plea
-
సీఎం కేజ్రీవాల్‌కు క్యాన్సర్? అవే లక్షణాలు?
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను వైద్య పరీక్షలు చేయించుకోవాల్సినందున తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. పీఈటీ, సిటీ స్కాన్ తదితర వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తన మధ్యంతర బెయిల్‌ను ఒక వారం పాటు పొడిగించాలని కేజ్రీవాల్ తన పిటిషన్లో వివరించారు.అరవింద్ కేజ్రీవాల్లో కనిపిస్తున్న లక్షణాలు తీవ్రమైన కిడ్నీ సమస్యలు లేదా క్యాన్సర్‌ని కూడా సూచిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. దీని తరువాత లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి జూన్ ఒకటి వరకు ఢిల్లీ సీఎంకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మే 10న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అలాగే జూన్ 2న కోర్టుకు లొంగిపోవాలని కూడా ఆదేశించింది.బిజినెస్ టుడే తెలిపిన వివరాల ప్రకారం ఆప్ నేత అతిషి మీడియాతో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. కేజ్రీవాల్ ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నసమయంలో అతని బరువు ఏడు కిలోలు మేరకు తగ్గింది. అకస్మాత్తుగా బరువు తగ్గడం అనేది ఆందోళన కలిగించే అంశమని, కస్టడీ నుంచి బయటకు వచ్చాక, వైద్యుల పరిశీలనలో ఉన్నప్పటికీ కేజీవాల్ తిరిగి బరువు పెరగడం లేదని అతిషి తెలిపారు.ఢిల్లీ సీఎంకు జరిపిన వైద్య పరీక్షల్లో అతని కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని తేలిందని అతిషి చెప్పారు. అధిక కీటోన్ స్థాయిలతో పాటు ఆకస్మికంగా బరువు తగ్గడం అనేది క్యాన్సర్‌తో పాటు కిడ్నీ వ్యాధులకు సంకేతమని ఆమె తెలిపారు. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్ పీఈటీ స్కాన్‌తో పాటు ఇతర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారని అతిషి వివరించారు. -
సీఈసీ, ఈసీల నియామక చట్టంపై స్టే ఇవ్వలేం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (అపాయింట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సరీ్వస్, టర్మ్స్ ఆఫ్ ఆఫీస్) చట్టం–2023’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, ఇటీవల ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఇతర పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్ లాయర్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీ సిఫార్సుల మేరకు సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపట్టాలని అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచి్చందని గుర్తుచేశారు. కొత్త చట్టంపై స్టే విధించాల్సిందేనని అసోసియేషన్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రభుత్వ పాలనాయంత్రాంగం కింద పని చేస్తోందని ఆరోపించారు. అయితే, ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని, పాలనాయంత్రాంగం కింద పనిచేస్తోందని అనడం సరికాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యా నించారు. ‘‘ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే నియమితులయ్యారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. నియమితులైన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టంపై మధ్యంతర ఉత్తర్వు ద్వారా స్టే విధించడం గందరగోళానికి దారి తీస్తుంది. అలాగే వారి నియామకాన్ని నిలిపివేయలేం’’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తేల్చిచెప్పారు. నూతన చట్టం ప్రకారం ఎంపికైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరింది. అయితే, ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్లను పరిశీలిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 5 తేదీకి వాయిదా వేసింది. -
మహువా మెయిత్రా పిటిషన్‌పై సుప్రీంలో నేడు విచారణ
ఢీల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. క్యాష్ ఫర్ క్వారీ ఆరోపణలతో తన ఎంపీ సభ్యత్వం రద్దును సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేశారు. కేంద్రంపై విమర్శలు చేయడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పందం చేసుకున్నట్లు మెయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. కేంద్రం, అదానీ సంస్థలపై విమర్శలు చేయడానికి టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మొదటిసారి పార్లమెంట్లో ఈ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో పెద్ద చర్చే జరిగింది. ఈ అంశం చివరికి ఎథిక్స్ కమిటీకి చేరింది. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడగడానికి మహువా అనైతిక చర్యకు పాల్పడినట్లు ఎథిక్స్ కమిటీ నిర్దారిచింది. మెయిత్రా తన లోక్‌సభ పోర్టల్ లాగిన్ వివరాలను వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో పంచుకున్నట్లు ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఈ 'క్యాష్-ఫర్-క్వారీ' కుంభకోణంలో ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ నివేదిక సిఫార్సు చేసింది. దీంతో డిసెంబర్ 8న ఆమె తన ఎంపీ పదవిని రద్దు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆమె మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. ఎథిక్స్ కమిటీ తన వాదనను వినిపించుకోలేదని మహువా ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఎంపీ పదవి రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసు సూత్రధారి లలిత్ ఝా అరెస్టు -
'ప్లీజ్ నన్ను చంపకండి..' హమాస్ దళాల బందీలో యువతి
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో హమాస్ మిలిటెంట్ల అమానయ చేష్టలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో నిర్వహిస్తున్న పీస్ఫెస్టివల్పై హమాస్ ఉగ్రవాదులు.. అరమణి(25) అనే యువతిని ఎత్తుకెళ్లారు. ఆమెను మిలిటెంట్లు బైక్‌పై బలవంతంగా ఎక్కించుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో మిలిటెంట్లను వేడుకుంటోంది అరమణి. ప్లీజ్ నన్ను చంపకండి.. దయచేసి వదలిపెట్టండి అంటూ ఏడుస్తోంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ నాథన్‌ను కూడా హమాస్ దళాలు బంధించి తీసుకెళ్లారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Noa was partying in the south of Israel in a peace music festival when Hams terrorists kidnapped her and dragged her from Israel into Gaza. Noa is held hostage by Hamas. She could be your daughter, sister, friend.#BringBackOurFamily pic.twitter.com/gi2AStVdTQ — Hen Mazzig (@HenMazzig) October 7, 2023 ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ఇప్పటికే ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ వీధుల్లో హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగిస్తున్న ఆందోళనకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్నది జర్మనీ పౌరురాలైన తన సోదరి అని ఓ మహిళ ధృవీకరించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలు.. మహిళను నగ్నంగా ఊరేగించి.. -
అల్లర్లతో ఢిల్లీ హై అలర్ట్.. భద్రతపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు..
ఢిల్లీ: హర్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. సీసీటీవీలతో నిఘాను మరింత పెంచాలని ఆయా ప్రభుత్వాలకు జారీ చేసిన నోటిసుల్లో పేర్కొంది. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘర్షణలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పలు హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. ఢిల్లీతో సహా చుట్టపక్కల రాష్ట్రాల్లో దాదాపు 30 వరకు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశాయి. ఇప్పటికే ఉన్న అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ ర్యాలీలకు అనుమతించవద్దంటూ సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. అదనపు బలగాలను మోహరించాలని నోటీసుల్లో పేర్కొంది. ర్యాలీలపై పిటీషన్ దాఖలు.. హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల సెగ దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. నుహ్ జిల్లాలో అల్లర్లకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్లు ర్యాలీలు నిర్వహించతలపెట్టాయి. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఆయా సంఘాలు ర్యాలీలను రద్దు చేయాలని కోరుతూ పిటీషనర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. నుహ్, గుర్‌గ్రామ్‌లలో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అల్లర్లను ప్రేరేపించే చిన్న సంఘటన కూడా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. కావున అల్లర్లను రెచ్చగొట్టే ఎలాంటి మతపరమైన ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొన్నారు. హర్యానా ఘటనకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలోని నారిమన్ విహార్ మెట్రో స్టేషన్ పరిధిలో బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. మేవాత్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ నిరసనలకు పిలుపునిచ్చింది. మానేసర్‌లో భిసమ్ దాస్ మందిర్ వద్ద భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ మహా పంచాయత్‌ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. హర్యానాలో సోమవారం అల్లర్లు చెలరేగాయి. విశ్వహిందూ పరిషత్ ర్యాలీపై ఇతర వర్గం వారు దాడి చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. అల్లరిమూకలు వందల సంఖ్యలో వాహనాలకు నిప్పంటించారు. అల్లర్లను అదుపుచేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ నిలిపివేసింది. ఇదీ చదవండి: ఎన్సీఆర్కు పాకిన హర్యానా మత ఘర్షణలు.. 116 మంది అరెస్ట్.. ఢిల్లీ హై అలర్ట్ -
పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటీషన్
-
Viveka Case : సునీత పిటిషన్ జులై 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో.. సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణను వచ్చే నెల(జులై) 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ(జూన్ 19, సోమవారం) విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నెలాఖరు (జూన్ 30) కల్లా వివేకా హత్య కేసుపై సిబిఐని దర్యాప్తు పూర్తి చేయమని ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విషయాన్ని సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానానికి గుర్తు చేశారు. ఈ నెలాఖరుతో సిబిఐ దర్యాప్తు గడువు ముగుస్తున్నందున ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ అంగీకరించలేదు. కేసు విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ CJI బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో వాదనలు వినిపించాల్సిందిగా ప్రతివాదులయిన అవినాష్ రెడ్డి, CBIలకు నోటీసులు జారీ చేసింది. Supreme Court is hearing a plea by the daughter of former MP late YS Vivekananda Reddy against a Telangana High Court order granting anticipatory bail to Kadapa MP YS Avinash Reddy in connection with her father's murder.#SupremeCourt #SupremeCourtofIndia pic.twitter.com/Xs5HCAjpXz — Bar & Bench (@barandbench) June 19, 2023 పిటిషన్‌కు కాలం చెల్లే అవకాశం! వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఈ నెలాఖరు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌గా విధించిన సంగతి తెలిసిందే. అలాగే సునీతా రెడ్డి పిటిషన్ ను జులై 3కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. CBI చార్జిషీట్ దాఖలు చేస్తే గనుక ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ కు కాలం చెల్లిపోయే అవకాశం ఉంది. గత విచారణలో సునీత తీరుపై అసంతృప్తి వివేకా కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి మే 31వ తేదీన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. గత విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది సునీత. అంతే కాదు, హైకోర్టు మినీ ట్రయల్ ను నిర్వహించిందని, తమ వాదనల్లో మెరిట్ పరిశీలించకుండా బెయిల్ ఇచ్చిందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను అరెస్ట్ చేయించాలన్న తాపత్రయం సునీతలో కనిపిస్తోందని, కేవలం ఇగో క్లాషెస్ కోసం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మొన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. Justice Surya Kant: Returnable on 7th July. Counsel: There is a connected matter. Justice Kant: List before first bench on 3rd July 2023, after getting appropriate orders from CJI. #SupremeCourt #SupremeCourtOfIndia — Live Law (@LiveLawIndia) June 19, 2023 తన వాదనే వినాలి, తాను చెప్పిందే నమ్మాలి అన్నట్టుగా కనిపించిన సునీత తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఏ న్యాయస్థానమయినా.. ఎలాంటి అభియోగాలపైనా అయినా.. వాదనలతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని సునీత విస్మరించినట్టు కనిపించింది. ఇదీ చదవండి: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కి కారణం ఇదే.. -
వివేకా కేసు.. ఏ1 గంగిరెడ్డి బెయిల్ రద్దు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి ఊరట లభించింది. ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు వచ్చే నెల 5వ తేదీలోగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే.. గంగిరెడ్డిని అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలిపింది న్యాయస్థానం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు ప్రధాన నిందితుడు (ఏ–1) ఎర్ర గంగిరెడ్డి. అయితే.. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కేసు విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టులో సీబీఐ ఓ పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్యకు కుట్ర పన్నింది ఎర్ర గంగిరెడ్డేనని, దాన్ని అమలు చేయడంలోనూ అతనిది కీలక పాత్ర అని దర్యాప్తు సంస్థ వాదనలు వినిపించింది. అంతేకాదు.. సాక్ష్యాలు తారుమారు చేయడంలోనూ అతను కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. గంగిరెడ్డి గనుక బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదించింది. అయితే.. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయించాలని సీబీఐ పలుమార్లు ప్రయత్నించి విఫలమైందని అతని తరపున న్యాయవాది వాదించారు. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లను.. కడప కోర్టు, ఏపీ హైకోర్టు కూడా కొట్టివేశాయని ప్రస్తావించారు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని, బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే వాదనలు విన్న ఏకసభ్య బెంచ్.. సీబీఐ వాదనతోనే ఏకీభవించింది. దర్యాప్తు దశలో.. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో గంగిరెడ్డి లొంగిపోవాలని, లేకుంటే అరెస్ట్ చేసుకోవచ్చని దర్యాప్తు సంస్థకు సూచించింది హైకోర్టు. అలాగే.. రెండు నెలల్లోపు వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేయాలని, జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జులై 1వ తేదీ తర్వాత గంగిరెడ్డికి తిరిగి బెయిల్ ఇవ్వొచ్చని ట్రయల్ కోర్టుకు తెలిపింది హైకోర్టు. 2019 అక్టోబర్‌లో వివేకా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ ఇచ్చింది పులివెందుల కోర్టు. ఆపై 2021లో ఎర్ర గంగిరెడ్డిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏ1గా కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందునా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరుతూ వస్తోంది. ఇదీ చదవండి: వివేకా రెండో భార్య సంచలన స్టేట్మెంట్ -
AP: హైకోర్టులో ‘ఈనాడు’కి ఎదురుదెబ్బ..
సాక్షి, అమరావతి: విస్తృత సర్క్యులేషన్ కలిగిన ఏదైనా ఓ దినపత్రికను కొనుగోలు చేసుకునేందుకు సచివాలయాలు, వలంటీర్లకు నెలకు రూ.200 ఆర్థిక సాయాన్ని అందచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలును నిలిపివేయాలంటూ ‘ఈనాడు’ పత్రిక చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. వలంటీర్లు, సచివాలయాలు ‘సాక్షి’ దినపత్రికను కొంటే... ఆ కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోవద్దంటూ ఆడిట్ బ్యూరో సర్కులేషన్ (ఏబీసీ)ను ఆదేశించాలన్న అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. ఈ మేరకు ఈనాడు దాఖలు చేసిన రెండు అనుబంధ వ్యాజ్యాలను కొట్టివేసింది. సర్క్యులేషన్ దారుణంగా పడిపోవటంతో.. ఏబీసీ ఆడిట్లో తన అసలు సర్క్యులేషన్ బండారం బయటపడుతుందని, ఇన్నాళ్లూ తాను రకరకాలుగా కాపాడుకుంటూ వస్తున్న నంబర్–1 స్థానం పోతుందనే భయంతో ‘ఈనాడు’ పత్రిక ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... నిర్దిష్టంగా ఫలానా పత్రికను మాత్రమే కొనుగోలు చేయాలంటూ వలంటీర్లను గానీ, సచివాలయాలను గానీ ప్రభుత్వం ఆదేశిస్తున్నట్లుగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని స్పష్టం చేసింది. రూ.200 ఆర్థిక సాయాన్ని వలంటీర్లకు, సచివాలయాలకు ‘సాక్షి’ దినపత్రికను మాత్రమే కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో ఇస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని లోతైన విచారణ జరిపి తేలుస్తామని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ‘ఈనాడు’ చేస్తున్న ఆరోపణల ఆధారంగా... ‘సాక్షి’ కొనుగోళ్లను పెంచుకునేందుకే ప్రభుత్వం రూ.200 ఆర్థిక సాయం చేస్తోందన్న ప్రాథమిక నిర్ణయానికి ఈ దశలో రాలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రస్తావించిన కీలకాంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఇది సాక్షి – ఈనాడు మధ్య వ్యాపార సంబంధిత వివాదమని ధర్మాసనం అభిప్రాయపడింది. సాధారణంగా ఇద్దరి మధ్య జరిగే ఇలాంటి వ్యాపార యుద్ధాల్లో న్యాయస్థానాలు మధ్యంతర ఉత్తర్వుల దశలో అరుదుగా మాత్రమే జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్యానించింది. జీవోలు రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్ ఏదైనా పత్రిక కొనుగోలు నిమిత్తం గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాలకు నెలకు రూ.200 ఆర్థిక సాయంతో పాటు బడ్జెట్ కేటాయింపుల జీవోలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలంటూ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈనాడు) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వలంటీర్లు, సచివాలయాల ద్వారా జరిగే సాక్షి దినపత్రిక కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్కు్యలేషన్ (ఏబీసీ)ను ఆదేశించడంతో పాటు నిర్దిష్ట కాలాల్లో సాక్షి పత్రికకు ఇచ్చిన సర్క్యులేషన్ సర్టిఫికేషన్‌ను పునఃసమీక్షించేలా ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్ ఐ.వెంకట్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం తెలిసిందే. ప్రభుత్వ జీవోల అమలును నిలిపివేయడంతో పాటు 2022 జూలై–డిసెంబర్, ఆ తరువాత కాలానికి సాక్షి సర్క్యులేషన్‌ను ఆడిట్ చేయకుండా ఏబీసీని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ రెండు అనుబంధ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సీజే ధర్మాసనం మొదట ఈ అనుబంధ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. అటు ఈనాడు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్నది. మంగళవారం ఈ అనుబంధ వ్యాజ్యాల్లో ఉత్తర్వులు వెలువరించింది. శాసనసభ స్వతంత్ర వ్యవస్థ ‘ఈనాడుపై నిషేధం విధిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం విషయానికొస్తే శాసనసభ అన్నది స్వతంత్ర వ్యవస్థ. దాని చర్యలను ఈనాడు తన పిటిషన్లో సవాలు చేయలేదు. ఇక సాక్షి సర్క్యులేషన్ లెక్కల విషయానికొస్తే ఏబీసీ మాత్రమే సర్క్యులేషన్ గణాంకాలను విడుదల చేస్తుంది. వీటిని విశ్వసిస్తూ ఈనాడు తన వ్యాజ్యంలో ప్రస్తావించింది కాబట్టి ఏబీసీ గణాంకాలను తారుమారు చేయవచ్చని ఈ దశలో భావించలేం. ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఓ పత్రిక లేదా ఇతర పత్రికల కొనుగోళ్లు పెరిగితే ఆ వివరాలను తాజాగా సర్క్యులేషన్ గణాంకాలను విడుదల చేసేందుకు ఏబీసీ ఉపయోగించుకుంటుంది. ప్రభుత్వం విడుదల చేసే నిధుల వల్ల వలంటీర్లు, సచివాలయాలు నిర్దిష్టంగా ఓ పత్రికను కొనుగోలు చేసినంత మాత్రాన సర్క్యులేషన్ గణాంకాలను విడుదల చేయకుండా ఏబీసీని ఏ రకంగానూ నిరోధించలేం. చదవండి: బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ? రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టంగా ఓ పత్రికను మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలను చూపలేదు’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనాడు దాఖలు చేసిన రెండు అనుబంధ వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వుల్లో తాము వ్యక్తం చేసినవి కేవలం అనుబంధ వ్యాజ్యాలకు మాత్రమే పరిమితమని, ప్రధాన వ్యాజ్యాన్ని పరిష్కరించే విషయంలో ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. -
నవయుగ కంపెనీకి సుప్రీంకోర్టులో షాక్
సాక్షి, ఢిల్లీ: మచిలీపట్నం పోర్టు పనుల రద్దుపై నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భూమి కేటాయించినా పోర్టు నిర్మించడంలో నవయుగ ఆలస్యం చేసిందని కాంట్రాక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. త్వరితగతిన పోర్టు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. చదవండి: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు సోదాలు -
నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన యూకే హైకోర్టు.. త్వరలో భారత్‌కు..
చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొనేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హైకోర్టులో చుక్కెదురైంది. దేశం నుంచి పరారీలో ఉన్న నీరవ్ మోదీని భారత్‌కి తిరిగి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ పిటీషన్ దాఖలైంది. అయితే నీరవ్ మోదీని అప్పగించడం అన్యాయం లేదా అణచివేత కాదని కోర్టు పేర్కొంటూ అతని పిటీషన్‌ను తిరస్కరించింది. దీంతో త్వరలో నీరవ్ భారత్‌కు రానున్నారు. ఈ అప్పీల్ విచారణకు అధ్యక్షత వహించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు. ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో కటకటాల వెనుక ఉన్న 51 ఏళ్ల వ్యాపారవేత్త, గత ఫిబ్రవరిలో భారత్‌కు అప్పగింతకు అనుకూలంగా జిల్లా జడ్జి సామ్ గూజీ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని రూ. 13,500 కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయాడు. అప్పటినుంచి భారత్‌కు తిరిగి రాకుండా తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నాడు. చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! -
చనిపోయిన దోమలను తీసుకుని కోర్టుకు హాజరైన గ్యాంగ్‌స్టర్
ముంబై: చనిపోయిన దోమలను ఒక ప్లాస్టిక్ బాటిల్ నిండా నింపుకుని కోర్డుకు వచ్చాడు గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా. వాటిని జడ్జికి చూపిస్తూ దోమతెర కావాలని కోరాడు. సదరు గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మాజీ సహచరుడు. అతనిపై మహారాష్ట్రలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. లక్డావాలాని 2020లో పోలీసులు అరెస్టు చేసి నావీ ముంబైలోని తలోజా జైల్లో పెట్టారు. ఈమేరకు లక్డావాలా సెషన్ కోర్టులో దోమతెర కావాలంటూ అప్పీల్ పెట్టుకున్నాడు. అందుకోసం అని కోర్టుకి చనిపోయిన దోమలను ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసుకుని తీసుకువచ్చి...కోర్టులో చూపిస్తూ తాను తన సాటి ఖైదీలు వీటితో ఇబ్బందిపడుతున్నామని చెప్పాడు. పోలీసులు భద్రతా దృష్ట్యా దోమతెరలు అందించడం లేదని వాపోయాడు. ఐతే కోర్టు ఆ ఆపీల్ని తిరస్కరించింది. దోమతెరకు బదులు ఓడోమోస్ వంటి దోమల నివారిణులను ఉపయోగించుకోవాల్సిందిగా సూచించింది. అంతేగాక జైలు అధికారులు దోమల బెడద అరికట్టే చర్యలను తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి పలు ఫిర్యాదులు గతంలో కోర్టు ముంగిటకి వచ్చాయి. ఐతే వాటిలో కొందరికి దోమతెర వెసులుబాటు కల్పించారు కానీ కొందరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌కి మాత్రం ఆ వెసులుబాటు ఇవ్వడం లేదు. (చదవండి: దోపిడికి గురయ్యాను కాపాడాలంటూ ఎమర్జెన్సీ కాల్! తీరా చూస్తే...) -
ఈవీఎంలో పార్టీ గుర్తుల తొలగింపునకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎం, బ్యాలెట్లపై పార్టీ గుర్తులు నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈవీఎంలో అభ్యర్థి పేరు, వయసు, విద్యార్హత, ఫొటోలు ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం విచారించింది. ఈవీఎంలో పార్టీ గుర్తులుండడంపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికలు పార్టీలతో ముడిపడి ఉంటాయని, పిటిషన్‌ను అంగీకరిస్తే అభ్యర్థి గెలిచాక పార్టీలు మారే ప్రమాదముందని పేర్కొంది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పార్టీల నీడలో అభ్యర్థులు ఉండడం వల్లే చట్టసభల సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. నేర చరిత్ర లేని వారికి పార్టీలు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పిటిషనర్ వాదనపై అటార్నీ జనరల్ వెంకట రమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలో ఓటు వేయడానికి ముందుగానే ఓటర్లు తమ అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారని ఏజీ పేర్కొన్నారు. పిటిషన్ ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచన చేసింది. కోర్టు విచారణకు అంగీకరించని నేపథ్యంలో తాను ఈసీని ఆశ్రయిస్తాయని వికాస్ సింగ్ పేర్కొన్నారు. తమకు ఫిర్యాదు వస్తే తప్పకుండా పరిశీలిస్తామని ఈసీ తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారు. చదవండి: ఎన్నికల వేళ.. బీజేపీలో ముసలం -
బిల్కిస్ బానో దోషుల విడుదల.. కీలక పరిణామం
న్యూఢిల్లీ: గుజరాత్ మారణకాండ సమయంలో జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి శిక్ష అనుభవిస్తున్న దోషుల్ని శిక్షా కాలం ముగియక ముందే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన తాజా పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. బిల్కిస్ బానో కుటుంబసభ్యులు ఏడుగురి హత్యపై కూడా విచారించాలని ఆ పిటిషన్ పేర్కొంది. ఇప్పటికే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సి.టి. రవికుమార్‌లు ఆ ప్రధాన పిటిషన్‌కు దీనిని కూడా జత చేశారు. నేరస్తుల విడుదలపై దాఖలైన ఎన్నో పిటిషన్లకు గుజరాత్ ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదు. దీనిపై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి మరింత సమయం ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తే నవంబర్ 29వ తేదీన దీనిపై న్యాయస్థానం విచారణ కొనసాగించనుంది. ఇదీ చదవండి: తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు! -
మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి
ఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత, ప్రవక్త కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి ఊహించని స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాక.. బెదిరింపులు, వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని ఆమె తాజా అభ్యర్థన పిటిషన్‌ను అదే బెంచ్ ముందు దాఖలు చేశారు. తన అరెస్టును నిలువరించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె మరోసారి కోర్టులో అభ్యర్థించారు. ఇదిలా ఉంటే ఆమె పిటిషన్‌పై ఇవాళ(మంగళవారం) విచారణ చేపట్టే అవకాశం ఉంది. గతంలో విచారణ సందర్భంగా ఆమె అభ్యర్థనపై స్పందించిన బెంచ్.. సంబంధిత హైకోర్టు(ఢిల్లీ)ను సంప్రదించాలని ఆమె తరపు న్యాయవాదికి సూచించారు. అయినప్పటికీ ఆమె మరోసారి సుప్రీంను ఆశ్రయించడం విశేషం. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం జులై 1వ తేదీన నూపుర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు నిరసన సెగ తగిలింది. అంతేకాదు పలువురు మేధావులు, రిటైర్డ్ జడ్జిలు, బ్యూరోక్రట్లు, రాజకీయ నేతలు సైతం తీవ్రంగా తప్పుబడుతూ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఒక బహిరంగ లేఖ రాశారు కూడా. అయితే ఆ నాటి నుంచి తనకు అత్యాచార, చావు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయని ఆమె తాజా అభ్యర్థనలో పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని ఢిల్లీకి బదలాయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరోసారి ఆమె సుప్రీంలో పిటిషన్ వేసింది. ఈ గ్యాప్‌లో ఆమెపై మరో మూడు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు కావడం గమనార్హం. చదవండి: బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలి! -
చిన్నమ్మకు చుక్కెదురు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్నమ్మ శశికళకు చెన్నై సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆమెను తొలగించడం సబబే అంటూ న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది. నేపథ్యం ఇదీ.. సుదీర్ఘకాలం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూశారు. తరువాత ఆ బాధ్యతల్లో శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఎంపికైనట్లు ఆపార్టీ 2016 డిసెంబర్ 19న ప్రకటించింది. ఇక ఆ తరువాత సీఎం సీటుపై కన్నేసిన జయలలిత శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నిక్కయ్యారు. అయితే అదే సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకెళ్లారు. దీంతో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను, ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి టీటీవీ దినకరన్‌ను తొలగిస్తున్నట్లు పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ ఓ పన్నీర్‌సెల్వం, ఉప కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్‌లో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఆ తీర్మానాలు చెల్లవంటూ.. ఇదిలా ఉండగా, ప్రధాన కార్యదర్శి సమక్షంలో జరగని (సర్వసభ్య సమావేశంలో) తీర్మానాలు చెల్లవని ప్రకటించాల్సిందిగా కోరుతూ శశికళ, దినకరన్ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. తనను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ 2016లో చేసిన తీర్మానానికి పార్టీ సభ్యుల హోదాలో పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి బద్దులై ఉండాలని, కన్వీనర్, కో– కన్వీనర్ పదవులను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రకటించాలని శశికళ తన పిటిషన్లో పేర్కొన్నారు. శశికళ వేసిన పిటిషన్‌ను నిరాకరించాల్సిందిగా పన్నీర్‌సెల్వం, ఎడపాడి కూడా పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం కోర్టులో విచారణకు వచ్చినప్పుడు పార్టీ తరపు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ, శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఎన్నికల కమిషన్ సమర్ధించిందని చెప్పారు. తాను పార్టీ ప్రధాన కార్యదర్శినని.. న్యాయస్థానంలో శశికల అబద్ధమాడారని వివరించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అనే పేరుతో సొంతగా పార్టీ స్థాపించినందున తాను వేసిన పిటిషన్‌ను వెనక్కితీసుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ మరో పిటిషన్ ద్వారా కోర్టుకు విన్నవించారు. దీంతో ప్రధాన కార్యదర్శిగా ప్రకటించాలని కోరుతూ శశికళ దాఖలు చేసిన పిటిషన్‌పై మాత్రమే సోమవారం విచారణ సాగింది. శశికళ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి దాఖలు చేసిన పిటిషన్లను స్వీకరిస్తున్నట్లు, ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ చేసిన తీర్మానం చెల్లుతుంది కాబట్టి ఆమె వేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెన్నై సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి జె. శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు. సివిల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తాం.. సేలం: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడం సబబే అంటూ చెన్నై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేస్తామని చిన్నమ్మ సోమవారం స్పష్టం చేశారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులోని ఆర్ధనారీశ్వర స్వామి ఆలయానికి శశికళ సోమవారం వచ్చి స్వామిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవారు, నవగ్రహాల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలే తనకు ఆధారమన్నారు. ఎంజీఆర్ రూపొందించిన విధి విధానాల ఆధారంగా కార్యకర్తలే ప్రధాన కార్యదర్శిని నిర్ణయించగలరని స్పష్టం చేశారు. దేశంలోని మరే పార్టీలోనూ ఈ షరతు లేదని, అన్నాడీఎంకే విధి విధానాల్లో మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే తాను పోరాడుతున్నట్లు చెప్పారు. -
'ప్లీజ్.. పప్పను బతికించండి.. లేకపోతే నేను ఒంటరి వాన్నవుతాను'
సాక్షి, నిజామాబాద్(మోర్తాడ్): ‘అందరికీ నమస్కారం.. నాకు నా పప్పా కావాలి.. ఎలాగైనా మీరే మా పప్పాను కాపాడాలి... లేకపోతే నేను ఒంటరి వాన్ని అయిపోతాను.. అందరికి చేతులెత్తి మొక్కుతున్నా.. ప్లీజ్ ప్లీజ్’ అంటూ వచ్చిరాని మాటలతో నాలుగేళ్ల అరింద్ర తన తండ్రి కోసం వేడుకుంటున్న వీడియో కన్నీళ్లను పె ట్టిస్తోంది. తన తండ్రి ఆరోగ్యం కోసం బాలుడు వేడుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న మోర్తాడ్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌కు క్యాన్సర్ సోకింది. అస లే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలంటే మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరి స్థితి బాగాలేకపోవడంతో ఆపన్నహస్తం కోసం అత ని కుటుంబం ఎదురుచూస్తోంది. రాజేంద్రప్రసాద్ ఉపాధి కోసం టైలరింగ్ పని చేస్తుండేవాడు. కొన్ని నెలల కింద కడుపులో క్యాన్సర్ సోకడంతో తీవ్ర అ నారోగ్యానికి గురయ్యాడు. మెరుగైన వైద్యం కోసం అవస్థలు పడుతున్న సమయంలోనే క్యాన్సర్ మహ మ్మారి లీవర్‌కు పాకింది. అతనికి ఆపరేషన్ చేయాలంటే కనీసం రూ. 15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్న రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం కరీంనగర్లో చికిత్స పొందుతున్నాడు. దాతలు సంప్రదించాల్సిన వివరాలు అకౌంట్ నంబర్ : 62255754401 పేరు : రాజేంద్రప్రసాద్, బ్యాంకు : ఎస్బీఐ ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఆఐN0020268 ఫోన్ పే నంబర్ : 9010767362 -
చదువుపై దృష్టి పెట్టు: ఇంటర్ విద్యార్ధికి సుప్రీం సూచన
న్యూఢిల్లీ: రాజ్యాంగ పరిహారాలు కోరుతూ కోర్టులను ఆశ్రయించడం కన్నా చదువుపై దృష్టి పెట్టాలని ఒక విద్యారిని సుప్రీంకోర్టు సున్నితంగా మందలించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన 17ఏళ్ల ఇంటర్ విద్యార్ధి సుప్రీంకోర్టులో పిల్ వేశాడు. అయితే పిల్లలు ఇలాంటి అంశాల్లో తలదూర్చడం మంచిది కాదని దీనిపై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. అలాగని ఈ పిల్‌ను తాము పబ్లిసిటీ స్టంటుగా పరిగణించడం లేదని, కానీ ఇది తమవద్దకు రావాల్సిన పిటిషన్ కాదని తెలిపింది. కావాలంటే సదరు విద్యార్ధి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది. ‘‘మీ క్లయింట్‌ను చదువుపై శ్రద్ధ పెట్టమనండి. రాజ్యాంగ పరిహారాల్లాంటి అంశాల్లో తలదూర్చవద్దని సూచించండి. ఇదసలు ఎలాంటి అసందర్భ పిటిషనో మీరే గమనించండి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో మాదిరి పరిస్థితులున్నట్లు కేరళలో లేవు. పిల్లలు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది’’ అని క్లయింట్ తరఫు న్యాయవాదికి సూచించింది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని బలవంతంగా పిల్లలను బడికి పంపమని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. ఇప్పుడిప్పుడే సెకండ్‌వేవ్ ప్రకంపనాలు తగ్గుతున్నాయని, మరో వేవ్ అవకాశాలు పెరిగాయని, మరోవైపు పిల్లలకు టీకాలు ఇంకా రాలే దని గుర్తు చేసింది. అందువల్ల ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు స్కూల్ ఓపెనింగ్ నిర్ణయాలు తీసుకుంటాయని, తాము బలవంతం గా ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటిషన్ ఉపసంహరించుకుంటామని పిటిషనర్ తెలపడంతో ధర్మాసనం అంగీకరించింది. -
భారత్‌పై నిషేధం: నిర్మోహమాటంగా కోర్టు నిరాకరణ
సిడ్నీ: ఏడాదిన్నర కిందట భారతదేశానికి వచ్చిన ఓ ఆస్ట్రేలియన్ వ్యక్తి ఇప్పుడు కర్నాటకలోని బెంగళూరులో ఒంటరిగా ఉంటున్నాడు. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చేవారిపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అందులో భాగంగా ఆస్ట్రేలియా కూడా ఇటీవల భారతదేశం నుంచి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించింది. అసలు భారత్ నుంచి వచ్చేవారిని నిషేధించింది. ఈ నిషేధంపై ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో వివాదం కొనసాగింది. సిడ్నీలోని కోర్టులో భారతేదశం నుంచి మన పౌరులను అనుమతించాలని చేస్తూ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో భారత్‌లో చిక్కుకున్న 79 ఏళ్ల వ్యక్తి ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. దేశ ఆరోగ్యం దృష్ట్యా.. వైద్యాధికారుల సిఫారసు మేరకు భారతీయుల రాకపై నిషేధం విధించినట్లు మరోసారి న్యాయస్థానం స్పష్టం చేసింది. కర్నాటకలోని బెంగళూరులో తమ దేశానికి చెందిన వ్యక్తి చిక్కుకునిపోయాడని.. ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చేందుకు పరిస్థితులు అడ్డంకిగా మారాయని సిడ్నీలోని కోర్టులో న్యాయవాది పిటిషన్ వేశాడు. దీనిపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలోకి ఎవరినీ రానివ్వం అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ వచ్చేందుకు ప్రయత్నిస్తే 66 వేల డాలర్ల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ చదవండి: రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్ -
‘ధిక్కారం’పై కేసు వాపసుకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ రాజ్యంగబద్ధతను సవాలు చేస్తూ మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం అనుమతిచ్చింది. ఇదే అంశంపై ఇప్పటికే పలు ఇతర పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్లు వీరు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. (ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా) జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ ఈ అంశంపై గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపి పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. నేరపూరిత ధిక్కరణ విషయంలోని ఓ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు, సమానత్వ హక్కుకు భంగం కలిగిస్తుందని పిటిషనర్లు గతంలో సుప్రీంను ఆశ్రయించారు. (రామోజీకి ‘సుప్రీం’ నోటీసులు) -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థపై దివాలా పిటిషన్
సింగపూర్: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐటీఎన్‌ఎల్) విదేశీ అనుబంధ సంస్థ ఐటీఎన్‌ఎల్ ఆఫ్‌షోర్ పీటీఈ లిమిటెడ్‌పై సింగపూర్ కోర్టులో గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్ఎస్బీసీ దివాలా అస్త్రాన్ని ప్రయోగించింది. సంస్థపై ‘వైండింగ్ అప్’ పిటిషన్ దాఖలు చేసింది. రూ.1,000 కోట్లకుపైగా బకాయిలు రాబట్టే క్రమంలో హెచ్ఎస్బీసీ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని ఒక సంస్థపై ఈ తరహా పిటిషన్ దాఖలు కావడం ఇదే తొలిసారి. ఐటీఎన్‌ఎల్ ఆఫ్‌షోర్ పీటీఈ లిమిటెడ్ జారీచేసిన 1,000 మిలియన్ల చైనా యువాన్ల (రూ.1,050 కోట్లకుపైగా) విలువైన బాండ్లలో హెచ్ఎస్బీసీ పెట్టుబడులు పెట్టింది. నిజానికి ఈ బాండ్లు 2021లో మెచ్యూరిటీకి వస్తాయి. -
ఆర్టికల్ 370 రద్దు : సుప్రీంకోర్టులో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ, ఆర్టికల్ 370 రద్దుపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవాలు చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఎల్ శర్మ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్టికల్ 370 రద్దు అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం జారీచేసిన ఉత్తర్వులను ఎంఎల్శర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని పిటిషన్లో ఆయన ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీ సమ్మతిని తీసుకోకుండా రాష్ట్రపతి ఆమోదించడం చట్టవిరుద్ధమని ఎం ఎల్ శర్మ వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆర్టికల్ 370రద్దుపై మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్య అప్రజాస్వామికమని మండిపడ్డారు. తనును గృహనిర్బంధంలో ఉంచి, లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌షా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తన పరిస్థితే ఇలా వుంటే.. ఇక సామాన్యుడి పరిస్థితిని ఏమిటని ప్రశ్నించారు. తాన నమ్మిన భారత దేశం ఇది కాదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి కష్ట కాలంలో దేశ ప్రజలు కశ్మీర్ ప్రజలకు అండగా నిలవాలంటూ కంటతడి పెట్టారు. -
రియల్ లైఫ్ విలన్లు వేరుగా ఉంటారు
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు ప్రభాస్ భూమి విషయంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావుల ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. పిటిషనర్ (ప్రభాస్) రీల్ లైఫ్ (సినిమా)లో విలన్లను ఎదుర్కొని ఉండొచ్చునని, రియల్ లైఫ్‌లో విలన్లు వేరుగా ఉంటారని తెలుసుకోవాలని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నెంబర్ 5/3లో తనకున్న భూమిని అధికారులు ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి గేటుకు తాళం వేయడాన్ని సవాలు చేస్తూ ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు గురువారం దానిని మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభాస్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆ భూమిని పిటిషనర్ చట్టబద్ధంగా కొనుగోలు చేశారని తెలిపారు. ఆ భూమిలో పిటిషనర్ నిర్మాణాలు కూడా చేశారన్నారు. అధికారులు సుప్రీంకోర్టు తీర్పు అంటూ తమ భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, గేటుకు తాళం వేశారని చెప్పారు. తరువాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, పిటిషనర్ రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేయించుకోలేదన్నారు. ఆ భూమిలో చేపట్టిన నిర్మాణాలకు అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. క్రమబద్ధీకరణ దరఖాస్తును కూడా తిరస్కరించామని, ఇదే విషయాన్ని ఆన్లైన్ పోర్టల్‌లో పేర్కొన్నామన్నారు. అందుకే రాతపూర్వకంగా ఆ విషయాన్ని పిటిషనర్‌కు తెలియచేయలేదన్నారు. పిటిషనర్ ఆ భూమిని సర్వే నంబర్ 5/3లో ఉందని చెబుతున్నారని, అది సర్వే 46 అని ఆయన వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఈ సర్వే నంబర్ 46లో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఇప్పటికే 84 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. బడా వ్యక్తులు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి రికార్డుల్లో మార్పులు చేసుకుంటున్నారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ‘తమ భూమి గేటుకు అధికారులు తాళం వేశారని ఫిర్యాదు చేస్తూ ఎవరైనా పేదవాడు కోర్టుకు వచ్చుంటే మేం జోక్యం చేసుకుని ఉండేవాళ్లం. తాళం తీసి బయటకు వెళ్లాలని అధికారులను ఆదేశించే వాళ్లం. అయితే ఇందులో పిటిషనర్ న్యాయపోరాటం చేసేందుకు డబ్బు ఖర్చు పెట్టగలరు. అందుకే మేం స్టే ఇవ్వడం లేదు. దీని అర్థం స్థితి మంతుల విషయంలో కోర్టు ఇలా వ్యవహరిస్తుందని కాదు. ఎవరి విషయంలోనైనా చట్టం ప్రకారమే నడుచుకుంటాం’ అని ధర్మాసనం తెలిపింది. తెలియక కొనుగోలు చేసుండొచ్చు శరత్ తన వాదనలు కొనసాగిస్తూ, ఆ భూమిపై హక్కు ఉందని భావిస్తే, సివిల్ కోర్టుకు వెళ్లవచ్చునన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వ భూమి అని తెలియక పిటిషనర్ ఆ భూమి కొనుగోలు చేసి ఉంటారు. పిటిషనర్ నిర్మించిన భవనాన్ని ఇప్పటికిప్పుడు కూల్చబోమని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో యథాతథస్థితి ఆదేశాలను కొనసాగిస్తున్నామంది. తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
నేరం ఒప్పుకున్న ట్రంప్ మాజీ ఎన్ఎస్ఏ ఫ్లిన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ సందర్భంగా తప్పుడు వాంగ్మూలంతో ఎఫ్బీఐను మోసగించినట్లు ట్రంప్ మాజీ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) మైకేల్ ఫ్లిన్ అంగీకరించారు. శుక్రవారం వాషింగ్టన్ ఫెడరల్ కోర్టుకు ఆయన హాజరయ్యారు. ఎన్నికల్లో రష్యా పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బీఐ మాజీ డైరక్టర్ రాబర్డ్ ముల్లర్ విచారణ సందర్భంగా అభియోగాల్ని వెల్లడించారు. అప్పటి రష్యా రాయబారి సెర్గీ కిస్లా్యక్తో సంభాషణలకు సంబంధించి ఉద్దేశ్యపూర్వకంగా ఫ్లిన్ ఎఫ్‌బీఐకి తప్పుడు, కల్పిత, మోసపూరిత వాంగ్మూలమిచ్చారని ఆరోపించారు. అప్పటి అధ్యక్షుడు ఒబామా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన సమయంలో.. ‘పరిస్థితి దిగజారకుండా అడ్డుకోండి’ అని రష్యా రాయబారి కిస్లా్యక్ను కోరలేదని పేర్కొంటూ ఎఫ్బీఐతో ఫ్లిన్ అబద్ధమాడారని చార్జ్‌షీట్‌లో ఆరోపించారు. ఇజ్రాయేల్‌కు సంబంధించి ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌ను జాప్యం చేయాలని, లేదా ఓడించాలని రష్యా రాయబారికి సూచించలేదని కూడా అబద్ధమాడినట్లు ముల్లర్ ఆరోపించారు. తాజా పరిణామాలపై వైట్‌హౌస్ స్పందించలేదు. ఎఫ్‌బీఐని తప్పుదారి పట్టిస్తే గరిష్టంగా 5 సంవత్సరాల వరకూ జైలు శిక్ష విధిస్తారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో మైకేల్ ఫ్లిన్ కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. -
ఎన్జీటీలో కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : పాత డీజిల్ వాహనాలపై నిషేధంపై కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. పదేండ్లు దాటిన డీజిల్ వాహనాలపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొట్టివేసింది. డీజిల్ వాహనాల కాలుష్యం ప్రజల పాటి ప్రమాదకరంగామారిందని పేర్కొంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నిషేధ ఆజ్ఞలను సవరిండానికి నిరాకరించిన ఒక డీజిల్ వాహనం 24 పెట్రోల్ వాహనాలు, 40 సిఎన్జీ వాహనాలకు సమానం అవుతుందని వ్యాఖ్యానించింది. కాగా నవంబర్ 2014 లో, జాతీయ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతున్నందున 15 ఏళ్ల కంటే ఎక్కువ డీజిల్, పెట్రోల్ వాహనాలకు అనమతి లేదని ఎన్జీటీ ఆదేశించింది. ఆ తరువాత ఏప్రిల్, 2015 లో ట్రిబ్యునల్ మరోసారి డీజిల్ వాహనాలను 10 ఏళ్ళకు పైబడిన డీజిల్ వాహనాలను అనుమతించరాదని ఆదేశించింది. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఎన్జీటీ మరోసారి ఆదేశించింది. జనవరి, 2017 లో ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో డీజిల్ వాహనాలపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరిధిని 15 ఏండ్లకు పెంచాలని కోరింది. ఎన్జీటీ నిర్ణయంతో పబ్లిక్, ప్రయివేటు సెక్టార్లు తీవ్రంగా దెబ్బ తింటాయని కేంద్రం వాదిస్తోంది. అటు డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే ప్రక్రియను ఢిల్లీ ఆర్టీఓ గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన అసంగతి తెలిసిందే. -
ఉపహార్ కేసు: రియల్టర్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపహార్ థియేటర్ ట్రాజెడీ కేసులో ప్రధాన దోషి రియల్ ఎస్టేట్ వ్యాపారి, గోపాల్ అన్సాల్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏడాది జైలు శిక్ష, రూ. 30 కోట్ల జరిమానాపై అన్సల్ పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం సుప్రీం కొట్టి వేసింది. జైలుకి వెళితే తన ఆరోగ్యంపై కోలుకోలేని దెబ్బపడుతుందన్న గోపాల్ అన్సల్ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మార్చి 20వ తేదీలోపు కోర్టుముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. గతనెలలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం గోపాల్ అన్సల్ కోర్టుముందు లొంగిపోవాల్సి ఉంది. రియల్టర్ల తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెట్మలానీ వాదిస్తుండగా, ఉపహార్ విషాద భాదితుల అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది కె టీఎస్ తులసీ తన వాదనలను వినిపించారు. తమ రిప్యూ పిటీషన్ పై సుప్రీం తీర్పుకు సమీక్ష ఉండదని వాదించారు. అయితే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని జె ఎస్ ఖేహర్ ధర్మాసనం విచారణకు జాబితా బెంచ్ లభ్యతపై శుక్రవారం నిర్ధారించనున్నామని సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీకి హామీ ఇచ్చారు. అయితే 1997లో జరిగిన ఉపహార్ సినిమా అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 59 మంది మృతి చెందిన నాటి ఘటనలో థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ సోదరులను దోషులుగా కోర్టు తేల్చింది. వీరిలో గోపాల్ అన్సల్ (69) సుప్రీంకోర్టు ఏడాది జైలుశిక్ష, రూ. 30 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. మరోవైపు సుశీల్ అన్సల్ వయసు ఆధారిత సమస్యల కారణంగా మినహాయింపునిచ్చింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని గోపాల్‌నున ఆదేశించిన సంగతి తెలిసిందే. 2015లో దోషులిద్దరికీ సుప్రీంకోర్టు రెండేండ్ల జైలుశిక్ష (ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా ఉన్నందుకు), చెరొకరికి రూ.30 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2008 డిసెంబర్ 19న ఢిల్లీ హైకోర్టు వారి శిక్షను ఏడాదికి తగ్గించింది. ఈ నేపథ్యంలో మృతుల బంధువుల అసోసియేషన్ దీనిపై న్యాయపోరాటానికి దిగింది. తమకున్యాయం చేయాల్సింది కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. -
పాత నోట్ల మార్పిడిపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూడిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత నోట్ల మార్పిడిపై దేశ అత్యున్నత ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. డీమానిటైజేషన్‌లో భాగంగా రద్దయిన పాత నోట్లను మార్చుకునేందుకు ఈ నెలాఖరు వరకూ ఇచ్చిన గడువు అమలు కాకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణకు సుప్రీం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ జే.ఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఈ నెల10వ తేదీ లోపు కేంద్రం స్పదించాల్సిందిగా ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతన ప్రసంగంలో 31 డిసెంబర్ 2016కి ముందు పాతనోట్లను డిపాజిట్ చేయలేని వ్యక్తులెవరైనా ఆర్బీఐ ప్రత్యేక బ్రాంచ్‌లలో రద్దయిన పాతనోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు కాగా నవంబర్ 8 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దును ప్రకటించారు. రద్దయిన నోట్లను ఆయా బ్యాంకులలో మార్పిడికి గాను డిశెంబర్ 30, 2016 వరకు గడువును నిర్ణయించారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో రద్దయిన పెద్ద నోట్లను ఆర్బీఐలో జమ చేసుకునేందుకు మార్చి 31, 2017 వరకు కేంద్రం గడువు ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం వాగ్దానం మేరకు మార్చి 31, 2017 వరకు రద్దయిన పాతనోట్ల డిపాజిట్‌కు అనుమతి నిరాకరించడంపై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. -
తమిళనాడులో సుప్రీం ఆదేశాలు బేఖాతరు
చెన్నై: సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా తమిళనాడులో జల్లికట్టు క్రీడను కొనసాగిస్తున్నారు. నామ్ తమిళర్ పార్టీ కార్యకర్తలు జల్లికట్టు నిర్వహిస్తుండగా గురువారం పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ అండదండలతోనే జల్లికట్టు కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. జల్లికట్టుపై ప్రజల సెంటిమెంట్‌ను కేంద్రం అర్ధం చేసుకోవాలన్నారు. వెంటనే ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ఆమె కోరారు. జల్లికట్టుకు అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. -
ప్రొఫెసర్ లక్ష్మికి చుక్కెదురు
గుంటూరు: మెడికో సంధ్యారాణి ఆత్మహత్య కేసులో అరెస్టయిన ప్రొఫెసర్ లక్ష్మికి కోర్టులో చుక్కెదురైంది. బుధవారం ప్రొఫెసర్ లక్ష్మి బెయిల్ పిటిషన్‌ను విచారించిన మూడో అదనపు జిల్లా కోర్టు.. ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకుంది. లక్ష్మి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొటూ లేఖరాసి సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య అనంతరం పరారీలో ఉండి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన లక్ష్మికి బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది. -
మాల్యా అప్పీల్‌పై బ్యాంకులకు ఆదేశాలు
కోర్టు ధిక్కార చర్యల నోటీసులను రీకాల్ చేయాలంటూ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా నమోదుచేసిన అప్పీల్‌పై బ్యాంకుల కన్సార్టియం ఎస్బీఐ స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించినా విజయ్ మాల్యా తన ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడంతో ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మాల్యాకు నోటీసులు జారీఅయ్యాయి. అయితే ఆ నోటీసులను రీకాల్ చేసుకోవాలంటూ మాల్యా అప్పీల్‌కు వెళ్లారు. ఈ అప్పీల్‌పై పదిరోజుల్లో ఎస్బీఐ స్పందించాలని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ ఆదేశించారు. ఈ అప్పీల్‌పై విచారణను 2016 సెప్టెంబర్ 27కు సుప్రీంకోర్టు వాయిదావేసింది. మాల్యా తన ఆస్తుల వివరాలన్నింటినీ వెల్లడించి రుణ బకాయిల సెటిల్మెంట్కు ప్రయత్నించారని, కానీ ఎలాంటి సెటిల్మెంట్ కుదరలేదని లిక్కర్ బ్యారన్ న్యాయవాది మహేశ్ అగర్వాల్ వాదించారు. కోర్టు ధిక్కరణకు ఆయన పాల్పడలేదని పేర్కొన్నారు. రూ. 9వేల కోట్ల రుణాల ఎగవేత కేసును తప్పించుకునేందుకు రూ. నాలుగువేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తానని మాల్యా ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ ను బ్యాంకులు తిరస్కరించడంతో గత ఏప్రిల్ లో ఆస్తుల వివరాలు తెలియజేయాలని మాల్యాకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన!
- పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు.. వచ్చేవారం వాదనలు న్యూఢిల్లీ: హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనలు ఇంకా చల్లారలేదు. గడిచిన 15 రోజులుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. కర్ఫ్యూ ప్రాంతాల్లో ప్రజలకు రేషన్ సరుకులు అందించాలని కేంద్రం.. మొహబూబా సర్కారును కోరినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలేవీ సాగడంలేదు. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాల హెచ్చుమీరి ప్రవర్తిస్తున్నాయని, నిరంకుశంగా ప్రజలను అణచివేస్తున్నాయని, వాటిని అరకట్టేందుకు జమ్ముకశ్మీర్ రాజ్యాంగం సెక్షన్ 92ను అనుసరించి రాష్ట్రంలో రాష్రపతి పాలన విధించాలని జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్‌పీపీ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసం శుక్రవారం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. వచ్చేవారం వాదనలు జరగనున్నాయి. గడిచిన రెండు వారాలుగా రాష్ట్రంలో కొనసాగుతోన్న ఆందోళనలను అదుపుచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న పిటిషనర్లు.. ముఫ్తీ సర్కారును రద్దుచేసేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును కోరారు. కాగా, పరిష్కారం కోసం హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు? అని ధర్మాసనం ప్రశ్నించగా, కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్ హైకోర్టులో కార్యకలాపాలు స్తంభించిన సంగతిని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం కశ్వీర్ లోయలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనల్లో 45 మంది పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. -
విజయ్ మాల్యాకు హైకోర్టులో చుక్కెదురు!
న్యూ ఢిల్లీ: ఉద్దేశపూర్వక బ్యాంకు రుణాల ఎగవేతదారుగా తనను ఎస్బీఐ పేర్కొనడాన్ని సవాలు చేస్తూ యూబీ గ్రూప్ ప్రమోటర్ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మాల్యా అభ్యర్థనను పరిశీలించి ఆయనకు స్వాంతన చేకూర్చే అంశం తన అధికార పరిధిలో లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విజయ్ మాల్యాకు గతంలో బాంబే హైకోర్టు నుండి కూడా ఇదే రకమైన సమాధానం వచ్చిన విషయాన్ని ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడి, లండన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న విజయ్ మాల్యాను అరెస్ట్ చేసి, అతని పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాల్సిందిగా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ)ను ఇటీవల ఎస్బీఐ కోరింది. డియాజియో నుంచి మాల్యాకు లభించే పరిహారం నిధులను ముందుగా తమకు దఖలుపర్చడంతో పాటు దేశవిదేశాల్లో ఆయనకున్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడయ్యేలా ఆదేశించాలని ఎస్బీఐ డీఆర్టీని కోరింది. -
సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2002 హిట్ అండ్ రన్ కేసులో శుక్రవారం ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సల్మాన్ నిర్దోషిగా విడుదల కావడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింన కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన ఊపిరి పీల్చుకున్న ఈ భజరంగి భాయిజాన్ కి మళ్లీ కష్టాలు మొదలైనట్టయింది. కాగా ముంబైలో సల్మాన్ ఖాన్ 2002లో కారును నిర్లక్ష్యంగా నడిపిన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్‌కు విధించిన ఐదు సంవత్సరాల శిక్షను బొంబాయి హైకోర్టు గత ఏడాది కొట్టివేసింది. సల్మాన్ నిర్దోషిగా తీర్పు చెబుతూ అతనిపై ఉన్న అన్ని కేసులను కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
ఖైదీల అప్పీలును ఆపడం తప్పు
విశ్లేషణ జీవిత ఖైదీకి కూడా సమాచార హక్కు ఉందని, రెండో అప్పీలుకు హాజరు కావడానికి కూడా వీలు కల్పించవలసి ఉంటుందని, భద్రతా కారణాల వల్ల ఇబ్బందులు ఉంటే వేరే తేదీ కోరడమో లేక వీడియో సమావేశమో ఏర్పాటు చేయాలని కమిషన్ నిర్ధారించింది. జైలు కూడా ప్రభుత్వ విభాగమే. అయితే అక్కడ బంధితులుగా ఉన్న ఖైదీలకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు పెట్టుకునే వీలుందా? అనే ప్రశ్న చాలా సార్లు వచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం కారాగార వాసు లకు, జీవిత ఖైదీలకు కూడా వాక్ స్వాతంత్య్రం ఉంటుంది. అంతే కాదు ఉరిశిక్షకు గురైన వ్యక్తి కూడా చట్టం ప్రకారం ప్రాణం తీసే వరకు జీవించే హక్కు, వాక్ స్వాతంత్య్రం తదితర స్వాతంత్య్రాలు కలిగి ఉంటాడు. 2005 చట్టం ప్రకారం వారందరికీ సమా చార హక్కు కూడా ఉంటుంది. జైలు అధికారులకు ఆర్టీఐ కింద దరఖాస్తులు పెట్టుకోవచ్చు, మొదటి అప్పీలు, రెండో అప్పీళ్లు వేసు కోవచ్చు. ఆ అప్పీళ్ల విచారణలో తన కేసు చెప్పు కోవడానికి సరైన అవకాశాలు పొందే హక్కు కూడా వారికి ఉంటుంది. ఆ అవకాశాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ముఖ్యంగా జైలు అధికా రులపైన ఉంటుంది. సహజ న్యాయసూత్రాల మేరకు, ఆర్టీఐ చట్టం, రాజ్యాంగం గుర్తించిన ప్రాథ మిక హక్కులతోపాటు, నిందితుడికి మొత్తం అవకా శాలు ఇవ్వాలని, సమాచారం కూడా పూర్తిగా ఇవ్వా లని నేర న్యాయ విచారణా సూత్రాలు కూడా వివరిస్తున్నాయి. కేంద్ర సమాచార కమిషన్ ముందు అప్పీలు దాఖలు చేసిన జీవిత ఖైదీ రవీందర్ కుమార్‌కు అనుమతి ఇవ్వకపోవడం అతని సమాచార హక్కు చట్టం ఉల్లంఘనే అవుతుంది. సర్టిఫైడ్ కాపీలు పొందే హక్కు వరకట్నం హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రవీందర్ కుమార్ తను జైలుకు రాగానే వైద్యపరీక్షలు నిర్వహించారని తనకు ఆ వైద్యపరీక్షా రికార్డులు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. అతనికి కావలసిన మొత్తం కాగితాల ప్రతులు ఇచ్చారు. కాని వాటిని సర్టిఫై చేయలేదు. కనుక మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని కోరాడు. ఆ రికార్డులను ధ్వంసం చేశామని, కనుక ఇవ్వడానికి కాగితాలేమీ లేవని అధికారులు జవాబిచ్చారు. మొదటి అప్పీలు అధికారి ఈ జవాబు సరైనది కాదని అడిగిన సమాచారం పదిరోజుల్లో ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. అయినా వారు సమాచారం ఇవ్వలేదు. తన భార్యను హత్యచేశాడన్న ఆరోపణ రుజువై రవీందర్ తన తల్లిదండ్రులతో సహా జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో చేరగానే అతనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే కంటిచూపు విష యంలో లోపాలున్నట్లు తేలిందని, ఈ విష యానికి సంబంధించి ధ్రువీకరించిన పత్రాలు దొరికితే అప్పీలులో తాను నిర్దోషినని రుజువు చేసుకోగలుగు తానని రవీందర్ నమ్మకం. బందిపోట్ల దాడిలో తన భార్య మరణించిందని తన అత్తవారింటి వారు తనను ఇరికించారని రవీందర్ ఆరోపించాడు. తనకు వైద్య పరీక్ష పత్రాలు చాలా ముఖ్యమని అతను సమాచార కమిషన్ ముందు విన్నవించాడు. రికార్డుల ధ్వంసం తాను ఇచ్చిన దరఖాస్తు అందుకున్న 14 రోజుల తరువాత వైద్యపరీక్షల రికార్డులను ధ్వంసం చేశారని రవీందర్ ఆరోపించారు. విజేందర్ కుమార్ యాదవ్ (అడిషనల్ డీసీపీ 1 నార్త్ డిస్ట్రిక్ట్ ) హోదాలో రికార్డులు ధ్వంసం చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారని, ఆయనే పీఐఓ హోదాలో 14 రోజుల ముందు ఆర్టీఐ దరఖాస్తు స్వీకరించారని రవీందర్ వివరించారు. ఈ అంశం అధికారులు ఇచ్చిన పత్రాలలో రుజువ వుతున్నాయని కమిషన్ భావించింది. సమాచార దరఖాస్తు పెండింగ్‌లో ఉండగా రికార్డులు ధ్వంసం చేయడం చట్ట విరుద్ధమని, సమాచార హక్కుకు భంగకరమని ఇదివరకే ఢిల్లీ హైకోర్టు వివరమైన తీర్పు ఇచ్చింది. రికార్డుల తొలగింపు విధానం ప్రకారం గడువు తీరిన దస్తావేజులు సమాచార అభ్యర్థన వచ్చేనాటికి పొరబాటున తొలగించకుండా మిగిలి ఉంటే, ఆ సమాచారం దరఖాస్తు విచారణ ముగిసేలోగా కూడా తొలగించకూడదని సీఐసీ ఒక కేసులో నిర్ధారించింది. ఈ విధంగా రికార్డులు తొలగించినందుకు సెక్షన్ 20 కింద తీహార్ జైలు అధికారిపైన ఎందుకు చర్య తీసుకో కూడదో వివరించాలని పీఐఓకు షోకాజ్ నోటీసు జారీ చేయవలసి వచ్చింది. ధ్వంసం చేశారు కనుక దొరకలేదని చెబుతున్న రికార్డులను వెతక డానికి, ప్రత్యామ్నాయమార్గాలు అన్వేషించి సమా చారం ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత కూడా జైలు అధికారుల మీద ఉంది. సమాచార నిరాకరణకు గురైన రవీందర్‌కు సరైన నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూడదో వివరించాలని కూడా నోటీసు జారీ చేశారు. హాజరు అనుమతి నిరాకరణ రెండో అప్పీలు విచారణకు హాజరు కావడానికి తనకు జైలు అధికారులు అన్యాయంగా అనుమతి నిరాకరిం చారని, కనుక తాను ఆరోజు రాలేకపోయానని ఖైదీ రవీందర్ ఆరోపించారు. జైలు న్యాయాధికారి ముందు అనుమతి కోరుతూ తాను పిటిషన్ వేసుకోవలసి వచ్చిందని, వారి అనుమతితో కమిషన్ ముందుకు రాగలిగానని రవీందర్ వివరించారు. జీవిత ఖైదీకి కూడా సమాచార హక్కు ఉందని, రెండో అప్పీలుకు హాజరు కావడానికి కూడా వీలు కల్పించవలసి ఉంటుందని, భద్రతా కారణాల వల్ల ఇబ్బందులు ఉంటే వేరే తేదీ కోరడమో లేక వీడియో సమావేశమో ఏర్పాటు చేయాలని కమిషన్ నిర్ధారిం చింది. రెండో అప్పీలులో హాజరు కావడానికి అను మతి నిరాకరించి సమాచార హక్కుకు అవరోధం కలిగించినందుకు వివరణ ఇవ్వాలని కూడా కమిషనర్ ఆదేశించారు. (రవీందర్ కుమార్ వర్సెస్ తీహార్ జైలు, CIC/SA/A/2015/001408, 15.2.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
వారిపై జోకులను బ్యాన్ చేయండి..!
నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం.. నవ్వలేక పోవడం ఒక రోగం అన్నారు. అయితే ఆ నవ్వుల పువ్వులు విరిసేందుకు హాస్యాన్ని పండించేవారూ, ఆస్వాదించేవారూ కూడ అవసరమే. స్పాంటేనియస్ గా పుట్టే హాస్యం... ఆరోగ్యంగా హాయిగా ఉంటుంది. కానీ హాస్యానికి వస్తువు ఏమిటి అనేది ఎంచుకోవడం మాత్రం ఒక్కోసారి కష్టంగానే మారుతుంది. ముఖ్యంగా నలుగురు కలిసినప్పుడు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడంలో భాగంగా ఏదో ఒక జోక్ చెప్పుకుని నవ్వుకుంటుంటారు. అందులో ఒక్కటైనా సర్దార్జీలపై ఉంటుండటం షరా మామూలుగా కనిపిస్తుంది. అయితే ఆ సర్దార్జీ జోక్ ల వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. జోక్ లపై అభ్యంతరాలతో ఓ లాయర్ ఉన్నత న్యాయస్థానంలో పిల్ వేయడంతో కేసు విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఒకప్పుడు హాస్యాన్నిపండించేందుకు సినిమా యాక్టర్లనో, రాజకీయ నాయకులనో, భాషనో, యాసనో వస్తువుగా మలచుకునేవారు. కానీ రాను రాను అది తీవ్ర రూపం దాల్చడంతో ఆయా సంబంధింత వర్గాలు అభ్యంతరాలు తెలుపుతూ వస్తున్నారు. దీంతో హాస్యాన్ని పండించడం ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త కష్టంగానే మారింది. అయితే ఇప్పుడు సర్దార్జీ జోక్స్ పై సుప్రీంకు చేరిన పిల్ ను కోర్టు పరిశీలించేందుకు అంగీకరించింది. మొత్తం సిక్కు సమాజంపై నిర్లక్ష్యం, తొందరపాటుతనం తో వేసే జోక్స్... మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందంటూ సర్దార్జీలపై వెబ్ సైట్లలో జోక్ లను తొలగించాలన్న డిమాండ్ కోర్టు పరిశీలిస్తోంది. బుద్ధి తక్కువ వ్యక్తులుగానూ, అవివేకులుగానూ సిక్కులను చిత్రీకరిస్తుండటం బాధిస్తోందని సిక్కు న్యాయవాది హర్విందర్ చౌదరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేరస్తులకు పెనాల్టీ విధించే దిశగా అధికారులకు ఆదేశాలివ్వాలని ఆమె కోరారు. సర్దార్జీ జోక్స్ ఉన్న సుమారు ఐదు వేల వెబ్ సైట్లను నిషేధించాలని, లేదా వాటినుంచీ సిక్కు సమాజాన్ని కించపరిచే జోక్స్ ను పూర్తిగా తొలగించేందుకు టెలికాం, ఇన్ఫర్ మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రులకు ఆదేశాలివ్వాలని ఆమె అభ్యర్థించారు. కోర్టులు... విదేశాలతో సహా అన్ని ప్రాంతాల్లో తాము అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ వాతావరణంలో తమ పిల్లలు సైతం ఇంటిపేరైన కౌర్, సింగ్ లను పెట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. న్యాయమూర్తులు టి.ఎస్. థాకూర్, గోపాల్ గౌడ లతో కూడిన ధర్మాసనం... ఈ జోక్స్ ను పలువురు సిక్కులు పెద్దగా పట్టించుకోవడం లేదని, వారిపై వారే జోక్స్ వేసుకుని హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారని అన్నారు. అంతేకాక హాస్యోక్తులు రాసిన కుష్వంత్ సింగ్ కూడ సిక్కేనని ఎత్తి చూపారు. పైగా ఎంతోమంది జోక్స్ ను స్పోర్టివ్ గా తీసుకుంటారని, అవమానంగా భావించడం లేదని అన్నారు. కేవలం వినోదం కోసం పండించే హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారన్నారు. అటువంటి జోక్స్ ను పూర్తిగా నిలిపివేయాలని మీరు కోరితే... ఏకంగా సిక్కులే అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండొచ్చని బెంచ్ అభిప్రాయ పడింది. అయితే ఇటీవల బీహార్ లో ప్రధాని మోడీ పర్యటనను న్యాయవాది చౌదరి బెంచ్ కు ఉదహరించారు. అక్కడ జరిగిన ర్యాలీలో ప్రధాని బీహారీలు తెలివైన వారు అన్నారని, అదే మా విషయానికి వస్తే... ప్రతివారూ జోక్స్ వేసేందుకే ప్రయత్నిస్తారని చెప్పారు. దానికి బెంచ్ స్పందిస్తూ.. ఒకవేళ మోడీ పంజాబ్ వెడితే సిక్కులు కూడ తెలివైనవారని ప్రశంసిస్తారని మీరు చింతించాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా చౌదరి పిటిషన్.. ఓ నిర్దిష్ట కమ్యూనిటీకి సంబంధించిన సున్నిత విషయమని, అందుకే ఆమె పిటిషన్ ను సుప్రీం కోర్ట్ సిక్కు న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్. కెహర్ ముందు ఉంచుతామని చెప్పారు. మీ కమ్యూనిటీ నుంచీ సుప్రీంకోర్టు ఓ న్యాయమూర్తిని కలిగి ఉండటం అదృష్టమని, అదే సమాజానికి చెందిన వ్యక్తి సమస్యను మెరుగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని, కేసును ఆయన బెంచ్ కు తరలిస్తామని ఆమెను కోరారు. కాగా పిటిషనర్.. అందుకు అంగీకరిస్తూ... తిరిగి తన వాదనను కొనసాగించేందుకు ఒక నెల గడువును అడిగారు. -
గుజరాత్ అల్లర్ల కేసులు: మాజీ ఐపీఎస్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: అది 2002, ఫిబ్రవరి 27.. గోద్రాలో రైలు తగలబడిన చాలాసేపటికి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ముఖ్య అధికారుల సమావేశం జరిగింది. ఆ గదిలో ఒక కానిస్టేబుల్ (డ్రైవర్) కూడా ఉన్నాడు. రైలు ఘటనకు ప్రతీకారంగా పెల్లుబిగే ప్రజాగ్రహానికి అడ్డుకట్ట వేయొద్దంటూ సీఎం అధికారులను ఆదేశించారని తర్వాత పుకార్లు పుట్టాయి. ఆ డ్రైవర్ ను లోపలికి పంపిది ఒక ఐపీఎస్ ఆఫీసరని తేలింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు అపిడవిట్ రూపొందించేలా ఐపీఎస్ ఆఫీసర్ తతను బలవంతపెట్టాడని సదరు కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో ఐపీఎస్ అధికారిపై కేసు నమోదయింది. ఆ అధికారి పేరు సంజీవ్ భట్. ఇప్పుడాయన సర్వీసులో లేరు. కానీ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ సాగుతోంది. దీనితోపాటు నాటి గుజరాత్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ-మెయిల్ ను హ్యాక్ చేసి, ట్యాంపర్ చేశారని కూడా భట్ పై కేసు నమోదయింది. ఈ రెండు కేసుల్లో తనపై నమోదయిన ఎఫ్ఐఆర్ పై సిట్ చేత తిరిగి దర్యాప్తు చేయించాలని ఆయన సుప్రీంకోర్టును అభ్యర్థించారు. భట్ అభ్యర్థనలను మంగళవారం కోర్టు కొట్టివేసింది. కింది కోర్టులో విచారణ యథావిథిగా జరుగుతుందని పేర్కొంది. -
సుప్రీంలో శ్రీనివాసన్‌కు ఊరట
న్యూఢిల్లీ: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పదవి చేపట్టకుండా అడ్డుకోవాలన్న పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు నిరాకరించింది. వెంటనే విచారించాల్సిన అవసరం లేదని జస్టిస్ విక్రమ్ జీత్ సేన్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. బీహార్ క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటీషన్‌ను సోమవారం సుప్రీం ధర్మాసనం విచారించింది. ఐపీఎల్ అక్రమాల కేసులో శ్రీనివాసన్ విచారణ ఎదుర్కొంటున్నందున ఆయన ఐసీసీ పదవి చేపట్టకుండా అడ్డుకోవాలని కోరింది. అయితే ఆ సయమం వచ్చినపుడు విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది. -
హైకోర్టులో మంత్రి పార్ధసారథికి చుక్కెదురు