judgment
-
‘‘ఎలా చూసినా కులగణనే కీలకం’’
ఎన్నికల వేళ సందడి చేసిన కులగణన వాదం ఆ తర్వాత కూడా చర్చనీయాంశంగా కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు దేశంలోని ఉపకులాలకు న్యాయం జరిగేలా ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను విభజించవచ్చని వెలువరించిన తీర్పు ఇప్పుడు ఎంతో కీలకంగా మారింది. అయితే ఈ తీర్పును అమలుపరచడానికి రాష్ట్రాలు వేటికవి తమ ప్రాంతాల్లో కులగణన చేస్తే కుదరదు. కేంద్రం మాత్రమే జనాభా లెక్కల్లో భాగంగా ఈ పని చేయాలి. లేదంటే కోర్టులో కొత్త వివాదాలు తలెత్తుతాయి. అయితే రిజర్వేషన్ల వల్ల అత్యధిక ప్రయోజనం పొందుతున్న కులాలవారూ, అలాగే స్థానికంగా బలంగా ఉన్న రిజర్వేషన్ వెలుపల ఉన్న శూద్ర కులాలవారూ కులగణనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.దేశంలోని ఉపకులాలకు న్యాయం జరిగేలా ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను విభజించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పోతే ఆ విభజన న్యాయబద్ధ ఆబ్జెక్టివ్‌గా తేల్చిన జనాభా లెక్కల ప్రకారమే చెయ్యాలని కూడా తేల్చి చెప్పింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇటువంటి లెక్కలు రాష్ట్రాలు కమిషన్ల ద్వారానో, లేదా స్వంత రాష్ట్రస్థాయి జనాభా గణన చేపట్టి చెయ్యలేరు. ఏ కేంద్ర ప్రభుత్వమైతే సుప్రీంకోర్టు ముందు ఉపకులాలకు న్యాయబద్ధమైన రిజర్వేషన్ పంపకం అవసరమే అని ఒప్పుకుందో... ఆ ప్రభుత్వమే కేంద్ర స్థాయిలో కులాల వారీగా జనాభా లెక్కలు తీయించే వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జడ్జిమెంట్ అమలుకు పూనుకోలేదు. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సొంత రాష్ట్ర ఉపకులాల లెక్కలు తీయించి, ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీలో రిజర్వేషన్ విభజిస్తే ఆ విభజన మళ్లీ హైకోర్టులో ఉపకుల లెక్కల యాక్యురసీ (కచ్చితత్వం) కొట్టివేయబడుతుంది. చివరకు సుప్రీంకోర్టుకు పోయినా అదే సమస్య ఎదురవుతుంది.ఇది ఎస్సీ, ఎస్టీల సమస్య మాత్రమే కాదు...ఇప్పటికే ఉప కులాల లెక్కలు తీసిన బిహార్ రిజర్వేషన్ విభజన, పెంపుదలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల ఉపకుల న్యాయపర విభజన కేవలం ఎస్సీలకో, ఎస్టీలకో సంబంధించింది మాత్రమే కాదు. ఓబీసీ కులాల్లో అన్ని రాష్ట్రాల్లో తమ తమ ఉపకులాల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాలు, సీట్లు రావడం లేదని ఉద్యమాలు నడుస్తున్నాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో మాదిగ, మాల కులాలకో; కోయ, గోండు, చెంచు, లంబాడాల మధ్య విభజనకో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పరిమితమై లేదు. బీసీ కులాల్లో ఉన్న ఏబీసీడీ గ్రూపుల్లో చాలా ఉప కులాలున్నాయి. డీ గ్రూపులో గొల్ల– యాదవులకు... మున్నూరు కాపులకు దొరికే అవకాశాలు దొరకడం లేదనీ, బీ గ్రూపులో కురుమలకు తమ వాటా తమకు దొరకడం లేదనే తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే వాళ్ళు తమ కులాన్ని సెమీ–నొమాడిక్ కమ్యూనిటీ (అర్ధ సంచార జాతి) లోకి మార్చాలని డిమాండ్ ఉంది.మహారాష్ట్రలో ధనగర్లు (గొర్రెల కాపర్లు) చాలా ఉద్యమాలు నడిపి తమ కులానికి మొత్తం ఓబీసీ రిజర్వేషన్లో 3 శాతం వాటా సంపాదించుకున్నారు. అక్కడి మరాఠాలు తమకూ రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా పోరాడుతున్నారు. కోర్టులు అందుకు అంగీకరించనందున తమకు కుంబి కులసర్టిఫికెట్లు ఇచ్చి రిజర్వేషన్‌లోకి చొప్పించండి అని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. గుజరాత్లో పటేళ్లు (పాటీదార్లు) తమకూ రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఉపకుల రిజర్వేషన్ జడ్జిమెంట్ ద్వారా ఈ అన్ని రకాల డిమాండ్లకు పరిష్కారం వెతకాల్సి ఉంటుంది.2024 ఎన్నికల్లో ఓట్ల కోసం చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఉపకులాలకు ‘మీ వాటా మీకు ఇప్పిస్తామని’ వాగ్దానం చేసింది. ప్రధానమంత్రి స్వయంగా ఆ మీటింగులో పాల్గొన్నారు. కానీ జాతీయ స్థాయిలో కుల గణన చేయించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్... 1931 నాటి జనాభా లెక్కల్లో చేసినట్లు కులగణనను జనాభా లెక్కల్లో భాగంగా చెయ్యాల్సిన అవసరాన్ని కేంద్రం ముందు పెట్టింది. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదు.కాంగ్రెస్ వెనక్కి తగ్గింది!కాంగ్రెస్ పార్టీ 2011 జనాభా లెక్కల్లో భాగంగా కులగణన ఒక ప్రత్యేక కుల లెక్కల షెడ్యూల్‌ను తయారుచేసి లెక్కలు తీయించారు. కానీ శుద్రాతీత అగ్రకులాల్లో (బ్రాహ్మణ, బనియా, క్షత్రియ, కాయస్థ, ఖత్రి కులాల వారి నుండి) వ్యతిరేకత రావడం వల్ల ఆ లెక్కలు బయట పెట్టకుండా ఆపేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో మేధావి వర్గమంతా ఈ ఐదు కులాల వారే! 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కులజనాభా లెక్కలు కావాలని కాంగ్రెస్ ఓట్ల శాతం పెంచే ప్రయత్నం చేశారు. కానీ రిజర్వేషన్ బయట ఉన్న కులాల నుండి అన్ని పార్టీల్లో వ్యతిరేకత వస్తోంది. ఈ కారణం వల్లనే కర్ణాటకలో కులాల లెక్కలు తీసి కూడా బయట పెట్టకుండా ఆపేశారు. కారణం బ్రాహ్మణ, బనియా, లింగాయత్, వక్కళి కులాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కనుక. వీటన్నిటికి మూలమేమంటే చాలా చిన్న శూద్రేతర కులాలు చాలా పెద్ద మొత్తంగా ఉద్యోగాలు, ప్రభుత్వరంగ ఐఐటీ, ఐఐఎమ్‌లు, మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందుతున్నాయి. వీరి కులాల సంఖ్య జనాభా లెక్కల ద్వారా బయటికి వస్తే వారు దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని నడుపడానికి వ్యతిరేకంగా చాలా పెద్ద తిరుగుబాటు వస్తుంది.మొత్తం మీద శూద్రుల వాటా తక్కువే!రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు, కమ్మలు, వెలమలకు కూడా అర్థం కాని అంశమేమంటే... ఢిల్లీ అధికారంలోగానీ, బ్యూరాక్రసీలోగానీ; గవర్నర్లు, అంబాసిడర్ల వంటి పదవుల్లో కానీ వీరి వాటా చాలా తక్కువ అనేది. రిజర్వేషన్ బయట ఉన్న మొత్తం శూద్ర అగ్ర కులాలకు వారి జనాభా లెక్కల ప్రకారం చూస్తే కేంద్ర అధికారంలో కానీ, మోనోపలీ క్యాపిటల్‌లో కానీ అతి కొద్దిపాటి వాటా మాత్రమే ఉన్నది. కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్లో కాని, ప్రధానమంత్రి సెక్రటేరియట్లో కాని వారు ఎవ్వరూ కనబడరు. వారు కేవలం రాష్ట్ర అధికారం కోసమే ఆరాటపడుతున్నారు. కానీ కేంద్రంలో మొత్తం శూద్రుల వాటా చాలా చిన్నదిగా ఉంది. కుల గణన... రెడ్డి, కమ్మ, వెలమ వంటి కులాలు జాతీయ స్థాయిలో వాటా పొందడానికి పనికొస్తుంది. ఇదే పరిస్థితి కర్ణాటకలోని లింగాయత్, వక్కళి కులస్థులది కూడా! వాళ్ళు రాష్ట్ర రిజర్వేషన్ సిస్టమ్‌లో భాగస్వాములే కానీ కులలెక్కలను వ్యతిరేకిస్తున్నారు. కేరళలో నాయనార్లు కుల లెక్కలే కాదు రిజర్వేషన్లను కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు తాము శూద్రులం కాదు క్షత్రియులమని చెప్పుకుంటున్నారు. ఇది కేవలం ఆ చిన్న రాష్ట్రంపై పెత్తనం చలాయించడానికి పనికొస్తుంది. కానీ కేంద్రంలో నాయనార్లకు కూడా వాటా లేదు. ప్రతి రాష్ట్రంలో ఉన్న శూద్ర పై కులాలు కులగణనను ఎందుకు స్వాగతించాలో ఆలోచించడం లేదు.1931లో బ్రిటిష్ ప్రభుత్వం కులాల లెక్కలు తీసి ఉండకపోతే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణులు తామే దేశంలో అత్యధికులం అని నమ్మించేవారు. అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాళ్ళు అలానే నమ్మించారు. దేశం మొత్తం మీద బ్రిటిష్ పాలక వ్యవస్థ (అడ్మినిస్ట్రేషన్)లో వాళ్ళే ఉండేవారు. జనాభా రీత్యా కూడా ‘మేమే అన్ని కులాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నామ’ని నమ్మించేవారు. ఆచరణలో కులం ఉన్నప్పుడు ఆ కులం సంఖ్య ఎంత ఉందో తెలిస్తే తప్ప కులాల అభివృద్ధి, దేశం అభివృద్ధి జరిగే ప్రణాళికలు తయారు చెయ్యడం సాధ్యం కాదు.తక్కువ సంఖ్యలో ఉండి ఎక్కువ ఉద్యోగాలు, విద్యారంగంలో సీట్లు సంపాదించే కులాలు, కులం లెక్కలు తియ్యొద్దని తప్పకుండా వాదిస్తాయి. ఈ ఆలోచనా ధోరణి నుండే రిజర్వేషన్లలో 50 శాతానికి మించి ఉండకూడదని వాదించాయి. సుప్రీంకోర్టులో తమకు అనుకూల జడ్జిమెంటును సంపాదించాయి. దానికి మెరిట్ అనే ఒక వాదనను ముందు పెట్టాయి. అసలు కులాన్ని ఈ దేశానికి బ్రిటిష్ వలసవాదులు తెచ్చారని వాదించాయి. ఉత్పత్తి కులాలు ముఖ్యంగా శూద్రులు ఢిల్లీలో పాలకులైతే తమ చరిత్ర తలకిందులవుతుందని భావించాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉపకులాల వాటా జడ్జిమెంట్ చరిత్ర మలుపును మరో మెట్టు ఎక్కించేదనే అంశంలో సందేహం లేదు. ఇప్పుడు అన్ని శూద్ర కులాలు, దళితులు, ఆదివాసులు ఐక్యంగా కుల జనాభా లెక్కలు చెయ్యాలని పోరాడటమే వారి భవిష్యత్తుకు మార్గం. - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
వినేశ్ రజత పతకం అప్పీల్‌పై తీర్పు నేడు!
పారిస్: క్రీడాలోకమే కాదు... యావత్ దేశం ఎదురుచూపులకు నేడు తెరపడే అవకాశముంది. భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై నేడు తీర్పు వెలువడనుంది. పారిస్ విశ్వక్రీడల్లో మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్లోకి ప్రవేశించిన ఆమె సరిగ్గా బౌట్‌కు ముందు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. దీంతో ఫైనల్లో ఓడినా కనీసం ఖాయమనుకున్న రజతం చేజారడంతో పాటు... అమె పాల్గొన్న వెయిట్ కేటగిరీ జాబితాలో చివరి స్థానంలో నిలవడం భారతావనిని నిర్ఘాంత పరిచింది. తన అనర్హతపై సవాలుకు వెళ్లిన ఫొగాట్... సంయుక్త రజతం డిమాండ్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిష్ణాతులైన లాయర్లతో ఈ అప్పీలుపై వాదించింది. విచారణ పూర్తికావడంతో నేడు సీఏఎస్ తుది తీర్పు వెలువరించనుంది. కాగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ... వినేశ్ బరువు పెరగడం, అనర్హతకు బాధ్యుడిని చేస్తూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దివాలాపై విమర్శలకు దిగడం సమంజసం కాదని చెప్పింది.సంబంధిత అథ్లెట్ల బరువు, ఈవెంట్ల నిబంధనలపై కోచ్, వ్యక్తిగత సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడింది. -
కేసు ఉన్నా.. ఉద్యోగం తొలగించరాదు
సాక్షి, అమరావతి: క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన ఓ ఉద్యోగిని నేరుగా ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నేరం నిరూపణ అయ్యేంతవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషే అని.. దీనిని అధికారులు విస్మరించకూడదని గుర్తు చేసింది. క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉండటం ఆ ఉద్యోగి తన అధికారిక విధులను నిర్వర్తించడానికి ఎంతమాత్రం అడ్డంకి కాదని తేల్చిచెప్పింది. క్రిమినల్ కేసు ఉన్నప్పుడు ఉద్యోగంలోంచి తీసేయాలంటే.. ముందుగా ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇవ్వడం, విచారణ జరపడం అధికారుల బాధ్యత అని తెలిపింది. నోటీసు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఉద్యోగం నుంచి తొలగించేంత భారీ శిక్ష విధించడం చట్టప్రకారం చెల్లదని స్పష్టం చేసింది. అలాంటి శిక్ష రద్దవుతుందని తేల్చి చెప్పింది. అంగన్వాడీ వర్కర్‌గా పనిచేస్తున్న ఓ మహిళను ఏసీబీ కేసు నెపంతో నేరుగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. సదరు మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తూ అధికారులు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. ఇదీ కేసుపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కె.ధనలక్ష్మి 1998లో అంగన్వాడీ కార్యకర్తగా నియమితులయ్యారు. ఆ తరువాత కాంట్రాక్ట్ పద్ధతిలో సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుకు ఆమెను ఎంపిక చేశారు. కాగా.. 2008 డిసెంబర్ 11న ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే.. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు డిసెంబర్ 14న అధికారులు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. తనను ఏకపక్షంగా తొలగించారంటూ ఆమె 2009లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ధనలక్ష్మిని అంగన్వాడీ వర్కర్‌గా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో ధనలక్ష్మి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీవ్రంగా స్పందించడంతో విధిలేని పరిస్థితుల్లో 2010లో ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. తమపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారన్న ఉద్దేశంతో అధికారులు ధనలక్ష్మిని ఏసీబీ కేసును సాకుగా చూపి ఉద్యోగం నుంచి తొలగిస్తూ 2011లో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ ఆమె అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు కావాలనే ఆమెను తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఈ విషయం నిరూపణ కావడంతో 2016లో ఏసీబీ కోర్టు ధనలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించి.. కేసు కొట్టేసిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేస్తూ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ధనలక్ష్మిని నాలుగు వారాల్లో తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె అన్ని రకాల సర్వీసు ప్రయోజనాలకు అర్హురాలని, చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లో చెల్లించాలని సూచించారు. -
ఆక్రమణ నుంచి ‘అమరా’కు విముక్తి
పెదకాకాని: దేవదాయ శాఖ 17ఏళ్ల పాటు చేసిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. సుమారు రూ.3 కోట్ల విలువైన 20 సెంట్ల స్థలాన్ని అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా అమరా వారి సత్రం పెదకాకాని శివాలయం దేవస్థానానిదే అని హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఆలయ అధికారులు మంగళవారం దానిని స్వాదీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆలయ ఉప కమిషనర్ దాసర శ్రీరామ వరప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. 1942లో గుంటూరుకు చెందిన అమరా వెంకటేశ్వర్లు, మువ్వల వెంకట సుబ్బారావులు గుంటూరు జిల్లా పెదకాకాని శివాలయం ఎదురుగా ఉన్న 20 సెంట్లు భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో భక్తుల సౌకర్యార్థం సత్రం నిర్మించారు. వారి అనుమతితో 1968లో దేవదాయ శాఖ ఆ«దీనంలోకి తీసుకుని కొంతకాలం గడిచిన తరువాత సత్రం యజమానుల నుంచి కంట్రిబ్యూషన్ వసూలుచేశారు. సత్రం నిర్వాహకులు ఆ సత్రంలో పనులకు యండ్రప్రగడ సీతారామయ్య, వెంకటరత్నం (భార్యభర్తలను)లను నియమించి వారికి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. 2006లో అప్పటి ఆలయ ఈఓ బీహెచ్ వీరారెడ్డిని ఆ సత్రానికి సింగిల్ ట్రస్టీగా దేవదాయ శాఖ అధికారులు నియమించారు. ఆ తర్వాత కొంతకాలానికి సత్రంలో ఉంటున్న యండ్రప్రగడ సీతారామయ్య సత్రం తనదేనంటూ భార్య వెంకటరత్నంకు వీలునామా రాయడం.. వెంకటరత్నం తన కుమారుల్లో ఒకరైన సాంబశివరావుకు రిజి్రస్టేషన్ చేశారు. ఆ తర్వాత 2005లో సత్రాన్ని ఖాళీ చేయాలని ఆలయ అధికారులు కోరడంతో అందులో ఉంటున్న యండ్రప్రగడ కుటుంబం సత్రం తమదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.సత్రం పూర్తి హక్కులు శివాలయానికి.. జిల్లా న్యాయస్థానం నుంచి ఈ కేసు వ్యవహారం 2008లో ట్రిబ్యునల్‌కు చేరడంతో 2011లో సత్రం ఆలయానికి చెందినదేనని తీర్పు వచ్చింది. అప్పటికే సత్రంలో పని కల్పిస్తే సత్రాన్ని స్వాధీనం చేసుకున్నారని భావించిన సత్రం యజమానులు అమరా వెంకటేశ్వర్లు, మువ్వల వెంకటసుబ్బారావు కుటుంబ సభ్యులు 2008లో ఆ సత్రం పూర్తి హక్కులు శివాలయానికి కల్పిస్తూ రిజి్రస్టేషన్ చేశారు. సత్రాన్ని స్వాధీనం చేసుకోవడంలో కొందరు అధికారుల ఉదాశీన వైఖరితో ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి గ్రామపెద్ద ఆలపాటి రామస్వామి కూడా అమరా వారి సత్రం ఆలయానికి చెందినదేనంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. గత నెల 21న అమరా వారి సత్రం సంపూర్ణ హక్కులు పెదకాకాని శివాలయానికి చెందినవేనని హైకోర్టు తీర్పు ఇచి్చంది. దీంతో సత్రంలో ఉంటున్న యండ్రప్రగడ వెంకటరత్నంకు పదిరోజుల పాటు ఆలయ శివ సదనంలో ఒక రూంలో ఉండేందుకు అనుమతించి మంగళవారం సత్రాన్ని ఖాళీ చేయించారు. అనంతరం శిథిలావస్థకు చేరిన సత్రాన్ని కూలి్చవేశారు. ఈ భూమి శివాలయానికి చెందినదని.. ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా శిక్షార్హులని ఆలయ ఉప కమిషనర్ దాసర శ్రీరామ వరప్రసాదరావు హెచ్చరించారు. -
పిన్నెల్లి వ్యాజ్యాలపై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి : పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ వ్యాజ్యాల్లో తీర్పు వెలువరించే వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనకుండా పెట్టిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటింగ్‌లో పాల్గొనేందుకు పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తరువాత ఈ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి.పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారు.. తీవ్రంగా పరిగణించండిఈ సందర్భంగా పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం, పోలీసుల తీరును ఎండగట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో ఉత్తర్వులిచ్చిందని, గతంలో ఎన్నడూ కమిషన్ ఇలా వ్యవహరించలేదని అన్నారు. పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్నారు. తప్పుడు వివరాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈవీఎం కేసులో పిన్నెల్లికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వనున్నట్లు సంకేతాలు రావడంతో ఆ వెంటనే హత్యాయత్నం కేసులు బనాయించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారన్నారు. గత నెల 22న హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వగా, 23న ఇతర కేసుల్లో పిన్నెల్లిని నిందితునిగా చేర్చారని తెలిపారు. హైకోర్టుకు మాత్రం 22నే చేసినట్లు చెప్పారని, తరువాత ఇది అబద్ధమని తేలడంతో 23నే నిందితునిగా చేర్చినట్లు పోలీసులు అంగీకరించక తప్పలేదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించాలన్నారు. హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్ కింద కేసు నమోదుకు వీల్లేదని, అందుకు నిర్దిష్ట విధానం ఉందని వివరించారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై పెట్టిన మరో కేసు చెల్లదని చెప్పారు.నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోండిపోలీసుల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు నమోదు చేశామని తెలిపారు. 2019లో కూడా ఇదే తరహా కేసు నమోదైందన్నారు. మధ్యంతర ముందుస్తు బెయిల్ షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని, సాక్షులను బెదిరించారని తెలిపారు. పిన్నెల్లి, అతని అనుచరుల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారన్నారు. పిటిషనర్ నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునేందుకు వచ్చిన శేషగిరిరావు, ప్రశ్నించిన మరో మహిళపై పిన్నెల్లి, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు.అశ్వనీ కుమార్ నియామకం చట్ట విరుద్ధంఅనంతరం పిన్నెల్లి న్యాయవాది నిరంజన్‌రెడ్డి పోలీసుల తరఫున అశ్వనీ కుమార్ హాజరు కావడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన నియామకం సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగా జరగలేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం గురించే నిబంధనల్లో ఉంది తప్ప, స్పెషల్ కౌన్సిల్ గురించి లేదన్నారు. తప్పును సరిచేసుకుని చట్ట ప్రకారం ఆయన్ను నియమించుకుంటే అభ్యంతరం లేదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
పోస్టల్ బ్యాలెట్ పై నేడు కీలక తీర్పు
-
Madhya Pradesh High Court: సహజీవనం చేసినా భరణం
భోపాల్: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా ఒక పురుషుడితో చాలాకాలం సహజీవనం చేసి విడిపోయిన మహిళ భరణానికి అర్హురాలేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భరణం ఇవ్వాలన్న కింది కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. 38 ఏళ్ల శైలేంద్ర బాప్చే, 48 ఏళ్ల అనిత చాలాఏళ్లు సహజీవనం చేశారు. కుమారుడు పుట్టాక విడిపోయారు. బిడ్డను పోషించుకోవడానికి, తన జీవనానికి భరణం ఇవ్వాలని అనిత డిమాండ్ చేయగా శైలేంద్ర అంగీకరించలేదు. దాంతో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అనిత్ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ.1,500 చొప్పున భరణం చెల్లించాలని శైలేంద్రను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శైలేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. శైలేంద్ర పిటిషన్‌ను కొట్టివేసింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే సీఆర్పీసీ సెక్షన్ 125 కింద ఆమెకు భరణం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
కవితకు బెయిల్‌పై 8న తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. ఈనెల 8వ తేదీ సోమవారం తీర్పు వెలువరిస్తామన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్, బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింíఘ్వీ, ఈడీ తరఫున జొహెబ్ హొస్సేన్‌లు వాదనలు వినిపించారు. తల్లి పర్యవేక్షణ అవసరం: సింఘ్వీ కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, 16 ఏళ్ల కుమారుడికి తల్లి పర్యవేక్షణ, భావోద్వేగ మద్దతు ఈ సమయంలో ఎంతో అవసరమని సింఘ్వీ పేర్కొన్నారు. తల్లి అరెస్టుతో కుమారుడు ఎంతో దిగ్భ్రాంతి చెందిన పరిస్థితిని మనం చూడాలన్నారు. కవిత కుమారుడు పరీక్షలు రాసే సబ్జెక్టులు ప్రస్తావిస్తూ.. తల్లి స్థానాన్ని తండ్రి లేదా సోదరుడు భర్తీ చేయలేరని, మానసిక ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పారు. తల్లి దగ్గర ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపారు. కవితకు బెయిల్ ఇచ్చినా ఈడీకి వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆమెను తిరిగి సుల భంగానే అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. తండ్రి ఢిల్లీలో ఉండి న్యాయపోరాటం చేస్తున్నారని కుమారుడు తెలంగాణలో ఉన్నారని సింఘ్వీ తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో ప్రధాని ఆల్ ఇండియా రేడియోలో ఉపన్యాసాలు ఇస్తున్నారని, ఆ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఊహకు మించి ఉంటుందని వ్యాఖ్యానించారు. అన్నీ చూసి కోర్టు నిర్ణయం తీసుకోవాలి: హొస్సేన్ సెక్షన్ 45 నిబంధనలు సింఘ్వీ నొక్కి చెబుతున్నారని, అయితే ప్రజా జీవితంలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకురాలికి అవి వర్తించవని ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ అన్నారు. ఈ కేసులో లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలున్న ప్రధాన వ్యక్తుల్లో ఒక మహిళను ప్రశ్నిస్తున్నామని, ప్రాక్సీల ద్వారా ఆమె లబ్ధి పొందారని వాదించారు. కేవలం ఇతర నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ విషయం చెప్పడం లేదని, సంబంధిత పత్రాలు, వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలు చూసి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తన దగ్గర ఉన్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక సాక్ష్యాలు ఎలా నాశనం చేశారో నిరూపిస్తుందన్నారు. కవిత పలు ఫోన్ల నుంచి సమాచారం డిలీట్ చేశారని, మొత్తంగా 100 కంటే ఎక్కువ ఫోన్లు నాశనం చేశారని ఆరోపించారు. ఈ కేసులో చాలా పెద్ద పురోగతి సాధించే దశలో ఉన్నామని, తాత్కాలిక ఉపశమనం కల్పిస్తే దర్యాప్తు పక్కకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని, ప్రజలను కూడా ఆమె ప్రభావితం చేస్తారన్నారు. సాక్షుల్ని పిలిచి వారి వారి వాంగ్మూలాలు మార్చుకోవాలని బెదిరించే అవకాశం ఉందంటూ హొస్సేన్ వాదించారు. ఈ దశలో కవిత న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరోసారి జోక్యం చేసుకొని కవిత కుమారుడికి 12 పేపర్లలో ఏడు పూర్తయ్యాయని భారతీయతలో తల్లి ఒకరే తగిన సాన్నిహిత్యాన్ని అందించగలరని తెలిపారు. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. -
బదిలీ అధికారం యజమానికి ఉంది
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీ విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారిని బదిలీచేసే అధికారం సదరు యజమాని (ప్రభుత్వం)కి ఉందని స్పష్టంచేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం వారిని బదిలీ చేయడం తప్పుకాదని తేల్చిచెప్పింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను బదిలీచేస్తూ 2022లో ప్రభుత్వం జారీచేసిన జీఓ–103ను హైకోర్టు సమర్ధించింది. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులు కనీస వేతన స్కేల్‌కు అర్హులని స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని వారందరికీ కనీస వేతన స్కేల్‌ను వర్తింపజేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీచేసిందని.. అందులో కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొంది. సవరించిన కనీస వేతన స్కేల్‌ను కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 1–1–2022 నుంచి అమలుచేయాలని.. వారికి చెల్లించాల్సిన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని అధికారులకు తేలి్చచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ కృపాసాగర్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతన స్కేల్‌ను ఖరారుచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేసేలా అధికారులను ఆదేశించడంతో పాటు, తమను వివిధ ప్రాంతాలకు బదిలీచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను చట్ట విరుద్దంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లోని కాంట్రాక్టు టీచర్లు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు కాంట్రాక్టు టీచర్ల బదిలీల ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించారు. ఇదే సమయంలో కోర్టుకొచ్చిన టీచర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగించాలని.. అంతేకాక.. వారికి కనీస వేతనాలు, తదనుగుణ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ కాంట్రాక్టు టీచర్లు.. కనీస వేతనాలపై ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. బదిలీ అధికారం యజమానికి ఉంది ‘ఇక కాంట్రాక్టు టీచర్ల బదిలీ విషయానికొస్తే, వారిని కావాల్సిన చోటుకు బదిలీ చేయడం సబబే. నిజానికి.. 2013 నాటి కాంట్రాక్టు ఒప్పందంలో బదిలీల విషయంలో ఎలాంటి నిబంధన లేదు. దీని ఆధారంగా కాంట్రాక్టు టీచర్లు తమను బదిలీ చేయడానికి వీల్లేదంటున్నారు. అయితే, 2022లో తీసుకొచ్చిన కొత్త ఒప్పందంలో బదిలీ నిబంధన ఉంది. అందువల్ల ప్రస్తుత కేసులో కాంట్రాక్టు టీచర్ల బదిలీ ఉత్తర్వులను ఎంతమాత్రం తప్పుపట్టలేం. బదిలీల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సమర్థనీయమే’.. అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది. వారికిచ్చి వీరికివ్వకపోవడం వివక్షే.. వీటిపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కాంట్రాక్టు టీచర్ల తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పు కాంట్రాక్టు, తాత్కాలిక, అడ్హాక్ తదితర ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలను వర్తింపజేస్తూ జీఓ ఇచ్చిందని, అయితే అధికారులు వాటిని కాంట్రాక్టు టీచర్లకు వర్తింపచేయడం లేదన్నారు. పిటిషనర్లు కాంట్రాక్టు టీచర్లు మాత్రమేనని, వారికి ట్రాన్స్ఫర్లు వర్తింపజేయడానికి వీల్లేదని తెలిపారు. కనీస వేతనాలు వర్తింపజేయకుండా బదిలీలు చేయడానికి వీల్లేదన్నారు. సర్వశిక్షాభియాన్ తరఫు న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. కేజీబీవీ, యూనివర్సిటీలు, సొసైటీలు, మోడల్ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతన స్కేల్‌ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయితే, ఈ ఉత్తర్వులు మంజూరు చేసిన ఖాళీల కింద నియమితులైన వారికి మాత్రమే వర్తిస్తాయన్నారు. అలాగే, బదిలీ చేయాలని పలువురు కాంట్రాక్టు టీచర్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమరి్పంచారని, ఆ మేరకు వారి బదిలీ జరిగిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కనీస వేతనాల విషయంలో ఎన్వీ సుమంత్ వాదనలతో ఏకీభవిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. అంతేకాక.. ‘తమకు కనీస వేతన స్కేల్ ఉత్తర్వులను వర్తింపజేయాలన్న కాంట్రాక్టు టీచర్ల అభ్యర్థన సబబైనదే. సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం అన్నది దోపిడీ, బానిసత్వం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకునే వారికి కనీస వేతన స్కేల్‌ను అమలుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అధికారులు ఆ స్కేల్‌ను వర్తింపజేయకపోవడం ఏకపక్షం. కనీస వేతనాల విషయంలో సింగిల్ జడ్జి తీర్పును ఏ రకంగానూ విమర్శించాల్సిన అవసరంలేదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
ప్రణీత్‌రావు పిటిషన్లో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించడం లేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతోపాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘24 గంటలూ ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ప్రణీత్ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్ చేస్తున్నారు’ అని చెప్పారు. అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదిస్తూ.. ‘పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇది చాలా తీవ్ర నేరం. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సాక్ష్యాలను అందించేందుకే రమేశ్ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప.. విచారణలో పాల్గొనలేదు’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. గురువారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
చైల్డ్ పోర్నోగ్రఫీపై ఆ తీర్పు దుర్మార్గం: సుప్రీం
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దుర్మార్గంగా అభివర్ణించింది. ఆ తీర్పుపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. చెన్నైకి చెందిన ఎస్.హరీశ్(28) పిల్లలతో కూడిన పోర్నోగ్రఫీ కంటెంట్‌ను తన సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడంటూ పోలీసులు కేసు పెట్టారు. దీనిపై హరీశ్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు. విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం పోక్సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదని పేర్కొంటూ జనవరి 11వ తేదీన తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పు చట్టాలకు వ్యతిరేకం, దుర్మార్గమని పేర్కొంది. ఏకసభ్య ధర్మాసనం ఇలాంటి తీర్పు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించింది. -
AP : జస్టిస్ రాకేష్ వివాదాస్పద తీర్పు రద్దు
ఏపీ హైకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన వివాదస్పద తీర్పును రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ డిసెంబర్ 31, 2020న జస్టిస్ రాకేష్‌కుమార్ ఒక తీర్పు ఇచ్చారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పులో చేర్చిన జస్టిస్ రాకేష్.. దాన్నే తీర్పుగా పేర్కొనడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన తీర్పును అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్వీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాళ ప్రకటించింది. కేసు పూర్వపరాలేంటీ? ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వేలం వ్యవహారానికి సంబంధించి 2020లో ఓ పిటిషన్ ఏపీ హైకోర్టు ముందు దాఖలయింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అలాగే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రాకేష్ కుమార్.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిసెంబర్ 31, 2020న ఓ తీర్పు ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం లేదంటూ తన తీర్పులో వ్యాఖ్యలు చేశారు జస్టిస్ రాకేశ్‌కుమార్. శాసనవ్యవస్థమీదా, పోలీసు యంత్రాంగంమీద, మూడు రాజధానుల అంశంమీదా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేశ్‌కుమార్ వాటన్నింటిని తీర్పులో పొందుపరిచారు. సుప్రీంకోర్టుపైనే ఎదురుదాడి దీంతో పాటు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారంపైనా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు జడ్జిలను బదిలీ చేయడాన్ని హైకోర్టుపై దాడిగా అభివర్ణించారు. నాడు హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్ చేసిన తీర్పులో ఏకంగా సుప్రీంకోర్టు కొలిజీయంనే తప్పుబట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది? కేసుల విచారణ జాప్యంపై, అలాగే అమరావతి భూముల కేసులో జస్టిస్ రాకేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పు అంశాలనూ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇతర రాజ్యాంగ వ్యవస్థల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ హైకోర్టు ఆరోపించడం జరికాదని సూచించింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఒక హైకోర్టు జడ్జిగా తనకున్న విచక్షణాధికారాన్ని ఇష్టానుసారంగా వినియోగించలేరని, వ్యవస్థలను ఇబ్బంది పెట్టకూడదని తెలిపింది. ఒక హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుపట్టే ముందు.. తాను కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న విషయాన్ని రాకేష్‌కుమార్ గుర్తించకపోవడం శోచనీయమని పేర్కొంది. జస్టిస్ రాకేష్ కుమార్ పై ఆరోపణలేంటీ? వివాదాల్లో ఇరుక్కోవడం జస్టిస్ రాకేష్‌కుమార్‌కు ఇది కొత్తేమీ కాదు. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATలో సభ్యుడిగా ఉన్న రాకేష్‌కుమార్ తీరును ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన ఆ పోస్టుకు రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫినోలెక్స్ కేబుల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేందుకు ప్రయత్నించడంతో ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్ రాకేశ్‌కుమార్ కోర్టు ధిక్కరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పాట్నా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టంతా అవినీతిమయమయిందని నిరాధార ఆరోపణలు చేసి విమర్శల పాలయ్యారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్ -
చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు
-
కొడాలి నాని, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు కొట్టేసిన కోర్టు
సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ నేతలపై టీడీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేసింది. నానితో పాటు, మరో ఆరుగురు వైఎస్సార్సీపీ నేతలు నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. 2017లో వినాయకచవితి సందర్భంగా గుడివాడలో నాని నిర్వహించిన అన్న సమారాధనను పోలీసుల ద్వారా టీడీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. డీఎస్పీ మహేష్ నేతృత్వంలో అన్నదానాన్ని పోలీసులు అడ్డుకోబోగా, అన్నం పెడుతుంటే అడ్డుకోవడమేంటని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. భోజనం చేస్తున్న టేబుళ్లను పోలీసులు నెట్టి వెయ్యడంతో దుమారం చెలరేగింది. ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే నాని, వైసీపీ నాయకులు గుడ్లవల్లేరు బాబ్జి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్ సహా మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జరిగిన విచారణలో పోలీసులు చూపినవి తప్పుడు సాక్ష్యాలని న్యాయమూర్తి నిర్ధారించారు. వైఎస్సార్సీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
ఆ 181 ఎకరాలు హెచ్ఎండీఏవే..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని 181 ఎకరాల వివాదాస్పద భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కే చెందుతాయని హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. అందులోని 50 ఎకరాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 2007 నుంచి శంషాబాద్ గ్రామ పంచాయతీ జారీ చేసిన ఆస్తి పన్ను నోటీసులు, మున్సిపల్ అనుమతి, రెవెన్యూ రికార్డులు, విద్యుత్ బిల్లులు, ఫొటోలు, 2023 ఏప్రిల్ 20 నాటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇంటి పన్ను రశీదులు, ఇంటి నిర్మాణ అనుమతి.. ఇలా అన్నీ నకిలీవేనని జ్యుడీషియల్ రిజిస్ట్రార్నివేదిక బయటపెట్టిందని స్పష్టం చేసింది. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు కల్పి త రసీదులు సృష్టించారని పేర్కొంది. 1990 సెపె్టంబర్ 4 నాటి ఉత్తర్వుగా పేర్కొంటూ.. 1992లో టైప్ చేసిన కాపీని పిటిషనర్ ఇచ్చారని, అది కూడా నకిలీదేనని తేలిందని వెల్లడించింది. అన్ని అంశాలను పరిశీలించాక పిటిషనర్‌కు ఉపశమనం పొందడానికి ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. ‘పైగా’భూములని పేర్కొంటూ.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సర్వే నంబర్ 725/21లోని 7.31 ఎకరాలు, సర్వే నంబర్ 725/23లోని 10.07 ఎకరాలు, సర్వే నంబర్ 725/25లోని 12.34 ఎకరాలు సహా దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా (సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు క ల్పిస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. రసీదులన్నీ నకిలీవే.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘవన్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. తప్పుడు పత్రాలు, రసీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టిస్తున్నారని.. అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకు పైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ కోర్టుకు వివరించారు. 2007, 2012లో జారీ చేసిన రసీదులు పూర్తిగా నకిలీవని స్పష్టం చేశారు. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల పత్రాలను ఆయన ఈ సందర్భంగా ధర్మాసనానికి అందించారు. 2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం తెలంగాణ అని పేర్కొన్నారని.. అలాగే శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ అని మరో రసీదులో ఉందని వివరించారు. దాంతో ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం గతంలోనే జ్యుడీïÙయల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. రిజిస్ట్రార్విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇచ్చారు. పిటిషనర్ పేర్కొన్నట్టుగా 1997లో అసలు పిటిషన్లే నమోదు కాలేదని వివరించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచి్చంది. -
చట్టబద్ధత కల్పించలేం
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. ‘‘అది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. పార్లమెంటు పరిధిలోని అంశం. కోర్టులు చట్టాలు చేయవు. వాటిని మంచి చెడులను బేరీజు వేస్తాయంతే’’ అని పేర్కొంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అయితే స్వలింగ సంపర్కులకు పెళ్లాడే స్వేచ్ఛ, హక్కు ఉంటాయని స్పష్టం చేసింది. అంతేగాక ఇతరుల మాదిరిగానే వారికి అన్ని రకాల హక్కులూ సమానంగా ఉంటాయని, వారిపై వివక్ష చూపొద్దని పేర్కొంది. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయమై సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది. తద్వారా స్వలింగ సంపర్కులు వివక్ష ఎదుర్కోకుండా చూడాలని పేర్కొంది. అలాగే స్వలింగ బంధాలు పట్టణ, సంపన్న వర్గాలకు పరిమితమైన ధోరణి అన్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ధర్మాసనం తప్పుట్టింది. ‘‘స్వలింగ సంపర్కం అనాది కాలం నుంచీ ఉన్న సహజ ధోరణే. అది కేవలం పట్టణాలకో, సంపన్న వర్గాలకో సంబంధించింది కాదు. ఈ విషయంలో కుల, సామాజిక వర్గ భేదాలూ ఉండవు. కనుక ఆ అపోహను వదిలించుకోవాలి’’ అని సూచించింది. కాకపోతే స్వలింగ జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కుండబోదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 3:2తో మెజారిటీ తీర్పు వెలువరించింది. దత్తతతో పాటు పలు న్యాయపరమైన అంశాల విషయంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పి.ఎస్.నరసింహ విభేదించారు. నాలుగు తీర్పులు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2018లో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కూడా కల్పించాలంటూ ఎల్జీబీటీక్యూఐఏ++ వర్గాల తరఫున 21 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ అనంతరం గత మే 11న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా దీనిపై మొత్తం 4 తీర్పులు వెలువరించింది. మొత్తం అంశంపై సీజేఐ 247 పేజీల తీర్పు వెలువరించారు. స్వలింగ జంటల దత్తత తదితర అంశాలపై సీజేఐ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ జస్టిస్ కౌల్ విడిగా 17 పేజీల తీర్పు వెలువరించారు. కాగా వాటితో విభేదిస్తూ తనతో పాటు జస్టిస్ కోహ్లీ తరఫున జస్టిస్ భట్ 89 పేజీల తీర్పు వెలువరించారు. దానితో పూర్తిగా ఏకీభవిస్తూ జస్టిస్ నరసింహ 13 పేజీల తీర్పు రాశారు. స్వలింగ ప్రవృత్తి సహజమైనదే తప్ప మానసిక రుగ్మత కాదని సీజేఐ స్పష్టం చేశారు. లైంగిక గుర్తింపు, ప్రవృత్తుల గురించి విచారణ జరిపే నెపంతో స్వలింగ జంటలను పోలీసులు వేధించవద్దని ఆదేశించారు. ఈ నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించడం గానీ, వారి నివాసాలకు వెళ్లడం గానీ చేయొద్దని చెప్పారు. దత్తతపై... అవివాహితులకు, స్వలింగ జంటలకు దత్తత హక్కుండదంటూ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. వారికి ఆ హక్కును నిషేధిస్తున్న దత్తత చట్ట నిబంధనలను సమర్థిస్తున్నట్టు పేర్కొంది. అయితే దీనిపై కూడా పార్లమెంటు సమగ్రంగా చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. సమస్యల పరిష్కారానికి కమిటీ స్వలింగ సంపర్కులకు చట్టబద్ధ వివాహ హక్కు లేదని, రాజ్యాంగం ప్రకారం దాన్ని మౌలిక హక్కుగా పొందజాలరని పేర్కొంటూ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. అదే సమయంలో, స్వలింగ జంటల సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించేందుకు కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీతో పాటు సామాజిక తదితర రంగాల నిపుణులకు అందులో చోటుండాలని సూచించింది. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయానికైనా వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని వర్గాల వారి వాదనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేసింది. రేషన్ కార్డు తదితరాల నిమిత్తం స్వలింగ జంటను ఒకే కుటుంబంగా పరిగణించడం, ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడం, డెత్ బెనిఫిట్స్ తదితరాల నిమిత్తం తమలో ఒకరిని నామినీగా పేర్కొనడం వంటి సౌకర్యాలను కల్పించవచ్చేమో పరిశీలించాలని సూచించింది. దాంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు. అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించిన మీదట కమిటీ ఇచ్చే తుది నివేదికను కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలనపరంగా అన్ని స్థాయిల్లోనూ అమలు చేయాలని సీజేఐ స్పష్టం చేశారు. ‘స్వలింగ జంటల బంధాన్ని చట్టపరంగా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. లేదంటే వారికి అన్యాయం చేసినట్టే అవుతుంది’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఎల్జీబీటీక్యూఐఏ++ అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, క్వశ్చనింగ్, ఇంటర్‌సెక్స్, పాన్‌సెక్సువల్, టూ స్పిరిట్, అసెక్సువల్ తదితరులు కేవలం లైంగిక ప్రవృత్తి ఆధారంగా పెళ్లి చేసుకునే విషయంలో ఫలానా వారికి ఫలానా హక్కు వర్తించబోదని చెప్పబోవడం పొరపాటే అవుతుంది. స్వలింగ జంటలు పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకోవడాన్ని ఎవరూ నిషేధించలేరు. కానీ దానికి చట్టపరమైన గుర్తింపును మాత్రం ఇప్పటికైతే వారు కోరజాలరు. అలాగే దత్తత హక్కును కూడా! ఈ విషయంలో జస్టిస్ భట్ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నా – జస్టిస్ నరసింహ ఎవరేమన్నారు.. అవివాహితులు, స్వలింగ జంటలు దత్తత తీసుకోవడాన్ని నిషేధిస్తున్న సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్అథారిటీ (సీఏఆర్ఏ) నిబంధన 5(3) రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధం. స్త్రీ పురుష జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులు కాగలరన్న భావన సరికాదు. అది స్వలింగ జంటల పట్ల వివక్షే అవుతుంది. అసలు వివాహమనే బంధానికి సమానంగా వర్తించే సార్వత్రిక భావనంటూ ఏదీ లేనే లేదు – సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వలింగ సంపర్కుల పట్ల జరుగుతున్న చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకు బహుశా ఇది సరైన సందర్భం. ఈ దిశగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ సకారాత్మక చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా – జస్టిస్ ఎస్.కె.కౌల్ ఎల్‌జీబీటీక్యూఏఐ++ జంటల సమస్యలు మా దృష్టికి రాకపోలేదు. కానీ వారికి దత్తత హక్కు లేదన్న సీఏఆర్ఏలోని నిబంధన 5(3) చెల్లుబాటవుతుంది. అయితే స్వలింగ స్వభావులకు భాగస్వాములను ఎంచుకునేందుకు, సహజీవనం చేసేందుకు పూర్తి హక్కుంటుంది. అయితే ఆ బంధంతో వారికి దఖలు పడాల్సిన హక్కులను గుర్తించాల్సిన అనివార్యత మాత్రం ప్రభుత్వాలకు లేదు -జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ -
విద్యుత్ బకాయిల చెల్లింపుపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదంలో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ ఏపీ.. దీనిపై ఇప్పటికే ఇచ్చిన స్టేను పొడించాలంటూ తెలంగాణ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. హైకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి తమకు తెలంగాణ నుంచి రూ.6,756.92 కోట్లు (అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) రావాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఏపీకి 30 రోజుల్లోగా రూ.6,756.92 కోట్లు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బకాయిల విషయంలో తెలంగాణ సర్కార్‌పై ఒత్తిడి తేవొద్దని స్టే ఇచ్చింది. ఈ వ్యవహారం ఇలా కోర్టులో ఉండగానే.. విద్యుత్ బకాయిలు తప్పకుండా చెల్లించాలని ఆదేశించినా తెలంగాణ ఇవ్వడం లేదని.. అందువల్ల రిజర్వు బ్యాంకులోని తెలంగాణ ఖాతా నుంచి సొమ్మును మినహాయించుకుని ఏపీకి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది. దీనితో కేంద్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని, చెల్లింపులపై స్టేను పొడిగించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులోని ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. బకాయిల వల్ల ఇబ్బందుల్లో ఏపీ డిస్కమ్‌లు తెలంగాణ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ విద్యుత్ డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వచ్చిందని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పునర్విభజన తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ఈ బకాయిలకు, పునర్విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు కూడా ఏపీ డిస్కమ్‌లు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాయన్నారు. బకాయిలు చెల్లించక బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, తెలంగాణకు విద్యుత్ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని గుర్తు చేశారు. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని, బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉందని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం తీర్పు రిజర్వు చేసింది. -
ఆ జీవోలపై హైకోర్టు పునర్విచారణ
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ 1411.. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ను సవాలుచేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు శనివారం తిరిగి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, కేంద్రం దాఖలు చేసే కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలని పిటిషనర్లయిన రామయ్య, రాజేంద్రప్రసాద్‌లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పట్టించుకోని సింగిల్ జడ్జి.. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు జీఓలను సవాలుచేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు 2020లో వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై విచారణ జరిపిన నాటి న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, ఆ జీఓల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2020 సెపె్టంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే సంపూర్ణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను ఆ తరువాత ప్రభుత్వాలు తప్పనిసరిగా కొనసాగించాలన్నారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చుకుని వారి వాదనలు వినాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సైతం న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ జీఓలవల్ల వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు బాధిత వ్యక్తులు కాదని, వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సైతం జస్టిస్ సోమయాజులు పరిగణనలోకి తీసుకోలేదు. ‘సుప్రీం’ ఆదేశాలతో తిరిగి విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తిరిగి ఈ ఏడాది జూన్‌లో విచారణ మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. అటు తరువాత పలుమార్లు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. తాజాగా.. శనివారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. కౌంటర్ల దాఖలుకు కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ తరఫు న్యాయవాది వరుణ్ బైరెడ్డి గడువు కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. సిట్ పరిధిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలంటూ తాజాగా పిల్ దాఖలైందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యాజ్యం విచారణకు వస్తే అందులోనూ కేంద్రం తన వైఖరిని తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి గడువునిచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేశారు. అప్పటికల్లా ఇరుపక్షాలు కౌంటర్లు, వాటికి రిప్లైలు దాఖలు చేయడం పూర్తిచేయాలని న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు.. దీంతో.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తప్పుపట్టి వాటిని రద్దుచేసింది. హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు జీఓలను పరిశీలిస్తే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు ఆ జీఓ జారీ అయినట్లు భావించడానికి వీల్లేదంది. కేంద్రాన్ని సైతం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేర్చుకోవాలని హైకోర్టును ఆదేశించింది. కేంద్రం అభిప్రాయం కూడా తెలుసుకోవాలంది. కేసు పూర్వాపరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను మూడునెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో హైకోర్టుకు స్పష్టం చేసింది. -
చాట్‌జీపీటీ చెప్పిందని కోర్టు మెట్లక్కిన దిగ్గజ కంపెనీ.. చివరికి ఏమైందంటే
ఓ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్‌జీపీటీ ఇచ్చిన ఆధారాల్ని పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇంతకీ ఆ కేసు ఏంటి? చాట్‌జీపీటీ ఇచ్చిన ఆధారాలేంటి? పలు నివేదికల ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ లగ్జరీ షూ తయారీ సంస్థ క్రిస్టియన్ లౌబౌటిన్.. భారత్‌లోని ఢిల్లీ కేంద్రంగా షుటిక్ అనే కంపెనీ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా షూ’లను తయారు చేసి అమ్మకాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు షుటిక్‌పై క్రిస్టియన్ లౌబౌటిన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. తమ సంస్థ కొన్ని షూ డిజైన్లు తమకే చెందుతాయంటూ ట్రేడ్‌మార్క్ తీసుకుందని, ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కోర్టుకు వివరించింది. అయితే, షుటిక్ తమ ట్రేడ్ మార్క్ షూ డిజైన్లను కాపీ కొట్టిందని, ఇదే విషయాన్ని చాట్‌జీపీటీ చెప్పినట్లు ఆధారాలు సమర్పించింది. తమకు న్యాయం చేయాలని విన్నవించుకుంది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు.. న్యాయస్థానంలో చట్టపరమైన లేదా వాస్తవిక సమస్యల పరిష్కారానికి చాట్‌జీపీటీ ఇచ్చిన ఆధారాలు సరిపోవని కోర్టు పేర్కొంది. ఏఐ చాట్బాట్ల ప్రతిస్పందనలు, కల్పితాలు, ఊహాజనిత డేటా మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు.. ప్రతివాది ఉద్దేశపూర్వకంగా మనీ సంపాదనకు ట్రేడ్ మార్క్ నిబంధనలను ఉల్లంఘించారని అర్థమవుతుందని తెలిపింది. ఇకపై బూట్ల డిజైన్లు, రంగులు కాపీ చేయరాదని, ఆ ఒప్పందం ఉల్లంఘిస్తే రూ.25 లక్షలు జరిమాన చెల్లించాల్సి వస్తుందని ప్రతివాదిని హెచ్చరించింది. ప్రస్తుతం, పిటిషనర్ ఖర్చుల కింద వాదికి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. చదవండి👉 ‘ఆ AI టూల్‌ను షట్‌డౌన్ చేస్తున్నాం’.. చాట్‌జీపీటీ సృష్టికర్త సంచలన ప్రకటన! -
గద్వాల ఎమ్మెల్యే DK అరుణ.! హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో శాసనసభ్యుడి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను 2018 డిసెంబర్ 12 నుంచీ ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆదేశించింది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2,50,000 జరిమానా విధించింది. మరో రూ.50,000ను పిటిషనర్‌కు పరిహారంగా చెల్లించాలని సూచించింది. డీకే అరుణ పిటిషన్‌తో.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యరి్థగా డీకే అరుణ పోటీ చేశారు. ఇందులో కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,057 ఓట్లు, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే ఎన్నికల సమయంలో కృష్ణమోహన్‌రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని.. ఆయన ఎన్నికను రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ డీకే అరుణ తరఫున న్యాయవాది యోగితా ప్రకాశ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. భూములు, ఖాతాల వివరాలు చెప్పలేదని.. అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య పేరుతో ఉన్న వాహనాలకు ట్రాఫిక్ చలానాలు ఉన్నా చెల్లించలేదని, ఈ వివరాలను అఫిడవిట్లో పేర్కొన లేదని కోర్టుకు వివరించారు. గద్వాల ఎస్బీఐ, ఏడీబీ బ్యాంకుల్లో కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య జ్యోతికి ఉన్న ఖాతాల వివరాలను చెప్పలేదన్నారు. సిబిల్ వివరాల ప్రకారం ఎమ్మెల్యే బ్యాంకులకు రూ.1,09,67,737 రుణాలు బకాయిలు ఉన్నా వెల్లడించలేదని, అలాగే జాతీయ బ్యాంకుల్లో మరో రూ.1.22 కోట్ల రుణాలున్నా పేర్కొనలేదని వివరించారు. అదే విధంగా పుద్దూరులో వారికి ఉన్న 24 ఎకరాల భూమిని అఫిడవిట్లో చూపలేదన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదు. పత్రికా ప్రకటన ఇచ్చినా స్పందించలేదు. దీంతో న్యాయమూర్తి తీర్పును జూన్ 22న తీర్పును రిజర్వు చేసి గురువారం వెల్లడించారు. అయితే ఈ కేసులో కృష్ణమోహన్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించేందుకు ఆగస్టు 18న న్యాయవాది మనోహర్ వచ్చారని, ఈ మేరకు అప్లికేషన్ దాఖలు చేశారని రిజిస్ట్రీ హైకోర్టుకు వివరించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. జూన్ 22నే తీర్పు రిజర్వు చేశామని, ఈ నేపథ్యంలో మధ్యంతర అప్లికేషన్‌ను అనుమతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా..బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తీర్పు వెలువరించిందన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు నాలుగు అభియోగాలతో కోర్టుకు వెళ్లారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, కొందరికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేక దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తాను గత ఎన్నికల్లో 37వేల మెజారీ్టతో గెలిచానని, ఈసారి 50వేల మెజారీ్టతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా న్యాయం జరిగింది: డీకే అరుణ తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, అభ్యర్థులకు ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెంపపెట్టు వంటిదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఈ తీర్పు మూడేళ్ల ముందే రావాల్సిందని.. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పును గద్వాల ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే దానికి ఇది సంకేతమని పేర్కొన్నారు. -
ఫార్మాసిటీ భూసేకరణ రద్దు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణ కేసులో ప్రకటన, అవార్డులు, పరిహారం డిపాజిట్ సహా తదుపరి అన్ని చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులైన 180 మంది పిటిషనర్ల నుంచి మళ్లీ అభ్యంతరాలను తీసుకొని, భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించింది. భూసేకరణలో చేపట్టాల్సిన కనీస విధానాన్ని కూడా పాటించకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏదైనా భూమిని సేకరించేటప్పుడు అనుసరించాల్సిన విధానంపై 2017లో ప్రధాన కార్యదర్శి మెమోను జారీ చేసినా, దాన్ని అర్థం చేసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొంది. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గుర్తించలేదని, తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో మూడేళ్లు గడిచినా ప్రతిష్టాత్మకమైన ఫార్మా సిటీ నిర్మాణం కూడా ముందుకుసాగలేదని పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వం 2020, జూలై 23న జారీ చేసిన భూసేకరణ ప్రకటనను కొట్టివేస్తున్నామని వెల్లడించింది. భూసేకరణ, పునరావాసం చట్టంలోని సెక్షన్ 15 కింద అభ్యంతరాలను 3 నెలల వ్యవధిలోగా తీసుకుని, మళ్లీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. తీర్పు తేదీ ప్రామాణికంగా మార్కెట్ విలువ పేర్కొనాలి భూసేకరణ, పునరావాస చట్టప్రకారం తమకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడం లేదని, ఇతర చర్యలు చేపట్టడం లేదని మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున రవికుమార్, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ పరిషద్ వాదనలు అందకుముందు వినిపించారు. ‘రెండు వారాల్లో పిటిషనర్లు అభ్యంతరాలను తెలియజేయాలి. అధికారులకు సహకరించాలి. ఈ తీర్పు తేదీని ప్రామాణికంగా తీసుకుని అధికారులు మార్కెట్ విలువ నిర్ణయించాలి. ఇరుపక్షాలు చర్చలతో ప్రయోజనాలను పొందాలి. 2015లోనే ప్రభుత్వం గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించింది. చట్టపరమైన అడ్డంకులు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. చట్టాలు ఏం చెబుతున్నాయో కూడా ఐఏఎస్ అధికారులు అర్థం చేసుకోకపోవడం, భూసేకరణ చట్టాన్ని ఎలా అమలు చేయాలన్నది కూడా తెలియకపోవడం ఆక్షేపణీయం. దీని కారణంగానే రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 2017, అక్టోబర్ 23న మోమో జారీ చేయాల్సి వచ్చింది. అందులో 2013 భూ సేకరణ చట్ట ప్రకారం.. సేకరణ సమయంలో అనుసరించాల్సిన విధానం ఏంటీ అన్నది చెబుతూ పలు మార్గదర్శకాలు వెల్లడించారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుడ్డిగా తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. దీని కారణంగా ఎంతో విలువైన కోర్టు సమయం మూడేళ్లుగా వృథా అవుతూ వచ్చింది’అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. -
గ్రేహౌండ్స్ భూమిపై ఎల్లో రాబందుల కళ్లు.. పచ్చ గుండాలకు సుప్రీం కోర్టు షాక్
సాక్షి, ఢిల్లీ: 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, ఆయన నాయకత్వంలోని టిడిపిలో ఏ చాప్టర్ చూసినా ఏదో ఒక అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. చంద్రబాబుతో తిరిగే వాళ్లెవరయినా.. ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం తరచుగా బయటపడుతోంది. హైదరాబాద్ భూమి వెనక బాబు అనుచరుడు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల రెవెన్యూ పరిధి. హైదరాబాద్ శివార్లలో అత్యంత విలువైన భూమి. 143 ఎకరాల ఈ భూమి విలువ అక్షరాలా పది వేల కోట్లు. దీన్ని గతంలో గ్రే హౌండ్స్ సంస్థకు కేటాయించారు. దేశంలో శాంతి భద్రతలను రక్షించే సంస్థల్లో ఒకటయిన గ్రౌహౌండ్స్ కే ఎసరు పెట్టేందుకు ప్రయత్నించారు టిడిపి నేత ఒకరు. ఆయనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్న మాండ్ర శివానందరెడ్డి. రెండు దశాబ్దాలుగా ప్లాన్ అప్పట్లో పోలీస్ శాఖలో పని చేసిన మాండ్ర శివానందరెడ్డికి ఈ స్థలం వెనకున్న లూపోల్స్ కొన్ని తెలుసు. ఇంకేముంది.. ఈ భూమినే కొట్టేసేందుకు రకరకాల కుట్రలు పన్నారు. చంద్రబాబు అండతో రకరకాల కొత్త డాక్యుమెంట్లు సృష్టించారు. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవని తెలిసినప్పటికీ తామే జీపీఏ హోల్డర్లమంటూ దందా సాగించారు. అయితే ఈ కుట్రలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. 1994 నుంచి కొనసాగుతున్న భూ వివాదానికి ముగింపు పలికింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రూ.10 వేల కోట్ల విలువైన ఈ భూమిని కొట్టేసేందుకు రకరకాల కుట్రలు చేశారు. మంచిరేవులలోని ఈ భూములకు విలువ పెరగడంతో వాటిపై రాబందుల కళ్లు పడ్డాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ల్యాండ్ మాఫియా జోక్యం కూడా కనిపిస్తోంది. ఈ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తుదివి. ఎలాంటి జోక్యాలు అనుమతించబోం. ఇక ముందు ఈ వ్యవహారంలో ఎలాంటి పిటిషన్ లను అనుమతించబోం. అలాగే కింది కోర్టులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు.’’ అని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. హక్కులన్నీ ప్రభుత్వానికే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలోని 142.39 ఎకరాల భూయాజమాన్య హక్కులు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజా ఆదేశాలతో 1994 నుంచి కొనసాగుతున్న భూవివాదానికి ముగింపు పలికినట్టయింది. ఈ భూములపై కిందిస్థాయి కోర్టులు, హైకోర్టు ఎలాంటి జోక్యం చేసుకునే అధికారం లేదని, ఇప్పుడు ఇచ్చిన తీర్పే తుదితీర్పు అని ఆదేశాల్లో పేర్కొంది. సదరు భూమి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని, తదుపరి కేటాయింపులపై దాని యాజమాన్య, స్వాధీన హక్కులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయాలని చెప్పింది. బాబు బ్యాచ్ లో మహా ముదుర్లు చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో ఆయన వెంట బాగా దగ్గరగా నడిచిన వాళ్లలో, లేదా చంద్రబాబుతో కలిసి రకరకాల వ్యవహారాలు నడిపిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. మార్గదర్శి స్కాంలో బాబు ఫ్రెండ్ రామోజీరావు, అవినీతి కేసులో బాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్, ఓటుకు కోట్లు కేసులో బాబు అనుచరుడు రేవంత్ రెడ్డి, అమరావతి రాజధాని కేసులో పార్టీ నేతల్లో చాలా మంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా దూరం వెళ్తుంది. -
‘కొత్తగూడెం’ తీర్పుపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వా లని కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నామని, దీని కోసం స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘జలగం వెంకట్రావు ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు నాకు అనుకూలంగా తీర్పునిస్తే.. అప్పుడు నాకు అన్యాయం జరిగినట్లు అవుతుంది. ఎన్నికైన నాటి నుంచి శాసనసభ్యుడిగా సేవలందిస్తున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తీర్పును సవాల్ చేసే వరకు అమలుపై స్టే ఇవ్వాలి. ఈ ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ కోర్టు ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ ఇంకా అందలేదు.. దీంతో అప్పీల్‌కు సమయం పట్టే అవకాశం ఉంది.అప్పీల్ చేసే వరకు చట్టప్రకారం 30 రోజుల పాటు తీర్పును నిలిపివేయాలి. సర్టిఫైడ్ కాపీ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి బుధవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేయనున్నామని, అప్పటివరకు స్టే ఇవ్వాలని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. స్టే ఇవ్వడంతో మీకు వచ్చే ఇబ్బంది ఏమిటని జలగం తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దాదాపు మరో 4 నెలల కాలం మాత్రమే ఉందని, ఇప్పుడు బాధ్యతలు చేపట్టకపోతే ఆ కొద్ది నెలల కాలం కాస్త పూర్తయ్యే అవకాశం ఉందని న్యాయవాది బదులిచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని.. 2018, డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..!
వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌కు మరో ఆభరణం లభించినట్లయిందా? ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప ఎంపీగా ఉన్న సమయంలో సొంతంగా పార్టీ పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిసి ఆయనపై పెట్టిన కేసులలోని డొల్లతనం ఒక్కొక్కటి బయటపడుతోంది. ఆ కేసులను న్యాయస్థానాలు కొట్టివేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఒకరకంగా సంచలనంగా ఉన్నాయని చెప్పాలి. వాన్ పిక్ ప్రాజెక్టు ఆస్తులను జప్తు చేస్తున్న రోజులలోనే, ఈ కంపెనీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్ కేసులలో ఇరికించి అరెస్టు చేసినప్పుడే ఇది చాలా అన్యాయమని నేను అభిప్రాయపడ్డారు. పలు ఆర్టికల్స్ కూడా రాశాను. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినందుకు వాన్ పిక్కు భూములు కేటాయించారంటూ సీబీఐ పెట్టిన కేసు ఎంత అధ్వాన్నమైనదో ఇప్పుడు రుజువు అయింది. ఎక్కడైనా పరిశ్రమలు పెడతామని రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేస్తే అరెస్టు చేయాలి కాని, పరిశ్రమల స్థాపనకు భూములు సేకరించిన కంపెనీపైన, ఆ కంపెనీ చైర్మన్ పైన కేసు పెట్టడం ఏమిటా అన్న బాధ కలిగేది. కాని మన దేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో బ్యాంకులకు రుణాలు ఎగవేసినవారు హాపీగా కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల సరసన ఉండగలుగుతున్నారు. వాన్‌పిక్ ప్రాజెక్టు కనుక అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే, ఈ రోజున ఏపీకి పెద్ద ఆభరణం లభించినట్లయ్యేది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చీరాల, రేపల్లె ప్రాంతంలో బారీ ఎత్తున పవర్ ప్రాజెక్టులు, ఇతర ఓడరేవు ఆధారిత పరిశ్రమలు స్థాపించడానికి గాను వాన్ పిక్ సంస్థకు సుమారు 13 వేల ఎకరాల భూములను కేటాయించారు. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ అస్సైన్డ్ భూములుఉన్నాయి. అస్సైన్డ్ లబ్దిదారులు ఎవరికైనా తమ భూమిని అమ్ముకున్నా, ఆ కొనుగోలుదారులతో పాటు, ఒరిజినల్ యజమానులకు కూడా నిర్దిష్ట పరిహారం చెల్లించి అందరిని సంతృప్తిపరిచి భూములు సేకరించారు. అవి కూడా సేద్యానికి పనికిరాని భూములే అత్యధికం. కాని జగన్ మీద అక్కసుతో సీబిఐ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టి పారిశ్రామికవేత్తలను అరెస్టు చేసింది. సిబిఐకి తోడు ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా అదే ప్రకారం ఆస్తులను జప్తు చేసింది. ఇదంతా దశాబ్దం క్రితం జరిగింది. అప్పటి నుంచి ఆ భూములన్నీ వృధాగా పడి ఉన్నాయి. రావల్సిన పరిశ్రమలు రాకుండా పోయాయి. ఈ రకంగా ఏపీకి సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు, సిబిఐ ఆనాటి జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తీరని అన్యాయం చేశారు. పరిశ్రమలు రాకుండా చేశారు. చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని.. అదే కనుక అప్పుడే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా ఉంటే, ఈ పాటికి అక్కడ అభివృద్ది జరిగి ఉండేది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రాజెక్టు ఏపీకి పెద్ద ఆస్తిగా మారి ఉండేది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చి ఉండేవి. చిత్రం ఏమిటంటే పరిశ్రమలు పెట్టిన జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, ఆనాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ వంటివారు జైళ్లలో మగ్గవలసి వచ్చింది. పరిశ్రమలు పెట్టకుండా వేల కోట్లు ఎగవేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సుజన చౌదరి, లగడపాటి రాజగోపాల్, టి.సుబ్బరామిరెడ్డి , రాయపాటి సాంబశివరావు.. ఇలా టీడీపీ,కాంగ్రెస్, బీజేపీలో చేరిన కొందరు టీడీపీ నేతలకు రాజభోగాలు అనుభవించగలుగుతున్నారు. ఆ రోజుల్లో ఈడి జప్తు చేసిన ఈ భూమి విలువను సుమారు నలభై మూడు వేల కోట్లుగా లెక్కగట్టారు. ఈ ఆస్తి అంతా జగన్ దేనని చంద్రబాబు, టీడీపీ నేతలు, తప్పుడు ప్రచారం చేశారు. వైఎస్ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును చేపట్టినప్పుడు భూ సేకరణకు కూడా టీడీపీ అడ్డుపడింది. అయినా వైఎస్ ముందుకు వెళ్లారు. ఆయన ఆకస్మిక మరణం మొత్తం రాష్ట్రానికి తీరని నష్టం చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో సోనియా, చంద్రబాబు ఏకమవడం, సిబిఐ లక్ష్మీనారాయణను అడ్డు పెట్టుకుని కేసులు నడిపించడం వంటివి చేశారని పలు విమర్శలు వచ్చేవి. ఈనాడు రామోజీరావు వంటివారు పలు తప్పుడు కథనాలు ఇచ్చి ప్రజలను తప్పుదారి పట్టించడం నిత్య కృత్యంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి కనువిప్పు అవుతుంది. దేశానికి ఇలాంటి ప్రాజెక్టులు ఎంత అవసరమో ఆ గౌరవ న్యాయ స్థానం గుర్తించినట్లయింది. కింది కోర్టు మైండ్ అప్లై చేయకుండా యాంత్రికంగా ఆస్తుల జప్తును సమర్ధించిందని అభిప్రాయపడింది. మొత్తం ఈడి చార్జీషీట్‌ను తప్పుపట్టింది. ఇది ఏపీకి శుభకరమైన విషయం అని చెప్పాలి. తీర ప్రాంతంపై బాగా దృష్టి పెట్టి అభివృద్ది చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఈ తీర్పును అవకాశంగా తీసుకుని నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఎంకరేజ్ చేసి ఇప్పటికైనా ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చేలా చేయగలగాలి. చదవండి: ‘వాన్‌పిక్’ ఆస్తుల అటాచ్మెంట్ చెల్లదు నిజానికి నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రాజెక్టు టేకప్ చేయకుండా ఉంటే జైలుకు వెళ్లవలసి వచ్చేదికాదు. విదేశాలలో సైతం ఇబ్బంది పడవలసి వచ్చేదికాదు. కేవలం సీబిఐ,ఈడీ వంటి సంస్థల నిర్వాకం వల్ల ఇలా జరిగింది. వీటన్నిటిని మనసులో పెట్టుకుని ప్రాజెక్టును వదలివేయకుండా నిమ్మగడ్డ దీనిని ముందుకు తీసుకువెళితే బాగుంటుంది. రాష్ట్రాభివృద్దికి అడ్డుపడిన తెలుగుదేశం, కాంగ్రెస్ వంటి పార్టీలు పైకి మాత్రం అభివృద్ది కాముకులుగా పిక్చర్ ఇస్తుంటాయి. కాని లోపల మాత్రం ఇలాంటి కుట్రలు పన్ని ఏపీ అభివృద్దికి విఘాతం కలిగించాయి. నలభై మూడువేల కోట్ల అక్రమాలు జరిగాయని ఇంత కాలం ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన వాదన తప్పని అంగీకరిస్తారా? లేక కొత్తగా ఏదో ఒక దిక్కుమాలిన ప్రచారం చేస్తారా? అన్నది చూడాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఫలించిన మూడు దశాబ్దాల న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో స్వామి హథీరాంజీ మఠానికి చెందిన 25.36 ఎకరాలపై రక్షిత కౌలుదారులు మూడు దశాబ్దాలుగా చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. ఈ కేసులు పెండింగ్‌లో ఉండగానే తల్లిదండ్రులు మరణించడంతో వారి పిల్లలు చట్టబద్ధ వారసులుగా న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. ఫలితం అందుకున్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటున్న రక్షిత కౌలుదారులకే విక్రయించేందుకు మఠం సంరక్షకునికి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1990లో జారీ చేసిన జీవో 751ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చి న తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. వేలంలో కాకుండా, మఠానికి పూర్తిస్థాయి సంరక్షకుడు లేకుండా భూములను విక్రయించడానికి వీల్లేదన్న సింగిల్ జడ్జి తీర్పును ధర్మాసనం తప్పుపట్టింది. ఆ భూముల విక్రయం ప్రతిపాదనను మఠాధిపతి సర్జుదాస్ 1979లోనే తీసుకొచ్చారని గుర్తు చేసింది. 1957 నుంచి ఆ భూములు రక్షిత కౌలుదారుల సాగులోనే ఉన్నాయని, వాటిని వారి నుంచి స్వాదీనం చేసుకోవడం న్యాయపరంగా చాలా కష్టమని భావించడం, వివాదాలకు ఆస్కారం ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆ భూములను వారికే విక్రయించడం మేలని మఠం సంరక్షకుడు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇదీ నేపథ్యం: హథీరాంజీ మఠానికి తిరుపతిలోని సర్వే నంబర్లు 51/1, 54/2లో ఉన్న 25.36 ఎకరాలను ఎం.చెంగమ్మ, టి.మునుస్వామి నాయుడు 1957 నుంచి రక్షిత కౌలుదారులుగా సాగు చేస్తున్నారు. ఆ తరువాత వారికి మఠం మహంత్ శాశ్వత లీజు మంజూరు చేశారు. మహంత్ మరణం తరువాత 1966లో ఆ లీజు రద్దయింది. అయినా వారు లీజు డీడ్ల ద్వారా కొనసాగుతున్నారు. 1980లో అప్పటి మహంత్ సస్పెండ్ అయ్యారు. మఠానికి సంరక్షకుడు నియమితులయ్యారు. అనంతరం ఆ భూమిని కౌలుదారులకే విక్రయించాలని మఠం నిర్ణయించింది. దీనిపై వి.నాగమణి, డి.కుప్పుస్వామి నాయుడు మరికొందరు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఈ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ రక్షిత కౌలుదారులకే భూమిని విక్రయించేందుకు అనుమతిస్తూ 1990లో జీవో 751 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ నాగమణి తదితరులు హైకోర్టులో అదే ఏడాది పిటిషన్ వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. జీవో 751ని రద్దు చేస్తూ 2002లో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చెంగమ్మ తదితరులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అనంతరం చెంగమ్మ, ఆమె భర్త వెంకట్రామనాయుడు మరణించడంతో వారి పిల్లలు ఈ వ్యాజ్యంలో చట్టబద్ధ వారసులుగా చేరారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తుది విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చింది.