుణులు తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. కరోనా ఎక్కడ .. ఎంతసేపు జీవించి ఉంటుంది? కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరల్లో ఉండే వైరస్ కణాలు గాలిలో మూడు గంటల పాటు బతికి ఉంటాయి. ప్లాస్టిక్, స్టీల్, బెంచ్ ఉపరితలం, గాజు, స్టీలు వస్తువులపై ఎక్కువగా 72 గంటల పాటు వైరస్ జీవించి ఉంటుంది. కార్డు బోర్డు, కాగితం, ఫ్యాబ్రిక్స్‌పై 24 గంటల పాటు చురుగ్గా ఉంటుంది.సమయం గడిచే కొద్దీ వైరస్ ప్రభావం తగ్గిపోతుంది. కానీ ఈ లోపు మనం సదరు వస్తువులను తాకినట్లయితే మనలోకి వైరస్ ప్రవేశించే అవకాశం ఉంది. -
రాగిజావ... ఆరోగ్యానికి దోవ
వేసవిలో దాహార్తి తీర్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. వాటిలో రాగిజావ చాలా ఆరోగ్యకరం. రాగిజావను రోజుకోసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం... ∙రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ∙వీటిలో ఇనుము మోతాదు కూడా ఎక్కువే. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు దీన్ని తరచూ తీసుకోవడం మంచిది. ∙రాగి పిండిలో విటమిన్–సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోబాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు, రాగిజావ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి. ∙బరువు తగ్గాలనుకునేవారు రాగులను జావ రూపంలోనే కాదు, సంగటిగానూ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ∙రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి. అంతేకాదు కండరాల ఆరోగ్యానికీ, రక్తం తయారవడానికీ, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి. ∙దీనిలో మాంసకృత్తులు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు. -
రూ.150 కోట్లతో... ఎంఎస్ఆర్ కాపర్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ కాపర్ పేరుతో రాగి వాటర్ బాటిళ్ల తయారీలో ఉన్న ఎంఎస్ఆర్ కాపర్ లిమిటెడ్ (గతంలో ఎంఎస్ఆర్ ఇండియా)... భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూ.150 కోట్ల వ్యయంతో హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ వద్ద ఏర్పాటు చేసే ఈ ప్లాంటు తయారీ సామర్థ్యం నెలకు 600 టన్నులు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దుతున్న ఈ ఫ్యాక్టరీలో నవంబరు చివరికల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని, వైర్లు, రాగి ఉత్పత్తులు, విద్యుత్ పరికరాల వంటి 25 రకాలను ఇక్కడ తయారు చేస్తామని ఎంఎస్ఆర్ కాపర్ ఎండీ కె.వి.రాజశేఖర్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఫ్యాక్టరీకి కావాల్సిన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూరుస్తున్నట్టు తెలియజేశారు. నెలకు 10 లక్షల బాటిళ్లు.. ప్రస్తుతం కంపెనీ నెలకు 1.5– 2 లక్షల డాక్టర్ కాపర్ బాటిళ్లను విక్రయిస్తోంది. భారత్‌లో దక్షిణాదిన ఇవి అందుబాటులో ఉన్నాయి. యూఎస్, సింగపూర్, మలేషియా, దుబాయి, కెన్యాలో సైతం విక్రయిస్తోంది. నూతన ప్లాంటు రాకతో ఉత్పత్తి సామర్థ్యం నెలకు 10 లక్షల యూనిట్లకు చేరుతుంది. దీంతో కొత్త మార్కెట్లలో అడుగు పెడతామని కంపెనీ తెలిపింది. డిసెంబరు నుంచి ఉత్తరాది మార్కెట్లకు సరఫరా చేయనున్నారు. అలాగే ఆస్ట్రేలియా, యూరప్‌కు ఎగుమతి చేస్తామని, బాటిళ్ల విక్రయాల్లో ఎగుమతుల వాటా 20 శాతం ఉందని రాజశేఖర్ చెప్పారు. రెండింతల టర్నోవర్.. ఎంఎస్ఆర్ కాపర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2018–19లో రూ.250– 300 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు రాజశేఖర్ వెల్లడించారు. ‘‘కొత్త ప్లాంటులో ఉత్పత్తి నవంబరు చివరి నాటికి 50 శాతం, డిసెంబరులో 100 శాతానికి చేరుకుంటుంది. డాక్టర్ కాపర్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. కంపెనీ తయారు చేస్తున్న ఇతర ఫుడ్ ప్రొడక్టులకు మంచి ఆదరణ లభిస్తోంది. నూతన మార్కెట్లలో విస్తరిస్తాం. కాపర్ ఉత్పత్తుల ద్వారానే నెలకు రూ.40 కోట్ల వరకు ఆదాయం ఆశిస్తున్నాం. కొత్త ఫ్యాక్టరీతో 400 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని వివరించారు. -
తమిళనాట మరో ఉద్యమం
చెన్నై: తమిళనాట మరో ఉద్యమం మొదలైందంది. తీత్తుకుడిలోని స్టెరిలైట్ కాఫర్ ప్లాంట్‌ను మూసివేయాలని వేలాది మంది నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. ప్లాంట్ నుంచి విడుదలయ్యే కలుషిత నీటి ద్వారా పంటలు, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నాయని ఆందోళనకు దిగారు. ఎండీఎంకే అధ్యక్షుడు వైగో, మక్కల్ నీది మయ్యం అధినేత, సినీ నటుడు కమల్‌హాసన్ ఈ దీక్షలకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిసింది. -
రాగికి బదులు పసిడి!
► ఓల్టేజ్ కన్వర్టర్‌లో కేజీకి పైగా బంగారం ► గుట్టురట్టు చేసిన ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు సాక్షి, హైదరాబాద్: ఓల్టేజ్ కన్వర్టర్‌లో దాచి దుబాయ్ నుంచి తీసుకువచ్చిన 1.23 కేజీల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఈ దందాలో సూత్రధారులు ఓ బాధితుడిని క్యారియర్ (అక్రమ రవాణా చేసే వ్యక్తి)గా వాడుకున్నారని వెలుగులోకి వచ్చింది. ఓల్టేజ్ కన్వర్టర్‌లో ఉండే రాగి వైండింగ్ స్థానంలో 24 క్యారెట్ల బంగారంతో చేసిన దిమ్మెల్ని ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ సిల్వర్ ఫాయిల్స్ చుట్టారు. ఈ కన్వర్టర్‌ను హైదరాబాద్‌కు అక్రమ రవాణా చేయడానికి ఓ బాధితుడిని క్యారియర్‌గా వాడుకున్నారు. రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం కోసం వెళ్లి మోసపోయి... తిరిగి భారత్ బయలుదేరాడు. ఇతడిని దుబాయ్ విమానాశ్రయంలో ట్రాప్ చేసిన స్మగ్లింగ్ సూత్రధారులు ఆ బాక్సును ఇచ్చారు. హైదరాబాద్‌లో దిగిన తర్వాత తమ మనిషి వచ్చి పార్సిల్ తీసుకుంటాడని మాత్రమే చెప్పారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ 025 విమానంలో ఈ క్యారియర్ శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత బాక్స్ తీసుకోవడానికి వచ్చే వారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇతని కదలికలు అనుమానంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 1.23 కేజీల బంగారం దిమ్మెలు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ‘బాధితుడి’ని ప్రశ్నిస్తున్నారు. ఈ బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.36,86,670 ఉంటుందని అధికారులు తెలిపారు. -
బంగారం ధరెంతో తెలుసా?
