
కొల్లాపూర్: పాలకులు కేవలం హిందూ ఆలయాలపైనే తమ పెత్తనం ప్రదర్శిస్తూ.. మజీదులు, చర్చిల జోలికి ఎందుకు వెళ్లడం లేదని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కేవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ హిందువుల ఆలయాలు రాజకీయాలకు వేదికలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పాలకులు ఆలయాల సొమ్మును దోచేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో పాలకవర్గాలే విజయవాడ కనకదుర్గమ్మ గుడి, అమ్మవారిని రోడ్డుకీడ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. హిందూ దేవుళ్లను దర్శించుకోవాలంటే ఎమ్మెల్యే, ఎంపీల సిఫారసు లేఖలు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు కుహనా మేధావులు భారతీయ సంస్కృతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment