cancer treatment
-
ఆయుష్షు పెంచే ‘ఏఐ’
సాక్షి, విశాఖపట్నం: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ).. అన్ని రంగాల్లోనూ ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమూల మార్పులు తెస్తోంది. అత్యంత వేగంగా, కచ్చితత్వంతో కూడిన ఫలితాలతో ప్రపంచాన్ని మార్చేస్తోంది. వైద్య రంగంలోనూ వేగంగా చొచ్చుకు వస్తున్న ఈ కృత్రిమ మేధ మనిషి ఆయుష్షును పెంచడానికి కూడా దోహద పడుతుందని ప్రఖ్యాత వైద్య నిపుణులు, అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ ప్రెసిడెంట్ డా. ప్రతీక్ శర్మ తెలిపారు. భవిష్యత్తులో వైద్య రంగాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు ప్రజలకు చేరువ చేసే విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయని ఆయన చెప్పారు. విశాఖలో జరిగిన డీప్‌టెక్ సదస్సులో పాల్గొన్న డా. ప్రతీక్ శర్మ వైద్య రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.ఇప్పుడు 6% మాత్రమే ఉపయోగిస్తున్నాంకృత్రిమ మేధ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నా.. వైద్య రంగంలో మాత్రం అట్టడుగున ఉంది. వైద్య సేవల రంగంలో ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు కీలక ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో ఏఐ వినియోగం పెంచడానికి అన్ని దేశాలూ సంస్కరణలు కూడా తెస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే హెల్త్ కేర్‌లో ఏఐ సేవలు 6 శాతమే. 2022కి యూఎస్‌లో ఏఐ అడాప్షన్ రేట్ 19 శాతమే ఉంది.2047కి 85 శాతం వరకూ పెరిగే సూచనలున్నాయి. ఇది వైద్య సేవల్ని వేగవంతం చేయడమే కాకుండా మనిషి ఆయుష్షును పెంచేందుకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నాం. ఏఐ వినియోగంతో రోగ నిర్థారణ, సలహాలు, చికిత్సల్లో కచ్చితత్వం వస్తుంది. చాలా సమయం ఆదా అవుతుంది. ఔషధ పరిశోధనల్లోనూ ఏఐ సేవలు విస్త్రృతమవుతున్నాయి.హెల్త్‌కేర్ ఏఐలోభారీ పెట్టుబడులు..హెల్త్ కేర్‌లో ఏఐ వినియోగం కోసం అన్ని దేశాలూ పెట్టుబడులు భారీగా పెంచుతున్నాయి. అమెరికా ప్రస్తుతం 28.24 బిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చిస్తోంది. 2030కి 187.85 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టాలని నిర్ణయించింది. హెల్త్ కేర్‌లో ఏఐ వినియోగంలో భారత్ కూడా పురోగమిస్తోంది. భారత్‌లో 2022కి 0.13 బిలియన్ డాలర్లు మాత్రమే పెట్టుబడులుండగా.. 2030కి 2.92 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఇది శుభపరిణామమే అయినా.. భారత్ మరింతగా దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకుంటుంది.వైద్యంలో ఏఐ అప్లికేషన్స్ వినియోగం ఇలా..హెల్త్‌కేర్‌లో ఏఐ ఆధారిత అప్లికేషన్లు చాలా వరకూ వినియోగంలో ఉన్నాయి. డయాగ్నసిస్‌ను మరింతగా మెరుగుపరిచేందుకు, రోగి వైద్య రికార్డుల నిర్వహణ, వ్యక్తిగత వైద్య సేవల అభివృద్ధి, వైద్యులపై పనిభారం తగ్గించడం మొదలైన అంశాలకు సంబంధించిన యాప్స్ ఉన్నాయి. ఇప్పటికే వీటిని అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాల్లో ఉపయోగిస్తున్నారు. భారత్‌లో పేరొందిన ఆస్పత్రుల్లో ఇప్పుడిప్పుడే ఇవి ప్రారంభమవుతున్నాయి.క్యాన్సర్ చికిత్సలో అద్భుత ఫలితాలుక్యాన్సర్ చికిత్సలో ఆంకాలజీ విభాగంలో ఏఐ అద్భుత ఫలితాలు అందిస్తోంది. ప్రాథమిక దశలో బ్రెస్ట్ క్యాన్సర్‌ని గుర్తించడం కష్టతరం. కానీ, అమెరికాలో అతి తక్కువ సమయంలోనే ఏఐ ద్వారా రొమ్ము క్యాన్సర్‌ని గుర్తించారు. సెర్టిస్ ఏఐ యాప్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ఏఐ–డ్రివెన్ ఆంకాలజీ డ్రగ్ డిస్కవరీతో ఫలితాలు రాబడుతున్నారు. ఊపిరితిత్తులు, మెదడు, మెడ, చర్మ సంబంధమైన క్యాన్సర్ల గుర్తింపు ఫలితాలు కూడా వీలైనంత త్వరగా అందించేలా యాప్‌ల అభివృద్ధి జరుగుతోంది.మారుమూల పల్లెలకూ వైద్య సేవలుఏఐ ద్వారా మారుమూల గ్రామాలకూ వైద్య సేవలు చేరువవుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఈ ఫోన్లో ఏఐ ఉంటే.. ఆ ఫోన్ కూడా ఒక డాక్టర్‌గా మారిపోతుంది. ఏఐ డ్రివెన్ రిమోట్ కేర్ యాప్‌తో మారుమూల పల్లెల్లో ఉన్న రోగితో డాక్టర్ నేరుగా మాట్లాడి.. బీపీ, పల్స్ చెక్ చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చేసింది. వైద్యుల అపాయింట్మెంట్, వైద్య సలహాలు, సూచనల్ని చాట్‌బాట్ ద్వారా అందించే రోజులు కూడా వచ్చేశాయి. -
చికిత్స ఏదైతేనేం... సాంత్వనే ముఖ్యం!
కేన్సర్ వ్యాధిపై మరోసారి చర్చ మొదలైంది. అల్లోపతి పద్ధతులు మేలైనవా? లేక ప్రాచీన ఆయుర్వేదమే గట్టిదా అన్న ఈ చర్చకు ప్రముఖ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కారణమయ్యారు. సిద్ధూ భార్య, స్వయానా అల్లోపతి డాక్టర్ అయిన నవజోత్ కౌర్ సిద్ధూ ఆయుర్వేద పద్ధతు లను అవలంబించిన కారణంగానే కేన్సర్ నుంచి విముక్తు రాలినైనట్లు చెప్పడం ఒక రకంగా తేనెతుట్టెను కదిపి నట్లయింది. దేశంలోనే ప్రముఖ కేన్సర్ చికిత్సా కేంద్రం ‘టాటా మెమోరియల్ హాస్పిటల్’ ఇప్పటికే సిద్ధూ మాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనీ, శాస్త్రీయ పద్ధతుల్లో నిరూపణ అయిన చికిత్స పద్ధతులకే ప్రాధాన్య మివ్వాలనీ హెచ్చరించగా... తామేం చేశామో, ఎలా చేశామో వివరించేందుకు సిద్ధూ కూడా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండు వైద్యవిధానాల మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ వ్యాసం.పిండంతో మొదలై మరణించేంతవరకూ జరిగే కణ విభజన ప్రక్రియలో వచ్చే తేడా ఈ కేన్సర్ మహమ్మారికి కారణం. అదుపు తప్పి విచ్చలవిడిగా విభజితమయ్యే కణాలు కణితిగా ఏర్పడటం లేదా అవయవాల పనిని అడ్డుకునే స్థాయిలో మితిమీరి పెరిగిపోవడం జరుగుతూంటుంది. శతాబ్దాలుగా మనిషిని పట్టిపీడిస్తున్న ఈ వ్యాధికి అల్లోపతి సూచించే వైద్యం... శస్త్రచికిత్స, రేడియేషన్, కీమో థెరపీ! వ్యాధి ముదిరిన స్థాయిని బట్టి, ఏ అవయ వానికి సోకిందన్న అంశం ఆధారంగా ఈ మూడింటిని లేదా విడివిడిగా, రెండింటిని కలిపి వాడుతూంటారు. అయితే శస్త్రచికిత్స తరువాత కూడా కేన్సర్ మళ్లీ తిరగ బెట్టవచ్చు.రేడియేషన్, కీమోథెరపీలు శరీరాన్ని గుల్ల బార్చేంత బాధాకరమైన ప్రక్రియలు. అందుకే చాలామంది చెప్పేదేమిటంటే... కేన్సర్ వ్యాధితో కంటే దానికి చేసే చికిత్సతోనే ఎక్కువమంది మరణిస్తూంటారూ అని! కొన్ని దశాబ్దాలుగా పాటిస్తున్న ఈ మూడు రకాల ఆధునిక వైద్య పద్ధతులకు ఇటీవలి కాలంలో కొన్ని వినూత్నమైన చికిత్స పద్ధతులు వచ్చి చేరాయి. రోగ నిరోధక శక్తినే కేన్సర్ కణాలపై దాడి చేసేలా చేయడం (ఇమ్యూనో థెరపీ), కణితులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రాంతానికి మాత్రమే రేడియేషన్ అందించడం (ప్రిసిషన్ ఆంకాలజీ), తక్కువ డోసు కీమోథెరపీ మందులను ఎక్కువసార్లు ఇవ్వడం (భారత్‌లో ఆవిష్కృతమైన పద్ధతి) మునుపటి వాటి కంటే కొంత మెరుగైన ఫలితాలిస్తున్నాయి. అయితే ఈ రోజు వరకూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంచనా ఏమిటీ అంటే... కేన్సర్‌కు చికిత్స లేదు అని! కాకపోతే మరణాన్ని కొన్నేళ్లపాటు వాయిదా వేయడం మాత్రం సాధ్యమైంది. అది ఐదేళ్లా? (సర్వైవల్ రేట్) పదేళ్లా అన్న చర్చ వేరే!ప్రత్యామ్నాయ పద్ధతుల మాటేమిటి?వేల సంవత్సరాల మానవజాతి పయనంలో ఎంతో ప్రగతి సాధించినమాట నిజమే. కానీ ఇప్పటికీ కనీసం మనిషి తాను నివసిస్తున్న భూమిని పూర్తిగా అర్థం చేసుకో గలిగాడా? లేదనే చెప్పాలి. చేసుకోగలిగి ఉంటే... వాతా వరణ కాలుష్యం లాంటి సమస్యకైనా... కేన్సర్ లాంటి వ్యాధి చికిత్సకైనా ఎప్పుడో పరిష్కారాలు దొరికి ఉండేవి. దొరకలేదు కాబట్టే ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతులు, మందులు కనుక్కుంటున్నారు. వ్యాధులను జయించే దిశగా ప్రయాణిస్తు న్నారు. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్ర శేఖర్ మాటలను ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిఉంటుంది. సైన్స్... సత్యాన్వేషణకు జరిగే నిరంతర ప్రయాణమంటారాయన. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు ఈ ప్రయాణంలో ఎప్పటికప్పుడు మనం కొత్త మైలు రాళ్లను చేరుకుంటూ ఉంటామే తప్ప... అంతిమ సత్యాన్ని ఆవిష్కరించలేము అని మనం అర్థం చేసుకోవాలి.కేన్సర్ విషయానికే వద్దాం... అల్లోపతి విధానాల్లోని లోటుపాట్లను గుర్తించిన చాలామంది వైద్యులు ప్రత్యా మ్నాయ మార్గాలపై కూడా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆయుర్వేదం కూడా వీటిల్లో ఒకటి. కానీ... ఆయుర్వేదంలో ఉన్న చిక్కు గురించి ఐఐసీటీ మాజీ డైరెక్టర్ ఒకరి మాటలు వింటే సమస్య ఏమిటన్నదికొంత అవగతమవుతుంది. ఆయుర్వేదంలో ఉపయోగించే మొక్కల్లో కొన్ని వందలు, వేల రసాయనాలు ఉంటాయి. వాటిల్లో ఏ రసాయనం, లేదా కొన్ని రసాయనాల మిశ్రమం వ్యాధి చికిత్సలో ఉపయోగపడిందో తెలుసు కోవడం కష్టమని ఆయన చెబుతారు. నిజం కావచ్చు కానీ... పాటించే పద్ధతీ, ఏ రసాయనం ఉపయోగపడిందో కచ్చితంగా మనకు తెలియాల్సిన అవసరముందా? రోగికి మేలు జరిగితే చాలు కదా? పైగా ఆయుర్వేదాన్ని, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను కూడా శాస్త్రవేత్తలు అను మానపు దృష్టితోనే చూశారు. చాలా కొద్దిమంది అందు లోని సైన్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పాలి. అల్లోపతి వైద్యం ఫూల్ ప్రూఫా? కానేకాదు. ఒక మందు తయారయ్యేందుకు పది పన్నెండేళ్లు పట్టడం ఒక విషయమైతే... దాదాపు ప్రతి మందుతోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొన్ని కేన్సర్‌కూ కారణమవుతూండటం చెప్పు కోవాలి.అల్లోపతితోనే వినూత్నంగా...కేన్సర్ విషయంలో అల్లోపతి, ఆయుర్వేదాల మధ్య చర్చ ఒకపక్క ఇలా నడుస్తూండగానే... అమెరికాలో ఇంకో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. డా‘‘ ఇల్యెస్ బాగ్లీ, పియెరిక్ మార్టినెజ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఐవర్ మెక్టిన్, మెబెండజోల్, ఫెన్బెండజోల్ వంటి మాత్రలను కేన్సర్‌పై ప్రయోగించారు. ఈ మందులు మామూలుగా పేవుల్లోని హానికారక పరాన్నజీవులను నాశనం చేసేందుకు వాడుతూంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమి టంటే... ఐవర్ మెక్టిన్, మెబెండజోల్ మాత్రలతో కొంత మంది వైద్యులు అభివృద్ధి చేసిన చికిత్స పద్ధతి అద్భుతంగా పనిచేయడం. పైగా... శాస్త్రవేత్తలు కొందరు ఈ పద్ధతి, ఫలితాలను ధ్రువీకరించడం. ఫలితంగా ఈ పద్ధతి ‘జర్నల్ ఆఫ్ ఆర్థో మాలిక్యులర్ మెడిసిన్’లో ‘టార్గెటింగ్ ద మైటోకాండ్రియల్ స్టెమ్ సెల్ కనెక్షన్ ఇన్ కేన్సర్ ట్రీట్మెంట్’ పేరుతో ఈ ఏడాది సెప్టెంబరు 19న ప్రచురి తమైంది.ఇల్యెస్ బాగ్లీ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఆర్థో మాలిక్యులర్ మెడిసిన్ అధ్యక్షుడు. అల్జీరియా దేశస్థుడు. పియెరిక్ మార్టినెజ్ కేన్సర్ పరిశోధనల్లో బాగ్లీతో కలిసి పనిచేశారు. థైరాయిడ్ కేన్సర్‌తో పాటు నవ్‌జోత్ కౌర్ సిద్ధూను వేధించిన రొమ్ము కేన్సర్, పాంక్రియాస్ కేన్సర్లపై ఈ రెండు మందులు ప్రభావం చూపుతున్నట్లు ప్రస్తుతా నికి ఉన్న సమాచారం. మరిన్ని కేన్సర్లపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.ఒకప్పుడు గుర్రాల్లో పురుగులను తొలగించేందుకు వాడిన ఐవర్ మెక్టిన్లో కేన్సర్ కణాలను మట్టుబెట్టగల కనీసం 15 మూలకాలు ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. డా‘‘ బాగ్లీ, డా‘‘ మార్టినెజ్ వంటి వారు సంప్రదాయవాదుల మాటలకే కట్టుబడి ఈ ప్రయోగం చేసి ఉండకపోతే... కేన్సర్ చికిత్సకు ఇతర మార్గాలూ ఉన్నాయన్న విషయం ఎప్పటికీ తెలిసి ఉండేది కాదేమో.చివరగా... ఒక్క విషయం: కేన్సర్ చికిత్సకు ఐవర్ మెక్టిన్, ఫెన్బెండజోల్ల వాడకానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అనుమతులూ లేవు. కాబట్టి.. పరిశోధన ఫలితాలను రూఢి చేసుకోవడంతోపాటు మరిన్ని చేప ట్టడం కూడా అవసరం. అంత వరకూ మనం కేన్సర్ మహ మ్మారికి అణిగిమణిగి ఉండా లన్నది నిష్ఠుర సత్యం!– గిళియారు గోపాలకృష్ణ మయ్యాసీనియర్ జర్నలిస్ట్ -
క్యాన్సర్ చికిత్సలో జుట్టుకు శ్రీరామరక్ష
క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ అక్షరాలా నరకప్రాయం. శరీరమంతటినీ నిస్తేజంగా మార్చేస్తుంది. పైగా దాని సైడ్ ఎఫెక్టులు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ముఖ్యమైనది జుట్టు రాలడం. కనీసం 65 శాతానికి పైగా రోగుల్లో ఇది పరిపాటి. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లోనైతే చికిత్ర క్రమంలో దాదాపు అందరికీ జుట్టు పూర్తిగా రాలిపోతుంటుంది. ఈ బాధలు పడలేక కీమోథెరపీకి నిరాకరించే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఇది శుభవార్తే. కీమోథెరపీ సందర్భంగా హెల్మెట్ వంటి ఈ హెడ్‌గేర్ ధరిస్తే చాలు. జుట్టు రాలదు గాక రాలదు!స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ ఐర్లండ్‌కు చెందిన ల్యూమినేట్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న హెల్మెట్‌ను తయారు చేసింది. దీన్ని స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. చికిత్స జరుగుతన్నంతసేపూ రోగి ఈ హెడ్‌గేర్ ధరిస్తాడు. దాన్ని ఓ యంత్రానికి అనుసంధానిస్తారు. దానిగుండా తల మొత్తానికీ చల్లని ద్రవం వంటిది సరఫరా అవుతూ ఉంటుంది. అది తలలోని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను బాగా తగ్గిస్తుంది. తద్వారా ఆ ప్రాంతానికి చేరే క్యాన్సర్ ఔషధాల పరిమాణం చాలావరకు తగ్గుతుంది. దాంతో వాటి దు్రష్పభావం జుట్టుపై పడదు. కనుక అది ఊడకుండా ఉంటుంది. ‘‘ఈ హెడ్గేర్ను ఇప్పటికే యూరప్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించగా 75 శాతానికి పైగా రోగుల్లో జుట్టు ఏ మాత్రమూ ఊడలేదు. మిగతా వారిలోనూ జుట్టు ఊడటం 50 శాతానికి పైగా తగ్గింది. రొమ్ము క్యాన్సర్ రోగుల్లోనైతే 12 సెషన్ల కీమో థెరపీ అనంతరం కూడా జుట్టు దాదాపుగా పూర్తిగా నిలిచి ఉండటం విశేషం’’ అని కంపెనీ సీఈవో ఆరన్ హానన్ చెప్పారు. అంతేగాక వారి లో ఎవరికీ దీనివల్ల సైడ్ ఎఫెక్టులు కని్పంచలేదన్నారు. రొ మ్ము క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టంతా పోగొట్టుకున్న ఓ యువ తిని చూసి ఆయన చలించిపోయారట. ఆ బాధలోంచి పురు డు పోసుకున్న ఈ హెల్మెట్‌కు లిలీ అని పేరు కూడా పెట్టారు! వచ్చే ఏడాది యూరప్, అమెరికాల్లో దీని క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టనున్నారు. అవి విజయవంతం కాగానే తొలుత యూఎస్ మార్కెట్లో ఈ హెల్మెట్‌ను అందుబాటులోకి తెస్తారట. దీనికి క్యాన్సర్ రోగుల నుంచి విశేషమైన ఆదరణ దక్కడం ఖాయమంటున్నారు.లోపాలూ లేకపోలేదు అయితే ఈ స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీలో కొన్ని లోపాలూ లేకపోలేదు. కీమో సెషన్ జరిగినప్పుడల్లా చికిత్సకు ముందు, సెషన్ సందర్భంగా, ముగిశాక హెడ్‌గేర్ థెరపీ చేయించుకోవాలి. ఇందుకు కీమోపై వెచి్చంచే దానికంటే కనీసం రెండు మూడు రెట్ల సమయం పడుతుందని హానన్ వివరించారు. ముఖ్యంగా చికిత్స పూర్తయిన వెంటనే హెల్మెట్‌ను కనీసం 90 నిమిషాల పాటు ధరించాల్సి ఉంటుందని చెప్పారు. పైగా దీనివల్ల తలంతా చెప్పలేనంత చల్లదనం వ్యాపిస్తుంది. ఇలాంటి లోటుపాట్లను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు హానన్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేన్సర్ కణాలపై అణువుల సుత్తి!
కేన్సర్... పేరు చెప్పగానే మరణం ఖాయమన్న ఆలోచనలు అందరిలోనూ మెదులుతాయి. అయితే అత్యాధునిక టెక్నాలజీ, పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు కేన్సర్ వ్యాధి నిర్వహణ ఎంతో సులువైంది. కాకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య పద్ధతులు మూడింటితోనూ బోలెడన్ని సమస్యలు, దుష్ప్రభావాలైతే ఉన్నాయి. అందుకే అతితక్కువ దుష్ప్రభావాలున్న చికిత్స పద్ధతి కోసం శాస్త్రవేత్తలు చాలా చోట్ల పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా రైస్ యూనివర్శిటీ Rice University శాస్త్రవేత్తలు విజయం సాధించారు కూడా. ప్రత్యేకమైన కాంతి, కొన్ని అణువుల సాయంతో 99 శాతం కేన్సర్ కణాలను చంపేయవచ్చునని వీరు నిరూపించారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ప్రధానంగా మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. ► శస్త్రచికిత్స కణితిని తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స(సర్జరీ) ఇది శరీరాన్ని బలహీన పరిచే ప్రక్రియ. ►ఇక రెండోది కీమో థెరపీ ఇందులో రేడియోధార్మిక రసాయనాల సాయంతో శరీరంలోని కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు. జుట్టు ఊడిపోవడం, వాంతులు, విరేచనాలు, అలవిగాని అలసట.. ఇలా రకరకాల దుష్ప్రభావాలు తప్పవు. ► మూడో పద్ధతి.. రేడియో థెరపీ రేడియో ధార్మిక పదార్థాలతో నేరుగా కణితులను నాశనం చేసేందుకు వాడే పద్ధతి ఇది కీమోథెరపీతో వచ్చే ఇబ్బందులే ఇక్కడ కూడా కనిపిస్తాయి ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రిసిషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ వంటివి మునుపటి పద్ధతుల కంటే కొంత మెరుగ్గా ఉన్నా... శాస్త్రవేత్తలు వీటిపై మరింత పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఏం చేశారంటే.. చాలా సింపుల్. అమైనో సయనైన్ అణువులు కొన్నింటిని తీసుకున్నారు. పరారుణ కాంతి కిరణాల ద్వారా వాటిని ఉత్తేజపరిచారు. ఫలితంగా ఈ అణువులు కంపించడం మొదలుపెట్టాయి. ఇలా కంపిస్తున్న అణువులను దగ్గరగా ఉంచడం ద్వారా కేన్సర్ కణాల పైపొరలు విచ్ఛిన్నమై నాశనమయ్యేలా చేశారు. అంతే!! ఈ అమైనో సయనైన్ అణువులను శరీరం లోపలి అవయవాల ఫొటోలు తీసేందుకు ఒక రకమైన రంగు మాదిరిగా ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పరారుణ కాంతి పడినప్పుడు వీటిల్లోని అణువులు ఉత్తేజితమై ప్లాస్మాన్లుగా మారుతున్నాయి. అణువు లోపలే కంపిస్తూ ఉంటాయి. ఈ కంపనాలు కాస్తా కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేందుకు కారణమవుతున్నాయి. పరారుణ కాంతి వినియోగానికీ ప్రాముఖ్యత ఉంది. ఈ కాంతి శరీరం లోపలికి దృశ్యకాంతి కంటే లోతుగా చొచ్చుకుపోగలదు. శరీరం లోపలి అవయవాలు మాత్రమే కాకుండా.. ఎముకలకు వచ్చే కేన్సర్లకు కూడా ఈ కాంతి ద్వారా చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నమాట. ఈ పద్ధతి పనితీరుపై రైస్ యూనివర్శిటీ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ మాట్లాడుతూ.. కంపనాలన్నీ క్రమ పద్ధతిలో ఒకేలా ఉండేలా చేయడం వల్ల కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. ‘‘నిజానికి ఈ పద్ధతిని కేన్సర్‌పై అణువుల సుత్తి దెబ్బ’’ అనాలి అంటారు ఆయన. ఎలుకల్లో కేన్సర్ మాయం.. రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గాజు పాత్రలో కేన్సర్ కణాలను ఉంచి అమైనో సైనైన్ అణువులను ప్రయోగించారు. ఆశ్చర్యకరమైన రీతిలో 99 శాతం వరకూ కేన్సర్ కణాలు నశించిపోయాయి. మెలనోమా కేన్సర్ కణితులున్న ఎలుకలపై వాడినప్పుడు కూడా కొంత కాలం తరువాత దాదాపు సగం ఎలుకల్లో కేన్సర్ కణాలన్నవి లేకుండా పోయాయి. ఈ పరిశోధనల్లో రైస్ యూనివర్శిటీతోపాటు టెక్సస్ ఏ అండ్ ఎం, యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్‌లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే... నేడో రేపో.. ప్రాణాంతక కేన్సర్‌ను ఎలాంటి దుష్ప్రభావాలు, శస్త్రచికిత్సల అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చునన్నమాట!!! -
రాగితో చౌకగా క్యాన్సర్ మందులు తయారు చేయొచ్చు: సైంటిస్టులు
ఆరోగ్యపరంగా రాగి లోహానికి ఉన్న ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో రాగిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు రాగిని ఉపయోగించి క్యాన్సర్ డ్రగ్స్ మెడిసిన్స్‌ను చవకగా తయారు చేయొచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ సైంటస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధరణంగా క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు తయారు చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ. 2 లక్షల 60 వేలకు పైగా ఖర్చు అయితే, రాగిని ఉపయోగించి మెడిసిన్స్ చేయడం వల్ల ఒక గ్రాముకు కేవలం రూ. 250 రూపాయలే అవుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో తేల్చారు. దీని వల్ల భవిష్యత్తులో చవకగా ఔషధాలు తయారు చేసేందుకు మార్గం సుగుమం అయ్యింది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. మనిషి మొదటగా కనుక్కొని వాడిన లోహం రాగి. కొన్ని వేల ఏళ్లుగా మనం రాగి వస్తువులను, రాగి పాత్రలను వాడుతూనే ఉన్నాం. దీన్ని తామ్రము అని, క్యూప్రమ్ అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్రలను వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే రుజువైంది. నీటిలో ఉండే బాక్టీరియాను నశింపజేసే శక్తి కూడా రాగికి ఉందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. రాగి లోహాలను వాడటం వల్ల అనేక రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా,చవకగా దొరికే లోహాల్లో రాగి ఒకటి. దీనికి ఉండే ఔషధ గుణాల రీత్యా క్యాన్సర్ చికిత్సలోనూ వాడేందుకు అనువుగా ఉందని ప్రొఫెసర్ ఓహ్యున్ క్వాన్ అన్నారు. క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా వాడే మందుల తయారీకి ఒక గ్రాముకు రూ. 2లక్షల 60 వేల(3వేల డాలర్లు)ఖర్చవగా, రాగిని ఉపయోగించి అదే ఔషధాన్ని తయారు చేసేందుకు కేవలం రూ.250 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా క్యాన్సర్ వ్యతిరేక c-Jun N- టెర్మినల్ కినేస్ ఇన్హిబిటర్ను కేవలం మూడు దశల్లోనే ఉత్పత్తి చేయగలిగారు. సాధారణంగా దీనికి 12 రసాయనిక చర్యలు అవసరం అవుతాయి. ఇందులో అడెనోసిన్, N6-మిథైలాడెనోసిన్ను సులువుగా అమైన్గా మార్చగలదు. కణాలు, వ్యాధి ప్రక్రియలు మరియు అభివృద్ధిలో జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఈ అమైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతమున్న క్యాన్సర్ చికిత్సలో దీన్ని ఉత్పత్తి చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ.8వేల 500($103)కు పైగా ఖర్చవుతుంది. అదే రాగిని ఉపయోగించడం వల్ల చాలా చవకగా ఔషధాలను తయారు చేయొచ్చని, భవిష్యత్తులో ఈ పద్దతి మరింత సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక ట్రీట్మెంట్.. మొదటి హాస్పిటల్‌గా గుర్తింపు
అపోలో క్యాన్సర్ సెంటర్ సరికొత్త మైలురాయిని చేరుకుంది.దక్షిణాసియాలో మొట్టమొదటి సైబర్‌నైఫ్(CyberKnife® S7™ FIM) రోబోటిక్ రేడియో సర్జరీ సిస్టమ్‌ను అపోలో క్యాన్సర్ సెంటర్లో ప్రవేశపెట్టారు.సైబర్‌నైఫ్ సిస్టమ్ అనేది క్యాన్సర్, చికిత్స చేయలేని క్యాన్సర్ కణితులకు రేడియేషన్ థెరపీని అందించే నాన్-ఇన్వాసివ్ చికిత్స. ఇది మెదడు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ప్రోస్టేట్ ,పొత్తికడుపు క్యాన్సర్లతో సహా శరీరం అంతటా క్యాన్సర్ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా ఈ విధానం అందుబాటులో ఉంది. గతంలో రేడియేషన్‌తో చికిత్స పొందిన రోగులు, మెటాస్టాటిక్ గాయాలు పునరావృత క్యాన్సర్లు ఉన్నవారు కూడా సైబర్‌నైఫ్ చికిత్స తీసుకోవచ్చు. సైబర్‌నైఫ్ సిస్టమ్ అనేది రేడియేషన్ డెలివరీ పరికరాన్ని కలిగి ఉన్న ఏకైక రేడియేషన్ డెలివరీ సిస్టమ్. దీన్ని లీనియర్ యాక్సిలరేటర్ అని పిలుస్తారు, రేడియేషన్ థెరపీలో ఉపయోగించే హై-ఎనర్జీ X-కిరణాలు లేదా ఫోటాన్లను పంపిణీ చేయడానికి నేరుగా రోబోట్‌పై అమర్చబడుతుంది. ఇది వేలాది బీమ్ కోణాల నుంచి మోతాదులను అందించడానికి,శరీరంలో ఎక్కడైనా డెలివరీ ఖచ్చితత్వానికి కొత్త ప్రమాణాన్ని సెట్ చేయడానికి రోబోట్‌ను ఉపయోగిస్తారు. అపోలో క్యాన్సర్ సెంటర్లో గత 15 సంవత్సరాలుగా సైబర్‌నైఫ్ టెక్నాలజీని ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన నిపుణుల బృందం ఉంది. ఇప్పటివరకు, ఇక్కడ మూడు వేల క్యాన్సర్ కేసులను పర్యవేక్షించారు.ఇప్పుడు సైబర్‌నైఫ్ సిస్టమ్‌ను ప్రారంభించి క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన విధానాన్ని విప్లవాత్మకంగా ప్రారంభించి దక్షిణాసియాలో మొదటి సంస్థగా నిలిచింది.సైబర్నైఫ్లో సర్టిఫైడ్ ఫెలోషిప్ శిక్షణా కార్యక్రమాన్ని అందించినందుకు గానూ అపోలో క్యాన్సర్ సెంటర్ దేశంలోనే మొదటి సంస్టగా గుర్తింపు పొందింది. సీనియర్ కన్సల్టెంట్ – రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ మహదేవ్ పోతరాజు మాట్లాడుతూ..సైబర్‌నైఫ్ చికిత్సలుసాధారణంగా 1-5 సెషన్లలో నిర్వహించబడతాయి. చికిత్స వ్యవధి సాధారణంగా 30-90నిమిషాల వరకు ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో అనస్థీషియా లేదా కోతలు అవసరం లేదు.చాలా మంది రోగులు చికిత్స సమయంలో రోజువారీ కార్యకలాపాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది అని అన్నారు. -