♦ నిర్ణయించడానికి కొన్ని సూత్రాలు ♦ అంతర్జాతీయ ధర, డాలర్ మారకం ఆధారం ♦ డిమాండ్ సరఫరాలతో పాటు పలు అంశాల ప్రభావం చమురు, రాగి వంటి ఎన్ని కమాడిటీలున్నా... బంగారం ప్రత్యేకత బంగారానిదే. పెట్టుబడి సాధనంగా, పారిశ్రామిక పరంగా, అవసరాల్లో ఆదుకునే ఆపద్బాంధవిగా పసిడి మెరుపు ఎప్పటికీ తగ్గదు. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ధరల్లో భారీగా హెచ్చుతగ్గులుండవు. అందుకని హెడ్జింగ్‌కు గొప్ప సాధనంగా బంగారాన్ని ఉపయోగిస్తారు. మరి ఇంతటి విలువైన బంగారం ధరలను నిర్ణయించేదెలా? ఒకసారి చూద్దాం... వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై, ప్రజలపై కమోడిటీ మార్కెట్ల ప్రభావం బలంగానే ఉంటుంది. కీలకమైన కమోడిటీల్లో కొరత ఏర్పడితే... ఆ కమోడిటీ సంబంధిత ఉత్పత్తులను చేజిక్కించుకోవాలనే తపన వినియోగదారుల్లో ఉంటుంది. దీంతో ఉత్పత్తిదారులు అధిక ధరలను డిమాండ్ చేస్తారు. వినియోగదారులేమో తమకు నచ్చిన కమోడిటీలను కొనుగోలు చేయడానికి అధిక ధరలు చెల్లించడానికైనా సై అంటారు. మరోవైపు సరఫరాలు అధికంగా ఉంటే ధరలు తగ్గుతాయి. నాలుగు రకాల కమోడిటీలు.. సాధారణంగా కమోడిటీలను 4 కేటగిరీలుగా విభజిస్తారు. ఇంధనం (ముడి చమురు, హీటింగ్ ఆయిల్, సహజవాయువు, గ్యాసోలిన్ తదితరాలు), లోహాలు (బంగారం, వెండి, ప్లాటినమ్, రాగి...మొదలైనవి), లైవ్ స్టాక్, మాంసం (గొర్రెలు, పోర్క్ బెల్లీ, ఇత్యాది), వ్యవసాయ ఉత్పత్తులు (మొక్కజొన్న, సోయాబిన్, గోధుమ, వరి, కొకోవా, కాఫీ, పత్తి, పంచదార... తదితరాలు). బంగారం లోహాల కేటగిరి కిందకు వస్తుంది. కమోడిటీ ట్రేడింగ్ కొంచెం భిన్నం... కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేయడం, ట్రేడింగ్ చేయడం కాస్త భిన్నంగా ఉంటుంది. స్టాక్స్, బాండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లుగా, ట్రేడింగ్ చేసినట్లుగా కమోడిటీల్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఉండదు. కమోడిటీ ట్రేడింగ్ చేయాలంటే ముందుగా ఆమోదయోగ్యమైన ప్రమాణాలు అవసరం. ఇలాంటి ఆమోదయోగ్యమైన ప్రమాణాల కారణంగా భౌతికంగా ఆ కమోడిటీలను తనిఖీ చేయకుండానే ట్రేడింగ్ చేస్తుంటారు. డిమాండ్ - సరఫరాలతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి, మార్కెట్ డిమాండ్ తదితర అంశాలు ముడి చమురు, అల్యూమినియం, రాగి, పంచదార వంటి కమోడిటీ ధరలపై ప్రభావం చూపుతాయి. పుత్తడిలోకి పెట్టుబడులు... స్టాక్ మార్కెట్ తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నా... లేక బాగా పడిపోతూ ఉన్నా... ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా తమ సొమ్మును స్టాక్ మార్కెట్ నుంచి విలువైన లోహమైన బంగారంలోకి మళ్లిస్తారు. తరతరాలుగా విశ్వసనీయమైన, ఆధారపడతగ్గ ఆస్తిగా పుత్తడికి ప్రాధాన్యం ఉండటమే దీనికి కీలక కారణం. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నపుడు, కరెన్సీ విలువ పడిపోయినపుడు హెడ్జింగ్‌గా విలువైన లోహాలు ఉపయోగపడతాయి. అయితే కమోడిటీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం కొంత రిస్క్‌తో కూడిన వ్యవహారమేనని చెప్పొచ్చు. సరైన వ్యూహాం లేకుండా ఇలా నేరుగా కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు వచ్చే అవకాశాలే అధికం. ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్ ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. షేర్ల ట్రేడింగ్‌కు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఎలాగో, కమోడిటీల ట్రేడింగ్‌కు ఎంసీఎక్స్ అలాగన్నమాట. ఈ ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు, పత్తి, కాఫీ వంటి వ్యవసాయోత్పత్తులు, తదితర కమోడిటీల్లో ట్రేడింగ్ జరుగుతుంది. లావాదేవీలు సురక్షితంగా, పారదర్శకంగా, నియమనిబంధనలకనుగుణంగా జరిగేలా ఎంసీఎక్స్ చూస్తోంది. ధరలను నిర్ణయించేవి.. ట్రేడింగ్ కార్యకలాపాలు, ఇంకా మరికొన్ని అంశాలు కమోడిటీల ధరలను నిర్ణయిస్తాయి. అంతర్జాతీయ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, బంగారం, వెండి లోహాల ధరలు ఏ యూనిట్లలో కోట్ అవుతున్నాయి? ట్రాయ్ ఔన్స్-గ్రాముల మారకం, ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో సరఫరా, డిమాండ్ తదితర అంశాలు.. ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలను నిర్ణయిస్తాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ధర ఎలా నిర్ణయిస్తారంటే, పై అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఒక సాధారణ సూత్రంతో పుత్తడి ధరను నిర్ణయిస్తారు. ఎంసీఎక్స్‌లో పుత్తడి 10 గ్రాముల యూనిట్లలో కోట్ అవుతోంది. ఒక ట్రాయ్ ఔన్స్ 31.1 గ్రాములకు సమానం. దీని ఆధారంగా 10 గ్రాముల బంగారం ధరను నిర్ణయిస్తారు. అంటే... 10 గ్రాముల బంగారం ధర= (అంతర్జాతీయంగా పుత్తడి ధర) ్ఠ (డాలర్‌తో రూపాయి మారకం) ్ఠ 10 ్ఠ (ట్రాయ్ ఔన్స్-గ్రామ్ మారకం విలువ). పసిడి... మరో 2 నెలలు మెరుపే! ముంబై/న్యూయార్క్: పసిడి ధరపై సానుకూల అంచనాలు సమీప కాలంలో పటిష్టంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వారం మధ్యన మంగళ-బుధవారాల్లో జరిగిన కీలక సమావేశాల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్- ఫెడ్ ఫండ్ రేటును పెంచకపోవడం పసిడికి బలాన్నిచ్చింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ధర ఔన్స్(31.1గ్రా)కు వారం వారీగా 28 డాలర్లు ఎగసింది. 1,341 డాలర్ల వద్ద ముగిసింది. జూన్ తరువాత పసిడి ఒక వారంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితుల్లో పసిడి మరో ఒకటి రెండు నెలలు పటిష్ట ధోరణిలోనే కొనసాగుతుందన్నది నిపుణుల అభిప్రాయం. డిసెంబర్ నాటికి రేటు పెంచుతామని ఫెడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా దిగువ స్థాయిలో ఫండమెంటల్స్ పటిష్టంగా లేకపోవటం వల్ల, ఒకవేళ ఫెడ్ రేటు పెంచినా... పసిడి ముందుకే సాగుతుందన్న వాదనా ఉంది. 0.25 శాతంగా ఉన్న ఫండ్ రేటు పెంచితే, పసిడి ఔన్స్‌కు 1,000 డాలర్ల దిగువకు పడిపోతుందన్న మెజారిటీ విశ్లేషణలకు అంచనాలకు భిన్నంగా ఇప్పటి వరకూ పసిడి పరుగులు తీయటం గమనార్హం. మరోవైపు దేశీయంగానూ పసిడి గత వారంలో బలపడింది. 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత 10 గ్రాముల ధరలు వరుసగా రూ.370 చొప్పున ఎగశాయి. వరుసగా రూ.31,570, రూ.31,420 వద్ద ముగిశాయి. ఇక వెండి కేజీ ధర ఏకంగా రూ.1,650 ఎగసి రూ.47,235 వద్ద ముగిసింది. -
రాగితో ఊబకాయానికి చెక్
సాక్షి, హైదరాబాద్: బరువు తగ్గేందుకు చాలా మంది ఊబకాయులు తిండి తినడం బాగా తగ్గించేస్తుంటారు. దీంతో బరువు తగ్గడం మాటెలా ఉన్నా... ముందు నీరసం, ఆ తరువాత రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే తినడం పెద్దగా తగ్గించకుండానే.. రాగి (కాపర్) శరీరానికి అందించడం ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారం ద్వారా తీసుకునే రాగి శరీరంలోని కొవ్వును కరిగించే విషయంలో బాగా ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. శరీరంలో రక్తకణాలు తయారయ్యేందుకు, శరీరం ఇనుమును శోషించుకునేందుకు, రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు, అనుసంధాన కణజాలం (కనెక్టివ్ టిష్యూ) అభివృద్ధికి రాగి తోడ్పడుతుందని ఇప్పటికే వెల్లడైందని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్ చాంగ్ వెల్లడించారు. ఈ పరిశోధన కోసం ఊబకాయంతో ఉండి, ‘విల్సన్స్ డిసీజ్’ పరిస్థితి ఉన్న ఎలుకలను శాస్త్రవేత్తల బృందం ఎంచుకుంది. అవసరానికి మించి అందిన రాగి (కాపర్) ని శరీరం బయటకు విసర్జించలేకపోవడం, తద్వారా కాలేయం సహా పలు అవయవాల్లో రాగి ఎక్కువగా చేరుకోవడమే విల్సన్స్ డిసీజ్. రాగి ఎక్కువగా ఉన్న ఈ ఎలుకలు ఊబకాయంతో ఉన్నా.. వాటిల్లో కొవ్వు మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు సాధారణ ఎలుకలతో పోలిస్తే వీటి కొవ్వు కణాల్లో రాగి తక్కువగా ఉంది. కొవ్వును కరిగించే మందుల ప్రభావం విల్సన్ డిసీజ్ ఉన్న ఎలుకల్లో తక్కువగా ఉందని గుర్తించారు. అప్పటికే కొవ్వు కణాలను రాగి నియంత్రిస్తుండడమే దీనికి కారణమని తేల్చారు. దీనిని బట్టి కొవ్వు కణాలను కరిగించడంలో రాగి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు అంచనాకు వచ్చామని క్రిస్ చాంగ్ తెలిపారు. అయితే అధిక మోతాదులో రాగిని తీసుకోవడం శరీరంలోని లోహాల సమతౌల్యాన్ని దెబ్బతీయవచ్చని స్పష్టం చేశారు. ►జాతీయ పౌష్టికాహార సంస్థ అంచనాల ప్రకారం సాధారణ వ్యక్తులకు ప్రతిరోజు రెండు మిల్లీగ్రాముల రాగి అవసరం. అంతకు మించకూడదు. ►రాగి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు నువ్వులు, జీడిపప్పు, కాబూలీ శనగలు, పీతలు, ఎండ్రకాయలు. -
తీయండ్రా... ప్లేట్లు..!
పౌరుషాల గడ్డ జిమ్మంటోంది. మర్యాదల సీమ రమ్మంటోంది. కడుపు గిర్రున తిరిగింది. నాలుక సడెన్ బ్రేక్ కొట్టింది. పళ్లు పదును పట్టాయి. రాయలసీమ విందు.. వస్తోంద్రా ర్రేర్రేయ్! తీయండ్రా ప్లేట్లు..! కుమ్మేయండెహె..!! జొన్న అంబలి కావల్సినవి: నీళ్లు - 2 కప్పులు జొన్నపిండి - 3 టేబుల్ స్పూన్లు ఉప్పు, మజ్జిగ - తగినంత తయారీ: నీళ్లు మరిగించాలి. జొన్నపిండిలో చల్లటి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న నీళ్లలో పోయాలి. గరిటెతో కలుపుతూ ఉండాలి. ఉప్పు వేసి కలిపి, మిశ్రమం చిక్కబడ్డాక మంట తీసేయాలి. కావాలనుకుంటే తగినంత మజ్జిగ కలుపుకోవాలి. బలవర్ధకమైన ఈ అంబలిని వేడిగానూ చల్లగానూ సేవించవచ్చు. రాగి పిండితోనూ ఇదేవిధంగా అంబలిని తయారుచేసుకోవచ్చు. అలచంద వడలు కావల్సినవి: అలచందలు - 300 గ్రాములు ఉల్లిపాయ - 1 (ముక్కలు చేయాలి); పచ్చిమిర్చి - 3 అల్లం - చిన్న ముక్క; కరివేపాకు - రెమ్మ; జీలకర్ర - టీ స్పూన్ వెల్లుల్లి - 4 రెబ్బలు; కొత్తిమీర - టీ స్పూన్; ఉప్పు - తగినంత తయారీ : అలచందలను 2-3 గంటల సేపు నీళ్లలో నానబెట్టాలి. నీళ్లు వడకట్టి రోట్లో లేదా గ్రైండర్లో వేసి దీంతో పాటు అల్లం ముక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొత్తిమీర వేసి రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకొని అరచేతితో వత్తి, కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించి తీయాలి. కొత్తిమీర చల్లి ఈ వడలను ఏదైనా చట్నీతో వడ్డించాలి సీమకోడి వేపుడు కావల్సినవి: బోన్‌లెస్ చికెన్ - 200 గ్రాములు; అల్లం - వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; నిమ్మకాయ - సగం ముక్క; గరం మసాలా - అర టీ స్పూన్; మొక్కజొన్న పిండి - టీ స్పూన్; కారం - టీ స్పూన్; మైదా - టీ స్పూన్; ఉప్పు - తగినంత; కరివేపాకు - రెమ్మ నూనె - తగినంత; పసుపు - అర టీ స్పూన్ తయారీ : చికెన్‌ను కడిగి, వడకట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మకాయ రసం పిండి కలిపి 5 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత చికెన్‌లో కారం, పసుపు, గరం మసాలా, మొక్కజొన్నపిండి, మైదా.. వేసి కలపాలి. కడాయిలో తగినంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చికెన్ ముక్కలను బాగా వేయించాలి. రాగి సంకటి కావల్సినవి: బియ్యం - కప్పు; ఉప్పు - తగినంత రాగి పిండి - ఒకటిన్నర కప్పు; నెయ్యి - టీ స్పూన్ తయారీ: 3-4 కప్పుల నీళ్లు పోసి బియ్యం ఉడికించాలి. అన్నం 75 శాతం ఉడికాక అందులో రాగిపిండి వేస్తూ కలపాలి. మజ్జిగ చేసే కవ్వంతో చిలికితే పిండి ఉండలు లేకుండా అన్నంతో బాగా కలుస్తుంది. ఉప్పు వేసి మిశ్రమం గట్టిపడ్డాక దించాలి. గమనిక: జొన్న సంకటి కావాలనుకునేవారు రాగిపిండికి బదులు జొన్నపిండి వాడి ఇదే విధంగా తయారుచేసుకోవాలి. ఉలవచారు కావల్సినవి: నల్ల, తెల్ల ఉలవలు - కప్పు; ఉల్లిపాయలు - 2 చింతపండు గుజ్జు - టేబుల్ స్పూన్; ఎండుమిర్చి - 5; జీలకర్ర -ఆవాలు - అర టీ స్పూన్; వెల్లుల్లి రెబ్బలు - 4; కారం - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత, ధనియాల పొడి - టీ స్పూన్ తయారీ: ఉలవలను నీళ్లలో 2 గంటలు నానబెట్టి, మెత్తగా ఉడికించాలి. తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బాలి. గిన్నెలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు గుజ్జు, కారం, ఉప్పు, ఉలవ రసం, ధనియాల పొడి వేసి మరిగించి, దించాలి. బొబ్బట్లు కావల్సినవి: పచ్చిశనగపప్పు - 300 గ్రాములు బెల్లం - 200 గ్రాములు; మైదా పిండి - కప్పు బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు తయారీ: తగినన్ని నీళ్లు పోసి శనగపప్పు ఉడికించాలి. నీళ్లు వడకట్టి అందులో తరిగిన బెల్లం వేసి కలపాలి. ఈ మిశ్రమం చల్లారాక మెత్తగా రుబ్బాలి. కడాయిలో నెయ్యి వేసి, మెత్తగా రుబ్బిన పూర్ణం మిశ్రమం వేయించాలి. మిశ్రమం పొడిగా అయ్యాక దించాలి. బొంబాయిరవ్వను అర గంట నానబెట్టి మైదాపిండిలో కలపాలి. కొద్దిగా నీళ్లు తీసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలపాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని వత్తి, మధ్యలో పూర్ణం మిశ్రమం పెట్టి అన్నివైపులా మూసి, పూరీలా.. చేత్తో వత్తాలి. పెనంపైన నెయ్యి వేసి బొబ్బట్లను రెండువైపులా కాల్చుకోవాలి. వడ్డించేముందు నెయ్యి వేసి అందించాలి. మటన్ ఫ్రై కావల్సినవి మటన్ ముక్కలు - 200 గ్రాములు పసుపు - అర టీ స్పూన్ అల్లం - వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు నిమ్మకాయ - సగం ముక్క గరం మసాలా - అర టీ స్పూన్ మొక్కజొన్న పిండి - టీ స్పూన్ కారం - టీ స్పూన్ మైదా - టీ స్పూన్ ఉప్పు - తగినంత కొత్తిమీర - టీ స్పూన్ నూనె - తగినంత తయారీ మటన్‌ను కడిగి నీళ్లన్నీ పోయేలా వడకట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఉడికించాలి. నీళ్లన్నీ ఇంకిపోయాక నిమ్మ రసం కలిపి 5 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత మటన్‌లో కారం, పసుపు, గరం మసాలా, మొక్కజొన్నపిండి, మైదా.. వేసి కలపాలి. కడాయిలో తగినంత నూనె వేసి మటన్ ముక్కలను బాగా వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లి దించాలి. నాటుకోడి పలావ్ కావల్సినవి : నాటుకోడి ముక్కలు - 200 గ్రాములు బియ్యం - 150 గ్రాములు ఉల్లిపాయలు - 2 దాల్చిన చెక్క - 2 ముక్కలు నెయ్యి-డాల్డా - 3 టేబుల్ స్పూన్లు గరం మసాలా - టీ స్పూన్ పుదీనా ఆకులు - గుప్పెడు అల్లం -వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్ ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - 3 బిర్యానీ ఆకు - 2 కరివేపాకు - రెమ్మ కొత్తిమీర - టీ స్పూన్ కోడిగుడ్లు - 1 తయారీ : మందపాటి గిన్నెలో నెయ్యి-డాల్డా వేసి కాగాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, గరం మసాలా వేసి వేయించాలి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించాలి. తర్వాత పుదీనా వేసి, వేగాక ఉప్పు కలిపి, నీళ్లు పోసి మరిగించాలి. దీంట్లో నాటుకోడి ముక్కలు వేసి ఉడికించాలి. ముక్కలు 50 శాతం ఉడికాక అందులో బియ్యం వేసి కలపాలి. అన్నం ఉడికాక మంట తగ్గించి కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి పూర్తిగా అయ్యాక దించాలి. ఉడికించి, నూనెలో వేయించిన కోడిగుడ్డును పైన అలంకరించాలి. గోంగూర మటన్ కావల్సినవి : మటన్ ముక్కలు - 250 గ్రాములు గోంగూర - గుప్పెడు ఆకులు ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి) ఎండుమిర్చి - 4 వెల్లుల్లి - 2 జీలకర్ర, ఆవాలు - టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత కారం - టీ స్పూన్ (తగినంత) ధనియాల పొడి - టీ స్పూన్ గరం మసాలా (లవంగ, యాలకులు, దాల్చినచెక్క వేయించి పొడి చేసినది) - టీ స్పూన్ ఎండు కొబ్బరి - అర కప్పు కొత్తిమీర - టీ స్పూన్ తయారీ : మటన్ ముక్కలలో పసుపు వేసి 75 శాతం వరకు ఉడికించాలి. మందపాటి గిన్నెలో నూనె వేసి కాగాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, గరం మసాలా వేయించాక ఉల్లిపాయలు వేగనివ్వాలి. దీంట్లో అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మటన్ ముక్కలు వేసి కలపాలి. ఉప్పు, కారం, గోంగూర వేసి ఉడికించాలి. ధనియాల పొడి వేసి మరికాసేపు ఉంచి చివరగా కొత్తిమీర చల్లి దించాలి. గుత్తొంకాయ కావల్సినవి : వంకాయలు - 6 పల్లీలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము - ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున చింతపండు - నిమ్మకాయ పరిమాణం (కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టాలి అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి) నూనె - 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి - 4 కారం - టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ ఉప్పు - తగినంత కొత్తిమీర - టీ స్పూన్ తయారీ: పల్లీలు, నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి. కొబ్బరి కొద్దిగా నీళ్లు కలిపి ముద్ద నూరుకోవాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలపాలి. దీంట్లో కరివేపాకు, ఉల్లిపాయ తరుగు వేయించాక తయారు చేసుకున్న పల్లీలు, నువ్వుల కొబ్బరి ముద్ద, కారం, చింతపండు గుజ్జు కలిపి ఉడికించాలి. తగినంత ఉప్పు కలపాలి. వంకాయలను నాలుగువైపులా కట్ చేయాలి. విడిగా కడాయిలో నూనె వేసి అందులో వంకాయలు వేసి కొద్దిగా వేయించి వీటిని ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి దించాలి. నాటుకోడి పులుసు కావల్సినవి: నాటుకోడి ముక్కలు - 200 గ్రాములు గసగసాలు - 150 గ్రాములు; ఎండుకొబ్బరి - 100 గ్రాములు; పచ్చిమిర్చి - 4; నూనె - 4 టేబుల్ స్పూన్లు; అల్లం -వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); టొమాటో - 1 (సన్నగా తరగాలి); జీలకర్ర - టీ స్పూన్; పచ్చిమిర్చి - 3; కారం - టీ స్పూన్; ఉప్పు - తగినంత; గరం మసాలా - అర టీ స్పూన్; ధనియాల పొడి - అర టీ స్పూన్ ఎండుకొబ్బరి - 100 గ్రాములు; కొత్తిమీర - టేబుల్ స్పూన్ తయారీ: గసగసాలు వేయించి ఎండుకొబ్బరి కలిపి ముద్ద చేసి ఉంచాలి. నాటుకోడి ముక్కలలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలిపి అరగంట పక్కనుంచాలి. గిన్నెలో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, నిలువుగా కోసిన పచ్చిమిర్చి వేసి కలపాలి. దీంట్లో కలిపి ఉంచిన నాటుకోడి ముక్కలను వేసి కలపాలి. కొద్దిగా ఉడికాక కారం, ఉప్పు, గసగసాల మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి కలపాలి. ముక్క ఉడికాక మంట తగ్గించి గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర చల్లి 3 నిమిషాలు ఉంచి దించాలి. -
అతుకులులేని రాగి బాటిల్
ప్రపంచంలో తొలిసారిగా తయారీ రూ.50 కోట్లతో ప్లాంటు ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అతుకులు లేని (సీమ్‌లెస్) రాగి బాటిల్‌ను హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ఆర్ ఇండియా రూపొం దించింది. ఎటువంటి అతుకులు లేకుండా బాటిల్‌ను తయారు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని కంపెనీ వెల్లడించింది. ‘డాక్టర్ కాపర్’ బ్రాండ్‌తో కంపెనీ వీటిని మార్కెట్ చేస్తోంది. పైలట్ కింద చేపట్టిన విక్రయాలు విజయవంతమయ్యాయని, ఇప్పటికే 25,000 బాటిళ్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని ఎంఎస్ఆర్ ఇండియా సీఎండీ ఎం.శ్రీనివాస రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీరు ఆరోగ్యానికి మంచిది. దీనిని దృష్టిలో పెట్టుకునే సౌకర్యవంతంగా ఉండేలా 100% స్వచ్ఛమైన రాగితో బాటిళ్లను రూపొందించాం. లీటరు బాటిల్ ధర రూ.600గా నిర్ణయించాం’ అని చెప్పారు. ఏడాదిలో ప్లాంటు విస్తరణ.. ప్రస్తుతం కంపెనీ నెలకు 3.5 లక్షల యూనిట్లు తయారు చేయగల ప్లాంటును జీడిమెట్ల వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకు రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టింది. మెషినరీని యూరప్ నుంచి దిగుమతి చేసుకున్నామని శ్రీనివాస రెడ్డి తెలిపారు. బాటిల్ పరిశ్రమ మార్కెట్ దేశంలో రూ.8,000 కోట్లుంది. 2020 నాటికి ఇది రూ.20 వేల కోట్లకు చేరుతుంది. మార్కెట్ ప్రోత్సాహకరంగా ఉండడంతో ఏడాదిలో ప్లాంటును విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. రోజుకు 50,000 బాటిళ్లు తయారు చేయగల మెషినరీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. ఈ మెషినరీకి రూ.100 కోట్ల దాకా వ్యయం అవుతుందని వెల్లడించారు. రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటితో నింపిన బాటిళ్లను పలు రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఎఫ్‌ఎంసీజీలోకి సైతం.. బీఎస్ఈలో లిస్ట్ అయిన ఎంఎస్ఆర్ ఇండియా త్వరలో ఎఫ్ఎంసీజీ విభాగంలోకి ప్రవేశిస్తోంది. హైదరాబాద్‌లోని బౌరంపేట వద్ద 10 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు నిర్మాణ పనులను కంపెనీ వేగిరం చేసింది. ఆహారోత్పత్తులు, సౌందర్య సాధనాలు ఇక్కడ తయారు చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి ఇవి మార్కెట్లో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ప్లాంటు కోసం రూ.25 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్టు సమాచారం. -
పేరులో నేముంది
చిరుధాన్యాలలో మేలిమి... రాగులు... చిరుధాన్యాలలో ఒకటైన రాగి పంటకు కీటకాలు, చీడపీడల సమస్య చాలా తక్కువట. అందుకేనేమో రాగులను ఆహారంగా చేసుకుంటే మన ఒంటికీ అనారోగ్యసమస్యలు చాలా తక్కువ అని అంటుంటారు. ఒకప్పుడు పేదల ఆహారంగా రాగులకు పేరు ఉండేది. కానీ, నేడు అనారోగ్యం దరిచేరకుండా ఉండాలంటే రాగులనే ప్రధాన ఆహారంగా ఎంచుకోవాలి అనేవారి సంఖ్య సంపన్నుల్లోనూ పెరుగుతోంది. అందుకే, రాగి అంబలిగానే పరిచయం ఉన్న వీటితో ఇప్పుడు రకరకాల వంటకాలను సృష్టిస్తున్నారు. రుచికరంగా రాగులను తెగ లాగించేస్తున్నారు. రాగులను సాధారణంగా వేరుశనగ, కంది, మినుము వంటి పప్పు దినుసులతో పాటు అంతరపంటగా సాగుచేస్తారు. దీనిని ఎక్కువగా ఆఫ్రికా, ఆసియాలోని మెట్టప్రాంతాలలో పండిస్తారు. రాగి పుట్టింది మాత్రం ఇథియోపియాలోని ఎత్తై ప్రదేశాలలో అని, నాలుగువేల సంవత్సరాల క్రితం మన దేశంలో ప్రవేశపెట్టబడింది అని తెలుస్తోంది. ఎత్తు ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితుల్లోనూ తట్టుకుని సులువుగా పండే పంట ఇది. చల్లనైన హిమాలయపర్వతసానువుల్లో 2,300 మీటర్ల ఎత్తువరకు రాగిని పండిస్తారట! -
