సాక్షి, ఢిల్లీ: 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, ఆయన నాయకత్వంలోని టిడిపిలో ఏ చాప్టర్ చూసినా ఏదో ఒక అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. చంద్రబాబుతో తిరిగే వాళ్లెవరయినా.. ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం తరచుగా బయటపడుతోంది.
హైదరాబాద్ భూమి వెనక బాబు అనుచరుడు
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల రెవెన్యూ పరిధి. హైదరాబాద్ శివార్లలో అత్యంత విలువైన భూమి. 143 ఎకరాల ఈ భూమి విలువ అక్షరాలా పది వేల కోట్లు. దీన్ని గతంలో గ్రే హౌండ్స్ సంస్థకు కేటాయించారు. దేశంలో శాంతి భద్రతలను రక్షించే సంస్థల్లో ఒకటయిన గ్రౌహౌండ్స్ కే ఎసరు పెట్టేందుకు ప్రయత్నించారు టిడిపి నేత ఒకరు. ఆయనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్న మాండ్ర శివానందరెడ్డి.
రెండు దశాబ్దాలుగా ప్లాన్
అప్పట్లో పోలీస్ శాఖలో పని చేసిన మాండ్ర శివానందరెడ్డికి ఈ స్థలం వెనకున్న లూపోల్స్ కొన్ని తెలుసు. ఇంకేముంది.. ఈ భూమినే కొట్టేసేందుకు రకరకాల కుట్రలు పన్నారు. చంద్రబాబు అండతో రకరకాల కొత్త డాక్యుమెంట్లు సృష్టించారు. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవని తెలిసినప్పటికీ తామే జీపీఏ హోల్డర్లమంటూ దందా సాగించారు. అయితే ఈ కుట్రలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. 1994 నుంచి కొనసాగుతున్న భూ వివాదానికి ముగింపు పలికింది.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
రూ.10 వేల కోట్ల విలువైన ఈ భూమిని కొట్టేసేందుకు రకరకాల కుట్రలు చేశారు. మంచిరేవులలోని ఈ భూములకు విలువ పెరగడంతో వాటిపై రాబందుల కళ్లు పడ్డాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ల్యాండ్ మాఫియా జోక్యం కూడా కనిపిస్తోంది. ఈ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తుదివి. ఎలాంటి జోక్యాలు అనుమతించబోం. ఇక ముందు ఈ వ్యవహారంలో ఎలాంటి పిటిషన్ లను అనుమతించబోం. అలాగే కింది కోర్టులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు.’’ అని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది.
హక్కులన్నీ ప్రభుత్వానికే
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలోని 142.39 ఎకరాల భూయాజమాన్య హక్కులు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజా ఆదేశాలతో 1994 నుంచి కొనసాగుతున్న భూవివాదానికి ముగింపు పలికినట్టయింది. ఈ భూములపై కిందిస్థాయి కోర్టులు, హైకోర్టు ఎలాంటి జోక్యం చేసుకునే అధికారం లేదని, ఇప్పుడు ఇచ్చిన తీర్పే తుదితీర్పు అని ఆదేశాల్లో పేర్కొంది. సదరు భూమి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని, తదుపరి కేటాయింపులపై దాని యాజమాన్య, స్వాధీన హక్కులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయాలని చెప్పింది.
బాబు బ్యాచ్ లో మహా ముదుర్లు
చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో ఆయన వెంట బాగా దగ్గరగా నడిచిన వాళ్లలో, లేదా చంద్రబాబుతో కలిసి రకరకాల వ్యవహారాలు నడిపిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. మార్గదర్శి స్కాంలో బాబు ఫ్రెండ్ రామోజీరావు, అవినీతి కేసులో బాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్, ఓటుకు కోట్లు కేసులో బాబు అనుచరుడు రేవంత్ రెడ్డి, అమరావతి రాజధాని కేసులో పార్టీ నేతల్లో చాలా మంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా దూరం వెళ్తుంది.
Comments
Please login to add a commentAdd a comment