క్యాన్సర్ బాధితులకు ‘ఆరోగ్యసిరులు’
క్యాన్సర్ బారినపడిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా ఉంటోంది. 2019 నుంచి ఇప్పటివరకు 2.64 లక్షల మంది బాధితులకు జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించింది. ఇందుకోసం రూ.1,801 కోట్లు ఖర్చుచేసింది. ఈ ఫొటోలో మంచంపై ఉన్న మహిళ పేరు కె. సువార్త. ఈమెది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామం. పొదుపు సంఘాల ఆర్పీగా పనిచేస్తోంది. భర్త ఆటో డ్రైవర్. కొద్దినెలల క్రితం గొంతులో సమస్య మొదలైంది. క్రమంగా ఆ సమస్య తీవ్రమై ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులను సంప్రదిస్తే.. గొంతు క్యాన్సర్‌గా నిర్ధారించారు. ఉన్నంతలో సంతోషంగా జీవించే ఆ కుటుంబంలో ఆందోళన మొదలైంది. ఇంతలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్‌కు ఉచిత వైద్యం లభిస్తుందని తెలియడం రాజేశ్‌కు ఎంతో ఊరటనిచ్చింది. దీంతో విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి భార్యను తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ నా కుటుంబానికి సీఎం జగన్ ప్రభుత్వం అనేక పథకాలు అందించింది. ఇప్పుడు నా ఇల్లాలు క్యాన్సర్‌తో బాధపడుతుంటే ఉచిత వైద్యం కూడా అందిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే ఈ రోజున నా భార్యను బతికించుకునేందుకు నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చేదో’’.. అని అంటున్నాడు. – సాక్షి, అమరావతి ఇలా సువార్తలాగే క్యాన్సర్ బారినపడ్డ పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా ఉంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం పరిధిని సీఎం జగన్ విస్తరించారు. టీడీపీ ప్రభుత్వంలో 1,059గా ఉన్న ప్రొసీజర్స్‌ను ఏకంగా 3,257కు పెంచారు. అలాగే, టీడీపీ హయాంలో 200లోపు మాత్రమే క్యాన్సర్ ప్రొసీజర్లు ఉండగా ప్రస్తుతం 400కు పైగా క్యాన్సర్ ప్రొసీజర్లు పథకం పరిధిలోకి వచ్చాయి. లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) బాధితులకు నిర్వహించే అత్యంత ఖరీదైన బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు. అలాగే, రూ.10 లక్షలు, ఆపైన ఖర్చయ్యే ఈ ప్రొసీజర్‌ను పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఇలా ఏ తరహా క్యాన్సర్‌కైనా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స లభిస్తోంది. ఒక్క క్యాన్సరే కాకుండా.. క్యాన్సర్‌కే కాక.. హృద్రోగాలు, కిడ్నీ, లివర్ ఇలా వివిధ రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ ద్వారా బాధితులకు ఉచితంగా అందుతున్నాయి. అదే టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో అప్పట్లో పేదలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. కానీ, ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం తీసుకొస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ మేలు చేకూరుతోంది. ప్రొసీజర్లను 3,257కి పెంచి 2019 నుంచి ఇప్పటికి 40 లక్షల మందికి ఉచిత వైద్యం అందించారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి ఆరోగ్య ఆసరా కింద కూడా అండగా నిలుస్తున్నారు. ఇలా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం 2019 నుంచి ఇప్పటికి రూ.10వేల కోట్లకు పైగా జగన్ సర్కార్ ఖర్చుచేసింది. ప్రభుత్వమే నా మనవరాలిని బతికించింది.. నా మనవరాలికి బ్లడ్ క్యాన్సర్. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఒకరోజు జీవచ్ఛవంలా పడిపోయిన పాపను ఎత్తుకుని విజయవాడలోని హెచ్‌సీజీ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పాపకు వైద్యం మొదలుపెట్టారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. ఈరోజు నా మనవరాలి ప్రాణాలను సీఎం జగన్ ప్రభుత్వం కాపాడింది. – శాంతకుమారి, విజయవాడ 2.64 లక్షల మందికి వైద్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద 2,64,532 మంది క్యాన్సర్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.1,801.30 కోట్లు ఖర్చుచేసింది. ఇదే 2014–19 మధ్య టీడీపీ హయాంలో క్యాన్సర్ చికిత్సకు కేవలం రూ.751.56 కోట్లు ఖర్చుచేశారు. అంటే.. నాలుగేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీడీపీ కంటే రూ.1,049.74కోట్లు అదనంగా ఖర్చుచేసింది. ప్రభుత్వమే నా మనవరాలిని బతికించింది.. నా మనవరాలికి బ్లడ్ క్యాన్సర్. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఒకరోజు జీవచ్ఛవంలా పడిపోయిన పాపను ఎత్తుకుని విజయవాడలోని హెచ్‌సీజీ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పాపకు వైద్యం మొదలుపెట్టారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. ఈరోజు నా మనవరాలి ప్రాణాలను సీఎం జగన్ ప్రభుత్వం కాపాడింది. – శాంతకుమారి, విజయవాడ ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే.. మా నాన్నకు గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆయన కౌలు రైతు. వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో వాళ్లు జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ చికిత్సకు సొంతంగా ఖర్చుపెట్టే స్థోమత లేదు. ఆరోగ్యశ్రీ పథకం మా నాన్నను ఆదుకుంది. పథకం లేకపోయి ఉంటే ఎంతో కష్టంగా ఉండేది. ఈ మేలును ఎప్పటికీ మరువలేం. – ప్రశాంతి, శృంగవృక్షం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా పూర్తి ఉచితంగా వైద్యం.. అన్ని రకాల క్యాన్సర్‌తో పాటు, రూ.వెయ్యి వైద్యం ఖర్చు దాటే ప్రతి ప్రొసీజర్‌ను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. అర్హులైన లబ్దిదారులకు ఉచితంగా వైద్యం అందేలా చూస్తున్నాం. చికిత్స అనంతరం రోగుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. మెజారిటీ శాతం సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పథకాన్ని మరింతగా మెరుగుపరచడానికి నిరంతరం కసరత్తు చేస్తున్నాం. – ఎంఎన్ హరేంధిరప్రసాద్, సీఈఓ, డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
లెవల్–1 క్యాన్సర్ సెంటర్‌గా గుంటూరు
సాక్షి, అమరావతి : ప్రభుత్వరంగ ఆస్పత్రుల్లోనే క్యాన్సర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముమ్మరం చేసింది. వ్యాధి నియంత్రణ, నివారణకు సీఎం వైఎస్ జగన్ ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ వైద్యం కోసం బాధితులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పనిలేకుండా అన్ని ప్రాంతాల్లో 50 కి.మీ పరిధిలోనే వైద్య సదుపాయాలను కల్పించేలా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ రోడ్ మ్యాప్‌ను రాష్ట్ర వైద్యశాఖ రూపొందించింది. తొలిదశ కింద.. గుంటూరు జీజీహెచ్‌లోని క్యాన్సర్ విభాగాన్ని లెవల్–1 సెంటర్‌గా, కర్నూలు, విశాఖపట్నంలో లెవల్–2 క్యాన్సర్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. రెండో దశలో కాకినాడ, అనంతపురం జీజీహెచ్‌లలోని విభాగాలను లెవెల్–2 క్యాన్సర్ సెంటర్లుగా అభివృద్ధిచేస్తుంది. ఇందుకుగాను రూ.119.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అధునాతన పరికరాల ఏర్పాటు గుంటూరు, కర్నూలు, విశాఖ క్యాన్సర్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వైద్య పరికరాలను సమకూరుస్తోంది. నాట్కో సహకారంతో గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్ సెంటర్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది. క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ థెరపీ అందించడానికి ఆధునిక వైద్య పరికరాల్లో ఒకటైన లీనియర్ యాక్సిలేటర్ (లినాక్) ఇక్కడ అందుబాటులో ఉంది. దీనిని లెవెల్–1 సెంటర్‌గా అభివృద్ధి చేపట్టడానికి వీలుగా పెట్ స్కాన్ మిషన్‌ను సర్కార్ సమకూరుస్తోంది. మరోవైపు.. రూ.120 కోట్లతో కర్నూలులో కొత్తగా ఏర్పాటుచేస్తున్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ భవన నిర్మాణ పనులు వచ్చేనెలలో పూర్తవుతాయి. విశాఖపట్నంలో ఇప్పటికే భవనం అందుబాటులో ఉంది. ఈ రెండు చోట్లకు లినాక్, హెచ్డీఆర్ బ్రాకీ, సీటీ సిమ్యులేటర్ పరికరాల కొనుగోలుకు అధికారులు పర్చేజింగ్ ఆర్డర్లు(పీఓ) ఇచ్చారు. అదే విధంగా.. సర్జికల్, మెడికల్, రేడియేషన్ అంకాలజీ పరికరాల కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా పరికరాలను సమకూర్చే ప్రక్రియ పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. అనంతపురం, కాకినాడల్లో లినాక్, సీటీ సిమ్యులేటర్ పరికరాల ఏర్పాటుకు బంకర్ల నిర్మాణం, ఇతర పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా అండగా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. దీనికితోడు.. టీడీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వాస్పత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా.. క్యాన్సర్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులపైనే మెజారిటీ శాతం ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాల కల్పన, ఆయా ఆస్పత్రుల బలోపేతం, వ్యాధి నియంత్రణ చర్యలపై దృష్టిసారించారు. అలాగే, క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. గత ఏడాది క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం పథకం కింద ఏటా రూ.600 కోట్లు ఖర్చుచేశారు. ప్రణాళికాబద్ధంగా క్యాన్సర్‌కు కళ్లెం క్యాన్సర్‌కు వైద్యం, వ్యాధి నియంత్రణ చర్యల విషయంలో ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ రంగంలోనే ఇందుకు మెరుగైన వైద్యం అందాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించాం. ఈ ఏడాది ఆఖరుకు లెవల్–1 సెంటర్‌గా గుంటూరు.. లెవల్–2 కేంద్రాలుగా కర్నూలు, విశాఖపట్నం క్యాన్సర్ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం. మరోవైపు.. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్‌ను ప్రారంభించాం. దీని పరిధిలోకి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రులను తీసుకొచ్చి చికిత్స విషయంలో నిర్దేశిత ప్రొటోకాల్స్‌ను పాటించేలా చూస్తున్నాం. క్యాన్సర్ రిజిస్ట్రీని కూడా ప్రారంభించాం. – ఎం.టి. కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ -
క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం
మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడింది. మూడు నెలల క్రితం నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురైనట్లు వైద్యులు పేర్కొన్నారు. అప్పటినుంచి క్యాన్సర్‌తో పోరాడిన ఆమె ఎట్టకేలకు దాని నుంచి విముక్తి పొందినట్లు స్వయంగా ప్రకటించింది. ''క్యాన్సర్ మహమ్మారి నుంచి ఇంత త్వరగా కోలుకుంటానని అనుకోలేదు. చికిత్స సందర్భంగా 15 పౌండ్ల బరువు తగ్గాను. ఆ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. అన్ని భరించి ఇవాళ మహమ్మారి నుంచి విముక్తి సంపాదించా. ఇక క్యాన్సర్ నుంచి విముక్తి కలగగానే టీవీ చానల్ బాధ్యతల్లో లీనమయ్యా.'' అంటూ తెలిపింది. ప్రస్తుతం 66 ఏండ్ల నవ్రతిలోవా మియామీ ఓపెన్‌లో టీవీ చానల్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. అమెరికాకు చెందిన మార్టినా నవ్రతిలోవా 18 సింగిల్స్ , 31 మహిళల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స్‌తో మొత్తంగా 59 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి చరిత్ర సృష్టించింది. 1970,80వ దశకంలో ఆమె సమకాలీకురాలు క్రిస్ ఎవర్ట్‌తో పోటీ పడిన నవ్రతిలోవా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.1981లో అమెరికా పౌరసత్వం రాగానే తనను తాను లెస్బియన్‌గా ప్రకటించుకున్న నవ్రతిలోవా అప్పటి నుంచి ఎల్జీబీటీ(LGBT) హక్కుల కోసం పోరాడుతూ వచ్చింది. చదవండి: దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు? అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ క్రికెటర్ గుడ్‌బై -
క్యాన్సర్‌ను జయించిన వలంటీర్ మహమ్మద్
క్రోసూరు: క్యాన్సర్ బారిన పడిన వలంటీర్‌కు ప్రభుత్వం సాయం చేయడంతో అతడు పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాడు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన షేక్ ఉమ్మర్ ఖయ్యుం ఆటో నడుపుతుంటాడు. వారి పెద్ద కుమారుడు షేక్ మహమ్మద్ డిగ్రీ పూర్తి చేసి వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. మహమ్మద్ 2021లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు. సమాచారం తెలుసుకున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అతని ఇంటికి వెళ్లి పరామర్శించి వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించారు. సీఎం వైఎస్ జగన్‌కి వినతి పెట్టారు. వెంటనే స్పందించిన సీఎం జగన్..మహమ్మద్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంతా ప్రభుత్వమే భరాయించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్‌కు ప్రభుత్వం రూ.78 లక్షలు మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో చికిత్స పొంది మహమ్మద్ ఇంటికి చేరుకున్నాడు. వైఎస్సార్ ఆసరా ద్వారా నెలకు రూ.5,000 చొప్పున 6 నెలల పాటు అందించి మందులను కూడా ఉచితంగా అందజేసింది. సీఎం జగన్ లాంటి నేత ఉండటంతోనే తాము ఈ సమస్య నుంచి బయటపడ్డామని, ఆయనకు తాము ఎంతగానో రుణపడి ఉన్నామని ఖయ్యుం కుటుంబసభ్యులు తెలిపారు. మహమ్మద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చొరవతో సీఎం జగన్ వెంటనే స్పందించి తనను ఆదుకున్నారని, జీవితంలో ఒక్కసారి సీఎం జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలపాలని తన కోరిక అని చెప్పాడు. -
క్యాన్సర్ నివారణలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుంది
సాక్షి, గుంటూరు: రాబోయే పదేళ్లలో.. క్యాన్సర్ నివారణకుగానూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఏపీ బడ్జెట్లో.. రూ.400 కోట్లను క్యాన్సర్ నివారణకు కేటాయించారు. క్యాన్సర్ స్క్రీనింగ్‌కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందంద కుదుర్చుకుంది. కర్నూల్లో రూ.120 కోట్లతో కేన్సర్ యూనిట్ ఏర్పాటు జరుగుతోంది. అలాగే విశాఖ కేజీహెచ్‌లో రూ.60 కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం అని ఆమె తెలిపారు. 2030 నాటికి క్యాన్సర్ నివారణలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆమె.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్ కు గురవుతున్నారన్నారు. 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిందని మంత్రి విడదల రజని ఈ సందర్భంగా తెలిపారు. -
క్యాన్సర్‌కు మెరుగైన వైద్య సేవలందిస్తాం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రసిద్ధి చెందిన వైద్య సంస్థల సహకారంతో రాష్ట్రంలోని క్యాన్సర్ రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గురువారం మంగళగిరిలోని మంత్రి కార్యాలయంలో దేశంలోనే ప్రతిష్టాత్మక క్యాన్సర్ వైద్య సంస్థ అయిన హెల్త్ కేర్ గ్లోబల్ సంస్థతో రాష్ట్ర వైద్య శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ అతిపెద్ద నెట్వర్క్ కలిగిన హెల్త్‌కేర్ గ్లోబల్ సంస్థ అంతర్జాతీయ వైద్యులతో క్యాన్సర్‌కు చికిత్స అందిస్తోందని చెప్పారు. క్యాన్సర్లను గుర్తించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులకు శిక్షణ ఇవ్వడం, న్యూట్రిషన్, యోగా తదితర అంశాలపై తర్ఫీదు అందించడంతోపాటు ప్రతి నెలా జిల్లా ఆస్పత్రుల్లో 30 క్యాంపులు నిర్వహించడం వంటివాటిపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. క్యాన్సర్ రోగుల విషయంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని మంత్రి రజిని వివరించారు. ప్రతి రోగికి అత్యాధునిక వైద్యం పూర్తి ఉచితంగా మన రాష్ట్రంలోనే అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇందుకోసం కడప, కర్నూలులో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో క్యాన్సర్ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్క క్యాన్సర్ రోగానికి సంబంధించే 400కు పైగా ప్రొసీజర్లను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ వైద్యానికే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నవీన్‌కుమార్, జె.నివాస్, డాక్టర్ వినోద్‌కుమార్, డాక్టర్ బి.వల్లీ, హెచ్‌సీజీ ప్రతినిధులు డాక్టర్ ఈఎస్ విశాల్రావు, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
Pele: 'నాకేం కాలేదు బాగానే ఉన్నా.. భయపడకండి'
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్వయంగా స్పష్టతనిచ్చాడు. తాను బాగానే ఉన్నానని.. తిరిగి కోలుకుంటున్నట్లు ప్రకటించాడు. 82 ఏళ్ల పీలేకు గతేడాది క్యాన్సర్ కారణంగా పెద్ద పేగులో కణతిని తొలగించారు. అప్పటినుంచి తరచూ చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నాడు. తాజాగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబసభ్యులు సావో పౌలో పట్టణంలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆదివారం ఉదయం పీలే పరిస్థితి విషమంగా ఉందని.. కీమో థెరపీకి కూడా స్పందించడం లేదని.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తన ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు ప్రచారంపై ఇన్స్టాగ్రామ్ వేదికగా పీలే స్పందించాడు. తాను బాగానే ఉన్నట్లు వెల్లడించాడు. తన కోసం ప్రార్థిస్తున్న వాళ్లంతా ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని.. తాను బాగానే ఉన్నానని ప్రకటించాడు. తాను సానుకూల దృక్పథంతో ఉన్నట్లు.. చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పాడు. దేవుడిపై తనకు విశ్వాసం ఉందని.. మీరు చూపిస్తున్న ప్రేమ నాకు మరింత శక్తినిస్తోందని తెలిపాడు. ఈ సందర్భంగా తన కోసం ప్రార్థిస్తున్న అభిమానులకు, చికిత్స అందిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా పీలేకు గతేడాది క్యాన్సర్ సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. తర్వాత ఆయన కోలుకున్నారు. తిరిగి ఇటీవల క్యాన్సర్ సంబంధిత సమస్యతోనే ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆసుపత్రిలో ఉన్న ఆయన ఆరోగ్యంపై రోజుకో రకంగా వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Pelé (@pele) చదవండి: దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం.. మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? -
పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స
సాక్షి, హైదరాబాద్: సాధారణ చికిత్సలకే పరిమితమయ్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో ఆరోగ్యశ్రీ కింద క్రిటికల్ కేర్, గ్యాస్ట్రో, గుండె, కేన్సర్ వంటి పెద్ద జబ్బులకు కూడా చికిత్సలు చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఉండే పీహెచ్‌సీల్లో, కొన్నిచోట్ల పీజీ కోర్సు పూర్తయిన స్పెషలిస్ట్ వైద్యులు ఉండటంతో పెద్ద జబ్బులకు చికిత్సలు చేయడం సాధ్యమవుతోందని వైద్య వర్గాలు అంటున్నాయి. అంతేకాక చిన్నచిన్న జబ్బులకు పెద్దాసుపత్రులకు వెళ్లకుండా స్థానికంగానే వాటిని నయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పీహెచ్సీలలో ఆరోగ్యశ్రీ కింద సేవలు ప్రారంభించిన రెండున్నర నెలల కాలంలోనే వేలాది మంది చికిత్సలు పొందారు. వీటిల్లో వైద్య సేవలన్నీ ఉచితమే అయినా, ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం వల్ల డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పెద్ద ఆసుపత్రులపై తగ్గిన భారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఈ ఎనిమిదేళ్లలో రూ.5,817 కోట్లు కేటాయించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 13.31 లక్షల మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు పొందారు. అందులో అత్యధికంగా 2015–16లో 1.88 లక్షల మంది పేదలు ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల వైద్య సేవలు పొందారు. అలాగే ఇదే కాలంలో ఉద్యోగులు, జర్నలిస్ట్‌ల ఆరోగ్య పథకం కింద 3.31 లక్షల మంది చికిత్సలు పొందగా, అందుకోసం ప్రభుత్వం రూ.1,346 కోట్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చికిత్సకు అవకాశం ఉన్నా పైస్థాయి ఆసుపత్రికి రిఫర్ చేయకుండా కట్టడి చేయడం, వైద్య సేవలను వికేంద్రీకరించడం వల్ల పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాక ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించడం వల్ల ప్రైవేట్‌లో అనవసర చికిత్సలకు బ్రేక్ వేసినట్లు అవుతుందని చెపుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని అడ్డంపెట్టుకుని అనవసర చికిత్సలు చేస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రెండున్నర నెలల్లో 9,292 చికిత్సలు ఈ ఏడాది మే నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అంటే దాదాపు రెండున్నర నెలల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేశారు. ఈ కాలంలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం 9,292 వైద్య చికిత్సలు అందించగా, అందులో అత్యధికంగా జనరల్ మెడిసిన్‌కు సంబంధించి 6,492 చికిత్సలు చేశారు. 2,077 గ్యాస్ట్రిక్ సంబంధిత జబ్బులకు చికిత్సలు చేశారు. అలాగే 233 జనరల్ సర్జరీలు జరిగాయి. 195 ఎండోక్రైనాలజీకి చెందిన చికిత్సలు జరిగాయి. ఇవిగాక ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించామని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో మూడు గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి. క్రిటికల్ కేర్‌కు సంబంధించి మేడ్చల్ జిల్లాలో 12, నిర్మల్ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో నాలుగు చికిత్సలు చేశారు. డెర్మటాలజీకి సంబంధించి వివిధ జిల్లాల్లో 9 చికిత్సలు జరిగాయి. అలాగే ఆయా జిల్లాల్లో 10 ఈఎన్టీ సర్జరీలు, 41 ప్రసూతి చికిత్సలు, 76 ఇన్ఫెక్షన్ వ్యాధులకు వైద్యం, రెండు కేన్సర్ చికిత్సలు కూడా జరిగాయి. కిడ్నీ వైద్యం కూడా 9 చోట్ల చేశారు. మూడు న్యూరాలజీ, 13 ఆర్థోపెడిక్ సర్జరీలు, 54 పీడియాట్రిక్ చికిత్సలు, 8 ఫల్మనరీ, ఒక తలసేమియా, 5 పాలీ ట్రామా చికిత్సలు జరగడం గమనార్హం. కాగా, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నచోట్ల మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత) -
కన్నీరు తుడిచి.. బాసటగా నిలిచి..
వినుకొండ (నూజెండ్ల): క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడికి బోన్‌మారో చికిత్సకు రూ.50 లక్షలు మంజూరు చేయించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ఆ పేదకుటుంబం కన్నీరు తుడిచారు. వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు అశోక్‌బాబు పరిస్థితిని స్వయంగా చూసిన మంత్రి వెంటనే ఆస్పత్రిలో చేర్చించాలని సూచించారు. అశోక్‌బాబు తండ్రి మూడేళ్ల కిందట చనిపోయాడు. తల్లి కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో అశోక్‌కు క్యాన్సర్ అని, చికిత్సకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని తల్లికి తెలిసి హతాశురాలైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె ప్రమాదవశాత్తు గాయపడింది. గ్రామ సర్పంచి సురేష్ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బాలుడి తల్లికి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం వినుకొండ వచ్చిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రజనికి బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే వివరించి సహాయం చేయాలని కోరారు. అశోక్‌బాబును తీసుకొచ్చిన బంధువులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. బాలుడి పరిస్థితి చూసి సీఎంవో అధికారులతో మాట్లాడిన మంత్రి వైద్యానికి అయ్యే ఖర్చు రూ.50 లక్షలను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బాలుడిని ఆస్పత్రిలో చేర్పించాలని బంధువులకు సూచించారు. -
క్యాన్సర్‌కు కళ్లెం.. గ్రామ, వార్డు క్లినిక్స్ స్థాయిలో స్క్రీనింగ్
సాక్షి, అమరావతి: మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లతో విస్తరిస్తున్న క్యాన్సర్ కేసులను పసిగట్టి సరైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ, వార్డు క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించి అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు క్యాన్సర్ స్క్రీనింగ్‌పై సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. లైనాక్ మెషిన్లు, 3 చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు క్యాన్సర్ కేసుల్లో 60 – 70 శాతం వరకు చివరి దశలో గుర్తించడంతో వ్యయ ప్రయాసలతో చికిత్స పొందినా ఫలితం దక్కడం లేదు. విస్తృత స్క్రీనింగ్ ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే చాలా ప్రాణాలను కాపాడవచ్చు. గ్రామ, వార్డు క్లినిక్స్‌తో పాటు మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ప్రభుత్వం అమల్లోకి తేనుంది. తద్వారా క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్సలు అందించనున్నారు. క్యాన్సర్ గుర్తింపు, చికిత్సపై సమర్థ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే వాటితో కలిపి మొత్తం 27 మెడికల్ కాలేజీల్లో క్యాన్సర్ నివారణకు రెండు చొప్పున లైనాక్ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. విశాఖ, తిరుపతి, గుంటూరు కాలేజీల్లో క్యాన్సర్ నివారణకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు పూర్తి స్థాయి ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. మూడో దశలో గుర్తిస్తే సంక్లిష్టం క్యాన్సర్లలో 33.2 శాతం ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందిస్తే నయం అవుతోంది. మహిళల్లో రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో 49.2 శాతం ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే తక్కువ ధరతోనే నయం అవుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే రూ.71 వేల లోపే వ్యయంతో 99 శాతం నయం అవుతోంది. అదే మూడో దశలో గుర్తించి రూ.1.76 లక్షలు వ్యయం చేసినా 29 శాతమే నయంఅవుతోంది. లక్షల్లో మరణాలు.. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఏటా పెరిగిపోతున్నాయి. మన దేశంలో 2020లో కొత్తగా 13.24 లక్షలకుపైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 6.8 లక్షలు మహిళల్లో క్యాన్సర్ కేసులు కాగా 6.5 లక్షలు పురుషుల్లో క్యాన్సర్ కేసులున్నాయి. 2020లో క్యాన్సర్‌తో 8.5 లక్షల మంది మృతి చెందగా రాష్ట్రంలో 34 వేల మంది మృత్యువాత పడినట్లు అంచనా. 2030 నాటికి దేశంలో క్యాన్సర్ కేసులు 28 శాతం మేర పెరగవచ్చని అంచనాలు పేర్కొంటున్నాయి. ఆరోగ్యశ్రీలో పెరిగిన చికిత్స వ్యయం రాష్ట్రంలో కొత్త క్యాన్సర్ కేసులు 70 వేల వరకు ఉండవచ్చని అంచనా. పురుషుల్లో అత్యధికంగా నోటి క్యాన్సర్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 39,768 క్యాన్సర్ కేసులుండగా అత్యధికంగా ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 13 శాతం చొప్పున నమోదయ్యాయి. 16 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులున్నాయి. 2030 నాటికి రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు 70 వేల వరకు పెరగవచ్చని అంచనా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 2019 నుంచి 2021 వరకు క్యాన్సర్ చికిత్స వ్యయం 37.3 శాతం మేర పెరిగింది. 2021–22లో ఆరోగ్యశ్రీలో 1,18,957 క్యాన్సర్ కేసులకు చికిత్స అందించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సలు 24 శాతం పెరిగాయి. -
క్యాన్సర్ కణాలపై విద్యుత్ఛార్జ్!!
అల్లరిమూకలపై లాఠీఛార్జి!! అందరూ ఈ మాట అనేక సార్లు వినే ఉంటారు. దాదాపు క్యాన్సర్ కణాలూ అంతే. అయితే ‘లాఠీచార్జీ’కి బదులు... ఈ సరికొత్త చికిత్స ప్రక్రియలో ‘విద్యుత్ ఛార్జీ’ ప్రయోగిస్తారు. తలపైనున్న క్యాప్ నుంచి ‘ఛా...ర్జ్’ అంటూ ఆదేశాలు రాగానే... అపాయకర క్యాన్సర్కణాలన్నీ చెల్లాచెదురైపోతాయి. అంతేకాదు... ఆ విద్యుత్‌షాక్ కారణంగా వాటి పెరుగుదలా ఆగిపోతుంది. అదెలాగో చూద్దామా? సాధారణంగా మెదడులో క్యాన్సర్ గడ్డలు వస్తే ప్రధానంగా సర్జరీతో తొలగిస్తారు. కానీ మెదడులో శస్త్రచికిత్స కాస్త కష్టమైన ప్రక్రియ. క్యాన్సర్ గడ్డ వరకే తొలగించాలి. లేదంటే... దేహంలో అది నియంత్రించే ఏదైనా కేంద్రానికి ఏ కొంత దెబ్బ తగిలినా... ఆ ప్రాంతం చచ్చుబడిపోతుంది. అయితే ఇటీవల ‘ఆప్ట్యూన్ థెరపీ’ అనే సరికొత్త ప్రక్రియకు అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. టోపీలా ధరించాల్సిన ‘ఆప్ట్యూన్ డివైజ్’ అనే ఓ పరికరం కొన్ని విద్యుత్ క్షేత్రాలను పుట్టిస్తుంది. ఆ క్షేత్రాల్లో ప్రసారమయ్యే విద్యుత్తు... విస్తృతంగా పెరగబోయే క్యాన్సర్ కణజాలాన్ని చెల్లాచెదురు చేస్తుంది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త చికిత్స ప్రక్రియ గురించి అవగాహన కోసమే ఈ కథనం. మెదడులో వచ్చే గ్లయోబ్లాస్టోమా అనే రకానికి చెందిన క్యాన్సర్ గడ్డలకు చికిత్స అందించేందుకు ఉద్దేశించిన పరికరమే ‘ఆప్ట్యూన్ డివైజ్’. దీన్ని తలకు తొడిగాక అది తలచుట్టూ ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’ అనే విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ క్షేత్రం ఫలితంగా కొత్తగా పెరగాల్సిన క్యాన్సర్ కణాలు పెరగకుండా పోతాయి. అంతేకాదు... ఆ ప్రాంతంలోని క్యాన్సర్ కణాలన్నీ చెల్లాచెదురైపోతాయి. అయితే కొత్త చికిత్స గురించి తెలుసుకోడానికి ముందర అది చికిత్స చేసే ‘గ్లయోబ్లాస్టోమా క్యాన్సర్’ గడ్డలు గురించి తెలుసుకుందాం. గ్లయోబ్లాస్టోమా అనేవి చాలా వేగంగా పెరిగే ఒక రకం క్యాన్సర్ కణుతులు. ఇవి నాడీకణాల ఆధారంగా పెరిగేవి. కాబట్టి అవి సాధారణంగా మెదడులో లేదా కాస్త అరుదుగా వెన్నుపాము మీద వస్తుంటాయి. ఇవి చాలా చురుగ్గా, వేగంగా, తీవ్రంగా పెరుగుతాయి. ఈ తరహా క్యాన్సర్ ఎందుకు వస్తుందనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయితే అరుదైన కొన్ని రకాల జన్యురుగ్మతలు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ గడ్డలు రావడం వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వేగంగా విస్తరించే క్యాన్సర్ కావడంతో... ఒకసారి దీని బారిన పడ్డాక బాధితులు సాధారణ ఆయుఃప్రమాణంతో చాలాకాలం పాటు బతికే అవకాశాలు కాస్తంత తక్కువే. సాధారణంగా క్యాన్సర్‌లో ఉపయోగించే సంప్రదాయ చికిత్సలైన శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమో వంటి వాటితోనే ఇప్పటివరకూ దీనికి చికిత్స ఇస్తూ వస్తున్నారు. అయితే... ఈ క్యాన్సర్‌కు ఇప్పుడు ఈ ‘ఆప్ట్యూన్’ అనే సరికొత్త పరికరం అందుబాటులోకి రావడం చాలామంది బాధితుల పాలిట ఇదో ఆశారేఖగా మారింది. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రావడం వల్ల ఇది చాలా ఎక్కువ ఖరీదైన చికిత్సగానే ఉంది. పైగా అమెరికాలో మినహాయించి చాలా యూరోపియన్ దేశాల్లోకీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ భారత్‌లోని కొన్ని పెద్ద పెద్ద క్యాన్సర్ సెంటర్లలో ఇప్పుడిప్పుడే ఈ చికిత్స అందుబాటులోకి వస్తోంది. ఏమిటీ ఆప్ట్యూన్ పరికరం...? గ్లయోబ్లాస్టోమా కోసం ఉపయోగించే ’ఆప్ట్యూన్’ ప్రక్రియలో తలచుట్టూ బ్యాండేజీల్లాగా కనిపించే కొన్ని పరికరాలను అతికిస్తారు. ఇందుకు వీలుగా తొలుత బాధితుల తలవెంట్రుకలు తీయిస్తారు. (గుండు చేస్తారు). ఆ గండుకు వీటిని అంటుకుపోయేలా వీటిని రూపొందించారు. వీటిల్లో ‘ట్రాన్స్‌డ్యూసర్ అర్రేస్’ అని పిలిచే సిరామిక్ డిస్క్‌లు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ బ్యాండేజీలా కనిపించే ఉపకరణాన్ని ‘స్కల్ క్యాప్’లా తొడుగుతారు. ఈ అర్రేస్ – అంటే ఎన్నో అద్దాల్లాంటి సముదాయం అని అర్థం) అన్నింటినుంచీ వచ్చే వైర్లన్నీ ఒక పోర్టబుల్ బ్యాటరీకి కలిపి ఉంటాయి. ఆ బ్యాటరీని భుజం దగ్గరగానీ లేదా బ్యాక్ప్యాక్లోగానీ పెడతారు. ఈ బ్యాటరీ సహాయంతో తలచుట్టూ ఓ విద్యుత్ క్షేత్రాన్ని రూపొందిస్తారు. ఈ క్షేత్రాన్ని ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’ అంటారు. ‘టీటీఎఫ్’ అంటే...? ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’లో చాలా తక్కువ తీవ్రతతో ఉన్న విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ తరంగాలు హానికారక క్యాన్సర్ కణాలను ఎటుపడితే అటు చెల్లాచెదురుగా చెదరగొట్టడంతో పాటు... వాటిల్లో కణవిభజన జరగకుండా నిరోధిస్తాయి. ఏ ఫ్రీక్వెన్సీలో ఈ విద్యుత్తరంగాలను ప్రయోగిస్తే... గ్లయోబ్లాస్టోమా కణాలన్నీ చెదిరిపోతాయో... ఆ ఫ్రీక్వెన్సీలో విద్యుత్తరంగాలు ఉత్పన్నమయ్యేలా ఆప్ట్యూన్ పరికరాన్ని సెట్ చేస్తారు. ఎంతకాలం పాటు...? చికిత్సలో భాగంగా ఇలా ఎంతకాలంపాటు ఈ టోపీలాంటి ఉపకరణాన్ని తొడిగి ఉండాలన్నది ట్యూమర్ల తీవ్రత ఆధారంగా డాక్టర్లు నిర్ణయిస్తారు. దుస్తులన్నింటిలాగే క్యాప్ ధరించడమూ ఒకరకంగా ఓ తొడుగు లాంటిదే కాబట్టి ఇది రోజువారీ పనులకూ అడ్డురాదు. ఒక్కోసారి ఈ క్యాప్లాంటి తొడుగును రోజుల్లో 18 గంటల పాటు కూడా ధరించాల్సి రావచ్చు. అలాగే తలలోని గడ్డలకు ఈ విద్యుత్ తరంగాల ప్రభావం ఉండటానికి, క్యాప్‌ను గుండుతో సరిగా అంటుకుపోయేలా ఉంచడానికి వారంలో రెండుసార్లు వెంట్రులకను తీసేయాల్సి వస్తుంటుంది. ఎందుకు అందుబాటులోకి రావాల్సి వచ్చింది? ఈ పరికరం ఎందుకు అందుబాటులోకి రావాల్సి వచ్చిందో కూడా చూద్దాం. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ (ఈవోఆర్టీసీ) అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ... ‘గ్లయోబ్లాస్టోమా’ బాధితులు వివిధ చికిత్సలతో ఎంత కాలం పాటు మనుగడ సాగించగలరనే అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. ఏడు అంశాల ఆధారంగా ఇందుకోసం మూడు మోడల్స్‌ను కూడా రూపొందించిది. ఆ ఏడు అంశాలేమిటంటే... బాధితులకు ఇస్తున్న చికిత్స, అతడి వయసు, శస్త్రచికిత్స ఏ మేరకు సాధ్యమైందనే అంశం, మినీ మెంటల్ స్కోర్ ఎగ్జామినేషన్ అనే పరీక్ష, కార్టికోస్టెరాయిడ్స్ ఏమైనా ఇస్తున్నారా అనే అంశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాలకు అనుగుణంగా బాధితుడి సామర్థ్యాలు, ఎంజీఎమ్టీ ప్రమోటర్ మిథైలేషన్ స్టేటస్... అనే ఈ ఏడు అంశాల సహాయంతో ఆయా అంశాలను మూడు రకాల మోడల్స్ (సూత్రాల్లాంటివి)లో ప్రతిక్షేపించి లెక్కగడతారు. ఇలా లెక్కగట్టినప్పుడు అననుకూలతలు ఎక్కువగా ఉన్న కొందరు బాధితులు బతికే కాలం చాలా తక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఇలాంటి వారి ఆయుష్షునూ పెంచడానికి అనేక మార్గాల్లో పరిష్కారాలను వెతుకుతున్నప్పుడు ఈ ఆప్ట్యూన్ పరికరం అందుబాటులోకి వచ్చింది. దాదాపుగా పదకొండు నెలలు కూడా బతకరని నిర్ణయించిన చాలామంది రోగుల ఆయుష్షును దాదాపు మూడు నుంచి ఐదేళ్లకు మించి బతికేలా చేసింది ఈ చికిత్స. దీన్ని ఇంకా మెరుగుపరిస్తే... బాధితులు మరింతకాలం బతికే అవకాశం ఉన్నందున అననుకూలురైన చాలామందికి ఇదో ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఒకసారి గ్లయోబ్లాస్టోమా నిర్ధారణ అయ్యాక... సంప్రదాయ క్యాన్సర్ చికిత్సలతో రోగి బతికే అవకాశాలను (ప్రోగ్నోసిస్ను) దాదాపుగా మూడేళ్లుగా చెబుతుంటారు. కానీ ఈ ఉపకరణంతో నిర్వహించిన ట్రయల్స్‌లో తర్వాత ఆ రోగుల ఆయుష్షు దాదాపు ఐదేళ్ల వరకు పెరగడాన్ని వైద్యనిపుణులు చూశారు. ఈ పరిశీలనలన్నింటినీ చూశాకే... కొత్త మందులకూ, కొత్త చికిత్స ప్రక్రియలకు అనుమతులిచ్చే ‘ఎఫ్‌డీఏ’ దీన్ని ఆమోదించింది. సాధారణంగా ఇది నోటిలోకి తీసుకునే మందు కానందున సైడ్ఎఫెక్ట్స్ పెద్దగా లేవుగానీ... బాధితుల్లో మరికొన్ని రకాల ఇబ్బందులను నిపుణులు గమనించారు. రోజూ మాడుకు క్యాప్‌లా ధరించి ఉండాల్సి రావడంతో మాడు–చర్మం మీద ఇబ్బందిగా (ఇరిటేషన్లా) అనిపించడం, మరికొందరిలో తలనొప్పి కనిపించాయి. కీమోథెరపీ తీసుకుంటూనే దీన్ని ధరించివారిలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం, వికారం, వాంతులు, మలబద్ధకం, అలసట వంటి స్వల్ప అనర్థాలను వైద్యనిపుణులు చూశారు. దీనికి తోడు కాస్తంత అరుదుగా కొందరిలో కాస్త పెద్దస్థాయి అనర్థాలైన మూర్ఛ (ఫిట్స్/సీజర్స్), డిప్రెషన్ వంటి మానసిక సమస్యలనూ గమనించారు. ఇక రోజూ దీన్ని ధరించాల్సి రావడంతో తలపైన చర్మంలో కొన్నిచోట్ల కాస్తంత బిగుతుగా/బిగుసుకుపోయినట్లుగా అనిపించడం (ట్విచ్చింగ్), తలమీద పుండ్లు, జ్వరం వచ్చినప్పుడు కనిపించే నీరసం వంటివి కూడా కనిపించాయి. చదవండి: Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్ అంటే? -
క్యాన్సర్ చికిత్సపై సీఎం జగన్ ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు: కృష్ణబాబు
సాక్షి, అమరావతి: హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి, తిరుపతి స్విమ్స్, విజయవాడ చినకాకాని ఆసుపత్రిలో క్యాన్సర్ ట్రీట్మెంట్పై ఒప్పందం జరిగినట్లు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఏపీలో క్యాన్సర్ చికిత్సకు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోంది. గత ఏడాది లక్షా 30 వేల మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి 50 కిలోమీటర్లకు క్యాన్సర్ వైద్యం అందే స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిదశలోనే క్యాన్సర్‌ను గుర్తించి వైద్యం అందించాలనే ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు క్యాన్సర్‌కి సంబంధించి టెలి కన్సల్టెన్సీ సర్వీస్ ఏర్పాటు చేశామని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 120 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఈ సంఖ్య భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన వైద్య విధానాలతో రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ విశాఖపట్నం హోమీ బాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం పొందనుంది. వ్యాధి గుర్తింపునకు స్క్రీనింగ్, పలు రకాల క్యాన్సర్ ప్రమాదాల గుర్తింపు, జిల్లాల్లో ప్రివెంటివ్ అంకాలజీ, క్యాన్సర్ డే కేర్ సేవలు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రీ, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు శిక్షణ అందించడం వంటివి హోమీ బాబా ఆస్పత్రి అందించనుంది. ప్రభుత్వాస్ప త్రుల్లో పొగాకు విరమణ కేంద్రాల ఏర్పాటు, స్క్రీనింగ్‌లో నిర్ధారించిన క్యాన్సర్ రోగులు, హైరిస్క్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెఫరల్ విధానం రూపకల్పనకు సంబంధించి హోమీ బాబా ఆస్పత్రి సహకారం అందించనుంది. విభజన అనంతరం క్యాన్సర్ చికిత్స వనరులను ఏపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి కట్టడి, ప్రభుత్వ రంగంలో చికిత్స వనరులను మెరుగుపరచడంపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ దృష్టి సారించింది. భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా రాష్ట్రంలోనే చికిత్స వనరులను మెరుగుపరచనున్నారు. చదవండి: (టీడీపీ ఆరిపోయే దీపం: మంత్రి జోగి రమేష్) -
మరింత సమర్థంగా క్యాన్సర్ కట్టడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్యాన్సర్‌ను సమర్థంగా నియంత్రించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థలను భాగస్వామ్యం చేస్తోంది. ఆయా సంస్థల సలహాలు, సూచనలు, సహకారం తీసుకుంటూ క్యాన్సర్‌పై యుద్ధానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్సకు ప్రసిద్ధి చెందిన టాటా మెమోరియల్ సెంటర్‌కు చెందిన విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్‌తో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎంవోయూ చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 120 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఈ సంఖ్య భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన వైద్య విధానాలతో రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ విశాఖపట్నం హోమీ బాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం పొందనుంది. వ్యాధి గుర్తింపునకు స్క్రీనింగ్, పలు రకాల క్యాన్సర్ ప్రమాదాల గుర్తింపు, జిల్లాల్లో ప్రివెంటివ్ అంకాలజీ, క్యాన్సర్ డే కేర్ సేవలు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రీ, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు శిక్షణ అందించడం వంటివి హోమీ బాబా ఆస్పత్రి అందించనుంది. ప్రభుత్వాస్ప త్రుల్లో పొగాకు విరమణ కేంద్రాల ఏర్పాటు, స్క్రీనింగ్‌లో నిర్ధారించిన క్యాన్సర్ రోగులు, హైరిస్క్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెఫరల్ విధానం రూపకల్పనకు సంబంధించి హోమీ బాబా ఆస్పత్రి సహకారం అందించనుంది. విభజన అనంతరం క్యాన్సర్ చికిత్స వనరులను ఏపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి కట్టడి, ప్రభుత్వ రంగంలో చికిత్స వనరులను మెరుగుపరచడంపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ దృష్టి సారించింది. భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా రాష్ట్రంలోనే చికిత్స వనరులను మెరుగుపరచనున్నారు. -
క్యాన్సర్‌ను చంపే ‘ముసుగు మందు’..!
క్యాన్సర్‌కు చేసే చికిత్సలు చాలా కష్టంగా అనిపిస్తుంటాయి. దానికి కారణమూ ఉంది. క్యాన్సర్‌కు వాడే కీమో మందులైనా, రేడియేషన్ ఇచ్చినా... క్యాన్సర్ కణాలతో పాటు ఎన్నో కొన్ని / ఎంతో కొంత ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటాయి. చికిత్స తర్వాత సైడ్ఎఫెక్ట్స్ ఎలాగూ ఉండనే ఉంటాయి. ఆఖరికి శస్త్రచికిత్స చేసినా సరే... మళ్లీ పెరగకుండా ఉండేందుకు కొంత మార్జిన్ తీసుకుని, క్యాన్సర్ గడ్డకు ఆనుకుని ఉన్న మంచి కణాలనూ కొంతమేరకు తొలగిస్తుంటారు. చివరకు వ్యాధి నిరోధకతను పెంచడం ద్వారా క్యాన్సర్ కణాలనే నశింపజేసి, బాధితుల ఆయుష్షును పెంచే ఇమ్యూనోథెరపీల విషయంలోనూ ఇలాంటి నష్టం ఎంతో కొంతమేర జరుగుతుంది. ఒకవేళ మంచి కణాలకు ఏమాత్రం హాని చేయకుండా, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే వెదికి వెదికి పట్టి తుదముట్టించే చికిత్స ప్రక్రియను కనుగొంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చాలామంది శాస్త్రవేత్తల్లో ఉన్నప్పటికీ... యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన ప్రిట్జ్కర్ స్కూల్ ఆఫ్ మాలెక్యులార్ ఇంజనీరింగ్‌కు చెందిన కొంతమంది పరిశోధకులు ఓ ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఈ ముసుగు మందు!! దాని వివరాలివి... ముసుగు మందు పని తీరు ఇది క్యాన్సర్ కణాలకూ, ఆరోగ్యకరమైన కణాలకూ ఓ తేడా ఉంది. ఆరోగ్యకరమైన కణాలు క్రమపద్ధతిలో, నియమిత వేగంతో మాత్రమే పెరుగుతాయి. కానీ క్యాన్సర్ కణాల పెరుగుదల ఓ పద్ధతి లేకుండా చాలా వేగంగా కొనసాగుతుంది. ఇలా పెరగడానికి కొన్ని ఎంజైములు ఉత్పత్తి అవుతుంటాయి. కానీ అదే ఆరోగ్యకరమైన కణాలతో ఈ ఎంజైముల ఉత్పత్తి పరిమితంగా ఉంటుంది. ఈ తేడాలనే మరింత సురక్షితమైన ‘ఐఎల్–12’ వర్షన్‌ను రూపొందించడానికి శాస్త్రవేత్త లు ఉపయోగించుకున్నారు. దీని ఆధారంగా విపరీతంగా ప్రవర్తించే ఈ ‘ఐఎల్–12’ కణాలకు ఓ ‘మాలెక్యులార్ ముసుగు’ తొడిగారు. అవి క్యాన్సర్ గడ్డను చేరేవరకు వాటిపై ఆ ముసుగు అలాగే ఉంటుంది. చాలా వేగంగా ఉత్పత్తయ్యే కణజాలం ఎంజైములు తగిలినప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది. అంటే ఆ ఎంజైమే ఈ ముసుగును ఛిద్రం చేస్తుంది. అంటే... ‘ఐఎల్–12’ కణాలు క్యాన్సర్ గడ్డను చేరగానే ముసుగు తొలగిపోతుందన్నమాట. అక్కడ అవి తమ తీవ్రతా, వైపరీత్యం వంటి గుణాన్ని కోల్పోకుండా... అక్కడే తమ ప్రభావాలను చూపుతాయి. ఫలితంగా అక్కడ కిల్లర్ టీ–సెల్స్‌ను విపరీతంగా పెరిగేలా చేస్తాయవి. దాంతో క్యాన్సర్ గడ్డపై మాత్రమే ఆ తీవ్రత ప్రభావం తీక్షణంగా ఉంటుంది. మిగతా ఆరోగ్యకరమైన కణాలు సురక్షితంగా ఉంటాయి. ఒక క్లినికల్ పరీక్షలో ఈ అంశాన్ని ప్రయోగాత్మకంగా చూశారు. ‘ట్రోజెన్ డ్రగ్ డెలివరీ’ అనే కొత్త చికిత్సగా... ముసుగు వేసుకుని... లక్ష్యాన్ని చేరాక అక్కడ తీవ్రస్థాయిలో ప్రభావవంతంగా జరిగే ఈ చికిత్సనే ‘ట్రోజెన్ డ్రగ్ డెలివరీ’గా కూడా అభివర్ణిస్తారు. తమ యుద్ధతంత్రంలో భాగంగా... ఓ పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి, అందులో రహస్యంగా సైనికులను నింపి ఉంచి... శత్రువులకు బహూకరించాక... అందులోంచి ఒక్కపెట్టున సైనికులు వచ్చి దాడి చేసిన‘ట్రోజన్ వార్’ కథ తెలిసిందే. అందుకే ఈ చికిత్స ప్రక్రియకు ఆ పేరు పెట్టారు. అయితే... ఎంత ముసుగు వేసుకుని పోయినా కొన్నిసార్లు ఇది కొన్నిచోట్ల (మైక్రో ఎన్విరాన్మెంట్లో) అక్కడి కణాల కన్నుకప్పలేకపోవచ్చు. ఆ ఇబ్బందిని గనక అధిగమిస్తే... ఇమ్యూనోథెరపీనీ, కార్–టీ సెల్ థెరపీ (కైమరిక్ యాంటీజెన్ రీకాంబినెంట్ టీ సెల్ థెరపీ)ని... రెండింటినీ కలగలుపుకున్న ఈ థెరపీ మరింత సమర్థంగా రూపొందే అవకాశం ఉందనేది నిపుణుల భావన. అదే జరిగితే (జరిగే అవకాశాలే ఎక్కువ) ఇది తిరుగులేని చికిత్సగా ఆవిర్భవిస్తుందన్నది వైద్యశాస్త్రవేత్తలూ, నిపుణుల మాట. క్యాన్సర్ కణంపై రోగనిరోధక వ్యవస్థ పని చేసేదిలా! మన రోగనిరోధక వ్యవస్థలో సైటోకైన్స్ అనే ప్రోటీన్లు ఒక్కసారిగా దాడి చేసి హానికారక కణాలను తుదముట్టించడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రయత్నంలో భాగంగా సైటోకైన్లు... తెల్లరక్తకణాల్లో ఒక రకానికి చెందిన ‘కిల్లర్ టీ–సెల్స్’ను పెద్ద ఎత్తున ప్రేరేపిస్తాయి. అప్పుడా ‘కిల్లర్ టీ–సెల్స్’ క్యాన్సర్ కణాలపై దాడి ప్రారంభిస్తాయి. ఈ దాడి ప్రభావపూర్వకంగా ఎలా జరగాలన్న అంశంపై ఈ సైటోకైన్ ప్రోటీన్లే... ‘కిల్లర్ టీ–సెల్స్’కు శిక్షణ అందిస్తాయి. ఇలా అవి క్యాన్సర్ కణాలనూ, గడ్డలనూ ఎదుర్కొని వాటిని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటి సైటోకైన్లలో ఒక రకమే ‘ఇంటర్‌ల్యూకిన్–12’. దీన్ని సంక్షిప్తంగా ‘ఐఎల్–12’ అని కూడా అంటారు. వాటి ప్రభావం ఇలా ఉంటుంది... ఐఎల్– 12ను కనుగొని దాదాపు 30 ఏళ్లయ్యింది. కానీ వీటిని చికిత్సలో ఉపయోగించినప్పుడు అవి వాపు, మంట కలిగించే అంశాలనూ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇన్ఫ్లమేటరీ మాలెక్యుల్స్ను పుట్టిస్తాయి. ఇవి దేహంలోని ఇతర కణాలను, ముఖ్యంగా కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే... వీటిని ఉపయోగించాక కలిగే అనర్థాలూ, దుష్ప్రభావాల కారణంగా, ముఖ్యంగా కాలేయం వంటి కీలక అవయవాలకు జరిగే నష్టాల వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని... ఎఫ్‌డీఏ వీటిని చికిత్స ప్రక్రియలకు అనుమతించలేదు. ఆనాటి నుంచి శాస్త్రవేత్తలు ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. క్యాన్సర్ కణాల పట్ల ఈ ‘ఐఎల్–12’ కణాల ప్రభావం తగ్గకూడదు. కానీ దేహం తట్టుకోగలిగేలా వాటిని రూపొందించాలి. ప్రయోగాత్మకంగా రెండు కేస్–స్టడీలివి... రొమ్ముక్యాన్సర్ వచ్చిన కొందరు బాధితులను పరిశీలించగా... సాధారణంగా ఇమ్యూనోధెరపీలో ఉపయోగించే ‘చెక్‌పాయింట్ ఇన్హిబిటార్’తో కేవలం 10 శాతం ఫలితాలు కనిపించగా... ఈ ‘మాస్క్డ్ ఐఎల్–12’తో 90 శాతం ఫలితాలు కనిపించాయి. ఇక ఒక పెద్దపేగు (కోలన్) క్యాన్సర్ కేస్–స్టడీలో ఈ ‘మాస్క్డ్ ఐఎస్–12’తో 100 శాతం ఫలితాలు కనిపించడం మరో విశేషం. డాక్టర్ సురేష్. ఏవీఎస్. మెడికల్ ఆంకాలజిస్ట్ -
అన్ని క్యాన్సర్లకూ ఆరోగ్యశ్రీ
దేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. క్యాన్సర్ బాధితుల సంరక్షణ, చికిత్సపై సీఎం జగన్ దూరదృష్టి అభినందనీయం. రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. – డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు సాక్షి ప్రతినిధి, తిరుపతి: క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసి, పేదలందరికీ ఉచితంగా వైద్య సౌకర్యం అందించాలనేదే తమ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో టాటా సంస్థ అద్భుతమైన క్యాన్సర్ ఆస్పత్రిని తిరుపతిలో ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. తిరుపతి జూపార్క్ రోడ్లో టీటీడీ సహకారంతో టాటా సంస్థ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (స్వీకార్)ను గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రేడియాలజీ విభాగంలో రోగుల కోసం అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన క్యాబిన్లు, వైద్య పరికరాలను, చికిత్సా విధానాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వడమే లక్ష్యమని, రానున్న రోజుల్లో ఆంకాలజీ విభాగంలో అన్ని రకాల సేవలు వర్తింపజేయాలని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సమగ్రమైన క్యాన్సర్ చికిత్స అందించాలన్నది తమ లక్ష్యమని, ఇందులో భాగంగా అన్ని రకాల క్యాన్సర్లకు ఒకే గొడుగు కింద ఉచితంగా చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క రోగి కూడా క్యాన్సర్‌తో చనిపోకూడదని, చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనేది తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. క్యాన్సర్ కేర్, అడ్వాన్స్డ్ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సీఎం జగన్, చిత్రంలో మంత్రులు, ఆసుపత్రి బృందం క్యాన్సర్ చికిత్సపై దృష్టి పెట్టిన ఏకైక రాష్ట్రం ఏపీ ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. క్యాన్సర్ సంరక్షణ, చికిత్సపై సీఎం దూరదృష్టి అభినందనీయమన్నారు. పీడియాట్రిక్ ఆంకాలజీ సెంటర్, ప్రివెంటివ్ ఆంకాలజీ, సెంటర్ ఫర్ పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తూ.. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని చెప్పారు. టాటా ట్రస్ట్ సీఈవో ఎన్.శ్రీనాథ్, స్వీకార్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వీఆర్.రమణన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్‌కు అత్యుత్తమ వైద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలందించేలా ప్రభుత్వాస్ప త్రులను బలోపేతం చేయడంపై వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం బాధితులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా.. ఏపీలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్టు సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ప్రస్తుతమున్న బోధనాస్పత్రుల్లోని క్యాన్సర్ విభాగాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనిని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇప్పటివరకు అత్యధిక మంది క్యాన్సర్ బాధితులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం తీసుకుంటున్నట్టు ప్రత్యేక బృందం పరిశీలనలో వెల్లడైంది. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన లీనియర్ యాక్సిలరేటర్ పరికరం గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అందుబాటులోకి రావడం గమనార్హం. ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాల వల్ల రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రత్యేక బృందం గుర్తించింది. -
‘కీమో’నుంచి కోలుకున్నా.. క్యాన్సర్ ట్రీట్మెంట్పై నటి రియాక్షన్
Actress Hamsa Nandini Shares About Her Cancer Treatment: ప్రముఖ టాలీవుడ్ నటి హంసా నందిని ఇటీవలె క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తన పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోస్ట్‌ను షేర్ చేసింది. 16సైకిల్స్ పాటు కీమో థెరపీ చేశారు. ఇప్పుడు నేను అధికారికంగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ చికిత్స ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంకా గెలవలేదు. తదుపరి పోరాటానికి నేను సన్నద్దం కావాల్సిన తరుణం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది అంటూ ఇన్‌స్టాలో ఓ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు మరింత బలంగా తిరిగొస్తారు. గెట్ వెల్ సూన్ అంటూ పేర్కొన్నారు. కాగా ఆర్యన్ రాజేశ్ హీరోగా వచ్చిన ‘అనుమానస్పదం’ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో హీరోయిన్గా పరిచయమైన హంసానందిని.. ‘మిర్చి, అత్తారింటికి దారేది’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో గుర్తింపు పొందింది. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
Cancer: కొత్తకొత్తగా, చెత్తచెత్తగా... తెలుసుకోవాల్సిన విషయాలు!
క్యాన్సర్ కూడా ఒక కణమే. అది కొత్తకొత్తగా, చెత్తచెత్తగా ప్రవర్తిస్తుంది. కొత్తగా ఎలా ఉన్నా ఇలా చెత్తగా ప్రవర్తించడమే దాన్ని మిగతా ఆరోగ్యకరమైన కణాల నుంచి వేరు చేస్తుంది. చెడ్డ లక్షణాలుగా ఆపాదిస్తున్న ఆ గుణాలు ఎనిమిది. అందుకే క్యాన్సర్‌ను ఎనిమిది వంకర్ల ‘అష్టావక్ర’ కణంగా చెప్పవచ్చు. ఆ ఎనిమిది గుణాలకు తోడుగా ఈ ఏడాది (2022లో) తాజాగా ఇప్పుడు మరిన్ని దుష్ట గుణాలను నిపుణులు కనుగొన్నారు. కొత్త చికిత్స ప్రక్రియలను కనుగొనేందుకు ఇవి తోడ్పడుతున్నందున వీటిని గురించి తెలుసుకోవడం అవసరం కూడా. అవేమిటో తెలుసుకుందాం. 1. సస్టెయిన్డ్ ప్రోలిఫరేటివ్ సిగ్నలింగ్ : కణాలన్నీ తమలోని జీవరసాయనాలతో ఒకదానితో ఒకటి సంప్రదింపులు జరుపుకోవడం, ఒకదానితో ఒకటి అనుసంధానితమై ఉండటం చేస్తుంటాయి. క్యాన్సర్ కణాలు విచిత్రంగా తమ సొంత సిగ్నలింగ్ వ్యవస్థను కలిగి ఉండటమే కాదు... ఆరోగ్యకరమైన కణాలు సంభాషించుకున్నట్లుగా, ఒక క్రమబద్ధమైన రీతిలో అనుసంధానితమై ఉన్నట్లుగాను ఉండవు. పక్కవాటితో నిమిత్తం లేకుండా తాము స్వతంత్రంగా, ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ ఉంటాయి. ఈ గుణాన్ని సస్టెయిన్డ్ ప్రోలిఫరేటివ్ సిగ్నలింగ్గా నిపుణులు పేర్కొంటుంటారు. 2. దేహపు సిగ్నల్స్ స్వీకరించకపోవడం : దేహంలో ఎక్కడైనా చెడు కణాలు ఉంటే వాటిని తుదముట్టించేందుకు శరీరం నుంచి ఆజ్ఞలు వెలువడతాయి. వాటి ఆధారంగా ఆ చెడు కణాలన్నీ మిగతా ఆరోగ్యకరమైన కణాలకు చేటు చేయకుండా తమను తాము ధ్వంసం చేసుకుని అంతర్గత అవయవాల ఆరోగ్యం కాపాడాలి. కానీ క్యాన్సర్ కణాలు ఈ సిగ్నల్స్‌ను లెక్క చేయవు. 3. రెసిస్టింగ్ సెల్ డెత్ : ప్రతి కణం ఒక నిర్ణీత సమయం తర్వాత మరణిస్తుంటుంది లేదా అంతమైపోతుంటుంది. కానీ క్యాన్సర్ కణం అలా మరణించడానికి ఇష్టపడదు. అందుకే చావు లేని వరం పొందిన రాక్షసుల్లా అది రెచ్చిపోతుంటుంది. 4. ఎనేబిలింగ్ రిప్లికేటివ్ ఇమ్మోర్టాలిటీ: ముందు పేర్కొన్న (‘రెసిస్టింగ్ సెల్ డెత్’) అంశంలో చెప్పినట్లుగా లోపభూయిష్టమైన కణం... ఇతర కణాలకు నష్టం చేయకుండా ఉండేందుకు అంతమైపోవాలి. కానీ క్యాన్సర్ కణం అలా అంతమైపోకుండా ఉండటమే కాదు... తనలాంటి లోపభూయిష్టమైన కణాలను ఉత్పత్తి చేస్తుంది. అది కూడా ఒకటి రెండుగానూ... రెండు నాలుగుగానూ కాకుండా... కణవిభజన నిబంధలను అతిక్రమించి ఒకటి నాలుగుగానూ... ఆ నాలుగు అరవై నాలుగుగా.. ఇలా ఇష్టం వచ్చినట్లు అపరిమితంగా పెరిగిపోతుంది. అందుకే క్యాన్సర్ గడ్డలు ఒక క్రమతతో కాకుండా... గడ్డల్లా (ట్యూమర్స్లా) అసహ్యం గా పెరుగుతాయి. 5. ఇండ్యూసింగ్ / యాక్సెసింగ్ వాస్క్యులేచర్ : అన్ని కణాలకు నిర్ణీతమైన రీతిలో ఆక్సిజన్ లేదా పోషకాలు అందాలి. కానీ క్యాన్సర్ గడ్డలు... కణాల నిబంధనలన్నీ తోసిరాజంటూ తాము స్వయంగా రూపొందించుకున్న మార్గాల ద్వారా ఆరోగ్యకరమైన కణాలకు అందనివ్వకుండా... అన్ని పోషకాలను తామే స్వీకరిస్తాయి. అందుకే క్యాన్సర్ వచ్చిన రోగి బలహీనంగా మారిపోతుంటాడు. ఇలా క్యాన్సర్ కణాలు సొంత రక్తప్రసరణ మార్గాలను ఏర్పాటు చేసుకోవడాన్నే ‘ఇండ్యూసింగ్ / యాక్సెసింగ్ వాస్క్యులేచర్’ అని నిపుణులు చెబుతుంటారు. 6. యాక్టివేటింగ్ ఇన్వేజన్ అండ్ మెటాస్టాసిస్: ఒక నిర్ణీత క్రమంలో కాకుండా... తానున్న ప్రాంతాన్ని వదిలి... వేరే అవయవాల కణాల్లోకి వలస వెళ్లి... అక్కడ స్థిరపడటం, అక్కడ మళ్లీ పెరిగిపోవడాన్నే ‘మెటాస్టాసిస్’ / ‘మెటస్టాటిక్ గ్రోత్’ అంటారు. ఉదాహరణకు కాలేయానికి క్యాన్సర్ వచ్చిందనుకుందాం. అది అక్కడికే పరిమితమై పోకుండా పక్కన ఉన్న అన్ని అవయవాలకు పాకడాన్ని మెటాస్టాసిస్ అంటారు. ఇలా క్యాన్సర్ పక్కకణాలపై దాడి చేసినట్లుగా అన్నిచోట్లకు పాకే ప్రక్రియను ‘యాక్టివేటింగ్ ఇన్వేషన్ అండ్ మెటాస్టాసిస్’ అంటారు. 7. రీ–ప్రోగ్రామింగ్ సెల్యులార్ మెటబాలిజమ్ : ఓ కణంలో క్రమబద్ధమైన రీతిలో జీవక్రియలు జరగడాన్ని మెటబాలిజమ్ అంటారు. ఈ కార్యక్రమాన్ని దెబ్బతీయడమే కాకుండా... తనకు ఇష్టమైన రీతిలో అక్కడి కార్యకలాపాలు జరిగేలా క్యాన్సర్ కణం జీవక్రియలను రీ ప్రోగ్రామింగ్ చేస్తుంది. ఇది కణానికి తీవ్రనష్టం కలిగిస్తుంది. 8. అవాయిడింగ్ ఇమ్యూన్ డిస్ట్రక్షన్: మన దేహంలో చెడు కణం పుట్టగానే రోగనిరోధక వ్యవస్థ రంగంలోకి దిగి దాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది. కానీ క్యాన్సర్ కణం ఈ ఇమ్యూన్ వ్యవస్థను తోసిరాజని పెరుగుతుంది. ఇమ్యూన్ వ్యవస్థ తనను నాశనం చేయకుండా మనుగడ సాగిస్తుంది. ఈ గుణాలను కనుగొన్న కారణంగా క్యాన్సర్‌ను తుదముట్టించేందుకు లేదా ఎదుర్కొనేందుకు ఇదివరలో మనకు తెలిసిన మార్గాలతో పాటు... ఇతర మార్గాలను కనుగొనేందుకు దారి సుగమమైంది. అయితే ఇంకా అదనం గా ఏవైనా గుణాలన్నాయా..? అనే అంశంతో పాటు... ఇదివరలో కనుగొన్న ఎనిమిది అంశాలపై మరింత అవగాహన కోసం పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. తద్వారా మరింత సమర్థమైన, మెరుగైన చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆశిస్తున్నారు. ఇక్కడ పేర్కొన్న ఎనిమిది గుణాలతో పాటు ఈ ఏడాది అంటే 2022లోనే మరిన్ని గుణాలను నిపుణులు కనుగొన్నారు. ఉదాహరణకు జన్యుపరమైన చంచల స్వభావంతో ప్రవర్తించడం (జీనోమ్ ఇన్‌స్టెబిలిటీ అండ్ మ్యూటేషన్స్), అన్ని నిబంధనలను తోసిరాజని తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం (అన్లాకింగ్ ఫీనోటైపిక్ ప్లాస్టిసిటీ), దేహపు ఆజ్ఞలను తనకు అనుగుణంగా వ్యాఖ్యానించుకుని అన్ని విధాల చెరుపుగా చేసేవిధంగా కార్యకలాపాలు నిర్వహించడం (నాన్ మ్యూటేషనల్ ఎపీజెనెటిక్ రీ–ప్రోగ్రామింగ్), చెడు కోసం పాటుపడటం (ట్యూమర్ ప్రమోషన్ ఇన్ఫ్లమేషన్), కాలం చెల్లిన కణాలూ ఇంకా జీవించే ఉండటమే కాకుండా మంచి కణాలను తమ కార్యకలాపాలు నిర్వహించనివ్వకుండా చేయడం (సెనెసెంట్ సెల్స్), మన దేహానికి అవసరమైన మంచి బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా చేసి, చెడు సావాసాలతో చెడు బ్యాక్టీరియా దేహంలో పెరిగిపోయేలా చేయడం (పాలీమార్ఫిక్ మైక్రోబయోమ్) వంటివి కొన్ని. -
Cancer: క్యాన్సర్ గురించి అవి కేవలం అపోహలు మాత్రమే.. వాస్తవాలేమిటి?
క్యాన్సర్ గడ్డపై కత్తి ఆనిస్తే అది మరింతగా విజృంభించి విస్తరిస్తుందనీ, క్యాన్సర్ ఏదైనా... సర్జరీ చేయకూడదనే అపోహలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి. అయితే తొలిదశ లో క్యాన్సర్‌ను కనుగొంటే దాన్ని నూరు శాతం నయం చేయడానికి శస్త్రచికిత్సే ప్రధాన ప్రక్రియ అనీ, దాదాపు అరవై శాతానికి పైగా క్యాన్సర్లు నయం చేయవచ్చని అంటున్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు (సీఎస్ రావు). క్యాన్సర్‌పై ఉన్న అపోహా వాస్తవాల గురించి ఆయన ఏమన్నారో చదవండి. కొన్ని క్యాన్సర్లకు (ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్ల వంటివాటికి) కేవలం శస్త్రచికిత్సే అసలైన చికిత్స అంటారు కదా. అది ఎంతవరకు వాస్తవం? జ. హార్మోన్ల తేడాలతో వచ్చే అనేక రకాల క్యాన్సర్లతో పాటు ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్ వంటి వాటికి శస్త్రచికిత్సే ప్రధాన చికిత్స. నిజానికి సరైన రీతిలో శస్త్ర చికిత్స చేసినప్పుడు తొలిదశ రేడియేషన్ అవసరమే ఉండకపోవచ్చు. కాకపోతే అప్పటికే వేరేచోటికి క్యాన్సర్ కణాలు పాకి ఉండవచ్చుననే అభిప్రాయంతోనే రేడియేషన్ లేదా కీమో ఇవ్వాల్సి వస్తుంటుంది. లేదంటే కేవలం శస్త్ర చికిత్సతోనే మొత్తం రొమ్ముక్యాన్సర్ పూర్తిగా నయమవుతుంది. శస్త్రచికిత్స వల్ల వ్రణాన్ని తొలగించడం వల్ల దేహంలో కొన్ని చోట్ల సొట్టలు కూడా పడే అవకాశముంది కదా... వాటిని సరిదిద్దడానికి ఏవైనా మార్గాలున్నాయా? జ. శస్త్రచికిత్స తర్వాత పడే సొట్టలు రెండు రకాలు. అవి... 1. బయటకు కనిపించేవి 2. బయటకు కనిపించనివి. బయటకు కనిపించే వాటికే ప్లాస్టిక్ సర్జరీ అవసరం వస్తుంది. బయటకు కనిపించని వాటి కారణంగా మనలో... అంటే మనం నిర్వహించే పనుల్లో ఏవైనా లోపాలు (ఫంక్షనల్ లాస్) తలెత్తినప్పుడు మరికొన్ని శస్త్రచికిత్సల సహాయంతో వాటిని అధిగమించవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనూ మళ్లీ మనకు పనికి వచ్చేది ‘శస్త్రచికిత్స’ ప్రక్రియే. ‘కత్తి ఆనిస్తే చాలు... క్యాన్సర్ మరింతగా రెచ్చిపోతుంది. ఇంకా ఎక్కువగా పాకుతుంది’ అంటారు అందుకే క్యాన్సర్‌పై కత్తే పెట్టకూడదు అనే మాట చాలామందిలో ఉంది. అది కేవలం అపోహా? ఇందులో ఏదైనా వాస్తవం ఉందా? జ: నిజానికి క్యాన్సర్గురించి వైద్యశాస్త్ర పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో క్యాన్సర్ బాగా ముదిరిపోయిన దశలో శస్త్రచికిత్స చేస్తుండేవారు. అప్పటికే క్యాన్సర్ కణాలు వేర్వేరు అవయవాలకు విస్తరించి ఉండటంతో, అసలు క్యాన్సర్ గడ్డను (ప్రైమరీని) తొలగించినప్పటికీ... ఇతర ప్రాంతాలకు విస్తరించిన గడ్డలు (సెకండరీ ట్యూమర్స్) పెరుగుతుండేవి. ఫలితంగా క్యాన్సర్‌కు కత్తి పెట్టకూడదనే దురభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఇప్పుడు మొదటి, రెండో దశలోనే క్యాన్సర్లను కనుగొంటున్నందున శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయమైపోయిన రోగులెందరో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కత్తి పెట్టలేని మారుమూల ప్రదేశాల్లో ఉండే క్యాన్సర్ గడ్డలకీ , లేదా కత్తి ఆనించడమే సమస్య గా మారే మెదడు వంటి కీలకమైన అవయవాల్లోని లోపలి భాగాల్లో ఉండే క్యాన్సర్ గడ్డలను తొలగించడానికి శస్త్రచికిత్సల్లో ఏవైనా అధునాతన ప్రక్రియలు ఉన్నాయా? జ. మనం శస్త్రచికిత్స ద్వారా చేరలేని ప్రాంతాల్లో ఉన్న క్యాన్సర్ గడ్డల (డీప్ సీటెడ్ ట్యూమర్స్)ను తొలగించేందుకు... ఎమ్మారై గైడెడ్ సర్జరీ, సింటిగ్రఫీ గైడెడ్ సర్జరీ, అల్ట్రా సౌండ్ గైడెడ్ సర్జరీ వంటి కొన్ని ప్రక్రియలు సమర్థంగా ఉపయోగపడతాయి. వాటి సహాయంతో దేహంలోని మారుమూల ప్రాంతాల్లో చాలా లోతుగా ఉన్న గడ్డలనూ తొలగించవచ్చు. భవిష్యత్తులో శస్త్రచికిత్స విషయంలో రాబోయే విప్లవాత్మకమైన మార్పులు ఏవైనా ఉన్నాయా? జ. గతంలో క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా కనుగొనేవారు. కానీ ఇటీవల క్యాన్సర్ తొలిదశలో ఉండగానే లేదా అంతకు చాలా ముందుగానే కనుగొనడమే ఓ విప్లవవాత్మకమైన మార్పు. కేవలం ఈ కారణంగానే కొన్ని క్యాన్సర్లు సమూలంగా నయమయ్యే అవకాశం దక్కింది. అందుకే మూడు దశాబ్దాలకు ముందు... క్యాన్సర్లలో 85 శాతం నయం కానివి ఉండేవన్న అపప్రథ ఉండేది. కానీ ఇప్పుడు 85 శాతం పూర్తిగా నయమైపోతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్స వల్లే సమూలంగా తొలగించడం సాధ్యమవుతోంది. దీనికి తోడు రేడియో గైడెడ్ లోకలైజెషన్, రేడియోలాజికల్ లోకలైజెషన్, ఇంట్రా ఆపరేటివ్ కీమో థెరపీ, ఇంట్రా ఆపరేటివ్ రేడియో థెరపీ, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ లాంటి విప్లవాత్మకమైన ప్రక్రియల ద్వారా మరింత సమర్థమైన చికిత్సకు అవకాశం దక్కింది. క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స ప్రాధాన్యమేమిటి? పరిమితులు ఏమిటి? జ: క్యాన్సర్‌కు మొట్టమొదటి వైద్యం శస్త్ర చికిత్సయే. ఇది ఎక్కువగా గడ్డల రూపంలో కనిపించే క్యాన్సర్ వ్రణాల్లో (సాలిడ్ ట్యూమర్స్) బాగా ఉపయోగపడుతుంది. ఉదా: థైరాయిడ్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణాశయం, పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఎముకల్లో వచ్చే సార్కోమా, సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్. అంటే దాదాపు 60 శాతం క్యాన్సర్ లకు శస్త్రచికిత్స అవసరమవుతుంది. శస్త్ర చికిత్స వల్ల వ్యాధి ఏయే దశలలో ఉందన్న సమాచారమూ తెలుస్తుంది. తొలి దశలలో ఉన్న క్యాన్సర్లన్నింటినీ శస్త్రచికిత్స సహాయంతో పూర్తిగా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాలలో ముదిరి పోయిన క్యాన్సర్‌లో శస్త్ర చికిత్స వల్లనే ఉపశమనం లభిస్తుంది. ఉదా: వాసన వచ్చే పుండు, పేగుకు రంధ్రం పడినప్పుడు, శ్వాస తీసుకునేందుకు అంతరాయం కలుగుతున్న సందర్భాల్లో శస్త్ర చికిత్సతోనే రోగికి ప్రాణదానం చేయవచ్చు. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ చదవండి: Gas Problem Solution: గ్యాస్ సమస్యా... పాస్తా, కేక్ బిస్కెట్స్, ఉల్లి, బీట్రూట్స్ తింటే గనుక అంతే!