ఈ వారం వ్యవసాయ సూచనలు
కంది, కొర్ర,, వేరుశనగ సాగు మేలు * ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని కంది, కొర్ర, రాగి, వేరుశనగ, పత్తి, పశుగ్రాసాలు సాగు చేసుకోవచ్చు. * విత్తే ముందు రైతులు తమ సొంత విత్తనాన్ని వాడుకున్నట్లయితే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా శుద్ధి చేసిన విత్తనాన్ని మార్కెట్లో కొనుగోలు చేయాలి. * వర్షాధారపు పంటలన్నింటిలోనూ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడడం వలన భూసారం పెరగడమే కాకుండా నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, వేరుశనగ చెక్క, వేప చెక్క, కానుగ చెక్కలను వాడుకోవచ్చు. * నూనె గింజ పంటలకు తప్పనిసరిగా సల్ఫర్ ఉన్న భాస్వరపు ఎరువులను వాడాలి. అన్ని పంటలకు మొత్తం భాస్వరపు ఎరువును ఆఖరి దుక్కిలోనే వేయాలి. భూసార పరీక్షను అనుసరించి ఎరువులను వేసుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. * వర్షాలు తక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకుగాను, వాలుకు అడ్డంగా విత్తుకోవడం, వాలును అనుసరించి మడులను చిన్నవిగా చేసుకోవడం, వాలు ఎక్కువగా ఉన్నచోట్ల లోతైన గొడ్డు చాళ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ వాలు ఉన్న చోట్ల మట్టితోగాని, రాతి కట్టడంతో లేదా జీవ కంచెతో గాని అడ్డు ఏర్పాటు చేసుకోవడం వలన నీటిని అక్కడే ఇంకేలా చేసుకోవడమే కాకుండా మట్టి కొట్టుకు పోకుండా నివారించవచ్చు. * వర్షాకాలంలో కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తిన 24 గంటల్లోపు ఆయా పంటలకు సిఫారసు చేసిన కలుపు పైమందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. * కంది పంటకు పెండిమిథాలిన్ 1 నుంచి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటరు. ఆముదం పంటకు పెండిమిథాలిన్ 1.3 - 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 800 మి.లీ. నుంచి ఒక లీటరు. పత్తిలో విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 1 లీటరు/ విత్తిన తర్వాత పెండిమిథాలిన్ 1.3 నుంచి 1.6 లీ./ అలాక్లోర్ 1.5-2 లీటర్లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
‘స్టోర్ రూం’లో ఏం జరిగింది
నిజామాబాద్ నాగారం : ట్రాన్స్‌కో జిల్లా స్టోర్‌లో లక్షల రూపాయల విలువ చేసే కాపర్, అల్యూమిని యం వైర్లు మాయమైన విషయమై విచారణ జరపడానికి వరంగల్ ఎస్ఈ కిషన్, అసిస్టెంట్ సెక్రటరీ మనోహర్‌స్వామి శుక్రవారం జిల్లాకు వచ్చారు. వారితోపాటు జి ల్లాకు చెందిన ట్రాన్స్‌కో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కిషన్ ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు స్టోర్ రూమ్‌లో విచారణ జరిపారు. శనివారం కూడా విచారణ కొనసాగనుంది. నెలలోగా నివేదిక.. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల సమయంలో కాలిపోయిన కాపర్, అల్యూమినియం వైర్లను కాంట్రాక్టర్ స్టోర్ రూంలో అందించి రశీదు పొందాలి. ఆ తర్వాతే మరమ్మతులకు సంబంధించిన బిల్లులు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తారు. అయితే కాంట్రాక్టర్ కాపర్, అల్యూమినియం అందించకున్నా.. అధికారులు వారితో కుమ్మక్కై రశీదులు ఇచ్చారు. సదరు కాంట్రాక్టర్ కాపర్, అల్యూమినియం వైర్లను అమ్ముకొని, అధికారులకు వాటా ఇచ్చేవారని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఈ విషయం బయటికిపొక్కడంతో అప్పటి ఎస్ఈ విషయాన్ని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో విచారణ జరిపిన ట్రాన్స్‌కో అధికారులు నలుగురు ఏఈలు, ఏడీఈని సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు వరంగల్ ఎస్ఈ కిషన్ శుక్రవారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. స్టోర్ రూమ్‌లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కేసుకు సంబంధించిన చార్జిషిట్‌లో కామారెడ్డి ఏడీ ఈ రఘుకుమార్, నిజామాబాద్ ప్రస్తుత స్టోర్ ఏడీఈ వెంకటరమణ, కరీంనగర్ ఏఈ శ్రీహరి, సస్సెండ్ అయిన స్టోర్ ఏఈ ప్రశాంత్‌రెడ్డిల పేర్లు ఉన్నాయన్నారు. వీరిని విడివిడిగా విచారిస్తున్నామన్నారు. విచారణను నెలలోగా పూర్తి చేసి నివేదికను సీఎండీ కార్తికేయ మిశ్రాకు అందిస్తామని తెలిపారు. -
శిక్ష పడేనా?
* ట్రాన్స్‌కో స్టోర్‌లో కాపర్,అల్యూమినియం మాయం * నేడు విచారణకు రానున్న ఎస్ఈ * గతంలోనే నలుగురు అధికారుల సస్పెన్షన్ * సిబ్బంది, అధికారులలో చర్చ నిజామాబాద్ నాగారం: ట్రాన్స్‌కో స్టోర్‌లో లక్షల రూపాయల విలువ చే సే కాపర్, అల్యూమినియం మాయమైంది. ఏడు నెల ల క్రితం ఒక ఏడీఈ, నలుగురు ఏఈలు సస్పెండ్ అ య్యారు. శుక్రవారం ఎస్ఈ విచారణకు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ కుంభకోణం ట్రాన్స్‌కో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షిస్తారా.. బయట పడేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులలో వెలువడిన కాపర్, అల్యూమినియంను అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్లు స్టోర్ రూమ్‌కు అప్పజెప్పి రసీదు తీసుకోవాలి. అప్పుడే మరమ్మతులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తారు. అయితే కాంట్రాక్టర్లు కాపర్, అల్యూమినియంను స్టోర్‌రూమ్‌కు అందజేయకున్నప్పటికీ ముట్టజెప్పినట్లుగా రశీదు తీసుకున్నారు. కాంట్రాక్టర్లకు, అధికారుల మధ్య అవగాహన ప్రకారమే ఈ తతంగం చా లా రోజులుగా కొనసాగినట్లు తెలిసింది. కాపర్‌ను బయటే అమ్ముకుని డబ్బులను పంచుకునేవారు. ఈ క్రమంలో 2011-12లో నిజామాబాద్‌లోని స్టోర్ ఏఈగా పని చేస్తున్న శ్రీహరి బదిలీపై కరీంనగర్ జిల్లాకు వెళ్లారు. జిల్లాలోని నవీ పేట మండలం ఏఈగా పని చేస్తున్న ప్రశాంత్‌రెడ్డికి స్టోర్ ఏఈగా బదీలీ చేశారు. బాధ్యతలు తీసుకునే సమయంలో రికార్టులు అన్నీ సరి చూసుకుంటుండగా కాపర్, అల్యుమిని యం స్టాక్ తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీంతో బాధ్యత లు తీసుకోవడానికి ప్రశాంత్‌రెడ్డి నిరాకరించారు. ఒప్పందం ప్రకారం విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం, కరీంనగర్ స్టోర్ ఏడీఈ ప్రకాశం, నిజామాబాద్ స్టోర్ ఏడీఈగా పనిచేస్తున్న రఘుకుమార్ రంగంలోకి దిగి, శ్రీహరి,ప్రశాంత్‌రెడ్డి మధ్య ఒప్పందం కుదిర్చారు. ఈ మేరకు శ్రీహరి రూ.10 లక్షలు ఇవ్వాలి. దీంతో పూర్తి బాధ్యత ప్రశాంత్‌రెడ్డి తీసుకుంటారు. ఒప్పందం ప్రకారం ముందుగా రూ.5 లక్షలు ప్రశాంత్ రెడ్డికి ముట్టాయి. ఇప్పటి వరకు కథ బాగానే నడిచింది. మిగతా రూ. 5 లక్షల చెల్లింపులో తీవ్ర జ్యాపం జరగడంతో ఇద్దరి మధ్య రగడ మొదలైంది. మళ్లీ కరీంనగర్ ఏడీఈ, నిజామాబాద్ స్టోర్ ఏడీఈ, ఏఈ శ్రీహరి, ఏఈ ప్రశాంత్‌రెడ్డి సమావేశ మయ్యారు. శ్రీహరి మరో రూ.2 లక్షలు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ అకౌంట్లోకి పంపించారు. ఈలోగా ఇక్కడ స్టోర్ ఏడీఈగా పని చేస్తున్న రఘుకుమార్ కామారెడ్డికి బదీలీపై వెళ్లారు. దోమకొండలో పనిచేస్తున్న ఏడీఈ వెంకటరమణ స్టోర్ ఏడీఈగా బదీలీపై వచ్చారు. దీంతో కొత్తగా వచ్చిన ఏడీఈకి సదరు కాంట్రాక్టర్ తన అకౌంట్లోకి రూ. రెండు లక్షలు ఏవిధంగా వచ్చాయో చెప్పాడు. స్టోర్ ఏడీఈ బాధ్యతలు తీసుకున్నప్పుడు అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయని సంతకం పెట్టిన వెంకటరమణ, తనకు అందాల్సిన వాటా రాకపోవడంతో అప్పటి ఎస్ఈకి విషయాన్ని చేరవేశారు. అప్పటికే దీనిపై ‘సాక్షి’ లో వరుస కథనాలు రావడంతో ఎస్ఈ విషయాన్ని సీఏండీ దృషికి తీసుకెళ్లారు. వెంటనే నలుగురు ఏఈలు, ఏడీలు, అనంతరం స్టోర్ ఏఈ సస్పెండయ్యారు. విచారణను నిలిపేందుకు యత్నాలు ఇదే విషయంలో వెనువెంటనే విచారణ చేయిస్తే మరింత మంది అధికారులు, కాంట్రాక్టర్లు బయటకు వస్తారని తెలి సింది. దీంతో అక్రమాల్లో భాగస్వాములు ఉన్నవారు విచారణను నిలిపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇంత పెద్దమొత్తంలో కుంభకోణం జరగడం, ఇందులో కేవలం అధికారులను బలి చేయడం జరిగిపోయింది. కాంట్రాక్టర్లు తప్పు లు చేసినట్లు తెలిసినా అప్పటి ఎస్ఈ వారి పేర్లను బ్లాక్ లిస్టులో పెట్టలేదు. వారిని వెనకేసుకు వచ్చారు. దీంతో సద రు కాంట్రాక్టర్లు అందుకు కానుకగా ఒక ఏసీని, ఒక టీవీ, విలువైన పర్నిచర్‌ను కార్యాలయానికి అందజేశారని సమాచారం. దీంతో పెద్దసారు సంతృప్తి చెంది వారిని ఏమీ అనలేదు. ఎస్ఈ బదీలీ అయ్యేంత వరకు అక్కడే ఉన్న టీవీ, మ రికొన్ని వస్తువులు కొత్త ఎస్ఈ వచ్చేలోగా మాయం చేశారు. నేడు విచారణలో ఏం జరుగుతుందో.. వరంగల్ ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి ఎస్ఈ శుక్రవారం జిల్లాకు రానున్నారు. స్టోర్ ఏడీఈగా ఉన్న వెంకటరమణ, కామారెడ్డి ఎడీఈ రఘుకుమార్, కరీంనగర్ ఏఈ శ్రీ హరి, సస్పెండ్ అయిన ఏఈ ప్రశాంత్‌రెడ్డిపై విచారిస్తారు. అసలు ఏం జరిగింది. ఎంత మొత్తంలో అక్రమాలు జరి గాయి అన్ని విషయాలు తెలియాల్సి ఉంది. విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం లేకపోలేదు. -
కోల్‌గొట్టారు!
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్: సింగరేణి సంస్థ దళారులకు అక్షయపాత్రగా మారింది. అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు దళారులతో కుమ్మక్కై సింగరేణి సామగ్రిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కార్మికులు చెమటోడ్చి కూడబెట్టిన ఆస్తులను చుక్క చెమట పడకుండా దళారులు దోచుకుంటున్నారు. సింగరేణి నుంచి ఏడాదికి రూ.100 కోట్ల కుపైగా బొగ్గు అక్రమంగా చేతులు మారుతోంది. బొగ్గుతోపాటు ఇనుము, రాగి, బెల్టు కూడా ఏడాది కి రూ.5 కోట్ల వరకు అక్రమంగా అమ్ముకొని దళారు లు సొమ్ము చేసుకుంటున్నారు. సంస్థ ఆస్తులు రక్షించేవారు ఉన్నతాధికారుల కనుసన్నల్లో నడుచుకుంటూ ఉండటంతో సింగరేణి సామగ్రి యథేచ్ఛగా తరలుతున్నాయి. ‘బొగ్గ’వుతున్న ఆస్తులు దేశంలోని వివిధ భారీ పరిశ్రమలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. టెండర్లు నిర్వహించి విక్రయాలు జరుపుతోంది. స్థానిక డీలర్లు టెండర్లు దక్కించుకుని పరిశ్రమలకు గూడ్స్ వ్యాగన్ల ద్వారా బొగ్గును సరఫరా చేస్తారు. ఒక గూడ్స్ రైలులో 59 వ్యాగన్లు ఉంటాయి. దీనిని ఒక ర్యాకు అంటారు. ఒక వ్యాగనులో 80 టన్నుల బొగ్గును నింపాలి. వ్యాగనుకు 15 టన్నుల బొగ్గును తక్కువగా నింపి వే బిల్లు మాత్రం 80 టన్నులు నింపినట్టుగా చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం నింపితే ఒక ర్యాకులో 4,720 టన్నులు వెళ్లాలి. 15 టన్నులు తక్కువగా నింపితే ఒక ర్యాకులో 885 టన్నుల బొగ్గు తక్కువగా వెలుతుంది. ఈ విధంగా మిగిలించుకున్న బొగ్గును ఒక ర్యాకుకు సరిపడా తయారు చేసుకుని ఇతర పరిశ్రమలకు టన్నుకు రూ.3,500 చొప్పున రూ.1,65,20,000 అమ్ముకుంటారు. నెలలో ఐదు ర్యాకుల చొప్పున ఏడాదికి 60 ర్యాకుల బొగ్గును అమ్మితే రూ.100 కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. కాసులుకురిపిస్తున్న ‘రాగి’ సింగరేణిలోని భారీ యంత్రాలకు కేబుళ్ల ద్వారా విద్యుత్తు సరఫరా అవుతోంది. ఈ కేబుళ్లు అధిక బరువు ఉండటంతోపాటు నాణ్యతగల రాగితో తయారవుతాయి. రాగికి బాగా డిమాండ్ ఉంటుంది. రెండు ఫీట్ల పొడవు కేబుల్‌లో కిలోపైగా రాగి ఉంటుంది. సెలవు రోజుల్లో, యంత్రాలు మరమ్మతు కోసం ఆగినపుడు, విరామ సమయంలో, గనుల ఆవరణలో ఉన్న కేబుల్‌ను దొంగలు ఎత్తుకెళ్లి కాల్చివేస్తారు. దీంతో కేబుల్‌లో ఉన్న రాగి బయటకు వస్తుంది. ఈ రాగిని దొంగలు కిలో రూ.250 చొప్పున దళారులకు అమ్ముతారు. దళారులు హైదరాబాద్‌లోని బాలానగర్‌లో కిలో రూ.500 అమ్ముకుంటారు. కరిగించని రాగిని మాత్రమే రశీదు లేకుండా బాలానగర్‌లో కొంటారు. దళారులు కనీసం నెలలో పదిహేను సార్లు అయినా హైదరాబాద్‌లో అమ్ముతారు. ఈ విధంగా నెలకు పది క్వింటాళ్ల రాగి అమ్ముతారు. పది క్వింటాళ్లకు కిలో రూ.500 చొప్పున అమ్మితే రూ.5 లక్షలు అవుతాయి. దొంగలకు ఇవ్వగా దళారులకు రూ.2.50 లక్షలు మిగులుతాయి. ఏడాదికి దళారులు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారు. వరంగా మారిన ‘బెల్టు’ భూగర్భ గనులతోపాటు ఓసీపీలలో బొగ్గును బంకర్లలోకి తరలించడానికి బెల్టును ఉపయోగిస్తారు. బెల్టు ఒక ఇంచు మందంతోపాటు రెండున్నర ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఈ బెల్టును దొంగిలించడానికి గోదావరిఖనికి చెందిన ముఠా ఒకటి ఉంది. ఈ ముఠా దొరికి కేసులు గనుక అయితే దళారులే వారిని విడిపించేంత వరకు ఖర్చులు భరిస్తారు. దొంగల వద్ద దళారులు ఒక ఫీటు బెల్టును రూ.250 కొంటారు. ఈ బెల్టును దళారులు తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులోని బియ్యం మిల్లుల యజమానులకు ఒక ఫీటుకు రూ.1000 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బెల్టు సైజులుగా కత్తిరించి ట్రాన్సుపోర్టులో గోనె సంచుల ద్వారా పాలకొల్లుకు తరలిస్తారు. కొనుగోలు చేసిన వారు దళారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేస్తారు. ట్రాన్సుపోర్టు వారికి రూ.1000 ఇస్తే పాలకొల్లుకు బెల్టు వెలుతుంది. దళారులు నెలకు రూ.10 లక్షలు, ఏడాదికి రూ.కోటికిపైగా సంపాదిస్తున్నారు. అధికారుల అండదండలు ఉండటంతో వారు కూడా మామూలుగానే తీసుకుంటున్నారు. లక్షణంగా ఇనుము చోరీ బొగ్గు ఉత్పత్తికి ఉపయోగించే ఇనుప సామగ్రిని దొంగలకు కాసులు కురిపిస్తోంది. దొంగలు తస్కరించిన ఇనుమును బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని, కొత్తగూడెం ప్రాంతాల్లో కొందరు వ్యాపారస్తులు ఒక కిలోకు రూ.10 చొప్పున కొంటారు. కొనుగోలు చేసిన ఇనుమును హైదరాబాద్‌లో కిలోకు రూ.15 చొప్పున అమ్ముకుంటారు. నెలకు ఈ ప్రాంతాల నుంచి పది లారీల ఇనుము తరలుతోంది. ఏడాదికి రూ.18 లక్షల ఇనుప సామగ్రి దొంగలపాలవుతోంది. ఆస్తుల రక్షణలో అధికారులు విఫలం సింగరేణి ఆస్తులు కాపాడటానికి ఎస్అండ్పీసీ సిబ్బంది సుమారు 2వేల మంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది 800 మంది ఉన్నారు. ఎస్అండ్పీసీ సిబ్బందికి నెలకు సుమారు రూ.6 కోట్లు, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సుమారు రూ.2.50 కోట్లు సింగరేణి వేతనాల రూపంలో చెల్లిస్తోంది. అయినప్పటికీ చోరీలు ఆగడం లేదు. ఇప్పటికైన సింగరేణి రూ.కోట్ల ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉంది. -
అమరిక : ఇంటి కళకు ఇత్తడి, రాగి...
ఇంటి అలంకరణలో ఎంత ఆధునికత చోటుచేసుకుంటున్నా ప్రాచీన వస్తువుల పట్ల మనిషికి మక్కువ ఎక్కువవుతూనే ఉంటుంది. అంతటా ప్లాస్టిక్మయమైన ఈ రోజుల్లో ఇంటి అలంకరణలో ఇత్తడి, రాగి వస్తువులను ఉపయోగిస్తే ఆ కళ తీరే శోభాయమానంగా ఉంటుంది. ఇంట్లో స్టోర్ రూమ్‌లోనో, అటకమీదో పడేసిన వస్తువులను దించి, దుమ్మ తుడిచేయండి. పాతగా అనిపిస్తే కొత్తగా మెరిపించడానికి కింది చిట్కాలూ పాటించవచ్చు. ముందుగా చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. ఎమెరీ క్లాత్(లోహాలను మెరుగుపెట్టడానికి ఉపయోగించేది)తో ఇత్తడి పాత్రల, వస్తువుల అంచులను రుద్దాలి. దీనివల్ల అంచుల తయారీలో లోపాలు ఉండి, కొనలాంటి భాగాలు గుచ్చుకోకుండా కుదురుగా చేయొచ్చు. తర్వాత మెత్తని కాటన్ క్లాత్‌తో తుడవాలి. టొమాటో గుజ్జు ఇత్తడి పాత్రలకు రాసి, మెత్తటి కుచ్చు ఉన్న బ్రష్‌తో రుద్దాలి. తర్వాత మంచి నీటితో శుభ్రపరిచి కాటన్ వస్త్రంతో తుడవాలి. ఒక భాగం నీళ్లలో రెండు భాగాలు పాలు పోసి అందులో ఇత్తడి వస్తువులు కొన్ని గంటల పాటు ఉంచాలి. తర్వాత మంచినీటితో శుభ్రపరిచి పొడిక్లాత్‌తో తుడవాలి. రెండు భాగాలు వెనిగర్, ఒక భాగం నీరు కలిపి అందులో రెండు గంటలు ఇత్తడి వస్తువులను ఉంచాలి. తర్వాత శుభ్రపరచాలి. పొడి క్లాత్‌కు కొద్దిగా ఆలివ్ ఆయిల్ అద్దుకుని, దాంతో ఇత్తడి వస్తువులను బాగా రుద్దుతూ తుడిస్తే మెరుపు తగ్గదు. రాగి, ఇత్తడి వస్తువులను నిమ్మముక్కతో రుద్దినా పాత్రలకు కొత్తదనం వస్తుంది. ఇప్పుడిక అమ్మమ్మ వాడిన పూలసజ్జనో, నానమ్మ పెట్టిన నగలపెట్టెనో, తాతయ్య తాగిన మరచెంబునో పనికిరాదని పడేసే అవసరమే ఉండదు!