
నిజామాబాద్ నాగారం: డిసెంబర్ 11న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్వామి పరిపూర్ణానంద అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణకు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ చరిత్ర ఉన్న పేర్లనే జిల్లాలకు పెట్టుకుందామన్నారు. హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా, షాద్‌నగర్‌ను శ్రీనగర్, మహబూబ్‌నగర్‌ను పాలమూరు, మహబూబాబాద్‌ను మానుకోట, నిజామాబాద్‌ను ఇందూర్‌గా పేర్లు మారుస్తామని చెప్పారు. తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవ మండపాలకు ఉచితంగా విద్యుత్ సదుపాయం, అయ్యప్ప, ఇతర స్వాములకు ప్రత్యేకంగా వసతులు, రక్షణ, భదత్ర కల్పిస్తామన్నారు. తెలంగాణలో కాషాయజెండా ఎగురవేద్దామన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మాయ మాటలు నమ్మవద్దన్నారు. ప్రతి ఒక్కరు బీజేపీ గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment