
కనికరంలేని గ్రామ తీర్పు..
వివరాలు.. తాలూకాలోని హంపాపుర గ్రామానికి చెందిన దివ్యాంగుడు సణ్ణస్వామి.. అదే గ్రామంలో ఉంటున్న తన బంధువుల ఇంటి సమీపంలోనున్న కొబ్బరి చెట్టును తొలగించడానికి ప్రయత్నించాడు. దీనికి గ్రామపెద్ద సిద్ధనాయక అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో సణ్ణస్వామిని గ్రామం నుంచి బహిష్కరిస్తూ సిద్ధనాయక తీర్పు చెప్పాడు. గ్రామ బహిష్కరణ విధించడంతో సణ్ణస్వామికి గ్రామంలో హోటల్, రేషన్, కటింగ్‌సెలూన్‌లోకి కూడా రానివ్వడంలేదు. తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు హంపాపుర పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు.