swamy paripoornananda
-
'బైరాన్‌పల్లి అమరవీరుల ఆశయాలు పూర్తి కాలేదు'
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, స్వామి పరిపూర్ణానందలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ ... బైరాన్‌పల్లి పోరాట చరిత్ర మరిచి పోలేనిదని, అక్కడి అమరవీరుల ఆశయం ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. వారి త్యాగాలను, ఆశయాలను వృధా పోనివ్వకుండా చూస్తామని తెలిపారు. అప్పటి నిజాం సేనలు బైరాన్‌పల్లిలో వందలమందిని కాల్చి చంపితే ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గు లేకుండా నిజాంను పొగుడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం అమరులైన వారి ఆశయాల సాధన కోసం బీజేపీ ఎప్పటికి పాటు పడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో కాషాయజెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. దేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి ఉందని స్వామి పరిపూర్ణానంద వెల్లడించారు. ఒకేరోజులో 118మంది బైరాన్‌పల్లి వాసులను నిజాం రజాకార్లు బలితీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నేను యదగిరిగుట్టకు పాదయాత్ర చేస్తానంటే తనను రాష్ట్రం నుంచి బహిష్కరించిన కేసీఆర్‌ను సంవత్సరం తిరగకముందే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ముఖ్యమంత్రి బొమ్మలను బహిష్కరించారని పరిపూర్ణానంద పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అధికారికంగా విమోచన దినం
నిజామాబాద్ నాగారం: డిసెంబర్ 11న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్వామి పరిపూర్ణానంద అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణకు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ చరిత్ర ఉన్న పేర్లనే జిల్లాలకు పెట్టుకుందామన్నారు. హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా, షాద్‌నగర్‌ను శ్రీనగర్, మహబూబ్‌నగర్‌ను పాలమూరు, మహబూబాబాద్‌ను మానుకోట, నిజామాబాద్‌ను ఇందూర్‌గా పేర్లు మారుస్తామని చెప్పారు. తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవ మండపాలకు ఉచితంగా విద్యుత్ సదుపాయం, అయ్యప్ప, ఇతర స్వాములకు ప్రత్యేకంగా వసతులు, రక్షణ, భదత్ర కల్పిస్తామన్నారు. తెలంగాణలో కాషాయజెండా ఎగురవేద్దామన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మాయ మాటలు నమ్మవద్దన్నారు. ప్రతి ఒక్కరు బీజేపీ గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
అక్బరుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్‌కు పోవాలనీ..
మలక్‌పేట: హిందుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్‌కు పోవాలనీ.. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మారుస్తాని చెప్పి కంగారు తెలంగాణగా మార్చారని స్వామి పరిపూర్ణానంద ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖతం, కాంగ్రెస్ గతం, ఎంఐఎం హతం చేయడం తథ్యమన్నారు. మలక్‌పేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆలె జితేంద్ర ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి మూసారంబాగ్ డివిజన్లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైద్రాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని స్వామి పరిపూర్ణనంద అన్నారు. మలక్‌పేటలో కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు పాల్పడుతున్న మజ్లిస్ అభ్యర్థి బలాలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే నేరుగా మజ్లిస్‌కు వేసినట్లేనని అన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ఎక్కడ కూడా బాంబ్ పేళ్లుల్లు జరగలేదని, బాంబ్ పేల్చేవారిని దేశ సరిహద్దుల్లోనే పేల్చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 7న జరుగబోయే పోలింగ్ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కమలం గుర్తుకు ఓటే వేసి ఆలె జితేంద్రను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర కార్యదర్శి దేవేందర్, మలక్‌పేట కన్వీనర్ సంరెడ్డి సురేందర్‌రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ నర్సింహ, డివిజన్ అధ్యక్షుడు సురేందర్, విజయ్‌కాంత్, రమేశ్‌రెడ్డి, సహాదేవ్యాదవ్, యాదగిరెడ్డి, రమేష్‌గుప్తా పాల్గొన్నారు. -
‘సుప్రభాతమే పిచ్చెక్కించిందా’
సాక్షి, హైదరాబాద్ : వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌లో గల సాయిబాబా ఆలయంలో భక్తిపాటల మైక్‌సెట్‌ను ఆన్ చేసిన అర్చకుడు సత్యనారాయణ శర్మ (60)పై అటుగా వెళ్తున్న ఓ యువకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ సత్యనారాయణ గురువారం తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ శర్మ మృతి శక్తి పీఠం అధిపతి, బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామి స్పందించారు. శర్మపై దాడి చేసింది ఓ ముస్లిం యువకుడని ఆయన ఆరోపించారు. హిందుస్థాన్‌లో హిందువులకు స్థానం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు కూడా మంత్రులు హాజరవ్వడం ఈ విపత్కర పరిస్థితికి సంకేతమని అన్నారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మేము భక్తి అనుకోవాలి.. కానీ మీరు మసీదు, మదర్సాలలో తర్ఫీదు పొందిన ఒక ముస్లిం వ్యక్తి అరవై ఏళ్ల వృద్ధ బ్రాహ్మణున్ని కొట్టి చంపాడు. గుడిలో సుప్రభాతం పెట్టడం వల్లనే నిందితుడి మానసిక స్థితి పాడైందని చెప్పడం దారుణమని అన్నారు. మీరు రోజుకు 5 సార్లు హజా చేస్తే హిందువులంతా విని అది ముస్లింల భక్తి అనుకోవాలి. కానీ, సుప్రభాతం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా అని ప్రశ్నించారు. ఒక పూజరిని మతోన్మాది కొట్టి తీవ్రంగా గాయపర్చితే కనీసం సరైన వైద్యం అందించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. పోలీసులు దర్యాప్తు జరిపి నిందితున్ని ఆకతాయిగా తేల్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే మసీదులు, మాదర్సాలో ఉండేవారు ఆకతాయిలా అని ప్రశ్నించారు. -
అర్చకుడు సత్యనారాయణ శర్మకు కన్నీటి వీడ్కోలు
గీసుకొండ(పరకాల): అర్చకుడు దేవళ్ల సత్యనారాయణ శర్మకు అర్చకులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. సత్యనారాయణ శర్మ భౌతిక కాయాన్ని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి సందర్శించి నివాళులర్పించారు. అంతిమయాత్రలో కడదాకా పాల్గొన్నారు. సత్యనారాయణ శర్మకు భార్య, పిల్లలు లేకపోవడంతో ఆయన అన్న శంకర్రావు కుమారుడు సురేష్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఎనుమాముల, రెడ్డిపాలెం నుంచి వచ్చేవారిని అడ్డుకున్నారు. అంతిమయాత్రలో తెలంగాణ బ్రాహ్మణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, ప్రధానకార్యదర్శి జీవీఎస్ శ్రీనివాసాచారి, అర్బన్ జిల్లా అధ్యక్షులు వల్లూరి పవన్‌కుమార్, నాగిళ్ల శంకర్‌శర్మ, నాయకులు జగన్మోహన్శర్మ, వాణి, బీజేపీ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి, పరకాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్, గట్టికొప్పుల రాంబాబు, గ్రామ పెద్దలు ఆడెపు రమేశ్, దొంగల రమేశ్ పాల్గొన్నారు. డీసీపీ అనురాధ, ఏసీపీలు ప్రతాప్‌కుమార్, సుధీంద్ర, సీఐ సంజీవరావు, ఎస్ఐ రహీంలతో పాటు పలువురు పోలీస్ అధికారులు అవాంఛనీయ టనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.. అర్చకుడు సత్యనారాయణశర్మ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే రూ. 10 లక్షల ఎక్స్‌గేషియా చెల్లించి ఆదుకోవాలని బ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా మొగిలిచర్లలో సత్యనారాయణశర్మ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అర్చకుల భద్రతపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బ్రాహ్మణ పరిషత్ నుంచి సత్యనారాయణ కుటుంబానికి తక్షణ సాయం అందించాలన్నారు.నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో బీజేపీదే అధికారం: పరిపూర్ణానంద
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ కురుక్షేత్రం ప్రారంభం అయిందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. అమిత్‌షా నేతృత్వంలో ఇటీవల బీజేపీలో చేరిన పరిపూర్ణానంద తొలిసారిగా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఇతర నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని, ధర్మాన్ని బీజేపీ కాపాడుతున్నందుకే తాను బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. అలాగే కులాలకు, కుటుంబ వారసత్వానికి తావులేకుండా బీజేపీ పని చేస్తోం దన్నారు. మిషన్ 70 పేరుతో లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ చక్కగా పనిచేస్తోందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. తనకు పదవులు అక్కర్లేదని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఇక్కడ పూర్తయ్యాక మరో రాష్ట్రానికి వెళతానన్నారు. అమిత్‌షా పదవి ఇస్తానన్నా..పదవి కాదు..పని చేస్తానని చెప్పానన్నా రు. తెలంగాణలో జనతా సర్కార్ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అద్వానీ, వాజ్‌పేయి జోడీ పార్టీని నడిపించిందని, ఇప్పుడు అమిత్ షా, మోదీ జోడీ పార్టీని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకువస్తుందన్నారు. పార్టీ అధ్యక్షు డు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల మొద టి విడత ప్రచారంలో భాగంగా హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేటలో నిర్వహించే బహిరంగ సభలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని వెల్లడించారు. పరిపూర్ణానంద చేరికను స్వాగతిస్తు న్నామన్నారు. ఆయన చేరికతో ప్రజల నుంచి బీజేపీకి ఎనలేని మద్దతు లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటముల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నార న్నారు. అధికారంలోకి వచ్చే వరకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం తీయనని అంటున్నారని, అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని, హిమాలయాలకు వెళ్లి సన్యాసం పుచ్చుకోవాల్సి వస్తుందన్నారు. -
‘కొండగట్టు’ వద్ద నారాయణ బలిహోమం
జగిత్యాల జోన్/కొండగట్టు: కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో బుధవారం నారాయణ బలిహోమం నిర్వహించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రీ, పులి సీతారామ శాస్త్రీ, శ్రీనివాసశర్మ తదితర వేద పండితుల బృందం రెండు గంటలపాటు హోమం నిర్వహించింది. యాగం నిర్వహిస్తున్న స్థలంలోని వేదికపై దాదాపు అరగంట పాటు స్వామిజీ ప్రత్యేక జపం చేస్తూ, మౌనంగా ఉండిపోయారు. ప్రమాద స్థలంలోనే 50 మందికిపైగా చనిపోయినందున సామూహికంగానే మృతులకు పిండ ప్రదానం చేశారు. యజ్ఞహోమం వద్ద పిండాలను ఏర్పాటు చేసి.. మృతుల కుటుం బాలతో పిండాలు ప్రదానం చేయించారు. అనం తరం ధర్మపురి గోదావరిలో కలిపేందుకు తీసుకెళ్లారు. కాగా, కొండగట్టు బస్సు ప్రమాద స్థలాన్ని గోదావరి నీటితోపాటు యజ్ఞ విభూతితో శుద్ధి చేశారు. ప్రత్యేక పూజలూ చేశారు. వస్త్రాల బహూకరణ: మృతుల కుటుంబాలకు పరిపూర్ణానంద స్వామి తన చేతుల మీదుగా వస్త్రాలను బహూకరించారు. ఆ సమయంలో బాధితులు తమవారిని తలుచుకుని స్వామివారి పాదాలపై పడి ఏడ్వడం చూసేవారికి సైతం కన్నీళ్లను తెప్పించింది. మృతుల కుటుంబీకులు సంతోషంగా ఉండాలని స్వామి ఆకాంక్షించారు. -
నేను కేరళ వాసిని: స్వామి పరిపూర్ణానంద
సాక్షి, విజయవాడ: శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగర బహిష్కరణను హైకోర్డు కొట్టివేయడంతో ఆయన నేడు నగరంలో అడుగుపెట్టనున్నారు. దుర్గగుడిలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన నగరానికి బయలుదేరారు. అంతకుముందు పటిష్ట భద్రత నడుమ పరిపూర్ణానందను పోలీసులు ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చారు. స్వామిజీ వెంట తెలంగాణ ఎమ్మెల్యే ప్రభాకర్, బీజేపీ కార్యకర్తలు, భక్తులు తదితరులు ఉన్నారు. అమ్మవారి దర్శనాంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నన్ను బహిష్కరించడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాపై తెలంగాణ పోలీసుల చర్యలను కోర్టు కొట్టివేసింది. ధర్మం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్దం. తెలంగాణకు వెళ్లేలా ఆశీర్వదించమని అమ్మవారి కోరుకున్నా. అమ్మవారు కటాక్షించారు. అందుకే దర్శనం చేసుకోవాలని వచ్చా. నేను కేరళ వాసిని.. నా సొంత రాష్ట్రంలో వచ్చిన విపత్తును తగ్గించాలని అమ్మవారిని కోరుకున్నా, త్వరలోనే కేరళను సందర్వించబోతున్నా’ అంటూ పరిపూర్ణానంద వివరించారు. ఇక పరిపూర్ణానంద హైదరాబాద్ రానుండటంతో ఘనంగా స్వాగతం పలకాలని బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బైక్ ర్యాలీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అసలేం జరిగిందంటే.. ఓ టీవీ చానెల్లో చర్చ సందర్భంగా శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు. తనపై విధించిన నగర బహిష్కరణపై పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. -
పరిపూర్ణానంద: ఎప్పుడో చేసిన ప్రసంగాలపై ఇప్పుడు బహిష్కరణా?
సాక్షి, హైదరాబాద్ : శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులోవాదనలు కొనసాగాయి. తనను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ.. హైదరాబాద్ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చారు. ఆదిలాబాద్‌లో, కరీంనగర్లో గతంలో పరిపూర్ణానంద ఇచ్చిన ప్రసంగాల ఆధారంగా ఆయనను బహిష్కరించమని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలుపగా.. హైదరాబాద్ పరిధిలో ఎలాంటి కేసులు లేకుండా ఎలా బహిష్కరిస్తారని పరిపూర్ణానంద తరఫున వాదనలు వినిపిస్తున్న మాజీ అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ఎప్పుడో చేసిన ప్రసంగాలపై ఇప్పుడు ఎలా బహిష్కరిస్తారని అడిగారు. ధర్మాగ్రహ యాత్రకు మొదటి అనుమతి ఇచ్చి తర్వాత ఎందుకు అనుమతి నిరాకరించారో తెలపాలని కోరారు. ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుందని ఆయన కోర్టుకు తెలిపారు. స్వామి పరిపూర్ణానందపై వేసిన నగర బహిష్కరణ ఎత్తివేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. పరిపూర్ణానంద బహిష్కరణకు సంబంధించి.. ఒరిజినల్ డాక్యుమెంట్లను మంగళవారం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఓ టీవీ చానెల్లో చర్చ సందర్భంగా శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు. తనపై విధించిన నగర బహిష్కరణపై న్యాయపోరాటం చేయాలని స్వామి పరిపూర్ణానంద నిర్ణయించారు. ఇందులో భాగంగానే హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన బహిష్కరణ రాజ్యాంగ విరుద్ధమని, గూండాలను మాత్రమే నగరం నుంచి పోలీసులు బహిష్కరిస్తారని పరిపూర్ణానంద పిటిషన్లో పేర్కొన్నారు. -
‘స్వామి పరిపూర్ణానంద బహిష్కరణపై వివరణ ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఏపీ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పరిపూర్ణానంద బహిష్కరణ మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని మింట్ కాంపౌండ్‌లోని త్రిశక్తి హనుమాన్ దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ ఏపీ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 24న వ్యక్తిగతంగా హాజరై వివర ణివ్వాలని డీజీపీని ఆదేశించారు. -
స్వామి బహిష్కరణ.. స్పందించిన కత్తి మహేష్!
శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు ఆరు నెలలు బహిష్కరించడంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ ట్విటర్ ద్వారా స్పందించారు. స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ విధించడాన్ని ఆయన ఖండించారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కత్తి మహేష్‌పై హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పాడుతుందనే భావనతో కత్తి మహేష్‌పై హైదరాబాద్ పోలీసులు ఆరు నెలలు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే. ‘పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు. బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. మనుషుల్ని‘‘తప్పిస్తే’’ సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంద’ని కత్తి మహేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కత్తి మహేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వామి బహిష్కరణకు మద్దతుగా కత్తి మహేష్ మాట్లాడటం ఆసక్తికర పరిణామం. స్వామి పరిపూర్ణానందపై కూడా హైదరాబాద్ పోలీసులు నేడు బహిష్కరణ విధించారు. ఆయన గతంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. వాటికి సమాధానం చెప్పలేదంటూ స్వామి పరిపూర్ణానందపై కూడా 6 నెలల బహిష్కరణ వేటు వేశారు. పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు.బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.మనుషుల్ని "తప్పిస్తే" సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది. — Kathi Mahesh™️ (@kathimahesh) 11 July 2018 -
హైకోర్టును ఆశ్రయించిన పరిపూర్ణానంద
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నుంచి పోలీసులు తనను బహిష్కరించడాన్ని నిరసిస్తూ శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పరిపూర్ణనంద బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ ధాఖలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను తెలంగాణ పోలీస్ శాఖ విస్మరిస్తోందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. తక్షణమే బహిష్కరణను తొలగించేలా పోలీస్ శాఖకు అదేశాలు ఇవ్వాలని పరిపూర్ణనంద స్వామి పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించలేదు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ధర్మాగ్రహ పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు రెండు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. కత్తి మహేశ్‌ను కూడా హైదరాబాద్ నుంచి బహిష్కరించారు. ఆరు నెలల పాటు నగరంలోకి రాకుండా నిషేధం విధించారు. -
స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో జూబ్లీహిల్స్ గృహ నిర్బంధంలో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడ తరలించారు. అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించొద్దని.. తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు సందర్భాల్లో ఇతర మతాలపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వామి పరిపూర్ణాంద తరలింపులో తొలుత పోలీసులు చాకచక్యం ప్రదర్శించారు. నాలుగు వాహనాల్లో బయలు దేరిన పోలీసులు రెండు వాహనాలను విజయవాడ వైపు, మరో రెండు వాహనాలను శ్రీశైలం వైపు పంపించారు. ఈ రెండు మార్గాల్లో ఆయన్ను ఎక్కడికి తరలించారనే విషయాన్నిపోలీసులు వెల్లడించలేదు. అధికారిక ప్రకటన అనంతరం కాకినాడలోని శ్రీపీఠానికి స్వామి పరిపూర్ణానందను తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
స్వామి పరిపూర్ణానంద ఆరు నెలలు నగర బహిష్కరణ
-
తొలిసారి తెరపైకి కత్తి మహేష్ తండ్రి
-
తొలిసారి తెరపైకి కత్తి మహేష్ తండ్రి
సాక్షి, చిత్తూరు : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై ఈ రోజు(సోమవారం) హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. కత్తి ఇటీవల శ్రీరాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా కత్తి మహేశ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ.. స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే కత్తిపై పలు కేసులు నమోదయ్యాయి. దీనిపై కత్తి మహేష్ తండ్రి కత్తి ఓబులేసు స్పందించి శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నా కొడుకును కాదు.. హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు. మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రార్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాముడి గురించి నా కొడుకు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమేనని పేర్కొన్నారు. రామాయణం విష వృక్ష పుస్తకం.. పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతోందన్నారు. నా కొడుకు హిందువే.. నాస్తికుడు కాదు.. అస్తికుడేనని తెలిపారు. నా కొడుకు తన భార్యతో కలిసే ఉన్నాడు విడిపోలేదని చెప్పారు. ఈ నెల 4న లక్నో వెళ్లి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారని తెలిపారు. సామాజిక మాథ్యమాల్లో కావాలనే కొంతమంది నా కొడుకుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. -
కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు!
సాక్షి, హైదరాబాద్ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. తమ అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశించవద్దని కత్తిని ఆదేశించారు. ఈ మేరకు ఆయనను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని.. నగరం నుంచి తీసుకెళ్లారు. ఏపీలోనూ కత్తి మహేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్తూరులోని స్వగ్రామానికి కత్తి మహేశ్‌ను పోలీసులు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఆయనను హైదరాబాద్ నుంచి బహిష్కరించారా? లేక తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించారా? అన్నది తెలియాల్సి ఉంది. ఎన్ని నెలలపాటు కత్తి మహేశ్‌ను నగరం నుంచి బహిష్కరించారనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ నగర బహిష్కరణ, స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్టుపై మరిన్ని వివరాలు తెలిపేందుకు తెలంగాణ డీజీపీ మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. శ్రీరాముడిపై తాజాగా కత్తి మహేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో కత్తి మహేశ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. కత్తి మహేశ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ.. స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశముండటంతో కత్తి మహేశ్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి : ధర్మాగ్రహ యాత్రకు నో.. పరిపూర్ణానంద హౌస్ అరెస్టు! -
మీలో మా అమ్మను చూస్తున్నా..
