telangana vimochana dinotsavam
-
‘విమోచన’ అనడానికి మీకున్న అభ్యంతరాలేంటి?
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ జంకుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినం అంటే.. ఇప్పటి రేవంత్ సర్కారేమో ‘ప్రజా పాలన దినోత్సవం’ అంటోంది. ‘విమోచన’ అనడానికి మీకున్న అభ్యంతరాలేంటి? ఏం అడ్డం వస్తుంది. పాతవస్తీ వరకే పరిమితమైన మజ్లిస్ పార్టీకి చెందిన ఓవైసీలకు అంతలా ఎందుకు భయపడుతున్నారు..? వారిని ప్రసన్నం చేసుకున్వేఉకు చరిత్రనే వక్రీకరిస్తారా..? నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలు ఇప్పటి తరానికి, భవిష్యత్ తరానికి తెలపద్దా..?రైతులు, కూలీలు, సబ్బండ వర్ణాలు ఏకమై కత్లుళ్లు, గొడ్డళ్లు, వడిసెళ్లు, బరిసెళ్లు, బర్మారు తుపాకులు, రోకలిబండలతో ప్రాణానికి తెగించిన పోరాట చరిత్రను ఇప్పటి తరానికి తెలియకుండా ఎందుకు తొక్కుపెడుతున్నారు.. నాడు నిజాం హైదరాబా్ సంస్థానాన్ని స్వతంత్ర ఇస్లాం రాజ్యంగా మార్చాలని ప్రయత్నించలేదా..? కుదరని పక్షంలో పాకిస్తాన్ తోనైనా కలవాలని భావించలేదా..? కరుడుకట్టిన మతోన్మాది ఖాసి రజ్వీ రజాకార్లకు ఆయుధాలిచ్చి హిందువులపైకి ఉసిగొల్పిన చరిత్రను మర్చిపోయారా..? మనుషులను వరుసలో నిలబెట్టి తుపాకీతో కాల్చి చంపడాలు... చెట్లుకు కట్టి సామూహికంగా ఉరి తీయడాలు.. సజీవ దహనాలు.. మహిళలచే నగ్నంగా బతుకమ్మలు ఆడించడాలు.. హత్యలు, ఆత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, దొమ్మీలు.. ఇవన్నీ ఇవన్నీ రజాకార్ల ఆకృత్యాలు కావా..?‘ మా నిజాం రాజు తరతరాలు బూజు’ అని దాశరధి అన్నది నిజం కాదా.. ‘‘ గోల్కొండ ఖిలా కింద నీ ఘోరీ గడ్డం కొడుకో నైజాము సర్కరోడా’’ అన్న పాటలు అమద్ధమా..? ‘‘ రాజు పేరిట అరాజకమునకు-జరిగిన పూజలు చాలింక- రక్కసితనముకు పిశాచవృత్తికి- దొరికిన రక్షణ చాలింక’’ అని కాళోజీ కవితలు రాసింది నిజాంకు వ్యతిరేకంగా కాదా.. మరి ఎందుకు వాస్తవాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తున్నారు..? దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ,, షోయబుల్లా ఖాన్, కొమురం భీం.. వంటి వారి పోరాటాలు ఈ తరం మరచిపోవాలా..? కొందరు విద్రోహ దినం అంటున్నారు.. ప్రజలను రాచి రంపాన పెట్టిన నిజాంను ఓడించడం విద్రోహమా..? ఇది విలీనం కాదు.. విద్రోహం కాదు.. మమ్మూటికీ విమోచనే.. ఏది ఏమైనప్పటికీ.. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహించడం సంతోషమే.. ఇది బీజేపీ విజయం.. తెలంగాణ ప్రజల విజయం.హైదరాబాద్ సంస్థానంలో భాగమై ఇప్పుడు కర్నాటక, మహారాష్ట్రలో విలీనమైన జిల్లాల్లో.. అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం అధికారిక భాగ్యం లేదు. దీనికి కారణం ఓటు బ్యాంకు.. సంతుష్టీకరణ రాజకీయాలు.. ఓవైసీకి భయపడడం.. సెప్టెంబర్ 17న అధికారిక విమోచన వేడుకల కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసింది.. 1998 నుంచే ఇందుకోసం ఉద్యమాలు చేశాం.. ప్రజలను చైతన్య పరిచి, మరుగున పడేసిన చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి తెలంగాణ విమోచన యాత్రలు చేశాం.. అమరవీరుల చరిత్రను వెలికి తీశాం.. చారిత్రాత్మక ప్రాంతాలను సందర్భించాం.. అమరధామాలు నిర్మించాం..అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు విస్మరించారు.. తెలంగాణ తెచ్చుకున్నాకయినా అధికారిక వేడుకలు నిర్వహించకుందామంటే.. అప్పటి సీఎం కేసీఆర్ నిరాకరించారు.. అదే కేసీఆర్ ఉద్యమ సమయంలో ‘ విమోచన దినోత్సవం’ నిర్వహించరని అప్పటి ఉమ్మడి పాలకులను నిలదీశారు.. స్వయంగా ఆయనే సీఎం అయినా. మజ్లిస్‌కు భయపడి అధికారికంగా నిర్వహించలేదు.. అధికారిక వేడుకల కోసం తెలంగాణ విమోచన యాత్ర పేరిట నేను స్వయంగా తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఉద్యమాల్లో పాల్గొన్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకున్నా సరే.. మేం అధికారిక వేడుకలు నిర్వహిస్తామని నరేంద్ర మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు.. 2022లో తొలిసారి కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారిక వేడుకలు నిర్వహించుకున్నాం.. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. అమరవీరులను స్మరించుకున్నారు.. వారి త్యాగాలను కీర్తించారుదేశం నడిబొడ్డన ఉన్న హైదరాబాద్ సంస్థానం రాజైన నిజాం.. ఈ ప్రాంతాన్ని స్వతంత్య ఇస్లామిక్ దేశంగా లేకుంటే.. పాకిస్తాన్‌తో కలపాలని భావించారు. దీనికి తోడు నియంతృత్వ నిజాం పాలనలో.. రజాకార్ల దారుణాలు, అరాచకాలు, ఆకృత్యాలకు ఇక్కడి ప్రజలు నలిగిపోతూ ఉండడంపై నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలత చెందారు. మంచిమాటలో నిజాంను దారికి తెచ్చేందుకు ప్రయత్నించారు.. నిజాం ససేమిరా అనడంతో ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ యాక్షన్‌కు శ్రీకారం చుట్టారు.. జె.ఎన్.చౌదరి నేతృత్వంలో భారత్ సైనికులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో.. నిజాం సైన్యం, రజాకార్లు తోకముడిచారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలవడం పటేల్ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..మేమే సాయుధ పోరాటం చేశామని కమ్యూనిస్టులు గొప్పలు చెప్పుకుంటారు.. కానీ ప్రజలు ఎవరికి వారు.. స్వచ్ఛందంగా అందుబాటులో ఉన్న పనిముట్లనే ఆయుధాలుగా చేసుకుని నిజాం, రజాకార్లపై పోరాడారు. ప్రజలు స్వచ్ఛంద పోరాటాన్ని కమ్యూనిస్టులు హైజాక్ చేశారు. కమ్యూనిస్టులు నిజంగానే నిజాంకు వ్యతిరేకంగా పోరాడితే.. నిజాం లొంగిపోయాక కూడా భారత బలగాలలో ఎందుకు పోరాడారు..? అంటే వారి పోరాటం నిజాంకు వ్యతిరేకంగా కాదు.. నిజాం నుంచి స్వాధీనం చేసుకొని రష్యాకు అనుబంధంగా ఇక్కడ స్వతంత్ర కమ్యూనిస్టు రాజ్యం స్థాపించాలనేది వారి కుట్ర. హైదరాబా్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం అనేది వారి ఉద్దేశం కానేకావు.. నిజాం లొంగిపోయాక భారత సైన్యాలతో పోరాటం చేయడం చారిత్రాత్మకం తప్పిదంగా ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణ రెడ్డి అభివర్ణించడం వాస్తవం కాదా..? ఇప్పుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడినట్లు చెప్పుకోవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం.ఇప్పుడు మూడోసారి.. అదీ 75 వసంతాలు పూర్తి చేసుకన్న సందర్భంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది... సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోంది.. 2022లో మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చే సరికి.. గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసీఆర్ అధికారిక వేడుకలకు సిద్ధమయ్యారు.. అప్పుడు కూడా విమోచన అనకుండా జాతీయ సమైక్యతా దినం అంటూ తప్పుదోవ పట్టించారు.. ఇప్పుడు రేవంత్ ప్రజాపాలన దినోత్సం అంటున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్.. ఈ మూడు పార్టీలు ఒక్కటే.. బీజేపీ ఒక్కటే తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతుంది.నిజాం వ్యతిరేక పోరాటంలో కొన్ని ఘటనలు..రజాకార్ల తుపాకీ తూటాలకు పరకాల పట్టణం రక్తసిక్తమైంది. వందల మంది ఉద్యమకారులు చనిపోయారు. పరకాల ఘటన మరో జలియన్‌వాలాబాగ్‌గా చరిత్రలో నిలిచిపోయింది.రజాకార్లు అరాచకాలను ఎదుర్కొనేందుకు బైరాస్ పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకొని, దూరం నుంచే వారి రాకను పసిగట్టేందుకు బురుజులు నిరమించుకున్నారు. రజాకార్ల తోకముడిచేలా చేసిన భైరాన్‌పల్లి చరిత్రను మరచిపోయా.. భైరాన్ పల్లిపై కక్ష గట్టి మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా అందరినీ కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. 118 మంది భైరాన్ పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు వీరమరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు భైరాన్ పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలుస్తుంది.నిర్మల్‌లో రాంజీగోండుతో పాటు వెయ్యి మందిని మర్రిచెట్టుకు సామూహికంగా ఉరి తీశారు. ఆ మర్రి ‘ గోండ్ మర్రి’. ‘‘ ఉరులమర్రి’’గా ప్రసిద్ధి చెందింది. చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లిలో రజాకార్లు 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలో బావిలో పడేశారు.. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొనొ ఎత్తుకెళ్లారుభువనగిరి తాలూకాలో రేణిగుంట గ్రామస్థులు రజాకార్లతో జరిపిన పోరాటంలో 26 మంది అమరులయ్యారు.జనగాం తాలూకా కాల్కొండలో రజాకార్లు 13 మంది గ్రామస్థులను కాల్చి చంపారు.జనగాం తాలూకా కూట్గల్లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను చంపిచ రజాకార్లువరంగల్, సూర్యాపేటలో శాంతియుత ర్యాలీ చేస్తున్న కార్యకర్తలపై కాల్పులు, 6 మంది దుర్మరణం,, మృతుల్లో కొడిలూరి లచ్చయ్య.కప్పం కట్టాలంటూ గద్వాల తాలూకాలోని ఓ గ్రామంలో రజాకార్ల కాల్పులు, నలుగురు దుర్మరణం.కరీంనగర్ జిల్లాలోని గారిపల్లి, మూసఖాన్ పేట్, ఇండ్లను తగులబెట్టిన రజాకార్లు.ఖమ్మం జిల్లా మధిర తాలూకాలోని మీనబోలులో ఆరుగురు గ్రామసంరక్షకులను పొట్టన పెట్టుకున్న రజాకార్లు. ఇవి మచ్చుకు కొన్ని ఇలాంటి ఘటనలు ఎన్నో ఎన్నెన్నో జరిగాయి.-డా. కె.లక్ష్మణ్, ఎంపీబీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు -
‘విమోచన’ నిర్వహణకు భయమెందుకు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విమోచన పేరిట ఉత్సవాలు నిర్వహించేందుకు భయమెందుకని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విమోచన దినోత్సవ నిర్వహణకు సిగ్గు, మొహమాటం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో, ఉద్యమంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రజాకార్ల భయంతో వెనక్కు తగ్గారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించి 75 ఏళ్లు కావొస్తున్నా ఓటుబ్యాంక్ రాజకీయాలతో రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అధికారికంగా నిర్వహించే సాహసం చేయలేదని దుయ్యబట్టారు. కేంద్రం ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా హాజరై అమిత్‌షా ప్రసంగించారు. ‘ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించగానే అందరూ దీనిని నిర్వహించేందుకు సిద్ధపడినా విమోచన పేరుతో జరిపేందుకు భయపడుతున్నారు. రజాకార్లు ఇంకా దేశానికి సంబంధించిన నిర్ణయాలేవీ తీసుకోలేరు. అందువల్ల వారంతా తమ మనస్సు ల్లోని భయాన్ని తొలగించాలి. ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాల నేది ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష. దీన్ని సాకారం చేసే లక్ష్యంతోనే కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరు నిర్వహించినా నిర్వహించకపోయినా కేంద్రం అధికారికంగా ప్రతి ఏటా ఘనంగా ఈ దినోత్సవాలను నిర్వహిస్తుంది’ అని అమిత్‌షా చెప్పారు. శనివారం పరేడ్ గ్రౌండ్లో కేంద్ర సాయుధ బలగాలనుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా. నవతరానికి స్ఫూర్తినిచ్చేందుకే... హైదరాబాద్ విమోచన కోసం త్యాగం చేసిన యోధులు, అమరు లను ప్రజల్లో పునరుజ్జీవులుగా ఉంచడంతోపాటు నవ, యువ తరానికి స్ఫూర్తి కలిగించడానికే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నా మని అమిత్‌షా చెప్పారు. ఎందరో వీరులు నిజాం అరాచకా లను, అత్యాచారాలను సహించిన విషయాన్ని నేటి తరం మరిచి పోవద్దన్నారు. పాత హైదరాబాద్ స్టేట్ (3 రాష్ట్రాల పరిధిలో) లోని విశ్వవిద్యాలయాల్లో ఈ అంశంపై లోతైన పరిశోధనలు, అధ్యయనాలు జరగాలన్నారు. ఆ వీరుల గాథను దేశం నలు మూలలా చేరవేసి నివాళులు అర్పించాలని చెప్పారు. తెలంగాణ విమోచనం చెందిన 74 ఏళ్ల తర్వాత అధికారికంగా ఈసారి కార్య క్రమాలు నిర్వహించడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. పటేల్‌దే నిర్ణయాత్మక పాత్ర.. తెలంగాణకు స్వాతంత్య్రం తీసుకురావడంలో సర్దార్ వల్ల భాయ్ పటేల్ పోషించిన పాత్రను అమిత్ షా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘హైదరాబాద్ స్టేట్‌లో నిజాం నవాబును, రజాకార్లను ఓడించకపోతే అఖండ భారత్ స్వప్నం నిజం కాదని పటేల్ గ్రహించారు. దేశం మధ్యలోని కొంత భాగంలో అకృత్యాలు, అత్యాచారాలు, హింస కొనసాగుతుంటే మహాత్మాగాంధీ స్వతంత్ర భారత స్వప్నం పూర్తి కాదనే పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా విజయం సాధించారు. పటేల్ లేకపోతే ఈ ప్రాంతం మరిన్ని రోజులు చీకట్లోనే ఉండేది’ అని చెప్పారు. ఈ సందర్భంగా కొమురం భీం, రాంజీ గొండు, స్వామి రామానంద తీర్థ, విద్యాధర్ గురూజీ, పండిత్ కేశవరావ్ కోరట్ కర్, ఎం.చెన్నారెడ్డి, పీవీ నరసింహారావు, వందేమాతరం రామచంద్రరావు, నారాయణ్ రావ్ పవార్ మొదలైన వారిని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ స్టేట్‌లో నిజాం, రజాకార్ల నికృష్టచర్యలను ఉద్యమకారులు గట్టిగా ఎదుర్కొన్నారని చెప్పారు. గుండ్రాంపల్లిలో తన పర్యటన సందర్భంగా స్థానికులు అక్కడ నిజాం సమయంలో జరిగిన ఆకత్యాల గురించి చెప్పడం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆ ఘటనను దక్షిణ భారత జలియన్ వాలాబాగ్‌గా అభివర్ణించిన విషయాన్నీ అమిత్ షా గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా జరుపుకునే వాతావరణాన్ని కల్పించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని అభినందించారు. కంటోన్మెంట్లో జరిగిన కార్యక్రమంలో మానసిక దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న అమిత్ షా. ఘనంగా విమోచన దినోత్సవం కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కర్ణాటక మంత్రి శ్రీరాములు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉద్విగ్న వాతావరణంలో సాగింది. అమిత్‌షా తొలుత జాతీయ పతాకాన్ని ఎగరవేసి, కేంద్ర సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పరేడ్‌గ్రౌండ్స్‌లో 1948 సెప్టెంబర్ 17 తరువాత 75 ఏళ్లకు అదే రోజు తిరిగి జాతీయ జెండా ఎగిరిందంటూ అమిత్‌షాను అభినవ వల్లభాయి పటేల్‌గా కీర్తించారు. కాగా, అమిత్ షా బేగంపేటలోని హరితప్లాజాకు వచ్చే ముందు అక్కడి ప్రవేశద్వారంలో ఓ కారు అకస్మాత్తుగా ఆగడంతో కలకలం రేగింది. సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్ ఆ ప్లాజాలోని రెస్టారెంట్‌కు వచ్చే క్రమంలో ఆయన కారు నిలిచిపోయింది. అమిత్‌షా కోసం రూట్ క్లియరెన్స్ చేస్తున్న పోలీసులు కారును ముందుకు నెట్టే ప్రయత్నంలో కారు అద్దాలు పగిలాయి. కారు ఆగడం వెనుక ఎలాంటి దురేద్దేశాలు లేవని తేలడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అమిత్ షాకు పటేల్ ప్రతిమను బహూకరిస్తున్న బండి ఇదీ చదవండి: ‘10 శాతం కోటా’.. వారంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు -
జునాగఢ్ ఉత్సవాలు ఎందుకు నిర్వహించరు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు గుజరాత్‌లోని జునాగఢ్‌కు కూడా ఒకేసారి స్వాతంత్య్రం వచ్చిందని, మరి బీజేపీ నేతలు అక్కడ ఎందుకు వజ్రోత్సవాలు నిర్వహించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజ నాల కోసం సెప్టెంబర్ 17ను ఓ ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ చిల్లర వేషా లు వేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శనివారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ద్దేశించి ఆయన మాట్లాడుతూ గుజరాత్లో ఉత్సవా లు జరిపిన తర్వాతే హైదరాబాద్‌లో విమో చన ఉత్సవాలు జరపాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించి పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకు పోవాలనే కుట్రతోనే ఇక్కడ కొత్త వేషాలు కడుతున్నారని విమర్శించారు. రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అమలు చేసే ప్రణాళికలేంటో వివరించాలని డిమాండ్ చేశారు. సర్దార్ పటేల్ మా వాడు... హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తమ వాడని, ఆయనది కాంగ్రెస్ కుటుంబమని, తమ నుంచి పటేల్‌ను ఎవరూ విడదీయలేరని రేవంత్ వ్యాఖ్యానించారు. పటేల్ తన హయాంలో ఆర్ఎస్ఎస్ను నిషేధించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ చరిత్రను దొంగిలించి తమ చరిత్రగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ చిచ్చుపెట్టే పరిస్థితులు టీఆర్ఎస్ వల్లే ఏర్పడ్డాయని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో బీజేపీ, టీఆర్ఎస్ల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం సబ్బండ వర్గాలను ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణతల్లి విగ్రహాన్ని రేవంత్ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పిని సన్మానించారు. కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్, అంజన్‌కుమార్ యాదవ్, మల్రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, సిటీ కాంగ్రెస్ నాయకులు విజయారెడ్డి, రోహిణ్‌రెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రముఖ కాంగ్రెస్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్ పంతులుతోపాటు పలువురిని రేవంత్ శాలువాలతో సన్మానించి, వారికి పాదాభివందనం చేశారు. ఆపై ఇందిరా భవన్లో జరిగిన టీపీసీసీ ఎక్స్ సర్వీస్‌మెన్ సెల్ చైర్మన్ పి.రాజేంద్రన్ పదవీబాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ మాజీ సైనికులకు నెలలో బెనిఫిట్స్ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఇదీ చూడండి: మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త! -
