సాక్షి, హైదరాబాద్: కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఏపీ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పరిపూర్ణానంద బహిష్కరణ మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని మింట్ కాంపౌండ్‌లోని త్రిశక్తి హనుమాన్ దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ ఏపీ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 24న వ్యక్తిగతంగా హాజరై వివర ణివ్వాలని డీజీపీని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment