YS Viveka Case: SC Hearing Avinash Reddy Anticipatory Bail Challenging Plea Updates - Sakshi
Sakshi News home page

Viveka Case : సునీత పిటిషన్ జులై 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Published Mon, Jun 19 2023 8:21 AM | Last Updated on Mon, Jun 19 2023 3:35 PM

SC Hearing Avinash Reddy Anticipatory Bail Challenging Plea Updates - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో.. సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణను వచ్చే నెల(జులై) 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ(జూన్‌ 19, సోమవారం) విచారణ జరిపింది. 

సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నెలాఖరు (జూన్ 30) కల్లా వివేకా హత్య కేసుపై సిబిఐని దర్యాప్తు పూర్తి చేయమని ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విషయాన్ని సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానానికి గుర్తు చేశారు. ఈ నెలాఖరుతో సిబిఐ దర్యాప్తు గడువు ముగుస్తున్నందున ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. 

అయితే ఈ విజ్ఞప్తిని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ అంగీకరించలేదు. కేసు విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ CJI బెంచ్‌ ముందు లిస్ట్‌ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో వాదనలు వినిపించాల్సిందిగా ప్రతివాదులయిన అవినాష్ రెడ్డి, CBIలకు నోటీసులు జారీ చేసింది.

పిటిషన్‌కు కాలం చెల్లే అవకాశం!
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఈ నెలాఖరు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌గా విధించిన సంగతి తెలిసిందే. అలాగే సునీతా రెడ్డి పిటిషన్ ను జులై 3కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. CBI చార్జిషీట్ దాఖలు చేస్తే గనుక ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ కు కాలం చెల్లిపోయే అవకాశం ఉంది.

గత విచారణలో సునీత తీరుపై అసంతృప్తి
వివేకా కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి మే 31వ తేదీన  షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. గత విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది సునీత. అంతే కాదు, హైకోర్టు మినీ ట్రయల్ ను నిర్వహించిందని, తమ వాదనల్లో మెరిట్ పరిశీలించకుండా బెయిల్ ఇచ్చిందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను అరెస్ట్ చేయించాలన్న తాపత్రయం సునీతలో కనిపిస్తోందని, కేవలం ఇగో క్లాషెస్ కోసం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మొన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

తన వాదనే వినాలి, తాను చెప్పిందే నమ్మాలి అన్నట్టుగా కనిపించిన సునీత తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఏ న్యాయస్థానమయినా.. ఎలాంటి అభియోగాలపైనా అయినా.. వాదనలతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని సునీత విస్మరించినట్టు కనిపించింది.

ఇదీ చదవండి: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కి కారణం ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement