![Boys Plea for Father Suffering From Cancer in Nizamabad District - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/2/nzb.jpg.webp?itok=84EDJynd)
తన భార్య, కొడుకుతో రాజేంద్రప్రసాద్
సాక్షి, నిజామాబాద్(మోర్తాడ్): ‘అందరికీ నమస్కారం.. నాకు నా పప్పా కావాలి.. ఎలాగైనా మీరే మా పప్పాను కాపాడాలి... లేకపోతే నేను ఒంటరి వాన్ని అయిపోతాను.. అందరికి చేతులెత్తి మొక్కుతున్నా.. ప్లీజ్ ప్లీజ్’ అంటూ వచ్చిరాని మాటలతో నాలుగేళ్ల అరింద్ర తన తండ్రి కోసం వేడుకుంటున్న వీడియో కన్నీళ్లను పె ట్టిస్తోంది. తన తండ్రి ఆరోగ్యం కోసం బాలుడు వేడుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న మోర్తాడ్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌కు క్యాన్సర్ సోకింది. అస లే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలంటే మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక పరి స్థితి బాగాలేకపోవడంతో ఆపన్నహస్తం కోసం అత ని కుటుంబం ఎదురుచూస్తోంది. రాజేంద్రప్రసాద్ ఉపాధి కోసం టైలరింగ్ పని చేస్తుండేవాడు. కొన్ని నెలల కింద కడుపులో క్యాన్సర్ సోకడంతో తీవ్ర అ నారోగ్యానికి గురయ్యాడు. మెరుగైన వైద్యం కోసం అవస్థలు పడుతున్న సమయంలోనే క్యాన్సర్ మహ మ్మారి లీవర్‌కు పాకింది. అతనికి ఆపరేషన్ చేయాలంటే కనీసం రూ. 15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్న రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం కరీంనగర్‌లో చికిత్స పొందుతున్నాడు.
దాతలు సంప్రదించాల్సిన వివరాలు
అకౌంట్ నంబర్ : 62255754401
పేరు : రాజేంద్రప్రసాద్, బ్యాంకు : ఎస్‌బీఐ
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఆఐN0020268
ఫోన్ పే నంబర్ : 9010767362
Comments
Please login to add a commentAdd a comment