‘10 శాతం కోటా’.. వారంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి విసిగి వేసారిపోయాం. ఇకపై విసిగిపోం. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా వారం రోజుల్లో జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ.. మా జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావా? లేక దానితో ఉరి వేసుకుంటవా ఆలోచించుకో..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపుతామని.. పట్టాలు ఇచ్చి రైతు బంధు పథకం అమలు చేస్తామని చెప్పారు. భూమిలేని, ఉపాధి లేని గిరిజనుల కోసం ‘గిరిజన బంధు’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ వివరాలు సీఎం కేసీఆర్ మాటల్లోనే.. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా.. ‘‘జాతి, కులం, మతం, వర్గం అనే విభేదాలు లేకుండా 58 ఏళ్లు ఐక్యంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు ఐదారు శాతంగా ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ వచ్చాక పది శాతానికి పెంచాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఏడేళ్లు దాటిపోయింది. దీనిపై ప్రధాని మోదీని, ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చి విభజన రాజకీయాలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడుగుతున్నా.. ఏం అడ్డుపడుతోందని గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఆపుతున్నారు? రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుదల చేస్తాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రధాని మోదీని తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి అభ్యర్తిస్తున్నా. గిరిజన రిజర్వేషన్ల బిల్లును మీరు ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిస్తే ఆపకుండా ఆమోదం ఇస్తారు. రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే ప్రతిబంధన ఎక్కడా లేదు. పక్కరాష్ట్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే కేంద్రం ఏడో షెడ్యూల్లో చేర్చింది. అదే తరహాలో తెలంగాణ న్యాయపరమైన హక్కుకు కేంద్రానికి ఉన్న ప్రతిబంధకమేంటో చెప్పాలి. కేంద్రం సులభంగా పరిష్కరించే విషయాల్లో కూడా తాత్సారం చేస్తూ ప్రజలను గాలికి వదిలేస్తోంది. ప్రైవేటీకరణ పేరిట లక్షల కోట్ల రూపాయలను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెడుతోంది. పోడు భూములకు పట్టాలు.. గిరిజన బంధు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూమి దక్కేలా కమిటీ ఏర్పాటు చేసి జీవో 140 కూడా ఇచ్చాం. కమిటీల నుంచి నివేదికలు అందిన వెంటనే పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు పథకం అమలు చేస్తాం. సంపద పెంచడం.. అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. పోడు భూమి పట్టాల పంపిణీ తర్వాత భూమి లేని గిరిజనులను గుర్తిస్తాం. దళిత బంధు తరహాలో భూమి, భుక్తి, ఆధారం లేని గిరిజన బిడ్డల కోసం వెసులుబాటు చూసుకుని నా చేతుల మీదుగా ‘గిరిజన బంధు’ పథకాన్ని ప్రారంభిస్తాం. మేధోమధన వేదికలుగా ఆదివాసీ, బంజారా భవన్లు గిరిజనుల సమస్యల పరిష్కారానికి బంజారా, ఆదివాసీ భవన్లు వేదికలుగా మారాలి. రాష్ట్రంలో ‘మా తాండాలో మా రాజ్యం’ నినాదాన్ని ఆచరణలోకి తేవడంతో 3 వేలకు పైగా గిరిజన గూడేలు, తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న పంచాయతీలకు ప్రోత్సాహం, ఉచిత విద్యుత్, గురుకులాలు, రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్, టీ ప్రైడ్ కింద గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజన తండాలు, చెంచు, ఆదివాసీ గూడేల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతోంది. రూ.300 కోట్లతో ప్రతి గిరిజన ఆవాసానికి త్రీఫేజ్ విద్యుత్, రూ.200 కోట్లు విద్యుత్ బకాయిలు మాఫీ, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రోడ్లు, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజనుల సంస్కృతి, భాష, జీవన శైలి కాపాడేలా జాతరలు, పండుగలను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహిస్తున్నాం. గిరిజన గురుకులాల ద్వారా ప్రతిభ చూపుతున్న విద్యార్థులు.. బంగారు తెలంగాణ బిడ్డలుగా, భారత ప్రతినిధులుగా ఎదగాలి. గిరిజన బిడ్డలు చదుకునేందుకు మరిన్ని గురుకుల సంస్థలు ఏర్పాటు దిశగా చర్చలు జరుగుతున్నాయి..’’ అని కేసీఆర్ తెలిపారు. ఇన్నాళ్లూ పార్టీలు ఓటుబ్యాంకుగానే చూశాయి: సత్యవతి రాథోడ్ గతంలో రాజకీయ పార్టీలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే తప్ప మనుషులుగా చూడలేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్‌ను తమ జాతి ఎప్పటికి మరిచిపోదని చెప్పారు. ఇక జల్, జంగల్, జమీన్ నినాదాన్ని నిజం చేసిన నాయకుడు కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగ కాంతారావు అన్నారు. ఈ ఆత్మీయ సభలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతా.. ‘‘తెలంగాణ సమాజం ఐక్యత, ప్రగతి పరుగులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు. దుర్మార్గులు, నీచ రాజకీయ నాయకులు, సంకుచిత స్వార్థంతో వస్తున్నారు. మతపిచ్చి కార్చిచ్చులా అంటుకుంటే ఎటూ కాకుండా పోతాం. మీ బిడ్డగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. తెలంగాణలో కల్లోలం రానీయొద్దు. ఈ సమాజం సర్వమానవ సౌభ్రాతృత్వంతో పురోగమించే దిశగా ప్రజల పక్షాన నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా. ప్రజల రాజ్యం, రైతుల రాజ్యం కోసం తెలంగాణ జాతిగా మనం భారత జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు కదలాలి’’ రాష్ట్రవ్యాప్తంగా సమైక్యత ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాల యాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో సైతం ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు. ఇదీ చదవండి: విమోచనమే నిజమైన స్వాతంత్య్ర దినం -
టీఆర్ఎస్లో రచ్చరచ్చ.. పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్చల్
శాంతినగర్: జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అధికార పార్టీలో రగడకు దారితీశాయి. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్డీఓ రాములు అధ్యక్షతన శుక్రవారం వజ్రోత్సవాలు నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్బంగా కొందరు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటుండగా వేదికపై అలజడి రేగింది. ఒకరిపైఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్చల్ చేశారు. సభాప్రాంగణం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి సాయిచంద్, ఆయన అనుచరులు, గన్‌మెన్, పీఏలను ఒకవైపు.. ఎమ్మెల్యే అబ్రహం తన యుడు అజయ్, అతడి అనుచరులను మరోవైపు పంపించి గొడవ పెద్దది కాకుండా చూశారు. అనంతరం సాయిచంద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కుమారుడు అజయ్ అనుచరులు తనపై, పీఏ, గన్‌మెన్‌పై దాడికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయనకు నచ్చజెప్పి పోలీసు ఎస్కార్ట్‌తో అక్కడి నుంచి పంపించారు. దాడి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే, సాయిచంద్ ఎవరి ఆహా్వనం మేరకు వచ్చారని ఎమ్మెల్యే తనయుడు అజయ్ ప్రశ్నించారని, ఈ క్రమంలో మాటామాటా పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: జాతీయ సమైక్యత ర్యాలీలో అపశ్రుతి -
జాతీయ సమైక్యత ర్యాలీలో అపశ్రుతి
మంచిర్యాల టౌన్/మిర్యాలగూడ అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీలో పాల్గొన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎండలోనే ఉండటం, తాగునీరు సరిపడా లేక ఇబ్బందులు పడ్డారు. అనంతరం మండుటెండలో ర్యాలీని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు 3 కిలోమీటర్లు నిర్వహించారు. భోజనాలు కూడా ఎండలోనే మైదానంలో కింద కూర్చుని తిన్నారు. కనీసం తాగునీరు అందక, నీడ లేక 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 21 మందికి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించగా, మిగతా 9 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎల్ఈడీ స్క్రీన్ కూలి గాయాలు సమైక్యత వారోత్సవాల్లో భాగంగా మిర్యాలగూడలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎన్ఎస్పీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో కూర్చున్న స్థానిక కాకతీయ పాఠశాల విద్యార్థినులపై ఎల్ఈడీ స్క్రీన్ కూలిపోయింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన విద్యార్థినులకు చికిత్స అందించారు. ఇదీ చదవండి: ‘జయహో జగదీశన్న’.. ఆ జిల్లా ఎస్పీ నినాదం వివాదాస్పదం! -
బాహుబలి సినిమాలో మాదిరి ఈ స్టేజ్ కదలాలా..బీటలు వారాలా!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ నినాదం వివాదంగా మారింది. ‘జయహో జగదీశన్న’అంటూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని పొగిడి విద్యార్థులచే నినాదాలు చేయించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. అంతకుముందు పట్టణంలో భారీ ఎత్తున యువకులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘మంత్రి జగదీశ్‌రెడ్డికి జై జై.. ఈ గడ్డ మీద మనం పుట్టినందుకు ఈతరం మంత్రికి రుణపడి ఉండాలి. మీ అందరికీ ఆకలవుతుందా.. ఆకలేస్తే కేకలు వేయాలన్నారు శ్రీశ్రీ.. అది అందరికీ గుర్తుందా.. అయితే ఇలా నినాదాలు చేయండి.. జయహో జగదీశన్న’అంటూ నినాదాలు చేయించారు. ‘అందరూ బాహుబలి సినిమా చూశారా.. బాహుబలి వచ్చిననప్పుడు వేదిక కదిలిన విధంగా మీ నినాదాలతో ఈ స్టేజీ కదలాలా.. బీటలు వారాలా..’అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్పీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డిని పొగుడుతూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ విద్యార్థులతో నినాదాలు చేయించడం సిగ్గుచేటని, గౌరవప్రతిష్టలు కలిగిన యూనిఫాం సరీ్వసుకే అగౌరవమని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కలెక్టర్లు సీఎం కాళ్లు మొక్కడం, ఆ తర్వాత వారిని ఎమ్మెల్సీగా చేయడం చూశామని గుర్తుచేశారు. ఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: బాబాసాహెబ్ కలల సాకారంలో... -
‘బీజేపీవి వేషాలు.. టీఆర్ఎస్ది అతి తెలివి’
సాక్షి, హైదరాబాద్: నిజాం సంస్థానం భారత యూనియన్‌లో కలిసిన రోజును విలీనమని టీఆర్ఎస్, విమోచనమని బీజేపీలు మాట్లాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు అసలు తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజున మనుగడలోనే లేవని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. ముస్లింలపై హిందువులు గెలిచినట్టు బీజేపీ వేషాలు వేస్తుంటే.. హిందూ, ముస్లింలను మచ్చిక చేసుకోవాలనే ఆలోచనతో టీఆర్ఎస్ అతి తెలివి తేటలు ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే ఉన్న పేటెంట్ హక్కును దొంగిలించి రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీలు మల్లురవి, అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్‌లో కలిసిన రోజున తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని, అది జరిగి 75 ఏళ్లవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏడాది పాటు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతిభవన్‌లో సోదాలు జరపాలి.. లిక్కర్ స్కాంలో సోదాలంటూ బీజేపీ చేస్తున్న డ్రామాలను నమ్మేందుకు రాష్ట్రంలో వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు చెప్పినట్టు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కుమార్తె కవిత లేదా ఇతరుల పాత్ర ఉంటే ప్రగతిభవన్‌లో సోదాలు జరిపి, సీఎం కేసీఆర్‌ను విచారిస్తే ఆధారాలు లభిస్తాయని చెప్పారు. సీబీఐ విచారణ జరిపించాలి.. వేరే పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరినందుకు వారికి ముట్టిన డబ్బులు, లభించిన కాంట్రాక్టులు, జరిగిన భూముల రెగ్యులరైజేషన్లపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానన్న నమ్మకం సీఎం కేసీఆర్‌కు లేదని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ 25 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు నిమిషాల్లోనే వాయిదా వేయడంపై స్పందిస్తూ.. కేసీఆర్ అరాచక చక్రవర్తి అన్నారు. అక్టోబర్ 24 నుంచి తెలంగాణలో జరగనున్న భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలన్నా రు. అంతకుముందు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ రూపొందించిన భారత్ జోడో యాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఇదీ చదవండి: దేశ రాజకీయాల పేరిట కేసీఆర్ కొత్త డ్రామాలు: బండి సంజయ్ -
తెలంగాణ విమోచన దినోత్సవం: స్ఫూర్తిదాయక పోరాటం
ఈ నేల మీద సాగిన వీరోచిత త్యాగాల చరిత్ర, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. నాలుగు వేల మంది రక్త తర్పణంతో తెలంగాణ పునీత మైంది. ‘బాంచన్ దొర, నీ కాళ్లు మొక్కుతా’ అన్న చేతులే బందూకులెత్తి పోరాటం సాగించాయి. ఈ పోరాటం పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది. 3 వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు నెలకొల్పింది. ఈ క్రమం సాగుతుండగానే 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ స్టేట్‌పై యుద్ధం ప్రకటించింది. భారీ మర ఫిరంగులతో 50 వేల సైన్యం కవాతు తొక్కింది. కేవలం ఐదు రోజుల్లోనే యుద్ధం ముగి సింది. సెప్టెంబర్ 17న ఏడవ నిజాం భారత సైన్యాలకు లొంగిపోయాడు. కానీ నిజాంను లొంగ దీసుకోవడానికి వచ్చిన నెహ్రూ సైన్యాలు రైతాంగ ఉద్యమాన్ని అణచడానికి మూడేళ్ల పాటు శత విధాలా ప్రయత్నించాయి. అనేకులైన రైతు యోధులు, కమ్యూనిస్టులు నెహ్రూ సైన్యాల చేతిలో హత్యకు గురయ్యారు. పదివేల మంది కార్యకర్తలను కాన్సంట్రేషన్ క్యాంపులలో నిర్బం ధానికి గురిచేశారు. బ్రిగ్స్ ప్లాన్ పేరుతో గ్రామాలను దహనం చేశారు. అయినా సాయుధ పోరాట విరమణ జరగలేదు. 1946లో ప్రారంభమైన పోరాటాన్ని 1951 అక్టోబర్ 21న భారత ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విరమిస్తున్నట్టు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. ఇది చరిత్ర కాగా, భారతీయ జనతా పార్టీ నిజాం లొంగుబాటును విమోచన దినంగా ప్రకటి స్తున్నది. హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం రాజుకు, హిందూ ప్రజలకు మధ్య జరిగిన యుద్ధ మని గోబెల్స్ పలుకులు పలుకుతోంది. సాయుధ పోరాటంతో గానీ, నిజాం వ్యతిరేక ఉద్యమాలతో గానీ ఆనాటి జనసంఘ్‌కూ, ఈనాటి బీజేపీకీ ఏ సంబంధమూ లేదు. ఇది కులానికి, మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. నిరంకు శమైన నిజాం పాలనకు, భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆనాడు హిందూ ముస్లిం తేడా లేకుండా సాగించిన వర్గపోరాటం ఇది. 1943లో పరమ దుర్మార్గుడైన పాలకుర్తి, విసునూరు దొరలపై చట్ట బద్ధంగా తిరగబడి సవాల్ చేసిన పేద ముస్లిం రైతు బందగీ. తన భూమిని దక్కించుకునే ప్రయ త్నంలో భూస్వాముల గుండాల దాడిలో బలైన తొలి అమరుడు. ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్ నిజాంకు వ్యతిరేకంగా రాస్తు న్నాడని దొంగచాటుగా రజాకార్లు ఆయన కాళ్ళు చేతులు నరికి వేశారు. ఎందరో ముస్లిం మేధా వులు, కమ్యూనిస్ట్ నాయకుడు, కవి మఖ్దూమ్ లాంటి వారి నుంచి మొదలుకొని సామాన్య ప్రజల వరకు రజాకార్లకు వ్యతిరేకంగా పోరా డారు. గత రెండు వందల సంవత్సరాలలో తెలం గాణ ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గానీ, పోరాటం గానీ దేశ చరిత్రలో కానరాదు. బ్రిటిష్ పరిపాలన అంతం కావడం, దేశానికి స్వాతంత్రం రావడం, దాదాపు 565 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడం జరిగింది. కానీ, స్వాతంత్య్రానంతరం ఐదు సంస్థానాలు స్వతం త్రంగా వ్యవహరించడానికి నిర్ణయించుకున్నాయి. అందులో హైదరాబాద్ స్టేట్ ఒకటి. నిజాం రాజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు గాంచాడు. ఆనాడే 236 బిలియన్ల సంపద కలిగి ఉన్నాడు. ఐదు టన్నుల బంగారం కలిగి ఉన్నాడు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండటానికి నిర్ణయించుకున్నట్లు 1947 జూన్ 11న నిజాం పర్మాన ప్రకటించాడు. నిజాం దేవుడి ప్రతి రూపం అంటూ ఎంఐఎం ప్రచారం ప్రారంభించింది. ప్రజ లను భయభ్రాంతులకు గురిచేయడం, దోచు కోవడం, హత్యలు లూటీలు చేయడం, దొరలకు జాగీర్దార్లకు అండగా నిలవడం రజాకార్ల నిత్య కృత్యంగా మారింది. ప్రజలలో నిజాం పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అది కమ్యూనిస్టుల నేతృత్వంలో సాయుధ పోరాటంగా రూపు దిద్దుకుంది. పోలీస్ యాక్షన్, నిజాం పాలన అంతంతో ప్రజల కష్టాలు తీరుతాయని అందరూ భావిం చారు. తెలంగాణలో నైజాం పాలన స్థానంలో నెహ్రూ పాలన వచ్చింది. ఆనాటి దొరలే తిరిగి కాంగ్రెస్ నాయకులు అయ్యారు. పాలనలో మార్పు లేదు, ప్రజల బతుకుల్లో మార్పులేదు. అందుకే నిజాం లొంగిపోయిన 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా తెలంగాణ పోరాటం కొనసాగింది. ప్రజలపై దాడులను ప్రతిఘటించాలని పార్టీ నిర్ణయించింది. చివరకు పార్టీ నాయ కత్వంతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపి పోరాట విరమణకు కొన్ని హామీలను ఇచ్చింది. నాయకత్వం పోరాట విరమణ ప్రకటించింది. ఆ తర్వాత ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించింది. అయితే వీరుల త్యాగాలు వృధా కాలేదు. వర్తమాన సమాజంలో ఆ స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉన్నది. - వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ -
తెలంగాణ విమోచన దినోత్సవం.. వద్దా ఉత్సవం?
‘మా తెలంగాణలో మేము కనీసం విమోచనో త్సవాలు జరుపుకోవడా నికి కూడా స్వేచ్ఛ లేదా?మేం ఇంకెంత కాలం ఆంధ్రోళ్ళ పాలనలో ఉండాలి? మేమేమైనా బానిసలమా?’ ఇలాంటి మాటలెన్నో మాట్లాడింది ఎవరో కాదు, తెలంగాణ ఉద్యమ నాయకునిగా చెప్పుకునే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ వచ్చి ఏడేళ్ళు గడుస్తున్నా– నిధులు, నీళ్లు, నియామకాలు కాదు కదా... కనీసం స్వేచ్ఛగా తెలంగాణ విమోచన దినోత్సవా లకు కూడా వీలు లేని దుస్థితి దాపురించింది. ప్రత్యేక తెలంగాణలో అధికారికంగా విమోచ నోత్సవాలు జరపలేక పోవడానికి కారణమేంటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది కాబట్టి, ఇక విమోచనోత్సవాల అవసరమేంటన్నది కేసీఆర్ ఉవాచ. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది కదా, మరి పంద్రాగస్టు వేడుకలు ప్రతి ఏటా జరుపుకోవట్లేదా? మజ్లిస్ పార్టీకి తెలంగాణ విమోచనోత్సవాలు జరపడం ఇష్టం లేదు కాబట్టి అధికారంలో ఉన్నా జరుపలేని దుస్థితి మాది. కారు మాత్రమే మాది, స్టీరింగ్ ఒవైసీది’అని కేసీఆర్ చెప్పివుంటే కొద్దిగా గౌరవం అయినా ఉండేదేమో! ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినవన్నీ వాస్తవాలని నమ్మి, రెండుసార్లు అధికారం కట్ట బెట్టిన తర్వాత కవులు పాడుకుంటున్నట్లుగా ‘ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడబ్బ సొమ్మ యిందిరో తెలంగాణ’ అన్నదానికి వచ్చే సమాధానం: ఒక కుటుంబం పాలైంది. సమైక్య పాలనలో లాగే రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు. పైగా బోనస్‌గా ఆర్టీసీ కార్మికుల, ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మహత్యలు పెరిగాయి. సమైక్య పాలనలో కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛ అయినా ఉండేది. ఏ ధర్నా చౌక్ కేంద్రంగా తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగాయో, ఆ ధర్నాచౌక్‌నే ఎత్తేస్తే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రజలది. తెలంగాణ విమోచనోత్సవాలు జరపాలని ఒక్క బీజేపీ తప్ప, కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి గొప్పగా చెప్పే కమ్యూనిస్టులు సైతం చేస్తున్నది ఏమీలేదు. బహుశా తెలంగాణ ప్రజలకు వారు చేసినంతగా అన్యాయం ఇంకెవరూ చేయలేదన్న సత్యాన్ని గ్రహించి కాబోలు. దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వస్తే, తెలంగాణ (హైదరాబాద్ సంస్థాన్) ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 దాకా రాకపోడానికి నిరంకుశ నిజాం, రజా కార్లతోపాటు కమ్యూనిస్టులు కూడా కారణం. దేశానికి స్వాతంత్య్రం రానున్న తరుణంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన ఆదేశాలతో ఒక్కసారిగా భారత కమ్యూనిస్టు పార్టీ తన వైఖరిని మార్చుకుంది. అప్పటిదాకా కేవలం నిజాం, రజా కార్ల నుంచి బాధలు అనుభవించిన హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు కమ్యూనిస్టుల నుంచి మరిన్ని కష్టాలు పెరిగాయి. హైదరాబాద్‌ను భారతదేశంలో కలిపేసుకునే ప్రయత్నాలను వ్యతిరేకించాలి; భారత సైన్యాలు హైదరాబాద్‌లో అడుగు పెట్ట కుండా అడ్డుకోవాలి అంటూ నాటి ఆంధ్ర కమ్యూనిస్టు నేతలైన పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు ఒక ప్రకటన విడుదల చేయడంతోపాటు, స్వతంత్ర హైదరాబాద్ ఏర్పడాలనే నినాదం కూడా ఇచ్చారు. వీరి అండతో రజాకార్లకు వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. హైదరాబాద్ సంస్థాన సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు నిజాం ప్రయత్నించాడు. కమ్యూనిస్టు పార్టీ వైఖరిని అప్పటి మరో కమ్యూనిస్టు ముఖ్య నాయకుడు రావి నారాయణ రెడ్డి తీవ్రంగా నిర సించారు. ‘ఆంధ్ర నాయకత్వం బాధ్యులుగా ఉన్న అన్ని వేళల్లోకల్లా పోలీసు చర్య తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, భారత మిలిటరీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనేది పెద్ద నేరం. ఈ నేరం హిమాలయ పర్వతం లాంటిదని అంటే తప్పేమీ కాదు’ అని తన ‘తెలంగాణ నగ్న స్వరూపం’ అన్న డాక్యుమెంట్లో నిర్మొహమా టంగా స్పష్టం చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ దృఢచిత్తంతో వ్యవహరించి సైనిక చర్య చేపట్టి ఉండకపోతే ఇటీవటి కాలందాకా కశ్మీర్ కొరకరాని కొయ్యగా తయారైనట్లుగానే, హైదరాబాద్ సంస్థానం కూడా మారేదేమో! తెలంగాణ విమోచనోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తే అదేదో మైనారిటీలకు వ్యతిరేకమైనదిగా, మతతత్వంగా చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ చేయడం గర్హనీయం. ఇదే టీఆర్ఎస్ ఉద్యమ సమయంలో తెలంగాణ విమో చనోత్సవాలు జరపాలని డిమాండ్ చేస్తే అడ్డురాని మతతత్వం బీజేపీ డిమాండ్ చేస్తే ఎలా అవు తుందో తెలియజేయాలి. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరచడం పక్కన పెట్టాలి. -వ్యాసకర్త బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ -
కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి విముక్తి కావాలి..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పటాన్‌చెరులోని ఎస్వీఆర్ గార్డెన్లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి, హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీకి భయపడే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేశారని, తీసేస్తామని అనుకున్న మంత్రులను కూడా తీయలేదని విమర్శించారు. రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు మొట్టికాయ వేసినా కేసీఆర్‌కు బుద్ది రాలేదని మండిపడ్డారు. మజ్లిస్ దాయ దక్షిణ్యాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, బంగారు తెలంగాణను కేసీఆర్ బూడిద తెలంగాణగా, అప్పుల తెలంగాణగా మార్చారని లక్ష్మణ్ ఆరోపించారు. కారు.. సారు.. బారు.. ఇది రజాకార్ల సర్కారు అని ఎద్దేవా లక్ష్మణ్ చేశారు. అప్పనంగా కల్వకుంట్ల కుటుంబం అధికారం అనుభవిస్తోందని, ఈ కుటుంబం నుంచి రాష్టానికి విముక్తి కావాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్ సూచించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, రాష్ట్రంలో పరోక్షంగా ఎంఐఎం పార్టీనే పాలిస్తుందని ఆరోపించారు. నిజాం అడుగు జాడల్లో సీఎం కేసీఆర్ నడుస్తున్నారని, రజాకార్ల వారసత్వమే మజ్లిస్‌దని దుయ్యబట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ఈ విమోచన దినోత్సవ వేడుకలే ఆరంభమని కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయ పార్టీ అని, కేంద్ర పథకాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహాకారం అందిచడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్ని మంత్రివర్గ విస్తరణలు చేసినా టీఆర్ఎస్ పునాదులు కదలడం ఖాయమన్నారు. రాష్ట్రంలో త్రివర్ణ పతాకం ఎగరవేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదని, ప్రభుత్వ కార్యాలయాలపై జెండా ఎగురవేయాల్సిందేనని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు,శ్రేణులు అధిక సంఖ్యలో హాజరైయ్యారు -
17న ‘ఊరినిండా జాతీయ జెండా’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా ‘బండెనుక బండి కట్టి’పాటను రాసిన బండి యాదగిరి విగ్రహాన్ని తిరుమలగిరిలో ఈ నెల 9న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టింది. రజాకార్ల వ్యతిరేక పోరాటాలు జరిగిన, చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచిన స్థలాలను సందర్శిస్తోంది, సమావేశాలు నిర్వహిస్తోంది. రజాకార్లు 16 మందిని హత్య చేసిన మహబూబాబాద్ జిల్లాలోని దేవుని సంకీసలో సమావేశం నిర్వహించింది. 14న నిజామాబాద్ జిల్లాలో విమోచన దినోత్సవ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 16న బైరాన్‌పల్లిలో పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అదే రోజు మహబూబ్‌నగర్ జిల్లా అప్పంపల్లిలో, ఆసిఫాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లా వేయి ఊరుల మర్రిలో, ఖమ్మం జిల్లా ఎర్రుపాళెంలో కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టింది. వాటిల్లో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొనేలా చర్యలు చేపట్టింది. అన్ని బూత్‌ల్లో విమోచనకు ఏర్పాట్లు 17న ఊరినిండా జెండాలు కార్యక్రమం పేరుతో ప్రతి గ్రామంలోని అన్ని పోలింగ్ బూత్‌ల్లో విమోచన దినోత్సవాలు నిర్వహించాలని, అందులో భాగంగా ఉదయం 9 గంటలకు జాతీయ జెండాలు ఆవిష్కరించాలని నిర్ణయించామని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో త్రివర్ణ పతాకాలతో బైక్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు పటాన్చెరులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు. సభకు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, కిషన్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. హోంశాఖ మంత్రి అమిత్‌షా అధికారిక కార్యక్రమాల కారణంగా 17వ తేదీన రాలేకపోతున్నారని, ఆ తరువాత రాష్ట్ర పర్యటనకు వస్తారని వివరించారు. -
అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 17వ తేదిన జరగబోయే బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రావడం లేదని బీజేపీఅధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా పటాన్చెరులో జరిగే ఈ సభకు తొలుత అమితాషా రానున్నట్లు బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర స్థాయిలో అమిత్‌షా బిజీగా ఉన్నారని, అందుకే రావడం వీలు కావడం లేదని ప్రేమేందర్ పేర్కొన్నారు. ఆయన స్థానంలో ముఖ్య అతిథిగా ఎవరైనా కేంద్రమంత్రి హాజరవుతారని ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సర్వం మజ్లిస్ పార్టీనే నడుపుతోందని, మజ్లిక్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటే ప్రజల గొంతుక నొక్కటమేనని మండిపడ్డారు. నిజాం నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లను స్మరించుకోవాలని, తెలంగాణ విమోచన దినోత్సవ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న ‘ఊరు నిండా జెండాలు’ అనే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ రోజున అన్ని మండలాల్లో, మున్సిపాలిటీల్లో జాతీయ జెండాలు ఎగురవేస్తామని తెలిపారు. -
అధికారికంగా విమోచన దినం
నిజామాబాద్ నాగారం: డిసెంబర్ 11న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్వామి పరిపూర్ణానంద అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణకు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ చరిత్ర ఉన్న పేర్లనే జిల్లాలకు పెట్టుకుందామన్నారు. హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా, షాద్‌నగర్‌ను శ్రీనగర్, మహబూబ్‌నగర్‌ను పాలమూరు, మహబూబాబాద్‌ను మానుకోట, నిజామాబాద్‌ను ఇందూర్‌గా పేర్లు మారుస్తామని చెప్పారు. తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవ మండపాలకు ఉచితంగా విద్యుత్ సదుపాయం, అయ్యప్ప, ఇతర స్వాములకు ప్రత్యేకంగా వసతులు, రక్షణ, భదత్ర కల్పిస్తామన్నారు. తెలంగాణలో కాషాయజెండా ఎగురవేద్దామన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మాయ మాటలు నమ్మవద్దన్నారు. ప్రతి ఒక్కరు బీజేపీ గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
గవర్నర్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డిలు కలిశారు. భేటీ అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ..విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని ఇప్పటికి 18 సార్లు గవర్నర్లను కలిసామని తెలిపారు. తెలంగాణా విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని మరోసారి గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణా ప్రజల త్యాగాలను కేసీఆర్ విస్మరిస్తున్నారని విమర్శించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ల త్యాగాలు గుర్తించాలన్నారు. మజ్లీస్ పార్టీ ఒత్తిడికి లొంగి టీఆర్ఎస్ సర్కార్ విమోచన దినం నిర్వహించటం లేదని విమర్శించారు. 17న నిజామాబాద్‌లో బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ హాజరవుతారని తెలిపారు. పార్టీలుగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నపుడు..అధికారికంగా చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమస్యను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పించుకుంటున్నారు: లక్ష్మణ్
రేపటి నుంచి తెలంగాణ విమోచన యాత్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ విమోచన యాత్రను శుక్రవారం నుంచి మొదలు పెడుతున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు. మొత్తంగా వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రజాకారుల ఆగడాలకు సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలు తెలంగాణలో చాలా ఉన్నాయని, వాటన్నింటినీ సందర్శించి, ప్రజలకు తెలంగాణ విమోచన ప్రాధాన్యం గురించి వివరిస్తామన్నారు. తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం రోశయ్యను ప్రశ్నించారని, విమోచన దినోత్సవం నిర్వహించకపోతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ ఆ మాటే మరిచారని వ్యాఖ్యానించారు. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వహిస్తామని యాత్రలో ప్రజలకు చెబుతామన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మజ్లీస్ పార్టీకి తాకట్టు బెడితే ప్రజలు ఊరుకోరని లక్ష్మణ్ హెచ్చరించారు.