సనత్‌నగర్: చూపులేక పోవడం దురదృష్టం కాదని, చూపు ఉన్న మనం చూపులేని వారి వైభవాన్ని చూడలేకపోవడం దురదృష్టకరమని శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. బేగంపేట మయూరీమార్గ్లోని దేవనార్ అందుల పాఠశాల వార్షికోత్సవం శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన స్వామిజీ మాట్లాడుతూ.. ఇక్కడ చదువుతున్న ప్రతిఒక్క విద్యార్థిలోని తన తల్లి కనిపిస్తుందన్నారు. అంధురాలైన తన తల్లికి చేసిన సేవలను గుర్తుచేసుకుని స్వామీజీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనకు తల్లి మొదటి గురువైతే....స్వామి దయానంద సరస్వతి రెండవ గురువని వివరించారు. కొడుకులా కాకుండా కూతురిలా దగ్గరుండి తల్లికి సపర్యలు చేశానని, తనకు సన్యాసం ఇష్టం లేకున్నా తల్లి ఆజ్ఞను శిరసావహించానని అన్నారు. తన తల్లికి వేదాంతం, మంత్రం వినిపించడం తన అదృష్టమన్నారు. తన కోసం తాను జీవించడం సహజత్వమని, ఇతరుల కోసం జీవించడం మానవత్వమని, సమూహం కోసం జీవించడం దైవత్వంగా పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్థులకు కళ్లు లేకున్నా బ్రెయిన్‌తో నృత్యాలు చేసిన తీరు అద్భుతమని కితాబిచ్చారు. త్వరలోనే దేవనార్ పాఠశాల విద్యార్థులతో కొంత సమయం గడుపుతానని స్పష్టం చేశారు. పాఠశాల నిర్వాహకులను అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సామాజిక అంశాలతో ప్రదర్శించిన స్కిట్లు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ ఛైర్మన్ సాయిబాబాగౌడ్, కరస్పాండెంట్ జ్యోతిగౌడ్, ప్రిన్సిపాల్ లిల్లీ ఎగ్బర్డ్ తదితరులు పాల్గొన్నారు. -
హిందూ ఆలయాలపైనే పెత్తనమెందుకు?
కొల్లాపూర్: పాలకులు కేవలం హిందూ ఆలయాలపైనే తమ పెత్తనం ప్రదర్శిస్తూ.. మజీదులు, చర్చిల జోలికి ఎందుకు వెళ్లడం లేదని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కేవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ హిందువుల ఆలయాలు రాజకీయాలకు వేదికలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు ఆలయాల సొమ్మును దోచేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో పాలకవర్గాలే విజయవాడ కనకదుర్గమ్మ గుడి, అమ్మవారిని రోడ్డుకీడ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. హిందూ దేవుళ్లను దర్శించుకోవాలంటే ఎమ్మెల్యే, ఎంపీల సిఫారసు లేఖలు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు కుహనా మేధావులు భారతీయ సంస్కృతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
కించపరుస్తూ పుస్తకాలు రాస్తే సహించం
నారాయణఖేడ్: కులాల్ని కించపరుస్తూ ఎవరు పుస్తకాలు రాసినా సహించేది లేదని కాకినాడ శ్రీపీఠం మఠాధిపతి స్వామి పరిపూర్ణానంద తెలిపారు. త్వరలో అన్ని కులాలతో సర్వజన సంఘటన ఏర్పాటు చేస్తానన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బుధవారం రాత్రి రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ.. మహిషాసురుడి కోసం అమ్మ వారు ఉద్భవించిన తరహాలో కొందరు పాపాత్ముల కోసం తాను బయటకు వస్తానని, తనను అమ్మ వారే పంపారన్నారు. తన పుట్టుక, కులం, మతం గురించి అడిగిన విషయాలపై పరిపూర్ణానంద ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై పరోక్షంగా వ్యంగ్యంగా మాట్లాడారు. ఎక్కడ ఏ మాతృమూర్తి తనను అక్కున చేర్చుకుంటే వారే నా తల్లి అని, ఏ గడపకు వెళ్తే అదే నా ఇల్లు అని, ఏ పురుషుడి రూపం ఎదురైనా నాకు తండ్రి లాంటి వారే అని అన్నారు. సీపీఐ రామకృష్ణ మీ అమ్మ గురించి చెప్పేందుకు ఏం ఇబ్బందని అని పేర్కొన్నాడని, నా రూట్స్ గూర్చి మీలాంటి బ్రూట్స్‌కు, చెప్పాల్సిన అవసరం లేదన్నారు. -
ధార్మిక మండలి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
రమణయ్యపేట (కాకినాడ రూరల్): దేవాలయాల భూములు, ఆస్తుల పరిరక్షణ కోసం ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శ్రీపీఠం స్వామిజీ స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ రూరల్ రమణయ్యపేట శ్రీపీఠంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండోమెంట్ భూముల పరిరక్షణకు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలకు పాలకులు కొత్త భాష్యం చెబుతున్నారని ఆరోపించారు. ఎండోమెంట్ ఆస్తుల సంరక్షణకు «రిటైర్డు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల ఆధ్వర్యంలో ధార్మిక çమండలి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు.« ధర్మకర్తల మండళ్లు కాస్తా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారని విమర్శించారు. ఏపీ, తెలంగాణలో 33 వేల దేవాలయాలున్నాయని, ఇందులో 20 వేల దేవాలయాల్లో నిత్యం దీప, ధూప, నైవేద్యాలు జరుగుతున్నాయని, మిగతా 13 వేల దేవాలయాలు మూతపడినట్టు తెలిపారు. మూతపడిన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు సమర్పించే ఆదాయంలో 10 శాతం కామన్ గుడ్ ఫండ్ సీఎంకు వెళుతుందన్నారు. వీటి వినియోగంపై ఆర్డీఏలో సమాచారం కోరినా ఇవ్వడం లేదని ఆరోపించారు. విజయవాడలో సిద్ధార్థ కళాశాలకు ప్రభుత్వం విలువైన భూములు కేటాయించడం దారుణమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల ఎంపిక రాజకీయాలకతీతంగా ఆధ్యాత్మికతో పనిచేసేవారికి అవకాశం కల్పించాలన్నారు. మక్కా, జెరూసలేం యాత్రలకు వెళ్లే భక్తులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం హిందువులకు రాయితీలు ఇవ్వకపోగా, సర్‌చార్జీలు, టోల్గేట్ చార్జీలు వసూలు చేస్తుందని ఆరోపించారు. దేవాలయాలు, పండుగలు నిర్వహించేటప్పుడు దేవుని ప్రచారం చేసే ఫ్లెక్సీల కన్నా పాలకమండలి సభ్యులు, రాజకీయనేతల ఫ్లెక్సీలు అధికంగా కనిపిస్తున్నాయని వాపోయారు. ఈ ఖర్చును భక్తులు హుండీలో సమర్పించిన నిధుల నుంచి వినియోగంచడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. -
'తిరుపతిని హిందు సెక్యురిటీ జోన్‌గా ప్రకటించాలి'
తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి ఉగ్రవాదుల ముప్పు ఉందని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. తిరుపతిని హిందు సెక్యురిటీ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించాలని ఆయన గురువారమిక్కడ డిమాండ్ చేశారు. అలాగే నగరంలోని మద్యం షాపులు ఎత్తివేయాలని, అంతేకాకుండా ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు అనుమి ఇవ్వరాదని అన్నారు. అంతేకాకుండా వకుళమాతకు ఆలయం నిర్మించాలని, లేని పక్షంలో వందలాదిమందితో దీక్ష చేపట్టనున్నట్లు స్వామి పరిపూర్ణానంద హెచ్చరించారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వకుళమాత గుడి కట్టించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు.