ఆరోగ్యపరంగా రాగి లోహానికి ఉన్న ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో రాగిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు రాగిని ఉపయోగించి క్యాన్సర్ డ్రగ్స్ మెడిసిన్స్‌ను చవకగా తయారు చేయొచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ సైంటస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది.
సాధరణంగా క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు తయారు చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ. 2 లక్షల 60 వేలకు పైగా ఖర్చు అయితే, రాగిని ఉపయోగించి మెడిసిన్స్ చేయడం వల్ల ఒక గ్రాముకు కేవలం రూ. 250 రూపాయలే అవుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో తేల్చారు. దీని వల్ల భవిష్యత్తులో చవకగా ఔషధాలు తయారు చేసేందుకు మార్గం సుగుమం అయ్యింది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే.
మనిషి మొదటగా కనుక్కొని వాడిన లోహం రాగి. కొన్ని వేల ఏళ్లుగా మనం రాగి వస్తువులను, రాగి పాత్రలను వాడుతూనే ఉన్నాం. దీన్ని తామ్రము అని, క్యూప్రమ్ అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్రలను వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే రుజువైంది. నీటిలో ఉండే బాక్టీరియాను నశింపజేసే శక్తి కూడా రాగికి ఉందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. రాగి లోహాలను వాడటం వల్ల అనేక రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా,చవకగా దొరికే లోహాల్లో రాగి ఒకటి. దీనికి ఉండే ఔషధ గుణాల రీత్యా క్యాన్సర్ చికిత్సలోనూ వాడేందుకు అనువుగా ఉందని ప్రొఫెసర్ ఓహ్యున్ క్వాన్ అన్నారు. క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా వాడే మందుల తయారీకి ఒక గ్రాముకు రూ. 2లక్షల 60 వేల(3వేల డాలర్లు)ఖర్చవగా, రాగిని ఉపయోగించి అదే ఔషధాన్ని తయారు చేసేందుకు కేవలం రూ.250 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు.
ఈ విధానం ద్వారా క్యాన్సర్ వ్యతిరేక c-Jun N- టెర్మినల్ కినేస్ ఇన్హిబిటర్‌ను కేవలం మూడు దశల్లోనే ఉత్పత్తి చేయగలిగారు. సాధారణంగా దీనికి 12 రసాయనిక చర్యలు అవసరం అవుతాయి. ఇందులో అడెనోసిన్, N6-మిథైలాడెనోసిన్‌ను సులువుగా అమైన్‌గా మార్చగలదు. కణాలు, వ్యాధి ప్రక్రియలు మరియు అభివృద్ధిలో జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఈ అమైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ప్రస్తుతమున్న క్యాన్సర్ చికిత్సలో దీన్ని ఉత్పత్తి చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ.8వేల 500($103)కు పైగా ఖర్చవుతుంది. అదే రాగిని ఉపయోగించడం వల్ల చాలా చవకగా ఔషధాలను తయారు చేయొచ్చని, భవిష్యత్తులో ఈ పద్దతి మరింత సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment