Premendar Reddy
-
బీజేపీ ఇన్చార్జీ కమిటీల నియామకం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీ వివిధ కమిటీల నియామకాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే కొన్ని కమిటీలను ఏర్పాటు చేయగా తాజాగా 17 లోక్‌సభ స్థానాలకు ‘పార్లమెంట్ ప్రభారీలు’ (ఇన్చార్జీలు), 33 జిల్లాలకు ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆయా కమిటీల సభ్యలను నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ప్రభారీలు వీరే... ఆదిలాబాద్–అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దపల్లి–విశ్వవర్ధన్రెడ్డి, కరీంనగర్–పి.గంగారెడ్డి, నిజామాబాద్–వెంకటరమణి, జహీరాబాద్–బద్దం మహిపాల్‌రెడ్డి, మెదక్–ఎం.జయశ్రీ, మల్కాజిగిరి–ఎ.పాపారావు, సికింద్రాబాద్–దేవకి వాసుదేవరావు, హైదరాబాద్–గోలి మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల–పి,సుగుణాకరరావు, మహబూబ్‌నగర్–వి.చంద్రశేఖర్, నాగర్‌కర్నూల్– ఎడ్ల ఆశోక్‌రెడ్డి, నల్లగడొండ–చాడ శ్రీనివాసరెడ్డి, భువనగిరి–అట్లూరి రామకృష్ణ, వరంగల్–వి.మురళీథర్గౌడ్, మహబూబాబాద్–ఎన్.వెంకటనారాయణరెడ్డి, ఖమ్మం–కడగంచి రమేశ్. జిల్లా ఇన్చార్జీలు వీరే... ఆదిలాబాద్–బద్దం లింగారెడ్డి, నిర్మల్–ఎం. మల్లారెడ్డి, కొమురం భీమ్–ఎం.మహేశ్‌బాబు, నిజామాబాద్–కళ్లెం బాల్‌రెడ్డి, కామారెడ్డి–ఎర్ర మహేశ్, కరీంనగర్– మీసాల చంద్రయ్య, జగిత్యాల– చంద్రశేఖర్, పెద్దపల్ల–రావుల రాంనాథ్, రాజన్న సిరిసిల్ల–జి.మనోహర్‌రెడ్డి, సంగారెడ్డి–జె.రంగారెడ్డి, మెదక్–డా.ఎస్.మల్లారెడ్డి, రంగారెడ్డి రూరల్–పి.అరుణ్ కుమార్, వికారాబాద్–వి.రాజవర్ధన్‌రెడ్డి, మేడ్చల్ అర్బన్–గిరిమోహనశ్రీనివాస్, మేడ్చల్ రూరల్– వి.నరేందర్‌రావు, నల్లగొండ–ఆర్.ప్రదీప్‌కుమార్, యాదాద్రి– జె.శ్రీకాంత్, మహబూబ్‌నగర్ కేవీఎల్ఎన్ రెడ్డి, వనపర్తి–బోసుపల్లి ప్రతాప్, నాగర్‌కర్నూల్–టి.రవికుమార్, గద్వాల–బి.వెంకటరెడ్డి, నారాయణపేట–కె.జంగయ్య యాదవ్, హనుమకొండ–అడ్లూరి శ్రీనివాస్, వరంగల్– కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, భూపాలపల్లి–ఎస్.ఉదయ్ ప్రతాప్, జనగామ–యాప సీతయ్య, మహబూబాబాద్–బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ములుగు– ఎ.వెంకటరమణ, ఖమ్మం–ఎస్.విద్యాసాగర్‌రెడ్డి, కొత్తగూడెం–ఆర్.రుక్మరాజు, గోల్కొండ–గోషామహల్–ఎస్.నందకుమార్‌యాదవ్, మహంకాళి–సికింద్రాబాద్–నాగూరావు నామాజీ, హైదరాబాద్ సెంట్రల్– టి.అంజన్‌కుమార్‌గౌడ్. -
ఎమ్మెల్యేల కేసులో ఊహించని ట్విస్ట్‌లు.. బీజేపీకి కొత్త టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే స్పీడ్ పెంచిన సిట్.. బీజేపీ సీనియర్ నేతకు నోటీసులు ఇచ్చింది. దీంతో, ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిట్ దర్యాప్తుపై మండిపడుతున్నారు. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చింది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఈనెల 21వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇక, బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగింది. మరోవైపు.. సిట్ నోటీసులపై హైకోర్టులో స్టే ఇవ్వాలని బీజేపీ కోరింది. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని సిట్ వేధిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఇదిలా ఉండగా.. సిట్ నోటీసులపై శనివారం హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌కు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ వేశారు. 41ఏ నోటీసుల వెనుక అరెస్ట్ చేసే కుట్ర దాగి ఉంది. కేసుతో సంబంధంలేని వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. సిట్ నోటీసులపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో 8 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. -
ఎమ్మెల్యేల కేసులో మరో ట్విస్ట్.. కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం జరిగింది. ఈ కేసులో సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ బీజేపీ నేత గుజ్జల ప్రేమేందర్ రెడ్డి.. హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్‌లో రిట్ అప్పీల్ చేశారు. దీంతో, రిట్ అప్పీల్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను రేపటి(మంగళవారం)కి వాయిదా వేసింది. మరోవైపు తాను దాఖలు చేసిన పిటిషన్లో ప్రేమేందర్ రెడ్డి.. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణ హైకోర్టులో ఉన్న నేపథ్యంలో నిందితులు.. కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలో ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. -
అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 17వ తేదిన జరగబోయే బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రావడం లేదని బీజేపీఅధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా పటాన్చెరులో జరిగే ఈ సభకు తొలుత అమితాషా రానున్నట్లు బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర స్థాయిలో అమిత్‌షా బిజీగా ఉన్నారని, అందుకే రావడం వీలు కావడం లేదని ప్రేమేందర్ పేర్కొన్నారు. ఆయన స్థానంలో ముఖ్య అతిథిగా ఎవరైనా కేంద్రమంత్రి హాజరవుతారని ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సర్వం మజ్లిస్ పార్టీనే నడుపుతోందని, మజ్లిక్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటే ప్రజల గొంతుక నొక్కటమేనని మండిపడ్డారు. నిజాం నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లను స్మరించుకోవాలని, తెలంగాణ విమోచన దినోత్సవ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న ‘ఊరు నిండా జెండాలు’ అనే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ రోజున అన్ని మండలాల్లో, మున్సిపాలిటీల్లో జాతీయ జెండాలు ఎగురవేస్తామని తెలిపారు. -
తెలంగాణకు ఎరువుల ఫ్యాక్టరీ
- ముందుకు వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం హన్మకొండ(వరంగల్ జిల్లా): కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలో ఎరువుల ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు ముందుకు వచ్చిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో మూసి వేసిన కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు మోదీ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించిందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఉత్పత్తి కానున్న ఎరువులను కిసాన్ బ్రాండ్‌తో మార్కెట్లోకి విడుదల చేయనున్నారని చెప్పారు. ఫ్యాక్టరీ ప్రాంతాన్ని త్వరలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహీర్, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి రామగుండం సందర్శించనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయలో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు. విపత్తు సహాయ నిధుల నుంచి నిధులు వాడుకోవడానికి కేంద్రం సడలింపు ఇచ్చిందని పేర్కొన్నారు. -
కేసీఆర్..అప్పుడేం చేశారు?
గద్వాలటౌన్ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ శ్రేణులు ఏం చేశారని.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమేందర్‌రెడ్డి ప్రశ్నించారు. పునర్విభజన బిల్లును చట్టం చేసింది బీజేపీ ప్రభుత్వం కాదని.. యూపీఏ ప్రభుత్వమని గుర్తించుకోవాలని ఆయన హితవుపలికారు. సోమవారం ప్రేమేందర్‌రెడ్డి ఆయన గద్వాలలో విలేకరుల తో మాట్లాడారు. ఇప్పటికీ తెలంగాణ బీజేపీ ఆంక్షలు లేని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటుందని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు తలెత్తితే కేంద్రంతో చర్చించి పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. 1956 స్థానికత విషయంలో తెలంగాణ విద్యార్థులకే ఎక్కువగా అన్యాయం జరుగుతుందన్నారు. పాలమూరు జిల్లాను కరువు జిల్లాగా వెంటనే ప్రకటించి ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే సదస్సుకు పార్టీ గ్రామాధ్యక్షులు కావాలని కోరారు. సమావేశంలో రాములు, లక్ష్మి కేశవరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జగన్నాథం, రాధాకృష్ణారెడ్డి, జీఎం రవి తదితరులు పాల్గొన్నారు.