Expulsion
-
మహువా మెయిత్రా పిటిషన్‌పై సుప్రీంలో నేడు విచారణ
ఢీల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. క్యాష్ ఫర్ క్వారీ ఆరోపణలతో తన ఎంపీ సభ్యత్వం రద్దును సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేశారు. కేంద్రంపై విమర్శలు చేయడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పందం చేసుకున్నట్లు మెయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. కేంద్రం, అదానీ సంస్థలపై విమర్శలు చేయడానికి టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మొదటిసారి పార్లమెంట్లో ఈ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో పెద్ద చర్చే జరిగింది. ఈ అంశం చివరికి ఎథిక్స్ కమిటీకి చేరింది. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడగడానికి మహువా అనైతిక చర్యకు పాల్పడినట్లు ఎథిక్స్ కమిటీ నిర్దారిచింది. మెయిత్రా తన లోక్‌సభ పోర్టల్ లాగిన్ వివరాలను వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో పంచుకున్నట్లు ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఈ 'క్యాష్-ఫర్-క్వారీ' కుంభకోణంలో ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ నివేదిక సిఫార్సు చేసింది. దీంతో డిసెంబర్ 8న ఆమె తన ఎంపీ పదవిని రద్దు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆమె మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. ఎథిక్స్ కమిటీ తన వాదనను వినిపించుకోలేదని మహువా ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఎంపీ పదవి రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసు సూత్రధారి లలిత్ ఝా అరెస్టు -
మహువా మెయిత్రాపై వేటు.. లోక్‌సభ నుంచి బహిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు పడింది. లోక్ సభ నుంచి ఆమెను బహిష్కరించినట్లు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ఎంపీ మహువా మొయిత్రా ప్రవర్తన అనైతికమని, అసభ్యకరంగా ఉందని ఎథిక్స్‌కమిటీ చేసిన తీర్మానాలను లోక్ సభ అంగీకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఎంపీగా కొనసాగడం తగదని.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ పేర్కొన్నారు. #WATCH | Cash for query matter | TMC's Mahua Moitra expelled as a Member of the Lok Sabha; House adjourned till 11th December. Speaker Om Birla says, "...This House accepts the conclusions of the Committee that MP Mahua Moitra's conduct was immoral and indecent as an MP. So, it… pic.twitter.com/mUTKqPVQsG — ANI (@ANI) December 8, 2023 ఇక, టీఎంసీ ఎంపీగా మహువా మోయిత్రాను బహిష్కరించాలని లోక్‌సభ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేసి పార్లమెంట్ బయటకు వచ్చారు. #WATCH | Opposition MPs in Parliament premises after they stage walkout following Lok Sabha adopting motion to expel Mahua Moitra as TMC MP pic.twitter.com/5RJ9kaFWPN — ANI (@ANI) December 8, 2023 ప్రతిపక్షాలను కూల్చే ఆయుధం లోక్‌సభలో ఎంపీగా బహిష్కరణకు గురైన టీఎంసీ నాయకురాలు మహువా మెయిత్రా ఎథిక్స్ కమిటీపై విమర్శలు గుప్పించారు. ఎథిక్స్ కమిటీ నివేదిక సరైంది కాదని అన్నారు. ఎథిక్స్ కమిటీ ప్రతిపక్షాన్ని కూల్చడానికి ఒక ఆయూధంగా మారిందని మండిపడ్డారు. ఎథిక్స్ కమిటీ నియమ, నిబంధనలు అన్నీ ఉల్లంఘించి నివేదిక సమర్చిందని దుయ్యబట్టారు. "Ethics Committee another weapon to crush opposition," says Moitra soon after expulsion from Lok Sabha Read @ANI | https://t.co/jb6uvpSikT#MahuaMoitra #LokSabha #Parliament pic.twitter.com/be6Cm5dF8H — ANI Digital (@ani_digital) December 8, 2023 చదవండి: ఎంపీ మహువాపై లోక్‌సభ నిర్ణయం అదేనా..! -
ఎంపీ మహువాపై లోక్‌సభ నిర్ణయం అదేనా..!
న్యూఢిల్లీ : పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో ఎంపీ మహువా మెయిత్రాపై నివేదికను ఎథిక్స్‌కమిటీ ఇవాళ లోక్‌సభ ముందు ప్రవేశపెట్టనుంది. వినోద్‌కుమార్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ మహువా మొయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తూ సిఫారసు చేసిన నివేదికను ఇప్పటికే ఆమోదించింది. మహువాపై ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభ ముందు ప్రవేశపెట్టేందుకు శుక్రవారం(డిసెంబర్ 8) లిస్ట్ చేశారు. ఎజెండాలో ఐటెమ్ నంబర్ ఏడుగా దీనిని చేర్చారు. నివేదికను సభ ఆమోదిస్తే మహువా తన ఎంపీ పదవిని కోల్పోతారు. ఈ నెల 4వ తేదీనే మహువాపై నివేదికను టేబుల్ చేసేందుకు లిస్ట్ చేసినప్పటికీ దానిని ప్రవేశపెట్టలేదు. అయితే మహువాపై నివేదికపై సభలో చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. చర్చ లేకుండా చర్యలు తీసుకోవడం సరికాదని సూచిస్తున్నాయి. ఈ నివేదిక మ్యాచ్ ఫిక్సింగ్‌లా కనిపిస్తోందని ఆ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని ఆదేశాల మేరకే అదానీ గ్రూపుపై ప్రశ్నలు వేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు మహువాపై ఫిర్యాదు చేశారు. అనంతరం స్పీకర్ ఈ వ్యవహరాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. ఎథిక్స్ కమిటీ ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదికను సిద్ధం చేసింది. ఈ విచారణలో భాగంగా ఎథిక్స్ కమిటీ ముందు మహువా హాజరయ్యారు. ఇదీచదవండి..2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలు -
మహువా మొయిత్రా వివాదం: తొలిసారి మౌనం వీడిన మమత
కోలకతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుండి బహిష్కరణ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారి స్పందించారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై ఎట్టకేలకు మౌనం వీడిన దీదీ ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర అని బీజేపీపై మండి పడ్డారు. అయితే ఇది వచ్చే ఏడాది (2024) ఎన్నికల ముందు మహువాకే సాయం చేస్తుందని వ్యాఖ్యానించారు. గురువారం కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో టీఎంసీ చీఫ్ మమత, మహువా మొయిత్రాకు మద్దతుగా నిలిచారు. వివిధ కేసులలో తమ పార్టీ నాయకులను అరెస్టు చేసిన తర్వాత, లోక్‌సభ నుంచి మొయిత్రాను బహిష్కరించే అవకాశం ఉందని, మొయిత్రాను లోక్‌సభ నుంచి తప్పించాలనేదే బీజేపీ ప్లాన్ అని, అయితే ఈ కుట్రలు మహువా మరింత పాపులర్ కావడానికి దోహద పడతాయని పేర్కొన్నారు. ఇపుడామె బయట మాట్లాడగలుతున్నారన్నారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని,కేవలం మూడు నెలలు మాత్రమే మోదీ సర్కార్ ఉంటుందన్నారు. అంతేకాదు ప్రత్యర్థి నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్నికల తరువాత బీజేపీని వెంటాడుతాయంటూ జోస్యం చెప్పారు. కాగా పార్లమెంటులో ప్రశ్నలడగటానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు పెను దుమారాన్ని రాజేశాయి. దీనిపై బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ అధ్యక్షతన ఏర్పాటైన 15 మంది సభ్యుల ఎథిక్స్ కమిటీ మహువాను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని సిఫారసు చేసింది. Kolkata | West Bengal CM Mamata Banerjee says "Their (BJP) plan is to remove Mahua Moitra (from Lok Sabha). This will help her become more popular before the elections. What she used to speak inside (Parliament), now she will speak outside..." pic.twitter.com/V10seOqprj — ANI (@ANI) November 23, 2023 -
Mahua Moitra: కష్టాల్లో ఫైర్ బ్రాండ్
తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టినవారికి గుర్తింపు రావటం అంత సులభం కాదు. ప్రసంగించే అవకాశం లభించటం, దాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా అరుదు. మహిళా ఎంపీల విషయంలో దాదాపు అసాధ్యం. కానీ రాజకీయ రంగప్రవేశం చేసిన కొద్దికాలంలోనే తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికై లోక్‌సభలో ప్రవేశించిన మహువా మొయిత్రా చాలా త్వరగానే ‘వార్తల్లో వ్యక్తి’ అయ్యారు. తీరా నాలుగేళ్లయ్యే సరికల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఏం జరిగిందో అందరూ గ్రహించే లోగానే ఉరుము లేని పిడుగులా, ఊహించని ఉత్పాతంలా వచ్చిపడిన వివాదం చివరికామె పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరుపెట్టేలా పరిణమించింది. సభ్యుల నైతిక వర్తనను నియంత్రించే లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమెను సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌ను కోరుతూ గురువారం నివేదికను ఆమోదించింది. ఇందుకు ప్రధానంగా అనైతిక వర్తన, తీవ్ర తప్పిదాలకు పాల్పడటం కారణాలుగా చూపింది. అంతేకాదు... ఈ విషయంలో సంస్థాగత విచారణ, చట్టపరంగా గట్టి చర్యలు అవసరమని సిఫార్సు చేసింది. పార్లమెంటు సభ్యులు సభలో ప్రశ్నలు వేయటానికి వినియోగించే ఎన్ఐసీ వెబ్సైట్ లాగిన్, పాస్వర్డ్ ఆమె తన స్నేహితుడైన దుబాయ్ రియలెస్టేట్ వ్యాపారి దర్శన్ హీరానందానీకి ఇచ్చారనీ, ఆయన నుంచి కోటి రూపాయల ముడుపులు తీసుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ సంస్థలపై ప్రశ్నలు సంధించారనీ మొయిత్రాపై వచ్చిన ఆరోపణలు. ఆ ప్రశ్నలు అదానీ సంస్థల ప్రయోజనాలు దెబ్బతీసేంత తీవ్రమైనవా? అందువల్ల హీరానందానీకి ఒరిగేదేమిటి? ముడుపుల సంగతిని మొయిత్రా తోసి పుచ్చారు. లాగిన్, పాస్వర్డ్ ఇచ్చినట్టు అంగీకరించారు. అందుకుగల కారణాలు చెప్పారు. ఇదంతా దేశభద్రతకు ముప్పు తెచ్చే చర్య అనీ, లంచం తీసుకుని ప్రశ్నలేయటం అనైతికమనీ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గత నెలలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. కమిటీ విచారణ తీరుతెన్నులను ప్రశ్నిస్తూ ఇప్పటికే మొయిత్రా ఓం బిర్లాకు లేఖ రాశారు. కమిటీ తనను ప్రశ్నించిన తీరు ‘వస్త్రాపహరణం’ మాదిరిగా వున్నదంటూ దుయ్యబట్టారు. మొయిత్రా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వలె ఆంగ్ల భాషాప్రావీణ్యం వుండటం వల్లనే త్వరగా ఆమెకు పేరుప్రతిష్టలు సాధ్యమైనాయని అనుకోవటానికి లేదు. ప్రసంగించదల్చుకున్న అంశంపై పట్టు సంపాదించటం ఒక్కటే మొయిత్రా ప్రత్యేకతని చెప్పడానికి కూడా లేదు. విషయ పరిజ్ఞానంతోపాటు విస్ఫులింగాలు విరజిమ్మే స్వభావం, నిర్భీతిగా పాలక పక్షాన్ని నిలదీసే తత్వం ఆమెకొక విశిష్టతను తీసుకొచ్చాయి. అంతకుముందు మూడేళ్లు ఆమె తృణమూల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ మొయిత్రా గురించి దేశానికంతకూ తెలిసింది ఈ నాలుగేళ్ల కాలంలోనే. సభలోనే కాదు... వెలుపల కూడా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిప్పులు చిమ్ముతారు. మూకుమ్మడి అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షపడిన గుజరాత్ దోషులకు క్షమాభిక్ష పెట్టడాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎథిక్స్ కమిటీ విచారణలో నిర్ధారించిన అంశాలేమిటో, అవి ఏరకంగా తీవ్రమైన స్వభావంతో కూడుకున్నవో ఇంకా తెలియాల్సి వుంది. ఎన్ఐసీ లాగిన్, పాస్వర్డ్ ఇవ్వటం విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిబంధనలూ లేవు. అయినా సరైంది కాదనుకుంటే ఆమెను మందలించవచ్చు. కమిటీలోని విపక్ష సభ్యులు చెబుతున్న ప్రకారం 800 మంది ఎంపీల్లో అనేకులు సగటున కనీసం ఇద్దరు ముగ్గురికి ఇలా ఇస్తారు. కంప్యూ టర్ల వాడకం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం ఇందుకు కారణం. ఈ విషయంలో స్పీకర్ ఏం నిర్ణయిస్తారన్నది చూడాలి. ఆ సంగతలా వుంచితే ఫిర్యాదు, విచారణ వగైరాలన్నీ ఆదరా బాదరాగా సాగినట్టు కనబడుతోంది. అక్టోబర్ 26న కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ నెల 2న జరిగిన రెండో సమావేశం మధ్యలోనే ముగిసింది. అడిగినవాటికి జవాబివ్వకుండా ఆమె దుర్భాషలాడారని కమిటీ ఛైర్మన్ వినోద్ కుమార్ సోంకార్ ఆరోపిస్తే... ఫిర్యాదుతో సంబంధం లేని ప్రశ్నలతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వేధించారన్నది మొయిత్రా ఆరోపణ. దుబాయ్ వెళ్తే ఏ హోటల్లో దిగుతారు... మీతో ఎవరుంటారు... మీరు మీ మిత్రులతో మాట్లాడుతున్నట్టు వారి భార్యలకు తెలుసా అని అడిగారని కూడా ఆమె ఆరోపించారు. దీనికి నిరసనగా ఆమె, విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కమిటీ విచారణ గోప్యం కనుక ఆరోపణలు, ప్రత్యారోపణల్లో నిజానిజాలేమిటో తెలియదు. అయితే ఈ మొత్తం వ్యవహారం మన పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందన్నది మాత్రం వాస్తవం. అసలు దూబే ఫిర్యాదుకు మొయిత్రా మాజీ సహచరుడు దేహద్రాయ్ లేఖ ఆధారమన్న సంగతి కమిటీకి తెలుసా? కమిటీకిచ్చిన అఫిడవిట్లో మొయిత్రాకు ముడుపులు చెల్లించానని హీరానందానీ అంగీకరించారా? లేదని విపక్ష సభ్యులు చెబుతున్నారు. విడిపోయిన జంట పరస్పరం ఆరోపించుకోవటం సర్వసాధారణం. ఇప్పటికే పెంపుడు కుక్క విషయంలో వారిద్దరూ కేసులు పెట్టుకున్నారు. కనుక దేహద్రాయ్ ఫిర్యాదు అంశంలో దూబే, ఎథిక్స్ కమిటీ ఆచితూచి అడుగు లేయాల్సింది. మహిళ గనుకే ఇలా చేశారన్న అపవాదు రానీయకుండా చూసుకోవాల్సింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగతం, రాజకీయం కలగాపులగం చేశారన్న అప్రదిష్ట కలగడమూ మంచిది కాదు. ఏదేమైనా వ్యవస్థను ఢీకొట్టేవారు నిరంతరం అత్యంత జాగురూకతతో మెలగాలని మొయిత్రా ఇప్పటికే గుర్తించి వుంటారు. ఈ వివాదంలో పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యానికి అనుగుణమైన నిర్ణయం వెలువడాలని అందరూ కోరుకుంటారు. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
రూ. లక్షల్లో జరిమానాలు.. మితిమీరుతున్న వీడీసీల ఆగడాలు..
జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)ల ఆగడాలు రోజు రోజుకూ శృతి మింపోతున్నాయి. సమాజం ఒకవైపు సాంకేతికంగా పరుగులు పెడుతుంటే మరో వైపు వీడీసీల పనితీరు ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోంది. గ్రామాభివృద్ధికి ఏర్పడిన కమిటీలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. కానీ ఇవి గ్రామాల్లో సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి. మితిమీరుతున్న వీడీసీల ఆగడాలు మాట వినకుంటే బహిష్కరణ పంచాయతీ తీర్పుల్లో రూ. లక్షల్లో జరిమానాలు రాజకీయ ఒత్తిళ్లతో మిన్నకుండిపోతున్న అధికారులు ఖలీల్‌వాడి: గ్రామాల్లో చిన్న, పెద్ద పంచాయతీలు వీడీసీ వద్దకు చేరితే మాట వినని వారిని బహిష్కరణ వేటు తప్పదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వీడీసీల్లో తలదూర్చని పరిస్థితి ఉంది. దీంతో పంచాయతీలో వీడీసీలు పెదరాయుళ్లు తీర్పులు ఇస్తారు. చిన్నతప్పు జరిగినా ర. లక్షల్లో జరివనాలు విధిస్తారు. వినకపోతే సాంఘిక బహిష్కరణే. అక్కడ వీరు చెప్పిందే చట్టం చేసిందే న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మర్, బాల్కొండ, నిజామాబాద్ రరల్ నియోజకవర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. కోడిగుడ్డు నుంచి బెల్ట్‌షాపు వరకు.. గ్రామంలో గ్రామాభివృద్ధి కోసం వీడీసీలు కోడిగుడ్డు నుంచి బెల్ట్‌షాప్‌లకు టెండర్లు నిర్వహిస్తారు. గ్రామంలో వేలం పాటను నిర్వహిస్తాయి. కోడిగుడ్డు నుంచి కూల్‌డ్రింక్స్‌ను గ్రామంలో వేలంపాటలో దక్కించుకున్న వారే అమ్మాలి. ఇతరులు అమ్మితే వారికి జరిమనా వేస్తారు. కోడిగుడ్లు, కూల్డింక్స్ను మార్కెట్ రేటు కంటే అదనంగా డబ్బులు అమ్మకాలు చేస్తారు. బెల్ట్‌షాపుల వేలం దక్కించుకున్నవారు దాని రేటు కంటే రూ.10 నుంచి 50 వరకు ధరలను పెంచి అమ్ముతారు. వీడీసీకి ప్రజాప్రతినిధులు దాసోహం.. మంలో వీడీసీ వ్యతిరేకించిన ప్రజాప్రతినిధులను బహిష్కరించిన ఘటనలు ఉన్నాయి. ఆర్మర్ మండలంలోని పెర్కిట్ వీడీసీ అప్పటి ఆర్మర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ను బహిష్కరించారు. వీడీసీలు ఇచ్చిన తీర్పుకు బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లవద్దు, న్యాయస్థానాలు ఆశ్రయించవద్దు. ఇలాంటి అనేక ఆంక్షలు పెట్డడంతో పెత్తనం పెరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు వీడీసీలకు దూరంగా ఉంటేనే తమ పనులను చక్కబెట్టుకుంటారు. వీడీసీ అగడాలను పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. 1970లోనే ఏర్పాటు.. జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీలు 1970లో ఏర్పడ్డాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయలు కల్పించుకోవడానికి వీడీసీలు అప్పట్లో ఏర్పడ్డాయి. కుళాయి, బోరు నీటి కోసం, మురికి కాలువలు, రోడ్లు, వీధిదీపాలు పెట్టించటం ఇలా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీడీసీలు పనిచేసేవి. వీడీసీలు గ్రామంలో ప్రతి ఇంటికి కొంత డబ్బులు కలెక్ట్ చేసి వాటితో గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించేవారు. కాని రానురానూ అవి పూర్తిగా మారిపోయాయి. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో వీడీసీలో క్యాషియర్ పోస్టు కోసం రెండు గ్రూపులుగా చీలిపోయి. రెండు వర్గాల మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతనే ఉన్నాయి. ఈ గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారు 8 మంది సభ్యులు, ఇతర కులాలకు చెందిన 10 మంది సభ్యులు వీడీసీలో ఉంటారు. క్యాషియర్ పదవీ విషయంలో విభేదాలు రావడంతో వీడీసీ రెండుగా చీలింది. ఎవరికి వారు దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి సొంత మండలమైన వేల్పర్లోని రామన్నపేట్లో వీడీసీ ఆగడాలు మితిమీరిపోయాయి. రాత్రి వేళల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేయడంతో పొలాలకు వెళ్లే వారికి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రశ్నింనందుకు ఓ కులానికి చెందిన 300 కుటుంబాలను బహిష్కరించారు. వీడీసీ ఆదేశాల మేరకు గ్రామంలో ఈ కులస్తులకు కిరాణ సామానుతో పాటు హోటల్లో టీ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఒక వర్గంపై మరో వర్గం రాళ్లదాడి కూడా చేసుకున్నాయి. రెండు వర్గాలను పిలి అధికారులు, పోలీసు లు సమస్యను పరిష్కరించారు. ఇప్పటికి సమస్య కొలిక్కి వచ్చింది. సిరికొండలోని గడ్కోల్‌లో న్నపిల్లల మధ్య గొడవ కాస్త ఓ కుటుంబం బహిష్కరణకు దారి తీసింది. చిన్నారుల గొడవ కారణంగా ఇద్దరి మహిళల మధ్య వాగ్వాదం జరిగి వారు మొదట సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయగా తగాదా కోర్టుకు చేరింది. కోర్టులో ఓ మహిళ కుటుంబానికి న్యాయస్థానం ఫైన్ వేయగా వారు కట్టేశారు. అయితే కుల సంఘంలోకి సదరు మహిళ కుటుంబం రావాలంటే ఆల్ కమిటీ(వీడీసీ)కి ర. లక్ష చెల్లించాలని తీర్మానించారు. కోర్టుకు వెళ్లి జరివనా కట్టామని మళ్లీ మీకు ఎందుకు కట్టాలని వారు ఆల్ కమిటీ(వీడీసీ)ని ప్రశ్నించారు. దీంతో ఈ కుటుంబాన్ని ఇప్పటివరకు కులసంఫనికి సంబంధించిన ఏ కార్యక్రవన ఏ కార్యక్రమాలకు పిలవట్లేదు. మాట్లాడట్లేదు. వరికి ఆల్‌కమిటీ(వీడీసీ) చేసిన నిర్వాకంపై శుక్రవారం బాధిత కుటుంబం ఏసీపీ కిరణ్‌కుమార్‌ను ఆశ్రయించింది. -
పిల్లల గొడవ.. కుటుంబ బహిష్కరణకు దారి తీసింది..
సిరికొండలోని గడ్కోల్‌లో చిన్నపిల్లల మధ్య గొడవ కాస్త ఓ కుటుంబం బహిష్కరణకు దారి తీసింది. చిన్నారుల గొడవ కారణంగా ఇద్దరి మహిళల మధ్య వాగ్వాదం జరిగి వారు మొదట సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయగా తగాదా కోర్టుకు చేరింది. కోర్టులో ఓ మహిళ కుటుంబానికి న్యాయస్థానం ఫైన్ వేయగా వారు కట్టేశారు. అయితే కుల సంఘంలోకి సదరు మహిళ కుటుంబం రావాలంటే ఆల్ కమిటీ(వీడీసీ)కి రూ. లక్ష చెల్లించాలని తీర్మానించారు. కోర్టుకు వెళ్లి జరిమానా కట్టామని మళ్లీ మీకు ఎందుకు కట్టాలని వారు ఆల్ కమిటీ(వీడీసీ)ని ప్రశ్నించారు. దీంతో ఈ కుటుంబాన్ని ఇప్పటివరకు కులసంఘానికి సంబంధించిన ఏ కార్యక్రమాలకు పిలవట్లేదు. మాట్లాడట్లేదు. చివరికి ఆల్‌కమిటీ(వీడీసీ) చేసిన నిర్వాకంపై శుక్రవారం బాధిత కుటుంబం ఏసీపీ కిరణ్‌కుమార్‌ను ఆశ్రయించింది. -
కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు శశిధర్‌రెడ్డిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి శనివారం ప్రకటించారు. శశిధర్‌రెడ్డి ఈ నెల 18న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి ఈ నెల 18న అమిత్ షాతో భేటీ అవడం, శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. శశిధర్‌రెడ్డి వైఖరి పార్టీ రాజ్యాంగ నియమాలకు విరుద్ధమని, ఈ బహిష్కరణ నిర్ణయాన్ని ఆమోదించాలని ఏఐసీసీకి ప్రతిపాదన పంపామని వివరించారు. చదవండి: (కాంగ్రెస్‌కు క్యాన్సర్ సోకింది.. మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు) -
విశాఖ పోలీస్ సంచలన నిర్ణయం.. నగరంలో తొలిసారి..
సాక్షి, దొండపర్తి / మధురవాడ (భీమిలి): నగరంలో నేర నియంత్రణపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టిన పోలీస్ శాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖలో తొలిసారిగా ఒక రౌడీషీటర్‌ను నగరం నుంచి బహిష్కరించి నేరాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టించింది. పీఎం పాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో గూండాయిజం చేస్తున్న రౌడీషీటర్ పెంటకోట కిరణ్(19)ను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ బుధవారం నోటీసులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీకి చెందిన కిరణ్ ఇంటర్ వరకు చదివాడు. వ్యసనాలకు బానిసై శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం ప్రారంభించాడు. పీఎంపాలెం స్టేషన్ పరిధిలో రోబరీ, కిడ్నాప్, కొట్లాట ఇలా అనేక నేరాలకు కిరణ్ పాల్పడ్డాడు. దీంతో అతడిపై ఐపీసీ 297, 324, 425, 364 – ఏ, 342, 323, 384, 120బి, 34తోపాటు 428, 392 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రౌడీషీట్, హిస్టరీ షీట్‌తోపాటు ఎన్నికేసులు ఉన్నప్పటికీ కిరణ్ నిత్యం నేరాలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. అంతేకాకుండా గూండాయిజం చేస్తూ ప్రజలను బెదిరించడంతోపాటు దాడులకు పాల్పడుతున్నాడు. గత 6 నెలలుగా కిరణ్ కదలికలు, కార్యకపాలపై పోలీసులు నిఘా పెట్టారు. అతడి నుంచి ప్రజలకు, వారి ఆస్తులకు ప్రమాదముందని భావించారు. అతడిపై కేసులు పెట్టే వారితోపాటు, సాక్షులను బెదిరిస్తుండడంతో కిరణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ప్రజలు భయపడుతుండడాన్ని గుర్తించారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. పెంటకోట కిరణ్‌ను షరతులతో అక్టోబర్ 31వ తేదీ నుంచి 6 నెలలపాటు విశాఖ కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరిస్తూ నోటీసు అందించారు. రౌడీషీటర్లకు వెన్నులో వణుకు నగరంలో జరుగుతున్న నేరాలు, హత్యలతో పోలీసులు రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవైపు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తున్న, సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టి వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అలాగే నిర్మాణుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో రౌడీయిజం, గుండాయిజం, ఇతర నేరాలకు పాల్పడుతున్న వారిని నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు తొలిసారిగా రౌడీషీటర్‌ను నగరం నుంచి బహిష్కరించి సంచలనం సృష్టించారు. నగరంలో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తూ రౌడీషీటర్ల వెన్నులో వణుకు పుట్టించారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు నగరంలో రౌడీయుజం, గూండాయుజం, నేరాలకు పాల్పడితే సహించేది లేదు. నగర ప్రశాంతతకు, భద్రతకు భంగం కలిగించే వారెవరైనా ఉపేక్షించేది లేదు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విశాఖలో నేర నియంత్రణకు, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – సీహెచ్.శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
ప్రశాంత్ కిషోర్‌పై జేడీయూ వేటు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) విషయంలో పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌ను జనతాదళ్(యూ) బహిష్కరించింది. సీఏఏ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తున్న కిషోర్... ఈ విషయంలో పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారు. నితీశ్ ఈ రెండింటికీ మద్దతివ్వటాన్ని ప్రశాంత్‌తో పాటు జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ విమర్శించారు. ఈ రెండింటికీ వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవ్వాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీనుంచి వారిద్దరినీ బహిష్కరిస్తున్నట్లు జేడీయూ తెలిపింది. ‘వారిద్దరూ సీఎంను అవమానించేలా మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించారు’ అని పార్టీ పేర్కొంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి, పార్టీ పదవుల నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రశాంత్ కిషోర్, పవన్ వర్మలను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. నితీశ్ మళ్లీ సీఎం కావాలి: ప్రశాంత్ బహిష్కరణ ప్రకటన వెలువడిన వెంటనే ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ‘కృతజ్ఞతలు నితీశ్‌జీ. మీరు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించడం వల్లే ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకున్నానని మంగళవారం నితీశ్ చెప్పటంతో ఇద్దరి మధ్యా విభేదాలు తీవ్రమయ్యాయి. దానిపై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహిస్తూ... ‘‘ఎంత దిగజారిపోయారు!!. ఇలాంటి అబద్ధం చెప్పి నన్నూ మీ స్థాయికి లాగుతున్నారా? ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే అమిత్ షా సిఫారసులున్న నన్ను తొలగించే ధైర్యం మీకుంటుందా? దాన్ని ఎవరైనా నమ్ముతారా?’’ అని ప్రశ్నించారు. తృణమూల్‌లో చేరనున్నారా? ప్రశాంత్ త్వరలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని వినిపిస్తోంది. కానీ ఈ వార్తను తృణమూల్ వర్గాలు నిర్ధారించలేదు. భవిష్యత్తులో ఆ అవకాశం లేకపోలేదంటూ... ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ లేదా తమ అధినేత్రి మమత బెనర్జీనే ధ్రువీకరించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ పేర్కొన్నారు. మమత బెనర్జీతో ప్రశాంత్‌కు సంబంధాలున్నాయన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రశాంత్ సేవలను టీఎంసీ ఉపయోగించుకుంటోంది. -
కుల భోజనం పెట్టనందుకు బహిష్కరణ
సాక్షి, నల్లబెల్లి (వరంగల్): కుల సంఘం పెద్దలు చెప్పిన తీర్పుకు కట్టుబడి ఉండకపోవడంతో ఆ కుటుంబాన్ని వెలివేశారు. మండలంలోని శనిగరం గ్రామంలో శనివారం ఇది వెలుగులోకి వచ్చింది. శనిగరం గ్రామానికి చెందిన నీలం సమ్మాలుకు గత మార్చిలో మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం నుంచి టాటా ఎస్ వాహనాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ముదిరాజ్ కుల సంఘం పెద్ద మనుషులు బోయిని రాజు, నీలం సుధాకర్, డ్యాగల రమేష్, నీలం రవి, బోళ్ల రమేష్, దండు శ్రీనులు కుల సంఘానికి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా సమ్మాలు తిరస్కరించాడు. దీంతో కొందరు వ్యక్తులు టాటా ఎస్ వాహనం టైర్లు ఎత్తుకపోయారు. ఈ మేరకు గత మార్చి 29వ తేదీన పోలీసులను ఆశ్రయించగా విచారణ చేశారు. గ్రామంలో మాట్లాడుకుంటామని ఇరువురు అంగీకరిస్తూ పోలీస్ స్టేషన్లోనే రాజీ కుదుర్చుకున్నారు. గ్రామంలో పంచాయతీ చేసిన కుల పెద్దలు సంఘానికి రూ.90 వేలు చెల్లించాలని తీర్మాణించారు. వారి తీర్మాణం మేరకు సమ్మాలు సంఘానికి రూ.90 వేలు చెల్లించారు. అయినా పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కోపంతో ఏప్రిల్ 14వ తేదీన మరో సారి సమ్మాలు కుటుంబాన్ని కుల సంఘం సమావేశానికి పిలిపించి సంఘంలోని సభ్యత్వం రద్దు చేసినందున మళ్లీ కావాలంటే రూ.50 వేలు చెల్లించి, కుల భోజనం పెట్టాలని తీర్పునిచ్చారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు అంగకరించకపోవడంతో పెద్దలు సాంఘిక బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై ఆయన శనివారం తహసీల్దార్‌ను ఆశ్రయించారు. ఇదే విషయమై మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ సబ్సిడీ వాహనాల కోసం చాలా మంది పోటీ పడడంతో సంఘానికి రూ.లక్ష ఇచ్చిన వారి దరఖాస్తునే సబ్సిడీ కోసం పంపించాలని తీర్మాణించామే తప్ప ఎవరి సభ్యత్వాలు రద్దు చేయలేదని తెలిపారు. -
పోలింగ్‌ను బహిష్కరించిన చెక్కి క్యాంప్
బోధన్‌రూరల్(బోధన్): మండలంలోని చెక్కి క్యాంప్ గ్రామాన్ని బోధన్ మున్సిపాలిటీలో వీలినం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ను బహిష్కరించారు. గురువారం మండలంలోని చెక్కి క్యాంప్ గ్రామంలో అధికారులు తెలిపిన ప్రకారం 556 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ కేంద్రం నెంబర్ 45లో ఉదయం 8గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 20మందే ఓటు వేశారు. మిగిలిన ఓటర్లు తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని ఓటింగ్‌లో పాల్గొనకుండా నిరసన తెలిపారు. సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్ పాల్గొనకుండా భీస్మించారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో అధిక శాతం ప్రజలు ఉపాధిహామీ పనుల మీద ఆధారపడ్డారన్నారు. గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా ఉపాధి కోల్పోవడంతో పాటు పన్నుల భారంతో ఇబ్బందులు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను అధికారులు, ప్రభుత్వం గుర్తించి గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయకుండా కొత్త జీపీగా ఏర్పాటు చేయాలని కోరారు. తమకు కచ్చితమైన హామీ లభించేవరకు పోలింగ్‌లో పాల్గొనేది లేదన్నారు. దీంతో సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రానికి ఓటర్లు రాక వెలవెలబోయింది. అనంతరం సాయంత్రం సమయంలో గ్రామస్తులందరు పునారోచన చేసి సమస్య సాధనకు కార్యాచరణ రూపొందించుకుని కలసికట్టుగా పోరాటం చేద్దామని నిర్ణయించుకుని తిరిగి సాయంత్రం 6నుంచి8గంటలవరకు ఓటింగ్‌లో పాల్గొన్నారు.మొత్తం68.52శాతం ఓటింగ్ నమోదైనట్లు పీవో తెలిపారు. అధికారులు పోలింగ్ సమయం పెంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. -
రోడ్డు కోసం ఎన్నికల బహిష్కరణ
చిట్టమూరు: మండల పరిధిలోని బురదగల్లికొత్తపాళెం పంచాయతీ ఓటర్లు గురువారం సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్సీపీ గూడూరు అసెంబ్లీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు చొరవతో ప్రారంభమైంది. తమ పంచాయతీలో గత 40 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడం, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు అధికారులకు తెలిపారు. పంచాయతీలో కొత్తపాళెం గ్రామంలో బూత్ నంబర్ 275లో 1187 ఓట్లు, కుమ్మరిపాళెం బూత్ నంబర్ 276లో 456 ఓట్లు ఉన్నాయి. అధికారులు ఉదయం 7 గంటలకు పోలింగ్ నిర్వహించేందుకు ఈవీఎంలను సిద్ధం చేశారు. అయితే ఓటర్లు ఎవరూ రాకపోవడంతో అక్కడి పోలింగ్ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి గ్రామస్తులతో చర్చించారు. అయితే సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వనిదే తాము ఓట్లు వెయ్యబోమని తేల్చిచెప్పారు. పంచాయతీలోని కొత్తపాళెం, కుమ్మరిపాళెం, బురదగలిల్లి, పేరపాటితిప్ప గ్రామాల ప్రజలు రాజకీయాలకతీతంగా ఒక్కటై తమ పంచాయతీలో ప్రధానంగా రోడ్డు, తాగునీటి సమస్యలు తీర్చేందుకు కచ్చితమైన హామీ వచ్చేంత వరకు ఓట్లు వేయకూడదని నిశ్చయించుకున్నామని తెలిపారు. అయితే గ్రామానికి గొల్లలనట్టు గ్రామం నుంచి దొరవారిసత్రం మండలం కారికాడు వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా ఉందన్నారు. ఈ రోడ్డు పనులు చేసేందుకు వణ్యప్రాణి సంరక్షణశాఖ(అటవీశాఖ వైల్డ్‌లైఫ్) నుంచి తారురోడ్డు పనులు చేయకూడదని ఆంక్షలు ఉన్నాయని, దీంతో ఈ రోడ్డుకు గత కొన్నేళ్లుగా మరమ్మతు పనులు జరగలేదని తెలిపారు. రోడ్డు గంతలమయంగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే వైద్యశాలకు తీసుకువెళ్లాలన్నా నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొన్ని సందర్భాల్లో సకాలంలో వైద్యశాలకు వెళ్లలేక కొందరు మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. అలాగే పంచాయతీకి వాకాడు మండలం స్వర్ణముఖి నది నుంచి పైపులైన్ల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. అయితే వారానికి ఒక్కసారి మాత్రమే అరకొరగా నీరు సరఫరా అవుతోందని, దీంతో తాగునీటికి అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల్లోని కలుషిత నీటిని వినియోగించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ రెండు సమస్యలు పరిష్కారానికి హామీ ఇస్తే గానీ ఓట్లు వేయబోమని తెగేసిచెప్పారు. వరప్రసాద్‌రావు చొరవతో పోలింగ్ బురదగల్లికొత్తపాళెం పంచాయతీలో ఓటర్లు ఎన్నికలు బహిష్కరించారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు ఆ పంచాయతీకి చేరుకున్నారు. మీకు అండగా ఉంటాం ముందు ఓటింగ్‌లో పాల్గొనాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి చెన్నారెడ్డి బాబురెడ్డి, జిల్లా కార్యదర్శి వంకా రమణయ్యలతో వరప్రసాద్‌రావు కొత్తపాళెం, కుమ్మరిపాళెం గ్రామాల్లో ఉన్న పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. వరప్రసాద్‌రావుకు గ్రామస్తులు తమ సమస్యలు తెలియజేశారు. అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పంచాయతీ ప్రజలు వరప్రసాద్‌రావుపై ఉన్న నమ్మకంతో ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. -
డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్ కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇద్దరు ఎస్పీలు రంగనాథ్, రెమా రాజేశ్వరిలకు హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందు జరుగుతున్న కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ రద్దు కావడంతో సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను ధర్మాసనం మూసివేసిందని, అయినప్పటికీ సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ముందుకెళుతున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ డీజీపీ, ఇద్దరు ఎస్పీలు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన ఇదే ధర్మాసనం, సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలిపేసిందని వివరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లకు భద్రతను పునరుద్ధరించాలన్న ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంతో అటు డీజీపీ, ఇటు ఇద్దరు ఎస్పీలను కోర్టు ధిక్కార కేసులో ప్రతివాదులుగా చేరుస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత కోర్టు ధిక్కారం కింద వీరికి నోటీసులు కూడా జారీ చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కేసులో మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఒక్కరే స్టే పొందాల్సి ఉంది. -
పరిపూర్ణానంద బహిష్కరణపై స్టే నో!
సాక్షి, హైదరాబాద్: కాకినాడలోని శ్రీపీఠం వ్యవస్థాపకుడుపరిపూర్ణానంద స్వామి హైదరాబాద్ నగర బహిష్కరణ అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. నగర బహిష్కరణ కొనసాగింపునకు వీలుగా తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంలో స్వామీజీకి గతంలో జారీ చేసిన నోటీసు అందాల్సి ఉందని, దానిని పరిశీలించాక ఈ అప్పీల్‌పై విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. కరీంనగర్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో స్వామీజీ రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించినందుకే నగర బహిష్కరణ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు విడివిడిగా ఉత్తర్వులిచ్చాయని, వీటి అమలును నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉతర్వులపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదించారు. యాత్ర పేరుతో అనుమతులు తీసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై పరిపూర్ణానంద స్వామి వాదనలు వినాల్సి ఉందని, ఇప్పటికే స్వామీజికి ఇచ్చిన నోటీసు అందాల్సి ఉన్నందున ఈ పరిస్థితుల్లో స్టే ఆదేశాలు జారీ చేయబోమని ధర్మాసనం ప్రకటించింది. విచారణ వాయిదా పడింది. -
నేను కేరళ వాసిని: స్వామి పరిపూర్ణానంద
సాక్షి, విజయవాడ: శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగర బహిష్కరణను హైకోర్డు కొట్టివేయడంతో ఆయన నేడు నగరంలో అడుగుపెట్టనున్నారు. దుర్గగుడిలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన నగరానికి బయలుదేరారు. అంతకుముందు పటిష్ట భద్రత నడుమ పరిపూర్ణానందను పోలీసులు ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చారు. స్వామిజీ వెంట తెలంగాణ ఎమ్మెల్యే ప్రభాకర్, బీజేపీ కార్యకర్తలు, భక్తులు తదితరులు ఉన్నారు. అమ్మవారి దర్శనాంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నన్ను బహిష్కరించడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాపై తెలంగాణ పోలీసుల చర్యలను కోర్టు కొట్టివేసింది. ధర్మం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్దం. తెలంగాణకు వెళ్లేలా ఆశీర్వదించమని అమ్మవారి కోరుకున్నా. అమ్మవారు కటాక్షించారు. అందుకే దర్శనం చేసుకోవాలని వచ్చా. నేను కేరళ వాసిని.. నా సొంత రాష్ట్రంలో వచ్చిన విపత్తును తగ్గించాలని అమ్మవారిని కోరుకున్నా, త్వరలోనే కేరళను సందర్వించబోతున్నా’ అంటూ పరిపూర్ణానంద వివరించారు. ఇక పరిపూర్ణానంద హైదరాబాద్ రానుండటంతో ఘనంగా స్వాగతం పలకాలని బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బైక్ ర్యాలీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అసలేం జరిగిందంటే.. ఓ టీవీ చానెల్లో చర్చ సందర్భంగా శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు. తనపై విధించిన నగర బహిష్కరణపై పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. -
కత్తి మహేశ్ బహిష్కరణపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ బహిష్కరణ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. నగర బహిష్కరణను సవాలు చేస్తూ కత్తి మహేశ్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. తనపై ఉన్న నగర బహిష్కరణను ఎత్తి వేయాలంటూ పిటిషన్లో కత్తి మహేశ్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల సమయం కావాలని కోరారు. దీనికి సమ్మతించిన హైకోర్టు కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది. -
పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టులో పరిపూర్ణానంద స్వామికి ఊరట లభించింది. హైదరాబాద్ నగర పోలీసులు పరిపూర్ణానంద స్వామికి జారీ చేసిన నగర బహిష్కరణ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు ఆయనపై ఆరునెలల పాటు విధించిన నగర బహిష్కరణను కోర్టు నిలిపివేసింది. తనపై విధించిన నగర బహిష్కరణను సవాల్ చేస్తూ పరిపూర్ణానంద స్వామి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్ శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ యాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించడంతో ఆయనను నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నిర్ణయించారు. ఈ మేరకు జులై 10న పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో అడుగుపెట్టొద్దని, నోటీసులు అందుకున్న 24 గంటల్లో నగరాన్ని విడిచిపెట్టాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు పరిపూర్ణానంద నగర బహిష్కరణకు ముందే కత్తి మహేష్‌ను కూడా ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. -
ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ!
ఆత్మకూరు రూరల్: ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లను జిల్లా నుంచి బహిష్కరించే యోచన ఉందని జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. ఆదివారం ఆయన ఆత్మకూరు ఎస్డీపీవో, పోలీస్ సర్కిల్ కార్యాలయాలను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పల్లెనిద్ర కార్యక్రమంతో గ్రామాల్లో శాంతి భద్రతలపై అవగాహన పెరుగుతోందన్నారు. ఎన్నికలు వస్తున్నందున హింసకు పాల్పడే వారి నేర చరిత్రను సేకరిస్తున్నామన్నారు. నేర చరిత్ర గల వారిని పోలీసులు.. బైండోవర్ చేసుకుంటారన్నారు. అవసరమైతే వారిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. అనంతరం కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్(సీపీవో)లతో మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ సామాజిక స్పృహ అవసరమన్నారు. సీపీవోలు చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రతిభావంతంగా పనిచేసిన వారికి నగదు రివార్డులు అందించారు. ఆ తరువాత పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్డీపీవో అడిషనల్ ఎస్పీ మాధవ రెడ్డి, సీఐ బత్తల కృష్ణయ్య, ఎస్ఐలు వెంకట సుబ్బయ్య, రమేష్ బాబు పాల్గొన్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన కత్తి మహేశ్
హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేశ్‌ను 6 నెలల పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నగర బహిష్కరణ చేసిన సంగతి తెల్సిందే. అలాగే కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా హిందువులను కూడగట్టి హైదరాబాద్‌లో ర్యాలీ తీసేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానంద స్వామిని కూడా నగర పోలీసులు 6 నెలల పాటు బహిష్కరణ చేశారు. ఇద్దరూ వేర్వేరుగా తమపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. -
పరిపూర్ణానంద బహిష్కరణ రికార్డులు సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నగర బహిష్కరణకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తనను నగర బహిష్కరణ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ స్వామి పరిపూర్ణానంద హైకోర్టులో వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జస్టిస్ రాజశేఖరరెడ్డి సోమవారం విచారణ జరిపారు. పరిపూర్ణానంద తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసే అధికారం ఈ ముగ్గురు పోలీసు కమిషనర్లకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సంఘ వ్యతిరేక, ప్రమాదకర కార్యకలాపాల చట్టం కింద పరిపూర్ణానందపై నగర బహిష్కరణ వేటు వేశారని, ఈ చట్టాన్ని కేవలం గూండాలపై, తరచూ నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగిస్తారని కోర్టుకు నివేదించారు. అటువంటి చట్టం కింద పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవడమంటే అతని హక్కులను హరించడమే అవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ పరిపూర్ణానంద విషయంలో నిబంధనల మేరకే నడుచుకున్నామని చెప్పారు. పరిపూర్ణానంద కోరిక మేరకే ఆయనను కాకినాడ తీసుకెళ్లామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి బహిష్కరణకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. -
‘స్వామి పరిపూర్ణానంద బహిష్కరణపై వివరణ ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఏపీ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పరిపూర్ణానంద బహిష్కరణ మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని మింట్ కాంపౌండ్‌లోని త్రిశక్తి హనుమాన్ దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ ఏపీ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 24న వ్యక్తిగతంగా హాజరై వివర ణివ్వాలని డీజీపీని ఆదేశించారు. -
ఆగ్రహించిన విశ్వహిందూ పరిషత్
సాక్షి, విజయవాడ : పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయటాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తున్నాయి. గురువారం విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద వీహెచ్‌పీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు, హిందుత్వ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామవరప్పాడు వరకు వారు ర్యాలీని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. రామవరప్పాడుకు ర్యాలీగా వస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ.. గురువారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌లు నగర దిగ్భందం చేశాయి. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. పెద్దపల్లి : తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విశ్వసిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను వారు తప్పు పట్టారు. గురువారం గోదావరిఖనిలో రాజీవ్ రహదారిపై వీహెచ్‌పీ రాస్తారోకో చేపట్టింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆయనపై ఉన్న బహిష్కరణను రద్దు చేయాలంటూ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు కూకట్పల్లి జాతీయ రహదారిపై బైఠాయించారు. -
అందుకే వాళ్లను నగరం నుంచి బహిష్కరించాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతికి విఘాతం కలగవద్దనే కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానందలను ఆరు నెలల పాటు నగరం నుంచి బహిష్కరించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్‌ను కలిసి, ప్రస్తుత రాజకీయ, పాలనాపరమైన అంశాలపై ఆయన చర్చించారు. రైతులకు రూ.5లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించేందుకు ఆగస్టు 15న ప్రారంభించనున్న రైతు బీమా పథకం ఉద్దేశాలు, వివరాలను గవర్నర్‌కు సీఎం తెలియజేశారు. వర్షాల రాకతో ఎగువ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వరద ప్రవాహం ప్రారంభమైందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. వచ్చే సెప్టెంబర్ నుంచి సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనికి వ్యతిరేకంగా శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఆందోళనకు దిగడం ద్వారా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదంలో కొన్ని వార్తా చానల్స్ వ్యవహరించిన తీరు పట్ల కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వామి పరిపూర్ణానందకు నగర బహిష్కరణ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర నేతలు కొన్ని రోజుల కింద గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో సీఎం గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. -
ఎక్కడికక్కడ అడ్డగింత
అనంతగిరి: స్వామి పరిపూర్ణనంద బహిష్కరణకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) శనివారం వికారాబాద్‌లో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పరిషత్ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. వికారాబాద్‌లోని ఆలంపల్లి ఎంఐజీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వెళ్లేందుకు వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ర్యాలీగా వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శిరీష, సీఐ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నాయకులను అడ్డుకున్నారు. ఆలయం వెలుపల నుంచి వస్తున్న నాయకులను అడ్డగించి వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఎమ్మార్పీ చౌరస్తా వరకు వచ్చిన కొందరిని కూడా అడ్డుకున్నారు. ఈ సమయంలో నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బహిష్కరణ ఎత్తివేయాలి ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. స్వామి పరిపూర్ణనందాపై బహిష్కరణ సరికాదని, వెంటనే బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విభజించు పాలించు అనే ధోరణిని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. స్వామిజీ ధర్మం గురించి మాట్లాడిన్రు తప్పా మరేది కాదన్నారు. అనంతరం వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బందెప్ప గౌడ్ మాట్లాడుతూ.. హిందూవుల మనోభావాలకు దెబ్బతినేలా ఎవరూ మాట్లాడొద్దని కోరారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. హిందూవుల జోలికి ఎవరైన వస్తే సహించేది లేదన్నారు. సమాజ హితం కోసం కృషి చేసే పరిపూర్ణనందాను బహిష్కరించడం సరికాదని బీజేపీ రాష్ట్ర నాయకులు పటేల్ రవిశంకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కడిక్కడ ప్రజల గొంతును నొక్కేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు ప్రశాంత్‌కుమార్, గోవర్దన్‌రెడ్డి, ప్రభాకర్, కృష్ణ పంతులు, మ్యాడం దత్తు, బీజేపీ నాయకులు పాండుగౌడ్, సదానంద్‌రెడ్డి, సాయికృష్ణ, మాధవరెడ్డి, శివరాజు, వివేకనందారెడ్డి, పోకల సతీశ్, రాచ శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌కుమార్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, శంకర్, సాయి చరణ్‌రెడ్డి, రాజు, రాము, గిరీశ్ కొఠారి, పరుశరాం, కరుణాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వికారాబాద్‌లో న్యాయవాదుల లోక్ అదాలత్ బహిష్కరణ వికారాబాద్‌లో ర్యాలీకి మద్దతుగా వికారాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు శనివారం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ను బహిష్కరించారు. అనంతరం న్యాయవాదులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ప్ర«ధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, సీనియర్ న్యాయవాదులు గోవర్దన్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, బస్వరాజు, చౌదరి యాదవరెడ్డి, శ్రీనివాస్, రవి, రాజు, రాము, ఈశ్వర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.