సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 17వ తేదిన జరగబోయే బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రావడం లేదని బీజేపీఅధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా పటాన్‌చెరులో జరిగే ఈ సభకు తొలుత అమితాషా రానున్నట్లు బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర స్థాయిలో అమిత్‌షా బిజీగా ఉన్నారని, అందుకే రావడం వీలు కావడం లేదని ప్రేమేందర్ పేర్కొన్నారు. ఆయన స్థానంలో ముఖ్య అతిథిగా ఎవరైనా కేంద్రమంత్రి హాజరవుతారని ఆయన తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సర్వం మజ్లిస్ పార్టీనే నడుపుతోందని, మజ్లిక్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటే ప్రజల గొంతుక నొక్కటమేనని మండిపడ్డారు. నిజాం నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లను స్మరించుకోవాలని, తెలంగాణ విమోచన దినోత్సవ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న ‘ఊరు నిండా జెండాలు’ అనే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ రోజున అన్ని మండలాల్లో, మున్సిపాలిటీల్లో జాతీయ జెండాలు ఎగురవేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment